
నాకు ఇప్పుడు ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయింది. ఫంక్షన్‌కి జుట్టుకు రంగు వేయించుకోవాలి. ప్రెగ్నెన్సీలో ఇది మంచిది కాదని విన్నాను. ఇప్పుడు జుట్టుకు ఎలాంటి రంగులు వేసుకోవటం మంచిది?
– మీనాక్షి, అనంతపురం
చాలామంది గర్భవతులు అడిగే ప్రశ్న ఇది. జుట్టుకు వేసుకునే రంగు మంచి కంపెనీది వాడటంతో గర్భవతులకు ఎలాంటి హాని జరగదని ఎన్నో పరిశోధనల్లో తేలింది. పర్మినెంట్, సెమీ పర్మినెంట్ డైలతో కొంతమందికి రియాక్షన్స్, దురదలు రావచ్చు. ఈ జుట్టుకు వేసుకునే రంగు తలపై మాడు ద్వారా రక్తంలోకి వెళ్లి బేబీకి హాని చేస్తుంది అనేది నిజం కాదు. జుట్టుకు వేసుకునే రంగులో చాలా తక్కువ మోతాదులో రసాయనాలు ఉంటాయి. ఇవి బేబీకి ఏ హాని చెయ్యవు. కాని ఆరోగ్యకరమైన మాడు లేకపోయినా, హై డోస్ కెమికల్ షాంపూలు, డైలు వాడినా చర్మంలో మార్పులు, దురదలు రావచ్చు.
ఆరోగ్యకరమైన మాడు ఎక్కువ డైని పీల్చుకోదు. కాని, 12 వారాల ప్రెగ్నెన్సీ దాటే వరకు అంటే మూడు నెలలు నిండే వరకు ఎలాంటి యాంటీబయోటిక్స్, పెయిన్ కిల్లర్స్, రసాయనాల గాఢత ఎక్కువ ఉండే జుట్టు, చర్మ చికిత్స మందులను తీసుకోవద్దని చెప్తాం. రెండు, మూడు త్రైమాసికాల్లో ప్రెగ్నెన్సీలో వచ్చే చర్మం, శరీరంలో వచ్చే మార్పుల వలన చాలామందికి డైలతో రియాక్షన్స్, దురదలు రావచ్చు. కొన్నిసార్లు డై సరిగ్గా పనిచెయ్యకపోవచ్చు. హై స్ట్రాండ్స్ కలర్స్ అంతగా పనిచెయ్యవు. కాని ప్రతిసారి హెయిర్ డై లేదా హెయిర్ కలర్ చేయించుకునే ముందు స్ట్రాండ్స్ టెస్ట్ చేయించుకోండి. ప్యాచ్ టెస్ట్ అనే స్కిన్ టెస్ట్ ప్రతిసారి చెయ్యమనండి.
ఒకవేళ ఇంట్లోనే జుట్టుకు రంగు వేసుకుంటుంటే, చేతులకు గ్లోవ్స్ వేసుకోవాలి. స్కిన్ ఇరిటేషన్ ప్రెగ్నెన్సీలో చాలా తర్వగా వస్తుంది. డై వేసుకున్న తర్వాత ఆ కంపెనీ చెప్పిన సమయం వరకు మాత్రమే ఉంచుకొని, వెంటనే శుభ్రం చేసుకోవాలి. బాగా గాలి, వెలుతురు ఉన్న ప్రదేశంలో డై వాడాలి. మాడును చాలాసార్లు నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. అలాగే ముఖం, మిగిలిన డైని కూడా శుభ్రం చేసుకోవాలి.
డై బ్లడ్ స్ట్రీమ్ ద్వారా శరీరంలోకి వ్యాపించడం చాలా అరుదు. హైలైట్స్ అనేవి ఈమధ్య చాలామంది చేసుకుంటున్నారు. అక్కడ వేసే రసాయనాలను కేవలం జుట్టు మాత్రమే పీల్చుకుంటుంది. సెమీ పర్మినెంట్ కలర్స్ అంటే హెన్నా లాంటì వి ఇంట్లోనే తయారుచేసుకొని వాడుకోవటం మంచిది.
Comments
Please login to add a commentAdd a comment