Hair Colours
-
ఈ దువ్వెనతో హెయిర్ డై ఈజీ..!
ఈరోజుల్లో, చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు రావడం సాధారణ సమస్యగా మారిపోయింది. అయితే యవ్వనంగా, అందంగా కనిపించడానికి ఆ వెంట్రుకలకు నలుపు లేదా ఇతర గాఢమైన రంగులను వేసుకోవడం సర్వసాధారణమైపోయింది. అలాంటి వారికి చిత్రంలోని ఈ పరికరం చక్కగా పని చేస్తుంది.ఇది బ్యూటీ వరల్డ్‌లో ప్రత్యేకంగా రూపొందిన బాటిల్. జుత్తు ఒత్తుగా పెరగాలన్నా, వేసుకున్న రంగు తలంతటికీ పట్టాలన్నా ఈ బాటిల్ సాయం తీసుకోవాల్సిందే. ఈ బాటిల్లో నూనె లేదా హెయిర్ కలర్ నింపుకుని మూతకు అటాచ్ అయ్యి ఉన్న దువ్వెన పళ్లను తలకు ఆనించి దువ్వుకుంటే సరిపోతుంది. దాని వల్ల చేతులకు జిడ్డు లేదా రంగు అంటుకోదు. ఈ బాటిల్ మూతకు దువ్వెన అటాచ్ అయ్యి ఉంటుంది. అయితే మూత కిందవైపు స్ప్రింగ్ ఉంటుంది. మూతపైన ఉన్న బటన్ని గట్టిగా ఒత్తితే, లోపల నుంచి కలర్ లేదా ఆయిల్ దువ్వెన పళ్లలోకి వచ్చి, వెంట్రుకలకు చక్కగా అప్లై అవుతుంది. ఈ బాటిల్‌ను నలుపు రంగు తోపాటు వివిధ రంగులకు వినియోగించవచ్చు. ఈ బాటిల్‌ను, దానికి అమర్చుకోగల దువ్వెనను శుభ్రంగా కడిగి, ఆరబెట్టుకోవచ్చు. అయితే కలర్‌కి వినియోగించిన బాటిల్‌ను ఆయిల్‌కి వాడకపోవడం ఉత్తమం. దీని ధర సుమారు 24 డాలర్లు వరకు ఉంది. అంటే 2,029 రూపాయలన్నమాట. ఇలాంటి బాటిల్స్ పలు రకాలు, పలు రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. (చదవండి: కిడ్స్‌పై కోల్డ్ వార్! 'పొడి' చెయ్యనియ్యొద్దు) -
Side Effects Of Hair Dyeing: తెల్లబడిందని జుట్టుకు రంగు వేస్తున్నారా? క్యాన్సర్ రావొచ్చు!
ఇంతకుముందు వృద్దాప్యంలో తెల్ల వెంట్రుకలు వచ్చేవి. కానీ ఇప్పుడు చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం చూస్తున్నాం. దీంతో దాన్ని కవర్ చేసేందుకు ఎడాపెడా ఎయిర్ డైని వాడేస్తున్నారు. మరికొందరు జుట్టు నల్లగా ఉన్నప్పటికీ దాన్ని ఫ్యాషనబుల్‌గా గ్రూమ్ చేసుకోవడం కోసం రంగు వేసుకుంటుంటారు. మరి హెయిర్ డై ఎంత వరకు సురక్షితం?హెయిర్ డై తరచుగా వాడితే క్యాన్సర్ వస్తుందా అన్నది ఇప్పుడు చూద్దాం. హెయిర్‌డైలో ఉండే కెమికల్స్ మీ చర్మానికి, మీ జుట్టుకు సరిపడకపోవచ్చు. దీనివల్ల అలర్జీ రావచ్చు. ఫలితంగా చర్మం ఎర్రబారడం, దురదపెట్టడం, ఎర్రటి దద్దుర్లు (ర్యాష్) వస్తుంటాయి. ఇలా జరిగితే వీలైనంత త్వరగా డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. కొంతమంది హెయిర్ డై ప్యాక్‌మీద అమోనియా ఫ్రీ అనే మాట చూసి అది సురక్షితమని వాడుకుంటుంటారు. కానీ అందులో కూడా పీపీడీ అనే రసాయనం లేనిదే వాడాలి. ఎందుకంటే అమోనియా ఫ్రీ అని ఉన్నప్పటికీ ఈ పీపీడీ కూడా అమోనియా నుంచి వచ్చే రసాయనమే కాబట్టి అమోనియా ఫ్రీ అనే విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. హెయిర్–డై వాడేవారు అది మనకు సరిపడుతుందా లేదా అన్నది పరీక్షించుకొని, ఆ తర్వాతే వేసుకోవాలి. అందుకోసం ముందుగానే చర్మంపై చిన్న మోతాదులో వేసుకొని పరీక్షించుకోవాలి. కొన్ని సందర్భాల్లో హెయిర్‌డైలో ఉండే రసాయనాల వల్ల కళ్లు మండటం, గొంతులో ఇబ్బంది, వరుసగా తుమ్ములు రావడం వంటి ఇబ్బందులు రావొచ్చు. ఇది కొన్నిసార్లు ఆస్తమాకు దారితీయవచ్చు. రంగు వేసుకునే టైంలో తప్పనిసరిగా గ్లౌవ్స్ ధరించాలి. హెయిర్ డైలో ఉండే రసాయనాలు వెంట్రుకలోకి ఇంకిపోతాయి. దీనివల్ల వెంట్రుకలు రఫ్‌గా అవుతాయి. కొందరు హెయిర్ డైని తలకు మాత్రమే కాకుండా కనుబొమ్మలకు కూడా వాడుతుంటారు. ఇలా ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరాదు. తరచుగా ఈ హెయిర్ డై వాడే వారికి కాన్సర్ ముప్పు కూడా ఉండొచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.అందుకే ఇంట్లోనే సహజసిద్దమైన పద్దతిలో డై వేసుకోవడం మంచిది. -
సహజమైన రంగు...
బ్యూటిప్స్ హెయిర్ కలర్స్ వాడకం వల్ల వాటిలోని రసాయనాలు కొందరి చర్మతత్త్వానికి సరిపడకపోవడం, జుట్టు సహజమైన కాంతి కోల్పోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. వీటికి విరుగుడుగా కురులకు మంచి అందాన్ని, రంగును ఇచ్చేవి ప్రకృతిలోనే సహజసిద్ధమైనవి ఉన్నాయి. వాటిలో... ఎర్రని బంతిపూలను వేసి, బాగా మరిగించిన కప్పుడు నీటిని మాడునుంచి శిరోజాలకు పూర్తిగా పట్టించాలి. గంట తర్వాత శుభ్రపరుచుకోవాలి. తలలో అక్కడక్కడా తెల్లబడిన వెంట్రుకలు ఎర్రగా అవుతాయి. జట్టుకు రంగు వేసుకోవాలనుకునేవారికి ఇది ఆర్గానిక్ హెయిర్ డైలా ఉపయోగపడుతుంది. బీట్రూట్ను పేస్ట్ చేసి, నీళ్లలో కలిపి మరిగించాలి. చల్లారిన తర్వాత వడకట్టిన నీటిని రాత్రి పడుకోబోయేముందు మాడుకు పట్టించి, వేళ్లతో మసాజ్ చేసుకోవాలి. మరుసటి రోజు ఉదయాన్నే తలస్నానం చేయాలి. వారానికి రెండు సార్లు ఈ విధంగా చేస్తూ ఉంటే చుండ్రు సమస్య తగ్గిపోతుంది. కురులకు కొద్దిగా పర్పుల్ కలర్ వస్తుంది. హెయిర్ కలర్స్ వాడే యువతరపు జుట్టుకు ఇది మంచి ఆప్షన్. హెయిర్ కలర్స్ వాడేవారు జుట్టు పొడిబారి వెంట్రుకుల బిరుసుగా అవుతాయనుకుంటే... టేబుల్ స్పూన్ పెరుగులో పెసరపిండి కలిపి, రెండు రోజులు బయటే ఉంచాలి. తర్వాత రోజు ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి, గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే కలర్లో ఉండే రసాయనాల ప్రభావం తగ్గడమే కాకుండా వెంట్రుకలు మృదువుగా అవుతాయి.