సెర్వికల్ కేన్సర్‌నుగుర్తించే పరికరం విడుదల | India launches its indigenous cervical cancer screening device | Sakshi
Sakshi News home page

సెర్వికల్ కేన్సర్‌నుగుర్తించే పరికరం విడుదల

Published Tue, Dec 24 2013 4:11 AM | Last Updated on Sat, Sep 2 2017 1:53 AM

India launches its indigenous cervical cancer screening device

స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఐసీఎంఆర్
 
న్యూఢిల్లీ: మొట్టమొదటిసారిగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన సెర్వికల్ కేన్సర్‌ను గుర్తించే పరికరాన్ని భారత్ సోమవారం విడుదల చేసింది. దేశంలో ఏటా సుమారు 74 వేల మంది మహిళలు సెర్వికల్ కేన్సర్ బారినపడి ప్రాణాలు పోగొట్టుకుంటున్న నేపథ్యంలో మహిళలకు వరప్రసాదంలా ఉపయోగపడే ఈ పరికరాన్ని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది.

దీనిని విడుదల చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి గులాంనబీ ఆజాద్ మాట్లాడుతూ, మహిళల్లో సెర్వికల్ కేన్సర్ లక్షణాలను తొలిదశలోనే గుర్తించేందుకు ఈ పరికరం ఉపయోగపడుతుందని, తద్వారా పలువురి ప్రాణాలు నిలిచే అవకాశాలు ఉన్నాయని అన్నారు. నోయిడాలో ఐసీఎంఆర్ ఆధ్వర్యంలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైటాలజీ అండ్ ప్రివెంటివ్ ఆంకాలజీ (ఐసీపీవో) రూపొందించిన ఈ పరికరం ఖరీదు రూ.10 వేలు మాత్రమే. ప్రస్తుతం సెర్వికల్ కేన్సర్‌ను గుర్తించే పరీక్షల కోసం దాదాపు రూ.8 లక్షల వరకు ఖర్చవుతోంది. ఆ ఖర్చుతో పోలిస్తే ఇది నామమాత్రమేనని ఆజాద్ అన్నారు. ఈ పరికరం రూపకల్పన లో కృషిచేసిన శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. 8 నెల ల్లో మార్కెట్‌లో అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement