
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను నివారించేందుకు ఐఐటీ, ఐఐఎమ్‌లకు చెందిన దెబయన్ సాహా, శశిరంజన్ ఓ పరికరాన్ని రూపొందించారు. నీటి బిందువులలోని వృద్ది చెందే కరోనాను చంపడానికి ఏయిర్ లెన్స్ మైనస్ కరోనా అనే పరికరం ఉపయోగపడుతుందని సాహా తెలిపారు. సాహా మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తికి కారణమయ్యే ఉపరితల ప్రదేశాలను శుద్ది చేయడానికి పరికరాన్ని ఉపయోగించవచ్చని.. ఇది ఆస్పత్రులు, ఒస్‌స్టాప్‌లు, రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్, ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చని తెలిపారు.
ఈ పరికరంతో నగరంలోని అన్ని ప్రదేశాలలో శుద్ది చేయవచ్చని అన్నారు. 'కరోనా డిశ్చార్జ్'ను ఉపయోగించి నీటి బిందువులను శుద్ది చేయవచ్చన్నారు. ఈ పరికరం శుద్దిచేయబడిన నీటి బిందువులతో కూడిన హానికర వైరల్ ప్రొటీన్లను నియంత్రిస్తుంది. ఆక్సిడేషన్ చేయడం వల్ల హానికర వైరస్‌ను నిర్మూలించడానికి ఎంతగానో తోడ్పడుతుందని దెబయన్ సాహా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment