
ముఖంపైన ముడతలు, మొండి మచ్చలు వయసుని రెట్టింపు చేసి చూపిస్తాయి. వాటితో పాటు కంటి చుట్టూ ఉండే వలయాలు.. ముఖాన్ని కాంతివిహీనంగా మార్చేస్తాయి. కళ్లు, పెదవులు, ముక్కు, నుదురు, బుగ్గల మీది చర్మం మృదువుగా మెరిస్తేనే ఆరోగ్యం.. అందమూనూ! అలాంటి ట్రీట్మెంట్‌నే అందిస్తుంది ఈ మాస్టర్ పీస్ (మోర్ ఎఫెక్టివ్ యాంటీ ఏజింగ్ డివైజ్).
ఇది పాలిపోయిన చర్మాన్ని సరిచేస్తుంది. చర్మంపైనున్న ముడతలు, గీతలు తగ్గించడంతో పాటు.. కొలాజెన్, ఎలాస్టిన్ ఉత్పత్తిని వేగవంతం చేసి.. చర్మానికి లైట్ థెరపీని అందిస్తుంది. డివైజ్ ముందున్న బటన్ ఆన్ చేస్తే అది పని మొదలు పెడుతుంది.
ప్రతి శరీరభాగంపైన 4 నుంచి 6 నిమిషాల పాటు ట్రీట్మెంట్ అందించొచ్చు. మొదటి నాలుగు వారాలు.. వారానికి మూడు సార్లు దీన్ని ఉపయోగిస్తే.. ఆ తర్వాత వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఉపయోగించాలి. ట్రీట్మెంట్ తర్వాత పొడి టవల్‌తో చర్మాన్ని క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది.
కనుబొమ్మల మధ్య, కంటి మూలల్లో, నుదుటిపై ఉండే ముడతల (క్రాస్ లైన్స్)ను తొలగిస్తుంది. రంగు మారిన చర్మాన్ని తిరిగి కాంతిమంతంగా చేస్తుంది. రంధ్రాలను పూడ్చి, చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది. ఈ డివైజన్‌ని ఉపయోగించడం చాలా సులభం. దీనికి చార్జింగ్ పెట్టుకుని ఉపయోగించుకోవచ్చు. ప్రయాణాల్లో, ఆఫీస్‌లో, ఇంట్లో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ధర కేవలం 2 వేల రూపాయలు మాత్రమే.
చదవండి: Hair Care Tips: వర్షాకాలంలో జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఉల్లిపాయ రసం, కొబ్బరి నూనెతో