
డిజిటల్ డివైస్‌లలో.. లేటెస్ట్ మేకర్స్‌ని ఎన్నుకోవడమే నయాట్రెండ్. చిత్రంలోని డివైస్ అలాంటిదే. ఇంతవరకు ఫ్రంట్‌లోడ్ ఎయిర్ ఫ్రైయర్స్‌నే చూశాం. కానీ ఈ చిత్రంలోని డివైస్ టాప్‌లోడ్ ఫ్రైయర్. దీనిలో బేకింగ్, గ్రిల్లింగ్, రోస్టింగ్, డీప్‌ఫ్రైయింగ్ వంటి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. ఆరులీటర్ల సామర్థ్యం కలిగిన ఈ మెషిన్ బాస్కెట్‌లో.. బూరెలు, గారెలు, బజ్జీలు, చగోడీలు, మురుకులు, వడియాలు వంటివన్నీ తయారు చేసుకోవచ్చు.
ఇందులో టైమింగ్, టెంపరేచర్ రెండిటినీ ఈజీగా సెట్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ఆయిల్‌తోనే ఆహారం వేగంగా గ్రిల్ అవుతుంది. దీన్ని మూవ్ చేసుకోవడం చాలా సులభం. ఇందులో గ్రిల్ బాస్కెట్‌తో పాటు.. గ్రిల్ ప్లేట్ కూడా లభిస్తుంది. దానిలో చికెన్, మటన్ ముక్కల్ని గ్రిల్ చేసుకోవచ్చు. దీన్ని వినియోగించడం చాలా ఈజీ.
Comments
Please login to add a commentAdd a comment