దువ్వెనలా ఉండే ఈ డివైజ్‌ మీ వద్ద ఉంటే..అందం మీ సొంతం! | Multi Attachment Face Scalp Care Device | Sakshi
Sakshi News home page

దువ్వెనలా ఉండే ఈ డివైజ్‌ మీ వద్ద ఉంటే..అందం మీ సొంతం! జుట్టు నుంచి బాడీ వరకు..

Published Sun, Jan 21 2024 1:11 PM | Last Updated on Sun, Jan 21 2024 1:21 PM

Multi Attachment Face Scalp Care Device - Sakshi

చిత్రంలోని పరికరం చూసి.. కేవలం దువ్వెన అనుకోవడంలో తప్పు లేదు కానీ ఇది మల్టీ డివైస్‌. తలకు మాత్రమే కాదు.. ముఖానికి, మొత్తం చర్మానికీ ఉపయోగపడుతుంది. జుట్టును, బాడీని అందంగా తీర్చిదిద్దుతుంది. ఈ మల్టీ–అటాచ్మెంట్‌ ఫేస్‌ స్కాల్ప్‌ కేర్‌ డివైస్‌.. ఎల్‌ఈడీ లైటింగ్‌తో, ఎలక్ట్రికల్‌ మజిల్స్‌ స్టిమ్యులేషన్‌ టెక్నాలజీతో, వైబ్రేషన్‌ తో పని చేస్తుంది. అయితే దీనికి ఉన్న మూడు వేరు వేరు హెడ్స్‌ని అవసరాన్ని బట్టి అటాచ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని వినియోగించుకోవడం చాలా సులభం. 

ఇది చర్మాన్ని ముడతలు, మచ్చలు లేకుండా మృదువుగా మారుస్తుంది. యవ్వనం తిరిగి వస్తుంది. అలాగే తలకు మసాజ్‌లానూ.. వెంట్రుకల గ్రోత్‌ని పెంచే విధంగానూ ఇది ట్రీట్‌మెంట్‌ని అందిస్తుంది. కండరాలను ఉత్తేజపరచేందుకు.. చిన్న చిన్న నొప్పులు తగ్గించుకునేందుకు మల్టీ హెడ్‌ (బాల్స్‌ అటాచై ఉన్న భాగం)ను ఈజీగా డివైస్‌కి అమర్చుకుంటే సరిపోతుంది.

ఈ బ్యూటీ టూల్లో.. ‘లో/మీడియం/ హై’ ఆప్షన్స్‌తో పాటు.. స్కాల్ప్, ఫేస్, మల్టీ అనే మూడు హెడ్స్‌ని అవసరానికి మార్చుకునే వీలుండటంతో దీనికి డిమాండ్‌ ఎక్కువగా ఉంది. 3 గంటల పాటు చార్జింగ్‌ పెట్టుకుంటే.. వైర్‌లెస్‌గా వినియోగించుకోవచ్చు. ధర 911 డాలర్లు. అంటే రూ. 75,005లు. క్వాలిటీ, రివ్యూస్‌ ఆధారంగానే ఇలాంటి డివైస్‌లను కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.  

(చదవండి: ఈ బ్యూటిప్స్‌ వాడారో.. ఇకపై ట్యాన్‌కు చెక్‌!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement