పార్లర్‌కి వెళ్లక్కర్లేకుండా..ఈ మెషిన్‌తో ఈజీగా వ్యాక్సింగ్, థ్రెడింగ్‌.. | 3 In 1 Hair Removal Device With Latest IGBT | Sakshi
Sakshi News home page

పార్లర్‌కి వెళ్లక్కర్లేకుండా..ఈ మెషిన్‌తో ఈజీగా వ్యాక్సింగ్, థ్రెడింగ్‌..

Published Sun, Oct 1 2023 4:28 PM | Last Updated on Wed, Oct 4 2023 11:22 AM

3 In 1 Hair Removal Device With Latest IGBT  - Sakshi

సాంకేతికతతో సకల సౌలభ్యాలను అందుకోవడం ఈ రోజుల్లో పెద్ద కష్టమేం కాదు. అయితే వినియోగదారులు తాము కొనుగోలు చేసే మెషిన్స్‌.. ట్రెండ్‌కి తగ్గట్టుగా ఆకర్షణీయమైన లుక్‌తో పాటు, లేటెస్ట్‌ వెర్షన్స్‌ తో ఉండాలని కోరుకుంటున్నారు. అలాంటి వారి కోసమే ఈ లేటెస్ట్‌ 3 ఇన్‌  1 హెయిర్‌ రిమూవల్‌ డివైస్‌. ఇన్సులేటెడ్‌ గేట్‌ బైపోలార్‌ ట్రాన్సిస్టర్‌ టెక్నాలజీతో రూపొందిన ఈ మెషిన్‌ .. సూపర్‌ ఫాస్ట్‌ డివైస్‌గా పని చేస్తుంది. లాంగ్‌ లాస్టింగ్‌ రిజల్ట్స్‌ను ఇస్తుంది.

ఈ పెయిన్‌లెస్‌ లేజర్‌ హెయిర్‌ రిమూవర్‌ సిస్టమ్‌.. స్త్రీలతో పాటు పురుషులకు కూడా చక్కగా ఉపయోగపడుతుంది. వినియోగించడం చాలా తేలిక. ఇది బాడీ, ఫేస్, బికినీ అనే మూడు ప్రత్యేకమైన మోడ్స్‌ని కలిగి ఉంటుంది. ప్రతి మోడ్‌లో 5 లెవెల్స్‌ చొప్పున ఉంటాయి. వాటిని తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు. 2 నెలల పాటు ఉపయోగించిన తర్వాత, వెంట్రుకల ఎదుగుదల పూర్తి స్థాయిలో తగ్గిపోతుంది. 98% వరకు ఫలితం కనిపిస్తుంది. అయితే ఈ ట్రీట్‌మెంట్‌కి ముందు.. వెంట్రుకలు రిమూవ్‌ చెయ్యాల్సిన భాగంలో షేవ్‌ చేసుకోవాల్సి  ఉంటుంది.

స్కిన్‌  టోన్‌ని బట్టి.. హెయిర్‌ కలర్‌ని బట్టి ఇది యూజ్‌ అవుతుంది. ఇక దీన్ని వినియోగించిన చోట చర్మం పొడిబారి, గరుకుగా మారడం వంటి సమస్యలు తలెత్తవు. ఈ డివైస్‌ను కళ్లకు సమీపంలో వాడుతున్నప్పుడు దీనితో పాటు లభించే కళ్లజోడును కచ్చితంగా పెట్టుకోవాలి. ధర 118 డాలర్లు. అంటే 9,781 రూపాయలు. ఈ లేటెస్ట్‌ ట్రెండీ మెషిన్‌ వెంట ఉంటే.. వ్యాక్సింగ్, థ్రెడింగ్‌ల కోసం ప్రతినెలా బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరగాల్సిన పని ఉండదు. దీన్ని వినియోగించి.. కేవలం ఎనిమిది లేదా పది నిమిషాల్లో మొత్తం బాడీ మీదున్న వెంట్రుకలను తొలగించుకోవచ్చు. 

(చదవండి: ఈ కిట్‌ మీవద్ద ఉంటే..పార్లర్‌కి వెళ్లాల్సిన పని ఉండదు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement