Hair removal
-
పార్లర్‌కి వెళ్లక్కర్లేకుండా..ఈ మెషిన్‌తో ఈజీగా వ్యాక్సింగ్, థ్రెడింగ్..
సాంకేతికతతో సకల సౌలభ్యాలను అందుకోవడం ఈ రోజుల్లో పెద్ద కష్టమేం కాదు. అయితే వినియోగదారులు తాము కొనుగోలు చేసే మెషిన్స్.. ట్రెండ్‌కి తగ్గట్టుగా ఆకర్షణీయమైన లుక్‌తో పాటు, లేటెస్ట్ వెర్షన్స్ తో ఉండాలని కోరుకుంటున్నారు. అలాంటి వారి కోసమే ఈ లేటెస్ట్ 3 ఇన్ 1 హెయిర్ రిమూవల్ డివైస్. ఇన్సులేటెడ్ గేట్ బైపోలార్ ట్రాన్సిస్టర్ టెక్నాలజీతో రూపొందిన ఈ మెషిన్ .. సూపర్ ఫాస్ట్ డివైస్‌గా పని చేస్తుంది. లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్‌ను ఇస్తుంది. ఈ పెయిన్లెస్ లేజర్ హెయిర్ రిమూవర్ సిస్టమ్.. స్త్రీలతో పాటు పురుషులకు కూడా చక్కగా ఉపయోగపడుతుంది. వినియోగించడం చాలా తేలిక. ఇది బాడీ, ఫేస్, బికినీ అనే మూడు ప్రత్యేకమైన మోడ్స్‌ని కలిగి ఉంటుంది. ప్రతి మోడ్‌లో 5 లెవెల్స్ చొప్పున ఉంటాయి. వాటిని తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు. 2 నెలల పాటు ఉపయోగించిన తర్వాత, వెంట్రుకల ఎదుగుదల పూర్తి స్థాయిలో తగ్గిపోతుంది. 98% వరకు ఫలితం కనిపిస్తుంది. అయితే ఈ ట్రీట్మెంట్కి ముందు.. వెంట్రుకలు రిమూవ్ చెయ్యాల్సిన భాగంలో షేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. స్కిన్ టోన్‌ని బట్టి.. హెయిర్ కలర్‌ని బట్టి ఇది యూజ్ అవుతుంది. ఇక దీన్ని వినియోగించిన చోట చర్మం పొడిబారి, గరుకుగా మారడం వంటి సమస్యలు తలెత్తవు. ఈ డివైస్‌ను కళ్లకు సమీపంలో వాడుతున్నప్పుడు దీనితో పాటు లభించే కళ్లజోడును కచ్చితంగా పెట్టుకోవాలి. ధర 118 డాలర్లు. అంటే 9,781 రూపాయలు. ఈ లేటెస్ట్ ట్రెండీ మెషిన్ వెంట ఉంటే.. వ్యాక్సింగ్, థ్రెడింగ్ల కోసం ప్రతినెలా బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరగాల్సిన పని ఉండదు. దీన్ని వినియోగించి.. కేవలం ఎనిమిది లేదా పది నిమిషాల్లో మొత్తం బాడీ మీదున్న వెంట్రుకలను తొలగించుకోవచ్చు. (చదవండి: ఈ కిట్ మీవద్ద ఉంటే..పార్లర్‌కి వెళ్లాల్సిన పని ఉండదు! -
బ్యూటీ పార్లర్ల చుట్టూతిరిగే సమస్యను పోగొట్టే గాడ్జెట్ ఇదే
లోలోపల ఆరోగ్య సమస్యల సంగతి పక్కనపెడితే.. పైకి కనిపించే అవాంఛిత రోమాల సమస్య 15 రోజులకోసారి బ్యూటీ పార్లర్ల చుట్టూతిరిగేలా చేస్తుంది. ఇలాంటి అన్ని సమస్యలకు చెక్ పెట్టేదే ఈ డివైజ్ (9,99,000 ఫ్లాషెస్ ఆటో మాన్యువల్ మోడ్స్ 5 ఎనర్జీ లెవెల్ హోమ్ యూజ్ పర్మినెంట్ హెయిర్ రిమూవల్). ఇది స్త్రీలకే కాదు పురుషులకూ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఈ అల్ట్రా–ఫాస్ట్ పర్మినెంట్ హెయిర్ రిమూవల్.. అధునాతనమైన ఇంటెన్స్ ప్లస్డ్ లైట్ టెక్నాలజీతో అవాంఛిత రోమాలను కుదుళ్ల నుంచి తొలగించి క్రమంగా తిరిగి రాకుండానూ నివారిస్తుంది. నొప్పి తెలియకుండా సమస్యను రూపుమాపుతుంది. ఇందులో 2 ప్రత్యేకమైన మోడ్స్, 5 ఎనర్జీలెవెల్స్ ఉంటాయి. స్కిన్ కలర్, హెయిర్ కలర్‌ని బట్టి మోడ్స్ సహకరిస్తాయి. మాన్యువల్ మోడ్‌తో సున్నితమైన భాగాల్లో అంటే బికినీ లైన్‌కి 4 నిమిషాలు, పైపెదవికి నిమిషం ఇలా ఒక్కోదానికి ఒక్కో సమయం పడుతుంది. ఇక చేతులు, కాళ్లు, వీపు భాగాలకు ఆటోమెటిక్ మోడ్ అప్లై చేసుకోవచ్చు. ట్రీట్మెంట్ తీసుకునే ప్రతి భాగంపై ముందుగానే షేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖానికి, మొత్తం బాడీకి ఈ ట్రీట్మెంట్ అందించేందుకు సుమారుగా 30 నిమిషాల సమయం పడుతుంది. 8 నుంచి 12 వారాలు క్రమం తప్పకుండా చేస్తే 90 శాతం హెయిర్ గ్రోత్ తగ్గుతుంది. 13వ వారం నుంచి ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. దీని నుంచి ఒక్కసారికి వెలువడే కాంతి (9,99,000 ఫ్లాషెస్) మానవశరీరానికి ఎలాంటి హానీ కలిగించదని నిరూపితమైంది. ప్రొఫెషనల్ ట్రీట్మెంట్ అందించే ఈ డివైజ్.. చాలా కంఫర్టబుల్‌గా పని చేస్తుంది. దీన్ని కళ్ల సమీపంలో ఉపయోగిస్తున్నప్పుడు కళ్లకు డివైజ్‌తో పాటు లభించిన ప్రత్యేకమైన గాగుల్స్ తప్పకుండా పెట్టుకోవాలి. అయితే ఈ హెయిర్ రిమూవర్ డార్క్ స్కిన్‌ను, వైట్ హెయిర్‌ను గుర్తించలేదు. -
వైరల్: ఆ రెండిటికీ తేడా తెలియకపోతే ఇలానే ఉంటుంది
మెల్బోర్న్ : షేవింగ్ క్రీమ్ అనుకుని ఓ యువకుడు పొరపాటున హేయిర్ రిమూవల్ క్రీమ్‌ను ముఖానికి పట్టించుకున్నాడు. దీంతో ముఖం మీది వెంట్రుకలు చాలా వరకు ఊడిపోయి కార్టూన్ క్యారెక్టర్‌లాగా అందవికారంగా తయారయ్యాడు. ఈ సంఘటన ఆస్ట్రేలియాలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌కు చెందిన రొనాల్డ్ వాల్కర్ అనే 22 ఏళ్ల యువకుడు కొద్దిరోజుల క్రితం గడ్డం చేసుకుందామని టేబుల్ డ్రాయర్లోంచి షేవింగ్ క్రీమ్ ట్యూబ్‌ను బయటకు తీశాడు. అయితే అందులోని క్రీమ్ అయిపోయి ఉండటంతో డ్రాయర్లో ఉన్న మరో క్రీమ్ ట్యూబ్‌ను బయటకు తీశాడు. దాన్ని ముఖంపై మొత్తం పూసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత ముఖం మొత్తం మండటం మొదలైంది. వెంటనే అతడు తన ముఖాన్ని ఫొటో తీసి సోదరుడికి పంపాడు. అతడి సోదరుడు ఆ ఫొటోను చూసి.. రొనాల్డ్ పూసుకున్నది సేవింగ్ క్రీమ్ కాదని, హేయిర్ రిమూవల్ క్రీమని చెప్పాడు. అతడు ముఖాన్ని కడుక్కోగా మీసాలు, రెండు కనుబొమ్మలో ఓ కనుబొమ్మ వెంట్రుకలు పూర్తిగా రాలిపోయాయి. ఈ సంఘటనను ఫన్నీగా భావించిన రొనాల్డ్ ఇందుకు సంబంధించిన ఫొటోలను తన ఫేస్బుక్ ఖాతాలో షేర్ చేశాడు. దీంతో అతడి ఫొటోలు వైరల్‌గా మారాయి. దీనిపై ఫేస్బుక్ వేదికగా రొనాల్డ్ స్పందిస్తూ.. ‘‘నాకు షేవింగ్ క్రీమ్‌కు, హేయిర్ రిమూవల్ క్రీమ్‌కు తేడా తెలియదు. ఈ రోజు ఈ రెండికి మధ్య తేడాను చాలా కష్టమైన పద్ధతిలో తెలుసుకున్నాను’’ అని చెప్పుకొచ్చాడు. చదవండి, చదివించండి : వైరల్: మమ్మీ... ప్లీజ్ కాస్త మెల్లిగా వేయండి! -
అవాంఛిత రోమాల లేజర్ చికిత్సతో చర్మంపై దుష్ప్రభావం ఉంటుందా?
నా వయసు 20 ఏళ్లు. నాకు ముఖంపైన కొన్నిచోట్ల రోమాలు ఉండి అసహ్యంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి అవాంఛిత రోమాలకు లేజర్ చికిత్స గురించి విన్నాను. నేను ఒకవేళ లేజర్ చికిత్స తీసుకుంటే అది నా చర్మంపై ఏదైనా ప్రతికూల ప్రభావం చూపుతుందా? లేజర్ చికిత్స వల్ల ఇతరత్రా ఏమైనా సైడ్ఎఫెక్ట్స్ అంటే శాశ్వతమైన దుష్ప్రభావాలు ఏవైనా ఉంటాయా? నాకు కాస్తంత వివరించండి. అవాంఛిత రోమాలను తొలగించడానికి వాడే లేజర్ చికిత్సలో అందుకు నిర్దేశించిన ఒక నిర్దిష్టమైన వేవ్‌లెంగ్త్‌లో వాటిని వాడటం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల కేవలం రోమాల్లోని కణాలు, చర్మంలోని కొన్ని నిర్దిష్టమైన కణాలు మాత్రమే ప్రభావితమవుతాయి. మరే ఇతర భాగాలూ దీనివల్ల ప్రభావితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మనకు అవసరం లేని రోమాలకు మాత్రమే లేజర్ ప్రభావం పరిమితమవుతుంది. కాబట్టి ఒకవేళ మీరు లేజర్ చికిత్స తీసుకోదలిస్తే దీని గురించి ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. నిర్భయంగా తీసుకోవచ్చు. -
పుట్టు వెంట్రుకలు...
షోడశ సంస్కారాలలో కేశఖండనం లేదా చూడాకర్మ ఒకటి. దీనినే పుట్టువెంట్రుకలు తీయటం అని వ్యావహారికంగా చెప్పుకుంటారు. తల్లి కడుపులోనుండి బయటకు వచ్చిన శిశువుకి మొదటిసారి వెంట్రుకలు తీయించే కార్యక్రమం. సాధారణంగా ఈ కార్యక్రమాన్ని మొదటి సంవత్సరం నిండకుండా గాని, మూడవ సంవత్సరంలో గాని నిర్వహిస్తుంటారు. అదీ కుదరనప్పుడు ఐదవ సంవత్సరంలో చేస్తారు. గోళ్ళు, జుత్తు మృత కణజాలం కదా! పైగా జుట్టు పెరగటం వల్ల పిల్లలు చికాకుగా ఉంటారు. చికాకు తగ్గించటానికి, ఆరోగ్య దృష్టితోను జుట్టుని చిన్నదిగా ఉంచటం మంచిదనే ఉద్దేశంతో ప్రాచీనులు కేశఖండనాన్ని చూడాకర్మమనే సంస్కారంగా మలచారు. పిల్లలకు కొంత వయసు వచ్చే వరకు తల లోపలి సంధులు కూర్చబడవు. అందుకే చిన్న పిల్లల తల పైభాగం మెత్తగా లోతుగా ఉంటుంది. ఆ మెత్తని భాగాన్ని మాడు అంటారు. కొన్ని నెలల నుండి రెండు మూడు సంవత్సరాలకు అది గట్టి పడుతుంది. దానిని మాడు పూడటం అంటారు. తల్లి కడుపులో ఉన్నప్పుడు ఏర్పడిన జుట్టు మెత్తని ఆ మాడు భాగాన్ని భద్రంగా కప్పి ఉంచి కాపాడుతుంది. కొంతమంది పిల్లలకు త్వరగా కొద్దినెలలకే గట్టి పడినా సాధారణంగా ఎక్కువ మందికి ఒకటిన్నర రెండు సంవత్సరాలకు మాడు గట్టి పడుతుంది. అప్పటితో పుట్టినప్పుడున్న జుట్టు అవసరం తీరిపోతుంది. దానిని తీసివేయాలి. తరువాత తాజాగా కొత్త జుట్టు వస్తుంది. పుట్టుకతో వచ్చిన జుట్టు తల్లి గర్భంలో ఉన్నన్ని రోజులూ మలిన జలాలలో నాని ఉంటుంది. వాటిని తొలగించటం వల్ల మలినమైన జుట్టు పోయి కొత్తగా ఆరోగ్యకరమైన జుట్టు వస్తుంది.