సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు..
మెల్‌బోర్న్ : షేవింగ్ క్రీమ్ అనుకుని ఓ యువకుడు పొరపాటున హేయిర్ రిమూవల్ క్రీమ్‌ను ముఖానికి పట్టించుకున్నాడు. దీంతో ముఖం మీది వెంట్రుకలు చాలా వరకు ఊడిపోయి కార్టూన్ క్యారెక్టర్‌లాగా అందవికారంగా తయారయ్యాడు. ఈ సంఘటన ఆస్ట్రేలియాలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌కు చెందిన రొనాల్డ్ వాల్కర్ అనే 22 ఏళ్ల యువకుడు కొద్దిరోజుల క్రితం గడ్డం చేసుకుందామని టేబుల్ డ్రాయర్‌లోంచి షేవింగ్ క్రీమ్ ట్యూబ్‌ను బయటకు తీశాడు. అయితే అందులోని క్రీమ్ అయిపోయి ఉండటంతో డ్రాయర్‌లో ఉన్న మరో క్రీమ్ ట్యూబ్‌ను బయటకు తీశాడు. దాన్ని ముఖంపై మొత్తం పూసుకున్నాడు.
కొద్దిసేపటి తర్వాత ముఖం మొత్తం మండటం మొదలైంది. వెంటనే అతడు తన ముఖాన్ని ఫొటో తీసి సోదరుడికి పంపాడు. అతడి సోదరుడు ఆ ఫొటోను చూసి.. రొనాల్డ్ పూసుకున్నది సేవింగ్ క్రీమ్ కాదని, హేయిర్ రిమూవల్ క్రీమని చెప్పాడు. అతడు ముఖాన్ని కడుక్కోగా మీసాలు, రెండు కనుబొమ్మలో ఓ కనుబొమ్మ వెంట్రుకలు పూర్తిగా రాలిపోయాయి. ఈ సంఘటనను ఫన్నీగా భావించిన రొనాల్డ్ ఇందుకు సంబంధించిన ఫొటోలను తన ఫేస్‌బుక్ ఖాతాలో షేర్ చేశాడు. దీంతో అతడి ఫొటోలు వైరల్‌గా మారాయి.
దీనిపై ఫేస్‌బుక్ వేదికగా రొనాల్డ్ స్పందిస్తూ.. ‘‘నాకు షేవింగ్ క్రీమ్‌కు, హేయిర్ రిమూవల్ క్రీమ్‌కు తేడా తెలియదు. ఈ రోజు ఈ రెండికి మధ్య తేడాను చాలా కష్టమైన పద్ధతిలో తెలుసుకున్నాను’’ అని చెప్పుకొచ్చాడు.
చదవండి, చదివించండి : వైరల్: మమ్మీ... ప్లీజ్ కాస్త మెల్లిగా వేయండి!
Comments
Please login to add a commentAdd a comment