బ్యూటీ పార్లర్ల చుట్టూతిరిగే సమస్యను పోగొట్టే గాడ్జెట్ ఇదే | IPL Hair Removal for Women Men Upgraded 999,000 Flashes | Sakshi
Sakshi News home page

బ్యూటీ పార్లర్ల చుట్టూతిరిగే సమస్యను పోగొట్టే గాడ్జెట్ ఇదే

Published Sun, Oct 10 2021 8:46 AM | Last Updated on Sun, Oct 10 2021 8:46 AM

IPL Hair Removal for Women Men Upgraded 999,000 Flashes  - Sakshi

లోలోపల ఆరోగ్య సమస్యల సంగతి పక్కనపెడితే.. పైకి కనిపించే అవాంఛిత రోమాల సమస్య 15 రోజులకోసారి బ్యూటీ పార్లర్ల చుట్టూతిరిగేలా చేస్తుంది. ఇలాంటి  అన్ని సమస్యలకు చెక్‌ పెట్టేదే ఈ డివైజ్‌ (9,99,000 ఫ్లాషెస్‌ ఆటో మాన్యువల్‌ మోడ్స్‌ 5 ఎనర్జీ లెవెల్‌ హోమ్‌ యూజ్‌ పర్మినెంట్‌ హెయిర్‌ రిమూవల్‌). 

ఇది స్త్రీలకే కాదు పురుషులకూ పర్ఫెక్ట్‌గా పనిచేస్తుంది. ఈ అల్ట్రా–ఫాస్ట్‌ పర్మినెంట్‌ హెయిర్‌ రిమూవల్‌.. అధునాతనమైన ఇంటెన్స్‌ ప్లస్డ్‌ లైట్‌ టెక్నాలజీతో అవాంఛిత రోమాలను కుదుళ్ల నుంచి తొలగించి క్రమంగా తిరిగి రాకుండానూ నివారిస్తుంది. నొప్పి తెలియకుండా సమస్యను రూపుమాపుతుంది. ఇందులో 2 ప్రత్యేకమైన మోడ్స్, 5 ఎనర్జీలెవెల్స్‌ ఉంటాయి. స్కిన్‌ కలర్, హెయిర్‌ కలర్‌ని బట్టి మోడ్స్‌ సహకరిస్తాయి. మాన్యువల్‌ మోడ్‌తో సున్నితమైన భాగాల్లో అంటే బికినీ లైన్‌కి 4 నిమిషాలు, పైపెదవికి  నిమిషం ఇలా ఒక్కోదానికి ఒక్కో సమయం పడుతుంది. 

ఇక చేతులు, కాళ్లు, వీపు భాగాలకు ఆటోమెటిక్‌ మోడ్‌ అప్లై చేసుకోవచ్చు. ట్రీట్మెంట్‌ తీసుకునే ప్రతి భాగంపై ముందుగానే షేవ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖానికి, మొత్తం బాడీకి ఈ ట్రీట్మెంట్‌ అందించేందుకు సుమారుగా 30 నిమిషాల సమయం పడుతుంది. 8 నుంచి 12 వారాలు క్రమం తప్పకుండా చేస్తే 90 శాతం హెయిర్‌ గ్రోత్‌ తగ్గుతుంది. 13వ వారం నుంచి ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. దీని నుంచి ఒక్కసారికి వెలువడే కాంతి (9,99,000 ఫ్లాషెస్‌) మానవశరీరానికి ఎలాంటి హానీ కలిగించదని నిరూపితమైంది. ప్రొఫెషనల్‌ ట్రీట్మెంట్‌ అందించే ఈ డివైజ్‌.. చాలా కంఫర్టబుల్‌గా పని చేస్తుంది. దీన్ని కళ్ల సమీపంలో ఉపయోగిస్తున్నప్పుడు కళ్లకు డివైజ్‌తో పాటు లభించిన ప్రత్యేకమైన గాగుల్స్‌ తప్పకుండా పెట్టుకోవాలి. అయితే ఈ హెయిర్‌ రిమూవర్‌ డార్క్‌ స్కిన్‌ను, వైట్‌ హెయిర్‌ను గుర్తించలేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement