గ్యాస్‌ గ్రిల్‌తో.. పిక్నిక్‌లో వెరైటీ వంటలు వండేయొచ్చు | Do You Know This Megamaster Portable Gas Grill Device | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ గ్రిల్‌తో.. పిక్నిక్‌లో వెరైటీ వంటలు వండేయొచ్చు

Published Tue, Aug 22 2023 2:45 PM | Last Updated on Tue, Aug 22 2023 3:18 PM

Do You Know This Megamaster Portable Gas Grill Device - Sakshi

లాంగ్‌ డ్రైవ్‌లకు వెళ్లినప్పుడు, పిక్నిక్లకు తిరిగినప్పుడు.. మన వెంట ఈ మెగామాస్టర్‌ పోర్టబుల్‌ గ్యాస్‌ గ్రిల్‌ ఉంటే చాలు, వేళకు రుచికరమైన ఐటమ్స్‌తో కడుపు నింపుకోవచ్చు. వెజ్, నాన్‌ వెజ్‌ ఇలా అన్ని రకాల వెరైటీలను చకచకా రెడీ చేసుకోవచ్చు. అందుకు వీలుగా ఈ గ్రిల్‌ డిజైన్‌ ప్రత్యేకంగా రూపొందింది. దీనిలో ఒకేసారి రెండు వెరైటీలు తయారు చేసుకోవచ్చు.

ఇది గ్యాస్‌ మీద ఆధారపడి పనిచేస్తుంది. దీని లోపల పాన్‌ ప్లేట్, స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ గ్రిల్‌ వేరువేరుగా ఉంటాయి. మూతకు అటాచ్‌ అయ్యి ఉన్న ఆ స్టీల్‌ స్టాండ్‌ మూతతో పాటు పైకిలేస్తుంది. క్లోజ్‌ చేస్తే.. దాని మీద ఆహారం లోపల పడిపోకుండా పోర్టబుల్‌గా మెషిన్‌లో అమరిపోతుంది. దీని బ్లాక్‌ అండ్‌ రెడ్‌ హ్యాండిల్‌కి ఆనుకుని ఉన్న చిన్న బటన్‌ ప్రెస్‌ చేస్తే.. పాన్‌ ప్లేట్‌ కింద మంట పుడుతుంది.

అలాగే ఇది నిలబడటానికి ఉపయోగపడే స్టాండ్స్‌ కూడా మడిచేందుకు వీలుగానే ఉంటాయి. మూత ఊడకుండా లాక్‌ చేసుకోవడానికి ప్రత్యేకమైన క్లిప్‌ ఉంటుంది. ఎక్కడికైనా తీసుకుని వెళ్లడానికి దీని హ్యాండిల్‌ చక్కగా పనికొస్తుంది. ఇందులో కట్లెట్స్, కబాబ్స్, హోల్‌ చికెన్‌ వంటివెన్నీ రెడీ చేసుకోవచ్చు. ఈ డివైస్‌ ధర 79 డాలర్లు (రూ.6,535).

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement