
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్‌కు చెందిన పేమెంట్ సొల్యూషన్స్ కంపెనీ ‘పేస్విఫ్’ పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) పరికరాన్ని విడుదల చేసింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ వ్యవస్థ కలిగిన ఈ పరికరాన్ని బుధవారమిక్కడ మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. యాప్స్‌తో కూడిన పీవోఎస్ డివైజ్‌ను వర్తకులు స్మార్ట్‌ఫోన్ మాదిరిగా వినియోగించుకోవచ్చని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. క్రెడిట్, డెబిట్ కార్డులు, వాలెట్స్, ఆన్‌లైన్ పేమెంట్, యూపీఐ, భారత్ క్యూఆర్ వంటి అన్ని రకాల పేమెంట్ ఆప్షన్లను వినియోగించుకునే వీలుంటుందని పేర్కొంది.