Health Tips In Telugu: These Things That We Should Not Do After Eating Dinner in Telugu - Sakshi
Sakshi News home page

Health Tips: తినగానే నిద్రకు ఉపక్రమిస్తే... ఈ దుష్ప్రభావాలు తప్పవు!

Published Sun, May 8 2022 1:23 PM | Last Updated on Sun, May 8 2022 6:01 PM

Health Tips In Telugu: Avoid These Things After Eating Dinner - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

Health Tips In Telugu: ఇటీవల ఆరోగ్యస్పృహ పెరగడం వల్ల తిన్న వెంటనే నిద్రకు ఉపక్రమించడం లేదుగానీ... గతంలో చాలామంది రాత్రి భోజనం కాగానే వెంటనే పడక మీదికి చేరేవారు. ఇప్పటికీ ఇలాంటివాళ్లు ఉన్నారు. నిజానికి తిన్న వెంటనే పడక మీదికి చేరడం వల్ల అసిడిటీ ప్రభావంతో కడుపులో ఇబ్బందులు పెరుగుతాయి.  ఓ సీసా నిండా నీళ్లు ఉన్నప్పుడు, దాన్ని నిలబెట్టకుండా... పక్కకు ఒరిగేలా చేస్తామనుకోండి.

దానిలోని ద్రవం సీసా గొంతు భాగంలోకి వచ్చినట్టే... మన కడుపులోని ద్రవాలూ గ్రావిటీ వల్ల ఫుడ్‌పైప్‌లోకి వస్తాయి. దాంతో మన కడుపులోని యాసిడ్‌... అన్నంపై పనిచేయడానికి బదులుగా గొంతులోంచి పైకి తన్నినట్లుగా అవుతుంది.

దాంతో గొంతులో వేడి ఆవిర్లు వస్తున్నట్లుగా అనిపించడం, కడుపులోని అన్నంపై యాసిడ్‌ ప్రభావం తగ్గి, అది త్వరగా అరగకపోవడం, కడుపు ఉబ్బరంగా ఉండటం (బ్లోటింగ్‌) వంటి అనర్థాలన్నీ జరుగుతాయి. అందుకే భోజనం తిన్న వెంటనే, పడక మీదికి ఒరిగిపోకుండా... ఆహారానికీ, నిద్రకూ కనీసం రెండు గంటల వ్యవధి ఇవ్వడం అవసరమన్నది వైద్యనిపుణుల సలహా. 

చదవండి👉🏾Oral Health Tips: నోటి దుర్వాసనకు చెక్‌! లవంగాలను తరచూ చప్పరిస్తున్నారా.. అయితే
చదవండి👉🏾Barley Water Health Benefits: బార్లీ నీళ్లు.. అద్భుత ప్రయోజనాలు.. రోజూ గ్లాసుడు తాగారంటే!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement