నాకు ఐదవ నెల ప్రెగ్నెన్సీ. ప్రతిరోజు మోషన్ ఫ్రీగా రాక ఇబ్బంది పడుతున్నాను. ఏ మందులూ పని చెయ్యడం లేదు.
ప్రెగ్నెన్సీలో ఇది చాలా సాధారణ సమస్య. హార్డ్ మోషన్‌తో పాటు పెయిన్‌ఫుల్‌గా కూడా ఉండొచ్చు. దీని వల్ల పొట్టలో నొప్పి, ఉబ్బరం, క్రాంప్స్ వస్తాయి. ప్రెగ్నెన్సీలో సరిగ్గా నీళ్లు తీసుకోకపోవడం అసలు కారణం. హార్మోనల్ చేంజెస్‌తో బొవల్ మూవ్‌మెంట్ కూడా బాగా తగ్గుతుంది. నీళ్లు సరిగ్గా తాగక బొవల్ మూవ్‌మెంట్ స్పీడ్ తగ్గి మోషన్ గట్టిపడటంతో మలబద్ధ్దకం మొదలవుతుంది.
తినే ఆహారంలో ఫైబర్ తక్కువ ఉన్నా, ద్రవ పదార్థాలు తక్కువ తీసుకున్నా, స్టూల్ బల్క్ తగ్గి కూడా మోషన్ హార్డ్ అవుతుంది. ఎక్సర్‌సైజెస్, యోగా చేసిన వారిలో టమ్మీ మజిల్స్ స్టిములేట్ అవుతాయి. దానితో మలబద్ధకం లాంటి ఇబ్బందులు రావు. మీరు రోజుకు నాలుగైదు లీటర్ల నీరు తాగండి. ఫైబర్ ఎక్కువ ఉండే ఆహారం.. బీన్స్, ఫ్రూట్స్, మొలకెత్తిన గింజలు తీసుకోవాలి. మోషన్ ఫ్రీగా అయ్యే లాక్సాటివ్ సిరప్స్ తీసుకోవాలి. వీటిలో స్టిములేటింగ్ లాక్సాటివ్స్ అంటే బొవల్ ఫాస్ట్‌గా మూవ్ అయ్యేటట్టు చేసేవి వాడాలి. కొన్ని మెడిసిన్స్, యాంటీబయాటిక్స్ వల్ల కూడా మలబద్ధకం సమస్య వస్తుంది.
మీరు అవి గుర్తించి డాక్టర్‌కి చెప్పాలి. అప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులను ఇస్తారు. వారంలో కనీసం మూడుసార్లు కూడా మోషన్‌కి వెళ్ళకపోతే మలబద్ధకంగా పరిగణించాలి. థైరాయిడ్ డిసీజ్, ఇరిటబుల్ బొవల్ సిండ్రోమ్‌లాంటి కండిషన్స్ ఉన్న వారిలో ఇంకా ఎక్కవ అవుతుంది. ప్రెగ్నెన్సీలో ఐదుగురిలో ఒక్కరికి ఈ ప్రాబ్లమ్ వస్తుంది. అన్నీ కరెక్ట్‌గా ఉన్నా కొంతమందిలో ఎందుకు మలబద్ధకం వస్తుందో చెప్పలేము. అలాంటప్పుడు హెల్దీ డైట్, ఎక్సర్‌సైజ్, లాక్సాటివ్స్‌తో ట్రీట్‌మెంట్ ఇస్తాము.
– డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్ హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment