Pregnant difficulties
-
పిల్లలు.. గర్భంలో ఉన్నప్పుడే తల్లి గొంతును గుర్తిస్తారు! అయితే ఈ సామర్థ్యం..
పద్మవ్యూహాన్ని ఎలా ఛేదించాలనే విషయాన్ని అర్జునుడు తన భార్య సుభద్రకు చెప్తుండగా గర్భంలో ఉన్న అభిమన్యుడు విని నేర్చుకున్నాడని మహాభారతంలో చదువుకున్నాం. అది నిజమేనని నమ్మేవాళ్లే ఎక్కువ. ఆ నమ్మకాన్ని వ్యాపారం చేసుకుంటూ, గర్భంలోని బిడ్డలకు కూడా పాఠాలు నేర్పిస్తున్నవారూ ఉన్నారు. అయితే అదంతా నిజమేనా? అనే సందేహం ఉంది. అందుకే తల్లిదండ్రులను, శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరచే శిశు సామర్థ్యాల గురించి తెలుసుకుందాం. పిల్లలను మరింత బాగా అర్థం చేసుకుని పెంచేందుకు ఇవి తల్లిదండ్రులకు ఉపయోగపడతాయి.శిశువులకు అసాధారణ వినికిడి సామర్థ్యాలు ఉన్న మాట నిజం. పెద్దలు నిమిషానికి 14 వేల వైబ్రేషన్స్‌ని స్వీకరిస్తే, పిల్లలు 20 వేల వైబ్రేషన్స్‌ని స్వీకరిస్తారు. గర్భం దాల్చిన 24వ వారం నుంచి పిండాలు బాహ్య వాతావరణం నుంచి శబ్దాలను గుర్తించగలవని అధ్యయనాలు చెబుతున్నాయి. గర్భంలో ఉన్నప్పుడే తల్లి గొంతును గుర్తిస్తారు. అయితే ఈ సామర్థ్యం స్వరాన్ని గుర్తించడానికి మాత్రమే పరిమితం. పద్మవ్యూహాన్ని అర్థం చేసుకునేటంత తెలివితేటలు ఉండవు. ఇక పుట్టిన వారం రోజుల నుంచే తల్లి గొంతును, ఇతరుల గొంతు నుంచి వేరు చేస్తారని డికాస్పర్, ఫీఫెర్(1980) చేసిన పరిశోధనలో వెల్లడైంది.శిశువులు అమ్మభాషకు, వేరే భాషలకు మధ్య తేడాను గుర్తించగలరంటే మీరు నమ్మగలరా? కానీ పెదవి కదలికలు, ముఖ కవళికలను గమనించడం ద్వారా ఆ తేడాను గుర్తించగలరని వీకమ్ ఎటేల్ (2007) అధ్యయనంలో వెల్లడైంది. దీన్నిబట్టి పిల్లల చూపు ఎంత చురుగ్గా ఉంటుందో అర్థమైంది కదా!శిశువుల పరిశీలనా సామర్థ్యం కేవలం భాషాభివృద్ధికే పరిమితం కాదు. 18 నెలల వయసు గల పిల్లలు.. ఇతరులు మాట్లాడటానికంటే ముందే ముఖకవళికలు, బాడీ లాంగ్వేజ్‌ను గమనించి వారి ఉద్దేశాలను, భావోద్వేగాలను అర్థం చేసుకోగలరని మెల్ట్జాఫ్ (1995) కనుగొన్నారు.పిల్లలు.. వాళ్లేం నేర్చుకుంటారని కొట్టిపడేయకండి. కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి శిశువుల మెదళ్లు తయారుగా ఉంటాయని కుహ్ల్ (2004) నొక్కి చెప్పారు. భాషను నేర్చుకునే సామర్థ్యం.. బాల్యంలోనే గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది. ఐదేళ్ల లోపు ఐదు భాషలు ఏకకాలంలో నేర్చుకోగలరు.అమ్మ పోలికా? నాన్న పోలికా? ఇకపై గొడవ పడకండి. నవజాత శిశువులు ఎక్కువగా తండ్రులను పోలి ఉంటారని సూచించే ఆధారాలు ఉన్నాయి. జన్యు పరీక్షలనేవి రాకముందే తండ్రెవరో గుర్తించడానికి ప్రకృతి పరంగా ఈ సారూప్యత ఏర్పడి ఉండవచ్చని బ్రెస్సన్, గ్రాస్సీ (2004) పేర్కొన్నారు.పుట్టుకతోనే పిల్లలకు సంఖ్యల పట్ల సహజమైన ఇన్ట్యూషన్ ఉంటుంది. అంతేకాదు వివిధ పరిణామాల మధ్య తేడాను గుర్తించగలరు. కూడిక, తీసివేతల మధ్య ప్రాథమిక అవగాహన కలిగి ఉంటారని గిynn (1992) అధ్యయనంలో వెల్లడైంది.శిశువులు మనిషి ముఖాలనే కాదు, జంతువుల ముఖాల మధ్య తేడానూ గుర్తించగలరు. అయితే వయసుతో పాటు మనుషులతో ఎక్కువ సమయం గడపడం వల్ల, మనుషుల ముఖాలను గుర్తించే సామర్థ్యం పెరుగుతుంది. జంతువుల ముఖాల మధ్య తేడాను గుర్తించే సామర్థ్యం తగ్గిపోతుందని పాస్కాలిస్తోపాటు ఇతరులూ (2002) కనుగొన్నారు.నవజాత శిశువులు తల్లి పాలనే కాదు, తల్లి వాసనకూ ప్రాధాన్యాన్నిస్తారు. తల్లి వాసన తగిలినవెంటనే శిశువులు ప్రశాంతంగా ఉంటారని మాక్ఫర్లేన్ (1975) కనుగొన్నారు. ఇది తల్లితో బంధం బలపడటంలో, ఆహారాన్ని అందించడంలో సహాయపడుతుంది.మనిషి మనుగడ సాగించాలంటే కమ్యూనికేషన్ అవసరం. అది పిల్లలు పుట్టుకతోనే నేర్చుకుంటారు. శిశువులు ముఖకవళికలను అనుకరించగలరని, ముఖ సంజ్ఞలను పునరావృతం చేయగలరని మెల్ట్జాఫ్, మూర్ (1977) గమనించారు. కమ్యూనికేషన్ స్కిల్స్‌కు మూలం బాల్యంలోనే ఉంది.శిశువులు తమ అనుభవాలను జ్ఞాపకాలుగా గుర్తుంచుకుంటారు. ఈ జ్ఞాపకాలు జీవితంలో తర్వాత స్పష్టంగా గుర్తుకు రాకపోవచ్చు, కానీ అవి ప్రవర్తనను, ప్రాధాన్యాలను ప్రభావితం చేస్తాయి. అందుకే శిశువులకు అందమైన అనుభవాలను అందించడం తల్లిదండ్రుల బాధ్యత.– సైకాలజిస్ట్ విశేష్ -
ప్రెగ్నెన్సీలో.. సరిగ్గా నీళ్లు తీసుకోకపోవడం వల్లే ఈ సమస్య!
నాకు ఐదవ నెల ప్రెగ్నెన్సీ. ప్రతిరోజు మోషన్ ఫ్రీగా రాక ఇబ్బంది పడుతున్నాను. ఏ మందులూ పని చెయ్యడం లేదు.ప్రెగ్నెన్సీలో ఇది చాలా సాధారణ సమస్య. హార్డ్ మోషన్‌తో పాటు పెయిన్‌ఫుల్‌గా కూడా ఉండొచ్చు. దీని వల్ల పొట్టలో నొప్పి, ఉబ్బరం, క్రాంప్స్ వస్తాయి. ప్రెగ్నెన్సీలో సరిగ్గా నీళ్లు తీసుకోకపోవడం అసలు కారణం. హార్మోనల్ చేంజెస్‌తో బొవల్ మూవ్మెంట్ కూడా బాగా తగ్గుతుంది. నీళ్లు సరిగ్గా తాగక బొవల్ మూవ్మెంట్ స్పీడ్ తగ్గి మోషన్ గట్టిపడటంతో మలబద్ధ్దకం మొదలవుతుంది.తినే ఆహారంలో ఫైబర్ తక్కువ ఉన్నా, ద్రవ పదార్థాలు తక్కువ తీసుకున్నా, స్టూల్ బల్క్ తగ్గి కూడా మోషన్ హార్డ్ అవుతుంది. ఎక్సర్సైజెస్, యోగా చేసిన వారిలో టమ్మీ మజిల్స్ స్టిములేట్ అవుతాయి. దానితో మలబద్ధకం లాంటి ఇబ్బందులు రావు. మీరు రోజుకు నాలుగైదు లీటర్ల నీరు తాగండి. ఫైబర్ ఎక్కువ ఉండే ఆహారం.. బీన్స్, ఫ్రూట్స్, మొలకెత్తిన గింజలు తీసుకోవాలి. మోషన్ ఫ్రీగా అయ్యే లాక్సాటివ్ సిరప్స్ తీసుకోవాలి. వీటిలో స్టిములేటింగ్ లాక్సాటివ్స్ అంటే బొవల్ ఫాస్ట్‌గా మూవ్ అయ్యేటట్టు చేసేవి వాడాలి. కొన్ని మెడిసిన్స్, యాంటీబయాటిక్స్ వల్ల కూడా మలబద్ధకం సమస్య వస్తుంది.మీరు అవి గుర్తించి డాక్టర్‌కి చెప్పాలి. అప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులను ఇస్తారు. వారంలో కనీసం మూడుసార్లు కూడా మోషన్‌కి వెళ్ళకపోతే మలబద్ధకంగా పరిగణించాలి. థైరాయిడ్ డిసీజ్, ఇరిటబుల్ బొవల్ సిండ్రోమ్‌లాంటి కండిషన్స్ ఉన్న వారిలో ఇంకా ఎక్కవ అవుతుంది. ప్రెగ్నెన్సీలో ఐదుగురిలో ఒక్కరికి ఈ ప్రాబ్లమ్ వస్తుంది. అన్నీ కరెక్ట్‌గా ఉన్నా కొంతమందిలో ఎందుకు మలబద్ధకం వస్తుందో చెప్పలేము. అలాంటప్పుడు హెల్దీ డైట్, ఎక్సర్సైజ్, లాక్సాటివ్స్తో ట్రీట్మెంట్ ఇస్తాము.– డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ -
ఈ సమస్యను.. పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటారు! ఇదీ..
నా వయసు 24 సంవత్సరాలు. నాకు ఆరు నెలలుగా వెజైనల్ దురద, పెయిన్, అప్పుడప్పుడు ఫీవర్ వస్తున్నాయి. నాకు ప్రెగ్నెన్సీ కూడా రావట్లేదు. ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా కంప్లీట్ రిలీఫ్ రావడం లేదు. – అమృత, విజయవాడమీరు చెప్పిన లక్షణాలను బట్టి దాన్ని పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటారు. దీనికి చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్. అది వెజైనల్ / యూరిన్‌లో ఉండవచ్చు. భర్త నుంచి వ్యాపించవచ్చు. అందుకే మీరు గైనకాలజిస్ట్‌ను కలసి వెజైనల్, యూరిన్ శాంపిల్స్ తీసుకుని, బ్యాక్టీరియల్ లేదా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందా అని నిర్ధారణ చేసి దానికి తగిన యాంటీబయాటిక్స్ ఇస్తారు. మీ భర్తని కూడా యూరాలజిస్ట్‌ని కలసి యురేటరల్ స్వాబ్ తీసుకోమని చెబుతారు.ఇద్దరికీ ట్రీట్మెంట్ చేసిన తరువాతనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చెయ్యమని చెప్తారు. ఇన్ఫెక్షన్స్ సరిగ్గా ట్రీట్ చెయ్యనప్పుడు ఫాలోపియన్ ట్యూబ్‌కి ఏ ఇన్ఫెక్షన్ వ్యాపించినా ట్యూబ్స్ బ్లాక్ కావచ్చు. అప్పుడు ప్రెగ్నెన్సీ రావడం కష్టమవుతుంది. వచ్చినా ట్యూబ్‌లోనే ప్రెగ్నెన్సీ రావడం.. అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అవుతుంది. ఇది ప్రమాదం. గర్భసంచికి కూడా ఇన్ఫెక్షన్ వ్యాపించే అవకాశాలు ఉంటాయి. లక్షణాలు మొదలైన రెండుమూడు రోజుల్లో వెంటనే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్‌కి ట్రీట్మెంట్ మొదలుపెడితే ఈ లాంగ్‌టర్మ్ రిస్క్స్ ఏమీ ఉండవు.డాక్టర్ చెప్పిన యాంటీబయాటిక్స్ కూడా సరైన టైమ్‌కి సరైన డోస్, చెప్పినన్ని రోజులు కరెక్ట్‌గా తీసుకోవాలి. వాళ్లకి ఫ్యూచర్లో ఇన్ఫెక్షన్ రాకుండా ఏడాదికి చెకప్‌కి వెళ్లమని చెప్తారు. ప్రెగ్నెన్సీ ఆలస్యం అవుతుంటే అల్ట్రాసౌండ్ ద్వారా ట్యూబ్స్‌లో బ్లాక్ ఉందా అని చెక్ చేస్తారు. కొన్ని బ్లడ్ టెస్ట్‌ల ద్వారా కూడా ప్రెగ్నెన్సీ ఆలస్యం అవ్వడానికి కారణాలను కనిపెడతారు. సరైన సమయానికి ట్రీట్మెంట్ ఇస్తే, మళ్లీ వెజైనల్∙ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.– డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
భరోసా ఇవ్వాలి.. బాధ్యతగా ఉండాలి
‘‘నెల నెలా డాక్టర్ దగ్గరకు వెళ్తున్నావా’’ ‘‘న్యూట్రిషనిస్ట్ ఇచ్చిన డైట్ చార్ట్ ప్రకారం తింటున్నావా’’ ‘‘రోజూ వాకింగ్ చేస్తే డెలివరీ సులువవుతుంది’’ ‘‘నీకేం తినాలని ఉందో చెప్పు... చేసి పంపిస్తాను’’ గర్భిణికి ఇలాంటి ఆత్మీయ పలకరింపులెన్నో. ఆత్మీయతలు... ఆనందాలు బయటకు కనిపిస్తాయి. ఆమె మనసు పడే సంఘర్షణ బయటకు కనిపించదు. ఆమె మనసు మౌనంగా మాట్లాడుతుంది. జీవిత భాగస్వామి ఆ మనసు భాషను అర్థం చేసుకోవాలి. తగిన సహకారం అందించాలి. గర్భిణులకు క్రమం తప్పకుండా డాక్టర్ చెకప్ చేసుకోవాలని చెబుతుంటాం. పోషకాహారం గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడుతుంటాం. వ్యాయామం ఎంత అవసరమో సూచిస్తుంటాం. బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఒకమ్మాయి గర్భం దాల్చిందని తెలియగానే ఫోన్ చేసి అభినందనలు చెబుతూ రకరకాల పరామర్శల్లో భాగంగా పై జాగ్రత్తలన్నీ చెబుతుంటాం. మరొక అడుగు ముందుకు వేసి మనసును ప్రశాంతంగా ఉంచుకోమనే ఓ మంచిమాట కూడా. అయితే గర్భంతో ఉన్న మహిళకు ఈ జాగ్రత్తలతోపాటు సైకాలజిస్ట్ కౌన్సెలింగ్ కూడా అవసరమనే సున్నితమైన విషయాన్ని చెప్పేవాళ్లుండరు. ‘సైకాలజిస్ట్‌ను సంప్రదించడం ఎందుకు? ఏ మానసిక సమస్య ఉందని’ అనే ప్రతిస్పందన కొంచెం ఘాటుగా కూడా వినిపిస్తుంటుంది. ‘నిజానికి పై జాగ్రత్తలన్నింటితోపాటు మానసిక విశ్లేషకుల సలహాలు, సూచనలు కూడా అవసరమే. ఆ సూచనలు గర్భంతో ఉన్న మహిళకు మాత్రమే కాదు భర్తకు కూడా’ అంటున్నారు క్లినికల్ సైకాలజిస్ట్ కాంతి. ఇద్దరికీ కౌన్సెలింగ్ ‘‘ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పటి నుంచి ఇద్దరికీ కౌన్సెలింగ్ ఉండాలి. తల్లి కావాలనే అందమైన ఆకాంక్ష ప్రతి మహిళకూ ఉంటుంది. అలాగే మాతృత్వం గురించిన మధురోహలతోపాటు అనేకానేక భయాలు కూడా వెంటాడుతుంటాయి. ప్రసారమాధ్యమాల్లో వచ్చే అనేక దుర్వార్తల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. తన బిడ్డకు అలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయేమోననే భయం వెంటాడుతూ ఉంటుంది. ఆమె తన భయాలను భర్తతో పంచుకున్నప్పుడు వచ్చే ప్రతిస్పందన చాలా కీలకం. నిర్లక్ష్యంగానో, విసుగ్గానో రెస్పాండ్ అయితే గర్భిణి మనసుకయ్యే గాయం చాలా తీవ్రంగా ఉంటుంది. అందుకే గర్భిణిలో తలెత్తే శారీరక, మానసికమైన మార్పుల గురించిన అవగాహన భర్తకు ఉండి తీరాలి. అందుకే కౌన్సెలింగ్‌కి ఇద్దరూ రావాలని చెబుతాం. కొంత మంది భర్తలు ప్రెగ్నెంట్ ఉమన్‌తో వాళ్ల తల్లిని లేదా సోదరిని పంపిస్తుంటారు. ఎట్టి పరిస్థితిలోనూ ఇలాంటి రాజీలు ఉండకూడదని చెబుతుంటాం. భార్య మానసిక స్థితిలోని సున్నితత్వం స్థాయులు భర్తకు అర్థమైనప్పుడే అతడు భార్యకు అన్ని వేళల్లోనూ అండగా నిలబడగలుగుతాడు. మెంటల్ వెల్బీయింగ్ గురించిన అవగాహన ఇద్దరిలో ఉన్నప్పుడే పాపాయిని జాగ్రత్తగా చూసుకోవడంలో కూడా పరిణతితో వ్యవహరించగలుగుతారు. మూడో వ్యక్తికి సాదర స్వాగతం సాధారణంగా మన ఇళ్లలో గర్భిణిగా ఉన్నప్పుడు ఆమెను అందరూ అపురూపంగా చూసుకుంటూ ఉంటారు. డెలివరీ తర్వాత బాధ్యతలన్నీ ఆమె భుజాల మీద మోపుతూ జాగ్రత్తల పేరుతో ఆమెను కట్టడి చేస్తుంటారు. నిజానికి ఈ దశలో భర్త సపోర్టు చాలా అవసరం. పోస్ట్ పార్టమ్ డిజార్డర్ ఒక్కొక్కరిలో ఒక్కో స్థాయిలో ఉంటుంది. మహిళ తన జీవితం ఒక్కసారిగా స్తంభించి పోయినట్లు భావిస్తుంది. ఒంటరితనం, నెగిటివ్ థాట్స్, ‘అందరూ సంతోషంగా ఉన్నారు... నా జీవితమే ఇలాగైంది, సోషల్ లైఫ్‌కు దూరంగా ఇంట్లో నాలుగ్గోడలకే పరిమితమైపోయింది జీవితం... అని దిగులు పడడం వంటి ఆలోచనలన్నీ వస్తుంటాయి. ఎందుకంటే చాలామంది మగవాళ్లకు తండ్రి అయిన తర్వాత కూడా లైఫ్‌స్టయిల్ ఏమీ మారదు. ఆడవాళ్ల విషయంలో అందుకు పూర్తిగా భిన్నం. అలాంటప్పుడే భర్త పట్టించుకోవడం లేదనే న్యూనత కూడా మొదలవుతుంది. అందుకే పోస్ట్ డెలివరీ ప్రిపరేషన్ గురించి డెలివరీకి ముందే భార్యాభర్తలిద్దరినీ మానసికంగా సిద్ధం చేయడం జరుగుతుంది. మగవాళ్లు తండ్రి అయిన సంతోషాన్ని బయట స్నేహితులతో సెలబ్రేట్ చేసుకోవడం సరికాదు, ఇంట్లోనే స్నేహితులతో గెట్ టు గెదర్ ఏర్పాటు చేసి భార్యను కూడా వేడుకలో భాగస్వామ్యం చేయాలి. పెటర్నిటీ లీవ్ సౌకర్యం ఉంటుంది. ఆ సెలవు తీసుకుంటారు, కానీ భార్యకు సహాయంగా ఉండక ఇతర వ్యాపకాలతో గడిపే వాళ్లూ ఉంటారు. కానీ తమ కుటుంబంలో మూడో వ్యక్తికి స్వాగతం పలికే క్రమంలో ప్రతి దశలోనూ భర్తను భాగస్వామ్యం చేయగలిగితే ఇలాంటి పరిణామాలుండవని నా అభిప్రాయం. డెలివరీ అయిన మహిళలకు దేహాకృతి విషయంలో ఎక్కడ లేని ఆందోళన మొదలవుతుంటుంది. దేహం తిరిగి మామూలు కాదనే భయం వెంటాడుతుంటుంది. మరికొందరు... నా బిడ్డకు నేను చేయాల్సినంత చేయడం లేదేమో, నేను మంచి తల్లిని కాలేనేమో అని బాధపడుతుంటారు. ఒక్కొక్కరైతే తమలో తామే బాధపడుతూ మౌనంగా రోదిస్తుంటారు, పెద్దగా వెక్కి వెక్కి ఏడుస్తారు కూడా. భావోద్వేగ పరమైన అసమతుల్యతకు లోనవుతున్న విషయాన్ని గుర్తించలేకపోతారు. మా కౌన్సెలింగ్‌లో భార్యాభర్తలిద్దరికీ ఇలాంటి విషయాలన్నింటి మీద అవగాహన కల్పిస్తాం. కాబట్టి భార్య మానసికంగా న్యూనతకు లోనయినప్పుడు ఎమోషనల్ సపోర్టు ఇవ్వాలనే విషయం మగవాళ్లకు తెలుస్తుంది. – ఎమ్. కాంతి, క్లినికల్ సైకాలజిస్ట్ హైదరాబాద్ చర్చ కావాలి... వాదన వద్దు! ఇక చంటి బిడ్డను చూడడానికి ఇంటికి వచ్చిన వాళ్లు కూడా ‘ఫలానా ఆమె తన బిడ్డను కింద పెట్టకుండా ఒంటి చేత్తో పెంచుకుంటోంది’ వంటి స్టేట్మెంట్లు అలవోకగా ఇచ్చేస్తుంటారు. ఆ మాటల ప్రభావంతో అన్నీ తనే చూసుకుంటూ సూపర్ మామ్ కావాలనే అవసరం లేని పట్టుదలకు కూడా పోతుంటారు చంటిబిడ్డల తల్లులు. ఇలాంటి కామెంట్లకు ప్రభావితం కాకుండా, విపరీత పరిణామాలకు తావివ్వకుండా ఉండాలి. భార్యాభర్తల మధ్య డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ గురించి ఇద్దరికీ అవగాహన ఉంటే చంటిబిడ్డను పెంచడంలో భార్యాభర్తలిద్దరూ సమంగా బాధ్యతలు పంచుకోగలుగుతారు. ప్రతి విషయాన్నీ చక్కగా చర్చించుకోవాల్సిన అవసరాన్ని తెలియచేస్తాం. అలాగే ఇద్దరి మధ్య డిస్కషన్ వాదనకు దారి తీయకూడదనే హెచ్చరిక కూడా చేస్తాం. సామరస్యమైన చర్చ ద్వారా సమస్యలకు పరిష్కారాలు కనిపిస్తాయి. వితండ వాదన వివాదానికి దారి తీస్తుంది. మన సంప్రదాయ పెంపకంలో... మగవాళ్లను అనేక విషయాలకు దూరంగా ఉంచడమే జరిగింది ఇంతవరకు. భార్యకు ఎమోషనల్ సపోర్టు ఇవ్వడం, బిడ్డ పెంపకంలో బాధ్యతను పంచుకుంటూ బాలింతకు విశ్రాంతినివ్వడం వంటివేవీ మగవాళ్లకు తెలియచేయడం ఉండదు. అందుకే ఏ విషయంలోనైనా భర్త తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుంటే అది అతడికి ఎలా స్పందించాలో తెలియక పోవడం కూడా అయి ఉండవచ్చు. అపోహ పడడానికి ముందు అతడికి తెలియచేసే ప్రయత్నం చేయాలని కూడా మహిళలకు చెబుతుంటాం. భార్యకు ధైర్యం చెప్పి అండగా నిలవాల్సిన బాధ్యతను భర్తకు గుర్తు చేస్తుంటాం’’ అన్నారు కాంతి. – వాకా మంజులారెడ్డి -
నడిరోడ్డుపై గర్భిణి నరకయాతన
పొదలకూరు: శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నెలలు నిండకుండానే ఓ గర్భిణికి రక్తస్రావం అయ్యింది. సకాలంలో గమ్యస్థానానికి చేర్చి వైద్యం అందించాల్సిన 108 వాహనానికి ఇంధనం లేకపోవడంతో ఆయిల్ పట్టుకుని వస్తామని చెప్పి సిబ్బంది గర్భిణిని నడిరోడ్డుపై వదిలి వెళ్లారు. దీంతో ఆ మహిళ నడిరోడ్డుపై నరకయాతన అనుభవించింది. బస్టాండ్‌లో ఉన్న ఓ ఆటో డ్రైవర్ 108 వచ్చేలోగా తాను గర్భవతిని నెల్లూరుకు తరలిస్తానని ముందుకు వచ్చి మానవత్వం చాటుకున్నాడు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నాగులవెల్లటూరు గ్రామానికి చెందిన ఆరో నెల గర్భిణికి రక్తస్రావం అవుతుండటంతో 108 అంబులెన్స్‌లో బంధువులు పొదలకూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ప్రతినెలా ఇదే ఆస్పత్రిలో పరీక్షలు చేయిస్తున్నారు. గర్భిణి పరిస్థితి విషమించడంతో వైద్యురాలు మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్‌లో నెల్లూరుకు తరలించాల్సిందిగా సూచించారు. ఈలోగా 108 సిబ్బంది వాహనంలో ఇంధనం లేదని దాన్ని నింపుకుని వస్తామని గర్భిణిని రోడ్డుపై వదిలేసి వెళ్లారు. అంబులెన్స్ రావడం ఆలస్యం కావడంతో రక్తస్రావం అవుతున్న గర్భిణి నరకయాతన అనుభవించింది. ఆమె ఆర్తనాదాలకు స్థానికులు చుట్టుముట్టారు. బంధువులకు ఏమి చేయాలో పాలుపోక అయోమయంలో ఉండగా గర్భిణిని తాను నెల్లూరుకు తీసుకెళతానని ఓ ఆటోడ్రైవర్ ముందుకొచ్చారు. అయితే ఇంధనం వేయించుకుని 108 వాహనం అక్కడికి రావడంతో గర్భిణిని అందులోనే నెల్లూరుకు తరలించారు. ఈ ఘటనపై అంబులెన్స్ సిబ్బంది మాట్లాడుతూ..తాము ముందుగానే నెల్లూరుకు తరలిస్తామని చెప్పినా గర్భిణి పొదలకూరు ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకు వెళ్లాల్సిందిగా తమకు చెప్పిందని తెలిపారు. 108 సిబ్బంది చెప్పినట్లు వారు నేరుగా నెల్లూరుకు వెళ్లినా మధ్యలో ఇంధన సమస్య వచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని బంధువులు అంటున్నారు. -
పురిటి నొప్పులతోనే పంపించేస్తున్నారు
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిలో పురిటి నొప్పులతో వస్తున్న నిండు గర్భిణులకు వైద్య సేవలు అందడం లేదు. వైద్యులు లేరని, సరైనా పరీక్షలు లేవని, సీరియస్‌గా ఉందని సాకులు చూపుతూ బలవంతంగా నిజామాబాద్ జిల్లాకు సిఫారసు చేస్తున్నారు. దీంతో అరచేతిలో తల్లి శిశువుల ప్రాణాలు పట్టుకుని అంబులెన్స్‌లలో వెళ్తున్నారు. మార్గమధ్యంలో ఇటీవల చాలా మంది గర్భిణులు ప్రసవాలైన సంఘటనలు ఉన్నాయి. ఇలా కామారెడ్డి జిల్లా కేంద్ర ఏరియా ఆస్పత్రిలో దారుణ సంఘటనలు జరుగుతున్నాయి. అయితే బుధవారం రోజున ముగ్గురు గర్భిణులను గెంటేశారు. ఒక్క మంగళవారం రోజే ఏడుగురు గర్భిణులను గెంటేశారు. దీంతో గర్భిణులు, వారి బంధువులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సౌకర్యాలు లేవనే సాకుతో.. బుధవారం రోజున ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డికి చెందిన సవిత పురిటి నొప్పులతో ప్రసవం కోసం వచ్చింది. పరీక్షించిన వైద్యులు ఇక్కడ సౌక ర్యాలు లేవని, శిశువు బాగా లేదని, నిజామాబాద్‌కు వెళ్లాలని రిఫర్ చేశారు. ఇదే రోజు కామారెడ్డి మండలం తిమ్మక్‌పల్లికి చెందిన బోయ సంధ్య అత్తగారైనా సిర్నాపల్లిలో రెగ్యులర్‌గా చూపించుకుంటూ తల్లిగారు ఇక్కడే కావడంతో పురిటి నొప్పులతో కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి వచ్చింది. ఇక్కడ రెగ్యులర్‌గా చెకప్ చేయించుకోలేదని మీ ప్రాంత ఆస్పత్రిలో చూపించుకోవాలని రిఫర్ చేసారని సంధ్య తండ్రి భిక్షపతి వాపోయాడు. భిక్కనూరుకు చెందిన ఓ నిండు గర్భిణిని రిఫర్ చేశారు. మంగళవారం రోజున గుర్జాల్తండాకు చెందిన కవిత, అమర్లబండకు చెందిన స్వప్న, యాచారం తండాకు చెందిన అనితతోపాటు మ రో నలుగురు గర్భిణులను బలవంతంగా నిజా మాబాద్‌కు రిఫర్ చేశారు. మంగళవారం గైనిక్ డాక్టర్ విజయలక్ష్మి విధుల్లో లేక రిఫర్లు చేసా మని సిబ్బంది చెప్పుకొచ్చారు. ఇలా రెండు రోజుల్లోనే 10 మంది గర్భిణులను అకారణంగా వైద్యు లు లేరని, రక్త పరీక్షలు లేవని, రెగ్యులర్‌గా చెకప్‌లు చేయించుకోలేరని, ఇక్కడ సౌకర్యాలు లేవనే వివిధ రకాల కారణాలతో వీరందరిని రిఫర్ చేసారని తెలిసింది. జులైలో చాలామంది గర్భిణులను ముఖ్యంగా రాత్రివేళల్లో వస్తున్న వారందరిని నిజామాబాద్‌కు, హైదరాబాద్‌కు రిఫర్ చేస్తున్నారు. ఏప్రిల్‌లో ఎల్లారెడ్డి మండలం మీసానిపల్లితండాకు చెందిన వనిత అనే గర్భిణిని రిఫర్ చేయడంతో కామారెడ్డి దాటగానే అంబులెన్స్‌లో సాధారణ ప్రసవమైంది. గత నెల 9న రామారెడ్డి మండలం కన్నాపూర్‌కు చెందిన సవిత అనే గర్భిణిని సైతం వైద్యులు లేరని రిఫర్ చేయడంతో మార్గమధ్యలో అంబులెన్స్‌లో ప్రసవమైంది. ఇలాంటి సంఘటనలు చాలానే జరుగుతున్నాయి. వైద్యులుంట లేరు... కామారెడ్డి ఏరియా ఆస్పత్రిలో ప్రస్తుతం గైనిక్ వైద్యురాలు విజయలక్ష్మి మాత్రమే ఉన్నారు. సర్జన్లు ఇద్దరు ఉన్నారు. ప్రసవాలను డాక్టర్ విజయలక్ష్మి చూసుకుంటారు. ఆపరేషన్ అవసరమైతే ఈ ముగ్గురు వైద్యులు చేస్తున్నారు. రోజంతా విధులు నిర్వహిస్తున్న వీరు రాత్రిపూట ఉండక గైనిక్ వైద్యులు లేరని గర్భిణులను పంపించేస్తున్నారు. సాధారణ కాన్పులు కాకపోతే ఆపరేషన్ అయ్యే అవకాశాలు ఉంటే డాక్టర్లు లేరని ఎమర్జెన్సీగా రిఫర్లు చేస్తున్న సంఘటనలు ఉన్నాయి. దీంతో గర్భిణులు నానా అవస్థలు పడుతున్నారు. శని, ఆదివారాల్లో మాత్రం గర్భిణులు వస్తే మాత్రం సిబ్బంది చూస్తున్నారు. పట్టించుకోని అధికారులు జిల్లా కేంద్ర ఆస్పత్రులో వైద్యులు లేక గర్భిణులు అవస్థలు పడుతున్నారు. పెద్ద సంఘటనలు జరిగినప్పుడు ఇతర ఆస్పత్రుల నుంచి వైద్యులను డిప్యూటేషన్ వేసి మరిచిపోతున్నారు. వారు వెళ్లి పోగానే మళ్లీ సమస్య మొదటికి వస్తుంది. నూత నంగా వస్తున్న మహిళా వైద్యులు ప్రసవాలు, సీజరియన్లు చేయడం లేదు. కేవలం ఓపీ చూస్తున్నారు. దీంతో పురిటి నొప్పులతో వస్తున్న గర్భిణులు నరకం చూస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. ఇక్కడ సౌకర్యాలు లేవంటున్నరు నేను పురిటి నొప్పులతో వస్తే గంటసేపు పరీక్ష చేసి ఇక్కడ సౌకర్యాలు లేవు అని పంపిచేశారు. లోపల దారుణంగా మాట్లాడుతున్నారు. అసలు ఎవ్వరూ సరిగ్గా పట్టించుకోవడం లేదు. ఇదేంటని అడిగితే తిడుతున్నారు. మేం రెగ్యులర్‌గా ఎల్లారెడ్డిలో చూపించుకున్నామని ఇక్కడ చెకప్‌లు లేదని పంపిచేస్తున్నారు. -బోయ సంధ్య, గర్భిణి -
నిండు గర్భిణి ఇబ్బందులు
జనగామ: జిల్లా కేంద్ర ఆస్పత్రిలోని వైద్యుల నిర్లక్ష్యంతో ఓ నిండు గర్భిణి ఏడు గంటల పాటు నరకయాతన పడింది. తీరా డెలివరీ సమయానికి తమ నుంచి కాదని చేతులెత్తేశారు. గంటలో వరంగల్ ఎంజీఎంకు తీసుకు వెళ్లాలని.. లేకుంటే పెద్ద ప్రాణానికే ముప్పు వాటిల్లుతోందని భయపెట్టారు. జనగామ జిల్లా పెద్దపహాడ్‌కి చెందిన కావ్య, హైదరాబాద్‌లోని అన్నోజీగూడకు చెందిన వల్లె శ్రీకాంత్ దంపతులు. ఈ నెల 14న జరిగిన రోడ్డు ప్రమాదంలో కావ్య తండ్రి శ్రీనివాస్ రెడ్డి మృతి చెందడంతో ఆమె తల్లిగారింటి వద్దనే ఉంటోంది. నిండు గర్భిణి అయిన కావ్యకు మంగళవారం ఉదయం పురిటినొప్పులు రావడంతో మేనమామ మాధవరెడ్డి, బంధువులు ఆమెను జనగామ ప్రభు త్వ ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు మధ్యాహ్నం సమయంలో డెలివరీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో కావ్య పరిస్థితి బాగాలేదని, వెం టనే వరంగల్‌కు తరలించాలని డాక్టర్లు చెప్పి వెళ్లిపోయారు. ‘ బిడ్డరక్తం పోతోంది.. ప్రసూ తి చేయండి అంటూ కుటుంబసభ్యులు కాళ్లు, వేళ్తూ పట్టుకుని బతిమిలాడినా వారు వినిపించుకోలేదు. ‘పరిస్థితి విషమంగా ఉంది.. తర్వాత మీ ఇష్టం..’అని డ్యూటీలో ఉన్న వైద్యురాలు చెప్పడంతో వారు భయాందోళనకు గురయ్యారు. దీంతో వెం టనే అంబు లెన్స్‌లో వరంగల్‌కు తరలిస్తూ మార్గమధ్యం లో జనగామలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడి వైద్యులు 30 నిమిషాల్లోనే ఆపరేషన్ చేయగా కావ్య పండంటి కూతురుకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారు. -
తల్లీబిడ్డల ప్రాణం ఖరీదు రూ.3 లక్షలు!
జడ్చర్ల: ప్రసవం కోసం వెళ్లిన గర్భిణి.. వైద్యుల నిర్లక్షంతో మృతి చెందింది. తల్లితో పాటు కడుపులో ఉన్న బిడ్డ కూడా చనిపోయింది. ఈ ఘట న మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పరిధి లోని బాదేపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. లింగంపేట గ్రామానికి చెం దిన లావణ్య(25) బాదేపల్లిలో నివాస ముంటోంది. గర్భిణిగా ఉన్న లావణ్యకు సోమవారం పురిటి నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాన్పునకు సంబంధించి శస్త్ర చికిత్స చేసే సమయంలో సదరు గర్భిణితో పాటు కడుపులో ఉన్న బిడ్డ కూడా చనిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. ఓ పెద్దమనిషి రూ.3 లక్షలు బాధిత కుటుంబానికి అందజేసేలా రాజీ కుదిర్చారు. దీంతో బాధితులు ఆందోళన విరమించి లావణ్య మృతదేహాన్ని తీసుకెళ్లారు. దీనిపై ఎలాంటి ఫిర్యాదూ అందలేదని సీఐ గంగాధర్ తెలిపారు.