తల్లీబిడ్డల ప్రాణం ఖరీదు రూ.3 లక్షలు! | Full of pregnancy difficulties | Sakshi
Sakshi News home page

తల్లీబిడ్డల ప్రాణం ఖరీదు రూ.3 లక్షలు!

Published Wed, May 24 2017 2:39 AM | Last Updated on Tue, Sep 5 2017 11:49 AM

Full of pregnancy difficulties

జడ్చర్ల: ప్రసవం కోసం వెళ్లిన  గర్భిణి.. వైద్యుల నిర్లక్షంతో మృతి చెందింది. తల్లితో పాటు కడుపులో ఉన్న బిడ్డ కూడా చనిపోయింది. ఈ ఘట న మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల పరిధి లోని బాదేపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. లింగంపేట గ్రామానికి చెం దిన లావణ్య(25) బాదేపల్లిలో నివాస ముంటోంది. 

గర్భిణిగా ఉన్న లావణ్యకు సోమవారం పురిటి నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాన్పునకు సంబంధించి శస్త్ర చికిత్స చేసే సమయంలో సదరు గర్భిణితో పాటు కడుపులో ఉన్న బిడ్డ కూడా చనిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు.  ఓ పెద్దమనిషి రూ.3 లక్షలు బాధిత కుటుంబానికి అందజేసేలా రాజీ కుదిర్చారు. దీంతో బాధితులు ఆందోళన విరమించి లావణ్య మృతదేహాన్ని తీసుకెళ్లారు. దీనిపై ఎలాంటి ఫిర్యాదూ అందలేదని సీఐ గంగాధర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement