నాకు 45 ఏళ్లు. రొటీన్ చెకప్ స్కాన్‌లో రెండు ఓవరీస్‌లో 3 సెం.మీ, 5 సెం.మీ సిస్ట్స్ ఉన్నాయని చెప్పారు. దీనికి ఎలాంటి ట్రీట్‌మెంట్ ఉంటుంది? క్యాన్సర్ రిస్క్ ఏమైనా ఉందా అని భయంగా ఉంది. – రుబీనా, గాజులరామారం
ఆ వయసులో చాలామందికి హార్మోనల్ ఇంబాలెన్సెస్ వల్ల ఓవరీస్‌లో సిస్ట్స్ ఫామ్ కావచ్చు. ఆ ఏజ్‌లో అంటే మెనోపాజ్‌కి ముందు క్యాన్సర్ రిస్క్ చాలా తక్కువ. సింపుల్ సిస్ట్స్ అయితే అసలు ట్రీట్‌మెంట్ కూడా అవసరం లేదు. ఒకవేళ ఆ సిస్ట్స్ 5 సెం.మీ కన్నా ఎక్కువుంటే చిన్న కీహోల్ సర్జరీ ద్వారా సిస్ట్‌ని మాత్రమే తీసేసి టెస్టింగ్‌కి పంపిస్తారు. ఓవరీస్ నుంచి 2– 3 సెం.మీ సైజులో ప్రతినెలా అండాలు విడుదలవుతాయి. కొన్నిసార్లు ఇంకాస్త పెద్ద సైజులో కూడా ఉండొచ్చు. భయపడాల్సిన అవసరం లేదు.
3 సెం.మీ కంటే ఎక్కువ ఉంటేనే సిస్ట్ అంటాము. ఫ్లూయిడ్ ఫిల్ అయి ఉంటాయి. అవి సింపుల్ సిస్ట్స్. కొంతమందికి బ్లడ్ ఫిల్ అయిన సిస్ట్స్ ఉంటాయి. వాటిని ఎండోమెట్రియాటిక్ సిస్ట్స్ అంటారు. డెర్మాయిడ్ సిస్ట్‌లో ఫ్యాట్ టిష్యూ ఉంటుంది. మీరు ఇంటర్నల్ పెల్విస్ స్కాన్ చేయించుకోండి. అందులో సిస్ట్ సైజ్, దాని తీరు స్పష్టంగా తెలుస్తాయి. ఏ సింప్టమ్ లేకుండా ఈ సిస్ట్స్ చాలామందిలో స్కానింగ్‌లోనే తెలుస్తాయి. అప్పుడు వాటి నేచర్‌ని బట్టి సైజ్‌ని బట్టి ట్రీట్‌మెంట్ ఇస్తారు. పదిలో ఒకరికి మాత్రమే సర్జరీ అవసరం ఉంటుంది.
కొంతమందికి కింది పొట్టలో నొప్పి, లైంగికంగా కలసినప్పుడు నొప్పి, యూరినరీ ప్రాబ్లమ్స్, మోషన్ డిఫికల్టీస్ ఉండవచ్చు. అలాంటి వారికి వెంటనే కొన్ని రక్తపరీక్షలు చెయ్యాలి. ఫ్యామిలీ హిస్టరీని కూడా డీటేయిల్డ్‌గా తీసుకుంటారు. సిస్ట్ వల్ల సమస్య ఉందని తేలితే క్లోజ్ ఫాలో అప్‌లో డాక్టర్ మీకు విషయాన్ని వివరిస్తారు. చాలా సిస్ట్‌లకు వెయిట్ అండ్ వాచ్ పాలసీయే సూచిస్తారు. మీకున్న సింప్టమ్స్, బ్లడ్ రిపోర్ట్స్, సైజ్‌ని బట్టి ఎంత తరచుగా స్కాన్స్ ద్వారా రీచెక్ చెయ్యాలో చెప్తారు. సిస్ట్ సైజ్ 5–7 సెం.మీ ఉన్నప్పుడు ఏడాదికి ఫాలో అప్ ఉంటుంది. ఏడాదికి మళ్లీ స్కాన్ చేయించుకోమని సూచిస్తారు. 7 సెం.మీ కన్నా ఎక్కువ ఉంటే ఎమ్మారై స్కాన్ చేయించుకోమంటారు. ఈ దశలో సర్జరీని సజెస్ట్ చేస్తారు.
మీ వయసుకి ఓవరీస్‌ని పూర్తిగా తీసేయడం మంచిది కాదు. 50–52 ఏళ్ల వరకు ఓవరీస్ నుంచి వచ్చే హార్మోన్స్ చాలా అవసరం. అందుకే లాపరోస్కోపీ ద్వారా కేవలం సిస్ట్‌ని మాత్రమే తీసేస్తారు. ఒకవేళ ఆ సిస్ట్ మెలికపడి పక్కనున్న బవెల్, బ్లాడర్ మీదికి స్ప్రెడ్ అయిన కొన్ని అరుదైన కేసెస్‌లో ఓవరీస్‌ని కూడా తీసేయాల్సి ఉంటుంది. మీరొకసారి గైనకాలజిస్ట్‌ని సంప్రదించండి. ఇంటర్నల్ స్కాన్ చేసి డీటేయిల్డ్‌గా చూస్తారు.
ఇవి చదవండి: స్కాన్‌లో ఓవరీస్‌లో చాకొలేట్ సిస్ట్స్‌తో ఏమైనా ప్రమాదమా?
Comments
Please login to add a commentAdd a comment