నాకు 20 ఏళ్లు. పీరియడ్స్ పెయిన్ సివియర్‌గా ఉంటోంది. స్కాన్‌లో ఓవరీస్‌లో చాకొలేట్ సిస్ట్స్ ఉన్నాయని చెప్పారు. వీటివల్ల ప్రమాదమేమైనా ఉంటుందా? – కునాలిక, వైజాగ్
ఇవి కొన్నిసార్లు గర్భసంచి పొరలోని టిష్యూ పెల్విస్‌లో ట్యూబ్స్, ఓవరీస్, వెజైనా మీద పెరుగుతాయి. పీరియడ్స్ టైమ్‌లో గర్భసంచిలో బ్లీడింగ్ అయినట్టే వేరేచోట కూడా బ్లీడ్ అయ్యి సిస్ట్స్ పెయిన్ వేస్తాయి. పీరియడ్స్‌లో పొట్టలో నొప్పి, యూరిన్‌లో, మోషన్‌లో లోయర్ బాడీ అంతా నొప్పి ఉండొచ్చు. ఇవి ఎందుకు వస్తాయి అనేదానికి స్పష్టమైన కారణమేమీ లేదు. జన్యుపరమైన కారణాలు, హార్మోన్స్‌కి సంబంధించిన కారణాలు ఉంటాయి.
ఇవి పదిమందిలో ఒకరికి ఉంటాయి. ఎమ్మారై స్కాన్‌లో కన్‌ఫర్మ్‌గా ఇది ఎండోమెట్రియాసిస్ అని చెప్పవచ్చు. క్రమం తప్పకుండా పెయిన్ రిలీఫ్ మెడిసిన్స్‌ని వాడాల్సి వస్తుంది. పారాసిటమాల్, ట్రామడాల్ లాంటివి బాగా పనిచేస్తాయి. మీ ఏజ్ గ్రూప్ వారికి హార్మోన్ పిల్స్ బాగా పెయిన్ రిలీఫ్‌ని ఇస్తాయి. ఇవి ఎండోమెట్రియాసిస్ సిస్ట్స్ లేదా చాకొలేట్ సిస్ట్స్‌ని కుంచించుకుపోయేలా చేస్తాయి. నొప్పిని తగ్గిస్తాయి. కంబైన్డ్ ఓరల్ కంట్రాసెప్టివ్ పిల్స్‌ని క్రమం తప్పకుండా నెలంతా వేసుకోవాలి.
ఈ మాత్రలతో వికారం, తలనొప్పి వంటి చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. కానీ రెండు నెలల్లో అంతా సర్దుకుంటుంది. 3 నుంచి 6 నెలల్లో మినిమమ్ ట్రీట్‌మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. చాకొలేట్ సిస్ట్స్ సైజ్ 5 సెం.మీ కన్నా ఎక్కువున్నా, హార్మోన్స్ పనిచేయకపోయినా లాపరోస్కోపీ సర్జరీ సూచిస్తారు. ఈ సిస్ట్స్‌ని తీసేసిన తరువాత క్వాలిటీ ఆఫ్ లైఫ్ మెరుగవుతుంది. కానీ రికరెన్స్ అంటే మళ్లీ వచ్చే రిస్క్ కూడా ఎక్కువే. క్లోజ్ ఫాలో అప్ స్కాన్స్ చేయించుకుంటూ ఉండాలి. ఆరోగ్యకరమైన జీవన శైలి ఫాలో కావాలి. పౌష్టికాహారాన్ని తీసుకోవాలి.
కొంతమందికి GnRH analogue ఇంజెక్షన్స్ ఇస్తారు. సర్జరీ తరువాత కూడా కొందరికి వీటిని సజెస్ట్ చేస్తారు. లాపరోస్కోపీ సర్జరీలో సిస్ట్స్‌ని తొలగించి.. ఏమైనా ఎండోమెట్రియాటిక్ స్పాట్స్ ఉంటే వాటిని కూడా fulgurate చేస్తే పెల్విక్ పెయిన్ బాగా తగ్గుతుంది. ఎండోమెట్రియాసిస్ సిస్ట్స్ ఉన్నాయని తెలిసినప్పుడు క్లోజ్ ఫాలో అప్‌లో ఉండాలి.
ఇవి చదవండి: ఏదో మిస్ అవుతున్నానబ్బా అని.. పదే పదే ఈ సందేహమా?
Comments
Please login to add a commentAdd a comment