పాదాలు అందంగా ఆరోగ్యంగా ఉండాలంటే చర్మం మీద మృతకణాలు తొలగించడం ప్రధానం. ఇంట్లోనే చేసుకోగలిగిన సింపుల్ పెడిక్యూర్ చేసుకునేటప్పుడు ఒక జాగ్రత్త తప్పనిసరిగా పాటించాలి. పాదాలను శుభ్రం చేయడానికి వాడే పమిస్ స్టోన్ మరీ పాతదై పోయి స్టోన్ రంధ్రాలు మురికితో నిండినప్పటికీ కొందరు దానినే ఉపయోగిస్తుంటారు. అది అసలు మంచిది కాదు. దాని వల్ల చర్మం మీదున్న మృతకణాలు తొలగకపోగా ఇతర ఇన్‌ఫెక్షన్‌లు వచ్చే ప్రమాదం ఉంటుంది.
ఇలా చేయండి..
- గోరు వెచ్చటి నీటిలో రెండు చుక్కలు లిక్విడ్ సోప్ లేదా షాంపూ వేసి కలిపి అందులో పాదాలను పది నిమిషాల సేపు ఉంచాలి. ఆ తర్వాత పాదాలను, వేళ్లను పమిస్ స్టోన్ లేదా ఫుట్ ఫైలర్‌తో రుద్ది శుభ్రం చేయాలి.
- పాదాలను పొడి వస్త్రంతో తుడిచి మాయిశ్చరైజర్ లేదా బాడీ క్రీమ్ రాయాలి.
- క్రీమ్ రాసిన తర్వాత పాదాలకు, వేళ్లకు మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల పాదాలు అలసట తొలగి సాంత్వన పొందుతాయి. రక్తప్రసరణ మెరుగవడంతో పాదాల నొప్పులు, పాదాల కండరాలు పట్టేయడం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.
Comments
Please login to add a commentAdd a comment