Pedicure
-
Beauty Tips: పాదాల శుభ్రతలో.. ఇది అస్సలు మంచిది కాదు!
పాదాలు అందంగా ఆరోగ్యంగా ఉండాలంటే చర్మం మీద మృతకణాలు తొలగించడం ప్రధానం. ఇంట్లోనే చేసుకోగలిగిన సింపుల్ పెడిక్యూర్ చేసుకునేటప్పుడు ఒక జాగ్రత్త తప్పనిసరిగా పాటించాలి. పాదాలను శుభ్రం చేయడానికి వాడే పమిస్ స్టోన్ మరీ పాతదై పోయి స్టోన్ రంధ్రాలు మురికితో నిండినప్పటికీ కొందరు దానినే ఉపయోగిస్తుంటారు. అది అసలు మంచిది కాదు. దాని వల్ల చర్మం మీదున్న మృతకణాలు తొలగకపోగా ఇతర ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇలా చేయండి.. గోరు వెచ్చటి నీటిలో రెండు చుక్కలు లిక్విడ్ సోప్ లేదా షాంపూ వేసి కలిపి అందులో పాదాలను పది నిమిషాల సేపు ఉంచాలి. ఆ తర్వాత పాదాలను, వేళ్లను పమిస్ స్టోన్ లేదా ఫుట్ ఫైలర్తో రుద్ది శుభ్రం చేయాలి. పాదాలను పొడి వస్త్రంతో తుడిచి మాయిశ్చరైజర్ లేదా బాడీ క్రీమ్ రాయాలి. క్రీమ్ రాసిన తర్వాత పాదాలకు, వేళ్లకు మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల పాదాలు అలసట తొలగి సాంత్వన పొందుతాయి. రక్తప్రసరణ మెరుగవడంతో పాదాల నొప్పులు, పాదాల కండరాలు పట్టేయడం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఇవి చదవండి: Priyanka Singh: బటర్‌ఫ్లై మామ్ -
పెడిక్యూర్ కోసం పార్లర్‌కు వెళ్లాల్సిన పనిలేదు, సింపుల్‌గా ఇంట్లోనే..
పెడిక్యూర్ ఇప్పుడు ఇంట్లోనే.. ►పాదాలను మెరిపించడంలో అరటితొక్కలు చక్కగా పనిచేస్తాయి. ►అరటితొక్కలను పాదాలపైన రుద్దితే మృతకణాలు, దుమ్మూ ధూళీ తొలగిపోతాయి. ► అరటి తొక్కలను ముక్కలుగా తరిగి కొద్దిగా తేనె వేసి పేస్టు చేయాలి. ఈ పేస్టుని పాదాలకు రాయాలి. అరగంట తరువాత సాధారణ నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండుసార్లు ఇలా చేయడం వల్ల పాదాలు మృదువుగా మారడంతో పాటు, చక్కగా మెరుస్తాయి. ► అరటితొక్కల పేస్టులో కొద్దిగా అలోవెరా జెల్ కలపాలి. ఈ పేస్టుని పాదాలకు అప్లై చేయాలి. ఇరవై నిమిషాల తరువాత కడిగేయాలి. ఈ పేస్టు పాదాలకు తేమనందించి కోమలంగా ఉంచుతుంది. ► అరటితొక్కల పేస్టులో కాఫీ పొడి, తేనె వేసి కలిపి స్క్రబర్‌లా పదిహేను నిమిషాలు రుద్దాలి. పాదాలపైన మురికి, మలినాలు పోయి చక్కగా మెరుస్తాయి. -
షుగర్ ఉంటే పెడిక్యూర్ చేయించుకోవచ్చా? లేదంటే..
షుగర్ ఉన్నవాళ్లు కళ్లు దగ్గర నుంచి కాళ్ల వరకు ప్రతి అవయవాన్ని కాపాడుకోవాల్సిందే. మధుమేహం అందరికీ కామన్ వ్యాధిలా అనిపించినా అదొక సైలెంట్ కిల్లర్. నెమ్మదిగా అవయవాలన్నింటిని బలహీనం చేసి చావు అంచులదాక తీసుకువెళ్లే భయానక వ్యాధి. సకాలంలో మందులు వేసుకుంటూ జాగురుకతతో వ్యవహరించకపోతే అంతే సంగతి. ఇప్పుడూ షుగర్ వయసుతో సంబంధం లేకుండా వచ్చేస్తోంది. ఇలా మధుమేహంతో బాధపడేవాళ్లు పార్లర్‌కి వెళ్లి పాదాలకు పెడిక్యూర్ వంటివి చేయించుకోవద్దని స్ట్రాంగ్‌గా హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. మధుమేహగ్రస్తులు ప్రతి అవయవాన్ని చాలా సున్నితంగా చూసుకోవాల్సిందే. శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు సమంగా ఉండాలి. కళ్లు, మూత్రపిండాలు, గుండె మీద ఎలాంటి ప్రభావం పడకుండా ఎప్పటికప్పుడూ చెకప్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యాధిగ్రస్తుల పాదాల్లో నరాలు సున్నితంగా ఉంటాయి. ముఖ్యంగా పాదాలకు ఎలాంటి గాయాలు కాకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పైగా చాలామందికి పాదాల్లో తిమ్మిర్లు, స్పర్శ లేకపోవడం వంటి సమస్యలు ఉంటాయి. కాబట్టి వీళ్లు పార్లర్‌కి వెళ్లి పాదాలకు సంబంధించిన పెడిక్యూర్ వంటివి చేయించుకోకూడదు. ఎందుకంటే? వాళ్లు పాదాలల్లో ఉన్న డెడ్ స్కిన్‌ని తొలగించడం వంటివి చేస్తారు. ఇది మరింత ప్రమాదం. వాళ్లు చేసే మసాజ్ కారణంగా నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. మాములు వ్యక్తులకు ఏం కాదు. కానీ ఘుగర్ ఉన్నవాళ్లకి అరికాళ్ల వద్ద చర్మ పలుచబడిపోతుంది. కాబట్టి పార్లర్ లేదా సెలూన్లో పాదాలకు సంబందించిన మసాజ్‌లు కాస్త ప్రమాదమే. ఎందుకు పెడక్యూర్ వద్దు..? డయాబెటిస్ స్టేజ్‌ల రీత్యా వారు ఈ పెడిక్యూర్ చేయించుకుంటే అరికాళ్లలోని స్కిన్‌ని తొలగించడం కారణంగా గాయాలుగా మారే అవకాశం ఉంటుంది. అదే ఒక వేళ శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువగా ఉంటే గాయం అయినా కూడా తెలియదు. మరింత పెద్దిగా మారి ప్రాణాంతకంగా మారవచ్చు. నిజానికి మసాజ్ చేసినప్పుడూ రక్తప్రసరణ జరిగి చేయించుకన్న అనుభూతి, రిలీఫ్ ఉంటాయి. మధుమేహం ఎక్కువగా ఉంటే ఏం చేసినా అంతగా తెలియదు. పెడిక్యూర్‌లో భాగంగా గోళ్లు కత్తిరంచడం లేదా క్లీన్ చేయడం జరుగుతుంది. ఒకరికి ఉపయోగించిన సాధనాలను అపరిశుభ్రంగా వాడితే అది ఇన్ఫెక్షన్లకు దారితీయొచ్చు. మధుమేహగ్రస్తులు పాదాలకు సంబంధించిన చికిత్సలు ఆర్థోపెడిస్ట్ నిపుణుల పర్యవేక్షణలోనే తీసుకోవాలి. ఇలా సెలూన్ లేదా బ్యూటీపార్లర్‌లో చేయించుకుంటే మాత్రం ఇన్ఫెక్షన్ల బారిన పడటమే కాకుండా మరింతగ ఆయా ప్రాంతాల్లో స్పర్శ కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. (చదవండి: మానసిక అనారోగ్యమే అని లైట్ తీసుకోవద్దు! బీ కేర్ ఫుల్! లేదంటే..) -
వికటించిన పెడిక్యూర్.. ఏకంగా రూ.13 కోట్ల నష్టపరిహారం
మహిళలు బ్యూటీ పార్లర్‌కి వెళ్లి ఫేషియల్స్ వంటివి చేయించుకుంటారనే విషయం తెలుసు. కానీ ఒక్కొసారి అవి వికటిస్తే ఎంతటి ప్రమాదాలు ఎదురవుతాయో కుడా ఇటీవల చూస్తున్నాం. అచ్చం అలానే ఒక మహిళ పాదాలకు మానిక్యూర్ చేయించకున్న తర్వాత ఆమె ఏకంగా కాలునే పొగొట్టుకుంది. (చదవండి: షార్క్ చేపతో ముఖాముఖి షూటింగ్: షాకింగ్ వైరల్ వీడియో!!) అసలు విషయంలోకెళ్లితే....ఫ్లోరిడాకు చెందిన ఒక మహిళ టంపాలోని టామీస్ నెయిల్స్ అనే పార్లర్‌కి వెళ్లింది. అయితే అప్పుడు ఆమె పాదాలకు పెడిక్యూర్ చేయించుకుంది. అప్పుడు పార్లర్ వాళ్లు పాదాలు మంచి అందంగా ఉండే నిమిత్తం కాస్మటిక్ ట్రీట్మెంట్ వంటివి చేశారు. అయితే ఆ సమయంలో ఆమె పాదం కాస్త తెగుతుంది. ఈ మేరకు ఆమెకు ఫెరిఫెరల్ వాస్క్యూలర్ అనే వ్యాధి( రక్తనాళాల్లో కొలస్ట్రాల్ ఏర్పడి ద్వారాలు ఇరుకై రక్త ప్రవహానిక అవరోదం ఏర్పడుతుంది) ఉండటంతో ఆ గాయం మానదు. దీంతో ఆ చిన్న గాయం కాస్త మానకపోగా పూర్తిగా ఇన్ఫెక్షన్కి గురై కాలు తీసే పరిస్థితి ఏర్పడింది. దీంతో వైద్యా ఖర్చుల అధికమవ్వడమే కాక ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇల్లును కూడా కోల్పోయింది. అయితే 55 ఏళ్ల ఈ మహిళ పాదాల సౌందర్యం కోసం చేయించుకున్న పెడిక్యూర్ తన జీవితాన్ని అత్యంద దయనీయ స్థితిలోకి నెట్టేసింది. ఏదిఏమైతేనే ఆ టామీస్ నెయిల్స్ పార్లర్ మూడు సంవత్సరాల తర్వాత తమ తప్పుని ఒప్పుకోవడమే కాక ఆ మహిళకు ఏకంగా రూ 13 కోట్ల నష్టపరిహారాన్ని కూడా చెల్లించింది. (చదవండి: తల్లిపాలతో తయారు చేసిన ఆభరణాలు!... వాటి ధర ఎంతంటే!!) -
Pedicure: పెడిక్యూర్ చేసే విధానం, లాభాలు తెలుసా?!
అందంగా ఉండాలని ఎవరికుండదు? అందంగా కనిపించడానికి ప్రయత్నం చేయని వారుండరు. అయితే చాలా మంది ముఖవర్చసును మెరుగుపరుచుకునేందుకు ఎంతో ప్రయత్నిస్తుంటారు గానీ, శరీరంలో మరే ఇతర అవయవాలపై అంత శ్రద్ధ చూపరు. కానీ ముఖంతోపాటు చేతులు, కాళ్లు కూడా శుభ్రంగా ఆరోగ్యంగా ఉంటేనే అందానికి పరిపూర్ణత చేకూరడంతో పాటు ఆరోగ్య సంరక్షణ కూడా జరుగుతుంది. పాదాల సంరక్షణకు పెడిక్యూర్, గోళ్ల సంరక్షణకు మెనీక్యూర్ విధానాలు అందుబాటులో ఉన్నాయి. దాదాపు అన్ని బ్యూటీపార్లర్లలో వివిధ ట్రీట్మెంట్లతోపాటు మెనీకూర్, పెడిక్యూర్‌లను అందిస్తున్నారు. పాదాలను గోళ్లను అందంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దడమే పెడిక్యూర్ అంటారు. పెడిక్యూర్ అనేది లాటిన్ పదం. లాటిన్ లో పెస్ లేదా పెడ్ అంటె పాదము, క్యూర్ అంటేరక్షణ అని అర్థం. చేతులు, చేతివేళ్లు, గోళ్లను అందంగా తీర్చిదిద్దే పద్ధతే మెనీక్యూర్. మెనీక్యూర్ కూడా లాటిన్ పదమే. మానస్ అంటే చేయి, క్యూర్ అంటే జాగ్రత్త అని అర్థం. పెడిక్యూర్ మర్దన ద్వారా పాదాలను కాపాడుకోవడమే పెడిక్యూర్. రోజంతా పనిచేసి అలసిపోయిన మోకాళ్లు, పాదాలు, మడమలు, కాలి వేళ్లు, గిలకలకు సున్నితమైన మజసాజ్ సాయంతో ఉపశమనం కలిగించడం పెడిక్యూర్‌లో ఒక భాగంగా ఉంటుంది. ఈ విధానంలో ప్యూమిస్ స్టోన్, మసాజ్ క్రీమ్, నెయిల్ బ్రష్, నెయిల్ కట్టర్, టబ్‌లను ఉపయోగిస్తారు. ఇలా చేస్తారు.. ముందుగా కాలి గోళ్ల పెయింట్‌ను తొలగిస్తారు. తరువాత గోళ్లను అనుకున్న రీతిలో కట్ చేస్తారు. తరువాత ఒక టబ్‌లో గోరువెచ్చని నీళ్లు తీసుకుని దానిలో చిటికెడు ఉప్పు, సుగంధ నూనే, నిమ్మరసం షాంపు వేసి 30 నిమిషాల పాటు పాదాలను నానబెడతారు. పాదాలు నానిన తరువాత ప్యూమిస్ స్టోన్ లేదా గరుకుగా ఉండే పిండితో మడమలు అరికాళ్లు శుభ్రంగా రుద్దుతారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయిన తరువాత మర్దనా ఆయిల్ లేదా మాయిశ్చరైజర్‌తో పాదాలను మొదట సుతిమెత్తంగా, తరువాత కాస్త గట్టిగా మసాజ్ చేస్తారు. తరువాత పాదాలను శుభ్రంగా తుడవడంతో పెడిక్యూర్ పూర్తవుతుంది. మసాజ్‌తో పాదాలకు ఉపశమనం కలిగి మనకు మానసికంగా ఒత్తిడి తగ్గినట్లు అనిపిస్తుంది. ఈ విధంగా నెలకు రెండు సార్లు పెడిక్యూర్ చేసుకుంటూ ఉంటే పాదాలు ఆరోగ్యంగా, అందంగా ఉంటాయి. పెడిక్యూర్ కు కావాల్సి పరికరాలు అన్ని మన దగ్గర ఉంటే ఇంట్లో కూడా చేసుకోవచ్చు. పెడిక్యూర్ రకాలు పెడిక్యూర్ చేసే విధానంలో ఉపయోగించే సామాగ్రి, క్రీములు, అవి ఇచ్చే ఫలితాలను బట్టి వివిధ రకాల పెడిక్యూర్లు ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. ► క్లాసిక్ లేదా రెగ్యులర్ పెడిక్యూర్. ►ప్రెంచ్ పెడిక్యూర్ ►జెల్ పెడిక్యూర్ ►పారఫిన్ పెడిక్యూర్ ►హాట్‌స్టోన్ పెడిక్యూర్ ►ఫిష్ పెడిక్యూర్ ►మిని పెడిక్యూర్ ►స్పా పెడిక్యూర్ ► ఐస్‌క్రీం పెడిక్యూర్ ►పెడిక్యూర్ ►వాటర్ లెస్ పెడిక్యూర్ ►సాల్ట్ పెడిక్యూర్ ►చాక్లెట్ పెడిక్యూర్ ►అథ్లెటిక్ లేదా స్పోర్ట్స్ పెడిక్యూర్ ►రోజ్ పెడిక్యూర్ ►మిల్క్ అండ్ హనీ పెడిక్యూర్ ►వైన్ పెడిక్యూర్ ►షాంఘై పెడిక్యూర్ బేసిక్ క్యూర్‌ను ఇంట్లో ట్రై చేయవచ్చు, మిగిలినవి నిపుణులతోనే చేయించుకోవాలి. మెనీక్యూర్ ఎలాగంటే... ముందుగా చేతి గోళ్లకు ఉన్న పాత నెయిల్ పెయింట్‌ను తుడిచివేస్తారు. తర్వాతా గోళ్లను నచ్చిన ఆకృతిలో అందంగా కత్తిరించి ట్రిమ్ చేస్తారు. ఇలా రెండు చేతుల గోళ్లను ట్రిమ్ చేశాక, ఒక గిన్నెలో సోప్ వాటర్‌ను తీసుకుని దానిలో హైడ్రోజన్ పెరాక్సైడ్, గ్లిజరిన్, నిమ్మరసం వేసి రెండు చేతుల వేళ్లు మునిగేలా అందులో ముంచి 10 నిమిషాలు ఉంచుతారు. ఇలా చేయడం వల్ల గోళ్లలో ఉండే మలినాలు, సూక్ష్మజీవులు నశించి గరుకుగా ఉంటే క్యూటికల్స్ మెత్తగా అవుతాయి. గోరు చుట్టూ ఉండే చర్మం కూడా మెత్తబడుతుంది. తరువాత అరిచేతుల నుంచి మోచేతుల వరకు శుభ్రంగా క్లీన్ చేస్తారు. ఆపై రెండు చేతులను తడిలేకుండా టవల్‌తో తుడుస్తారు. క్యూటికల్ రిమూవర్‌తో గోరు చుట్టూ ఇంకా ఏమైనా క్యూటికల్ బిట్స్ ఉంటే తీస్తారు. దీనివల్ల గోరు పెద్దదిగాను అందంగాను కనిపిస్తుంది. తరువాత చేతులను శుభ్రంగా తుడిచి మాయిశ్చరైజర్‌తో చేతులకు వేళ్లకు మర్థన చేస్తారు. ఇలా 15 రోజులకొకసారి చేయడం వల్ల చేతులు అందంగా ఆరోగ్యంగా కనిపిస్తాయి. కాస్త ధరను భరించగలిగినవారైతే నిపుణులతో పెడిక్యూర్, మెనీక్యూర్ చేయించుకుంటే మరిన్ని మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. లాభాలేంటి? పెడిక్యూర్‌లో పాదాల సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే... మెనీక్యూర్లో చేతుల ఆరోగ్యంపై ఫోకస్ చేస్తారు. రోజూవారి స్నానంలో పాదాలను చాలా మంది అశ్రద్ధ చేస్తుంటారు. ఫలితంగా వివిధ రకాల ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. పెడిక్యూర్ చేయించుకోవడం వల్ల ఈ ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి. తరచుగా ఎదురయ్యే పాదాల పగుళ్లను పెడిక్యూర్ నివారిస్తుంది. గోళ్లకు రక్తప్రసరణ బాగా జరగడం వల్ల అవి ఆరోగ్యంగా పెరుగుతాయి. గోళ్లకు కూడా పుష్కలంగా పోషకాలు అందడంవల్ల పెరుగుదల మంచిగా ఉండి మరింత కాంతివంతంగా మెరుస్తాయి. పెడిక్యూర్ విధానం లో పాదాలకు మంచి మర్దన (మసాజ్) లభిస్తుంది. దీనివల్ల పాదాల్లో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. దీంతో ఎటువంటి నొప్పులు, ఆర్థరైటీస్, వెరికోస్ వెయిన్స్ వంటివి తలెత్తవు. పాదాలకు చేసే మసాజ్‌తో శరీరం మొత్తం ఒకేరకమైన ఉష్ణోగ్రతలు కొనసాగడంతోపాటు, లింఫ్నోడ్స్లోని టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి. సుతిమెత్తని పాదాలకు మసాజ్ చేయడం వల్ల మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మసాజ్‌తో ఒత్తిడి తగ్గి మనస్సు ఉత్సాహంగా ఉంటుంది. దీంతో మనలో ఆత్మ విశ్వాసం పెరిగి నూతనోత్సాహంతో మరిన్ని విజయాలు సాధించవచ్చు. ఇన్ని ప్రయోజనాలు ఉండబట్టే బ్యూటీపార్లర్లు, స్పాలు అందించే క్యూర్లపై చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. ఆరోగ్యవంతమైన శరీరమంటే అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉండడమే! చదవండి: దేశాయ్ డిజైన్స్ వెరీ ట్రెండీ! -
ఏ ట్రీట్మెంట్ ఏమిటో!
బ్లీచింగ్: ముఖానికి బ్లీచ్‌ని అప్లై చేస్తారు. దీంతో చర్మంపై మురికి, నల్లదనం తొలగిపోతాయి. క్లెన్సింగ్: పాలలాంటి ద్రవంతో చర్మంపై మురికిని తొలగిస్తారు. ఫౌండేషన్: మేకప్ వేసుకోవడానికి ముందు అద్దే పౌడర్ని ఫౌండేషన్ అంటారు. ఇది పూస్తే మచ్చలు కనబడవు. బ్లషింగ్: మేకప్ పూర్తయ్యాక ఇచ్చే ఫినిషింగ్ టచ్. త్రెడ్డింగ్: సన్నని దారంతో ముఖమ్మీది అవాంఛిత రోమాలను తొలగించడం, కనుబొమల్ని తీర్చిదిద్దడం. వ్యాక్సింగ్: వ్యాక్స్‌తో చేతులు, కాళ్లపై ఉన్న అవాంఛిత రోమాలను తొలగించడం. ఫేషియల్: క్రీములు, పండ్ల గుజ్జు వంటి వాటిని ముఖానికి రాసి, మసాజ్ చేస్తారు. చర్మం శుభ్రపడి, మృదువుగా తయారవుతుంది. మానిక్యూర్: చేతి గోళ్లను కత్తిరించడం, మోచేతి వరకూ ఉండే చర్మాన్ని శుభ్రపరచడం. పెడిక్యూర్: కాలి గోళ్లను కత్తిరించడం, పాదాలను శుభ్రపరచ్చడం.