ప్రతీకాత్మక చిత్రం
మహిళలు బ్యూటీ పార్లర్‌కి వెళ్లి ఫేషియల్స్ వంటివి చేయించుకుంటారనే విషయం తెలుసు. కానీ ఒక్కొసారి అవి వికటిస్తే ఎంతటి ప్రమాదాలు ఎదురవుతాయో కుడా ఇటీవల చూస్తున్నాం. అచ్చం అలానే ఒక మహిళ పాదాలకు మానిక్యూర్ చేయించకున్న తర్వాత ఆమె ఏకంగా కాలునే పొగొట్టుకుంది.
(చదవండి: షార్క్ చేపతో ముఖాముఖి షూటింగ్: షాకింగ్ వైరల్ వీడియో!!)
అసలు విషయంలోకెళ్లితే....ఫ్లోరిడాకు చెందిన ఒక మహిళ టంపాలోని టామీస్ నెయిల్స్ అనే పార్లర్‌కి వెళ్లింది. అయితే అప్పుడు ఆమె పాదాలకు పెడిక్యూర్ చేయించుకుంది. అప్పుడు పార్లర్ వాళ్లు పాదాలు మంచి అందంగా ఉండే నిమిత్తం కాస్మటిక్ ట్రీట్‌మెంట్ వంటివి చేశారు. అయితే ఆ సమయంలో ఆమె పాదం కాస్త తెగుతుంది. ఈ మేరకు ఆమెకు ఫెరిఫెరల్ వాస్క్యూలర్ అనే వ్యాధి( రక్తనాళాల్లో కొలస్ట్రాల్ ఏర్పడి ద్వారాలు ఇరుకై రక్త ప్రవహానిక అవరోదం ఏర్పడుతుంది) ఉండటంతో ఆ గాయం మానదు.
దీంతో ఆ చిన్న గాయం కాస్త మానకపోగా పూర్తిగా ఇన్ఫెక్షన్‌కి గురై కాలు తీసే పరిస్థితి ఏర్పడింది. దీంతో వైద్యా ఖర్చుల అధికమవ్వడమే కాక ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇల్లును కూడా కోల్పోయింది. అయితే 55 ఏళ్ల ఈ మహిళ పాదాల సౌందర్యం కోసం చేయించుకున్న పెడిక్యూర్ తన జీవితాన్ని అత్యంద దయనీయ స్థితిలోకి నెట్టేసింది. ఏదిఏమైతేనే ఆ టామీస్ నెయిల్స్ పార్లర్ మూడు సంవత్సరాల తర్వాత తమ తప్పుని ఒప్పుకోవడమే కాక ఆ మహిళకు ఏకంగా రూ 13 కోట్ల నష్టపరిహారాన్ని కూడా చెల్లించింది.
(చదవండి: తల్లిపాలతో తయారు చేసిన ఆభరణాలు!... వాటి ధర ఎంతంటే!!)
Comments
Please login to add a commentAdd a comment