నకిలీ విత్తనాలతో జాగ్రత్త
ఆఫర్లను చూసి మోసపోవద్దు
నాణ్యమైనవి ఎంపిక చేసుకుంటేనే మేలు
రైతులకు వ్యవసాయాధికారుల సూచన
వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్న రైతులు విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు తప్పనిసరి పాటించాలి. లేకపోతే మొదటికే మోసం వస్తుంది. ప్యాకెట్లపై ఆకర్షణీయమైన ఫొటోలు, తక్కువ ధరలు ఆఫర్లు చూసి మోసపోవద్దు. నాణ్యమైన విత్తనాలు ఎంపిక చేసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. విత్తనాల బెడద రైతులకు సవాల్‌గా మారింది. అసలు ఏదో, నకిలీ ఏదో గుర్తించలేని విధంగా విత్తనాలు మార్కెట్‌లోకి వస్తుండడంతో రైతులు నష్టపోతున్నారు. స్థానికంగా ప్రభుత్వ గుర్తింపు పొందిన దుకాణాల్లో మాత్రమే విత్తనాలు కొనాలని చేయాలని వ్యసాయాధికారులు సూచిస్తున్నారు.
తక్కువ ధరలు, ఆఫర్లు నమ్మొద్దు..
వర్షాలు పడితే చాలు రైతుల హడావుడి మొదలవుతుంది. రోహిణి కార్తె ప్రారంభం కానున్న నేపథ్యంలో విత్తనాల కోసం రైతులు విత్తన డీలర్ల దుకాణాల వద్ద బారులు తీరుతారు. పలు విత్తన కంపెనీలు డీలర్లకు ఆఫర్లు ప్రకటిస్తాయి. ఆ ఆఫర్ల కోసం డీలర్లు రైతులకు విత్తనాలను అంటగడుతున్నారు. వారి మాటలు నమ్మి మోసపోవద్దు. చిన్నచిన్న జాగ్రత్తలు పాటిస్తే నకిలీ విత్తనాల బారిన పడకుండా ఉండవచ్చు. ఫొటోలు చూపించి, ఆఫర్ల ఆశ చూపి వివిధ పట్టణాలకు కంపెనీ వారు రైతులను తీసుకుపోవడం, గ్రామాల్లో తిరుగుతూ విత్తన ప్యాకెట్లు బుక్ చేసుకోవడం చేస్తుంటారు. వాటికి దూరంగా ఉండడం మంచిదని వ్యవసా«యాధికారులు పేర్కొంటున్నారు.
రైతులు తీసుకోవాలి్సన జాగ్రత్తలు..
1. గుర్తింపు పొందిన దుకాణం నుంచి నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేస్తేనే అధిక దిగుబడులు సాధించి లాభాలు పొందే అవకాశం ఉంటుంది.
2. విత్తనాలు కొన్న అనంతరం దుకాణం నుంచి తప్పనిసరిగా రశీదు తీసు కోవాలి.
3. విత్తనాలు ఏ సంస్థకు చెందినవో ప్యాకెట్‌పై ఉన్న లేబుల్, లాట్ నంబర్ రశీదుపై నమోదు చేసుకొని, భద్రపర్చుకోవాలి.
4. తొలుత విత్తనాలు మొలకెత్తే శాతాన్ని ప్యాకెట్‌పై చూసి కొనాలి.
విత్తనాలపై అవగాహన ఉండాలి..
విత్తనాలపై రైతులు అవగాహన ఉండాలి. కొన్న ప్యాకెట్లలో ఉన్న విత్తనాలు ఎంత శాతం మొలకెత్తుతాయో చూసుకోవాలి. రసీదులు, ప్యాకెట్లను భద్రపర్చుకోవాలి. అనుమతి ఉన్న దుకాణాల్లో విత్తనాలు కొనాలి. విత్తనాలు కొనుగోలు సమయంలో నాసిరకమా? అనేది చూసుకోవాలి.
– వెండి విశ్వామిత్ర, వ్యవసాయాధికారి, బోథ్
Comments
Please login to add a commentAdd a comment