మీ బ్రెయిన్ ఆక్టివ్‌గా ఉండాలంటే..
శరీరంలో ముఖ్యమైన భాగాల్లో మెదడు ఒకటి. మెదడు ఆదేశాల ప్రకారమే శరీరంలోని అన్ని భాగాలు పనిచేస్తాయి. మెదడు సరిగ్గా పని చేయకపోతే... మనిషి ఏ పనీ సరిగ్గా చేయలేడు. అలాంటి మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే.. మనం కొన్ని చెయ్యాలి... మరికొన్నింటిని తినాలి... అవేంటో చూద్దాం...
దేనినైనా సరే, సరిగ్గా పని చేయిస్తేనే అది సక్రమంగా పని చేస్తుంది. ఎన్ని వేలు పోసి కొన్న యంత్రాన్నైనా సరే, దానితో పని చేస్తేనే కదా అది సరిగ్గా పనిచేసేదీ లేనిదీ తెలిసేది! అందువల్ల మెదడు సరిగ్గా పని చేయాలంటే దానికి ఎప్పుడూ తగిన పని చెబుతూనే ఉండాలి. అదేవిధంగా మెదడు చురుగ్గా పని చేయాలంటే కొన్ని రకాలైన ఆహార పదార్థాలను తీసుకోవాలి.
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్: మెదడు సరిగ్గా పని చేయాలంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవడం అవసరం. ఎందుకంటే ఈ ఫ్యాటీ యాసిడ్స్ మెదడు కణాల మధ్య కమ్యూనికేషన్ ను ప్రోత్సహిస్తాయి. తృణ ధాన్యాలు కూడా మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
యాంటీ ఆక్సిడెంట్లు: ఇవి కూడా మెదడు కణాలను ఒత్తిడి, వాపు నుంచి రక్షించడంలో సహకరిస్తాయి. విటమిన్ బి12 లోపిస్తే నరాల బలహీనతకు దారితీయవచ్చు. కాబట్టి మీ డైట్‌లో విటమిన్ బి12 ఉండేలా చూసుకోండి.
అదే విధంగా అధికంగా చక్కెర తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మందగిస్తుంది. ఫలితంగా జ్ఞాపకశక్తి తగ్గి మతి మరపు పెరుగుతుంది. కాబట్టి షుగర్ తక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం ఉత్తమం. అదేవిధంగా హైడ్రేట్‌గా ఉండటం వల్ల మెదడు చురుగ్గా ఉంటుంది.
అరోమా: కొన్ని రకాల మూలికలు, సుగంధ ద్రవ్యాలు మెదడు కణాలను పరిరక్షించే సమ్మేళనాలను కలిగి ఉంటాయి, ఇవి ఐక్యూని మెరుగుపరుస్తాయి. కాబట్టి మీ ఆహారంలో పసుపు, దాల్చిన చెక్క, రోజ్ మేరీ వంటివి ఉండేలా చూసుకోండి.
ఇవిగాక మెదడును చురుగ్గా ఉంచేలా పదవినోదాలు, పదవిన్యాసాలు పూర్తి చేయడం, సుడోకు వంటివి ఆడటం, క్యారమ్స్, చదరంగం వంటి ఇన్‌డోర్ గేమ్స్ ఆడటం, రోజూ కొన్ని పదాలను గుర్తు పెట్టుకోవాలనే నియమాన్ని పెట్టుకుని దానిని సరిగ్గా అనుసరించడం వల్ల మెదడు చురుగ్గా ఉంటుంది.
ఇవి చదవండి: Shipra Singhania: సిమెంట్ వాడకుండా.. గోరువెచ్చని ఇల్లు!
Comments
Please login to add a commentAdd a comment