సోషల్ మీడియా చేసే చెరుపు గురించి చర్చ ఉన్నప్పటికీదానిని సరిగా ఉపయోగిస్తే మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుందని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు.స్నేహాలు, సమూహాలు మనకంటూ కొందరున్నారన్న భరోసా ఇస్తేసలహాలు సూచనలు కూడా ఇక్కడి నుంచి అందడం వల్లఆందోళన దూరం అవుతుందంటున్నారు.సోషల్ మీడియాను మెరుగ్గా ఎలా అర్థం చేసుకొని ఉపయోగించాలి?
సోషల్ మీడియా అంటే అదొక అవాస్తవిక ప్రపంచం, అక్కడున్న వారికి ఇబ్బందులు తప్పవు, మహిళల మీద ట్రోలింగ్ ఉంటుంది అనే అభి్ర΄ాయాలు చాలామందిలో ఉన్నాయి. అయితే నాణేనికి మరోవైపు కూడా ఉంది. సోషల్ మీడియాను సరిగ్గా వాడితే మానసిక సమస్యలు దూరమవుతాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఒంటరితనం, డిప్రెషన్, నిరాశ వంటివాటితో ఇబ్బంది పడేవారికి సోషల్ మీడియా ధైర్యాన్ని, మద్దతును, అర్థం చేసుకునే స్నేహితులను అందిస్తుందని అంటున్నారు.
ఆత్మీయ బంధాలను అల్లుకోవచ్చు
సోషల్ మీడియాలోని స్నేహాలన్నీ వ్యర్థమని, అక్కడ పరిచయమైన వారిలో నిజాయితీ ఉండదనే అ΄ోహ చాలామందిలో ఉంది. కానీ మనం నిజాయితీగా ఉంటే ఎదుటివారిలోని నిజాయితీని గుర్తించొచ్చని అంటున్నారు మానసిక నిపుణులు. అనేక ్ర΄ాంతాల్లో నివసిస్తున్న వారు, అనేక సామాజిక, ఆర్థిక నేపథ్యాలున్నవారు సోషల్‌మీడియాలో తారసపడుతుంటారు. అందులో మన భావాలకు, అభి్ర΄ాయాలకు తగ్గవారిని ఎంచుకునే అవకాశం ఉంటుంది. వారితో స్నేహం చేయడం ద్వారా మనలోని ఒంటరితనం దూరమవుతుంది. సోషల్‌మీడియాలో పరిచయమై ఆ తర్వాత అత్యంత ఆత్మీయ మిత్రులుగా మారినవారు బోలెడంత మంది ఉన్నారు. ఇవి మనసుకు బలం ఇస్తాయి.
అభిరుచులకు తగ్గ స్నేహాలు
మన చుట్టూ ఉన్నవారు మన అభిరుచులకు తగ్గట్టే ఉంటారని అనుకోలేం. కానీ సోషల్‌మీడియాలో ఒకే అభిరుచి, ఇష్టాయిష్టాలు కలిగిన వారు ఒకచోట చేరే అవకాశం ఉంటుంది. పుస్తక ప్రియులైతే ఒకచోట, చిత్రలేఖనం ఇష్టమైనవారంతా ఒకచోట, సినిమాలపై ఆసక్తి ఉంటే ఒక గ్రూప్, ప్రయాణాలు ఇష్టపడేవారు మరో గ్రూప్.. ఇలా మన ఇష్టాలకు తగ్గట్టు మెలిగే వారు కనిపిస్తారు. ఆ అంశాల గురించి చర్చిస్తారు. వారి అనుభవాలు వినొచ్చు. మన అభి్ర΄ాయాలు పంచుకోవచ్చు.. ఈ గ్రూపులు మన అవగాహన పరిమితిని విస్తృతం చేస్తాయి. తద్వారా మనసును విశాలం చేస్తాయి.
అభిప్రాయాలు సరి చేసుకోవచ్చు
సోషల్ మీడియా భిన్నాభిప్రాయాలు వినిపించే వేదిక. మన చుట్టూ ఉన్నవారి అభిప్రాయాలే కాక, ఎక్కడో ఉన్నవారి అభిప్రాయాలు మనం తెలుసుకోవచ్చు. అయితే భిన్నాభిప్రాయాలు వ్యక్తపరిచేటప్పుడు, సంయమనం చాలా ముఖ్యం. మన మాటే చెల్లాలి, మనం చెప్పిందే వినాలి అనే ఆధిపత్య ధోరణి ఉండకూడదు. కొన్ని అభిప్రాయాలు మన మీద లైట్ వేస్తాయి. మన మూస అభిప్రాయాలను మారుస్తాయి. నెగెటివ్ అభిప్రాయాలను దూరం చేసుకునేందుకు సాయం చేస్తాయి. ఇదంతా ఎందుకు అనంటే ఖాళీగా ఉండే మైండ్‌ను అర్థవంతమైన వ్యాపకంలో పెట్టడానికే. దీనివల్ల డిప్రెషన్ దూరమవుతుంది. అయితే సోషల్ మీడియాలో వచ్చే వార్తలన్నీ నిజాలు కావనేది గుర్తించాలి. అలాంటి ఫేక్ వార్తలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు ప్రచారం చేసేవారిని దూరంగా ఉంచాలి.
నూతన అంశాలపై ఆసక్తి
గాజులు ఎలా తయారు చేస్తారో తెలుసా? అద్దం ఎలా తయారవుతుంది? ఇంట్లో ఖాళీ డబ్బాలతో ఏదైనా అలంకరణ వస్తువులు చేయొచ్చా? చార్‌ధామ్ యాత్ర అంటే ఏమిటి? ఇలా మనకు తెలియని అంశాలను సోషల్ మీడియా ద్వారా తెలుసుకోవచ్చు. వీడియోల ద్వారా నేరుగా పరిశీలించొచ్చు. ఆసక్తి ఉంటే ప్రయత్నించవచ్చు. నూతన అంశాలపై ఆసక్తి ఉన్నవారికి సోషల్ మీడియా ఉపయోగకారి. తద్వారా మనమూ కంటెంట్ క్రియేటర్లుగా మారొచ్చు. ఇదంతా మనసును ఉత్సాహ పరిచే అంశమే.
నిపుణుల సలహాలకు వేదిక
వేసవిలో ఏ ప్రాంతాలకు విహారయాత్రకు వెళ్లొచ్చు? బైక్ ఎక్కువ మైలేజ్ రావాలంటే ఏం చేయాలి? ఇంటీరియర్ డిజైనింగ్ కోసం ఏ రంగులు మేలు? ఇలా అనేక ప్రశ్నలు మనకుంటాయి. కానీ సమాధానాలు ఇచ్చేందుకు అన్నిసార్లూ నిపుణులు మనకు అందుబాటులో ఉండరు. ఆ లోటును సోషల్‌మీడియా తీరుస్తుంది. ఇక్కడ అనేకమంది నిపుణులు అందుబాటులో ఉంటారు. కొందరు నిపుణులు కాకపోయినా, తమ అనుభవంతో మన సందేహాలను నివృత్తి చేయగలరు. దీనివల్ల మనకు శ్రమ తగ్గుతుంది. అయితే ఆరోగ్యం, ఆర్థిక విషయాల్లో సోషల్‌మీడియా సలహాలు పాటించకపోవడం మేలని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఆ జాగ్రత్త పాటించడం తప్పనిసరి.
సృజనాత్మకతకు వేదిక
ఒక చక్కని కవిత రాశారా? పదిమందితో పంచుకోవాలని ఉందా? ఒక చిత్రం గీశారా? దాన్ని అందరికీ చూపించాలని ఉందా? సోషల్ మీడియా మన సృజనాత్మకతకు చక్కటి వేదిక. ఎంతోమంది అక్కడ పాపులర్ అయ్యారు, అవుతున్నారు. వారికంటూ అభిమానులను సంపాదించుకున్నారు. ఉన్నచోటే ఆగి΄ోకుండా సృజనకు వేదిక అందించి, సృజనకారుల్లో ఉత్సాహం నింపడం సోషల్ మీడియాలో సాధ్యం. మానసిక ఉల్లాసానికి సృజనాత్మక ప్రదర్శనలు చాలా మేలు చేస్తాయి.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
సోషల్ మీడియాలో సంయమనం టించాలి. వ్యక్తిగతంగా దూషించడం, టార్గెట్ చేయడం, వేధించడం వంటివి చేయకూడదు.
సోషల్ మీడియాను పరిమితంగానే వాడాలి. దానికి అడిక్ట్ అయి΄ోకూడదు.
పూర్తి వ్యక్తిగత వివరాలు, ఇబ్బందికరమైన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పంచుకోకూడదు.
సోషల్ మీడియాలో నెగిటివిటీకి దూరంగా ఉండాలి.
సోషల్ మీడియాలో ఏవైనా వేధింపులు, మోసం, ట్రోలింగ్ వంటివి ఎదురైతే ధైర్యంగా ఎదుర్కోవాలి. వెంటనే సైబర్ నేరాల విభాగానికి ఫిర్యాదు చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment