ఐదేళ్లుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
వేడెక్కుతున్న భూభాగం..
వాతావరణ సమతుల్యతకు దెబ్బ
ప్రతి ఏటా ప్రమాదకరంగా ఎండలు
మే నెలకు ముందే సూరీడు నిప్పులు కక్కుతుండటం ఆందోళనకర పరిణామం. ఇటీవల వాతావరణ శాఖ హెచ్చరికల క్రమంలో మూడు రోజులు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వాతావరణ శాఖ కొలమానం ప్రకారం 35 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైతే ప్రజలకు, పంటలకు ప్రయోజనం. 35 డిగ్రీల నుంచి 40 డిగ్రీలు నమోదైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 41–45 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైతే ఆరెంజ్ అలర్ట్‌గా భావించాలని, అప్రమత్తంగా వ్యవహరించాలని.. అలాగే 45కు పైగా ఉష్ణోగ్రత చేరిందంటే.. మానవాళి ప్రమాదంలో ఉన్నట్లు, రెడ్ అలర్ట్‌గా నిపుణులు చెబుతున్నారు.
గత అయిదు రోజులుగా ఉష్ణోగ్రతల తీరిలా.
ఎండ ప్రభావం..
ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల పంటలపైనా ప్రభావముంటుంది. వేడి ప్రభావాన్ని అడ్డుకునేందుకు పొలాల మధ్య ఖాళీ స్థలాల్లో చెట్లను పెంచాలి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల పండ్ల తోటలకు కొంత నష్టం కలిగే అవకాశముంది. – డా.జి.మంజులత, ప్రధాన శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధన స్థానం
రైతులు ఉదయం 9 గంటల్లోపే పనులు ముగించుకొని ఇంటికి చేరుతున్నారు. సాధారణ ప్రజలు ఈ ఎండలకి అల్లాడిపోతున్నారు. శనివారం ఎండ తీవ్రత 44 డిగ్రీలు నమోదు కాగా.. ఆదివారం కూడా 44 డిగ్రీలు దాటింది. గతేడాది ఇదే సమయంలో పలుచోట్ల అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈసారి కూడా అదే రీతిలో నమోదవుతుండటంతో ప్రజలు ఉక్కపోత తట్టుకోలేకపోతున్నారు. అసలే వరి కోతలు ఊపందుకున్నాయి.
ఈ సమయంలో ఎండలు దంచి కొడుతుండటంతో రైతులు ఉదయం 6 గంటలకు వెళ్లి 9 గంటలకే ఇళ్లకు వెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది. పగటి పూట ఇళ్లకే పరిమితమవుతున్నారు. సాయంత్రం 6 గంటలు దాటితేనే బయటకి వస్తున్నారు. వ్యవసాయం పరంగా పంటలు చివరి దశకు చేరడంతో ఎండిపోయే ప్రమాదం కనపడుతోంది. రోజురోజుకి మారుతున్న ఎండ తీవ్రత నుంచి, వీచే వడగాలుల నుంచి జాగ్రత్తలు వహించక తప్పదు. దాహానికి తగ్గ పానీయాలు సేకరించాలి. చిన్న పిల్లల విషయంలో మరీ అప్రమత్తంగా వ్యవహరించాలి. ఇకపై ఈ ఎండలతో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది.
ఇవి చదవండి: సోమావతి అమావాస్య అంటే..రావిచెట్టుకి ప్రదక్షిణాలు ఎందుకు?
Comments
Please login to add a commentAdd a comment