sunrise hard
-
నెల ముందే.. నిప్పులు చెరిగే సూరీడుతో.. జర జాగ్రత్త!
మే నెలకు ముందే సూరీడు నిప్పులు కక్కుతుండటం ఆందోళనకర పరిణామం. ఇటీవల వాతావరణ శాఖ హెచ్చరికల క్రమంలో మూడు రోజులు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వాతావరణ శాఖ కొలమానం ప్రకారం 35 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైతే ప్రజలకు, పంటలకు ప్రయోజనం. 35 డిగ్రీల నుంచి 40 డిగ్రీలు నమోదైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 41–45 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైతే ఆరెంజ్ అలర్ట్గా భావించాలని, అప్రమత్తంగా వ్యవహరించాలని.. అలాగే 45కు పైగా ఉష్ణోగ్రత చేరిందంటే.. మానవాళి ప్రమాదంలో ఉన్నట్లు, రెడ్ అలర్ట్గా నిపుణులు చెబుతున్నారు. గత అయిదు రోజులుగా ఉష్ణోగ్రతల తీరిలా. ఎండ ప్రభావం.. ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల పంటలపైనా ప్రభావముంటుంది. వేడి ప్రభావాన్ని అడ్డుకునేందుకు పొలాల మధ్య ఖాళీ స్థలాల్లో చెట్లను పెంచాలి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల పండ్ల తోటలకు కొంత నష్టం కలిగే అవకాశముంది. – డా.జి.మంజులత, ప్రధాన శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధన స్థానం రైతులు ఉదయం 9 గంటల్లోపే పనులు ముగించుకొని ఇంటికి చేరుతున్నారు. సాధారణ ప్రజలు ఈ ఎండలకి అల్లాడిపోతున్నారు. శనివారం ఎండ తీవ్రత 44 డిగ్రీలు నమోదు కాగా.. ఆదివారం కూడా 44 డిగ్రీలు దాటింది. గతేడాది ఇదే సమయంలో పలుచోట్ల అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈసారి కూడా అదే రీతిలో నమోదవుతుండటంతో ప్రజలు ఉక్కపోత తట్టుకోలేకపోతున్నారు. అసలే వరి కోతలు ఊపందుకున్నాయి. ఈ సమయంలో ఎండలు దంచి కొడుతుండటంతో రైతులు ఉదయం 6 గంటలకు వెళ్లి 9 గంటలకే ఇళ్లకు వెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది. పగటి పూట ఇళ్లకే పరిమితమవుతున్నారు. సాయంత్రం 6 గంటలు దాటితేనే బయటకి వస్తున్నారు. వ్యవసాయం పరంగా పంటలు చివరి దశకు చేరడంతో ఎండిపోయే ప్రమాదం కనపడుతోంది. రోజురోజుకి మారుతున్న ఎండ తీవ్రత నుంచి, వీచే వడగాలుల నుంచి జాగ్రత్తలు వహించక తప్పదు. దాహానికి తగ్గ పానీయాలు సేకరించాలి. చిన్న పిల్లల విషయంలో మరీ అప్రమత్తంగా వ్యవహరించాలి. ఇకపై ఈ ఎండలతో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. ఇవి చదవండి: సోమావతి అమావాస్య అంటే..రావిచెట్టుకి ప్రదక్షిణాలు ఎందుకు? -
భానుడు భగభగ
ఉక్కిరి బిక్కిరవుతున్న రాష్ట్ర ప్రజలు మహబూబ్నగర్లో 43, తిరుమలలో 35 డిగ్రీల ఉష్ణోగ్రత సాక్షి, విశాఖపట్నం/తిరుమల: ఎండాకాలం ఆరంభంలోనే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలతో రాష్ట్రాన్ని భగభగ మండిస్తున్నాడు. వారం రోజులుగా పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు ప్రజలకు భయాందోళన కలిగిస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతకు తోడు అధిక పీడనం, గాలిలో తేమ శాతం పెరుగుదల కారణంగా తీవ్ర ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సోమవారం మహబూబ్నగర్లో గరిష్టంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మంగళవారం కూడా ఉష్ణోగ్రతలు అటూఇటుగా అలానే ఉన్నాయి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే సుమారు 4 డిగ్రీలు ఉష్ణోగ్రత అధికంగా నమోదవుతున్నట్టు విశాఖ వాతావరణ కేంద్రం నిపుణులు తెలిపారు. చాలాచోట్ల వడగాలులు కూడా వీస్తున్నాయని, రానున్న రోజుల్లో ఇవి మరింతగా పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. తిరుమలలో మంగళవారం గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీలుగా నమోదైంది. గత ఐదేళ్లుగా ఏప్రిల్ నెలలో 30 నుంచి 31 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా, ఈసారి మాత్రం ఏప్రిల్ మొదటి రోజే 35 డిగ్రీలకు చేరింది. మంగళవారం వేంకటేశ్వరస్వామి ఆలయ పరిసరాల్లో ఎండతీవ్రత ప్రభావంతో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 వరకు భక్తులు సందడి బాగా తగ్గిపోయింది. వారు ఉపశమనం పొందేందుకు ఆలయం నాలుగు మాడవీధుల్లో టీటీడీ అధికారులు చలువ పందిళ్లు, కూల్ పెయింటింగ్, ఎర్రతివాచీ ఏర్పాటు చేశారు. వచ్చే రెండు నెలల్లో తిరుమలలో ఉష్ణోగ్రత బాగా పెరిగే అవకాశం ఉందని టీటీడీ ల్యాబ్ సీనియర్ పరిశోధకుడు శ్రీనివాస దీక్షితులు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మంగళవారం నాటి ఉష్ణోగ్రతలు (సెల్సియస్ డిగ్రీల్లో) రెంటచింతల 41.9 తిరుపతి 41.7 నందిగామ 40.5 నెల్లూరు 40.5 విశాఖ 40.4 కావలి 40.4 తుని 40.2 ఒంగోలు 39.3 గన్నవరం 38.5 మచిలీపట్నం 37.4 కాకినాడ 36.2 బాపట్ల 36.4