మాన్‌సూన్ సీజన్ స్టార్ట్ అయింది! వానజల్లులు మనసుకు ఆహ్లాదాన్నిస్తాయి కానీ ఇంటి వాతావరణాన్ని గ్లూమీగా మార్చేస్తాయి. మనసుతో ఇల్లూ పోటీపడాలంటే ఇంటీరియర్ బ్రైట్‌గా ఉండాల్సిందే! అందుకే..
ఇంట్లో రంగు రంగుల వాల్ ఆర్ట్, కళాత్మక వస్తువులు, కుండీలు, క్యాండిల్ హోల్డర్లు.. వంటి ఉపకరణాలను చేర్చండి. గదిలోని ఒక గోడను బ్రైట్ కలర్‌తో పెయింట్ చేయండి. దీంతో ఆ స్థలం సజీవంగా మారిపోతుంది. లేదంటే కంటికింపైన వాల్‌పేపర్‌ను అతికించినా సరే! కుషన్ కవర్లు, కర్టెన్లూ డార్క్ కలర్స్‌వే ఎంచుకోండి.
వర్షాకాలం తేమ ఎక్కువ కాబట్టి వుడెన్ కాకుండా ఫైబర్, మైక్రో ఫైబర్ ఫర్నీచర్‌ను తెచ్చుకోండి. దీపాలతో వెలుగుకే పరిమితం కాదు. గాలినీ శుద్ధి చేస్తాయి. వెచ్చదనాన్నీ అందిస్తాయి. అయితే సువాసనలు వెదజల్లే క్యాండిల్స్‌ను వెలిగిస్తే చుట్టూ ఉన్న వాతావరణం మరింత ప్లెసెంట్ మారుతుంది. çపుస్తక ప్రియులు ఒక ఫైబర్ బుక్ షెల్ఫ్‌ను కిటికీలకు దగ్గరగా అమర్చుకోవచ్చు. చినుకుల సొగసును ఆస్వాదిస్తూ, నచ్చిన పుస్తకం చదువుకుంటూ, వేడి వేడి తేనీటిని సేవించవచ్చు. ఇలా మీ సృజనకూ పని చెప్పి.. మాన్‌సూన్‌లో మీ ఇంటిని ఇంకింత అందంగా మలుచుకోవచ్చు.
ఇవి చదవండి: ఒకప్పుడు ఇది మాఫియా డెన్.. కానీ ఇప్పుడిది?
Comments
Please login to add a commentAdd a comment