తస్మాత్‌ జాగ్రత్త..! కనిపించని కన్ను చూస్తోంది..! | Beware Of Dangerous Spy Cameras Growing In The City | Sakshi
Sakshi News home page

తస్మాత్‌ జాగ్రత్త..! కనిపించని కన్ను చూస్తోంది..!

Published Thu, Sep 26 2024 12:56 PM | Last Updated on Thu, Sep 26 2024 12:56 PM

Beware Of Dangerous Spy Cameras Growing In The City

స్పై కెమెరాలతో అప్రమత్తంగా ఉండాలి

ఇష్టానుసారంగా వినియోగిస్తున్న ఆకతాయిలు

అనుమానం వస్తే నిశితంగా పరిశీలించాలి

ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేయాలి

టెక్నాలజీని మంచికి ఉపయోగిస్తేనే ఫలితం

వరంగల్: టెక్నాలజీ.. మానవాళికి ఎంత మంచి చేస్తోందో.. ఆకతాయిలు, సంఘ విద్రోహుల చేతిలో పడి అంతే చెడు చేస్తోంది. ఫేస్‌బుక్, వాట్సాప్, యూ ట్యూబ్‌ వంటి సామాజిక మాధ్యమాలను అనుసరించి వ్యాపార అభివృద్ధి, స్నేహం, నాలెడ్జి పెంచుకుంటున్న వారు కొందరైతే.. సైబర్‌ నేరాలు, మాదకద్రవ్యాల సరఫరా, ఉద్యోగాల పేరుతో మోసానికి పాల్పడుతున్న వారు మరికొందరు. కాగా, ఇటీవల ట్రయల్‌ రూమ్, హాస్టల్‌ గదుల్లో స్పై కెమెరాలు (సీక్రెట్‌ కెమెరా) అమర్చిన ఘటనలు వింటున్నాం. విస్తరిస్తున్న టెక్నాలజీని ఇలా అడ్డదిడ్డంగా వినియోగిస్తే తర్వాత జైలుకెళ్లడం ఖాయం.

స్వల్ప పరిమాణంలో ఉండే ఈ స్పై కెమెరాలతో ఆకృత్యాలకు ఒడిగడుతున్న వారు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. షాపింగ్‌ మాళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, లాడి్జలు..ఇలా పబ్లిక్‌ ప్రదేశాల్లో ఎక్కడ ఏ కెమెరా కన్ను మనపై ఉందో తెలియని పరిస్థితి ఎదురవుతోంది. ముఖ్యంగా మహిళలు ఇలాంటి కెమెరాలకు బలవుతున్న ఘటనలు ఇటీవల వెలుగులోకి వస్తున్నాయి. అయితే కాస్త అప్రమత్తంగా ఉండి టెక్నాలజీని ఎలా వినియోగించాలో తెలిస్తే స్పై కెమెరాలను ఇట్టే గుర్తించే వీలుంది. అలా గుర్తించి పోలీసుల దృష్టికి తీసుకెళ్తే ఆకతాయిల పని పట్టేందుకూ అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో స్పై కెమెరా పని విధానం, ఆ కెమెరాను గుర్తించే వివిధ మార్గాల గురించి ‘సాక్షి’ ప్రత్యేక కథనం..

మోషన్‌ డిటెక్షన్, సౌండ్‌ టెక్నాలజీ..
కొన్ని శక్తివంతమైన స్పై కెమెరాల్లో బ్యాటరీని ఆదా చేయడం కోసం సౌండ్, మోషన్‌ డిటెక్షన్‌ టెక్నాలజీ పొందుపరుస్తారు. గతంలో హాస్టళ్లలో జరిగిన ఘటనలు పరిశీలిస్తే ఒక్కొక్కటి సుమారు రూ.3వేల లోపు విలువైన స్పై కెమెరా సౌండ్‌ యాక్టివేటెడ్‌ ఫీచర్స్‌ కలిగి ఉన్నాయి. మహిళలు బాత్‌రూం రావడానికి ముందు డోర్‌ తీయగానే ఆ శబ్దానికి ఆటోమేటిక్‌గా కెమెరా యాక్టివేట్‌ అయి వీడియో రికార్డ్‌ చేస్తుంది. వ్యక్తుల కదలికలను బట్టి దానంతట అదే రికారి్డంగ్‌ అవుతుంది. ఒకసారి చార్‌్జచేస్తే  రెజల్యూషన్‌ బట్టి నాలుగైదు గంటల పాటు నిరంతరాయంగా ఈ కెమెరాలు వీడియో రికార్డ్‌ చేస్తాయి.

స్పై కెమెరాలతో ప్రమాదాలు..
స్పై కెమెరాల ద్వారా మహిళల నగ్న దృశ్యాలను రికార్డ్‌ చేసి వాటిని పోర్న్‌ సైట్లలో అప్‌లోడ్‌ చేస్తున్న వారు ఇటీవల అధికమవుతున్నారు. మరికొంత మంది ఆ వీడియోలను సంబంధిత మహిళలకు పంపించి బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారు. ఎక్కడైనా ఇలా అనుమానాస్పదంగా ఉన్న స్పై కెమెరాలను గుర్తిస్తే వాటికి సంబంధించిన ఆధారాలను స్టార్ట్‌ఫోన్లో వీడియో, ఫొటోల రూపంలో రికార్డు చేయాలి. సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. షాపింగ్‌ మాల్స్‌ వంటి వాటిలో ఫ్లోర్‌ మేనేజర్‌ దృష్టికి తీసుకెళ్లాలి. వీడియో ఫుటేజీ రికార్డ్‌ చేసి బ్లాక్‌ మెయిల్‌ చేస్తుంటే, వెంటనే కుటుంబ సభ్యులతో చర్చించి పోలీసుల దృష్టికి తీసుకెళ్లడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో భాగంగా చాలా మంది మహిళలు నగరాల్లో హాస్టల్స్‌లో ఉంటున్నారు. వారు ఉండే గదులు, బాత్‌రూమ్‌లను నిశితంగా పరిశీలించాలి. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ స్పై కెమెరాలకు చెక్‌ పెట్టాలి.

మొబైల్స్‌తోనూ..
స్పై కెమెరాలు మాత్రమే కాదు, నిరంతరం మొబైల్‌ ద్వారా కూడా పబ్లిక్‌ ప్లేస్‌ల్లో మహిళల కదలికలు రికార్డు చేస్తున్నారు. ఆండ్రాయిడ్‌ ఫోన్లలో ఎవరికీ అనుమానం రాకుండా ప్రివ్యూ కూడా కనిపించకుండా బ్యాక్‌ గ్రౌండ్‌లో వీడియోని రికార్డ్‌ చేసే యాప్స్‌ని వాడుతున్నారు.

ఎన్నో రకాలు..
చాలా మంది అనుకుంటున్నట్లు చూడటానికి కెమెరా మాదిరి ఉండదు. మనకు ఏ మాత్రం అనుమానం రాకుండా రకరకాల వస్తువుల రూపంలో రూపొందిస్తారు. అనేక స్పై కెమెరాలను గమనిస్తే జేబులో పెన్, షర్టు బటన్స్, టేబుల్‌ మీద పెట్టే చిన్న క్లాక్‌లు, రిస్ట్‌ వాచీలు, ఫ్లవర్‌ వాజ్‌లు, కీచైన్లు, హ్యాంగర్స్, ఇంట్లో ఉండే ఫొటో ఫ్రేమ్‌లు, మొక్కలు, స్విచ్‌బోర్డులు, బల్బులు ఇలా అనేక విధాలా స్పై కెమెరాలు దొరుకుతున్నాయి.

అనేక రకాల పరీక్షలు..
స్పై కెమెరాలను గుర్తించేందుకు టెక్నిక్స్‌ ఉన్నాయి. కొన్ని రకాల కెమెరాలున్న ప్రదేశాల్లో ఫోన్‌ కాల్‌ చేసేందుకు ప్రయత్నిస్తే ఆది కాల్‌ డ్రాప్‌ అవుతుంది. ఆయా కెమెరాల్లో ఉండే మ్యాగ్నటిక్‌ తరంగాల వల్ల ఇలా జరుగుతుంది. ఇటీవల కాల్‌ డ్రాప్‌ అనేది తరచూ ఎదుర్కొనే సమస్య కావడంతో స్పై కెమెరా ఉందని అనుమానించలేని పరిస్థితి. ఇక ట్రయల్‌ రూమ్స్‌లో అమర్చే అద్దాలు రెండు రకాలుంటాయి. సహజంగా అద్దం ఒకవైపు మన రూపాన్ని చూపిస్తూ, దాని వెనుక భాగంలో వేరే రంగుతో కోటింగ్‌ చేయబడి ఉంటుంది. కానీ కొన్ని అద్దాలు పారదర్శకంగా ఉండి, ఇవతలి దృశ్యాలను అవతలికి చూపిస్తుంటాయి. మీకు అలాంటి అనుమానం వస్తే అద్దంలో కొద్దిగా ఖాళీ స్థలం ఉండాలి. అలా కాకుండా రెండు టచ్‌ అయినట్లు ఉంటే ఆ అద్దం అవతలి వైపు మీ దృశ్యాలను చూపిస్తుందని గ్రహించాలి. లైట్లన్నీ ఆఫ్‌ చేసి, ఫ్లాష్‌ లైట్‌ని అద్దం మీద వేసినప్పుడు అవతలి వైపు ఏదైనా ఉందేమో తెలుస్తుంది.

గుర్తించడం ఎలా?
స్మార్ట్‌ఫోన్లు వాడేవారికి గూగుల్‌ ఫ్లే స్టోర్‌లో హిడెన్‌ కెమెరా డిటెక్టర్‌ అనే యాప్‌ చాలా సందర్భాల్లో పనిచేస్తుంది. ఐ ఫోన్లు వినియోగించే వారికి స్పై హిడెన్‌ కెమెరా డిటెక్టర్‌ యాప్‌ ఉపయోగపడుతుంది. స్పై కెమెరాలు వెలువరించే ఇన్‌ఫ్రారెడ్‌ కిరణాలను గుర్తించడం ద్వారా గదిని పూర్తిగా డార్క్‌ చేసినప్పుడు నిర్దిష్ట స్థలంలో కెమెరా ఉందా లేదా అనే విషయం గమనించి మొబైల్‌ అప్లికేషన్‌లో వాటిని చూపిస్తాయి. స్పై కెమెరాలను గుర్తించడానికి బగ్‌ డిటెక్టర్‌ అనే ప్రత్యేక పరికరాలుంటాయి.

ఇవి చదవండి: అమెరికాను వణికిస్తున్న హరికేన్‌ హెలెన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement