Health
-
రోజంతా నీరసంగా అనిపిస్తోందా? ఇలా ప్లాన్ చేయండి!
చాలామంది రోజంతా నీరసంగా.. నిస్సత్తువగా గడుపుతుంటారు. దీనివల్ల శరీరం నిస్తేజంగా మారడమే కాకుండా అనేక రోగాల బారిన పడే ప్రమాదం ఉంది. అయితే కొన్ని చిన్నపాటి మార్పుల ద్వారా రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండవచ్చు. అవేంటో చూద్దాం.. తగినంత నిద్ర.. ప్రతిరోజూ కనీసం 7–8 గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యం. నిద్రలేమి చిరాకు, నీరసానికి దారితీస్తుంది.ఆరోగ్యకరమైన ఆహారం.. పోషకాలతో కూడిన సమతుల ఆహారం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రొటీన్లు శరీరానికి శక్తినిస్తాయి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర ఎక్కువగా ఉండే వాటిని తగ్గించడం మంచిది. వ్యాయామం.. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల ΄ాటు వ్యాయామం చేయడం వల్ల మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది. శక్తి స్థాయులు పెరుగుతాయి. నడవడం, యోగా, డ్యాన్స్ లేదా ఇష్టమైన ఏదైనా శారీరక శ్రమ చేయవచ్చు.నీరు తాగడం.. రోజంతా తగినంత నీరు తాగడం చాలా అవసరం. డీహైడ్రేషన్ వల్ల అలసట, చిరాకు కలగవచ్చు.ధ్యానం, విశ్రాంతి.. ప్రతిరోజూ కొంత సమయం ధ్యానం లేదా రిలాక్సేషన్ టెక్నిక్స్ కోసం కేటాయించండి. ఇది ఒత్తిడిని తగ్గించడానికి, మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడుతుంది.పాజిటివ్ ఆలోచనలు.. ప్రతికూల ఆలోచనలను తగ్గించుకుని సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోండి. కృతజ్ఞత కలిగి ఉండటం కూడా చాలా ముఖ్యం.ఇష్టమైన పనులు చేయడం.. ఆనందం కలిగించే హాబీలు లేదా పనుల కోసం సమయం కేటాయించడం మన మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.సామాజిక సంబంధాలు.. స్నేహితులు, కుటుంబ సభ్యులతో సమయం గడపడం, ఇతరులతో మాట్లాడటం, కనెక్ట్ అవ్వడం మానసిక ఆరోగ్యానికి చాలా ముఖ్యం.కొత్త విషయాలు నేర్చుకోవడం.. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం లేదా కొత్త విషయాలు తెలుసుకోవడం మీ మనస్సును ఉత్తేజపరుస్తుంది, ఉల్లాసంగా ఉంచుతుంది.రోజువారీ అలవాట్లు.. ఉదయం లేవగానే సహజమైన సూర్యకాంతిలో గడపడం శరీరపు జీవ గడియారాన్ని క్రమబద్ధీకరించడానికి సహాయపడుతుంది, ఉల్లాసంగా ఉంచుతుంది.చిన్న చిన్న విరామాలు.. మీరు ఎక్కువసేపు ఒకే పనిలో ఉంటే, మధ్యలో చిన్న విరామాలు తీసుకోండి. లేచి కొంచెం నడవండి లేదా స్ట్రెచ్ చేయండి.పనులు ప్లాన్ చేసుకోవడం.. రోజువారీ పనులను ఒక క్రమంలో ప్లాన్ చేసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది, మరింత నియంత్రణలో ఉన్నట్లు అనిపిస్తుంది.నవ్వండి, నవ్వించండి.. నవ్వడం ఒక గొప్ప ఒత్తిడి నివారిణి, హాయిగా నవ్వుకోడం మానసిక స్థితిని తక్షణం మెరుగు పరుస్తుంది.ఈ చిట్కాలను జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా రోజంతా ఉల్లాసంగాఉత్సాహంగా ఉండగలగడం ఎవరికైనా సాధ్యమే.ఒకవేళ మీకు ఏవైనా ప్రత్యేకమైన ఆందోళనలు ఉంటే, వైద్య నిపుణుడిని సంప్రదించడం మంచిది. -
ఏ క్షణమైనా గుండెపోటు ఖాయం..! కాలమిస్ట్ శోభా డే కుమార్తె వెయిట్ లాస్ స్టోరీ
అందరిని వేధిస్తున్న సమస్య ఊబకాయం. ఈ అధిక బరువుకి చెక్‌పెట్టడం ఓ సవాలు. ఎంతోమంది సెలబ్రెటీలు దీన్ని ఛాలెంజింగ్ తీసుకుని బరువు తగ్గి చూపించారు. అయితే అది అందరికీ సాధ్యం కాలేదు. కేవలం తగ్గాలన్న లక్ష్యంతో, కృతనిశ్చయంతో ఉన్నవారికే సాధ్యమైంది. అమ్మబాబోయ్ అనుకుని చేతులెత్తేయకుండా పట్టుపట్టి..ఆరోగ్యం కావాలనుకునే వారికే సుసాధ్యమైంది. ఇప్పుడు తాజాగా ఆ కోవలో ప్రముఖ నవలా రచయిత కాలమిస్ట్ శోభా డే కుమార్తె ఆనందితా చేరారు. ఆమె కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్న ఆలోచనే బరువు తగ్గేందుకు దారితీసిందని చెబుతున్నారు. ఇప్పుడామె ఎంత స్లిమ్‌గా మారారంటే..చూసేవాళ్లకే అసూయ కలిగేంతగా తగ్గిపోయారు. ఎందుకంటే జస్ట్ ఏడు నెలల్లోనే 40 కిలోలు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచారామె. మరీ ఆమెకు అదెలా సాధ్యమైందో తెలుసుకుందామా..!.గత ఆగస్టు 23, 2024 వరకు అధిక బరువుతో ఉండేది. అప్పటి నుంచి తన వెల్నెస్ జర్నీ ప్రారంభించానని తన ఇన్‌స్టా పోస్ట్‌లో రాసుకొచ్చారు ఫ్రీలాన్స్ రచయిత ఆనందిత. ఆ పోస్ట్‌లో '40 కిలోల తగ్గుదల' అనే శీర్షికతో తన వెయిట్‌లాస్ జర్నీ గురించి రాసుకొచ్చారామె. అసలు నమ్మలేకపోతున్నా.. ఇంతలా బరువు తగ్గానా..? అంటూ భావోద్వేగానికి గురయ్యారు. అలాగే తాను ఏవిధంగా బరువు తగ్గిందో వివరించింది. ముందుగా తాను ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలు గురించి తెలిపారామె. తన అధిక బరువు కారణంతో కనీసం కొద్ది దూరం నడిచేటప్పటికే ఆయాసం వచ్చేసిందని, కనీసం మెట్లు కూడా ఎక్కలేకపోయేదాన్ని అంటూ మాట్లాడారామె. శరరీంలో చెడు కొలస్ట్రాల్ లెవెల్స్ ఏ స్థాయిలో పెరిగాయంటే ఒక ఫ్లోర్ మెట్లు ఎక్కేటప్పటికే గుండెపోటు వచ్చేస్తుందేమోన్న భయం కలిగిందట. అలాగే చర్మం రంగు మారిపోయి తన ఆకృతే ఒకలా అయిపోందని చెప్పుకొచ్చింది. దాంతోపాటు స్లీప్ ఆప్నియా, నిద్రలేమి, నిరంతర దగ్గు, డయాబెటిక్ వంటి సమస్యలతో ఇబ్బంది పడేదాన్ని అన్నారు. ఇక ఇలాగైతే ఎన్నోనాళ్లు ఉండనన్న ఫీల్ కలిగి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టానన్నారామె. ముఖ్యంగా షుగర్ లేని ఆహారాలకే ప్రాధాన్యత ఇవ్వడమే గాక తగిన వ్యాయామం చేయడం వంటివి చేసినట్లు తెలిపారు. ఈ విధానంతో బరువు తగ్గడమే కాకుండా సులభంగా మెట్లు ఎక్కేయగలనని, పైగా మెట్లు లేని హోటల్లో స్టే చేయగలనని ధీమాగా చెబుతోందామె. అంతేగాదు ఆనందిత బరువు తగ్గడం అంటే శరీరాకృతి మారడంగా భావించొద్దు అది మన వెల్నెస్ ప్రయాణంగా భావిస్తేనే..బరువు తగ్గడమే గాక ఆరోగ్యంగానూ ఉంటామని చెబుతోంది ఆనందిత. View this post on Instagram A post shared by Anandita De (@ananditade) (చదవండి: Kushboo Sundar: 20 కిలోలు తగ్గిపోయిన ఖుష్బూ.. అందుకోసం ఏం చేసిందంటే?) -
50 ఏళ్ల వయసులో పడుచుపిల్లలా ఖుష్బూ.. సీక్రెట్ అదే!
నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ టాలీవుడ్ కోలీవుడ్‌లో తనదైన ముద్రవేసిన ప్రసిద్ధ నటి. 90లలో తన అందం, నటనతో సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన నటి ఆమె. ఎన్నో వైవిద్య భరితమైన పాత్రలో ప్రేక్షకుల, విమర్శకుల మెప్పుని పొందారు. అంతేగాదు వేలాదిగా అభిమానులను సొంతం చేసుకున్న తమిళ నటి. అలాగే సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి.. అక్కడ కూడా తన హవాను చాటుతున్నారు. అవసరమైనప్పుడూ ప్రజల తరుపున గళం విపుత్తు..వార్తల్లో నిలుస్తున్నారు కూడా. రాజకీయ నాయకురాలిగా బిజీగా ఉండే ఆమె కూడా ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెడుతుంటారు. అందుకు నిదర్శనమే ఆమె కొత్త గ్లామరస్ లుక్. ఎంతో లావుగా ఉండే ఆమె ఒక్కసారిగా పదహారణాల పడుచు పిల్లలా మారిపోయారు. నెటిజన్లు సైతం ఆమె కొత్త లుక్‌ని చూసి ఆశ్చర్యపోతున్నారు. మరీ.. అంతలా బరువు కోల్పోయినా..ఖుష్బు వెయిట్‌లాస్ సీక్రెట్ ఏంటో ఆమె మాటల్లోనే చూద్దామా..!.ఐదుపదుల వయసులో ఖుష్బూ అద్భుతంగా తన బాడీ ఆకృతిని మార్చుకుని అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేశారామె. ఇటీవలే అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్‌గా మారాయి. నిజంగా ఆమెనా..? ఖుష్బు కూతురా..? అని కన్ఫ్యూజ్ అయ్యేలా గ్లామరస్ లుక్‌లో కనిపించారామె. అయితే ఆమె కొత్త లుక్‌ని చూసి.. కొందరు నెటిజన్లు మెచ్చుకోగా మరికొందరు మాత్రం ఇంజెక్షన్లు ఏవో తీసుకునే బరువు తగ్గారామె అంటూ కామెంట్లు చేశారు. అయితే ఖుష్బూ వాటిన్నంటిని కొట్టిపారేస్తూ..తాను ఎలా బరువుని తగ్గించుకోగలిగరో షేర్ చేసుకున్నారు. అలాగే తన ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో కూడా చెప్పారు. బరువు తగ్గడానికి షార్ట్ కట్స్ ఉండవని నర్మగర్భంగా తేల్చి చెప్పారామె. ఒకవేళ్ల తగ్గినా..అది తాత్కాలికమే అని కూడా అన్నారు ఖుష్బూ. కేవలం క్రమశిక్షణాయుతమైన జీవనశైలి, బరువు తగ్గాలన్న కృత నిశ్చయాలే..అద్బుతంగా బరువు తగ్గేందుకు దారితీస్తాయని అంటున్నారామె. అంతేగాదు అందుకోసం తాను ఎలాంటి లైఫ్‌స్టైల్‌ని అనుసరించారో కూడా పంచుకున్నారు. మనసుపెట్టి తినడం, ఒక గంటపాటు వర్కౌట్లు, అలాగే సాయంత్రం 45 నుంచి 50 నిమిషాలు తప్పనిసరి వాక్ తదితరాలే ఈ సరికొత్త లుక్‌కి కారణమని అన్నారు. అయితే తాను ఇలా ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టడానికి ప్రధాన కారణం కూడా వివరించారు. షూటింగ్‌ల సమయంలో సంవత్సరాల తరబడి అయిన గాయాలు, శస్త్రచికిత్సలు తన మోకాళ్లను పూర్తిగా బలహీనపరిచాయన్నారు. వాటిపై ఒత్తిడిపడకూడదంటే బరువు తగ్గక తప్పదని వైద్యులు సూచించినట్లు తెలిపారు. చీలమండలాలు బాగానే ఉన్నాయని, మోకాళ్లు ఆల్మోస్ట్ అరిగిపోయాయని అన్నారు. అప్పుడే ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టకపోతే అంతే సంగతులని భావించి..బరువు తగ్గాలని గట్టిగా ఫిక్స్ అయ్యానన్నారు. అలా తాను దాదాపు 20 కేజీల బరువుని కోల్పాయానన్నారు.ఇక్కడ ఖుష్బూ బరువు తగ్గేందుకు ఎటువంటి సౌందర్య చికిత్సల జోలికిపోకుండా.. అందంగా..ఆరోగ్యకరంగా వృద్ధాప్యాన్ని ఎలా మలుచుకోవచ్చో చూపించారు. ఏదీఏమైనా.. వయసురీత్యా మార్పులనేవి సహజం. వాటిని దాచే ప్రయత్నం కంటే..ఆరోగ్యదాయకమైన పద్ధతిలో తీసుకొస్తే..అటు అందం, ఇటు ఆరోగ్యాన్ని పదిలపరుచుకున్న వాళ్లమవుతామని తన చేతలతో చెప్పకనే చెప్పింది నటి ఖుష్బూ. (చదవండి: ఎవరీ రేష్మా కేవల్రమణి..? ఏకైక భారత సంతతి మహిళగా టైమ్స్‌లో చోటు..) -
రక్తం ధారగా పోతోందా?.. బీ కేర్‌ఫుల్
చిన్న చిన్న గాయాలైనప్పుడూ జాగ్రత్త..!. రక్తం కారడం సహజమే కదా అని తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు ఆరోగ్యనిపుణులు. ఒకవేళ అనుకోకుండా గాయమైనా..రక్తం కారి కాసేపటికి కంట్రోల్ అవ్వాలి. లేదంటే అది హిమోఫిలియా రుగ్మతే అయ్యి ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అలాంటి బాధితులు తక్షణమే వైద్యుడిని సంప్రదించాలని అంటున్నారు. ఇవాళ ఏప్రిల్17 ప్రపంచ హిమోఫిలియా దినోత్సవం సందర్భంగా అసలేంటి వ్యాధి..? దీనికి చికిత్స ఏంటి తదితరాల గురించి తెలుసుకుందాం.చాలామంది హీమోఫిలియా అనే వ్యాధి గురించి తెలియదు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏటా ఏప్రిల్ 17న హీమోఫిలియా అవేర్నెస్ డే నిర్వహిస్తున్నారు.హీమోఫిలియా అంటే హీమోఫీలియా అనే పదం హెమోరాఫిలియా అనే పదానికి సంక్షిప్త రూపం. దీన్ని జ్యూరిచ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ డాక్టర్ షోన్లీన్ , అతని అసోసియేట్ ఫ్రెడరిక్ హాప్ఫ్ సృష్టించారు. రక్తం గడ్డకట్టే సామర్థ్యాన్ని ప్రభావితం చేసే అరుదైన జన్యు వ్యాధి 'హిమోఫిలియా'. ఇది వారసత్వంగా తల్లి దండ్రుల నుంచి పిల్లలకు వస్తుంది. అలాంటి వారికి ఎముక సంబంధిత సమస్యలు, కీళ్ల నొప్పులు, వాపు, అంతర్గత రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సరైన సమయంలో నిర్ధారణ చేసి మందులు వాడకపోతే ఒక్కోసారి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. 'రాయల్ డిసీజ్'.. ఈ సమస్య ఈనాటిది కాదు. ప్రాచీన ఈజిప్టు కాలం నుంచి దీని తాలుకా కేసులు నమోదయ్యాయట. అంతేగాదు దీన్ని 'రాయల్ డిసీజ్' అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈజిప్ట్రాణి విక్టోరియాకి ఈ వ్యాధి ఉందట. అలాగే ఆమెకు పుట్టిన తొమ్మిది మంది పిల్లల్లో ముగ్గురికి ఈవ్యాధి ఉందని, వారికి వారసత్వంగా వచ్చిందని అప్పుడే నిర్థారించారు వైద్య నిపుణులు. ఎందువల్ల ఇలా అంటే..సాధారణంగా ఎప్పుడైనా శరీరానికి గాయమైతే, రక్తస్రావం అవ్వడం మొదలవుతుంది. ఈ రక్తస్రావాన్ని ఆపేందుకు క్లాట్ ఏర్పడి, ప్లేట్లెట్స్ రక్తాన్ని చిక్కపరుస్తాయి. ఇలా రక్తస్రావం ఆగిపోతుంది. కానీ, హీమోఫిలియా ఉన్న వారికి శరీరంలో రక్తం గడ్డకట్టే కణాలు తక్కువగా ఉంటాయి. దీంతో వారికి గాయం అయితే రక్తం ధారగా శరీరం నుంచిపోతూనే ఉంటుందట. ఇక ఈ వ్యాధి ఏ,బీ అని రెండు రకాలుగా ఉంటుందట. ఈ వ్యాధి వల్ల ఒక వ్యక్తి తన శరీరంలో రక్తం గట్టకట్టడానికి అవసరమైన ప్రొటీన్లను ఉత్పత్తి చేసుకునేందుకు వీలుండదు. దీంతో తీవ్ర రక్తస్రావం అవుతుంది.హీమోఫిలియా బీ ఉన్న వారు తమ బ్లడ్ ప్లాస్మాలో ప్రొటీన్‌ను అంటే ఫ్యాక్టర్ 9ను సహజంగా ఉత్పత్తి చేసుకోలేరు. ఇప్పటి వరకు ఈ రోగులు ఫ్యాక్టర్ 9 కోసం ఇంజెక్షన్లు తీసుకోవాల్సిందే. వారంలో పలుసార్లు వీటిని వేయించుకోవాల్సి ఉంటుంది.ఈ వ్యాధి జన్యుపరంగా వస్తుంది. ఒకవేళ తల్లిదండ్రుల్లో ఎవరికైనా ఈ వ్యాధి ఉంటే, పిల్లలకు కూడా ఇది సంక్రమించే అవకాశం ఉంది. ఈ వ్యాధి సోకేందుకు ఇతర కారణాలు చాలా తక్కువని అంటున్నారు నిపుణులు. ఇది చాలా అరుదైన వ్యాధని చెబుతున్నారు వైద్య నిపుణులు.అంతేగాదు పదివేల మందిలో ఒకరికి హీమోఫిలియా -ఏ సోకుతుందని, 40 వేల మందిలో ఒకరికి హీమోఫిలియా బీ వస్తుందని చెప్పారు. చివరిగా..ఏ రూపంలో ఈ వ్యాధి సోకినా అది చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు నిపుణులులక్షణాలు..ఈ వ్యాధి లక్షణాలు స్వల్పంగా లేదా చాలా తీవ్రంగా ఉంటాయిముక్కు నుంచి రక్తం కారడంపళ్ల చిగుళ్ల నుంచి రక్తస్రావంచర్మం తేలిగ్గా ఊడొస్తుంది.శరీరం లోపల రక్తస్రావమవుతూ ఉండటంతో జాయింట్లలో నొప్పిహీమోఫిలియా వల్ల తలలో ఇంటర్నల్‌గా రక్తస్రావమవుతుంది. తీవ్ర తలపోటు, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.దీంతో పాటు, చిన్నవయసులోనే ముసలివాళ్లుగా మారడం, మెదడుకు సరైన సమయంలో రక్తం అందకపోవడంతో స్పృహ కోల్పోవడం, ముఖం అందవికారంగా మారడం వంటివి కూడా కనిపిస్తుంటాయి.ఈ లక్షణాలు అతి కొద్ది మంది రోగులలో మాత్రమే కనిపిస్తాయి.హీమోఫిలియా మూడు స్థాయుల్లో ఉంటుంది. స్వల్ప స్థాయిలో ఉన్నప్పుడు శరీరంలో 5 నుంచి 10 శాతం మాత్రమే రక్తం గడ్డకట్టే కణాలుంటాయి.మధ్యస్థంగా ఉన్నప్పుడు 1 నుంచి 5 శాతం మాత్రమే రక్తం గడ్డకట్టే కణాలు ఉంటాయి. ఆ తర్వాత ఈ వ్యాధి తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు, వీటి స్థాయి శరీరంలో కేవలం ఒక్క శాతం మాత్రమే ఉంటుంది.ఈ పైలక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా తక్షణమే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాల్సిందే. చికిత్స ఏంటంటే..నిజానికి కొన్నేళ్ల వరకు ఈ వ్యాధికి చికిత్స అనేది చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు రక్తం గడ్డకట్టేందుకు ఇంజెక్షన్ ఇస్తున్నారు. ఒక వేళ ఈ వ్యాధి అంత ప్రమాదకరస్థాయిలో లేకపోతే ఔషధాలతో ఉపశమనం పొందొచ్చు. అలాగే తోబుట్టువుల్లో ఒకరికి ఉండి మరొకరికి లేకపోయినా..కొంతకాలం తర్వాత వారు ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు ఉంటాయిన హెచ్చరిస్తున్నారు. ఇక హీమోఫిలియా బీ రకం వ్యాధి అయితే చికిత్స అత్యంత ఖరీదైనదే అంటున్నారు నిపుణులు. ఇటీవలే అమెరికా దీనికి హెమ్జెనిక్స్ అనే ఇంజెక్షన్‌ని అందుబాటులోకి తీసుకువచ్చిందట. అయితే దీని ధర 3.5 మిలియన్ డాలర్లు(భారత కరెన్సీలో దాదాపు 28 కోట్లు.). అంతేగాదు ప్రపంచంలో ఇప్పటివరకు ఉన్న ఔషధాల్లో ఇదే అత్యంత ఖరీదైన ఇంజెక్షన్‌గా నిలిచింది. ఇది అత్యంత అరుదైన వ్యాధికావడంతో దీని గురించి అందరికీ అవగాహన కల్పించాలనే ప్రత్యేకంగా ఒక రోజుని ఏర్పాటు చేసి మరీ అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నారు అధికారులు. ఈ ఏడాది థీమ్ "అరుదైన రక్రస్రావం రుగ్మత గురించి మహిళలు, బాలికలు అందరూ తెలుసుకోవాలి".. అనే నినాదంతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. (చదవండి: ఆరోగ్యానికి అదే మార్గం..! సూచిస్తున్న పోషకాహార నిపుణులు) -
ఆయన వింతగా ప్రవర్తిస్తున్నారు!
మా ఆయనకు 52 సం‘‘లు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు. వృత్తిలో పెద్దగా సమస్య లేదు. కాని ఈ మధ్య రాత్రి నిద్రలో తన కాళ్ళతో నన్ను కొడుతున్నాడు. నిద్రలో కాళ్ళను గట్టిగా కదిలించడం, అప్పుడప్పుడు కేకలు వేయడం, కలలో ఎవరితోనో పోరాడుతున్నట్లు ప్రవర్తిస్తున్నాడు. ఉదయాన్నే లేచిన తరువాత అడిగితే రాత్రి జరిగిన విషయాలు ఏమి గుర్తులేవని అనడమే కాక, అసలు అలా చేయనే లేదని చెప్తున్నారు. మా ఇద్దరి వైవాహిక జీవితంలో వేరే ఏ సమస్యా లేదు. నాకు ఏం చేయాలో తోచడం లేదు. నాపైన కోపంతో పగలు నన్నేం అనలేక రాత్రి నిద్రలో నన్ను ఇబ్బంది పెడ్తున్నారేమోనని అనిపిస్తుంది. దీనికి తగిన పరిష్కారం చెప్పగలరు.– వరలక్ష్మి, మహబూబ్ నగర్ మీ భర్త విషయంలో మీరు వివరించిన లక్షణాలు రాత్రి నిద్రలో కాళ్ళతో తన్నడం, కేకలు వేయడం, చేతులు కదిలించడం, పొద్దున దాని గురించి అసలేం గుర్తు లేకపోవడం... ఇవన్నీ ‘రెమ్ స్లీప్ బివేవియర్ డిజార్డర్’ అనే నిద్రకు సంబంధించిన రుగ్మతను సూచిస్తున్నాయి. ఈ సమస్యలో ఆ వ్యక్తి నిద్రదశలో కలల్లో వచ్చే విషయాలకు అనుగుణంగా వారికి తెలియకుండానే ఆ విధంగా ప్రవర్తిస్తారు. సాధారణంగా కలలు వచ్చే సమయంలో మన శరీర కండరాలు అచేతనమై ఉంటాయి. కానీ పైన చెప్పిన సమస్య ఉన్న వారిలో అలా జరగక΄ోవడం వల్ల వారు విపరీతంగా కదలడం, కాళ్ళతో చేతులతో కొట్టడం చేస్తారు. మీరు వెంటనే మీ భర్తను ఒక న్యూరాలజిస్ట్ లేదా సైకియాట్రిస్ట్ వద్దకు తీసుకెళ్ళి ‘స్లీప్ స్టడీ’ చేయించి ఈ రుగ్మతను నిర్ధారించుకోవాలి. కొన్ని మంచి మందులతో ఈ లక్షణాలను పూర్తిగా తగ్గించవచ్చు. చికిత్స మొదలయ్యే వరకు మీ భద్రత కోసం మీరు వేరే బెడ్‌పై లేదా వేరే గదిలో నిద్రిస్తే మంచిది. ఆయన నిద్ర΄ోయే ముందు మద్యపానం, కాఫీ, సిగరెట్ లాంటివి తీసుకోకుండా చూడండి. అన్నిటికీ మించి ఇది ఆయన అదుపులో లేని ఒక వైద్యసమస్య అని గుర్తించండి. ఆయన్ని కోపగించుకోకుండా, అర్థం చేసుకొని వైద్య చికిత్స చేయించండి! అన్నీ సర్దుకుంటాయి. ఆల్ ది బెస్ట్!(చదవండి: మంచి పనిచేశా..! భారత్‌పై డెన్మార్క్ మహిళ ప్రశంసల జల్లు..) -
వేసవి తాపం నుంచి రక్షించే సహజ ఆరోగ్య పానీయాలివే..!
హైడ్రేషన్.. వేసవిలో ఈ పదం మన ఆరోగ్యానికే కాదు, మన జీవితానికీ కీలకంగా మారుతుంది. ముఖ్యంగా హైదరాబాద్‌లాంటి మెట్రో నగరాల్లో వేడి ఉష్ణోగ్రతలు, ట్రాఫిక్ కష్టాలు, ఎయిర్ కండిషనర్ల నీడలో గడిచే జీవితాలు.. ఇలాంటి కారణాలతో మన శరీరంలోని నీటి శాతం గణనీయంగా తగ్గుతుంది. దాదాపు 70 శాతం పైగా నీరుండే మానవ శరీరం డీహైడ్రేషన్‌తో తాత్కాలిక ఆరోగ్య సమస్యలు మొదలు ప్రాణాపాయ పరిస్థితులకూ చేరుకుంటుంది. ప్రధానంగా చిన్నారుల్లో, వృద్ధుల్లో ఈ సమస్య జటిలంగా మారుతుంది. ఈ నేపథ్యంలో పళ్లరసాలు వేసవి తాపానికి, దాహానికి, దేహానికి సహజమైన పరిష్కారాలను అందిస్తున్నాయి. హైడ్రేషన్ కోసం సహజమైన, రుచికరమైన, ఆరోగ్యవంతమైన ప్రత్యామ్నాయం అందిస్తున్నాయి. వేసవిలో సైతం పండే పండ్లలో నీటి శాతం అధికంగా ఉండటం వల్ల.. ఇవి తక్షణ హైడ్రేషన్‌ను కలిగిస్తాయి. ద్రాక్ష, మామిడి, కర్భూజ, పుచ్చకాయ, నేరేడు, నారింజ వంటి పండ్లు పోషక సమ్మేళనంగా రసాలతో పాటు విటమిన్స్, మినరల్స్‌ను అందిస్తాయి. వీటిలో ముఖ్యంగా విటమిన్–సీ, పొటాషియం, ఫైటో న్యూట్రియంట్స్ వంటి పోషకాలుంటాయి. ఇవి శరీరానికి జలాభిషేకం చేయడమే కాదు, హీట్ స్ట్రోక్, చెమట వల్ల వచ్చే అలసట, నీరసం వంటి వాటిని కూడా తగ్గిస్తాయి. డీహైడ్రేషన్‌ను ఎలా తగ్గిస్తాయి? వేసవి కాలంలో చెమట ద్వారా శరీరం నుంచి నీరు, లవణాలు (ఎలక్ట్రోలైట్స్) కోల్పోవడం సర్వసాధారణం. పళ్లరసాల్లో ఉండే సహజ పొటాషియం, సోడియం లాంటి ఖనిజాల వల్ల ఈ లోపాలను భర్తీ చేయడం సాధ్యపడుతుంది. ముఖ్యంగా నారింజ రసం శరీరానికి తక్షణ శక్తిని అందించగలవని ఆరోగ్య నిపుణుల సూచన. ముఖ్యంగా పుచ్చకాయ రసంలో 90 శాతానికి పైగా నీరు ఉండటంతో ఇది సహజ కూలెంట్గానూ పనిచేస్తుంది. కూల్ డ్రింక్స్ ఎందుకు మంచివి కావు? హైదరాబాద్ వంటి ప్రముఖ నగరాల్లో అధికంగా వినియోగించే కూల్ డ్రింక్స్‌లో అధిక చక్కెర, కృత్రిమ రంగులు, కార్బన్డయాక్సైడ్ ఉంటాయి. ఇవి తాత్కాలికంగా శరీరానికి చల్లదనాన్ని కలిగించినట్టు అనిపించినా, అసలైన హైడ్రేషన్‌ను కలిగించవు. పైగా.. అధికంగా తీసుకుంటే మధుమేహం, దంత సమస్యలు, శరీర బరువు పెరగడం వంటి దీర్ఘకాలిక ప్రమాదాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఉదయం కార్యాలయానికి లేదా ఇతర పనుల మీద బయలుదేరేముందు ఓ గ్లాసు తాజా పళ్ల రసం తీసుకోవడం అలవాటు చేసుకోవడం ఉత్తమం. ఈ పండ్ల రసాలు రోడ్ల మీద దొరికేవి కాకుండా ఇంట్లోనే తయారు చేసుకోవడం శ్రేయస్కరం. షుగర్ లేని, ప్లాస్టిక్ ఫ్రీ, ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మార్గం ఇదేనని వెల్నెస్ ట్రైనర్ల అభిప్రాయం. వేసవిలో శరీరాన్ని చల్లబరచాలంటే.. చల్లని నీళ్లు కాకుండా, ఆరోగ్యవంతమైన పళ్లరసాలు ఎంచుకోవడం ఉత్తమం. ఎండదెబ్బ నుంచి రక్షణనిచ్చే పళ్ల రసాలు మామిడి పానకం : సహజ చక్కెరతో, తేనెతో తయారు చేస్తే శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతుంది. నారింజ/మోసంబి రసం : విటమిన్–సీ అధికంగా ఉండి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. పుచ్చకాయ రసం : శరీర ఉష్ణోగ్రత తగ్గించడంలో ఉత్తమమైనది. ద్రాక్ష రసం : హైడ్రేషన్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. తాజా కొబ్బరి నీరు : సహజమైన ఎలక్ట్రోలైట్లతో నిండి ఉంటుంది. (చదవండి: ఖరీదైన పండ్లకు కేరాఫ్‌గా భాగ్యనగరం..! ఏకంగా న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, చిలీ..) -
విటమిన్-డి... ఈ ఐదు విషయాలు తెలుసా?
విటమిన్ డి అనేది ఎంత ప్రాముఖ్యమైనదో తెలిసిందే. దీని లోపం వల్ల శక్తిస్థాయిలు క్షీణించి అలసటకు దారితీస్తుంది. రోగనిరోధకవ్యవస్థ పనితీరుకు కీలకమైనది ఇదే. అందువల్ల ఈ విటమిన్ లోపిస్తే అంటువ్యాధులు, అనారోగ్యాల బారినపడే ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు నిపుణులు. అంతేగాదు పరిశోధనలు సైతం ఈ విటమిన్ లోపిస్తే..ఆందోళన, డిప్రెషన్‌తో సహా మానసిక రుగ్మతలకు దారితీసే ప్రమాదం ఉందని వెల్లడించాయి కూడా. అంత ప్రాముఖ్యత ఉన్న విటమిన్ డికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.ఇది కేవలం విటమిన్ మాత్రమే కాదు. కాల్షియం శోషణ, ఎముకల ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తున్న కాల్సిట్రియోల్ అనే హార్మోన్‌కు పూర్వగామిగా పిలుస్తారు. ఎముకల బలానికి ప్రసిద్ధి చెందినప్పటికీ..ఇది కండరాల పనితీరు, రోగ నిరోధక శక్తి, మానసిక ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడుతుంది. ఈ విటమిన్ సూర్యరశ్మిలో పుష్కలంగా దొరుకుతుంది. సహజంగా సులభంగా పొందగలిగే విటమిన్ ఇది. అంతేకాదండోయ్ సూర్యకాంతి నుంచి వచ్చే యూవీబీ కిరణాలకు గురైనప్పుడు..శరీరం ఆటోమేటిగ్గా 'డి'ని ఉత్పత్తి చేస్తుందట. అందువల్ల ఆరోగ్యం కోసం బహిరంగ కార్యకలాపాలు తప్పనిసరి అని చెబుతున్నారు నిపుణులు. అలాగే ఆహారంలో కూడా ఉంటుంది ఈ విటమిన్ డి. ముఖ్యంగా కొవ్వు చేపలు, గుడ్డు సొనలు, సూర్యరశ్మికి గురయ్యే పుట్టగొడుగులు, పాల ఉత్పత్తుల్లోనూ ఉంటుందట. విచిత్రం ఏంటంటే ఇంతలా సమృద్ధిగా సూర్యరశ్మి భారత్‌లో ఉన్నప్పటికీ..ప్రతి ఐదు మంది భారతీయులలో ఒకరు విటమిన్ డీ లోపంతో బాధపడుతున్నారని నివేదికలు చెబుతున్నాయి.2023 నివేదికల ప్రకారం..భారతదేశ జనాభాలో దాదాపు 76% మంది ఈ విటమిన్ లోపంతోనే బాధపడుతున్నారుట. అందులో పురుషులు 79% మంది కాగా, స్త్రీలు 75% కావడం గమనార్హం. అలాగే 84% మంది పాతికేళ్ల వయస్సు కంటే తక్కువగా ఉన్న యువతే ఈ విటమిన్ లోపంతో బాధపడుతున్నట్లు నివేదిక పేర్కొంది. ముఖ్యంగా వదోదర, సూరత్, జైపూర్, కోల్‌కతా, ముంబై, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో ఈ విటమిన్ లోపంతో బాధపడుతున్నవారి సంఖ్య ఎక్కువ అని గణాంకాలు చెబుతున్నాయి. (చదవండి: ఒర్రీ వెయిట్‌లాస్ సీక్రెట్: వాంతులు చేసుకుంటూ బరువు తగ్గడమా..?) -
వాంతులు చేసుకుంటూ బరువు తగ్గడమా..?
స్మార్ట్‌గా..అందంగా కనిపించడం అనేది మోడళ్లు, సినీతారలు ప్రముఖులకే పరిమితం కాలేదు. ఇటీవల సోషల్ మీడియా పుణ్యమా అని ఓవర్‌నైట్ స్టార్లుగా మారుతున్న వాళ్లు సైతం అదే బాటపడుతున్నారు. ఇది ఆరోగ్యకరంగా ఉంటే ఏం సమస్య లేదు. తక్కువ సమయంలో సన్నగా మారిపోవాలనుకుంటేనే.. ఆరోగ్యమే చిక్కుల్లో పడుతుంది. చాలామంది ఏదీఏమైనా పర్లేదు అంటూ రిస్క్ చేసి మరీ తప్పుడు డైటింగ్ పద్ధతులు అనుసరిస్తున్నారు. అందుకోసం శరీరాన్ని ఎంతలా కష్టపెడుతున్నారంటే..కేవలం వర్కౌట్లు కాదు, ఆహారం పరంగా శరీరం శుష్కించిపోయేలా చేస్తున్నారు. అవి వింటే.. బరువు తగ్గడం కోసం ఇన్ని పాట్లు పడుతున్నారా అని ఆశ్చర్యమేస్తుంది. ఆకృతికి ఇంత ప్రాముఖ్యత..? అనిపిస్తుంది కూడా. ఒర్రిగా ప్రసిద్ధిచెందిన కంటెంట్ క్రియేటర్ సైతం ఇలాంటి పనులే చేసి బరువు తగ్గాడట. అతడు బరువు తగ్గే క్రమంలో అనుసరించిన విధానాలు తెలిస్తే..నిజంగానే వాంతి చేసుకున్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అందులో నో డౌట్.ఒర్రీగా ప్రసిద్ధి చెందిన ఓర్హాన్ అవత్రమణి అనే కంటెంట్ క్రియేటర్ 2023 ప్రారంభం వరకు 70 కిలోల బరువుతో ఉండేవాడు. చూడటానికి కొద్దిగా లావుగా ఉండేవాడు. ఇప్పుడు కాస్త ఫేమస్ కావడంతో టీవీ షోల్లో కనిపించేందుకు స్మార్ట్‌గా ఉండక తప్పదు. అందుకోసం అతను తిన్న ఆహారాన్ని వాంతి చేసుకునేవాడట. అలా చేసుకుంటే కాసేపటి వరకు వాంతి వస్తున్న ఫీలింగే ఉండి.. తిన్న ఆహారం అంతా బయటకొచ్చేస్తుంది. తద్వారా నీరసించి బరవు తగ్గేవాడట. అలా వాంతులు చేసుకుని చివరకు టాయిలెట్లో నిద్రపోయేవాడట. దాంతో మెడనొప్పితో ఇబ్బందిపడేవాడినంటూ తన అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఎలా మొదలయ్యాయో వివరించాడు ఓ ఇంటర్వ్యూలో. బరువు తగ్గడం కోసం ఓజెంపిక్ లాంటి మందులు వాడొచ్చు. అయితే అది ఛీటింగ్ అవుతుందే తప్ప బరవుతగ్గడం కాదనే నమ్ముతా అంటున్నాడు ఒర్రీ. అయితే తన దృష్టిలో బరువు తగ్గడానికి అదే బెస్ట్ అని కితాబిస్తున్నాడు. కాగా, ఒర్రీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన ఓ ఆఫీసులో స్పెషల్ ప్రాజెక్ట్ మేనేజర్‌గా పని చేయడమే గాక . ఓ సామాజిక కార్యకర్త కూడా. ప్రస్తుతం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా సెలబ్రిటీల పార్టీల్లో మెరుస్తుంటాడు. అలాగే బాలీవుడ్ టీవీ షోల్లో తళ్లుకుమంటుంటాడు. ఎంత ప్రమాకరమైనదంటే..తనను తాను ఆకలితో అలమటింపచేసుకునేలా పదేపదే వాంతులు చేసుకోవడం అనే ప్రక్రియ అత్యంత హానికరమైనదని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది శారీరకంగా మానసికంగా అత్యంత ప్రమాదకరమైనదని అంటున్నారు. దీని కారణంగా తీవ్రమైన నిర్జలీకరణం, ఎలక్ట్రోలైట్ అసమతుల్యత, జీర్ణశయాంతర సమస్యలు, గుండెకు సంబంధించిన రుగ్మతల బారినపడే అవకాశాలు మెండుగా ఉంటాయని చెబుతున్నారు. అంతేగాదు ఆకలి శరీరంలోని ప్రతి వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా కండరాలను బలహీనపరిచి జీవక్రియను నెమ్మదించేలా చేస్తుంది. ఫలితంగా మెదడు పనితీరు కూడా దెబ్బతింటుందని అన్నారు. కెరీర్లో విజయం సాధించడానికి ఎలా షార్ట్కట్లు ఉండవో అలాగే బరువు తగ్గడంలో కూడా ఉండవని తేల్చి చెబుతున్నారు. ఇలాంటి అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు సన్నగా మార్చినప్పటికీ..రాను రాను చిరాకు, ఒత్తిడి, వంటి వాటికిలోనై మొత్తం శరీరం పనితీరుపైనే తీవ్ర ప్రభావం చూపిస్తుందని వార్నింగ్ ఇస్తున్నారు నిపుణులు. అందువల్ల ఇలాంటి బాహ్య సౌందర్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఆత్మసౌందర్యానికే ప్రాధాన్యత ఇస్తూ..ఆరోగ్యప్రదంగా బరువు తగ్గే వాటిని అనుసరిస్తే అన్ని విధాల మేలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.(చదవండి: ఇదేం ఫిట్నెస్ స్టంట్..? తిట్టిపోస్తున్న నెటిజన్లు) -
మీ భంగిమ 'వెన్ను'దన్నుగా ఉందా..? సరైన పోష్చర్ అంటే..?
ఇటీవల చాలా చిన్న వయసులో ఉన్నవారు కూడా కండరాల నొప్పులని ఒళ్లునొప్పులనీ అంటుండటం మామూలే. దీనికి కారణం ఏదో జబ్బు లేదా వ్యాధి కాకపోవచ్చు. సరిగా నిలబడటం, కూర్చోవడం వంటివి చేయక΄ోవడమే కావచ్చంటున్నారు నిపుణులు. చాలామంది సరిగా నిల్చోవడం, ఆఫీసుల్లో లేదా ఇతరత్రా కూర్చోవడం, ఏదైనా వస్తువులు అందుకోవడం కోసం ఒంగడం వంటివి సరిగా చేయడం లేదంటే చాలామందికి అది ఆశ్చర్యమే. కానీ ఇదే నిజమంటున్నారు నిపుణులు. సరైన రీతిలో నిలబడటం, కూర్చోవడం, వంగడం, సెల్‌ఫోన్ మాట్లాడేటప్పుడు మెడ కండరాలపైన ఒత్తిడి పడేలా ఒక పక్కకు పూర్తిగా మెడ వంచకపోవడం వంటి శారీరక భంగిమలను (పోష్చర్‌ను) సరైన రీతిలో ఉంచడం వంటి మామూలు జాగ్రత్తలతోనే చాలా నొప్పులు నివారించవచ్చనీ, ఎప్పుడో వృద్ధాప్యంలో రావాల్సిన అరుగుదల సమస్యలను ముందే తెచ్చుకోకుండా రక్షించుకోవచ్చని తెలుసుకోవడం మేలు. అదెలాగో ఇప్పుడు చూద్దాం... సరిగ్గా నిలబడటం, నడిచేటప్పుడు ముందుకు లేదా పక్కకు ఒంగినట్లుగా కాకుండా సరిగ్గా నడవడం, కార్ లేదా బైక్ నడిపేటప్పుడు సరిగా కూర్చోవడం వల్ల ఒంటికి సంబంధించిన చాలా నొప్పులనూ, చాలా అరుగుదల సమస్యలను రాకుండా చూసుకు΄ోవచ్చు. ఇలా నడిచేటప్పుడు, నిలబడినప్పుడు, కార్ లైదా బైక్ నడిపేటప్పుడు మనం ఉండే శారీరక భంగిమల్లో (పోష్చర్స్‌లో) మన కండరాలు, ఎముకలపైన ఒత్తిడి పడుతుంటుంది. దాని కారణంగా ఆయా కండరాల్లో నొప్పులు రావడం లేదా అక్కడి ఎముకలు ఎప్పుడో చాలాకాలం తర్వాత అరగాల్సినవి కాస్తా ముందుగానే అరగడం జరగవచ్చు. తప్పుడు భంగిమల వల్ల కండరాల మీద పడే అలాంటి ఒత్తిడులను వీలైనంత తగ్గించగలిగితే / నివారించగలిగితే కండరాలనూ, లిగమెంట్లనూ, టెండన్లనూ చాలాకాలం బలంగా, పటిష్టంగా కా΄ాడుకోవచ్చు. దాంతో కండరాల నొప్పులు రాకుండా నివారించుకోవచ్చు. దీనికి కావల్సిందల్లా మనం సరిగ్గా నిలబడటం, సరిగా కూర్చోవడంలో సరైన భంగిమలు (పోష్చర్స్) పాటించడమే. ఇలా దేహ భంగిమను (పోష్చర్‌ను) ఎంత బాగా మెయింటెయిన్ చేసుటే ఎముకల అరుగుదల సమస్యలనూ (డీజనరేటివ్ ప్రాబ్లమ్స్‌ను), కండరాలపై పడే ఒత్తిడిని అంతగా నివారించుకోచ్చు అని తెలుసుకోవడం ముఖ్యం. సరైన పోష్చర్ అంటే... ఈ ప్రపంచంలోని ప్రతి వ్యక్తిపైనా భూమ్యాకర్షణ శక్తి ప్రతినిత్యం పనిచేస్తూ, ప్రతివారూ నిల్చున్నప్పుడు, కూర్చున్నప్పుడు, ఆఖరికి పడుకుని ఉన్నప్పుడు కూడా మనందరి మీదా ప్రభావంచూపుతూనే ఉంటుంది. తప్పుడు పద్ధతుల్లో నిలబడటం, కూర్చోవడం జరిగినప్పుడు ఆ ప్రభావం గరిష్టంగా ఉంటుంది. అందుకే అరుగుదల, కండరాలపై ఒత్తిడి దుష్ప్రభావం ఎక్కువ. దీనికి బదులు సరైన భంగిమల్లో నిలబడటం, కూర్చోవడం, వాహనం నడపడం, ఫోన్ మాట్లాడటం చేస్తుంటే అన్ని అవవయవాల మీద ఒత్తిడి సమంగా పడటంతో అరుగుదల, దుష్ప్రభావాలు ఒకేచోట కేంద్రీకృతం కావడం వంటి సమస్యలు ఉండవు. దాంతో నొప్పులూ, బాధలూ లేకుండా చాలాకాలం పాటు హాయిగా ఉండవచ్చు. సరైన పోష్చరల్ భంగిమలంటే ఏమిటో, అవి ఎలా ఉంటాయో తెలుసుకుందాం.చాలా సేపు నిలబడాల్సిన వాళ్లు ఎవరంటే... ఏదైనా వైకల్యమో లేదా ఆరోగ్య సమస్య ఉంటేనో తప్ప ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి వ్యక్తీ తన రెండు కాళ్లపై నిలబడటం మొదలుపెట్టిన నాటినుంచి సరిగా నిలబడటం నడవటం చేస్తుంటారు. ఇక ట్రాఫిక్‌లో నిలబడి డ్యూటీ చేసే పోలీసులు, ముఠాలు చెప్పడం కోసం బోర్డు దగ్గర లేదా టేబుల్ దగ్గర నిలబడే ఉపాధ్యాయులు / లెక్చరర్లు, సిటీ బస్సుల్లోని కండక్టర్లు, వంట చేసే మగవారు లేదా గృహిణులు, సేల్స్ గర్ల్స్, సేల్స్ బాయ్స్, మెషిన్ ఆపరేటర్లు... ఇలాంటి వారందరికీ తమ వృత్తులపరంగా చాలాసేపు నిలబడే ఉండాల్సిన అవసరముంటుంది. వీళ్లలో కాళ్లపైనా, ΄ాదాలపైనా ఒంటిబరువు చాలాసేపు పడటం వల్ల కాళ్లల్లో నీరసం, నిస్సత్తువ, కాళ్లవాపులు, వేరికోస్ వెయిన్స్, మెడనొప్పి, నడుమునొప్పి వంటి సమస్యలు వస్తుంటాయి.మంచి పోష్చర్‌లో నిలబడటం ఎలా? సరైన శారీరక భంగిమలో (మంచి పోష్చర్‌లో) నిలబడటం వల్ల కాళ్లు, కండరాలు, నడుము, మెడ వంటి అవయవాలపై తక్కువ భారం పడుతుంది. అలా తక్కువ భారం పడేలా సరైన రీతిలో నిలబడటానికి ఈ కింద పేర్కొన్న సూచనలు / జాగ్రత్తలు పాటించడం మేలు. అవి... నిలబడి చేసే పనులకు ఉపయోగించే ప్లాట్‌ఫారాన్ని (ఉదాహరణకు వంట చేసేవారు వంట టేబుల్, నిలబడి డ్రాయింగ్ వేసేవారు తమ ప్లాంక్ వంటి వాటిని) తమ ఎత్తుకు తగినట్లుగా అడ్జెస్ట్ చేసుకోవడం. నిలబడి ఉన్నప్పుడు ఎదురుగా ఉన్న రకరకాల వస్తువులను అందుకునే క్రమంలో పూర్తిగా ఒంగి తీసుకోవాల్సి వచ్చే దూరంగా ఉంచకుండా, తేలిగ్గా తీసుకునేంత దూరంలోనే వస్తువులను ఉంచుకోవడం. ఫ్లాట్‌ఫారమ్‌కు సరిగ్గా ఎదురుగా ఉండే పనులను చేసుకోవడం (ఉదాహరణకు వంట లేదా డ్రాయింగ్ వంటివి చేసేప్పుడు మీ ప్లాట్ఫారానికి పక్కగా ఉండకుండా ఎదురుగానే ఉండటం అవసరం). మడమలను పూర్తిగా ఫ్లాట్‌గా ఉంచకుండా వాటి కింద కాస్తంత ఎత్తుగా ఉండేలా చూసుకోవడం. (అయితే మడమల కింద ఉంచుకునే ఎత్తు మరీ ఎత్తుగా లేకుండా జాగ్రత్త పడటం). చాలాసేపు నిలబడి వంట చేయాల్సి వచ్చినప్పుడు ఒంటి బరువును కాళ్లపై మార్చి మార్చి వేస్తుండటం. (అంతేతప్ప... మొత్తం బరువును చాలాసేపు ఒకే కాలిపైన మోపడం సరికాదని గుర్తుంచుకోవాలి). నిలబడి చేసే పనులు (అంటే నిలబడి ఫ్లోరింగ్ శుభ్రం చేయడం, మాపింగ్, గార్డెనింగ్) వంటివి వీలైనంత నిటారుగా నిలబడే చేయడం. (అంతే తప్ప... చాలాసేపు ముందుకు ఒంగిపోయి చేయడం సరికాదు. అలా ఒంగిపోయి చాలాసేపు పనిచేయడం వల్ల వెన్నెముకపై ఎక్కువ భారం పడుతుందని తెలుసుకోవాలి).సరైన పోష్చర్‌లో కూర్చోవడమిలా...గతంతో పోలిస్తే ఇటీవలి కాలంలో కూర్చొని పనిచేసే ఉద్యోగాలే ఎక్కువ. అయితే ఇలా కూర్చుని పని చేసేటప్పుడు సరైన పోష్చర్‌లో కూర్చోకపోవడమే చాలా రకాల ఆరోగ్య సమస్యలకు మూలం. కూర్చుని కంప్యూటర్‌పై పనిచేసేవారు మొదలుకొని బల్లలపై కూర్చొని రాత పనిచేసే అనేక మందిలో సరిగా కూర్చోకపోవడం వల్లనే నడుమునొప్పి, కండరాల నొప్పులు, మెడ బిగుసుకుపోవడం (స్టిఫ్‌నెక్), తరచూ పాదాలకు తిమ్మిరిపట్టడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. ఇలా అదేపనిగా, సుదీర్ఘంగా కూర్చోవడం వల్ల భవిష్యత్తులో డయాబెటిస్, గుండెజబ్బులు, కొన్ని రకాల మానసిక సమస్యలూ వచ్చే అవకాశాలున్నాయి. కండరాలు, ఎముకలపై వీలైనంత తక్కువ భారం పడేలా కూర్చోవడం ఎలాగంటే... కుర్చీలో వీలైనంత నిటారుగా కూర్చోవాలి. అంతేతప్ప వెన్నుపై అధికమైన భారం పడేలా భుజాలను వేలాడేసి లేదా ఒంగి΄ోయి కూర్చోవడం సరికాదు.కంప్యూటర్ మానిటర్ సరిగ్గా ఉపయోగించేవారి కళ్లకు సరిగ్గా ఎదురుగా ఉండేలా అమర్చుకోవాలి. అంతే తప్ప మెడను బాగా ఎత్తిగానీ లేదా మెడను మరీ ఎక్కువగా ఒంచి చూసేలా దాన్ని అమర్చుకోకూడదు. కీబోర్డు చేతులకు, వేళ్లకు సౌకర్యంగా అందేలా ఉండాలి. కీబోర్డుపై పనిచేసే పమయంలో మోచేతులకు సపోర్ట్ ఉండేలా కూర్చీ తాలూకు హాండ్‌రెస్ట్‌లను అమర్చుకోవాలి. ఇలా చేయడం వల్ల చేతులు అలసిపోకుండా చాలాసేపు పని చేయడానికి వీలవుతుంది. కంప్యూటర్ పై పనిచేస్తున్నప్పుడు వీపును కుర్చీ తాలూకు బాక్‌రెస్ట్‌కు ఆనించి ఉంచాలి. అలాగని కుర్చీ బ్యాక్‌రెస్ట్ మరీ వెనక్కువాలి ఉండకూడదు. పనిచేసే సమయంలో వెనక్కు ఆనకపోవడం వల్ల భుజాలు, మెడ, వెన్ను సమస్యలు వచ్చే అవకాశముంది. నడుం కండరాలపై ఎక్కువ భారం పడి, ఎక్కువ శ్రమ కలుగుతుంది. పని చేసే సమయంలో కూర్చీ బ్యాక్‌రెస్ట్‌ను నిటారుగానే ఉంచి, వీపును దానికి ఆనించి ఉంచాలి. అప్పుడు వీపుకు తగినంత సపోర్ట్ దొరికి, వెన్నుపై భారం తగ్గుతుంది. కంప్యూటర్ అదేపనిగా కంటిన్యువస్‌గా ఉపయోగించడానికి బదులుగా ప్రతి గంటసేపు పని తర్వాత 10 నిమిషాలు విశ్రాంతి ఇవ్వడం మందిది. అది కూడా ఆ 10 నిమిషాలూ మళ్లీ కూర్చునే ఉండటానికి బదులుగా లేచి కాస్త అటు ఇటు తిరగడం మేలు. ఎదురుగా ఉన్న బల్లపైన మనం తరచూ ఉపయోగించే వస్తువులను మూడు అంచెల్లో పెట్టుకోవచ్చు. మొదటి అంచెలో అనుక్షణం అందుకునే వస్తువులు / పనిముట్లు / పుస్తకాలు / ఉపకరణాలు ఉంచుకోవాలి. రెండో అంచెలో తరచూ ఉపయోగించేవి పెట్టుకోవాలి. ఎప్పుడోగాని ఉపయోగించని వాటిని డెస్క్/టేబుల్‌కు అటు చివర ఉంచాలి. ఇలా మన వస్తువుల అమరిక ఉండటం వల్ల... వస్తువులను అందుకునే సమయంలో వెన్నుపై భారం చాలావరకు తగ్గుతుంది. కూర్చొని ఉన్నప్పుడు కాళ్లను ఫుట్‌రెస్ట్‌పైన కాస్తంత ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి. దాంతో వెన్ను/నడుము నొప్పి నివారించవచ్చు.కార్ డ్రైవింగ్‌లో పాటించాల్సిన పోష్చర్ జాగ్రత్తలు...డ్రైవింగ్ చేసే సమయంలో కారులో లేదా వాహనంలో కూర్చునే పోష్చర్ సరిగా లేకపోతే వెన్నుకు, మెడకు, నడుముకు సంబంధించిన చాలా సమస్యలు వచ్చేందుకు అవకాశాలెక్కువ.డ్రైవింగ్ సమయంలో సరిగా కూర్చోకపోతే... డ్రైవింగ్ పోష్చర్ సరిగా లేకపోతే ‘రిపిటిటివ్ డ్రైవింగ్ ఇంజ్యురీస్’ (ఆర్డీఐ) అనే సమస్యలు వస్తాయి. దాంతో మెడ బిగుసుకు΄ోవడం (స్టిఫ్‌నెక్), పాదాలు, కాళ్లకు తిమ్మిర్లు రావడం, భుజాలు నొప్పి పెట్టడం, మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి గురికావడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అందుకే కార్‌డ్రైవింగ్ చేసేవారు పోష్చర్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.డ్రైవింగ్‌లో సరిగా కూర్చోవడమిలా... ఫోర్‌వీలర్ డ్రైవింగ్ సమయంలో వెన్నుపైన సాధ్యమైనంత తక్కువ భారం పడేలా కూర్చోవడానికి పాటించాల్సిన సూచనలివి... డ్రైవ్ చేసేవాళ్లు సౌకర్యంగా కూర్చునేలా డ్రైవింగ్ సీట్ ఉండాలి. డ్రైవింగ్ చేసే సమయంలో స్టీరింగ్‌పై చేతులు పెట్టే పద్ధతి ఎలా ఉండాలంటే... మన డెస్క్‌పై చేతులు ఉంచినప్పటికంటే... స్టీరింగ్‌పై చేతులు కాస్త ఎత్తుగానే ఉండాలి. స్టీరింగ్ వీల్‌కూ, డ్రైవర్ ఛాతీకి మధ్య 25 – 30 సెం.మీ. (10 – 12 అంగుళాల) స్థలం ఉండేలా స్టీరింగ్ అడ్జెస్ట్ చేసుకోవాలి. డ్రైవ్ చేసేవారు ఎలా కూర్చోవాలంటే... స్టీరింగ్‌వీల్ ఎట్టిపరిస్థితుల్లో తమ కాళ్లకు ఆనకుండా చూసుకోవడం అవసరం. అలా స్టీరింగ్ వీల్‌కూ తమ దేహానికి మధ్య అవసరమైనంత స్థలం ఉన్నప్పుడు స్టీరింగ్‌ను సౌకర్యంగా తిప్పడానికీ, ప్రమాదం జరిగినప్పుడు ఎయిర్‌బ్యాగ్ తెరుచుకోడానికీ వీలుగా ఉండి, ప్రమాదం జరిగినప్పుడు డ్రైవింగ్ చేసేవారికి ఎక్కువ రక్షణ కలుగుతుంది. కారు కుదుపుల్లో సైతం కాళ్లకు స్టీరింగ్‌కు ఆనకూడని విధంగా సీట్, స్టీరింగ్‌వీల్ అడ్జెస్ట్ చేసుకోవాలి. వాహనం ఆగాక డ్రైవింగ్ చేసేవారు చాలా సౌకర్యంగా దిగగలిగే విధంగా కారు సీట్ ఉండాలి. స్టీరింగ్‌కూ, సీట్‌కూ మధ్య... డ్రైవ్ చేసే వ్యక్తి దిగేందుకు అనువుగా ఉండేంత స్థలం ఉండాలి. డ్రైవింగ్ చేసేవారు... మరీ 90 డిగ్రీలు నిటారుగా కూర్చొని డ్రైవ్ చేయడమూ సరికాదు. కాస్తంత వెనక్కు వాలి సౌకర్యంగా కూర్చుని డ్రైవ్ చేయాలి. అయితే డ్రైవింగ్ సీట్లో అలా వెనక్కి వాలినప్పుడు ఆ కోణం 120 డిగ్రీలకు మించకూడదు. డ్రైవింగ్ సీట్ వర్టికల్‌గా డ్రైవింగ్ చేసేవారి వెన్నుకూ, కింది భాగంలో వారి తొడలకు మంచి సపోర్ట్ ఇవ్వాలి. అలా మంచి సపోర్ట్ ఇచ్చేలా సీట్ కుషన్ ఉండటం మేలు. డ్రైవ్ చేసేప్పుడు తప్పనిసరిగా సీట్‌బెల్ట్ పెట్టుకోవాలి. బ్రేక్, క్లచ్ పెడల్స్ వంటి కారు భాగాలన్నీ డ్రైవింగ్ చేసేవారి కాళ్లకు సౌకర్యంగా తక్షణం అందేలా డ్రైవింగ్ సీట్ అమర్చుకోవాలి.టూవీలర్ (బైక్) డ్రైవింగ్‌లో పోష్చర్ ఇలా... సాధారణంగా బైక్‌ల తయారీదారులు హ్యాండిల్‌బార్స్, ఫుట్‌రెస్ట్ వంటి భాగాల అమరికలో కొన్ని ప్రమాణాలను పాటిస్తుంటారు. వాటిని అనుసరించడం వల్ల చాలా సమస్యలు రావు. అయితే బాగా స్టైల్‌గా కనిపించడం కోసం కొంతమంది తమ బైక్ హ్యాండిల్ బార్స్‌ను, సీట్ కోణాన్ని రకరకాలుగా మార్చి అమర్చుకుంటూ ఉంటారు. ఉదాహరణకు పొట్టి హ్యాండిల్ బార్స్ వాడటం, సీట్‌ను మరీ ఏటవాలుగా ఉండేలా అమర్చుకోవడ వంటివి చేస్తుంటారు. అలా కాకుండా బైక్ తయారీదారులు ప్రామాణికంగా ఉంచిన విధంగానే హ్యాండిల్‌బార్స్, ఫుట్‌రెస్ట్‌లు ఉంచుకోవడం మేలు. మరీ ఇబ్బందిగా ఉంటేనే తప్ప వాటిలో వ్యక్తిగతమైన మార్పులు చేసుకోకపోవడమే మంచిది. బైక్ వాడుతున్నప్పుడు నడుమునొప్పి, వెన్నునొప్పి వస్తుంటే... డ్రైవింగ్ చేసేవారికి బైక్ సీట్ అనువుగా, సౌకర్యంగా ఉండేలా కొన్ని మార్పులు చేసుకోవడం మంచిది. అవి... బైక్‌ల హ్యాండిల్స్ తగినంత విశాలంగా, రెండు చేతులు సరైన గ్రిప్ ఉండేలా పట్టుకోవడానికి వీలుగా ఉండాలి. పొట్టిగా ఉండే షార్ట్‌హ్యాండిల్స్ వల్ల ముందుకు ఒంగిపోవడంతో ఒంటిపై భారం పడి శరీరభాగాల్లో నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ. హ్యాండిల్ పట్టుకున్నప్పుడు డ్రైనింగ్ చేసేవారు తమ దేహం నిటారుగా ఉండేలా కూర్చోవాలి. అయితే ఇటీవల కొన్ని స్పోర్ట్స్ బైక్‌లలోని సీట్లు, హ్యాండిల్ బార్స్ శరీరం బాగా ముందుకు వాలిపోయి ఉండేలా మార్పులు చేస్తున్నారు. ఇలా వాలిపోయినట్లుగా కూర్చొనేలా రూపొందించిన ఫ్యాషన్ బైక్స్ వల్ల వెన్ను నిటారుగా ఉండకపోవడంతో వెన్ను నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి హ్యాండిల్‌బార్‌నూ, సీట్లను అలాంటి ఫాల్టీ పోష్చర్స్కు అవకాశమిచ్చేలా అమర్చుకోవడం సరికాదు. కాళ్లు పెట్టుకునే ఫుట్‌రెస్ట్ మన శరీరానికి మరీ దూరంగా ఉండకూడదు. దీనివల్ల కాళ్లు సాగినట్లుగా అయి΄ోయి నడుముపై భారం ఎక్కువగా పడుతుంది. దాంతో నడుమునొప్పి వచ్చేందుకు అవకాశం ఉంది. కాళ్లతో బ్రేక్ వేయడానికీ, గేర్లు మార్చడానికీ సౌకర్యంగా, వీలుగా ఉండేలా ఫుట్‌రెస్ట్‌లు ఉండాలి. చాలామంది బైక్‌లపై ప్రయాణాలు చేసేవారు తమ వీపుపై ఉండే బ్యాగ్స్ (బ్యాక్΄్యాక్స్) పెట్టుకొని వెళ్తుండటం ఇటీవల చాలా సాధారణంగా కనిపించే దృశ్యం. ఈ భారం నడుంపై ఎక్కువగా పడటం వల్ల కూడా నొప్పి రావచ్చు. ఇలాంటివారు ఆ బ్యాగ్ భారం వీపుపై కాకుండా, అది సీట్‌పై ఆనేలా చూసుకోవడం చాలా మంచిది. పైన పేర్కొన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వీలైనంత ఎక్కువ కాలం పోటు నొప్పులు రాకుండా కండరాలను సంరక్షించుకోవడం, ఎముకలు అరగకుండా నివారించుకోవడం సాధ్యమవుతుందని గుర్తుపెట్టుకోవాలి. సెల్‌ఫోన్ వాడకంలోజాగ్రత్తలివి...ఇటీవల టూవీలర్ డ్రైవ్ చేస్తుండే వాళ్లు అలాగే డెస్క్ మీద కంప్యూటర్‌పై పనిచేస్తూనే భుజానికీ చెవికీ మధ్య సెల్‌ఫోన్ ఉంచుకుని, మెడతో ఆ ఫోన్‌ను నొక్కిపట్టి ఉంచి మాట్లాడటం చేస్తుంటారు. అది సరికాదు. ఇందుకు బదులుగా వాహనం ఆపి ఉన్నప్పుడు ఇయర్‌ఫోన్స్ వాడటమన్నది మెడ, వెన్ను ఆరోగ్యానికి చాలా మంచిది. డ్రైవింగ్ చేస్తూ ఇయర్‌ఫోన్స్‌తోగాని మరే రకంగానూ సెల్‌ఫోన్ మాట్లాడకూడదు. పైగా అది చట్టరీత్యా నేరం. అలాగే అది ప్రాణానికి ప్రమాదం కూడా. సెల్‌ఫోన్‌ను ఉపయోగించే సమయంలో బొటనవేలిని మాటిమాటికీ వాడుతుండటం వల్ల బొటనవేలి వెనక ఉండే టెండన్ ఇన్ఫ్లమేషన్కు గురై వాపు వస్తుంది. అ తర్వాత కూడా అదేపనిగా దాన్ని ఉపయోగించడం వల్ల ఆ గాయం మానకుండా మాటిమాటికీ తిరగబెడుతుంది. దీన్నే బ్లాక్‌బెర్రీ థంబ్ లేదా గేమర్స్ థంబ్ అంటారు. అందుకే వీలైనంత వరకు అత్యవసర పరిస్థితుల్లోనే సెల్‌ఫోన్ ఉపయోగించాలి. సెల్‌ఫోన్ సంభాషణలు వీలైనంత క్లుప్తంగా ఉండేట్లుగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫోన్లో ఎక్కువగా మాట్లాడటం కన్నా మెసేజ్‌లనే ఎక్కువగా అలవాటు చేసుకోవడం మంచిది. అయితే ఇలా మెసేజ్‌లు ఇచ్చేటప్పుడు మెడను హానికరమైన కోణాలలో ఒంచకూడదు. మీ మెడను ఎంతగా ఒంచితే వెన్నుపై పడే భారం అంతగా పెరుగుతుందని గుర్తుంచుకోవాలి. సెల్‌ఫోన్ నెంబరును బాగా సన్నిహితులకు మాత్రమే ఇవ్వడం వల్ల అనవసరమైన కాల్స్‌ను అవాయిడ్ చేయవచ్చు. పొద్దున్నే లేవడానికి అలారం మొదలుకొని... రిమైండర్లు, ఆటలు, పాటలు, కాలిక్యులేటర్... ఇలా ప్రతిదానికీ సెల్‌ఫోన్ మీదే అతిగా ఆధారపడటం అంత మంచిది కాదు. అది వెన్నుకు చేటు చేయడంతోపాటు సెల్‌ఫోన్ అడిక్షన్‌కు దారితీయవచ్చు. -
రన్ ఫర్ హెల్త్..
అత్యవసర ఆరోగ్య సంరక్షణ, ప్రాముఖ్యతను చాటిచెప్పేందుకు హోండా బిగ్‌వింగ్ డీలర్ షిప్‌లు, ఆటోఫిన్ హోండా, జేఎస్పీ హోండా, ఫార్చ్యూన్ హోండా బిగ్‌వింగ్ సంయుక్తంగా 10కే రన్ విజయవంతంగా నిర్వహించారు. గచ్చిబౌలిస్టేడియంలో ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ఔత్సాహికులు పాల్గొన్నారు. రన్నర్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. ఫార్చ్యూన్ హోండా నీరవ్‌మోడి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ అత్యవసర ఆరోగ్య సంసరక్షణపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. హోండా బిగ్‌వింగ్ ప్రయత్నంలో భాగంగా దీనిని ఏర్పాటు చేశామన్నారు. దీనిని యేటా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటా మన్నారు. కార్యక్రమం ద్వారా వచ్చిన నిధులను మొత్తం ఆరోగ్య సంరక్షణకు ఉపయోగించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆయా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. హైటెక్‌సిటీలో 5 కె రన్.. మాదాపూర్ : ఐటీ ఉద్యోగులు 5 కె రన్లో పలువురు రన్నర్లు ఉత్సహంగా పాల్గొన్నారు. మాదాపూర్‌లోని హైటెక్‌సిటీ యశోధహస్పిటల్ వద్ద ఆదివారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా 5 కె రన్ నిర్వహించారు. టీసీఎస్ ఉద్యోగులు 8500 మంది పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐటీ ఉద్యోగుల ఆరోగ్యంపై ప్రముఖ డాక్టర్లు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అభినవ్, టీసీఎస్ అధ్యక్షుడు వి.రాజన్న, ఐటీ ఉద్యోగులు పాల్గొన్నారు. -
ఆవు పిడకలు...ఆరోగ్యం..!
ఆవుపేడ కదా అందులో ఏముంది అనుకునే వారికి దాని విలువ తెలియకపోవచ్చు.. ముందు తరాలవారు దాని విశిష్టతను గుర్తించారు. వారికి దాని ఉపయోగాలు తెలుసు..అందుకే ఆవు పేడ నీటితో కళ్లాపి చల్లేవారు.. పేడ అలికిన ఇల్లు శుభదాయకమని చెప్పేవారు. మట్టి గోడలకు పేడను అలికేవారు.. ఇలా క్రిమి కీటకాలను ఆవుపేడ నశింపజేస్తుందని వారు ముందే పసిగట్టారు. పేడ విలువను గుర్తించిన నేటితరం ఆవుపేడతో చెయ్యలేనిది ఏమీ లేదని నిరూపిస్తున్నారు. ఇప్పటికే ఆవు పేడతో సేంద్రియ ఎరువులు, బయోగ్యాస్ , పిడకలు, విభూతి, పళ్లపొడి, రాఖీలు, ప్రమిదలు, బొమ్మలు, దేవుళ్ల ప్రతిమలు, కుండీలు, జపమాలలు, అగరొత్తులు అంటూ ఎన్నో రకాలుగా ఆవు పేడను వినియోగిస్తున్నారు. ఇలా ఆవు పేడలో మూలికలు కలిపి అగ్నిహోత్ర పిడకలు తయారు చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు రాజుల కండ్రిగ రైతు సుబ్బరాజు. పీల్చే గాలి కూడా ఆరోగ్యాన్ని ఇవ్వాలనే సదుద్దేశంతో పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా, నగరి మండలం రాజులకండ్రిగకు చెందిన రైతు సుబ్బరాజు అగ్నిహోత్ర పిడకలు తయారు చేస్తున్నారు. రైతుగా సేంద్రియ పద్ధతిలో నూతన పంటలు సాగు చేసి అందరి మెప్పు పొందిన ఆయన పాడి రైతుగాను ఆరోగ్యమిచ్చే అంశాలపైనే దృష్టిసారించారు. హోమ పూజలు, ఇళ్లలో దూపం వేసే సమయంలోనూ వచ్చే పొగ ఆరోగ్యాన్ని ఇవ్వాలనుకునే ఆయన పర్యావరణ రక్షణకు సంబంధిత ఆయుర్వేద గ్రంథాలు చదవడం, సంబంధిత శాఖలోని వారిని కలిసి వారి వద్ద సలహాలు, సూచనలు పొంది అగ్నిహోత్ర పిడకల తయారీకి పూనుకున్నారు. కష్టంతో కూడుకున్న పనే అయినా పర్యావరణ రక్షణపై ఉన్న వ్యామోహంతో ఇంటి వద్దే ఒక పాక వేసుకొని అగ్నిహోత్ర పిడకల తయారీ చేస్తున్నారు. ఒక్కో పిడక రూ.30 10 కిలోల ఆవు పేడతో పిడకలు తయారు చేయాలంటే 3 కిలోల నెయ్యి , పాలు, పెరుగు, పంచితం అవసరం. వీటితో పాటు వేసే మూలికలు స్థానికంగా లభించవు. కొన్ని వస్తువులు చెన్నైలోని ఆయుర్వేద షాపునకు వెళ్లి తీసుకొస్తున్నారు. ఇలా తయారు చేయాలంటే ఒక్కో పిడకకు రూ.25 ఖర్చు అవుతోందని చెబుతున్నారు. వీటిని రూ.30కి విక్రయిస్తున్నారు. లాభాల కన్నా ఆరోగ్యం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నట్లు రైతు సుబ్బరాజు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చుట్టు పక్కల ఉన్న ఆలయాలలో జరిగే హోమ పూజలు, ఇళ్లలో జరిగే పూజలకు వాడటంతో పాటుతో తమిళనాడు, కర్ణాటకలలో జరిగే హోమ పూజలకు అగ్నిహోత్ర పిడకలు నగరి నుంచి తీసుకొని వెళతారు. ఒక్కసారి ఈ పిడకలు వాడి వాటి ప్రయోజనాలు తెలుసుకున్నవారు వాటిని వదలరు. తయారీ ఇలా.... దేశీవాళీ గిర్ ఆవుల పేడలో నెయ్యి, పాలు, పెరుగు, పంచితం, హోమ ద్రవ్యాలైన రావి, మోదుగ, జమ్మి, అర్క, గరిక, దర్భ, మేడి, చండ్ర, సరస్వతీ, తామర మొదలగు సమిధలతో పాటు సాంబ్రాణి, సర్జారసం, తెల్ల గుగ్గులు, వస, జటామాన్సి, ఆవాలు, కస్తూరి పసుపు, అపరాజిత, వేప, సుగంధి పాల, గ్రంథి తగర, చెంగాల్వ కోస్తు, పచ్చ కర్పూరం మొదలగు సుగంధ భరిత ద్రవ్యాలను కలిపి ముద్దలు చేసి కావాల్సిన ఆకారంలో చేసి ఎండబెడతారు. ఇలా శాస్త్రోక్తంగా పవిత్రంగా ఈ పిడకలు తయారవుతాయి. కావాల్సిన సామగ్రి సమకూర్చడానికి మాత్రమే ఎక్కువ సమయం పడుతుంది. అన్ని వస్తువులు ఉంటే రోజుకు ఒక మనిషి 300 పిడకలు చేసి ఎండబెట్టవచ్చు.వినియోగించడం ఎలా.. ఇంట్లో హోమ ద్రవ్యంగాను , అగ్నిహోత్రంగా, ధూపంగా వేసినట్లైతే మూలికలతో తయారైన ఈ పిడకల నుంచి వచ్చే పొగ రోగ కారక క్రిములను అంతరిపంజేసి, వాతావరణ కాలుష్యం నివారించి ప్రాణవాయువు అయిన ఆక్సిజన్ విరివిగా లభిస్తుంది. ఆరోగ్యంతో పాటు సుగంధ భరితమైన సువాసనలతో ఇంటి వాతావరణం ఆధ్యాత్మికతను సంతరించుకుంటుంది. ఆరోగ్యం కోసమే చేస్తున్నా ఆరోగ్యకరమైన పంటల కోసం ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా. అలాగే గాలి కూడా వీలైనంత మేర ఆరోగ్యకరంగా ఇవ్వాలనే ఆలోచనే ఈ పిడకల తయారీకి దారి తీసింది. పూర్వీకులు ఉదయాన్నే సూర్యుడి నుంచి వెలువడే అతినీల లోహిత కిరణాల నుంచి వెలువడే రేడియేషన్‌ను నిర్మూలించేందుకు ఆవుపేడను నీళ్లలో కలిపి కళ్లాపి చల్లేవారని ఈ మధ్య కాలంలో జరిపిన ప్రయోగాల్లో కనుగొన్నారు. ఒక పిడక మీద సెల్ ఫోన్ ఉంచినప్పుడు అది వెలువరించే రేడియేషన్ పరిమాణం తగ్గినట్లు గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపినట్లు పత్రికల్లో చదివాను. ఆయుర్వేద గ్రంథాలలో వాయు కాలుష్య నివారణకు సూచించిన మార్గాలను తెలుసుకొని ఆయుర్వేదానికి సంబంధించి కొందరి సలహాలతో అగ్నిహోత్ర పిడకలను తయారు చేస్తున్నా. లాభాల కన్నా ఆరోగ్యం ఇవ్వాలనే ఉద్దేశంతోనే వీటిని తయారు చేస్తున్నా. – సుబ్బరాజు, పాడి రైతు, రాజులకండ్రిగ (చదవండి: సరికొత్త మ్యూజిక్ థెరపీ..'జెంబే'..! ఆ వ్యాధులను నయం చేస్తుందట..!) -
సరికొత్త మ్యూజిక్ థెరపీ..'జెంబే'.. ఆ వ్యాధులను నయం చేస్తుందట..!
ఉరుకుల పరుగుల జీవనంలో ఉల్లాసం కావాలి. వారంలో ఒక్కరోజైనా, ఒక్క పూటైనా ఒత్తిడి నుంచి విముక్తి కావాలి. అందుకే నగరవాసులు ఎల్లప్పుడూ ఆసక్తికరమైన ప్రత్యామ్నాయ చికిత్సల కోసం అన్వేషిస్తూ ఉంటారు. అలాంటి అన్వేషణ ఫలాల్లో ఇప్పుడు, ఆఫ్రికన్ డ్రమ్ అయిన జెంబే ఒకటిగా నిలిచింది. మ్యూజిక్ థెరపీలో భాగంగా దీనిని నగరవాసులు ఆస్వాదించడం పెరుగుతోంది. చక్కని సంగీతం వినడం మనసుకు ఆహ్లాదాన్ని అందిస్తుందని కొత్తగా చెప్పనక్కర్లేదు. అయితే సంగీత వాయిద్యాన్ని పలికించడం కూడా అంతకు మించిన ఆహ్లాదాన్ని ఆరోగ్యాన్ని అందిస్తుంది అని జెంబే (Djembe) నిరూపిస్తోంది. ఇప్పటికే ముంబై వంటి నగరాల్లో బహిరంగ ప్రదేశాల్లో, ముఖ్యంగా మాల్స్‌లో సర్వసాధారణంగా జెంబే సంగీత కార్యక్రమం ఇప్పుడిప్పుడే హైదరాబాద్ (Hyderabad) నగరంలోనూ ప్రాచుర్యం పెంచుకుంటోంది. డ్రమ్ మారో డ్రమ్.. సంగీత పరికరమైన డ్రమ్ – దాని అంతర్గత లయ స్వభావం కారణంగా – దానిని పలికించే వారికి ఆరోగ్య ప్రయోజనం చేకూరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. నిజానికి గిటార్ లేదా హార్మోనికాతో పోలిస్తే సరళమైన సంగీత వాయిద్యం డ్రమ్స్. దీనిని పలికించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి సైకోథెరపిస్ట్ నీతా మాట్లాడుతూ, ‘డ్రమ్ శిక్షణ స్ట్రోక్ పేషెంట్లకు పార్కిన్సన్స్ వ్యాధి ఉన్నవారికి సైతం ఉపయుక్తం. నడక, చేయి నియంత్రణ ద్వారా వారికి ప్రయోజనం చేకూరుస్తుంది. వారి కదలికల్లో ఖచ్చితత్వం, వేగం, సున్నితత్వాన్ని మెరుగుపరుస్తుంది’ అంటున్నారు. ‘ఇది మెదడులో డోపమైన్ (Dopamine) స్థాయిలను పెంచుతుంది. అయితే అధికంగా డ్రమ్మింగ్ మీద ఆధారపడితే మాత్రం ప్రయోజనకరంగా ఉండకపోవచ్చు’ అని కూడా నీతా చెబుతున్నారు. ఒంటరిగా డ్రమ్మింగ్ (Drumming) చేయడం ఏకాగ్రతను పెంచుతుంది, లోతైన శ్వాస ద్వారా మెరుగైన ఆక్సిజన్ ప్రవాహాన్ని ప్రోత్సహిస్తుంది. ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. సమన్వయ శక్తిని పెంచుతుంది. ప్రస్తుతంలో జీవించడం (మైండ్ ఫుల్ నెస్) సాధనలో సహాయపడుతుంది. స్నేహితులు లేదా ఇతరులతో కలిసి ప్లే చేయడం ఉత్తమ మార్గం. ఇందులో పాల్గొనేవారు అతని/ఆమె సౌలభ్యం, నైపుణ్యం ప్రకారం వాయిద్యాన్ని పలకిస్తారు కాబట్టి ఇది బంధాలను బలపరుస్తుంది, సహనాన్ని అలవరుస్తుంది. అపరిచితులను ఒకచోట చేర్చడం ద్వారా నలుగురిలో కలవడానికి ఇబ్బంది పడే వ్యక్తులకు ఆ ఫీలింగ్ పోయేలా చేస్తుంది. ఆఫ్రికాలో సందేశాలు పంపే సంగీతం.. జెంబే పశ్చిమ ఆఫ్రికాలో, ముఖ్యంగా మాలి, గినియా ఐవరీ కోస్ట్ ప్రాంత మూలాలను కలిగి ఉంది. వివాహాలు, దీక్షా ఆచారాల వంటి ఉత్సవ సందర్భాల్లో ఈ డ్రమ్ వాయించడం సంప్రదాయం. వీటి ధ్వని మైళ్ల దూరం వినబడుతుందట. అందుకని, సుదూర ప్రాంతాల్లో ముఖ్యమైన సందేశాలను చేరవేయడానికి కూడా ఉపయోగిస్తారట. కాలక్రమేణా, జెంబే ఆఫ్రికా ను దాటి ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకూ వ్యాపించింది. పశ్చిమ ఆఫ్రికాలో ప్రాచుర్యం పొందిన వాయిద్యాల్లో జెంబే ఒకటి. గోబ్లెట్ ఆకారపు ఈ డ్రమ్ ఆఫ్రికాలోని డిజాలా/లెంకె చెట్టుకు చెందిన సింగిల్ పీస్ హార్డ్ వుడ్‌తో తయారవుతుంది. పైభాగం.. అంటే డ్రమ్‌హెడ్ గొర్రె/జంతు చర్మంతో రూపొందుతుంది. పెర్కుషన్ వాయిద్యం.. ఆరోగ్యమార్గం.. ‘దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన జెంబే ఒక పెర్కుషన్ వాయిద్యం. జాజ్, తబలా మృదంగం పెర్కుషన్ రంగంలో బాగా తెలిసిన ఎంపికలు అయితే, జెంబే నన్ను ఆకర్షించింది. అప్పటికే దీనిలో రాణిస్తున్న ఓ దక్షిణాఫ్రికా స్నేహితుడి ప్రోద్బలంతో దీన్ని సాధన చేశాను. సంగీతంలో పీహెచ్డీ చేశాను. మన శరీరంలోని ఏడు చక్రాల ప్రాముఖ్యతను నేను గుర్తించాను. హైదరాబాద్ నగరంలో తొలిసారి జెంబే ద్వారా మ్యూజికల్ థెరపీని పరిచయం చేశాను. ఇది మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి, ఒత్తిడి నిర్వహణలోనూ ఉపకరిస్తుంది. లయ ఆనందం ద్వారా ప్రజలను కనెక్ట్ చేసే అద్భుతమైన వాయిద్యం జెంబే. అన్ని వయసుల వారికీ సంగీతం తాలూకు మ్యాజిక్‌ను అందించడాన్ని లక్ష్యంగా పెట్టుకుని కొంతకాలంగా నగరంలోని పాఠశాలలు కళాశాలల్లో ప్రదర్శనలు, వర్క్‌షాపులు నిర్వహిస్తున్నాం. – సాయి కుమార్, ది జెంబే సర్కిల్ వ్యవస్థాపకుడు ఎవరికి నప్పదు.. అంటే.. పెద్దపెద్ద శబ్దాలకు వ్యతిరేకంగా స్పందించే స్వభావం కలిగినవారు.. అలాగే.. భుజం కీళ్లు, మోచేతులు లేదా మణికట్టుకు గాయాలు, లేదా ఇతర సమస్యలు ఉన్నవారికి ఈ జెంబే నప్పదు. అలాగే కార్డియో యాక్టివిటీని తక్కువగా మాత్రమే చేయాలని వైద్య సలహా పొందిన వారు కూడా దీని జోలికి వెళ్లకపోవడమే మంచిది. చదవండి: అక్కడ న్యూ ఇయర్‌కి శుభాకాంక్షలు చెప్పుకోరు..! ఏం చేస్తారో తెలిస్తే షాకవ్వుతారు -
కాబోయే తల్లులు యాంటీబయాటిక్స్ వాడితే..!
ఏ చిన్న ఇన్ఫెక్షన్ లేదా ఏ ఆరోగ్య సమస్య వచ్చినా చాలామంది అడపదడపా యాంటీబయాటిక్ టాబ్లెట్లు వేసుకుంటూ ఉంటారు. కానీ గర్భవతుల విషయంలో వాళ్లు ఇలా చేయడం ఎంతమాత్రమూ సరికాదు. ఎందుకంటే యాంటీబయాటిక్స్ మాత్రమే కాకుండా డాక్టర్ సలహా సూచన లేకుండా ఏ టాబ్లెట్‌ను కూడా గర్భవతులు వాడకూడదు. ఆ టాబ్లెట్స్ వాళ్లకు ఎంతో కీడు తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. గర్భవతులు యాంటీబయాటిక్స్ వాడితే ఆ దుష్ప్రభావం కడుపులోని బిడ్డపై పడి... ఆ చిన్నారికి ఎన్నో రకాల కీడు జరిగే అవకాశముంటుంది. ఉదాహరణకు కాబోయే తల్లులు యాంటీబయాటిక్స్ వాడితే... అవి బిడ్డ ఎముకల ఎదుగుదలకు అవరోధంగా పరిణమించవచ్చు. దాంతో బిడ్డ అవయవ నిర్మాణంలోనే లోసాలు (అనటామికల్ అబ్నార్మాలిటీస్) వచ్చి, కొన్ని అవకరాలు వచ్చే అవకాశముంది. కాబోయే తల్లి స్ట్రెప్టోమైసన్ వాడటం వల్ల బిడ్డకు వినికిడి లోపాలు వచ్చే అవకాశాలుంటాయి. తల్లులు వాడే టెట్రాసైక్లిన్ అనే యాంటీబయాటిక్ కారణంగా బిడ్డ దంతాలకు రావాల్సిన సహజమైన రంగు రాక΄ోవచ్చు. కొన్ని సందర్భాల్లో బిడ్డకు వచ్చే ఆ దంతాలు తమ సహజమైన మెరుపును కోల్పోవచ్చు. సల్ఫోనమైడ్స్ అనే యాంటీబయాటిక్స్ కారణంగా బిడ్డ పుట్టిన నెలలోపే వారికి కామెర్లు రావచ్చు. అయితే ప్రెగ్నెన్సీలో సైతం తీసుకోదగిన కొన్ని సురక్షితమైన యాంటీబయాటిక్స్ కూడా ఉంటాయి. అంటే... గర్భవతి ఏ త్రైమాసికంలో ఉందో దాన్ని బట్టి కొన్ని యాంటీబయాటిక్స్‌ను గర్భవతులకు సురక్షితంగా వాడుకోదగ్గవి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అందువల్ల గర్భిణికి యాంటీబయాటిక్స్ వాడాల్సిన పరిస్థితి వస్తే డాక్టర్ల పర్యవేక్షణలో వాటిని వాడాల్సి ఉంటుంది. అలాంటివి వాడుకోవచ్చు.(చదవండి: సమ్మర్లో వర్కౌట్లు చేసేటప్పుడూ..బీ కేర్‌ఫుల్ ..!) -
తడిసి ముద్దైపోయేలా చెమటలు పడుతున్నాయా..?
చెమట పట్టడం అందరిలో కనిపించే ఓ జీవక్రియ. వాతావరణంలో వేడిమి పెరిగినప్పుడు దానికి తగ్గట్లుగా దేహ ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. దాన్ని క్రమబద్ధీకరించేందుకు చెమటలు పట్టి... అవి దేహంలోని ఉష్ణోగ్రతను గ్రహించి ఆవిరి కావడంతో దేహం చల్లబడుతుంది. ఇదే పని వ్యక్తులు శారీరక శ్రమ చేసినప్పుడూ, బాగా ఆటలాడినప్పుడూ జరుగుతుంది. అంతేకాదు... బాగా ఆందోళనకు గురైనప్పుడు, భయపడ్డప్పుడు చెమట పడుతుంది. ఇది మానవ మనుగడకు ప్రకృతి చేసిన ఏర్పాటు. కొందరిలో అతిగా చెమటలు పడుతుంటాయి. ఇలా ఎందుకు జరుగుతుందో, ఇలాంటివారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్సలు తెలిపే కథనమిది. మనుషుల్లో ఎక్రైన్ అలాగే అపోక్రైన్ గ్లాండ్స్ అనే రెండు రకాల గ్రంథులుంటాయి. వీటిల్లో ఎక్రైన్ గ్లాండ్స్ అనే చెమట గ్రంథులు పుట్టినప్పటి నుంచీ ఒంటి నిండా వ్యాపించి ఉంటాయి. అయితే అపోక్రైన్ గ్రంథులనేవి బాహుమూలల్లోనూ, ప్రైవేట్ పార్ట్స్ దగ్గర ఉండి, కొంతకాలం తర్వాత (అంటే ముఖ్యంగా యుక్తవయసుకు వచ్చాక) అవి క్రియాశీలమవుతాయి. అందుకే చిన్నప్పుడు కాకుండా యుక్తవయసుకు వచ్చాకే బాహుమూలాల్లోనూ, ప్రైవేట్ పార్ట్స్ దగ్గర చెమట పట్టడం మొదలవుతుంది. చెమటలు పట్టడం కొందరిలో మరీ ఎక్కువ...కొందరిలో చెమట పట్టడం చాలా ఎక్కువగా జరుగుతుంటుంది. చెమటలు ఎక్కువగా పట్టడం వల్ల చాలా సమస్యలూ ఎదురవుతాయి. కొందరిలో అరికాళ్లు తేమగా అవుతుంటాయి. మరికొందరిలో అరచేతుల్లో చెమటలు ఎక్కువగా పట్టడంతో ఏది పట్టుకున్నా తడిసిపోవడం, జారిపోవడం కూడా జరుగుతుంటుంది. ‘హైపర్ హిడరోసిస్’లో మళ్లీ రెండు రకాలు. అవి... జనరలైజ్డ్ హైపర్ హిడరోసిస్ (దేహమంతటా విపరీతంగా చెమటలు పట్టడం) లోకలైజ్డ్ హిడరోసిస్ (దేహంలోని కొన్ని చోట్లలోనే చెమటలు ఎక్కువగా పట్టడం). జనరలైజ్డ్ హైపర్ హిడరోసిస్‌కి కారణాలు... చలికాలంలో వాతావరణం చల్లగా ఉన్నందున చెమటలు పట్టడం పెద్దగా జరగదు. కానీ వేసవిలో... అందునా మార్చినుంచి వాతావరణంలో వేడిమి పెరగడంతో విపరీతంగా చెమటలు పడుతుంటాయి. చెమటలకు మరికొన్ని కారణాలు... విపరీతమైన దేహశ్రమ లేదా వ్యాయామం తర్వాత వైరల్ ఫీవర్స్, మలేరియా, క్షయ వంటి జబ్బులతో జ్వరం వచ్చి తగ్గాక గుండెకు సంబంధించిన వ్యాధుల్లో అంటే షాక్, హార్ట్ ఫెయిల్యూర్స్‌లో ఎండోక్రైన్ లేదా హార్మోనల్ డిజార్డర్స్‌లో (అంటే హైపర్ పిట్యుటరీజమ్, హైపర్‌థైరాయిడిజమ్, ఇన్కసులినోమా, డయాబెటిస్ వంటి సమస్యల్లో) లింఫోమా, కార్సినాయిడ్ సిండ్రోమ్ వంటి క్యాన్సర్లు ఉన్నవారిలో గర్భిణుల్లో అలాగే మెనోపాజ్‌కు దగ్గరవుతున్నప్పుడు స్థూకాలయం ఉన్నవారిలో మద్యం తాగాక ఫ్లూయాక్సిటిన్ వంటి మందులు వాడుతున్నప్పుడు పార్కిన్సన్స్ జబ్బులున్నవారిలో, వెన్నెముక దెబ్బతినడం వంటి న్యూరలాజికల్ సమస్యలున్నవారిలో చెమటలు ఎక్కువగా పడుతుంటాయి.లోకలైజ్డ్ హైపర్ హిడరోసిస్ రకాలు... ఎమోషనల్ ఆర్ ఎసెన్షియల్ హైపర్ హిడరోసిస్ : తీవ్రమైన ఉద్విగ్నత ఉన్నప్పుడు లేదా ఉద్వేగాలు లేదా భయాలకు లోనైనవారిలో అరచేతులు, అరికాళ్లలో విపరీతంగా చెమటలు పడుతుండటం చాలామంది అనుభవంలోకి వచ్చే విషయమే యాగ్జిలరీ హైపర్ హిడరోసిస్ : బాహుమూలాల్లో చెమటలు పట్టడం ∙గస్టెటరీ హైపర్ హిడరోసిస్ : బాగా వేడివీ లేదా బాగా ఘాటైన మసాలాలతో కూడిన ఆహారాలు తీసుకుంటున్నప్పుడు కొందరిలో పెదవుల చుట్టూ లేదా ముక్కు మీద, నుదుటి మీద, తలలో విపరీతంగా చెమటలు పట్టడం పోశ్చరల్ లేదా ప్రెజర్ హైపర్ హిడరోసిస్ : కుర్చీల్లో కూర్చున్నప్పడు లేదా సీట్‌కు అనుకుని ఉన్న శరీరభాగమంతా చెమటలు పట్టడం వంటి రకాలు కూడా చూడవచ్చు ఎమోషనల్ లేదా ఎసెన్షియల్ హైపర్ హిడరోసిస్ : ఉన్నవాళ్లలోనూ కాస్త వైవిధ్యమైన లక్షణాలు కనిపించవచ్చు. ఉదాహరణకు కొందరిలో అరచేతులు, అరికాళ్లలో మాత్రమే చెమటలు ఎక్కువగా పడతాయి. ఇలాంటి లక్షణాలు సాధారణంగా వంశపారంపర్యంగా వస్తుంటాయి కొందరిలో వేసవిలో అరచేతుల్లో మరీ ఎక్కువగా చెమటలు పట్టడంతో చేతుల్లోని వస్తువులు తడిసిపోవడం, జారిపోవడం జరుగుతుండవచ్చు. అలాగే కాళ్ల నుంచి చెమటలు కారుతున్నప్పుడు వాళ్ల అరికాళ్ల గుర్తులు నేల/గచ్చు మీద కనిపిస్తుంటాయి. కొందరిలో చెప్పులూ జారిపోవచ్చు ఇంకొందరిలో పగటిపూట చాలా ఎక్కువగానూ, రాత్రుళ్లు తక్కువగానూ, నిద్రలో పూర్తిగా లేకుండానూ ఉండవచ్చు. లేదా మరికొందరిలో దీనికి పూర్తి భిన్నంగా ఉండవచ్చు.ఇలా చెమట పట్టేవారిలోనూ రెండు రకాలుగా చెమటలు పట్టవచ్చు. అవి... కంటిన్యువస్ స్వెటింగ్ : చెమటలు నిరంతరమూ ధారాపాతంగా పడుతుండవచ్చు. వేసవిలో ఈ పరిస్థితి మరీ ఎక్కువ.ఫేజిక్ స్వెటింగ్ : ఏ చిన్న పనిచేసినా లేదా ఏ చిన్నపాటి ఒత్తిడికి గురైనా అప్పడు మాత్రమే కంటిన్యువస్‌గా చెమటలు పడతాయి.అరచేతులూ... అరికాళ్లలో చెమటలతో సమస్యలిలా... పిల్లల్లో ఇలా చెమట పట్టడం వల్ల వారు పరీక్షల సమయంలో బాగా ఇబ్బంది పడుతుంటారు. ఈ చెమటలు ఎక్కువ కావడం వల్ల ఒక్కోసారి జవాబుపత్రం చిరిగి΄ోయే ప్రమాదమూ ఉంటుంది. అందుకే ఇలాంటి పిల్లలు సాధారణంగా చేతికింద రుమాలు పెట్టుకుని రాస్తుంటారు టెన్నిస్, క్రికెట్ వంటి ఆటలు ఆడే క్రీడాకారుల్లో ఇలాంటి సమస్య ఉంటే బ్యాట్ లేదా టెన్నిస్ రాకెట్ జారి΄ోతుంటాయి∙ ఆఫీసులో పని సక్రమంగా జరగకపోవడం నలుగురు కలిసే సోషల్ గ్యాదరింగ్స్‌లో అందరితోనూ కలవలేకపోవడం లేదా నిర్భయంగా షేక్‌హ్యాండ్ ఇవ్వలేకపోవడం కొందరిలో నడుస్తుండగానే చెప్పులు / పాదరక్షణలు జారిపోవడం (ఇలాంటివారు షూ వేసుకోవడం వల్ల కొంతవరకు మంచి ప్రయోజనమే ఉంటుంది. అయితే విపరీతమైన చెమటల కారణంగా వారి మేజోళ్లు తడిసి΄ోతుంటాయి. అందుకే ఎప్పటికప్పుడు ఉతికిన, శుభ్రమైన పొడి మేజోళ్లు వాడుతుండాలి. లేకపోతే ఈ చెమటలు, మలినమైన మేజోళ్ల కారణంగా మరికొన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయి. అవి.. కాంటాక్ట్ డర్మటైటిస్: చర్మానికి సంబంధించిన అలర్జీలు రావడం ∙పామ్ఫోలిక్స్ : చర్మంపై చిన్న చిన్న నీటి బుడగలు వచ్చి దురదగా ఉండటం పిట్టెడ్ కెరటోలైసిస్ : చర్మానికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రావడం డర్మటోఫైటోసిస్: చర్మంపై ఫంగల్ ఇన్ఫెక్షన్లు రావడం.చికిత్సలు... చెమట పట్టే సమస్య కొందరిలో దానంతట అదే తగ్గి΄ోతుంది. తగ్గకపోతే ఈ కింది సూచనలు/చికిత్సలు అవసరమవుతాయి. యాంటీ పెర్స్పెరెంట్లు : ఇందులో చాలా రకాలు ఉంటాయి. ఫార్మాల్డిహైడ్, గ్లూటరాల్ డిహైడ్, 20% అల్యూమినియం క్లోరైడ్ హెగ్జాహైడ్రేట్... వీటిని డాక్టర్ల సలహా మేరకే వాడాలి. యాంటీ పెర్స్పిరెటంట్లు ఎక్కువగా లేదా డాక్టర్ సలహా లేకుండా వాడటం వల్ల కాంటాక్ట్ డర్మటైటిస్ అనే అలర్జీలు వచ్చే అవకాశాలెక్కువ డియోడరెంట్లు : ఇవి చెమటను తగ్గించవు, నిరోధించవు. కానీ చెమట వల్ల దుర్వాసనను కొంత తగ్గిస్తాయి. అయాన్ ఫోరోసిస్ : ఇదికరెంట్ ద్వారా చేసే చికిత్స బొట్యులినమ్ టాక్సిన్ : ఇదో రకం విషం. ఇంజెక్షన్ సహాయంతో చేసే చికిత్స ఇది శస్త్రచికిత్స : సింపాథెక్టమీ అనే సర్జరీ. (ఇటీవల దీన్ని ఎక్కువగా సిఫార్సు చేయడం లేదు. దీంతో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నందున అంతగా ప్రోత్సహించడం లేదు).జాగ్రత్తలు... రోజూ స్నానం చేయాలి. వీలైతే రోజుకు రెండుసార్లు చేస్తే ఇంకా మంచిది ∙మాయిష్చరైజర్ సబ్బులు వాడేవారిలో చెమట ఎక్కువగా పట్టే అవకాశం ఉంది. ఇలాంటివారు నార్మల్ సబ్బులు వాడటం మంచిది చెమటలు ఎక్కువగా పట్టేవారు దాన్ని తేలిగ్గా పీల్చుకునేలా కాటన్ / నూలు దుస్తులు ధరించడం మేలు ఎప్పటికప్పుడు బాగా ఉతికిన, శుభ్రమైన బట్టలనే ధరిస్తుండాలి. (చదవండి: ముప్పై ఐదు ఏళ్లు, ఐదేళ్ల కూతురు కూడా ఉంది మరో బేబీ కోసం ప్లాన్ చెయ్యొచ్చా..?) -
సమ్మర్లో వర్కౌట్లు చేసేటప్పుడు.. బీ కేర్‌ఫుల్..!
సమ్మర్ ముదరగానే చెమటలు పడుతుండటంతో దేహం ద్రవాలను కోల్పోయి, చాలామందిలో మజిల్ క్రాంప్స్ రావడం పెరుగుతుంది. అకస్మాత్తుగా నిద్రలో గానీ, కొందరిలో పగటివేళలోనే పిక్కలు, తొడకండరాలు, ఛాతీ కండరాలు పట్టేస్తుంటాయి. కంటినిండా నిద్ర లేకపోవడం, ఆహారంలో కొన్ని అవసరమైన పోషకాలు లోపించడం, దేహానికి అలసటతో కలిగే నిస్సత్తువతోపాటు కొన్ని రకాల మందులు వాడకంతోనూ కొందరిలో మజిల్ క్రాంప్స్ కనిపించవచ్చు. కండరాల అలసట వల్ల, అలాగే వ్యాయామానికి ముందు తగినంతగా స్ట్రెచ్ ఎక్సర్సైజులు చేయకపోవడం, రక్తంలో ఎలక్ట్రోలైట్స్ పరిమాణం తగ్గిపోవడం కూడా కారణాలవుతాయి. ఈ సమస్యకు తక్షణ పరిష్కారంగా తాజాగా తయారు చేసుకున్న మజ్జిగలో కొద్దిగా ఉప్పు వేసుకుని తాగడం, చక్కెర లేకుండా పండ్లరసాలు, ద్రవాహారాలు తీసుకోవచ్చు. అన్ని పోషకాలతో కూడిన సమతుల ఆహారం తీసుకుంటూ ఉండటంతోపాటు, కంటినిండా నిద్రపోవడం వల్ల ఈ సమస్యను నివారించవచ్చు. వ్యాయామానికి ముందు చేసే వార్మప్ కూడా ఈ సమస్య నివారణకు బాగానే తోడ్పడుతుంది. (చదవండి: -
ముప్పై ఐదు ఏళ్లు, ఐదేళ్ల కూతురు కూడా ఉంది మరో బేబీ కోసం ప్లాన్ చెయ్యొచ్చా..?
నాకు ముప్పై ఐదు సంవత్సరాలు. ఐదేళ్ల కూతురు ఉంది. చాలా కష్టంగా కాన్పు జరిగింది. ఇంకో బేబీకి ప్లాన్ చెయ్యాలి అంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? – రాధ, ధర్మవరంవయసు పెరిగే కొద్దీ కొన్ని సమస్యలు తల్లికి, బిడ్డకి ఎక్కువ ఉంటాయి. మొదటి డెలివరీ, ప్రెగ్నెన్సీలో ఏదైనా సమస్యలు ఉంటే అవి మళ్లీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌కి ముందే ఇప్పుడు ఆ సమస్యలు ఏ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఏం చేసి వాటిని నార్మల్‌కి తీసుకురావాలి అని ముందే గైనకాలజిస్ట్‌ని కలవాలి. మధుమేహం సమస్య ఇప్పుడు ఎక్కువ అయితే, హెచ్బి ఏ1సీ లెవెల్స్ డైట్ చెక్ చెయ్యండి. లెవెల్స్ ఎక్కువ ఉంటే ప్రెగ్నెన్సీలో వచ్చే సమస్యకు మందుల ద్వారా ముందే కరెక్ట్ చెయ్యాలి. థైరాయిడ్ లెవెల్స్ చాలామందికి ముందే తెలియటం లేదు. అది బేబీ మెదడు ఎదుగుదల మీద ప్రభావం చూపిస్తుంది. అందుకే, ముందు టీఎస్‌హెచ్ లెవెల్స్ చెక్ చెయ్యండి. ఇంతకు ముందు ప్రెగ్నెన్సీలో శిశువు ఎదుగుదల సమస్యలు వచ్చినట్టయితే ఈసారి రాకుండా కొన్ని మందులు, డైట్ ముందే మార్చి ఇస్తాం. రక్తం గడ్డకట్టడం అవుతుందా అనే రక్తపరీక్షలు ముందే చేయించుకొని, దానికి తగిన మందులు వాడాలి. రక్తహీనత వలన రెండో ప్రెగ్నెన్సీలో చాలా సమస్యలు ఉంటాయి. శరీరంలో ఐరన్ లోపంతో ఇబ్బంది రావచ్చు. అందుకే సీబీపీ, విటమిన్ బీ–12, విటమిన్–డీ3 లెవెల్స్ ముందే చెక్ చేసుకోవాలి. భర్త వీర్య విశ్లేషణ కూడా ఒకసారి చేయించు కోవాలి. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ఇద్దరూ పాటించాలి. ఫోలిక్ యాసిడ్ 5 ఎమ్జీ మాత్రలు ప్లానింగ్‌కి మూడు నెలల ముందు నుంచి తీసుకోవాలి. పాలు, పెరుగు, పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. ఇంతకు ముందు ప్రెగ్నెన్సీలో ఏవైనా చర్మ సమస్యలు, కిడ్నీ సమస్యలు ఉంటే అవి ఇప్పుడు రాకుండా కొన్ని పరీక్షలు చేయించుకోవాలి. వాక్సినేషన్స్ కూడా చాలా ముఖ్యం. ఫ్లూ వాక్సిన్, ఎమ్ఎమ్ఆర్ వాక్సిన్, ఆటలమ్మ, రుబెల్లా వాక్సిన్స్ ముందు తీసుకోకపోతే ఇప్పుడు తీసుకొని, ఒకనెల తరువాత ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకోవాలి. మీ బరువు ఉండవలసిన బీఎమ్ఐ (బాడీ మాస్ ఇండెక్స్) కన్నా ఎక్కువ ఉంటే, బీఎమ్ఐ 30 కంటే ఎక్కువ ఉంటే కొంత బరువు తగ్గడానికి ప్రయత్నించాలి. సమతుల్యమైన, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. వ్యాయామం ప్రారంభించాలి. మీరు ఏదైనా సమస్యలకు మందులు వాడుతుంటే అవి ప్రెగ్నెన్సీలో మంచివి కాకపోతే, సంబంధిత డాక్టర్ని కలసి మందులను మార్పించుకోవాలి. చాలామందికి ఆందోళన తగ్గించే మందులు, మూర్చవ్యాధికి మందులు మారుస్తాము. ఉద్యోగం ఒత్తిడి ఎక్కువ ఉంటే ఆ ప్రభావం శిశువు ఎదుగుదలపై పడుతుంది. అందుకే సరైన వర్క్ ప్లేస్ సెలక్ట్ చేసుకోండి. ధ్యానం, యోగా చేయటం మంచిది. డా‘‘ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: ప్రెగ్నెన్సీ టైంలో బరువు పెరిగితే సమస్యలు వస్తాయా..? -
మాతృత్వం మధురిమను కాపాడుకుందాం..! కాబోయే తల్లుల ఆరోగ్యం కోసం..
మాతృత్వం ఓ వరం అంటారు. అదిపొందలేక బాధపడుతున్న వాళ్లెందరో. ప్రస్తుత జీవనశైలి, పర్యావరణ కాలుష్యం, జంక్ఫుడ్లతో మాతృత్వం మసకబారుతోంది. ముఖ్యంగా తల్లులు, కాబోయే తల్లులు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. టీనేజ్ వయసు నుంచే ఆడపిల్లలు మంచి ఆహారపు అలవాట్లు తీసుకునేలా కేర్ తీసుకుంటే..పెళ్లయ్యాక అలాంటి సమస్యలుబారిన పడరని చెబుతున్నారు నిపుణులు. అంతేగాదు తల్లలు ఆరోగ్యం కోసం ప్రతి ఏడాది ఏప్రిల్11న 'మాతృత్వ సంరక్షణ దినోత్సవం' పేరుతో ఏటా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదే రోజు మహాత్మాగాంధీ భార్య కస్తుర్బా గాంధీ పుట్టిన రోజు కావడం విశేషం. ఈ సందర్భంగా అమ్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం ఎలా..? కాబోయే తల్లులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. బారతదేశంలో మాతృత్వ సంరక్షణ పరంగా మెరుగ్గా ఉందని నివేదికలు చెబుతున్నాయి. అయితే గ్రామీణ ప్రాంతాలు, వెనుకబడిని వర్గాల్లో మాత్రం ప్రసూతి మరణాలు ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అంతేగాదు ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రసూతి మరణాల్లో భారత్ రెండో స్థానంలో ఉండటమే అత్యంత ఆందోళన కలింగించే అంశం. పట్టణాల్లో అమ్మల ఆరోగ్యానికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు, ప్రసూతి మరణాలు తగ్గించే విషయాల్లో బేషుగ్గానే ఉన్నా..పేదరికం, వెనుకబడిన ప్రాంతాల్లో ఈ సమస్య ఓ సవాలుగా ఉంది. ప్రధాన కారణాలు.. తీవ్రమైన రక్తస్రావం, ఇన్షెక్షన్లు, అధిక రక్తపోటు, అసురకక్షిత గర్భస్రావాలు, చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసుకోవడం తదితరాలని చెబుతున్నారు నిపుణులు. పట్టణ ప్రాంతాల్లోని మహిళలకి వీటిపై కొంత అవగాహన ఉంది, పైగా అందుబాటులో ఆస్పత్రులు, ఆరోగ్య నిపుణుల సలహాను సులభంగా పొందగలరు. గ్రామీణ ప్రాంతాల మహిళలు ఇంకా నాటు వైద్యాన్నే ఆశ్రయించడం, గర్భిణితో ఉండగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన లేమి తదితరాలు ప్రసూతి మరణాల ప్రమాదాన్నిపెంచుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం చొరవతో..ప్రసూతి మణాలు అడ్డుకట్టే వేసేలా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని అంగన్వాడి, హోమ్ డాక్టర్ వంటి పథకాలతో అమ్మలకు ఆరోగ్య సంరక్షణను అందిస్తున్నారు. అలాగే ఆయుష్మాన్ భారత్ వంటి కార్యక్రమాలతో తల్లి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో పురోగతి సాధిస్తోంది కూడా. పూర్తి స్థాయిలో ఈ ఆరోగ్య అసమానతలను అధిగమించాలంటే..కేవలం అవగాహన కార్యక్రమాలతోనే సాధ్యం. అందుకోసమే ప్రభుత్వాలు తల్లిపిల్లల ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆరోగ్యకరమైన ఆహారం తదితరాలపై అవగాహన కల్పిస్తున్నాయి. గర్భస్రావాలు జరగకుండా ఉండేలా.. ఆడపిల్లల ఆరోగ్యం కోసం పౌష్టిక ఆహారం అందించేలా కొన్ని రకాల పథకాలను కూడా ఇస్తుండటం గమనార్హం. అయితే అవి ఇంకా దారిద్య్ర రేఖకు దిగువున ఉన్నప్రజలకు పూర్తి స్థాయిలో చేరకపోవడంతోనే భారత్‌లో ఈ సమస్య తీవ్రంగా ఉందంటున్నారు నిపుణులు. అందువల్లే ఏటా ఈ దినోత్సవం రోజునైనా పేద మహిళలకు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం అందించే ఆరోగ్య సంరక్షణ పథకాలపై అవగాహన కల్పించడం, మాతృత్వ మధురిమను రక్షించేకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి కార్యక్రమాలతో చైతన్యపరుస్తున్నారు. అంతేగాదు స్కూళ్లు, కాలేజ్‌లు, కార్యాలయాల్లో పెద్దఎత్తున ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అత్యంత ముఖ్యం అని అంటున్నారు గైనకాలజిస్టులు. కాగా, ఇక ఈ ఏడాది "ఆరోగ్యకరమైన ప్రారంభాలు, ఆశాజనకమైన భవిష్యత్తులు" అనే థీమ్‌తో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తల్లుల ఆరోగ్యం కోసం..పోషకాహారం తీసుకోవడంగర్భనిరోధక మాత్రలు వైద్యులు పర్యవేక్షణలోనే వాడటం, అతిగా వాడకం నిరోధించటం తదితరాలు..ప్రసవం ముందు, తదనంతరం సరైన జాగ్రత్తలు తీసుకోవడంసరైన ఫ్యామిలీ ప్లానింగ్దీంతోపాటు కుటుంబ సభ్యుల సహకారం తదితరాలతో అమ్మల ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. అలాగే మన కుటుంబానికి ఆధారమైన ఆమె ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇద్దాం. (చదవండి: ఉమెనోపాజ్ అర్థం చేసుకుందాం) -
పెట్ బ్రీడ్.. బీ కేర్‌ఫుల్ డ్యూడ్..! మన వాతావరణానికి సరిపడేవే బెస్ట్..
ఒకప్పుడు మంచి కాలక్షేపాన్ని అందించే నేస్తాలుగా, అలసిన జీవితాలకు ఆహ్లాదాన్నిచ్చే ఆప్తులుగా భావించిన నగరవాసులు.. ఇప్పుడు పెట్స్‌ను స్టేటస్ సింబల్‌గా చూస్తున్నారు. లక్షలు, కోట్లు వెచ్చించి ఖరీదైన బ్రీడ్స్‌ను కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో మన వాతావరణానికి నప్పని వాటిని ఎంచుకోవడం పొరపాటవుతుందని పెట్ స్పెషలిస్ట్‌లు హెచ్చరిస్తున్నారు. గతంలో సింబా అనే ఒక సెయింట్ బెర్నార్డ్‌ను గతంలో బర్కత్పురాకు చెందిన జంతు కార్యకర్తలు రక్షించారు. దాన్ని ఒక కాంపౌండ్ లోపల బంధించి ఉంచారు. సరైన ఆహారం ఇవ్వకపోవడంతో, కంటి చూపు కోల్పోయి అనారోగ్యం భారిన పడిన సింబా ఆ తర్వాతు జంతు ప్రేమికుల సంరక్షణలో కోలుకుంది. అలా సింబా మాదిరిగానే, మరికొన్ని శునకాలనూ వాటిని తగిన విధంగా చూసుకోలేని యజమానులు వాటి ఖర్మానికి వదిలేస్తున్నారు. కొంపల్లి హైవే పైన గ్రేట్ డేన్ ను రక్షించిన శునకాల బిహేవియర్ థెరపిస్ట్ పన్నీరు తేజ మాట్లాడుతూ, ఈ విదేశీ జాతి శునకాలను చాలా వరకూ అక్రమ పెంపకందారుల నుంచి కొనుగోలు చేస్తారని, అయితే అనారోగ్య పరిస్థితి ఏర్పడిన తర్వాత వదిలివేస్తారని తెలిపారు. ‘చాలా మంది పెంపుడు జంతువుల యజమానులు జాతి ఆహార నిర్వహణ అవసరాల గురించి అవగాహన లేకుండానే థోరోబ్రెడ్ శునకాలను కొనుగోలు చేస్తారు’ అని ఆయన చెప్పారు. అవగాహన, సంరక్షణ అవసరం.. జర్మన్ షెపర్డ్ వంటి భారీ బ్రీడ్స్ అపార్ట్మెంట్లకే పరిమితం కాకూడదని, మన వాతావరణ పరిస్థితులకు అవి తగినవి కాదని నిపుణులు అంటున్నారు. ఇటువంటి శునకాలు అనేక అనారోగ్యాలకు గురవుతాయి, ‘కుక్కపిల్లని ఇంటికి తీసుకురావడం అంటే అది జీవితకాల బాధ్యత. బిడ్డకు ఎంత శ్రద్ధ, సంరక్షణ, సమయం అవసరమో వాటికీ అంతే అవసరం. ఇటీవల, నగరవాసులు కొందరు చౌ చౌస్, సెయింట్ బెర్నార్డ్స్, సైబీరియన్ హస్కీలు, అలాస్కాన్ మాలమ్యూట్స్ వంటి బ్రీడ్స్‌ను పెట్స్‌గా ఎంచుకుంటున్నారు. అయితే ఇవి మన వాతావరణానికి సరిపోవు. ఇవి సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రతలలో మాత్రమే తగిన విధంగా పెరుగుతాయి. భారతీయ వాతావరణానికి ఎప్పటికీ సర్దుబాటు కావు’. అంటూ పెట్ నిపుణుడు మురళి చెబుతున్నారు. సరిపడకపోతే.. అనారోగ్యాల వెతే.. నప్పని నగర వాతావరణం వల్ల కొన్ని బ్రీడ్స్ అనేక అనారోగ్యాలకు గురవుతాయి. గ్యాస్ట్రోఎంటిరైటిస్, హీట్ స్ట్రోక్, వైరల్ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు సులభంగా గురవుతాయి. కాబట్టి ఇండియన్ బ్రీడ్స్ లేదా దశాబ్దాల తరబడి భారతదేశంలో భాగమైన జాతులను దత్తత తీసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇక్కడి వాటికి ఇన్ఫెక్షన్ల నిరోధకత కలిగి ఉంటాయి. కఠినమైన వాతావరణాన్ని తట్టుకోగలవు అని చెబుతున్నారు. (చదవండి: పీరియడ్స్ వచ్చి వెయ్యి రోజులు.. అయినా తగ్గలేదు.. వైద్యులకే అంతుచిక్కని మిస్టరీ..!) -
ఎండల్లో... కొబ్బరి నీళ్లతో గేమ్స్ వద్దు!
ఎండ వేడిని తట్టుకోవడానికి, ఎండా కాలంలో సత్తువతో ఉండడానికి కొబ్బరి నీళ్లు ఎంత ఎక్కువగా తాగితే అంతమంచిది అనుకుంటారు చాలామంది. అయితే ఇది సరిౖయెనది కాదు అంటున్నారు పోషకాహార నిపుణులు. ఎందుకంటే...కొబ్బరి నీళ్లలో ΄పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల రక్తంలో పొటాషియం స్థాయులు పెరుగుతాయి. శరీరంలో లవణాల సమతూకం దెబ్బతింటుంది. కిడ్నీల పనితీరుపై ప్రభావం చూపుతుంది.కొబ్బరినీళ్లలో అధిక పొటాషియం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. కొబ్బరి నీళ్లలో అధిక చక్కెర కంటెంట్ వల్ల బరువు పెరగడానికి దారి తీయవచ్చు. డయాబెటిస్, గుండె జబ్బులు, దంత క్షయ ప్రమాదం పెరగవచ్చు.కొబ్బరితో అలర్జీలు అసాధారణమేమీ కాదు. కొంతమందికి కొబ్బరి నీటి వల్ల అలెర్జీలు రావచ్చు. దద్దుర్లు, వాపుతోబాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురు కావచ్చు.హైబీపి ఉన్న వారు, మధుమేహ వ్యాధిగ్రస్తులు, పేగు పూత వ్యాధి ఉన్న వాళ్లు కొబ్బరినీళ్లకు దూరంగా ఉండటమే మంచిది. (చదవండి: వేగాన్ వర్సెస్ నాన్‌వెజ్ డైట్: ఈ కవల సోదరుల ప్రయోగంలో వేటిలో విటమిన్లు ఎక్కువంటే..?) -
నాన్న ఉన్నట్టుండి పడిపోతున్నారా?, అయితే..
ఆరు పదుల వయసు దాటిన తర్వాత తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు?, ఎలా ఉంటున్నారు? అనేది పిల్లలు గమనించుకుంటూ ఉండాలి. ముఖ్యంగా అంతకుముందు చురుగ్గా తిరిగిన తండ్రి.. ఇప్పుడు ఉన్నట్టుండి డల్‌గా మారిపోవడం, శరీరం అంతా బిగుసుకుని ఉండిపోవడం, ఎక్కువగా నడవలేకపోవడం, ఒకవేళ నడిచినా పడిపోతుండడం లాంటి లక్షణాలు కనపడితే, అది కేవలం వయసు ప్రభావం మాత్రమే కాదు.. పార్కిన్సన్స్ డిసీజ్ కావచ్చు. పై లక్షణాలు కనిపించినప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే న్యూరాలజిస్టును సంప్రదించాలి. తగిన పరీక్షల ద్వారా దానికి కారణాలేంటో తెలుసుకుని తక్షణం చికిత్స ప్రారంభిస్తే లక్షణాలు తగ్గడమే కాదు, కొన్ని కేసుల్లో పూర్తిగా నయం అయిపోతుంది కూడా! మెదడులో ఉండే డొపమైన్ అనే రసాయనం ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల వచ్చే పార్కిన్సన్స్ వ్యాధి గురించి సామాన్య ప్రజల్లో కూడా అవగాహన ముఖ్యమని.. దాని లక్షణాలను గమనించి వెంటనే చికిత్స చేయించడం అవసరమని నగరంలోని ప్రధాన ఆస్పత్రులలో ఒకటైన ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ న్యూరాలజిస్ట్, స్ట్రోక్ స్పెషలిస్ట్ డాక్టర్ అనిరుధ్ రావు దేశ్‌ముఖ్ తెలిపారు. ఈ నెల 11న ప్రపంచ పార్కిన్సన్స్ డే(World Parkinson's Day) సందర్భంగా ఆయన మాట్లాడారు.“మన శరీరంలో ఇన్సులిన్ తగ్గితే మధుమేహం ఎలా వస్తుందో... అలాగే డొపమైన్ తగ్గితే పార్కిన్సన్స్ వస్తుంది. సాధారణంగా ఇది 60 ఏళ్లు దాటినవారిలోనే కనిపిస్తుంది గానీ, ఇటీవల కొన్ని కేసుల్లో మాత్రం 20లలో ఉన్నవారికి కూడా చూస్తున్నాం. ఇతర వ్యాధుల్లా కాకుండా.. శారీరకంగా కనిపించే లక్షణాలను బట్టే దీన్ని గుర్తించేందుకు కొంతవరకు అవకాశం ఉంటుంది. 👉ఎక్కువగా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోవడం, గతంతో పోలిస్తే బాగా డల్‌గా ఉండడం, ముఖంలో ఎలాంటి హావభావాలు పలికించకపోవడం, శరీరం అంతా బిగుతుగా అయిపోవడం, చేతులు కొద్దిగా వణకడం, చేత్తో ఏవీ సరిగ్గా పట్టుకోలేకపోవడం, నడక తగ్గిపోవడం, నడుస్తుంటే పడిపోవడం... ఇలాంటివన్నీ కూడా పార్కిన్సన్స్ వ్యాధి లక్షణాలే. వీటిలో ఏవి కనిపించినా కూడా అవతలివాళ్లు వెంటనే గుర్తించగలరు. 👉అలా గుర్తించినప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో.. కుటుంబంలో ఏదైనా మరణం సంభవించడం వల్ల కుంగుబాటు (డిప్రెషన్)తో అలా అయిపోయారని, కొన్ని రోజులు పోతే అదే నయమైపోతుందని వదిలేయకుండా వెంటనే వైద్యులకు చూపించాలి. చూపించినప్పుడు ఆ సమస్య మానసికమా, శారీరకమా అన్నది గుర్తించి అందుకు తగిన చికిత్సలు అందిస్తారు.👉గతంలో పార్కిన్సన్స్ డిసీజ్ (పీడీ) వచ్చిందంటే దానికి ప్రధానంగా డీబీఎస్ (డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్) లాంటి శస్త్రచికిత్సలే ఉండేవి. లేదంటే శరీరంలో డొపమైన్ స్థాయిని పెంచేందుకు కొన్ని రకాల మందులు వాడేవారు. కానీ ఇప్పుడు వైద్యశాస్త్రం అభివృద్ధి చెందింది. పార్కిన్సన్స్ వ్యాధికి కారణాలు ఏంటో తెలుసుకుని అందుకు తగిన చికిత్స చేసేందుకు అవకాశం వచ్చింది. ఇటీవల నా దగ్గరకు ఒక రోగి వచ్చారు. ఆయనకు పార్కిన్సన్స్ లక్షణాలే ఉన్నాయి. పరీక్షించినప్పుడు యాంటీబాడీలు తయారవ్వడం వల్ల డొపమైన్ స్థాయి తగ్గుతోందని గుర్తించాం. దాంతో ఇమ్యునోథెరపీ ప్రారంభిస్తే చాలా తక్కువ సమయంలోనే ఆయనకు పూర్తిగా నయమైంది. ఇప్పుడు మామూలు మనిషిలా ఉన్నారు. అందువల్ల సరైన సమయానికి ఆస్పత్రికి తీసుకొస్తే, పార్కిన్సన్స్ వ్యాధిని కూడా పూర్తిగా నయం చేసేందుకు కొన్ని కేసుల్లో అవకాశం ఉంటుంది. అదే ఇంతకుముందయితే జీవితాంతం డొపమైన్ పెంచేందుకు ఉపయోగపడే మందులు వాడుతూ ఉండాల్సి వచ్చేది, లేదా డీబీఎస్ లాంటి శస్త్రచికిత్సలు చేయాల్సి వచ్చేది. కొన్ని రకాల ఆహారపు అలవాట్ల వల్ల కూడా శరీరంలో కణాలు చచ్చిపోతాయి. అందువల్ల కూడా డొపమైన్ ఉత్పత్తి తగ్గిపోయి ఈ సమస్య వస్తుంది. అందువల్ల.. ప్యాకేజ్డ్, ప్రాసెస్డ్ ఆహారం తీసుకోవడం వీలైనంత వరకు తగ్గించాలి. అలాగే రసాయనాలకు గురికావడాన్ని కూడా తగ్గించాలి. అలాగే ఎంత త్వరగా ఈ లక్షణాలు గుర్తిస్తే అంత త్వరగా వైద్యులకు చూపించి, త్వరగా చికిత్స చేయడం మొదలుపెడితే ఫలితాలు కూడా మెరుగ్గా ఉంటాయి. చురుకైన జీవనశైలిని పాటించడం, మంచి ఆహారం తీసుకోవడం, నిత్యం క్రమం తప్పకుండా వ్యాయామం చేసుకోవడం ద్వారా కొంతవరకు ఈ వ్యాధి రాకుండా నిరోధించుకోవచ్చు” అని డాక్టర్ అనిరుధ్ రావు దేశ్‌ముఖ్ వివరించారు.డాక్టర్ అనిరుధ్ రావు దేశ్‌ముఖ్,ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ న్యూరాలజిస్ట్,స్ట్రోక్ స్పెషలిస్ట్ -
మామయ్య ప్రవర్తనలో మార్పు వచ్చింది
మా మామయ్యకు 65 ఏళ్లు. ఆయనకు బీపీ, షుగర్ చాలా కాలంగా ఉన్నాయి. సంవత్సరం క్రితం పార్కిన్సన్’ జబ్బు వచ్చిందని చెప్పారు. ఇక్కడే నరాల డాక్టర్‌కి చూపిస్తున్నాం. కొన్ని రోజులుగా ఆయన ప్రవర్తనలో మార్పు వచ్చింది. మా అత్త గారిని విపరీతంగా అనుమానిస్తున్నారు. ఇంటికి ఎవరైనా మగవాళ్ళు వస్తే వాళ్ళకి, మా అత్తగారితో అక్రమ సంబంధం అంటగడుతున్నారు. అలాగే రాత్రుళ్ళు ప్రశాంతంగా నిద్రపోకుండా మధ్యలో లేచి బయటకు, ఇంట్లోకి తిరుగుతున్నారు. మాకు ఎవరికీ కనపడని మనుషులు ఆయనకు కనపడుతున్నారు. ఈమధ్య అనుమానం నా మీద కూడా మొదలైంది. ఇంట్లో ఆడవాళ్ళని బయటకు వెళ్ళనీయట్లేదు. మా ఆయనకి చెప్తే వాళ్ళ నాన్నను మందలించడానికి ఇబ్బంది పడుతున్నారు. ఆయన ప్రవర్తనతో, మాటలతో మాకు నరకం కనిపిస్తోంది. – భానుప్రియ, మదనపల్లెమీరు రాసిన దాన్ని బట్టి మీ మామ గారికి గతంలో ఎప్పుడూ మానసిక సమస్యలు లేవు, బీపీ, షుగర్ మాత్రమే ఉన్నాయి, ఈ మధ్యే పార్కిన్సన్’ జబ్బు వచ్చిందని తెలుస్తోంది. మెదడులో ‘డోపమైన్’ అనే రసాయనం స్థాయి తగ్గినప్పుడు పార్కిన్సన్ జబ్బు, అదే డోపమైన్ పెరిగినపుడు ‘సైకోసిస్’ జబ్బు వస్తుంది. పార్కిన్సన్ జబ్బులో డోపమైన్ రసాయనం స్థాయి తగ్గడం వల్ల చేతులు వణకడం, నిదానంగా నడవడం, శరీరంలో కదలికలు తగ్గడం లాంటివి జరుగుతాయి. మందులు వాడినపుడు డోపమైన్ లెవల్స్ పెరిగి వారిలో ఈ లక్షణాలు మెరుగవుతాయి. ఐతే ఇలా మందులు వాడే వారిలో కొందరికి అనుమానాలు, భ్రాంతులు వంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా కనపడతాయి. దీనికి ప్రధాన కారణం డోపమైన్ లెవెల్స్ అవసరానికి మించి పెరగడం. మీ మామ గారి విషయంలో జరిగింది కూడా ఇదే! కనుక ముందు మీ న్యూరాలజిస్ట్‌ని కలిసి మందులు తగ్గిస్తారో లేదా మారుస్తారో కనుక్కోండి. అలా కుదరని పక్షంలో సైకోసిస్ లక్షణాలు తగ్గడం కోసం కొన్నాళ్ళు సైకియాట్రిస్ట్ పర్యవేక్షణలో ఉండి ‘యాంటీ సైకోటిక్’ మందులు వాడాల్సి ఉంటుంది. ఇలా మందులు వాడినప్పుడు పార్కిన్సన్ జబ్బు లక్షణాలు కొంత పెరగవచ్చు కూడా! అందుకే హాస్పిటల్లో డాక్టరు పర్యవేక్షణలో అడ్మిట్ అయి వైద్యం చేయించుకోవడం మంచిది. మీరు ధైర్యంగా ఉండండి. ఆయన కావాలని ఇదంతా చేయడం లేదని గ్రహించండి. వీలైనంత త్వరగా దగ్గర్లోని మానసిక వైద్యున్ని సంప్రదించండి. ఆల్ ది బెస్ట్! డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. (మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com) (చదవండి: 'ట్విన్‌టాస్టిక్'..! పుట్టుకలోనే కాదు ప్రతిభలో కూడా సేమ్ టు సేమ్..!) -
చిన్న పిల్లలను విడువని కేన్సర్ భూతం..!
కేన్సర్..కేన్సర్..కేన్సర్ ఈ మాట వింటుంటేనే గుండెలు గుభేలమంటున్నాయి. ప్రస్తుతం ఎవరిని కదిలించినా ఈ మహమ్మారిపై చర్చిస్తున్నారు. గతంలో వందల్లో ఒకరికో..ఇద్దరికో కేన్సర్ సోకేది. ప్రస్తుతం ఈ సంఖ్య అనూహ్యంగా పెరిగింది. దీనికి ప్రధాన కారణం.. మారుతున్న జీవన శైలి, తినే ఆహారపు అలవాట్లు, కాలుష్యం, జన్యుపరమైన లోపాలు. ఇవన్నీ కేన్సర్ భూతం వికటాట్టహాసానికి దారితీస్తున్నాయి. గత మూడు దశాబ్దాలలో కేన్సర్ బాధితుల సంఖ్య 79 శాతం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. చిన్నారుల నుంచి వయసు మీరిన వారి వరకు అందరిని ఈ భూతం కబలిస్తోంది, ఆ మూడు ఆసుపత్రుల్లో..నగరంలోని ఇండో అమెరికన్ కేన్సర్ ఆసుపత్రి, ఎంఎన్‌జే ఆసుపత్రి, నిమ్స్ ఆసుపత్రుల నివేదికల ప్రకారం సగటున ప్రతి లక్ష మందిలో 3,865 మంది కేన్సర్ బాధితులు ఉన్నారు. నోరు, ఛాతీ, ఊపిరితిత్తులు, గొంతు, స్వరపేటిక, రొమ్ము, శ్వాసకోశ, ప్రోస్టేట్, పేగు, జీర్ణశయ, కాలేయ వంటివి దాదాపు వందుకు పైగా కేన్సర్ రకాలు ఉన్నాయి. పురుషుల్లో నోటి కేన్సర్, మహిళల్లో బ్రెస్ట్ కేన్సర్ అత్యధిక శాతం మందిని వేధిస్తోందని నేషనల్ కేన్సర్ రిజిస్ట్రీ ప్రొగ్రాం నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 2025లో 53,565 మందికి కేన్సర్ సోకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తునా్నరు. ఇందులో పురుషులు 24,857 మంది, మహిళలు 28,708 మంది ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.మహిళలల్లో ముప్పు ఎక్కువమహిళల్లో ఎక్కువ మంది కేన్సర్ భారిన పడుతున్నారు. ఎన్సీఆర్పీ నివేదికల ప్రకారం ప్రతి లక్ష మంది మహిళల్లో 2,151 మంది మహిళలు కేన్సర్ బాధితలుగా ఉన్నారు. అదే సమయంలో పురుషులు 1,714 మంది వ్యాధి భారినపడుతున్నారు. బాధితుల్లో అత్యధికంగా 35.5 శాతం మంది మహిళలు బ్రెస్ట్ కేన్సర్‌కు గురవుతున్నారు. పురుషుల్లో నోటి కేన్సర్ 13.3 శాతం, ఊపిరితిత్తుల కేన్సర్ 10.9 శాతం మంది బాధపడుతున్నారు. 14 ఏళ్ల లోపు వయసు గల మిలియన్ మంది పిల్లల్లో ఏడాదికి సరాసరిన 94 మంది కేన్సర్ బారినపడుతున్నారు. ఇందులో అబ్బాయిలు 55 మంది ఉండగా, ఆడపిల్లలు 39 మంది ఉంటున్నారు.పొగాకుతో ప్రాణ గండం..కేన్సర్ బాధితుల్లో పొగాకు వాడకం వల్ల వ్యాధికి సోకిన వారు పురుషుల్లో 42 శాతం మంది ఉండగా అందులో నోటి కేన్సర్ 31 శాతం మంది, నాలుక 19 శాతం మంది, ఊపిరి తిత్తుల 26 శాతం ప్రధానంగా ఉన్నాయి. మహిళల్లో 13.5 శాతం మందికి పొగాకు పీల్చడం వల్ల కేన్సర్ వస్తుందని నిర్ధారించారు. ఇందులో 30 శాతం మంది ఊపిరితిత్తులు, 22 శాతం మంది నోరు, 17 శాతం మంది నాలుక కేన్సర్‌తో బాధపడుతున్నారు.కేన్సర్ రావడానికి కారణాలుశారీరక శ్రమ లేకపోవడం, అధిక బరువు, ఊబకాయం కలిగి ఉండడం, రక్తంలో చెక్కర స్థాయిలు పెరిగిపోవడం, ఉప్పు అధికంగా ఉండే అహారాలను తీసుకోవడం, పండ్లు, పాలను తగినంతగా తీసుకోకపోవడం, పొగాకు వాడకం, మద్యం సేవించడం, వారసత్వంగా కూడా కేన్సర్ వచ్చే అవకాశాలున్నాయి. రేడియేషన్ ప్రభావం, పర్యావరణ కాలుష్యం కూడా కేన్సర్లకు దారితీస్తున్నాయి.అందుబాటులో అత్యాధునిక చికిత్సలు..కేన్సర్‌కి కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, హార్మోన్ థెరపీ, ఇమ్యునోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంట్ వంటి ఉత్తమ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. జన్యు పరీక్షలు, రక్త పరీక్షలు, ఇమేజింగ్ పరీక్షలు (సీఎక్స్ఆర్, యూఎస్జీ, సీటీ, ఎమ్మారై, పీఈటి), బయాప్సీలు వంటి పరీక్షలతో కేన్సర్లను గుర్తించవచ్చు. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు, జీవనశైలిని మార్చుకుంటే వ్యాధికి దూరంగా ఉండొచ్చు.పిల్లల్లో జెనిటిక్, పర్యావరణం, తినే ఆహారం, డీఎన్ఏ డిస్టర్బ్ కావడం వలన కేన్సర్ వస్తుంది. బ్లడ్, కిడ్నీ, లివర్, కన్ను, ఎముకలపై ప్రభావం చూపిస్తుంది. పెద్దల్లో వెంట్రుక, గోరు తప్ప మిగతా అన్ని శరీర బాగాల్లోనూ కేన్సర్ వచ్చే అవకాశం ఉంది. చర్మం కందిపోవడం, మచ్చలు రావడం, జ్వరం, ప్లేట్లెట్స్ తగ్గిపోవడం, హెమోగ్లోబిన్ తగ్గిపోవడం, గొంతులో బ్లీడింగ్ ఆయాసం రావడం వంటి లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయించుకోవడం మంచిది. కేన్సర్ మొదటి రెండు దశల్లో ఉంటే 80 శాతం పైగా బాధితులకు నయం అవుతుంది.--స్నేహ సాగర్, మెడికల్ అంకాలజిస్టు, జీవీకే హెల్త్ హబ్(చదవండి: వెయిట్‌లాస్‌కి వ్యాయామం, యోగా కంటే మందులే మంచివా..? బిల్‌గేట్స్ ఏమన్నారంటే..) -
65 ఏళ్లు దాటిన వృద్ధులు తరుచుగా పడిపోతుంటారు ఎందుకు..?
సాధారణంగా పెద్దవయసులోని వారు పడిపోయారనీ, బాత్రూమ్లో జారిపడ్డారనీ... లాంటి మాటలుతరచూ వినవస్తూ ఉంటాయి. దాదాపు 65 ఏళ్లు దాటిన చాలామంది ఇలా పడిపోతుంటారనే న్యూస్ వింటుండటం మామూలే. పెద్దవారు ఇలా పడిపోతుండటం వల్ల ఒక్కోసారి ఎముకలు విరగడం (ఫ్రాక్చర్స్), తలకు గాయాలు (హెడ్ ఇంజరీస్) కావడం లాంటి అనర్థాలెన్నో జరుగుతుంటాయి. వీటిల్లో బాత్రూముల్లో జారిపోవడం మినహాయించి మిగతాచోట్ల పడిపోవడానికి చాలా కారణాలే ఉంటాయి. పెద్దవాళ్లు అలా ఎందుకు పడిపోతుంటారో, అందుకు రకరకాల కారణాలేమిటో, వాళ్లు అలాపడిపోవడాన్నినివారించడమెలాగో చూద్దాం. ప్రస్తుతం మనదేశంలో 60 ఏళ్లు పైబడిన పెద్దవాళ్ల సంఖ్య 15 కోట్లు. అంటే మొత్తం జనాభా అయిన 140 కోట్లలో దాదాపు 10.5% మంది పెద్దవాళ్లే. వీళ్లలో దాదాపు 60 నుంచి 70 ఏళ్ల వాళ్లలో 25–30 శాతం మంది పడిపోతూ ఉండగా... 70 నుంచి 80 ఏళ్ల మధ్యవాళ్లలో పడిపోయే వారి శాతం 35%గా ఉంది. మామూలుగా పదిమందిలో ఆరుగురు ఇండ్లలోనే పడుతుంటారు. పడిపోవడం మెల్లగానే పడిపోయినట్లు కనిపించినా ఆ పడటం తాలూకు పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉండవచ్చు. ఉదాహరణకు అలా పడినప్పుడు మెదడులోని రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని ‘సబ్డ్యూరల్ హిమటోమా’ అంటారు. దీనికి శస్త్రచికిత్స అవసరం పడుతుంది. ఇక తుంటి ఎముక ఫ్రాక్చర్ అయిపోయి మంచానికే పరిమితం కావడం చాలామంది ఎదుర్కొనే సమస్య. అప్పుడప్పుడూ పెద్దవారే కాదు... కొందరు మధ్యవయస్కులూ పడిపోవడం ఇటీవల సాధారణంగా జరుగుతోంది. ఇలా పడిపోడానికి కారణాలేమిటో తెలుసుకుందాం.కారణాలివే... కొందరు పెద్ద వయసువారిలో వయసు పెరుగుతున్న కొద్దీ వాళ్ల పాదాల్లో స్పర్శ కొంతమేర తగ్గవచ్చు. దాంతో తాము పడి΄ోతున్నామనే సంగతి కూడా వాళ్లకు తెలియకుండానే వాళ్లు పడిపోవచ్చు. వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకల సాంద్రతతో పాటు మజిల్ మాస్ కూడా క్రమంగా తగ్గుతూ పోతుంది. దాంతో కండరాల్లోని శక్తి కూడా క్షీణించడంతో పడిపోవడానికి అవకాశాలు పెరుగుతాయి. అలాగే మోకాలు, చీలమండ, తుంటి ఎముకల కీళ్లలోనూ కొన్ని మార్పులు రావడం కారణంగా పడిపోవడాలు జరగవచ్చు. పెరుగుతున్న వయసుకు తగ్గట్లు చూపు మందగించడం, వినికిడి శక్తి కూడా క్షీణించడం వంటి అంశాలు కూడా ఒక్కోసారి అకస్మాత్తుగా పడిపోవడానికి కారణాలు కావచ్చు. వయసు పెరుగుతున్న కొద్దీ వారిలో నిటారుగా నిలబడి ఉండే శక్తి తగ్గుతుంది. వయసు పెరిగిన పెద్దవాళ్లు పడిపోకుండా ఉండటానికి ప్రకృతి ఆ వృద్ధుల్ని కాస్త ముందుకు ఒంగిపోయేలా చేస్తుంది. పడి΄ోయేవాళ్లలో ఇలాంటివాళ్లే ఎక్కువ. కొన్నిసార్లు గుండె / మెదడు / శరీరంలోని ఇతర అవయవాలు లేదా వివిధ వ్యవస్థల్లోని ఆరోగ్య సమస్యలు నయం కావడం కోసం వాళ్లు వాడే మందుల కారణంగా కూడా వాళ్లు తూలిపడిపోయే ప్రమాదమూ ఉంటుంది. కొన్నిసార్లు నరాలకు సంబంధించిన కారణాలతోనూ పడిపోయే అవకాశాలుంటాయి. ఒక్కోసారి కారణాలేమీ లేకుండానే ముందుకో వెనక్కో పడిపోయే ప్రమాదం ఉంది. మాట్లాడుతూ నడుస్తున్నప్పుడు ఇలాంటి ప్రమాదం జరగవచ్చు. అందుకే పెద్దవయసు వారు మాట్లాడుతూ నడవకూడదు. నడుస్తూ మాట్లాడకూడదు. వృద్ధాప్యంలో పడిపోవడానికి కారణమయ్యే మరికొన్ని ఆరోగ్య సమస్యలుపోష్చరల్ హై΄ోటెన్షన్ (లో బీపీ) : అకస్మాత్తుగా బీపీ తగ్గిపోయే కండిషన్ ఇది. ఇలా జరగడానికి అనేక కారణాలు ఉంటాయి. సాధారణంగా శరీరంలోని ద్రవాలూ లేదా ఖనిజ లవణాల మోతాదులు తగ్గడం వల్ల ఇలా జరగవచ్చు. అలాగే కొందరిలో ఏదైనా మందు/ఔషధం తీసుకోగానే ఇలా జరగడానికి అవకాశముంది. ఒక్కోసారి పెద్దవాళ్లు తాము కూర్చున్న స్థితి నుంచి అకస్మాత్తుగా పైకి లేవడం లేదా ఉన్నట్టుండి పక్కపై నుంచి లేవడం జరిగినప్పుడు అకస్మాత్తుగా బీపీ పడిపోవచ్చు. ఇలాంటప్పుడు బీపీ 20 హెచ్‌జీ/ఎంఎం కంటే తక్కువగా ఉన్నప్పుడు మెదడుకు చేరాల్సిన రక్తం మోతాదులు కాస్తా అకస్మాత్తుగా తగ్గడం వల్ల పడిపోవచ్చు. కొందరు నిలబడి మూత్రవిసర్జన చేసేవాళ్లలో ఆ సమయంలోనూ లేదా కొందరిలో అకస్మాత్తుగా దగ్గు రావడం వల్ల కూడా ఒక్కోసారి బీపీ హఠాత్తుగా పడిపోయే ప్రమాదం ఉంది. సింకోప్ : కొందరు అకస్మాత్తుగా కొద్దిసేపు స్పృహ కోల్పోయినట్లుగా అయిపోతారు. కళ్లు తిరుగుతూ, చూపు తాత్కాలికంగా మసకబారుతుంది. ముఖంలో రక్తపు చుక్కలేనట్లుగా పాలిపోతారు. శరీరమంతా చల్లబడి, ఒళ్లంతా చెమటలు పట్టవచ్చు. దాంతో ఉన్నవారు ఉన్నట్టుగా అకస్మాత్తుగా పడిపోయి, ఎముకలు విరగడం, తలకు గాయం కావడం వంటి ప్రమాదం జరగవచ్చు. ఇలాంటి వాళ్లలో కొందరు ఒక్కోసారి తమ మూత్రవిసర్జనపై నియంత్రణ కోల్పోయే ప్రమాదమూ ఉంది. ఇలా అకస్మాత్తుగా కళ్లు తిరుగుతూ పడిపోవడాన్ని ‘సింకోప్’ అంటారు. మానసికంగా ఒత్తిడి తీవ్రమైనప్పుడు, మనకు అంతగా ఇష్టం లేని దృష్యాలనూ / అంశాలనూ చూసినప్పుడు (ఎవరైనా గాయపడటం లేదా రక్తస్రావం అవుతుండటం, ఇంకెవరైనా తీవ్రమైన నొప్పితో బాధపడుతుండటం వంటి తమకు ఆమోదం కాని అన్‌ప్లెజెంట్ విజువల్ స్టిములై కారణంగా) ఇలా జరగవచ్చు. వర్టిగో : ఒక్కోసారి కొందరిలో కళ్లు తిరిగినట్లుగా అయి΄ోయి ఒళ్లు స్వాధీనం తప్పి పడిపోవచ్చు. సాధారణంగా లోపలిచెవి లేదా బ్రెయిన్ స్టెమ్‌లో ఉన్న వ్యాధుల కారణంగా ఇలా జరగడానికి అవకాశాలెక్కువ. ఫిట్స్ : ఒక్కోసారి కొందరిలో ఫిట్స్ రావడం / స్పృహ కోల్పోవడం / శరీరమంతా కుదుపునకు (జెర్క్) లోనుకావడం వల్ల. ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ ఎటాక్ (టీఐఏ) : ఒక్కోసారి కొందరిలో తక్కువ తీవ్రతతో పక్షవాతం వచ్చి, మళ్లీ వెంటనే సాధారణ స్థితికి వచ్చేస్తారు. ఈ కండిషన్‌ను వైద్య పరిభాషలో ‘ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ ఎటాక్’ అంటారు. అకస్మాత్తుగా పడిపోవడానికి ఇది కూడా ఒక కారణం. ఇలాంటి సందర్భాల్లో కొందరిలో సరిగా మాట రాకపోవడం, మాటలు ముద్దగా రావడం, కాళ్లూ, చేతులు తాత్కాలికంగా బలహీనంగా మారడం జరగవచ్చు. పార్కిన్సన్ డిసీజ్ : ఈ ఆరోగ్య సమస్య ఉన్నవాళ్లలో వణుకు కారణంగా శరీరానికి సరైన బ్యాలెన్స్ లేకపోవడంతో పడిపోవడం జరుగుతుంది. వీళ్లలో శరీరం కదలికలు నెమ్మదించడం వల్ల కూడా వారు పడిపోయే ప్రమాదముంటుంది. వెన్నెముక / నరాలు / కండరాల వ్యాధుల వల్ల ఒక్కోసారి కాళ్లూ చేతులు బలహీనమైపోయినప్పుడు. దేహంలో సోడియమ్, పొటాషియమ్ వంటి లవణాలూ లేదా చక్కెర మోతాదులు తగ్గిపోయినప్పుడు. చాలా అరుదుగా మెదడులో కణుతులు, మతిమరపు, సైకోసిస్ వంటి అంశాలు కూడా పడిపోడానికి కారణాలు కావచ్చు. అకస్మాత్తుగా పడిపోవడాన్ని నివారించండి ఇలా...పడిపోవడానికి సరైన కారణాలను తెలుసుకొని... వాటిని సరిదిద్దుకోవాలి. అంటే... పడుకున్నవారు / కూర్చున్నవారు అకస్మాత్తుగా లేవడం వల్ల పడి΄ోవడం జరుగుతున్నా అలా ఉన్నపళంగా లేవడం సరికాదు. పడుకున్న వారు తాము పక్క నుంచి లేస్తున్నప్పుడు మొదట మెల్లగా ఒక పక్కకు ఒరుగుతూ... ఆ తర్వాత లేచి కూర్చుని... అప్పుడు మెల్లగా నిల్చోవాలి. కూర్చున్న వారు కూడా ఒకేసారి కుర్చీలోంచి లేవకుండా... మెల్లగా లేని నిలబడాలి. ఆరోగ్య కారణాల వల్ల ఇలా పడిపోయే మెడికల్ హిస్టరీ ఉన్నవారు అందుకు కారణాన్ని తెలుసుకోడానికి అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకుని, సమస్యను గుర్తించి అందుకు అవసరమైన చికిత్స తీసుకోవడం ద్వారా. అకస్మాత్తుగా పడిపోవడానికి నరాలకు సంబంధించిన (న్యూరలాజికల్) కారణాలుంటే అవేమిటో తెలుసుకుని, తగిన చికిత్స తీసుకోవాలి. ఉపకరణాలు వాడటం : అకస్మాత్తుగా పడిపోయే వారు తమకు అవసరమయ్యే ఉపకరణాలు... అంటే చేతికర్ర (వాకింగ్ స్టిక్) / వాకర్ / కళ్లజోడు వంటివి దూరంగా పెట్టుకోకుండా, ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలి. కాస్తంత పెద్ద వయసు మహిళలు హైహీల్స్ తొడగడం సరికాదు. తమకు సురక్షితంగా ఉండే ఫ్లాట్ హీల్ పాదరక్షలు వాడాలి. కాలి కండరాల బలాన్ని పెంచే వ్యాయామాలు, వాకింగ్ వంటివి చేయడం చాలా రకాల పడి΄ోవడాలను (ఫాల్స్‌ను) నివారిస్తాయి.ఇతరత్రా మరికొన్ని మార్గాలివి... చాలా సార్లు పడిపోవడం అన్నది ఇండ్లలోనే జరుగుతుంటుంది. అందువల్ల ఇంటివాతావరణాన్ని పెద్దవారికి ఫ్రెండ్లీగా మార్చడం చాలా మేలు చేస్తుంది. పడకుండా నివారిస్తుంది. ఇందుకు చేయాల్సిన కొన్ని పనులు... నాన్‌స్టిక్ మ్యాట్స్ వాడటం. ఫ్రిక్షన్ బాగా ఉంటే ఫ్లోరింగ్ వేయించడం. కాలుజారనివ్వని కార్పెట్స్ పరవడం. గదిలో మంచి వెలుతురు / గాలి వచ్చేలా చేసుకోవడం. టాయిలెట్స్, బాత్రూమ్స్లో మంచి పట్టు ఉండటానికి వీలుగా హ్యాండ్ రెయిల్స్ అమర్చుకోవడం, బాత్రూమ్ బయట కాలుజారనివ్వని మ్యాట్స్ వాడటం మరీ అవసరమైతే తప్ప ఎక్కడా ఎక్కకుండా ఉండటం...వంటి జాగ్రత్తలతో పెద్దవారు పడిపోయే ప్రమాదాలను నివారించవచ్చు.పడిపోయే అవకాశాలు ఎవరిలో ఎక్కువ... చిన్న చిన్న అడుగులు వేస్తూ, రెండు కాళ్ల మధ్య ఖాళీ తక్కువగా ఉంచేవారు. నిల్చున్నప్పుడు రెండు కాళ్ల మధ్య ఖాళీ తక్కువగా ఉంచేవారు. నడిచే సమయంలో కళ్లు మూసుకునేలా ముఖం ఎక్కువగా రుద్దుకునేవారు.చికిత్స ఫాల్ క్లినిక్స్ : ఇటీవల చాలా ఆసుపత్రుల్లో ‘ఫాల్ క్లినిక్స్’ ప్రారంభిస్తున్నారు. వీటిలో పడి΄ోయిన వాళ్లకు ఇవ్వాల్సిన చికిత్స అందిస్తుంటారు. పడిపోయాక తలకు దెబ్బతగిలినప్పుడు తక్షణం న్యూరో సర్జన్ చేత చికిత్సలు అందించాల్సిన అవసరముంటుంది. ఫ్రాక్చర్స్ వంటివి అయితే ఆర్థో నిపుణులతో చికిత్స అందించాల్సి ఉంటుంది. -
World Health Day 2025 : కొన్నిముఖ్యమైన విషయాలు, గణాంకాలు
ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో గర్భస్థ శిశువులు, ప్రసూతి మరణాల సంఖ్య గణనీయంగా తగ్గినప్పటికీ ఈ మరణాల రేటు మాత్రం ఇంకా ఆందోళనకరంగానే కనిపిస్తోంది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం (World Health Day) అందరికీ సమానమైన, అందుబాటులో ఉండే ఆరోగ్య సంరక్షణను నిర్ధారించాల్సిన అత్యవసర అవసరాన్ని గుర్తు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే హెల్దీ బిగినింగ్స్ అండ్ హోప్ ఫుల్ ఫ్యూచర్స్ (“Healthy Beginnings, Hopeful Futures”) అనేది ఈ ఏడాది థీమ్‌గా నిర్ణయించింది. ఈ విషయంలో తల్లి, నవజాత శిశువుల ఆరోగ్యం కీలక పాత్రను ఇది హైలైట్ చేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం ఆరోగ్యకరమైన శిశువు బాల్యం ఆరోగ్యంగా ఉంటే ఆ చిన్నారి భవిష్యత్తు కూడా డా ఆశాజనకంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన గర్భధారణ, బాల్యం ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు పునాది వేస్తాయి, పోషకాహార లోపం, రక్తహీనత, తక్కువ జనన బరువు, సరైన ప్రసూతి ఆరోగ్య సంరక్షణ పద్ధతులు లింగ అసమానతలు వంటి సవాళ్లను అధిగమించడం చాలా కీలకం.ప్రసూతి పోషకాహార ప్రాముఖ్యత, రక్తహీనత, బరువు తక్కుతో సంభవించే శిశు జననాలను తగ్గింసే ఆరోగ్య సంరక్షణ ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది.ఈ సందర్భంగా కొన్ని గణాంకాలుప్రసూతి మరణాలు: గర్భధారణ లేదా ప్రసవ సమస్యల కారణంగా సంవత్సరానికి సుమారు 3లక్షల మంది మహిళలు మరణిస్తున్నారు.నవజాత శిశు మరణాలు: ప్రతి సంవత్సరం 2 మిలియన్లకు పైగా శిశువులు వారి మొదటి నెలలోనే మరణిస్తున్నారు.ప్రసవాలు: సంవత్సరానికి సుమారు 2 మిలియన్ల ప్రసవాలు జరుగుతున్నాయి.మరణాలు : దురదృష్టవశాత్తు, ప్రతి 7 సెకనకు పుట్టకముందే లేదా పుట్టిన తరువాత ఒక శిశు మరణం సంభవిస్తుంది.ప్రపంచ ఆరోగ్య లక్ష్యాలు: 2030 నాటికి ప్రసూతి మనుగడ లక్ష్యాలను చేరుకోవాల్సి ఉంటుంది కానీ ఈ బాటలో 5 దేశాలలో 4 దేశాలు లేకపోవడం గమనార్హం.మానసిక ఆరోగ్యం: మానసిక ఆరోగ్య పరిస్థితులు మాతా మరియు నవజాత శిశువుల ఆరోగ్యానికి గణనీయమైన ఆందోళన కలిగిస్తాయి.నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్: ఈ వ్యాధులు మాతాశిశు ఆరోగ్యాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి.కుటుంబ నియంత్రణ: ప్రసూతి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కుటుంబ నియంత్రణ సేవల అందుబాటులోకి రావడం చాలా కీలకం.ఆరోగ్య సంరక్షణ ప్రాప్యత: మరణాల రేటును తగ్గించడానికి జననానికి ముందు, ప్రసవ సమయంలోనూ , ఆ తరువాత అధిక-నాణ్యమైన సంరక్షణ అవసరం.గ్లోబల్ క్యాంపెయిన్స్: తల్లీ బిడ్డలశిశువులకు ఆరోగ్యాన్ని నిర్ధారించడానికి ప్రపంచ దేశాల ప్రయత్నాల ప్రాముఖ్యతను డబ్ల్యూహెచ్ఓ నొక్కి చెప్పింది -
వ్యాధులకు చెక్‌పెట్టి.. ఆరోగ్యంగా జీవిద్దాం ఇలా..!
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు.. ఆరోగ్యం లేకపోతే కోట్లాది రూపాయలు ఉన్నా సుఖం లేనట్టే.. ప్రస్తుత జీవన శైలితో ప్రపంచ ఆరోగ్యం తిరోగమన బాట పడుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా రోగాలు పెరుగుతున్నాయని, ప్రతిఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ 1948లోనే గుర్తించింది. తొలిసారిగా వరల్డ్ హెల్త్ అసెంబ్లీని ఏర్పాటు చేసింది. ఏటా ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించాలని ఈ అసెంబ్లీ 1950లో తీర్మానించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించి, అందరూ ఆరోగ్యంగా జీవించేలా చేయటమే దీని ముఖ్యఉద్దేశం. రోగాలు వచ్చిన తర్వాత వైద్యుల దగ్గరకు పరిగెట్టడం కంటే ముందు జాగ్రత్త చర్యలతో ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎన్సీడీ–3.0 ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై దృష్టిపెట్టింది. బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులను ముందుగానే గుర్తించి చికిత్స అందించేందుకు గత ఏడాది నవంబరులో ఎన్సీడీ (నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ 3.0) కార్యక్రమం పేరుతో స్క్రీనింగ్ పరీక్షలకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా వైద్యసిబ్బంది ఇంటింటికీ వెళ్లి వైద్య పరీక్షలు చేస్తున్నారు. 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ బీపీ, షుగర్‌తోపాటు, పలు రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు. వ్యాధి నిర్ధారణ అయితే వైద్యం అందించేందుకు ఆస్పత్రులకు తరలిస్తున్నారు. 8,75,977 మందికి స్క్రీనింగ్ పరీక్షలు గుంటూరు జిల్లాలో 18 ఏళ్లు దాటిన జనాభా 17,50,399 మంది ఉన్నారు. వీరిలో 8,75,977 మందికి వైద్యసిబ్బంది స్క్రీనింగ్ పరీక్షలు చేశారు. వీరిలో మధుమేహం అనుమానితులు 23,103 మంది ఉండగా, 4,438 మందికి మధుమేహం ఉన్నట్లు నిర్ధారౖణెంది. ఇప్పటికే షుగర్‌తో 1,17,609 మంది చికిత్స పొందుతున్నారు. బీపీ అనుమానిత బాధితులు 23,294 మంది ఉండగా, 4,635 మందికి బీపీ ఉన్నట్లు నిర్ధారౖణెంది. ఇప్పటికే బీపీతో 1,33,419 మంది చికిత్స పొందుతున్నారు. క్యాన్సర్ అనుమానిత కేసులు 94 ఉండగా, క్యాన్సర్ ఉన్నట్టు ఆరుగురికి నిర్ధారౖణెంది. క్యాన్సర్ రోగులను గుంటూరు జీజీహెచ్ నాట్కో క్యాన్సర్ సెంటర్లో ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నారు. గుండె ప్రధానం శరీరంలోని అన్ని అవయవాల్లో గుండె ప్రధానమైంది. లబ్‌డబ్‌మంటూ ప్రతి నిమిషం కొట్టుకుంటూ ఉంటేనే మనిషి ప్రాణాలతో ఉన్నట్లు లెక్క. గుండెకోసం తప్పని సరిగా రోజూ వ్యాయామం చేయాలి. మంచి ఆహారపు అలవాట్లు కలిగి ఉండాలి. నూనె అధికంగా ఉండే పదార్థాలు , చికెన్, మాంసం లాంటి కొవ్వు అధికంగా ఉండే పదార్థాలను తినకూడదు. ఆకు, కాయగూరలు తీసుకోవాలి. ఉప్పును సాధ్యమైనంత తక్కువగా వినియోగించాలి. బీపీ, షుగర్లను నియంత్రణలో పెట్టుకోవాలి. ధూమపానం, మద్యపానం లాంటి వ్యసనాల జోలికి వెళ్ళకూడదు. ఒత్తిడి లేకుండా ఉండాలి. –డాక్టర్ పోలవరపు అనురాగ్, ఇంట్రవెన్షనల్ కార్డియాలజిస్టు, గుంటూరు.బీపీ, షుగర్లను అదుపులో పెట్టుకోవాలి... శరీరంలో వచ్చే అనేక శారీరక రుగ్మతలకు రక్తపోటు, మధుమేహం ప్రధాన కారణాలవుతున్నాయి, ఇవి అదుపులో లేకపోతే మూత్రపిండాలు, గుండె ఫెయిలవుతాయి. దృష్టిలోపాలు వస్తాయి. పక్షవాతం కూడా వస్తుంది. రోజూ ఉప్పు వాడకం 5 గ్రాముల కన్నా తక్కువ ఉండేలా చూసుకోవాలి. బీపీ వయస్సుతో సంబంధం లేకుండా, వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది. అదుపులో పెట్టేందుకు రోజూ యోగా చేయాలి. పొటాషియం, క్యాల్షియం ఉండే పాలు, పండ్లు లాంటి ఆహారాన్ని తీసుకోవాలి. –డాక్టర్ రేవూరి హరికృష్ణ, ఇన్ఫెక్షన్స్ స్పెషలిస్టు, గుంటూరు.ఆరునెలలకోసారి కిడ్నీ పరీక్షలు అవసరం కాళ్లవాపులు, మూత్రం ఎక్కువసార్లు రావటం, మూత్రంలో మంట రావటం, రక్తం కారటం, ఆకలిలేకపోటం, వాంతులు కావడం వంటి లక్షణాలు కన్పిస్తే కిడ్నీలకు వ్యాధి సోకినట్లు అర్ధం చేసుకోవాలి. కుటుంబంలో ఒకరికి ఉంటే వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా ముందస్తుగా పరీక్షలు చేయించుకోవటం మంచిది. నొప్పి మాత్రలు ఎక్కువగా వాడటం, నాటు మందులు వాడటం, బీపీ, షుగర్లు అదుపులో లేకపోవటం వల్ల మూత్రపిండాలు పాడవుతాయి. బీపీ, ఘగర్‌లు ఉన్నవారు ప్రతి 6 నెలలకు ఒకసారి కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి. – డాక్టర్ చింతా రామక్రిష్ణ, సీనియర్ నెఫ్రాలజిస్ట్, గుంటూరు(చదవండి: రాజ వంశం కాదు..సంపదలో వారసత్వానికి నో ఛాన్స్! బిల్‌గేట్స్ బెస్ట్ పేరెంటింగ్ పాఠం) -
ప్రెగ్నెన్సీ టైంలో అన్ని మార్పులా..? అక్కడ నొప్పి ఎందుకు వస్తుంది..?
నాకు ఇప్పుడు నాల్గవ నెల. నడుము, పొత్తి కడుపు, వెన్నులో చాలా నొప్పి ఉంటోంది. ఇది మామూలే అని చెప్తున్నారు. అసలు ఇది ఎందుకు వస్తుంది? – లక్ష్మీ, తిరుపతి. ప్రెగ్నెన్సీలో శరీరంలో చాలా మార్పులు వస్తాయి. బేబీని మొయ్యటం అనేది చాలా పెద్ద బాధ్యత. ఇలాంటి సమయంలో ఎంత సంతోషంగా ఉంటుందో, శారీరకంగా, మానసికంగా వచ్చే మార్పులను తట్టుకోవడానికి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. ఓపిక చాలా అవసరం. మొదట్లో ఎలాంటి నొప్పి, అసౌకర్యం ఉండకపోవచ్చు. శారీరకంగానూ బాగానే ఉంటుంది. కాని, హార్మోన్లు సహజంగా హెచ్చుగా ఉన్నందున అలసత్వం, నీరసం, ముభావంగా ఉండటం, తలనొప్పి, వికారం ఉంటాయి. రొమ్ముల్లో నొప్పి కొంచెం ఉండొచ్చు. రెండో త్రైమాసికంలో అంటే నాలుగు నుంచి ఏడవ నెల వరకు చాలా కొత్త మార్పులు ఉంటాయి. బేబీ పెరుగుతున్నప్పుడు లోపల ఒత్తిడి, స్ట్రెచింగ్ తెలుస్తుంది. శరీరంలో వాపు వస్తుంది. నొప్పిగా ఉంటుంది. సైడ్స్‌లో రౌండ్ లిగమెంట్స్ బాగా స్ట్రెచ్ అయి నొప్పిగా అనిపించవచ్చు. మూడో త్రైమాసికంలో బేబీ బరువు రెండు నుంచి మూడు కిలోల మధ్య ఉంటుంది. కాబట్టి, ఆ బరువు కాళ్ల మీద, పొత్తి కడుపు, నడుము, వీపు భాగంలో పడుతుంది. కీళ్ల నొప్పులు ఉంటాయి. ఉబ్బసం, మలబద్ధకం, ఆయాసం రావచ్చు. ఎక్కువ నడవలేక పోతారు. యూరిన్ అర్జెన్సీ ఉండటం, చర్మం నల్లబడటం, రొమ్ముల్లో నొప్పి, చిగుళ్లలో రక్తం రావటం, తల తిరగటం ఇవన్నీ సహజమైన మార్పులుగానే చెప్తాం. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అలానే ఏది సహజమైన సమస్య అని తెలిస్తే, అసలైన సమస్య, నొప్పిని త్వరగా గుర్తించి, సత్వర చికిత్స తీసుకోవచ్చు. డాక్టర్‌ను వెంటనే సంప్రదించవచ్చు. చాలామందికి నిద్రపట్టక ఇబ్బంది పడుతుంటారు. చివరి మూడు నెలల్లో ఆందోళన, ఆలోచనలు, భయాలు పెరుగుతాయి. ఇలా కాకుండా ధ్యానం, యోగా సాయంత్రం వేళల్లో చేస్తే శరీరం రిలాక్స్ అవుతుంది. నిద్రపోయే ముందు షవర్ బాత్ చెయ్యటం, వేడి పాలు తీసుకోవటం, సంగీతం వినటం, గదిని డిమ్‌గా ఉంచడంలాంటివి సహాయం చేస్తాయి. నిద్ర మాత్రలు అసలు వాడకూడదు. కొంతమందికి హెమరాయిడ్స్ ఎక్కువ అయి మలబద్ధకం, మూత్రవిసర్జన సమయంలో రక్తం రావటం, నొప్పి ఉండవచ్చు. అందుకు సరైన సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. ఎక్కువ ఒత్తిడితో మూత్రవిసర్జన చెయ్యకూడదు. భేది మందులతో సులభంగా అయ్యేట్టు మందులు వాడాలి. లూజు, కాటన్ ఇన్నర్ వెయిర్ వేసుకోవాలి. ఒక పక్కకు తిరిగి పడుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. కోల్డ్ ప్యాక్స్‌ను ఉపయోగించవచ్చు. యూరిన్ కూడా ఎక్కువ రావటం, లీక్ అవటం సహజంగా చూస్తాం. కేగెల్ వ్యాయామాలు చెయ్యాలి. బ్లాడర్ ట్రైనింగ్ అలవాటు చేసుకోవాలి. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అని చెక్ చెయ్యాలి. ఫ్లూయిడ్స్ మూడు నుంచి నాలుగు గంటలు తీసుకోవాలి. వెజైనల్ డిశ్చార్జ్ కూడా కామన్. దురదలు, మంటలు, దుర్వాసన లేకపోతే అది నార్మల్. ఒకసారి డాక్టర్‌తో పరీక్షించుకోవాలి. అప్పుడే ఉమ్మనీరు సంచి పగిలిపోవటం వారు గుర్తిస్తారు. బ్రాక్ట్సన్ కిక్స్ అనే కాంట్రాక్షన్స్ ఏడవనెల నుంచి కొన్ని సెకండ్లు వచ్చి పోతుంటాయి. అవి లేబర్ పెయిన్స్ కాదు. ఒక పక్కకు తిరిగి పడుకోవడం, రిలాక్సింగ్ వ్యాయామాలు చెయ్యటంతో ఈ నొప్పి తగ్గుతుంది. ఇవి అప్పుడప్పుడు వస్తుంటాయి. ఇవి ప్రెగ్నెన్సీలో మామూలే. వేరికోస్ వీన్స్‌కి కంప్రెషన్ స్టాకింగ్స్ వేసుకోవాలి. కాళ్లు, అరికాళ్లను ఎత్తులో పెట్టుకొని ఆఫీసు పని చేసుకోవాలి. చాలా వాపు వస్తే, బీపీ ఎక్కువ ఏమైనా అయిందా అని డాక్టర్ని సంప్రదించాలి. చర్మంలో మార్పులు, స్ట్రెచ్ మార్క్స్‌ని నిరోధించలేము. మాయిశ్చరైజ్ క్రీమ్స్ కొంత వరకు పనిచేస్తాయి. పొట్టపైన, రొమ్ములు, తొడలపైన పూసుకోవాలి. అలసట, నీరసం అనేది చాలా సాధారణంగా వచ్చే సమస్య. కాని, రక్తహీనతలో కూడా ఇది ఉంటుంది. అందుకే మీకు ఇలా ఉన్నప్పుడు ఐరన్, బీ12, ఫోలిక్ యాసిడ్ మందులు సరిగ్గా తీసుకుంటున్నారా లేదా అని చెక్ చేసుకోండి. పికా అంటే బ్లడ్ లెవల్స్ తక్కువ ఉన్నప్పుడు బియ్యం, పేపర్ తినాలనిపిస్తుంది. ఇది ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. సరిపడా నిద్ర ఉందా అని చెక్ చేసుకోండి, వ్యాయామం చెయ్యండి. తలనొప్పికి ఐస్ ప్యాక్స్ వాడొచ్చు. 10 నుంచి 12 గ్లాసుల నీరు రోజు తీసుకోవటం మంచిది. పారాసిటమాల్ టాబ్లెట్ ఒకటి సేఫ్‌గా వాడొచ్చు. వికారం, వాంతులకు మెత్తని ఆహార పదార్థాలు, అరటిపండు, అన్నం, బ్రెడ్ లాంటివి తీసుకోవాలి. కాల్చిన బంగాళదుంపలు, ఉడకబెట్టిన మొక్కజొన్న తీసుకోవాలి. మసాలాలు, నూనె పదార్థాలు, వేపుళ్లు తినకూడదు. నాన్ కాఫినేటెడ్ డ్రింక్స్ తీసుకోవాలి. సిప్స్లాగా నీళ్లు తీసుకోవాలి. పండ్ల రసాలు తాగొచ్చు, అల్లం టీ తాగొచ్చు. కాఫీ, టీ మానెయ్యాలి. సమయానికి ఆహారం తీసుకోవాలి. రెండు నుంచి మూడు గంటలకి ఒకసారి కొంచెం ఆహారం తీసుకోవాలి. మాంసాహారంలో డీన్ మీట్, హై ప్రోటీన్వి తీసుకోవాలి. ప్రతిరోజు మల్టీవిటమిన్ మాత్రలు తీసుకోవాలి. రొమ్ముల్లో మార్పులు ప్రెగ్నెన్సీలో సాధారణంగానే వస్తాయి. సైజ్ పెరగటం, డార్క్ కావటం, నొప్పి ఉండటం ఇవన్నీ మామూలే. కొంతమందికి ఐదవ నెల నుంచే కొలోస్ట్రమ్ లీక్ కావచ్చు. మంచి సపోర్ట్ ఇన్నర్ వేర్ వేసుకోవాలి. కాటన్‌వి వాడాలి. కాటన్ టవల్‌తో లీక్ అవుతున్న ఫ్లూయిడ్స్‌ని తుడవాలి. ప్రెస్ చెయ్యకూడదు. వేడి కాపడం పెట్టుకోవచ్చు. పొట్ట పక్కన గుచ్చినట్లుగా నొప్పులు రావచ్చు. పొట్ట పెరిగే కొద్దీ లిగ్మెంట్ స్ట్రెచ్‌తో ఈ నొప్పి వస్తుంది. నడుము లేదా గ్రోయిన్ ఏరియాలో కూడా వస్తుంది. కాళ్ల నొప్పులు కూడా ఉంటాయి. రాత్రిళ్లు ఈ నొప్పి ఎక్కువ ఉంటుంది. హీట్ థెరపీ లేదా బ్యాక్ మసాజ్ దీనికి పనిచేస్తుంది. రబ్బర్ దిండు, లేదా మెటర్నిటీ బెల్ట్ కూడా వాడొచ్చు. వదులైన దుస్తులు ధరించాలి. కంప్రెషన్ స్టాకింగ్స్ వేసుకోవాలి. డాక్టర్ భావన కాసు,గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ (చదవండి: ఈ జెల్ సాక్స్‌తో పాదాలు ఇట్టే కోమలంగా మారతాయ్..!) -
ఈ జెల్ సాక్స్‌తో పాదాలు ఇట్టే కోమలంగా మారతాయ్..!
సాధారణంగా మనం వాడే చెప్పులను బట్టి, వాతావరణాన్ని బట్టి, జాగ్రత్త లేకపోవడాన్ని బట్టి పాదాలు పొడిబారినట్లు తయారవుతుంటాయి. కాళ్లు తెల్లగా పొట్టురేగినట్లు ఉన్నా, మడమలు పగిలిపోయినా అసలు అందంగా కనిపించవు. అలాంటప్పుడు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిందే. కానీ సమయం లేని వారు ఇలాంటి జెల్ సాక్స్ కొనుక్కుంటే సరిపోతుంది. రాత్రి ఈ సాక్స్ వేసుకుని పడుకుంటే తెల్లారేసరికి పాదాలు మృదువుగా, అందంగా మారతాయి.పొడి పాదాలు, పగిలిన మడమలు ఉన్నవారికి, పాదాల చర్మాన్ని మృదువుగా, నునుపుగా ఉంచుకోవాలనుకునే వారికి, రాత్రిపూట సౌకర్యవంతమైన ఫుట్ కేర్ ట్రీట్మెంట్ కోరుకునేవారికి ఈ సిలికాన్ జెల్ సాక్స్ ఒక అద్భుతమైన పరిష్కారం. ఇవి పాదాలకు అవసరమైన తేమను అందించి ఆరోగ్యంగా ఉంచుతాయి.డీప్ హైడ్రేషన్ కారణంగా పాదాలు పగిలినట్లు మారినా, దుమ్ము, ధూళిలో తిరిగినా, కాళ్లు చూడటానికి అసహ్యంగా మారినా ఈ సిలికాన్ సాక్స్‌లో ఆయిల్స్ లేదా మాయిశ్చరైజర్ క్రీమ్స్ లేదా ఫుట్ సీరమ్‌లను కొద్దిగా వేసుకుని, సాక్స్ లోపల మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చేసుకుని, పాదాలకు తొడుక్కోవాలి.అయితే ముందుగా కాళ్లను శుభ్రంగా క్లీన్ చేసుకుని, తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. అనంతరం మాయిశ్చరైజర్ ఉన్న సాక్స్‌ని తొడుక్కుని ఉదయాన్నే తీసెయొచ్చు. ఈ సాక్స్‌ని గోరువెచ్చని నీటిల్లో క్లీన్ చేసుకుని, ఆరబెట్టుకోవాలి. ఇవి క్వాలిటీని బట్టి రూ. 199 నుంచి ఐదారొందల వరకూ ఆన్లైన్లో అమ్ముడుపోతున్నాయి. సైజులను గమనించుకుని, రివ్యూలు చూసి కొనుగోలు చేయడం ఉత్తమం.(చదవండి: -
కేన్సర్‌తో పోరాడటంలో బీట్రూట్ హెల్ప్ అవుతుందా..?
బీట్రూట్కు ఎరుపు రంగును ఇచ్చే బిటాలెయిన్స్ అనే పోషకం చాలా శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్. అది ఫ్రీరాడికల్స్‌ను తొలగించి, అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. ఇందులో ఎక్కువ మోతాదులో ఉండే విటమిన్–సీ కూడా శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్ కావడంతో ఇది కూడా కేన్సర్ల నివారణకు తోడ్పడుతుంది. అంతేకాదు... కొలాజెన్ ఉత్పాదన కూడా ఎక్కువగా జరుగుతుండటంతో చర్మం చాలాకాలం పాటు యౌవనంగా ఉండటానికి ఆ కొలాజెన్ సహాయపడుతుంది. బీట్రూట్ జ్యూస్ తీసుకునేవారికి అలసిపోకుండా చాలాసేపు పనిచేయగల స్టామినా పెరుగుతుంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే... వ్యాయామం చేస్తూ బీట్రూట్ను క్రమం తప్పకుండా తీసుకునేవారు అనేక రకాల కేన్సర్ల నుంచి రక్షణ పొందుతారు. అలాగే బీట్రూట్ బీటాలైన్ పిగ్మెంట్ల కారణంగా కణితి కణాలను తగ్గించగలదని పరిశోధనలో తేలింది. ముఖ్యంగా రొమ్ము, ప్రోస్టేట్ కేన్సర్ కణాలను తగ్గించగలదని అధ్యయనాలు చెబుతున్నాయి. బీట్రూట్ రసంలోని నైట్రేట్లు గుండెపనితీరుని మెరుగ్గా ఉంచుతుంది(చదవండి: జుట్టుని మింగేసే మందులివే..) -
టీకాలతో ఆటిజం వస్తుందా? అసలు చికిత్స ఉందా?
అమెరికాలో మీజిల్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్లు , ఆటిజం మధ్య సంబంధంపై విస్తృత చర్చ జరుగుతోంది. సీడీసీ(CDC), WHO చేసిన విస్తృతమైన అధ్యయనాలతో సహా పరిశోధనలు వ్యాక్సిన్లు , ఆటిజం మధ్య ఎటువంటి సంబంధం లేదని నిర్ధారించాయి. ఆటిజం ప్రధానంగా జన్యు, పర్యావరణ కారణాలుగా వస్తోందని భావిస్తున్నారు. టీకాలు నిజంగా ఆటిజానికి కారణం కానపుడు, సైన్స్ ప్రకారం దానికి కారణమేమిటి? World Autism Awareness Day డే సందర్బంగా అటిజానికి నివారణ, చికిత్స తదితర వివరాలు తెలుసుకుందాం. టీకాల కారణంగా ఆటిజం వస్తుందనేది కేవలం ఒక అపోహ మాత్రమే. టీకాలకూ, ఆటిజంకు సంబంధం లేదు. పిల్లలందరికీ ఏ వయసులో ఇప్పించాల్సిన టీకాలు యథావిధిగా ఆవయసులో ఇప్పించాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రవర్తనకు అనుగుణంగా మందులు ఇవ్వడమే...ఆటిజంకు ఎలాంటి మందులూ అందుబాటులో లేవు. విటమిన్లు, గ్లూటెన్ ఫ్రీ, కేసిన్ ఫ్రీ డైట్లు వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. వీళ్లలో ఫిట్స్ (మూర్ఛ) వంటి అనుబంధ సమస్యలు లేదా ఇతర తీవ్రమైన ప్రవర్తనకు సంబంధించిన మార్పులు (బిహేవియరల్ ఛేంజెస్) ఉన్నప్పుడు వాటికి సంబంధించి మాత్రమే మందులు వాడాల్సి ఉంటుంది. - డా. చంద్రశేఖర్ రెడ్డి సీనియర్ న్యూరో ఫిజీషియన్ బుద్ధిమాంద్యం అనే అపోహ ఉందిఆటిజం అంటే అది ఒక రకమైన బుద్ధిమాంద్యత అని కొందరు అపోహ పడుతుంటారు. చాలా కేసుల్లో మిగతా అందరు పిల్లల్లా అందరితోనూ కమ్యూనికేట్ చేయలేకపోవడమే వీరిలో ఉండే లోపం. నిజానికి చాలామంది నార్మల్ చిన్నారుల కంటే చాలా ఎక్కువ ఐక్యూను ప్రదర్శించేవారూ ఈ పిల్లల్లో ఉంటారు. మెదడు వికాసం లేకపోవడం అన్నది.. సమçస్య తీవ్రత ఎక్కువగా ఉన్న దాదాపు మూడోవంతు పిల్లల్లో మాత్రమే ఉంటుంది. వీరి విషయంలో ఏ అంశంలో వికాసం కొద్దిగా ఆలస్యం జరుగుతోందో ఆ అంశంలో శిక్షణ ఇస్తే వాళ్లు నార్మల్ పిల్లల్లానే పెరగగలుగుతారు. -డా.ప్రభ్‌జ్యోత్ కౌర్ సీనియర్ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ఎంత త్వరగా సమస్య గుర్తిస్తే అంత మంచిదిఆటిజం ఫలానా కారణం వల్ల వస్తుందని చెప్పలేం. ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అనే ప్రశ్నలకు సమాధానాలను పరిశోధకులు ఇంకా అన్వేషిస్తూనే ఉన్నారు. అయితే ఆటిజం పిల్లలను గుర్తించి, వారికి సరైన శిక్షణ ఇవ్వడం ద్వారా మెరుగైన ప్రయోజనాలను పొందవచ్చు. ఈ సమస్య పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ ఉంది. పట్టణాల్లో తమ పిల్లలకు ఆటిజం సమస్య ఉందని తెలిస్తే పరువు పోతుందేమో అనుకునేవారూ ఉన్నారు. పిల్లలు చూడటానికి బాగానే ఉన్నారు కదా, మనస్తత్వంలో మార్పు అందే వస్తుందిలే అని సరిపెట్టుకునేవారూ ఉన్నారు. కానీ, ఆటిజం సమస్య ఉన్న పిల్లలను చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుంది. వారికి అర్ధమయ్యే విధంగా ఒక్కో అంశాన్ని పరిచయం చేయాలి. అందుకు చాలా ఓర్పు, శిక్షణ ఇచ్చే టీచర్లు అవసరం. ప్లే స్కూల్స్, ప్రైమరీ స్కూళ్ల నుంచే అవగాహన తరగతులు నిర్వహించాలి. టీచర్లు, తల్లిదండ్రులూ ఈ సమస్యను ఎంత త్వరగా గుర్తించి, శిక్షణ ఇస్తే అంత మంచిది. -పి. హారికారెడ్డిబిహేవియర్అనలిస్ట్, యాధా ఏబీఏ సెంటర్,అత్తాపూర్,హైదరాబాద్ఓపికగా నేర్పాలిఆటిజం అనేది న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్. దీని బాధిత పిల్లల్లో కమ్యూనికేషన్ సమస్య ఉంటుంది. సమస్య ఉన్న పిల్లల్లో స్టీరియోటైపిక్ బిహేవియర్ (ఒకే పనిని పదేపదే చేయడం) ఉంటుంది. ఇలాంటివారిని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కోపగించుకోవడం, వేరుగా చూడడం చేయకూడదు. ఇతరులతో ఎలా మాట్లాడాలి, ప్రవర్తించాలో ఓపికగా నేర్పాలి. -డాక్టర్ వై.ప్రదీప్చిన్న పిల్లల వైద్యులు, డైక్ సెంటర్ తిరుపతి3 స్థాయిల్లో ఆటిజమ్పిల్లల్లో కనిపించే లక్షణాల తీవ్రత ఆధారంగా దీనిని ప్రధానంగా మూడు స్థాయిలుగా విభజించారు. మైల్డ్ ఆటిజం: పిల్లల వికాసంతక్కువగా (30% వరకు) ప్రభావితం అవుతుంది. మాడరేట్ ఆటిజం : వీరిలో వికాసం 30% నుంచి 60% లోపు ప్రభావితమవుతుంది. సివియర్ ఆటిజం: వికాసం చాలాఎక్కువగా ప్రభావితమవుతుంది.అంటే 60 శాతానికి పైగా.నేర్చుకోవడానికి సంబంధించి కొన్ని సమస్యలు» ఈ చిన్నారుల్లో నేర్చుకోవడానికి సంబంధించిరకరకాల సమస్యలు కనిపించవచ్చు. వాటిల్లో కొన్ని.. » జ్ఞానేంద్రియాల నుంచి లభ్యమయ్యే సమాచారాన్ని సరిగావిశ్లేషిoచుకోలేకపోవడం (సెన్సరీ ప్రాసెసింగ్ డిజార్డర్ – ఎస్పీడీ). » నేర్చుకునే ప్రక్రియ సరిగా జరగకపోవడం (లెర్నింగ్ డిజార్డర్–ఎల్డీ). » కొంతమంది చిన్నారుల్లో ప్రవర్తనకు సంబంధించిన రుగ్మతలు(బిహేవియరల్ డిజార్డర్స్) ఉంటాయి. అంటే నలుగురితో కలవలేరు. అకారణంగా ఏడుస్తూ ఉంటారు. » కొందరిలో ఆటిజంతో పాటు మూర్ఛ వంటి నాడీ సంబంధిత రుగ్మతలుండవచ్చు. ఎందుకుఇలాంటి సమస్యలు?ఆటిజంకు కారణాలుతెలుసుకోడానికి ఇప్పటికీపెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ నిర్దిష్టమైన కారణాలేమీ ఇంకా తెలియరాలేదు. అయితే కొన్ని అధ్యయనాల్లో ఆటిజంకు గురికావడానికి కారణాలను కొంతవరకు తెలుసుకున్నారు. అవి... » కొంతమేరకు జన్యుపరమైన కారణాల వల్ల దీని బారిన పడుతున్నారు. మెదడు ఎదుగుదలకు తోడ్పడే జన్యువులు, మెదడులో స్రవించే సెరటోనిన్, డోపమిన్ వంటి రసాయనాలు సంబంధిత అంశాల్లో లోపాల వల్ల.. » బిడ్డ కడుపులో ఉన్నప్పుడు తల్లి జెస్టేషనల్ డయాబెటిస్‌కు, హార్మోన్ల అసమతుల్యతకు లోను కావడం, గర్భధారణకు ముందు ఏవైనా వైరల్ ఇన్ఫెక్షన్లకు గురికావడం, తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనుకావడం వల్ల..» గర్భంతో ఉన్నప్పుడు వాడిన, వాడకూడని కొన్ని మందుల వల్ల.. ఆ అధ్యయనాల్లోదేశంలో ఆటిజంతో బాధపడే చిన్నారుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఐఏపీ), ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనాల ప్రకారం.. తొమ్మిదేళ్ల వయస్సులోపు చిన్నారుల్లో 1 నుంచి 1.5 శాతం పిల్లలు ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్‌తో బాధపడుతున్నారు. ఇది ఆందోళన కలిగించే అంశమని ఐఏపీ స్పష్టం చేస్తోంది. తెలంగాణలో ఎంతమంది ఉంటారనే దానిపై గణాంకాలు అందుబాటులో లేవు. అయితే తెలంగాణలో 0–9 ఏళ్ల వయస్సు చిన్నారులు 60 లక్షల వరకు ఉంటారని అర్ధ గణాంక శాఖ నివేదికను బట్టి తెలుస్తోంది. ఇందులో ఒక శాతాన్ని లెక్కిస్తే 60 వేల మంది, 1.5 శాతాన్ని పరిగణనలోకి తీసుకుంటే 90 వేల మంది వరకు చిన్నారులు ఈ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. సాధారణంగా ఈ సమస్య మగపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఆటిజంలోని రెట్స్ డిజార్డర్ అనే అరుదైన రకం ఆడపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది.ఏం చేయాలి మరి.. ?దీనిపై తల్లిదండ్రుల్లో అవగాహన పెరగాలి. పిల్లల్లో సమస్యను గుర్తించిన వెంటనే చికిత్సకు తీసుకెళ్లాలి. ఎంత త్వరగా చికిత్స చేయిస్తే అంత త్వరగా సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉందని తల్లిదండ్రులు గుర్తించాలని నిపుణులు చెబుతున్నారు. 2 ఏళ్ల వయస్సు లోపు గనుక గమనిస్తే సులభంగా బయటపడే చాన్స్ ఉంటుందని అంటున్నారు. ఆటిజం లక్షణాలు కనబరచే పిల్లలకు.. కొన్ని నిర్దిష్టమైన ప్రశ్నలూ సమాధానాల ఫార్మాట్లో నిర్వహించే పరీక్షల ద్వారా సమస్యను నిర్ధారించవచ్చు. ఈ జబ్బు ఉన్నవారిలో ఫిట్స్ వంటి న్యూరలాజికల్ సమస్యలు ఉన్నప్పుడే ఎమ్మారై, ఈఈజీ, మెటబాలిక్ డిజార్డర్ స్క్రీనింగ్ వంటివి అవసరం.ఎలాంటి మందులూ లేవు.. ఈ రుగ్మతకు ఎలాంటి మందులూ లేవు. విటమిన్లు, గ్లూటెన్ ఫ్రీ, కేసిన్ ఫ్రీ డైట్ల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఫిట్స్ లేదా ఇతర తీవ్రమైన ప్రవర్తనకు సంబంధించిన మార్పులు (బిహేవియరల్ ఛేంజెస్) ఉన్నప్పుడు మాత్రమే మందులు వాడాల్సి ఉంటుంది. రకరకాల థెరపీలతోనే చికిత్సచిన్నారుల వ్యక్తిగత లక్షణాలూ, భావోద్వేగ పరమైన అంశాలను బట్టి న్యూరో స్పెషలిస్టులు, సైకాలజిస్టులు, స్పీచ్ థెరపిస్టులు, బిహేవియరల్ థెరపిస్టులు ఇలా అనేక మంది స్పెషలిస్టుల సహాయంతో, సెన్సరీ ఇంటిగ్రేషన్ థెరపీ వంటి ప్రక్రియలతో సమీకృత చికిత్స అందించాల్సి ఉంటుంది. ఇలాంటి పిల్లలకు అవసరమైన విద్య అందించడం కోసం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సికింద్రాబాద్‌లోని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిజెబిలిటీస్’(ఎన్ఐఈపీఐడీ) వంటి సంస్థలు కృషి చేస్తున్నాయి. ఈ చిన్నారుల కనీస స్వావలంబన కోసం పలు సామాజిక సంస్థలు, ఎన్జీవోలు కూడా పనిచేస్తున్నాయి. అటిజమ్ ఇటీవలి కాలంలో ప్రధాన సమస్యగా మారుతోంది. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగులు కావడం, పిల్లలతో గడిపే తీరిక లేకపోవడం, ఎక్కువగా స్క్రీన్కు అడిక్ట్ కావడం వంటివి ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు.పుట్టగొడుగుల్లా చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్స్...ఆటిజంకు థెరపీ పేరిట నగరాల్లో ఎక్కడపడితే అక్కడ పుట్టగొడుగుల్లా చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్లు, చైల్డ్ రిహాబిలేటేషన్ సెంటర్లు వెలుస్తున్నాయి. వీటి నిర్వాహకులు అర్హత కలిగిన థెరపిస్ట్‌లు కాకపోయినా..కేవలం ఆయాలను నియమించుకుని ఇలాంటి సెంటర్లు నడిపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కొన్ని ఎన్జీవో సంస్థలు నిబద్ధతతో పనిచేస్తుంటే.. కొందరు పూర్తిస్థాయి వ్యాపారంలా నిర్వహిస్తున్నారు. ఒక్కో పిల్లాడిపై నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం దృష్టి సారించకపోవడం, నిర్వహణ, నియంత్రణ లేకపోవడం వల్ల స్పీచ్ థెరపీ కేంద్రాలు ఇష్టానుసారం వెలుస్తున్నాయి. ఒక ఆసుపత్రి ఏర్పాటు చేయాలంటే ఆసుపత్రి భవనం, అందులో అర్హతగల డాక్టర్లు, నర్సులు, ఆయాలు, పడకలు తదితర సౌకర్యాలకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు ఉంటాయి. కానీ ఈ పునరావాస కేంద్రాలకు ఎలాంటి మార్గదర్శకాలు లేకపోవడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న ప్రయోజనాలు..» ఆటిజం ఒక వైకల్యంగా గుర్తింపు.. » పునరావాస కేంద్రాలు నడిపించే ఎన్జీవోలకు ఆర్థిక సాయం » వైకల్యంతో బాధపడేవారికి సంబంధించిన హక్కుల చట్టాన్ని వీరికి కూడా వర్తింపచేయడం ద్వారా విద్యలో, పునరావాసంలో సహాయం » ఆటిజం బాధితులకు ఉన్నత విద్య అభ్యాసానికి ఆర్థికసాయం » వీరికి యూనిక్ డిజెబిలిటీ (విశిష్ట వైకల్యం) గుర్తింపు కార్డు ఇవ్వడం » రూ 2.5 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పించడం » ఆటిజం తగ్గింపునకు అవసరమైన పరికరాలు కొనుగోలుకు ఆర్థిక సాయం.» పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ, స్వయం ఉపాధికి రుణాలు మంజూరు, నైపుణ్య శిక్షణ. » ప్రాంతాల వారీగా సంగీత, నృత్య కచేరీలు ఏర్పాటు » రాష్ట్రంలో ఇప్పటివరకు ఆటిజంతో బాధపడుతున్న వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు లాంటి చర్యలు చేపట్టక పోవడం గమనార్హం. -
40లలో ఏం తింటామో అది..70లలోని ఆర్యోగ్యాన్ని నిర్ణయిస్తుందా..?
ఆరోగ్యకరమైన వృద్ధాప్యంపై ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఎలాంటి దీర్ఘవ్యాధుల బారినపడకుండా సాగే చక్కటి వృద్ధాప్య జీవితం కొనసాగించడం ఎలా అనేది శాస్తవేత్తలను వేధిస్తున్న చిక్కు ప్రశ్న. మనం తినే ఆహారం వృద్ధాప్యానికి ఏమైనా లింక్ ఉందా? అనే దిశగా విస్తృతమైన పరిశోధనలు చేశారు. అయితే దానికి తాజాగా చేసిన పరిశోధనల్లో సరైన సమాధానం దొరికిందని వెల్లడించారు శాస్త్రవేత్తలు. ఆహారం వృద్ధాప్యాన్ని ఎలా డిసైడ్ చేస్తుందో నిర్థారించామని చెప్పారు. కేవలం ఎక్కువ కాలం జీవించడమే లక్ష్యం కాదని మెరుగ్గా జీవించడమనేది అత్యంత ప్రధానమంటూ పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. అవేంటో చూద్దామా..!.నిపుణుల అభిప్రాయం ప్రకారం..సమతుల్య ఆహారం, దీర్ఘాయువు, మెదడు పనితీరుతో సహా మొత్తం ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుతుందని అన్నారు. పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు మంటను తగ్గించడానికి, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి, శారీరక విధులకు మద్దతు ఇవ్వడానికి సహాపడతాయని చెప్పారు. అందుకోసం 30 ఏళ్ల లోపు వయసున్న దాదాపు ఒక లక్ష మందికి పైగా వ్యక్తుల ఆహారపు అలవాట్లను ట్రాక్ చేశామని చెప్పుకొచ్చారు. వారంతా తీసుకున్న ఆహారం..అది వారి 70 ఏళ్ల వయసులోని ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో నిర్థారించామని చెప్పారు. ఆ క్రమంలోనే ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం తీసుకోవాల్సిన సరైన ఎనిమిది ఆహార విధానాలను కూడా గుర్తించామని తెలిపారు. దాన్ని ఆరోగ్యకరమైన సూచిక(AHEI)గా వర్గీకరించారు. ఈ విధమైన ఆహారాలు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి కూడా నొక్కి చెప్పారు శాస్త్రవేత్తలు.ఆ ఆహారాలు ఏంటంటే..పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, గింజలు, చిక్కుళ్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు(ఆలివ్ నూనె, చేప కొవ్వు) తదితరాలు మంచివని చెప్పారు. అదే సమయంలోఎరుపు మాంసం, ప్రాసెస్ చేసిన ఆహారాలు(జంక్‌ఫుడ్), శుద్ధిచేసిన ధాన్యాలు, అధిక సోడియం తదితరాలను నివారిస్తే మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలను పొందగలరని అన్నారు. ఈ ఆహారపు అలవాట్లకు కాస్త దగ్గరగా ఉన్నవారు.. 70లలో మెరుగైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకున్నట్లు వివరించారు. ఇలాంటి కొన్ని ఆరోగ్య సూత్రాలు ఆరోగ్యకరమైన జీవతానికి మద్దుతిస్తాయని చెప్పారు. అందుకోసం వివిధ రకాల రంగురంగుల పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, అసంతృప్త కొవ్వులు తదితర ఆహారపు అలవాట్లు ప్రాధాన్యత ఇస్తే..70లలో ఏ చీకు చింతా లేకుండా హాయిగా వృద్ధాప్యాన్ని ఆస్వాదించగలుగుతారని అన్నారు పరిశోధకులు.(చదవండి: పొట్ట ఫ్లాట్‌గా ఉండాలా..? ఐతే సాయంత్రం ఆరు తర్వాత ఆ ఆరు ఆహారాలను నివారించండి!) -
హెల్త్ సూపర్వైజర్ దారుణ హత్య.. కీలకం కానున్న హెల్మెట్..!
మహబూబాబాద్ రూరల్: ఓ గురుకులంలో హెల్త్ సూపర్వైజర్గా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి శనిగపురం గ్రామ శివారు బోరింగ్‌తండా సమీపంలో చోటు చేసుకుంది. రూరల్ సీఐ పి.సర్వయ్య కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలానికి చెందిన తాటి పార్ధసారథి (42) భద్రాచలంలోని జగదీశ్ కాలనీలో నివాసముంటున్నాడు. 11 ఏళ్ల క్రితం ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రేకపల్లే గ్రామానికి చెందిన స్వప్నతో వివాహం జరిగింది. వారికి పిల్ల లు భార్గవ్‌సాయి, పరమేశ్వరి ఉన్నారు. పార్ధసారథి మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలోని మహాత్మాజ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ఏడాది కాలంగా హెల్త్ సూపర్వైజర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. భార్య స్వప్న, పిల్లలు భార్గవ్‌సాయి, పరమేశ్వరి భద్రాచలంలోని జగదీశ్ కాలనీలో ఉంటున్నారు. పార్ధసారథి మాత్రం దంతాపల్లి మండల కేంద్రంలో అద్దె ఇంట్లో ఉంటూ సెలవు రోజుల్లో ఇంటికి వెళ్లి వస్తుంటాడు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం భద్రాచలం వెళ్లి సోమవారం సాయంత్రం అక్కడి నుంచి బయలుదేరాడు. తాను వస్తున్నానని తన గది యజమానికి ఫోన్ చేసి ఇంటి గేటు వేయొద్దని చెప్పాడు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున బోరింగ్‌తండా సమీపంలోని మిరప చేనులో ఓ వ్యక్తి మృతి చెంది ఉండడాన్ని స్థానిక రైతులు గమనించి డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం తెలిపారు. దీంతో రూరల్ ఎస్సై వి.దీపిక, సీఐ పి.సర్వయ్య, డీఎస్పీ ఎన్.తిరుపతిరావు ఘటనా స్థలిని పరిశీలించి ఎస్పీ సుధీర్‌రాంనాథ్ కేకన్‌కు సమాచారం ఇవ్వగా ఆయన హుటాహుటిన చేరకున్నారు. డాగ్స్కా్వ డ్, ఫింగర్‌ప్రింట్స్, క్లూస్‌టీం బృందాలు వివరాలు సేకరించాయి. ఘటనాస్థలికి చేరుకున్న మృతుడి సోదరి మద్దుల హేమవరలక్ష్మి, బావ శివప్రసాద్ బోరున విలపించారు. హేమవరలక్ష్మి మాట్లాడుతూ.. తన సోదరుడు పార్ధసారథిపై ఏడాది క్రితం దాడి జరిగిందని తెలిపారు. మరదలు స్వప్నకు వివాహేతర సంబంధం ఉందని ఆరోపించారు. ఈ కారణంగానే తమ సోదరుడి హత్య జరిగి ఉండొచ్చని పేర్కొన్నారు. కాగా, పోలీస్ స్టేషన్లో పార్ధసారథిని దుండగులు హత్య చేసి చంపారని ఫిర్యాదు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా బీసీ గురుకులాల ఆర్సీఓ రాజ్‌కుమార్.. పార్ధసారథి హత్యపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా, డీఎస్పీ తిరుపతిరావు, రూరల్ సీఐ సర్వయ్య, ఎస్సై దీపిక, బయ్యారం సీఐ రవికుమార్, ఎస్సై తిరుపతి, సీసీఎస్ సీఐ హథీరాం, ఇతర పోలీసుల అధికారులు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.కీలకం కానున్న హెల్మెట్..పార్ధసారథి హత్య విషయంలో ఘటనా స్థలిలో లభ్యమైన హెల్మెట్ కీలకం కానున్నట్లు విశ్వసనీయ సమాచారం. నిందితుల రాకపోకలు, వాళ్లు వాడిన ద్విచక్రవాహనం ఆచూకీ గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. సీసీ ఫుటేజీల్లో నిందితులు హత్య చేయడానికి వచ్చే ముందు ఆ వాహనం నడిపిన వ్యక్తి ధరించిన హెల్మెట్ తెలుపురంగులో ఉండగా, ఘటనా స్థలిలో లభించిన హెల్మెట్ కూడా అదే రంగులో ఉండడం గమనార్హం. పార్ధసారథి హెల్మెట్ ధరించకుండా ద్విచక్రవాహనంపై ప్రయాణించినట్లు పోలీసులు గుర్తించారు. భద్రాచలం నుంచి హత్య జరిగిన ప్రాంతం వరకు రహదారుల వెంట ఉన్న సీసీ ఫుటేజీని పోలీసులు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. -
పొట్ట ఫ్లాట్‌గా ఉండాలా..? ఐతే సాయంత్రం ఆరు తర్వాత..
బానపొట్ట ఉంటే ఎలాంటి ఫ్యాషన్ వేర్లను ధరించలేం. ఆడవాళ్లు అయితే సంప్రదాయ వస్త్రాలైన చీర వంటి వాటిని ధరించినప్పుడు కాస్త ఇబ్బందిగా ఫీలవ్వుతారు. ఇక మగవాళ్లు జీన్స్, పంచె వంటి ట్రెడిషనల్ వేర్లను ధరించినప్పుడూ స్పష్టంగా పొట్ట ఎత్తుగా కనిపిస్తుంది. అబ్బా ఈ పొట్ట కరిగిపోయి చక్కగా ఫ్లాట్‌గా ఉంటే బాగుండును అని అనుకోని వారే లేరు. ఎందుకంటే పెద్దవాళ్లే కాదు చిన్నారులు, టీనేజర్లు కూడా ఈ సమస్యనే అధికంగా ఎదుర్కొంటున్నారు. అయితే ఆ సమస్యకు సింపుల్‌గా ఇలా చెక్పెట్టేయండి అంటూ ప్రముఖ పోషకాహార నిపుణురాలు ప్రీతికా శ్రీనివాసన్ ఇన్స్టాగ్రాం వేదికగా చక్కటి సూచనలిచ్చారు. అవేంటో చూద్దామా..!.ఫ్లాట్ స్టమక్ కోసం చాలామంది ప్రయత్నిస్తుంటారు. జిమ్, వర్కౌట్లంటూ పలు వ్యాయామాలు చేసేస్తుంటారు. అయినా పొట్ట ఫ్లాట్‌గా అవ్వడం లేదని వాపోతుంటారు. అలాంటప్పుడే తీసుకునే ఆహారాలపై ఫోకస్ పెట్టాలంటున్నారు ప్రీతికా. ఎలాంటి ఆహారాలు ఏ సమయాల్లో తీసుకుంటే మంచిది అనేదానిపై పూర్తి అవగాహన ఉండాలన్నారు. ఈ ఆహార స్ప్రుహ మిమ్మల్ని అనారోగ్య సమస్యల నుంచే గాక బానపొట్టను నివారిస్తుందని చెబుతున్నారామె. అదెలోగా ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.రాత్రిపూట మనం తీసుకునే ఆహారాలే బానపొట్టకు ప్రధాన కారణమని చెబుతున్నారు. కొన్ని రకాల ఆహారాలు పగటిపూట తీసుకోవడమే మంచిదట. మరికొన్ని రాత్రి సమయాల్లో నివారిస్తే ఈ సమస్య తగ్గుముఖం పట్టడమే గాక పొట్ట వచ్చే అవకాశం ఉండదని నమ్మకంగా చెబుతున్నారు. అందుకోసం ఏం చేయాలంటే..నివారించాల్సిన ఆహారాలు..పొట్ట ఫ్లాట్‌గా ఉండాలనుకుంటే.. సాయంత్రం ఆరు తర్వాత ఆరు ఆహారాలను పూర్తిగా నివారించాలని చెప్పారు. అవేంటంటే..చక్కెర కలిగిన ఆహారాలు కేకులు, కుకీలు, చాక్లెట్లు సాయంత్రం ఆరు తర్వాత పూర్తిగా నిషేధించండి. ఎందుకంటే వీటిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి బొడ్డు కొవ్వు నిల్వకు దారితీస్తాయి. ఫలితంగా బరువు పెరుగుతారు. మొదట్లో కష్టంగా అనిపించినా.. రాను రాను అదొక అలవాటుగా మారుతుందట. అలాగే భారీ ప్రోటీన్లు రాత్రిపూట ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. ప్రోటీన్ అనేది ఆరోగ్యకరమైనప్పటికీ ఎర్రమాంసం, కూరలు వంటి భారీ ఆహారాలు రాత్రి సమయంలో జీర్ణం కావడం కాస్త కష్టం. ఫలితంగా నిద్ర లేమి, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలు ఉత్ఫన్నమవుతాయి. బదులుగా చికెన్ బ్రెస్ట్, గుడ్లు, వంటి తేలికపాటి ప్రోటీన్లు తీసుకోండి. కార్బోనేటెడ్ పానీయాలు అస్సలు ఆరోగ్యానికి మంచివి కావని చెబుతున్నారు పోషకాహార నిపుణురాలు ప్రీతికా. పొట్ట ఫ్లాట్‌గా ఉండాలనుకుంటే సాయంత్రం ఆరు తర్వాత దీన్ని పూర్తిగా నివారించండి అని సూచిస్తున్నారు. ఆఖరికి సోడాలు, బీర్లు, బిస్లరీ వాటర్ తదితరాలను కూడా నిషేధించండి. ఇవి పొట్ట ఉబ్బరం,గ్యాస్, కొవ్వు పెరిగేందుకు కారణమవుతాయట. ఇక సాయంత్రం ఆరు తర్వాత పాల ఉత్పత్తులను నివారించండి. ఇవి కడుపుపై చాలా భారాన్ని మోపుతాయట. ఇవి అరగడానికి సమయం ఎక్కువగా తీసుకోవడమే గాక జీర్ణ సమస్యలు, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలకు దారితీస్తుందట. అందుకే సాధ్యమైనంత వరకు పాలు, చీజ్, పెరుగు, క్రీమ్‌లు వంటి వాటిని రాత్రిపూట నివారించండి. వాటిని హాయిగా పగటిపూట తినండి గానీ సాయంత్రం తీసుకోవద్దు. తెల్లబియ్యం, శుద్ధిచేసిన కార్బోహైడ్రేట్లు, బ్రెడ్లు వంటివాటికి కూడా దూరంగా ఉండండి. వీటివల్ల ఇన్సులిన్ స్పైక్స్, బొడ్డు కొవ్వు పెరిగేందుకు దారితీస్తుంది. చివరగా డీప్-ఫ్రైడ్ ఫుడ్స్.. ఫ్రెంచ్ ఫ్రైస్, పకోడీలు, కచోరీలు, సమోసాలు వంటి డీప్-ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకోవద్దు. ఈ ఆహారాల్లో కేలరీలు అధికంగా ఉంటాయి. జీవక్రియను నెమ్మదిస్తాయి. పైగా శరీరంలో అధిక కొవ్వు నిల్వకు దారితీస్తాయి. పైన చెప్పిన ఈ ఆరు ఆహారాలను డైట్లో నివారించడం ప్రారంభించిన తర్వాత ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు మొదలవుతాయని చెబుతున్నారు పోషకాహార నిపుణురాలు ప్రీతికా. అంతేగాదు బానపొట్ట సమస్య తగ్గడమే గాక ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుందన్నారు. View this post on Instagram A post shared by LogaPritika Srinivasan (@fitmom.club) (చదవండి: భగభగమండే ఎండల్లో చర్మ సంరక్షణ కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!) -
మరుభూమిగా మయన్మార్.. దారుణమైన పరిస్థితులు
నేపిడా: ప్రకృతి ప్రకోపానికి మయన్మార్.. మరుభూమిగా మారింది. గత శుక్రవారం 7.7 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం(Major earthquake) ఆ దేశాన్ని అస్తవ్యస్తం చేసింది. భూకంపం దరిమిలా ఆ దేశ ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. భూకంప మృతుల సంఖ్య 2,056 కు చేరింది. దాదాపు 3,900 మంది గాయపడ్డారు. 270 మంది గల్లంతయ్యారు.మరింత దిగజారిన పరిస్థితులు మయన్మార్(Myanmar)లోని ప్రధాన పట్టణాలైన మండలే, నేపిడాలలో భూకంప బాధితులు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఆస్పత్రులన్నీ భూకంప బాధితులతో నిండిపోయాయి. దీంతో అందరికీ వైద్యం అందని పరిస్థితి ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో వారికి చికిత్స అందించేందుకు స్థలం, వనరుల కొరత ఏర్పడుతోంది. ఈ రెండు నగరాల్లోని వైద్య సిబ్బంది బాధితులను ఆదుకునేందుకు నిరంతరం తమ సేవలు అందిస్తున్నారు.సైనిక పాలనలో..పలు నివేదికల ప్రకారం గత నాలుగేళ్లుగా కొనసాగుతున్న సైనిక పాలన(Military rule) మయన్మార్‌లో ఆరోగ్య సేవలను పూర్తిగా అస్తవ్యస్తం చేసింది. భూకంపానికి ముందు నుంచి పలు ఆసుపత్రుల పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పుడు పరిస్థితి మరింత దిగజారింది. మండలేలో పరిస్థితి దారుణంగా ఉంది. 80 శాతానికిపైగా వైద్య సిబ్బంది సైనిక పాలనకు వ్యతిరేకిస్తున్నారు. గడచిన నెలలో ఏడు ప్రైవేట్ ఆసుపత్రుల లైసెన్సులు రద్దు చేశారు. భూకంపానికి ముందే మండలేలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులను మూసివేశారు.ఆస్పత్రులు ధ్వంసంభూకంపం కారణంగా కొన్ని ఆస్పత్రులు ధ్వంసం కావడంతో బాధితులందరికీ వైద్యం అందని పరిస్థితి ఏర్పడింది. అరకొరగా ఉన్న ఆస్పత్రులలో పడకల కొరత అధికంగా ఉంది. రోగులను నేలపైనే పడుకోబెట్టి చికిత్స అందిస్తున్నారు. కాగా మయన్మార్ వాతావరణ, జలశాస్త్ర విభాగం తెలిపిన వివరాల ప్రకారం భారీ భూకంపం తరువాత 36 భూ ప్రకంపనలు నమోదయ్యాయి. వాటి తీవ్రత 2.8- 7.5 మధ్య ఉంది. శుక్రవారం 7.7 తీవ్రతతో భూకంపం సంభవించిన కొద్ది నిమిషాల తర్వాత 6.4 తీవ్రతతో మరో భూకంపం కూడా సంభవించింది.ఇది కూడా చదవండి: చిరాగ్ పాశ్వాన్ తల్లి గదికి తాళం.. రోడ్డునపడ్డ కుటుంబ కలహాలు -
ఎండల్లో ఒళ్లు జాగ్రత్త..!
మానవ మనుగడకు ఎండ ఎంత అవసరమో... అందులోని రేడియేషన్‌తో... అందునా ముఖ్యంగా రేడియేషన్ స్పెక్ట్రమ్‌లోని అల్ట్రా వయొలెట్ కిరణాలతో అంత ప్రమాదం. ఎండ ఎప్పుడూ బాహ్య అవయవమైన చర్మంపైనే పడుతుంది కాబట్టి మొదటి ప్రమాదం మేనికే. పైగా ఇప్పుడు వేసవి ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. గత కొన్నేళ్లతో ΄ోలిస్తే ఫిబ్రవరి మొదటి వారాల్లోనే ఎండ తీవ్రతలు మొదలయ్యాయి. ఈ ఎండల్లో రేడియేషన్ నుంచి ముఖ్యంగా అందులోని అల్ట్రా వయొలెట్ కిరణాల దుష్ప్రభావాలనుంచి ఎలా రక్షించుకోవాలో తెలుసుకుందాం. సూర్యకాంతిలో అల్ట్రావయొలెట్ రేడియేషన్ భూ వాతావరణంలోకి ప్రవేశించగానే అందులోని అల్ట్రా వయొలెట్–ఏ, అల్ట్రా వయొలెట్–బీ, అల్ట్రా వయొలెట్–సీ (వీటినే సంక్షిప్తంగా యూవీ–ఏ, యూవీ–బీ, యూవీ–సీ అంటారు) అనే మూడు రకాల రేడియేషన్లు వాతావరణంలో ప్రవేశించాక ప్రధానంగా యూవీ–ఏ, యూవీ–బీ కిరణాలు చర్మంపై పడతాయి. అదృష్టవశాత్తూ అల్ట్రా వయొలెట్ రేడియేషన్‌లోని ప్రమాదకరమైన యూవీ–íసీ వాతావరణంలోకి ఇంకి΄ోతాయి. దాంతో యూవీఏ, యూవీబీ రెండూ చర్మంపై పడతాయి. అయితే ఈ రేడియేషన్‌లో దాదాపు 5 శాతం తిరిగి వెనక్కు వెళ్తాయి. మరికొంత పరిమాణం అన్నివైపులకూ చెదిరిపోతుంది. ఎండ తీవ్రంగానూ, నేరుగా పడే భూమధ్యరేఖ, ఉష్ణమండల ప్రాంతాల్లో యూవీ కిరణాల ప్రభావం ఎక్కువ అని చాలామంది అనుకుంటారు గానీ... నిజానికి మంచు కప్పి ఉన్న ప్రాంతాల్లోనే రేడియేషన్ ప్రభావమెక్కువ. అంటే భూమధ్య రేఖ కంటే ధ్రువాల వైపు ΄ోతున్న కొద్దీ, అలాగే ఎత్తుకు పోయిన కొద్దీ..., అలాగే వేసవి ముదురుతున్న కొద్దీ, వాతావరణంలో మబ్బులు లేకుండా నీలం రంగు ఆకాశం ఉన్నప్పుడూ ఈ రేడియేషన్‌లోని యూవీ కిరణాల తీవ్రత పెరుగుతుంది. రేడియేషన్‌లో ప్రమాదకరమైనది యూవీ–బీ... యూవీ–ఏ, యూవీ–బీలలో రెండోది (యూవీ–బీ) చాలా ప్రమాదకరమైనది. అది చర్మం తాలూకు ‘ఎపిడెర్మిస్’ అనే పొరను తాకాక అక్కడి డీఎన్ఏ, ఆర్ఎన్ఏ, ట్రి΄్టోఫాన్, టైరోజిన్, మెలనిన్లు ఆ కిరణాలను చర్మంలోకి ఇంకి΄ోయేలా చేస్తాయి. ఆ తర్వాత అవి చర్మంలోని మరో పొర ‘డెర్మిస్’నూ తాకుతాయి. అక్కడి ఇంట్రావాస్కులార్ హీమోగ్లోబిన్, డెర్మిస్లోని టిష్యూ బైలింబిన్ అనే కణజాలాలు వాటిని గ్రహించి మళ్లీ వెనకకు పంపుతాయి. అయితే ఈ ప్రక్రియలో అల్ట్రావయెలెట్ కిరణాలు గ్రహించిన ప్రతి డీఎన్ఏలో ఎంతోకొంత మార్పు రావడం జరుగుతుంది. అలాంటి మార్పులు చాలా పెద్ద ఎత్తున లేదా తీవ్రంగా జరిగినప్పుడు చర్మంపై అవి దుష్ప్రభావాల రూపంలో వ్యక్తమవుతాయి. ఇన్‌డోర్స్‌లో ఉన్నా ప్రమాదమే... ఇండ్లలో ఉన్నవాళ్ల మీద అల్ట్రావయొలెట్ రేడియేషన్ దుష్ప్రభావం ఉండదన్నది చాలా మందిలో ఉండే మరో అ΄ోహ. ఆరుబయటితో పోలిస్తే ఇన్‌డోర్స్‌లో కాస్త తక్కువే అయినా... రేడియేషన్ దుష్ప్రభావాలు గదుల్లో ఉన్నా ఎంతోకొంత ఉండనే ఉంటాయి. గదిలో ఉన్నప్పుడు మనకు అల్ట్రా వయొలెట్ కిరణాల ప్రభావం ఉండదని అనుకుంటాంగానీ... ఇళ్లలో ఉండే ట్యూబ్లైట్స్, ఎలక్ట్రిక్ బల్బుల నుంచి కూడా దాదాపు 5 శాతం వరకు రేడియేషన్ ఉంటుంది. ఆకాశంలో మబ్బులు కమ్మి ఉన్నప్పుడు అల్ట్రా వయొలెట్ కిరణాల తీవ్రత కొద్దిగా తక్కువగా ఉండవచ్చు. కొన్ని వ్యాధుల్లో ఎండ వల్ల పెరిగే తీవ్రత... కొందరిలో ఈ కింద పేర్కొన్న ఆరోగ్య సమస్యల్లో ఏదో ఒకటి ముందుగానే ఉండవచ్చు. అయితే తీక్షణమైన ఎండకు అదేపనిగా ఎక్కువ సేపు ఎక్స్పోజ్ కావడం వల్ల ముందున్న వ్యాధి తీవ్రత పెరగవచ్చు. ఆ ఆరోగ్య సమస్యల్లో ఇవి కొన్ని... యాక్నె (మొటిమలు) అటోపిక్ ఎగ్జిమా (స్కిన్ అలర్జీ) పెలగ్రా లూపస్ అరిథమెటోసిస్, హెర్పిస్ సింప్లెక్స్ బుల్లస్ పెఫిగోయిడ్ లైకెన్ ప్లానస్ సోరియాసిస్ వైరల్ ఇన్ఫెక్షన్స్ మెలాస్మా వంటివి ముఖ్యమైనవి. రేడియేషన్ వల్ల చర్మానికి జరిగే అనర్థాలివి... అల్ట్రా వయొలెట్ కిరణాలకు ఎక్స్పోజ్ కావడం వల్ల...సన్ బర్న్స్ సన్ ట్యానింగ్ చర్మం మందంగా మారడం గోళ్లకు నష్టం కావడం అసలు వయసు కంటే పెద్ద వయసు వారిగా కనిపించడం. ఇక ఈ అంశాల గురించి వివరంగా చెప్పాలంటే... సన్‌బర్న్స్: రేడియేషన్‌లోని అల్ట్రా వయొలెట్ కిరణాల ప్రభావం మొట్టమొదట కణాల్లోని చర్మకణాల్లోని డీఎన్ఏ పై పడుతుంది. అంతకంటే ముందు మొదట చర్మం వేడెక్కుతుంది. తర్వాత ఎర్రబారుతుంది. ఆరుబయటకు వెళ్లినప్పుడు ఆ ప్రభావం నేరుగా ఎండ పడే చోట... అంటే... ఎండకు ఎక్స్΄ోజ్ అయ్యే ముఖం మీద, చేతుల మీద త్వరగా కనిపిస్తుంది. బాగా ఫెయిర్‌గా ఉండి తెల్లటి చర్మంతో ఉన్నవారిలో సన్‌బర్న్స్ త్వరగా కనిపిస్తాయి. అయితే మన దేశవాసుల్లో సన్‌బర్న్స్ కాస్త తక్కువే. సన్ ట్యానింగ్ : ఎండ తగిలిన కొద్దిసేపట్లోనే చర్మం రంగు మారి అలా అది కొన్ని నిమిషాలు మొదలుకొని కొన్ని గంటల పాటు అలాగే ఉంటుంది. దీన్నే ‘ఇమ్మీడియెట్ ట్యానింగ్’ అంటారు. ఇలా మారిన రంగు (నల్లబారడం) మొదట తాత్కాలికంగానే ఉంటుంది. కానీ ఎప్పుడూ ఎండలోనే ఉండేవారిలో రంగు మారడం చాలాకాలం పాటు కొనసాగి, ఆ మారిన రంగు కాస్తా అలాగే చాలాకాలం పాటు ఉండిపోతుంది. దీన్నే ‘డిలేయ్డ్ ట్యానింగ్’ అంటారు. అటు తర్వాత అలా చాలాకాలం పాటు ఎండకు అదేపనిగా ఎక్స్పోజ్ అవుతూ ఉండేవారిలో చర్మం మందంగా మారుతుంది. ఇలా కావడాన్ని ‘హైపర్ప్లేషియా’ అంటారు. తెల్లగా, ఎర్రగా ఉన్నవారిలో ఇలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.ఎండ ప్రభావం గోళ్ల మీద కూడా...ఎండకు అదేపనిగా ఎక్స్΄ోజ్ అవుతుండే గోళ్లకు కూడా నష్టం జరిగే అవకాశముంది. నిత్యం అల్ట్రావయొలెట్ రేడియేషన్‌కు గురయ్యే గోళ్లలో వేలి నుంచి గోరు విడివడి ఊడి΄ోయే అవకాశముంటుంది. ఇలా జరగడాన్ని వైద్యపరిభాషలో ‘ఒనైకోలైసిస్’ అంటారు. ఎండ తీవ్రతతో వచ్చే చర్మవ్యాధులివి... ఎండలోని అల్ట్రావయొలెట్ రేడియేషన్‌కు అదేపనిగా ఎక్స్పోజ్ అయ్యేవారిలో కొన్ని రకాల చర్మవ్యాధులు వచ్చే అవకాశముంది. అవి... పాలీమార్ఫిక్ లైట్ ఎరప్షన్స్ : ఇవి యుక్తవయస్కుల్లో, పిల్లల్లో ఎక్కువ. చర్మంపై ముఖ్యంగా చెంపలపైన, ముక్కుకు ఇరువైపులా ఎర్రగా ర్యాష్ రావడం, అరచేతి పైనా, మెడ వెనక ఈ ర్యాష్ కనిపిస్తుంది. ఇందులో దురద కూడా ఎక్కువే. ముఖం మీద తెల్లటి మచ్చలు వస్తాయి. ఆక్టినిక్ ప్రూరిగో: ఈ సమస్య ప్రధానంగా అమ్మాయిల్లో ఎక్కువ. చర్మం అలర్జీలు ఉన్నవారిలో ఎక్కువ. మొదట చిన్న చిన్న దురద పొక్కుల్లాగా వచ్చి, అవి పెచ్చులు కట్టి, మచ్చలా మారుతుంటాయి. అలా వచ్చిన మచ్చ ఎన్నటికీ పోదు. హైడ్రోవాక్సినిఫార్మ్ : ఈ సమస్య పిల్లల్లో కనిపించడం ఎక్కువ. ఇవి దురదగా ఉండే రక్తపు నీటి పొక్కుల్లా ఉంటాయి. చాలా ఎర్రగా మారి, ఆ తర్వాత ఎండి, రాలిపోతాయి. అటు తర్వాత అక్కడ చికెన్పాక్స్లో ఉండే మచ్చలాంటిది పడుతుంది. చెంపలు, చెవులు, ముక్కు, చేతుల మీద ఈ పొక్కులు ఎక్కువగా వస్తుంటాయి. సోలార్ అట్రికేరియా: ఎండకు బాగా ఎక్స్పోజ్ అయిన వాళ్లల్లో కొద్ది నిమిషాల్లోనే అకస్మాత్తుగా చర్మం మీద ఎర్రగా, దద్దుర్లు వస్తాయి. ఇవి ఎవరిలోనైనా రావచ్చు. క్రానిక్ యాక్టినిక్ డెర్మటైటిస్: ఇదో రకం స్కిన్ ఇన్ఫెక్షన్. ఇది వచ్చిన చోట చర్మం ఎర్రగా, మెరుస్తున్నట్లుగా, మందంగా మారి, దురద వస్తుంది. అది వచ్చిన చోట చర్మం పొడిగా మారడమే కాకుండా ఉబ్బినట్లుగా అవుతుంది. ఇది ముఖ్యంగా ముఖం మీద ఎక్కువగా కనిపించినప్పటికీ మాడు, వీపు, మెడ, ఛాతి, చేతుల మీదికి కూడా వ్యాపిస్తుంది. పెద్దవయసు వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. స్కిన్ అలర్జీ, పుప్పొడితో కనిపించే అలర్జీలతోపాటు కలిసి వస్తుంది. చర్మ కేన్సర్లు : నిరంతరం నేరుగా, తీక్షణంగా పడే ఎండలో ఎక్కువగా ఉండేవారికి చర్మక్యాన్సర్లు వచ్చే అవకాశం ఎక్కువ. వీటిల్లో మెలనోమా, నాన్మెలనోమా అని రెండు రకాల క్యాన్సర్లు రావచ్చు. అల్ట్రా వయొలెట్ రేడియేషన్‌తో ఉండే కొన్ని ప్రయోజనాలివి... అల్ట్రా వయొలెట్ రేడియేషన్ వల్ల కొన్ని ఉపయోగాలు ఉంటాయి. అవి... విటమిన్ డి ఉత్పత్తికి : అల్ట్రా వయొలెట్ కిరణాలకు ఎక్స్΄ోజ్ కాక΄ోతే అసలు విటమిన్–డి ఉత్పత్తే జరగదు. ఎముకల బలానికీ, వ్యాధినిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉండటానికీ, అనేక జీవక్రియలకూ విటమిన్–డి చాలా అవసరమన్న విషయం అందరికీ తెలిసిందే. ఎముకల బలానికి అవసరమైన క్యాల్షియమ్ మెటబాలిజమ్, ఎముకల పెరుగుదల, నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయడం కోసం, ఇన్సులిన్ ఉత్పత్తికి కూడా అల్ట్రా వయొలెట్ రేడియేషన్ కొంతమేరకు అవసరమవుతుంది. కొన్ని రకాల ఆరోగ్య సమస్యల చికిత్సల్లో : సోరియాసిస్, విటిలిగో, ఎగ్జిమా వంటి కొన్ని ఆరోగ్య సమస్యల చికిత్సలో అల్ట్రా వయొలెట్ కిరణాలను ఉపయోగిస్తుంటారు. పుట్టుకామెర్ల చికిత్సలో : నవజాత శిశువుల్లో వచ్చే పుట్టుకామెర్లు (జాండీస్)ను తగ్గించడం కోసం అల్ట్రా వయొలెట్ కిరణాలు ఉపయోగపడతాయి. ఎండలో ఉండే వ్యవధి, తీవ్రత... పెరుగుతున్న కొద్దీ దుష్ప్రభావాల పెరుగుదల... ఎండకు ఎంతసేపు అదేపనిగా ఎక్స్పోజ్ అవుతుంటే దుష్ప్రభావాలూ అంతగా పెరుగుతాయి. అలాగే అల్ట్రావయొలెట్ రేడియేషన్ తాలూకు తీవ్రత పెరుగుతున్నకొద్దీ నష్టాల తీవ్రత దానికి అనుగుణంగా పెరుగుతూనే ఉంటుంది. ఇందుకు ‘ఫొటో ఏజింగ్’ ఒక ఉదాహరణ. ఫొటో ఏజింగ్ అంటే ఎండకు ఎక్స్పోజ్ అవుతున్న కొద్దీ అంటే... ఎక్స్పోజ్ అయ్యే వ్యవధి పెరుగుతున్న కొద్దీ ఆ వ్యక్తి తన వాస్తవ వయసుకంటే ఎక్కువ వయసు పైబడినట్లుగా కనిపిస్తుంటాడు. అల్ట్రా వయొలెట్–బి రేడియేషనే ఇందుకు కారణం. ఆ కిరణాల వల్ల ముఖం అలాగే మేని మీద ముడుతలు రావడం, చర్మం మృదుత్వం కోల్పోవడం, నల్లటి మచ్చలు రావడం, వదులుగా మారి΄ోవడం, తన పటుత్వం కోల్పోవడం వల్ల ఇలా ఏజింగ్ కనిపిస్తూ ఉంటుంది. యూవీ రేడియేషన్ అనర్థాల నుంచి కాపాడుకోవడం ఇలా... ప్రధానంగా వేసవితో పాటు మిగతా అన్ని కాలాల్లోనూ ఎండ తీక్షణత ఎక్కువగా ఉండే సమయంలో అంటే... ఉదయం పది నుంచి సాయంత్రం నాలుగు వరకు ఎండలోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. చర్మంపై సూర్యకాంతి పడకుండా పొడవు చేతి చొక్కాలు (పొడడైన స్లీవ్స్ ఉండే దుస్తులు) తొడగడం మంచిది. ఎండలోకి వెళ్లాల్సి వచ్చినప్పుడు ముఖం కవర్ అయ్యేలా చేసే బ్రిమ్ హ్యాట్స్తో పాటు వీలైతే సన్‌గ్లాసెస్ కూడా వాడుకోవడం మంచిది. ఎండలోకి వెళ్లడానికి అరగంట ముందుగా సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ (ఎస్పీఎఫ్) ఎక్కువగా ఉన్న మంచి సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. అలా ప్రతి మూడు గంటలకు ఓసారి రాసుకుంటూ ఉండాలి. ఈదేటప్పుడు, చెమట పట్టినప్పుడు రాసుకునేందుకు వీలుగా కొన్ని వాటర్ రెసిస్టాంట్ సన్‌స్క్రీన్ క్రీమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ సన్‌స్క్రీన్స్ ఎంచుకునే ముందర ఒకసారి చర్మవ్యాధి నిపుణలను సంప్రదించి తమకు సరిపడే ఎస్పీఎఫ్ను తెలుసుకుని వాడటం మంచిది. డీ–హైడ్రేషన్ నివారించడానికి నీళ్లు, ద్రవాహారాలు ఎక్కువగా తాగుతుండాలి. డా. వై. అరుణ కుమారి, సీనియర్ డెర్మటాలజిస్ట్ (చదవండి: కష్టాలు మనిషిని కనివినీ ఎరుగని రేంజ్‌కి చేరుస్తాయంటే ఇదే..!) -
ఓ పెద్ద మనిషి.. ఎందుకు కోపంగా ఉన్నావ్.. నిన్ను ఎవరు బాధించారు?
వృద్ధాప్య ఛాయలను దరిచేరనీయకుండా నిత్యం యవ్వన కాంతులీనడమే ధ్యేయంగా ప్రతి ఏటా కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్న అమెరికన్ వ్యాపారవేత్త, అత్యంత సంపన్నుడు బ్రియాన్ జాన్సన్‌పై భారత వైద్యుడు సంచలన ఆరోపణలు చేశారు. ‘ది లివర్ డాక్' అనే ఇంటర్నెట్ పేరుతో ప్రసిద్ధి చెందిన కేరళకు చెందిన వైద్యుడు సిరియాక్ అబ్బీ ఫిలిప్స్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు . బ్రియాన్ చెప్పేదంతా అబద్ధమని, ఇది ప్రజల్ని మోసగించే చర్య అంటూ ధ్వజమెత్తారు.‘ప్రజలు దానివైపు వెళ్లొద్దు. అదొక భయానకమైన విధానమే కాదు.. మోసపూరితం కూడా. అత్యంత ఖరీదైనదే కాదు.. ఉపయోగం లేనిది కూడా. బ్లూ ప్రింట్ పేరుతో బ్రయాన్ చేస్తున్నదంతా పచ్చి మోసం. ప్రమాదకరమైన స్నేక్ ఆయిల్స్ ను తన ప్రయోగాల్లో బ్రయాన్ జాన్సన్ వాడుతున్నాడు’ అంటూ ఫైరయ్యాడు.తన రక్త పరీక్ష సంస్థ థెరానోస్ కు సంబంధించిన కేసులో దోషిగా తేలిన అమెరికన్ బయోటెక్నాలజీ పారిశ్రామికవేత్త ఎలిజబెత్ ఏన్ హోమ్స్, ఆస్ట్రేలియన్ ఇన్ ఫ్లూయెన్సర్ బెల్లె గిబ్సన్లతో బ్రయాన్ జాన్సన్ ను పోల్చాడు అబ్బీ ఫిలిప్స్. నిన్న(ఆదివారం) అబ్బీ ఫిలిప్ప్ ఈ ఆరోపణలు చేయగా, తాజాగా బ్రయాన్ జాన్సన్ మాత్రం సుతిమెత్తాగా స్పందించాడు. అబ్బీ ఫిలిప్స్ చేసిన ఆరోపణలకు సమాధానాలు ఇవ్వకుండా.. ‘ నీకు ఏమైంది.. ఎందుకు కోపంగా ఉన్నావ్.. ఎవరు నిన్ను బాధించింది?’ అంటూ రిప్లే ఇచ్చారు బ్రయాన్ జాన్సన్.అసలు బ్రయాన్ జాన్సన్ కథేంటి..?వృద్ధాప్య ఛాయలను దరిచేరనీయకుండా నిత్యం యవ్వన కాంతులీనడమే ధ్యేయంగా ప్రతి ఏటా కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్న అమెరికన్ వ్యాపారవేత్త, అత్యంత సంపన్నుడే బ్రియాన్ జాన్సన్ మిలియనీర్ బ్రయాన్ జాన్సన్ యాంటీ ఏజింగ్ ప్రయోగాలతో వార్తల్లో నిలిచిన వ్యక్తి. దీని కోసం కోట్లక్దొదీ డబ్బుని ఖర్చు చేస్తున్న వ్యక్తిగా అందరి దృష్టిని ఆకర్షించారు. అతడు ఆ ప్రయోగాల్లో సక్సెస్ అందుకుంటాడో లేదా గానీ బ్రయాన్ తనపై చేసుకునే ప్రయోగాలు ఊహకందని విధంగా భయానకంగా ఉంటాయి. ఇంతకుముందు ప్లాస్మా, తన కొడుకు రక్తం ఎక్కించుకోవడం వంటి వాటితో హడలెత్తించాడు. ఇప్పుడు స్వచ్ఛమైన ఆక్సిజన్‌తో ఆరోగ్యం తోపాటు వృద్ధాప్యాన్ని తిప్పికొట్టేలా ఏకంగా తన కార్యాలయాన్నే హైపర్బారిక్ ఆక్సిజన్ చాంబర్‌గా మార్చేశారు. ఇలా ప్రయోగాలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు బ్రయాన్ జాన్సన్. It is terrifying that people do not see Bryan Johnson as actually a well-evolved masculine form of fraudsters Elizabeth Holmes and Belle Gibson, selling both expensive and utterly useless investigations and peddling potentially dangerous snake oil supplements in the name of… pic.twitter.com/qjts5KKXTF— TheLiverDoc (@theliverdr) March 30, 2025 Cyriac why are you so angry? Who hurt you?Blueprint offers extra virgin olive oil, proteins, nuts, and nutrients which have independent and robust scientific evidence. They are third party tested. The certificates of analysis are publicly available. They are affordably priced.— Bryan Johnson (@bryan_johnson) March 30, 2025 -
అలా స్ట్రోక్ బారిన పడటంతో ఏకంగా 14 నెలలు..!: జెరోధా సీఈవో నితిన్ కామత్
స్టాక్ ట్రేడింగ్ చేసేవారికి జెరోధా పరిచయం అక్కర్లేని పేరు. ఎందరో దీంట్లో డీమ్యాట్ అకౌంట్లు ఓపెన్ చేసి ట్రేడింగ్ చేస్తుంటారు. ఇక జెరోధా సంస్థ సీఈఓ నితిన్ కామత్ కూడా అందరికి సుపరిచితమే. ఎప్పుడూ ఫిట్‌గా ఉంటూ.. ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యత ఇవ్వడమే గాక పలు సలహాలు సూచనలు ఇస్తుంటారు. అలాంటి ఆయనే పాకిక్ష పక్షవాతానికి(స్టోక్) గురయ్యినట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. అంతేగాదు తాను కోలుకోవడానికే పద్నాలుగు నెలలు పట్టిందని అన్నారు. ఆరోగ్యం పట్ల ఇంతలా కేర్ తీసుకునేవాళ్లే స్టోక్ బారినపడితే సామాన్యుల పరిస్థితి ఏంటీ..?, ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితా అంటే..ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో జెరోధా సహ వ్యవస్థాపకుడు, సీఈవో అయిన నితిన్ కామత్ తాను స్టోక్ అనంతరం ఎలా కోలుకుని యథావిధికి వచ్చారో షేర్చేసుకున్నారు. తాతను గతేడాది మైల్డ్ స్టోక్ బారినపడినట్లు వివరించారు. తండ్రి చనిపోవడం, నిద్రలేమి, అలసట, డీహైడ్రేషన్, అతి వ్యాయమం వంటి వాటి వల్ల ఆ పరిస్థితి ఎదురయ్యిందని పోస్ట్‌లో తెలిపారు. దాన్నంచి ఆరునెలలో కోలుకున్నా కానీ, ముఖంలో ఆ స్ట్రోక్ తాలుకా లక్షణాలు క్లియర్‌గా కనిపించేవన్నారు. ఆ తర్వాత స్పష్టంగా చదవలేకపోవడం, రాయలేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొన్నా..కానీ ఆ తర్వాత నెమ్మదిగా మళ్లీ చదవడగలగడం, రాయడం వంటి సామర్థ్యాల్ని పొందగలిగానని అన్నారు. సుమారు 14 నెలలి తన శరీరం సాధారన స్థితికి చేరుకుందని అన్నారు. ఇప్పుడు దాదాపు 85% నా మనస్సు నా వద్దే ఉందన్నారు. అలాగే మునుపటిలో మరింత మెరుగుపడేలా సాధన చేయాల్సి ఉందని కూడా చెప్పారు. అయితే తాను ఇలా పూర్తి స్థాయిలో కోలుకోవడం చూసి డాక్టర్లు సైతం ఆశ్చర్యపోయారని అన్నారు. అంతేగాదు ఫిట్‌గా ఉండటంపై కేర్ తీసుకోవడమే గాక ఎంతమేర ఏ స్థాయి వరకు వ్యాయమాలు చేస్తే చాలు అన్న అవగాహన కూడా అత్యంత ముఖ్యమని చెప్పారు. అలాకాదని అతిగా వర్కౌట్లు చేస్తే శరీరం మోటారు వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూసి స్ట్రోక్ బారినపడే ప్రమాదం పొంచి ఉంటుందని హెచ్చిరించినట్లు తెలిపారు. ఆయన జీరో 1 ఫెస్ట్ అనే జెరోధా వెంచర్ సాయంతో ఆరోగ్య సంపద, అందుకోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి వాటి గురించి చర్చించడం వంటివి చేస్తుంటారు. ఇంతకీ ఈ స్ట్రోక్ అనేది అత్యంత ప్రమాదరకమైనదా? అంటే..తస్మాత్ జాగ్రత్త..ఉన్నట్టుండి తూలిపడిపోతున్నారా.. రెప్పపాటులోనే కంటి చూపు పోయి అంతా చీకటి అవుతోందా…పెదవులు ఓ పక్కికి లాగినట్టు అవుతున్నాయా? అయితే బీకేర్‌ఫుల్? అది బ్రెయిన్ స్ట్రోక్ లక్షణం కావచ్చు. గుండెపోటు వస్తే కాస్త ఆలస్యం అయితే ప్రాణం పోతుంది కానీ… బ్రెయిన్ స్ట్రోక్ వస్తే ఏకంగా బతికినంత కాలం అంగవైకల్యం భారిన పడేసి… మరొకరి మీద ఆధారపడే దీనస్థితికి తీసుకువస్తుంది. అందుకే స్ట్రోక్ లక్షణాలు కనిపిస్తే సత్వరం స్పందించాలని హెచ్చరిస్తుంటారు వైద్యులు.లక్షణాలు..బ్రెయిన్ స్ట్రోక్ వస్తే కొన్నిసార్లు ప్రాణం పోతుంది. ఇంకొన్నిసార్లు పక్షవాతం బారినపడతారు. తలలోని రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడి రక్తం సరఫరా నిలిచిపోవటం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. ఒక్కసారి స్ట్రోక్ బారిన పడితే నాలుగు గంటలలోపు సరైన చికిత్స అందించకపోతే మనిషి చనిపోవచ్చు లేదా జీవితకాలం వైకల్యం బారిన పడి మంచానికే పరిమితమవుతుంటారు. అందుకే బ్రెయిన్ స్ట్రోక్‌ని అత్యంత ప్రమాదకారిగా చెబుతుంటారు. శరీరంలోని ఓ చేయి బలహీనంగా అనిపించటం, అడుగువేసేందుకు కాళ్లు సహకరించకపోవటం, ఉన్నపళంగా బ్యాలెన్స్ తప్పి పడిపోతుండటం, కళ్లకు ఏమి కనిపించకుండా చీకట్లు కమ్మటం, మూతి ఓ పక్కకు తిరిగిపోతుండటం వంటివి బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు.భారత్‌లో ప్రతి నలభై సెకన్లకు ఒకరు బ్రెయిన్ స్ట్రోక్ భారిన పడుతుండగా… ప్రతి నాలుగు నిమిషాలకు ఒకరు దీని కారణంగానే చనిపోతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. బ్రెయిన్ స్ట్రోక్స్‌లో ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి. మొదటిది ఇస్కిమిక్ స్ట్రోక్. ఇందులో మెదడులోని రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడటం వల్ల వచ్చే స్ట్రోక్. దాదాపు 87 శాతం బ్రెయిన్ స్ట్రోక్‌లు ఇలా రక్తనాళాల్లో అంతరాయం ఏర్పడటం వల్ల వచ్చేవే. రెండోది హిమోరేజిక్ స్ట్రోక్. మెదడులో రక్తస్రావం అయినప్పుడు ఈ తరహా స్ట్రోక్‌లు వస్తాయి. కేవలం 13 శాతం మాత్రమే ఈ తరహా స్ట్రోక్‌లు ఉంటాయి. మనిషి శరీరంలో ఏ అవయవం పనిచేయాలన్నా మెదడు నుంచే సంకేతాలు రావాలి. అలాంటి మెదడు రక్తనాళాల్లో రక్తం సరఫరాకు అంతరాయం ఏర్పడినప్పుడు మనిషి మరణానికి దారి తీయటం లేదా పక్షవాతంతో కాళ్లు, చేతులు పనిచేయక శాశ్వత వైకల్యానికి దారి తీస్తోంది.ఎందువల్ల వస్తుందంటే..ఒక్కసారి స్ట్రోక్ బారినపడితే చాలు మనిషి జీవితం పూర్తిగా మారిపోయే ప్రమాదం ఉంది. వాస్తవానికి బ్రెయిన్ స్ట్రోక్‌కి కారణాలు అనేకం. మెదడులో రక్తం గడ్డకట్టడం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ ప్రధాన కారణాలు కాగా.. కొన్ని రకాల గుండె జబ్బులు, వారసత్వం, ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవటం, తీవ్రమైన ఒత్తిడి, నిద్రలేమి, గురక, స్లీప్ ఆప్నియా వంటి అనేక కారణాలు స్ట్రోక్‌కి దారితీస్తున్నాయి. ఇటీవలే వాతావరణ మార్పులు సైతం స్ట్రోక్‌కి కారణమవుతున్నట్టు నిపుణులు గుర్తించారు. అయితే స్ట్రోక్ లక్షణాలని సకాలంలో గుర్తిస్తే బాధితులను కాపాడుకునే అవకాశం ఉంది. స్ట్రోక్ భారిన పడిన వారిని ఎంఆర్ఐ, సీటీ స్కాన్ వంటి సౌకర్యాలు ఉన్న ఆస్పత్రులకు తీసుకువెళ్లి.. టెస్టులు చేసి నాలుగు గంటలలోపే కొన్ని రకాల ఇంజక్షన్లు ఇవ్వటం ద్వారా బాధితులు శాశ్వత వైకల్యం భారిన పడకుండా కాపాడవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉన్నామనే ఆలోచనతో దేన్ని తేలిగ్గా తీసుకోకండి, శరీరం మాట వినండి అని చెబుతున్నారు వైద్య నిపుణులు. View this post on Instagram A post shared by Nithin Kamath (@nithinkamath) (చదవండి: అంతర్వాహిని సరస్వతి నది పుష్కరాలు ట్రిప్‌కి వెళ్లొద్దాం ఇలా..! చక్కటి ఐఆర్సీటీసీ ప్యాకేజ్‌తో) -
వేసవిలో డీ హైడ్రేషన్ కట్టడికి కొబ్బరి నీరే తప్పనిసరా..?
సమ్మర్ వచ్చేస్తుందంటేనే భయం వేస్తుంది. ఉక్కపోతాలు, సూర్యుడి భగభగలు తలుచుకుంటే వామ్మో..! అనిపిస్తుంది. ఆఖరికి వండిన ఏ వంటకాలు నిల్వ ఉండవు. మధ్యాహ్నా 12 దాటితే బయటకు అగుపెట్టే ఛాన్సే లేదన్నంత వేడి సెగలు. ఎంత నీడ పట్టున కూర్చొన్న ఆ ఎండల వేడికి ఒకటే దాహం, నోరంతా పెడుచుకట్టుకుపోయినట్లు ఉంటుంది. దాంతో చాలావరకు కొబ్బరి బొండాలు, చెరుకురసం వంటివి వాటితో హైడ్రేటెడ్‌గా ఉండేలా చేసుకుంటారు. అయితే చెరుకురసంలో ఉండే అధిక చక్కెరల దృష్ట్యా కొబ్బరి నీళ్ల వైపుకే మొగ్గు చూపుతారు. అందులోనూ వేసవి అని అటు కొబ్బరి కాయల వ్యాపారలు అదును చూసి ఎక్కువ ధరలకు విక్రయిస్తుంటారు. ఎండల భయంతో విధిలేక అంత ధర వెచ్చించి మరీ కొని తాగేస్తుంటారు. అయితే అదేం అవసరం లేదంటున్నారు వైద్య నిపుణులు. సమ్మర్లో కొబ్బరి బొండాలు తప్పనిసరి ఏం కాదని తేల్చి చెబుతున్నారు. వాటికి బదులుగా తక్కువ ఖర్చులో డీహైడ్రేషన్‌కి చెక్‌పెట్టొచ్చని చెబుతున్నారు అదెలాగో చూద్దామా..!.ఆరోగ్య స్పుహ ఎక్కువై సోషల్ మీడియాలోనూ, పేపర్లోనూ కొబ్బరి నీరుకి మించిన దివ్యౌషధం లేదంటూ ఊదరగొట్టుస్తున్నారు. నిజానికి కొబ్బరి నీరేమి సర్వరోగ నివారిణి కాదంటున్నారు వైద్యులు. ఇది హైడ్రేషన్‌గా ఉంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అది సమంజసమే అయినా..మార్కెట్లో అధిక ధర పలుకుతున్నప్పడు ప్రత్యామ్నాయంగా తరుచుగా నీరు తాగితే చాలు. పోనీ వేడికి తాళ్లలేకపోతున్నాం అనుకుంటే అరటిపండ్లు, నీళ్లు తాగినా డీహైడ్రేషన్‌కి గురవ్వరని చెబుతున్నారు నిపుణులు. ఎలక్ట్రోలైట్ల సమృద్ధి కారణంగా..చాలామంది వేసవిలో కొబ్బరి నీళ్లు తాగకపోతే వేడి చేస్తుందని, ముక్కు నుంచి రక్తం కారుతుందని ఫిర్యాదులు చేస్తుంటారు. అది చాలా తప్పు ఆ సమస్యకు మూల కారణం తెలుసుకునేలా ఈఎన్టీ వైద్యుడిని సంప్రదించాలే గానీ కొబ్బరినీరు తగ్గిస్తుందని చెప్పడం సరైనది కాదంటున్నారు వైద్యులు. అలాగే చాలామంది మూత్రపిండాల్లో రాళ్లను నివారించడానికి కొబ్బరి నీరే మంచిదనుకుంటారు. అది కూడా సరైనది కాదు. ఎందుకంటే కొబ్బరినీటిలో పోషకాలు ఉన్నాయి కానీ అది మూత్రపిండాల్లో రాళ్లను తగ్గించేంత శక్తి అయితే ఉండదని నొక్కి చెప్పారు నిపుణులు. కేవలం వడదెబ్బ తగ్గినప్పుడు ఈ కొబ్బరినీరు తక్షణమే శక్తిని ఇచ్చి, ఎలక్ట్రోలైట్లతో బాడీని భర్తీ చేస్తుంది. త్వరితగతిన కోలుకునేలా చేస్తుందన్నారు. లేత కొబ్బరి నీరు ప్రకృతి ప్రసాదించిన రిఫ్రెషింగ్ అమృతం!. ఎలక్ట్రోలైట్లతో నిండిన ఇది, తక్కువ కేలరీలు, అధిక పొటాషియం, విటమిన్ బీ, సీలు కలిగిన హైడ్రేటింగ్ పానీయం. రీహైడ్రేషన్, జీర్ణక్రియ, రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. మనకు మంచి ఆరోగ్యకరమై ఎనర్జీ ఇచ్చేందుకు తీసుకోవాలే తప్ప. అది తీసుకుంటేనే హైడ్రేటెడ్‌గా ఉంటామనేది అపోహేనని తేల్చి చెప్పారు. అలాగే దీన్నీ హైడ్రేషన్‌కి సంబంధించిన ప్రాథమిక వనరుగా తీసుకోకూడదు. ఆ సమస్యలు ఉత్ఫన్నమైనప్పుడూ..అథ్లెట్లకు లేదా వేడి వాతావరణంలో పనిచేసేవారికి కొబ్బరినీటిలో ఉండే అధిక ఎలక్ట్రోలైట్ కంటెంట్ కారణంగా తీసుకోమని వైద్యులు సూచిస్తారే తప్ప, ప్రత్యామ్నాయంగా అరటిపండ్లు, చల్లటి నీరు తాగవచ్చు అని చెబుతున్నారు నిపుణులు. కొబ్బరి నీరు అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందించినప్పటికీ ఇది అన్నీ ఆరోగ్య సమస్యలకు అద్భుత నివారిణీ మాత్రం కాదని చెప్పారు. ముఖ్యంగా విరేచనాలు, మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడుతున్నవారికి అలసట బారిన పడకుండా ఉండేలా వైద్యులు నీటికి బదులుగా దీన్ని సూచించడం జరుగుతుందని వివరించారు. కాబట్టి సరసమైన ధరల్లో కొబ్బరి బొండాలు దొరికితే హయిగా కొనుక్కుని ఆస్వాదించండి లేదంటే హైడ్రేషన్ కోసం తక్కువ ధరలోనే ప్రత్యామ్నాయులు ఉన్నాయనే విషయం గ్రహించండి అని చెబుతున్నారు వైద్యులు.(చదవండి: జెన్ జడ్ రెబల్స్..ఈ తరం ఉద్యోగులు సరిచేసుకోవాల్సినవి ఇవే..!) -
గ్లోబల్ స్టార్ రామ చరణ్ ఫిట్నెస్ సీక్రెట్..! డైట్లో అవి ఉండాల్సిందే..
చిరంజీవి నట వారసుడిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన రామ్ చరణ్ తండ్రికి తగ్గ తనయుడు అని నిరూపించుకున్నాడు. నటన పరంగా యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ఎందులోనైనా తండ్రికి ధీటుగా చేసి విమర్శకుల ప్రశంసలందుకున్నారు. ప్రస్తుతం ఆయన గ్లోబల్ స్టార్‌గా వెలుగొందుతున్నారు. ఇవాళ ఆయన పుట్టినరోజు. ఈ రోజుతో ఆయనకు 40 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా చరణ్ ఫిట్నెస్ సీక్రెట్, డైట్‌ప్లాన్‌లు ఏంటో చూద్దామా. ఆయన తొలి చిత్రం చిరుత మూవీ నుంచి ఇటీవల విడుదలైన గేమ్‌ఛేంజర్ మూవీ వరకు అదే లుక్‌తో కనిపించేలా బాడీని మెయింటైన్ చేస్తున్నారు. అంతలా ఫిట్‌గా కనిపించేందుకు వెనుక ఎంతో డెడీకేషన్తో చేసే వర్కౌట్లు అనుసరించే డైట్లే అత్యంత ప్రధానమైనవి. అవేంటో చూద్దామా..రామ్ చరణ్ ఒకసారి అపోలా లైఫ్ డాట్ కామ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తను ఫిట్‌గా యాక్టివ్‌గా ఉండేందుకు ఎలాంటి వ్యాయమాలు, ఆహారం తీసుకుంటారో షేర్ చేసుకున్నారు. జంపింగ్ జాక్‌లు, సీటెడ్ మెషిన్ ప్రెస్‌ల నుంచి మిలిటరీ పుషప్‌లు, బార్బెల్ స్టిఫ్-లెగ్ డెడ్ లిఫ్ట్‌ల వరకు ప్రతిదీ చేస్తానని అన్నారు. అయితే ఇంట్లో వండిన భోజనం మాత్రమే తీసుకుంటానని అన్నారు. సమతుల్య జీవనశైలికి ప్రాధన్యాత ఇస్తానని చెప్పారు. ప్రతిరోజూ కొన్ని క్రీడలు తప్పనిసరిగా ఆడతానని అన్నారు. వారంలో నాలుగు రోజులు అధిక తీవ్రతతో కూడిన వ్యాయామాలు తప్పనిసరిగా చేస్తానని అన్నారు. ముఖ్యంగా ప్రశాంతంగా ఉండేందుకు ఇష్టపడతానని చెప్పారు. అలాగే ప్రతిరోజు ఒక గంటన్నర పాటు వ్యాయామం చేస్తానని తెలిపారు. అంతేగాదు శరీర బరువుని అదుపులో ఉంచే వ్యాయామాలపై దృష్టి పెడతానని చెప్పారు. 80% ఆహారంపైనే..ఫిట్ బాడీని నిర్వహించడంలో ఆహారం ప్రాముఖ్యతను హైలెట్ చేశారు రామ్‌చరణ. మన ఆరోగ్యం 80 శాతం తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుందన్నారు. అందువల్ల మనం ఏం తింటున్నాం అనేది అత్యంత ముఖ్యం అని చెప్పారు. అలాగే తాను ఆహారం విషయంలో చాలా కేర్ తీసుకుంటానని చెప్పారు. అనారోగ్యకరమైన ఆహారాలకు చాలా దూరంగా ఉంటానని చెప్పారు. అంతేగాదు ప్రతి ఆదివారం చీట్మీల్స్లో పాల్గొంటా, కానీ అది సృతి మించకుండా చూసుకుంటానని అన్నారు. డైట్ సీక్రెట్స్ఫిట్నెస్ కోచ్ రాకేష్ ఉడియార్ రూపొందించిన డైట్ ప్లాన్ ప్రకారం..కెఫిన్, ఆల్కహాల్, చక్కెర పానీయాలు, రెడ్ మీట్, గోధుమలు, ప్రోటీన్ షేక్‌లకు దూరంగా ఉంటారట రామ్‌చరణ్. తన రోజుని గుడ్డులోని తెల్లసొనతో చేసిన ఆమ్లేట్ లేదా పూర్తి గుడ్లు, ఓట్స్, బాదంపాలతో ప్రారంభిస్తారట. ఆ తర్వాత మధ్యాహ్నం కూరగాయలతో చేసి సూప్‌ని తీసుకుంటారట. ఇక భోజనంలో చికెన్ బ్రెస్ట్, బ్రౌన్ రైస్, గ్రీన్ వెజిటేబుల్ కర్రీ తీసుకుంటారట. సాయంత్రం స్నాక్స్ కోసం గ్రిల్డ్ ఫిష్, చిలగడదుంప, గ్రిల్డ్ వెజిటేబుల్స్‌ను ఇష్టపడతారని చెప్పారు. సాయంత్రం 6 గంటలకు రాత్రి భోజనంలో 'లార్జ్ మిక్స్డ్ గ్రీన్ సలాడ్', కొన్ని అవకాడోలను తీసుకుంటారని తెలిపారు ఫిట్నెస్ కోచ్ రాకేష్ ఉడియార్.వారంలో చేసే వర్కౌట్లు:సోమవారం: బైసెప్స్ (తప్పనిసరి)మంగళవారం: క్వాడ్స్బుధవారం: క్లేవ్స్ అండ్ అబ్స్గురువారం: ఛాతీ ట్రైసెప్స్శుక్రవారం: బ్యాక్ వర్కౌట్లుశనివారం: హామ్ స్ట్రింగ్ అండ్ ఇన్నర్ థై అబ్స్ఆదివారం: ఫుల్ రెస్ట్ View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) (చదవండి: బాబోయ్ మరీ ఇంతలానా..! వైరల్‌గా ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ జీవనశైలి) -
చిరాకుగా ఉన్నా.. చిద్విలాసంతో ఉన్నా.. చిరుతిండికే ఓటు ..!
ఆఫీసులో ఉండగా కలుద్దామని ఫ్రెండ్ ఫోన్ చేస్తే సమీపంలో ఉన్న ఏ ఛాయ్ క్యాంటీన్లోనో, కేఫ్‌లోనో కలుద్దాం అని చెబుతాం.. ఏ పార్క్‌లోనో, ట్యాంక్ బండ్ మీదో ఒంటరిగా కూర్చున్నప్పుడు పల్లీలు అమ్మేవాడో, ముంత కింద పప్పు వాడో కనిపిస్తే.. నోటికి పని చెబుతాం.. ఇలా ఎందుకు చేస్తాం? ఆకలి తీర్చుకోడానికా? లేక అవి తినాలనే ఆతృతతోనా? అంటే రెండూ కాదు.. మన మూడ్‌ను మెరుగుపరుచుకోవడం కోసం అంటున్నారు హైదరాబాద్ నగరవాసులు. రోడ్డు పక్కన దొరికే పానీ పూరీ కావచ్చు, థియేటర్లో కరకరమనిపించే పాప్ కార్న్ కావచ్చు.. సరదాగా లాగించే సమోసాలు కావచ్చు.. చిది్వలాసంతో నమిలేసే చిప్స్కావచ్చు.. ఇవన్నీ ఇంట్లో ముప్పూటలా తినేతిండికి అదనం. మన మూడ్స్‌ను మెరుగుపరిచే ఇంధనం.. గోద్రెజ్ ఫుడ్స్ లిమిటెడ్ ఎస్టీటీఈఎమ్ 2.0 స్నాకింగ్ రిపోర్ట్ ప్రకారం గత కొంతకాలంగా అధ్యయనాలు చెబుతున్న ఇదే అంశాన్ని అంగీకరిస్తున్నారు నగరవాసులు. చిరుతిండి మనలో ఉత్సాహాన్ని పెంచుతుంది. మన భావోద్వేగాలను మెరుగుపరచడంలో శక్తిమంతమైన పాత్ర పోషిస్తుందని స్పష్టం చేస్తున్నారు. ఎప్పుడు? ఎందుకు? ఏమిటి ఎలా.. సిటిజనులు స్నాక్‌కు సై అంటున్నారు? ఈ రిపోర్ట్‌లో పేర్కొన్న ప్రకారం చూస్తే.. మంచి మూడుకు స్నాక్ బూస్ట్..చిరుతిండి, హ్యాపీ మూడ్స్ ఒకదానికొకటి అనుబంధంగా ఉంటున్నాయనేది స్పష్టంగా తెలుస్తోంది. సర్వేలో పాల్గొన్నవారిలో 62% మంది మూడ్స్‌ను హ్యాపీగా ఉంచడం కోసం స్నాక్స్ తీసుకుంటారని అంగీకరించారు. అదే విధంగా 45% మంది పార్టీలు, వేడుకల సమయంలో ఫ్రోజెన్ స్నాక్స్ కోసం చూస్తామని చెప్పారు. అంటే విభిన్న రకాల వంటకాలు ఉన్నప్పటికీ స్నాక్స్ విలువ తగ్గదు అని దీనిద్వారా తెలుసుకోవచ్చు. ఎందుకంటే అవి వారి అనుభవాలను మరింతగా మెరుగుపరుస్తాయనే ఆలోచనతోనే అని చెబుతున్నారు. అలాగే నగరంలో 45% మంది వారాంతాల్లో కూడా ఫ్రోజెన్ స్నాక్స్‌ను ఇష్టపడతారు. వారి విశ్రాంతి సమయాలకు కొత్త రుచులను జత చేస్తారు. ఆరోగ్యకరమైనవి ఎంచుకుంటే మేలు.. స్నాక్స్ తీసుకోవడం తప్పుకాకున్నా.. ఒబెసిటీ ముప్పు వెంటాడుతూనే ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మితంగా తీసుకునే చిరుతిండిలో ఆరోగ్యకరమైన బాదం తదితర పప్పులు చేర్చాలని, విటమిన్లు, జింక్, ఫోలేట్ ఐరన్‌తో సహా 15 ముఖ్యమైన పోషకాల సహజ మూలంగా ఆల్మండ్స్ రోగనిరోధకతను మెరుగుపరుస్తాయని పోషక నిపుణులు చెబుతున్నారు. ఇవి ఎప్పుడైనా ఆస్వాదించడానికి అనుకూలమైన చిరుతిండిగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తేల్చింది. అలాగే నారింజ, ద్రాక్షపండు వంటి సిట్రస్ పండ్లు విటమిన్–సీ అందిస్తాయి. ఇది తెల్ల రక్త కణాల ఉత్పత్తికి అవసరమైన పోషకం–ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా రక్షణ ఇస్తుంది. ఈ పండ్లను స్నాక్స్‌గా మార్చుకోవడం రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది. అలాగే ఆకుకూరలతో కూడిన వెజ్ సలాడ్స్ కూడా మేలైనవేనని న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు.టైం ఏదైనా.. అటెన్షన్ కోసం.. పరీక్షల ముందు టెన్షన్ కావచ్చు.. రొమాంటిక్ సమయంలో అటెన్షన్ కావచ్చు.. కాదే సందర్భమూ స్నాకింగ్‌కు అనర్హం అంటున్నారు నగరవాసులు. నగరంలో 17% మంది విద్యార్థులు పరీక్షా సన్నాహక సమయంలో ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం చిరుతిండికి జై కొడుతున్నామని అంటున్నారు. మరోవైపు శృంగార సమయంలోనూ మానసిక స్థితిని బెటర్‌గా ఉంచేందుకు స్నాక్స్ తోడు కోరుకుంటున్నామని 16 శాతం మంది చెప్పారు. ఆట పాటల్లోనూ అదే బాట.. ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ పోటీ జరుగుతోంది. ఇలాంటి ప్రత్యక్ష క్రీడా ఈవెంట్లను కేఫ్స్లోనో, పబ్స్/క్లబ్స్లోనో వీక్షించే సమయంలో దాదాపు అందరి ముందూ ఏదో ఒక చిరుతిండి కనబడడం మనం గమనించవచ్చు. ఇదే విషయాన్ని అంగీకరిస్తూ నగరంలో 50% మంది తమ వీక్షణ అనుభవాన్ని మెరుగుపరచుకోడానికి స్నాక్స్‌కి సై అంటారు. అదే విధంగా 54% మంది నగరవాసులు టీవీ/ఒటీటీ/మొబైల్లో వెబ్ సిరీస్, సినిమాలు లేదా షోలను చూస్తున్నప్పుడు స్నాక్స్ తీసుకోడాన్ని ఇష్టపడతామని చెప్పారు. -
అయోవా నాట్స్ ఆరోగ్య అవగాహన సదస్సు
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా అయోవాలో ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖ వైద్యులు డాక్టర్ స్మిత కుర్రా, డాక్టర్ ప్రసూన మాధవరం, డాక్టర్ నిధి మదన్, డాక్టర్ విజయ్ గోగినేని వివిధ ఆరోగ్య అంశాలపై తెలుగువారికి అవగాహన కల్పించారు. భారత ఉపఖండంలో మధుమేహం వ్యాధి, ఆ వ్యాధి ప్రాబల్యంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.. మధుమేహం నివారించడానికి లేదా తొందరగా రాకుండా ఉండటానికి కొన్ని విలువైన చిట్కాలను తెలుగు వారికి వివరించారు. హృదయ సంబంధ వ్యాధులపై కార్డియాలజిస్ట్ అయిన డాక్టర్ నిధి మదన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. గుండె జబ్బు అంశాలపై ప్రేక్షకుల నుండి వచ్చిన అనేక ప్రశ్నలకు విలువైన సమాధానమిచ్చారు. గుండె సమస్యలను నివారించడానికి ఉత్తమ జీవనశైలిని సూచించారు.అయోవా చాప్టర్ బృందంలో భాగమైన పల్మనాలజిస్ట్ డాక్టర్ విజయ్ గోగినేని నిద్ర, పరిశుభ్రత, స్లీప్ అప్నియాపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నాణ్యమైన నిద్ర, స్లీప్ అప్నియా లక్షణాలను గుర్తించడం వల్ల కలిగే ప్రాముఖ్యత, వచ్చే ఆరోగ్య ప్రయోజనాలను డాక్టర్లు చక్కగా వివరించారు. డాక్టర్ స్మిత కుర్రా నేతృత్వంలో ఏర్పాటైన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో చొరవ తీసుకున్నారు, ఇతర వైద్యులతో సమన్వయం చేసుకుని ఈ కార్యక్రమానికి అనుసంధాన కర్తగా వ్యవహరించారు.నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ప్రెసిడెంట్(ఎలక్ట్) శ్రీహరి మందాడి, నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి జమ్ముల ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించినందుకు అయోవా చాప్టర్ కో ఆర్డినేటర్ శివ రామకృష్ణారావు గోపాళం, నాట్స్ అయోవా టీం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమానికి ఆహారాన్ని స్పాన్సర్ చేసినందుకు అయోవాలోని సీడర్ రాపిడ్స్‌లో ఉన్న పారడైజ్ ఇండియన్ రెస్టారెంట్ యజమాని కృష్ణ మంగమూరి కి నాట్స్ అయోవా చాప్టర్ సభ్యుడు శ్రీనివాస్ వనవాసం కృతజ్ఞతలు తెలిపారు. నాట్స్ హెల్ప్‌లైన్ అమెరికాలో తెలుగువారికి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడుతుందని.. అత్యవసర పరిస్థితుల్లో నాట్స్ హెల్ప్ లైన్ సేవలు వినియోగించుకోవాలని నాట్స్ అయోవా చాప్టర్ సభ్యులలో ఒకరైన హొన్ను దొడ్డమనే తెలిపారు.జూలై4,5,6 తేదీల్లో అంగరంగవైభవంగా టంపాలో జరిగే అమెరికా తెలుగు సంబరాలకు రావాలని నాట్స్ అయోవా సభ్యులు నవీన్ ఇంటూరి తెలుగువారందరిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో,నాట్స్ అయోవా చాప్టర్ సలహాదారు జ్యోతి ఆకురాతి, ఈ సదస్సుకు వచ్చిన వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి! -
అందం, ఆరోగ్యాన్ని ఇచ్చే స్మార్ట్ ఆభరణాలు..! థర్మామీటర్ చెవిపోగు ఇంకా..
అందం కోసం ఆభరణాలను ధరించడం మామూలే కాని, అవే ఆభరణాలు అందంతోపాటు ఆరోగ్యాన్ని, టెక్నాలజీని అందిస్తే భలే బాగుంటుంది కదూ! అయితే, ఈ గాడ్జెట్స్ మీ కోసం..థర్మామీటర్చెవిపోగుశరీర ఉష్ణోగ్రతను తెలుసుకోవడానికి ఉపయోగపడే థర్మామీటర్ చేసే పనిని చేస్తుంది ఈ చెవిపోగు. అమెరికాలోని ఓ విశ్వవిద్యాలయంలో షిర్లీ, జుయే, యుజియా అనే ముగ్గురు విద్యార్థులు రూపొందించిన ఈ చెవిపోగుతో శరీర ఉష్ణోగ్రతను సులభంగా తెలుసుకోవచ్చు. డ్యూయల్ సెన్సర్ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ యాంటెనాతో తయారైన ఈ చెవిపోగు బ్యాటరీలతో పనిచేస్తుంది. దీనిని ధరించిన వ్యక్తి ఉష్ణోగ్రతతో పాటు, పరిసరాల ఉష్ణోగ్రతలను కూడా ఎప్పటికప్పుడు ట్రాక్ చేసి, మొబైల్‌కు సమాచారం ఇస్తుంది. పీరియడ్స్ మూడ్ స్వింగ్స్కు చెక్అమ్మాయిలకు ప్రతినెలా వచ్చే పీరియడ్స్‌లో విపరీతమైన కడుపునొప్పితో పాటు, మూడ్ స్వింగ్స్ కుదురుగా ఉండనివ్వవు. ఇప్పుడు ఈ మూడ్ స్వింగ్స్ నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది ఈ ‘ఫెమ్టెక్ బీబీ రింగ్’. ఇదొక స్మార్ట్ రింగ్, సాధారణ హెల్త్ ట్రాకర్ మాదిరిగానే ఇందులోనూ, వివిధ సెన్సర్లతో పాటు, ఎమోషన్స్ ట్రాకింగ్ సిస్టమ్ ఉంటుంది. పీరియడ్స్ సమయంలో దీనిని ధరిస్తే ప్రతినెలా భావోద్వేగాల్లో వచ్చే మార్పులను పరిశీలించి సమాచారం ఇస్తుంది. రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేసే దీనిని, మొబైల్‌కు కనెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు.బైస్కోప్ గాగుల్స్కళ్లకు ధరించే కళ్లజోడు స్మార్ట్‌గా మారిపోయిన విషయం తెలిసిందే! అయితే, మొబైల్‌కు కనెక్ట్ చేసుకొని, కావాల్సిన సమాచారాన్ని కళ్లజోడు అద్దాలపైనే చూసే వీలు కల్పించే వీటి లేటెస్ట్ వెర్షన్ వచ్చేసింది. వాటిలో ఒకటి మినీ ప్రొజెక్టర్‌లా పనిచేసే ఈ ఐఎన్‌ఎమ్‌ఓ2 వైర్లెస్ గ్లాసెస్. వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీలతో ఎప్పుడైనా సరే కావాల్సిన సమాచారాన్ని మీ కళ్ల ముందు ఇన్విజిబుల్ స్క్రీన్ వేసి చూపిస్తుంది. మల్టీమీడియా హెడ్సెట్ సాయంతో వాయిస్ కమాండ్స్‌తో ఆపరేట్ చేయవచ్చు. కేవలం వంద గ్రాముల బరువుతో, సౌకర్యవంతంగా ఉండే దీని ధర 599 డాలర్లు (అంటే రూ.52,302) మాత్రమే!‘లబ్‌డబ్’ లవ్ లాకెట్ ప్రేమికులు తరచు చెప్పుకునే మాట.. ‘నా హృదయ స్పందన నువ్వేనని’. మరి ఇప్పుడు మీ ప్రియమైన వారి గుండె చప్పుడును ఎల్లప్పుడూ మీరు వినేందుకు వీలుగా రూపొందించినదే ఈ లాకెట్. ఇదొక లవ్ లాకెట్. దీనిని ధరించిన వారు తమ గుండె చప్పుడును తమ ప్రియమైన వ్యక్తితో పంచుకోవచ్చు. ఇందుకోసం రెండు లాకెట్లను నేరుగా ఇద్దరు వాడుకోవచ్చు. ఒకరి వద్దే లాకెట్ ఉంటే, మొబైల్ యాప్‌లో వారి కాంటక్ట్‌ను సేవ్ చేసుకొని వాడాలి. లాకెట్లో ఉండే బటన్‌ను నొక్కినప్పుడు, మీరు ఎంచుకున్న వారికి మీ గుండె చప్పుడు ఆడియోను చేరవేస్తుంది. ధర రూ. పది నుంచి ఇరవై వేల వరకు ఉంది. వివిధ రంగుల్లో ఆన్లైన్లో అందుబాటులో ఉంది. (చదవండి: వడలిపోయిన ముఖాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలి..) -
అడినాయిడ్స్ వాపు ..?
అడినాయిడ్స్ ముక్కు లోపలి భాగానికి కాస్త వెనకన, నోటి లోపల అంగిటి పైభాగంలో ఉంటాయి. అవి స్పాంజి కణజాలంతో తయారై మెత్తగా, గుంపులుగా ఉంటాయి. రెండు రకాలుగా వీటి ఉనికి తెలుస్తుంది. మొదటిది... ఎండోస్కోప్ అనే పరికరాన్ని ఉపయోగించడం ద్వారా... ఇక రెండోది తల ఎక్స్–రే తీసినప్పుడు, ఈ తల ఎక్స్–రేలో వాటి పరిమాణం కూడా తెలుస్తుంది. అడినాయిడ్స్ అన్నా, టాన్సిల్స్ అన్నా... ఈ రెండూ ఒకటేనని చాలామంది పొరబడుతుంటారుగానీ... ఈ రెండూ వేర్వేరు. నోరు బాగా తెరచినప్పుడు టాన్సిల్స్ కనిపిస్తాయిగానీ... అడినాయిడ్స్ కనిపించవు. నిజానికి అడినాయిడ్స్ అనేక రకాల ఇన్ఫెక్షన్స్ నుంచి పిల్లలను కాపాడుతుంటాయి. అయితే వాటికే ఇన్ఫెక్షన్స్ సోకడం కారణంగా అడినాయిడ్స్ వాచినప్పుడు వచ్చే సమస్య గురించి తెలుసుకుందాం. అడినాయిడ్స్‌లో కొన్ని యాంటీబాడీస్ ఉండటం వల్ల బ్యాక్టీరియా, వైరస్లు దేహంలోకి ప్రవేశించగానే... వాటిని శత్రుకణాలుగా గుర్తించి, వాటితో ΄ోరాడుతాయి. ఇలా ΄ోరాటంలో వాటిని తుదముట్టించడం ద్వారా ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి. చిన్నారుల్లో వ్యాధి నిరోధక శక్తి సహజంగానే తక్కువగా ఉండటం వల్ల వాళ్ల పసి దేహాలను కాపాడటానికి ప్రకృతి అడినాయిడ్స్ అనే ఏర్పాటు చేసింది. అయితే పిల్లలు పెరుగుతున్న కొద్దీ... వాళ్ల వ్యాధి నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) కూడా పెరుగుతుండటం వల్ల కొంతకాలానికి ఇవి క్రమంగా సైజు తగ్గుతూపోతాయి. ఐదేళ్ల వయసులో దాదాపుగా ఇవి పూర్తిగా కృశించి΄ోతాయి. వారికి యుక్తవయసు వచ్చేనాటికి అవి పూర్తిగా మటుమాయమవుతాయి. అడినాయిడ్స్‌లో ఇన్ఫెక్షన్లతో వాపు ఇలా... కొందరు చిన్నారులపైకి బ్యాక్టీరియా లేదా వైరస్ దాడి చేసినప్పుడు అడినాయిడ్స్ కణజాలంలో వాపు వచ్చే అవకాశాలుంటాయి. అలా జరగడం వల్ల ఇక అవి ఇతర ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు వాటి నుంచి దేహాన్ని కాపాడలేవు. దేహంపై బ్యాక్టీరియా, వైరస్ దాడి పెరిగిన కొద్దీ వాటిలో వాపు కూడా పెరుగుతూపోతుంది. అలాంటప్పుడు కొన్నిసార్లు పక్కనుండే టాన్సిల్స్‌కు కూడా ఇన్ఫెక్షన్ వచ్చి, వాటిల్లో కూడా వాపు రావచ్చు. ఇలా వాపు వచ్చిన కొద్దీ పిల్లలు గాలి పీల్చుకోవడం కష్టమవుతుంది. దాంతో చిన్నారుల్లో కొన్ని సమస్యలు రావచ్చు. అవి... ముక్కురంధ్రాలు మూసుకు΄ోయి గాలి పీల్చడం ఇబ్బందిగా మారడంతో నోటితో గాలి పీల్చడం. ∙నిద్ర సమయంలో పిల్లలో గురక రావడం. గొంతునొప్పిగా ఉండి, మింగడం కష్టం కావడం. ∙కొన్నిసార్లు మెడ్ర ప్రాంతంలోని గ్రంథులకూ వాపు రావడం. కొంతమందిలో వినికిడి సమస్యలూ లేదా దంత సమస్యలు కనిపించడం. ఊపిరి సరిగా అందక నిద్రాభంగమై లేచి ఏడ్వటం.చికిత్స...అడినాయిడ్స్‌లో వాపు వచ్చిన ప్లిలల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గడం కారణంగా వారికి తరచూ జ్వరాలు వస్తుంటాయి. అడినాయిడ్స్‌లో వాపు ఉన్నప్పుడు తొలుత యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేస్తారు. త్వరగా చికిత్స పొందని పిల్లల్లో వ్యాధి తీవ్రత పెరిగి మందులకు నయమయ్యే పరిస్థితి ఉండకపోవచ్చు అలాంటప్పుడు అడినాయిడెక్టమీ అనే శస్త్రచికిత్స ప్రక్రియ ద్వారా డాక్టర్లు వాటిని తొలగించాల్సి వస్తుంది. డా. ఈసీ వినయ కుమార్, ఈఎన్టీ నిపుణుల (చదవండి: పెద్దవాళ్లు జబ్బుపడితే ఎవరు చూడాలి..?) -
వడలిపోయిన ముఖాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలి?
నడివయసుకు చేరుకుంటున్న సమయంలో వయసుతో వచ్చే మార్పుల్లో, శరీరంలోని కండరాల్లో దారుఢ్యం సడలి, కొలతలు మారిపోవడం ప్రధాన సమస్యగా మారుతుంటుంది. శరీర నిర్మాణంలోనే కాదు, ముఖంలోనూ ఆ మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. జిమ్‌కి వెళ్తే శరీరాన్ని దృఢంగా తీర్చిదిద్దుకోవచ్చు. మరి వడలిపోయిన ముఖాన్ని ఎలా తీర్చి దిద్దుకోవాలి? ఇదిగో చిత్రంలోని ఈ ఫేస్ జిమ్ టూల్, ఈ సమస్యకు చక్కటి పరిష్కారంగా నిలుస్తుంది. మునివేళ్లతో పట్టుకుని వాడుకోగలిగే ఈ పరికరంతో శిల్పాన్ని మలచుకున్నట్లుగా ఎవరికి వారే తమ ముఖాన్ని చక్కగా తీర్చి దిద్దుకోవచ్చు. ఈ పరికరంతో మర్దన చేసుకుంటే ముఖ కండరాల్లో రక్త ప్రసరణ మెరుగుపడి, ముఖం పునర్యవ్వనం పొందుతుంది. సురక్షితమైన నాణ్యమైన మెటీరియల్‌తో రూపొందిన ఈ గాడ్జెట్ ఎలాంటి చర్మానికైనా హాని కలిగించదు. పైగా పట్టుకోవడానికి, మసాజ్ చేసుకోవడానికి అనువుగా ఇది రూపొందింది. దీనికి ఒకవైపు ఐదు దువ్వెన పళ్లులాంటి ఊచలు, వాటి చివర బాల్స్ ఉండగా.. మరోవైపు మెలితిరిగిన మృదువైన కొన, దానికో గుండ్రటి బాల్ అటాచ్ అయ్యి ఉంటుంది. మీ చర్మానికి సరిపడే సీరమ్ లేదా క్రీమ్ అప్లై చేసుకుని ఈ టూల్‌తో మసాజ్ చేసుకోవాల్సి ఉంటుంది. చిత్రంలో చూపిన విధంగా, చర్మానికి ఆనించి, కింది వైపు నుంచి పైకి మసాజ్ చేసుకుంటే మంచి ఫలితాలుంటాయి.(చదవండి: 'ఫైట్ ఎగైనెస్ట్ ఒబెసిటీ'కి ప్రధాని మోదీ పిలుపు..! ఐదేళ్లలోపు చిన్నారుల్లోనే..) -
ప్రసవ సమయంలో నొప్పులు తట్టుకోవాలంటే ఏం చేయాలి..?
నాకు ఇప్పుడు తొమ్మిదో నెల. నొప్పులు తట్టుకోలేను అనిపిస్తోంది. ఎపిడ్యూరల్ లాంటి ఇంజెక్షన్స్ అంటే భయం. నొప్పులు తట్టుకోవడానికి వేరే మార్గాలు ఉంటే చెప్పండి?– కావేరి, నెల్లూరు. ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ ఈ రోజుల్లో చాలా ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంది. సైడ్ ఎఫెక్ట్స్ కూడా కొద్దిగానే ఉంటాయి. కాని, అది వద్దనుకే వాళ్లకి కొన్ని ఆసుపత్రుల్లో కాంప్లమెంటరీ థెరపీస్ లేదా ఎండోక్సాన్ వంటి పెయిన్ రిలీఫ్ ఆప్షన్స్‌ని సూచిస్తున్నారు. కాంప్లమెంటరీ థెరపీస్ను సంబంధిత ఎక్స్పర్ట్ థెరపిస్ట్లతోనే తీసుకోవాలి. వాటిలో హిప్నోథెరపీ, అరోమాథెరపీ, మసాజ్, రిఫ్లెక్సాలజీ, ఆక్యుపంక్చర్ లాంటివి ఉంటాయి. హిప్నోగ్రఫీలో ప్రశాంతమైన ఒత్తిడిలేని ప్రసవం జరిగేటట్టు హిప్నో క్లాసులలో నేర్పిస్తారు. దీంతో ఆందోళన తగ్గి, బర్తింగ్ మజిల్స్ సరిగ్గా పనిచేస్తాయి. అరోమాథెరపీలో శారీరక, భావోద్వేగ ఆరోగ్యానికి అవసరమైన నూనెలు ఉపయోగించడం వలన భయం, ఆందోళన తగ్గుతుంది. కాని, దీనితో అంత పెద్దగా లాభం ఉండదని పరిశోధనల్లో తేలింది. రిఫ్లెక్సాలజీ లేదా మసాజ్‌లో మీ శరీరంలోని కొన్ని ప్రాంతాలు, చేతులు, కాళ్లను మసాజ్ చేయటం వలన లేబర్ పెయిన్ తగ్గుతుంది. వివిధ పరిశోధనల్లో ఇది కూడా పూర్తి ఉపశమనం ఇవ్వదని తేల్చారు. ఇక ఆక్యుపంక్చర్‌లో సన్నని స్టెరైల్ సూదులతో శరీరంలోని కొన్ని నిర్దిష్టమైన పాయింట్స్‌ని ప్రెస్ చేస్తారు. దీంతో నొప్పి తగ్గుతుంది. ఈ సూదులను ఆ నిర్దిష్టమైన స్పాట్స్‌లో ఇరవై నిమిషాల నుంచి మొత్తం కాన్పు జరిగే వరకు ఉంచుకోవచ్చు. ఇది థెరపిస్ట్ మీతోనే ఉండి, చేయాల్సిన చికిత్స. ఎంటోనాక్స్ అనే గ్యాస్‌నే ఒక ఆక్సిజన్ పంపు లాంటి దాని ద్వారా నైట్రస్ ఆక్సైడ్, ఆక్సిజన్ మిక్స్చర్ని పీల్చుకునే పద్ధతి. దీనితో చాలా వరకు నొప్పి నుంచి ఉపశమనం ఉంటుంది. ఇది రోగి సొంతంగానే ఉపయోగించుకోవచ్చు. అంటే నొప్పి మొదలైనప్పుడు ఒక పఫ్ పీల్చుకుంటే ఆ గ్యాస్ ద్వారా నొప్పి ఒక నిమిషం వరకు తగ్గుతుంది. మళ్లీ నొప్పి వచ్చినప్పుడు మళ్లీ ఉపయోగించాలి. కొంచెం మగతగా ఉంటుంది. యాభై శాతం వరకు నొప్పి తగ్గుతుందని పరిశోధనల్లో తేలింది. పైగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ఈ మార్గాల ద్వారా ఇంజెక్షన్స్ లేకుండా లేబర్ పెయిన్స్‌ను తగ్గించుకునే అవకాశం ఉంది. వీటిల్లో మీకు అందుబాటులో ఏది ఉంది అని ఆసుపత్రుల్లో పరిశీలించి తీసుకోవాలి. డా‘‘ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: ప్రపంచ వాతావరణ సదస్సు ఎలా ఏర్పాటైందంటే..ఇప్పటికీ 75 ఏళ్లా..?) -
స్థిరత్వం, నిలకడ బుద్దికోసం..!
ఆంజనేయాసనం అనేది యోగాలో ఒక భంగిమ. దీనిని క్రెసెంట్ మూన్ పోజ్ అని కూడా అంటారు. ఈ ఆసనం హనుమంతుడి తల్లి అంజన చేసే నృత్య భంగిమలోదిగా చెబుతారు. అందుకే ఈ ఆసనానికి ఆంజనేయాసనం అని పేరు. ఈ ఆసనం ప్రయోజనాలు...శరీరాన్ని ఒక కాలు మీద స్థిరంగా ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల సమతుల్యత కలుగుతుంది. స్థిరత్వం మెరుగుపడుతుంది. ఈ ఆసనాన్ని క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల శరీరానికి– మనసుకు మధ్య సమతుల్యత ఏర్పడుతుంది. హిప్ భాగం ఫ్లెక్సిబుల్ అవుతుంది. శరీరంపై అవగాహన కలుగుతుంది. కండరాలను బలోపేతం చేస్తుంది. కీళ్ల పనితీరును, ఉచ్ఛ్వాస–నిశ్వాసలను మెరుగు పరుస్తుంది. మానసిక, శారీరక సంబంధాన్ని బలోపేతం చేస్తుంది. మనస్సును స్థిరంగా ఉంచుతుంది. దిగువ శరీరాన్ని సాగదీయడానికి, ఛాతీని విశాలం చేయడానికి ఈ ఆసనం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఎలా చేయాలంటే... ఎడమ మోకాలిని ముందుకు చాపి, కుడి కాలిని వెనక్కి వంచి, కుడి కాలి మునివేళ్లమీద ఉండాలి. తలను నిటారుగా ఉంచి, రెండు చేతులను కంటికి ఎదురుగా నమస్కార భంగిమలో ఉంచాలి. ఐదు దీర్ఘశ్వాసలు తీసుకోవడం, వదలడం చేయాలి. శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మనసును స్థిరంగా ఉంచే ఈ ఆసనంలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతిరోజూ ఈ ఆసనాన్ని సాధనం చేయడం వల్ల మానసిక వికాసం కూడా మెరుగవుతుంది. (చదవండి: Round Egg Auction: కోటిలో ఒక్కటి ఇలా ఉంటుందేమో..వేలంలో ఎంతకు అమ్ముడుపోయిందంటే..) -
నచ్చినట్లే ఉంటున్నారా..?
ఇతర పరిస్థితులు ఎలా ఉన్నా సరే, జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అయితే, డబ్బు, ఆస్తులు, పరపతి ఉన్నా కొందరు సంతోషంగా ఉండలేరు. ఎందుకంటే ఇతరుల మాటలు, సలహాల వల్ల చాలా మంది తమను తాము మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫలితంగా తమ సెల్ఫ్ ఐటెంటిటీని, తద్వారా సంతోషాన్ని కూడా కోల్పోతున్నారు. జీవితంలో ఇతరుల కోసం మార్చుకోకూడని అలవాట్లు ఏంటో తెలుసుకుందాం. మీ గుర్తింపును కాపాడుకోండిఇలా ప్రవర్తించవద్దు, అలా మాట్లాడవద్దు, ఇలా ఆలోచించవద్దు అని ఇతరుల మీకు సలహాలు ఇస్తుంటే వాటిని అంతగా పట్టించుకోకండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సొంత నిర్ణయాలు, ఆలోచనలు ఉంటాయి. వాటిని అనుసరించే ముందుకు సాగాలి. ఇతరుల్ని ఫాలో అయితే మీ సొంత గుర్తింపును కోల్పోయే ప్రమాదముంది. ఇతరుల కోసం ప్రతి రోజూ మిమ్మల్ని మీరు మార్చుకుంటూపోతే.. చివరికి మిగిలేది ఏముండదు. ప్రపంచానికి భిన్నంగా ఉండటం, మీ గుర్తింపును కాపాడుకోవడం ఏ మాత్రం తప్పు కాదని గుర్తుంచుకోండి.వ్యక్తిగత వ్యవహారాలలో తలదూర్చనివ్వద్దుప్రతి వ్యక్తికి పర్సనల్ స్పేస్ ఉంటుంది. కొన్ని సీక్రెట్స్ దాచడంతో ΄ాటు ఒంటరిగా గడిపే హక్కు ఉంది. అయితే, ఎవరైనా మిమ్మల్ని పదే పదే నియంత్రించడానికి ప్రయత్నిస్తుంటే వారికి దూరంగా ఉండటమే మేలు. వేరే వాళ్లు మీరు చేసే ప్రతి పనిలో జోక్యం చేసుకుంటుంటే అది ఏ మాత్రం సరైనది కాదని గమనించండి. మీ పర్సనల్ స్పేస్‌ని గౌరవించుకోండి. మీ వ్యక్తిగత జీవితంలో దూరవద్దని స్పష్టంగా చెప్పేయండి.పీస్ ఆఫ్ మైండ్ఎవరైనా సరే, మీతో సంబంధం ఉన్నా లేకపోయినా మీ మానసిక ప్రశాంతతను చెడగొట్టే వారికి దూరంగా ఉండటమే మంచిది. కొందరు ఏం కాదు అంతా కరెక్ట్‌గా ఉందని మీ మనసును చికాకు పెట్టవచ్చు. కానీ, మీరే సంతోషం లేకుంటే దాని ఉపయోగం ఏంటి? అందుకే ప్రతికూల పరిస్థితులు, వ్యక్తుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. మీ ఆనందానికి ప్రాముఖ్యత ఇవ్వండి.నైతిక విలువలపై రాజీ వద్దుకొందరు లేదా కొన్ని పరిస్థితులు మిమ్మల్ని మోసగాళ్లుగా, అబద్ధాల కోరుగా మార్చటానికి ప్రయత్నించవచ్చు. కొందరు మీ చేత తప్పు పనులు చేయించడానికి బలవంతం పెడతారు. అయితే, ఇక్కడ నైతిక విలువలు పాటించడం ముఖ్యమని గుర్తించుకోండి. ఎవరో చె΄్పారని, వాళ్లు బలవంతం చేశారని చెడ్డ పనులు చేస్తే భవిష్యత్తులో కష్టాలే పలకరిస్తాయి. ప్రపంచం మొత్తం మీకు వ్యతిరేకంగా నిలబడినప్పటికీ.. ఏది కరెక్టో దానివైపే నిలబడండి.నో చెప్పడం నేర్చుకోండిఇతరులు ఎల్లప్పుడూ వారి మాటలే వినాలని, వారి కోసమే సమయం కేటాయించాలని భావిస్తారు. అంతేకాకుండా వారి కోరికల ప్రకారం ఇతరుల జీవించాలని కోరుకుంటారు. అయితే, వేరే వాళ్లు చెప్పే పనులన్నింటికీ యస్ చెప్పుకుంటూ ΄ోతే మీకు మిగిలేది ఏమీ ఉండదు. సంతోషం, ఆనందం అన్నీ దూరమై΄ోతాయి. అందుకే ఇతరులకు నో చెప్పడం నేర్చుకోండి. ఇతరులకు నో చెప్పడానికి ఎందుకు సంకోచం. మీ పరిమితుల్ని మీరే నిర్ణయించుకోండి.కలల్ని, ఆశయాల్ని వదులుకోకండిచాలా మంది మనం ఏదైనా నేర్చుకోవాలని ప్రయత్నం చేస్తుంటే సూటి ΄ోటి మాటలతో వెనక్కు లాగే ప్రయత్నం చేస్తారు. ఈ వయసులో నువ్వు ఏం సాధిస్తావు. ఇందులో నష్టం తప్ప లాభం ఉండదు, వేరే పని చూసుకుంటే మంచిదని లేని΄ోని సలహాలు ఇస్తుంటారు. అయితే, ఒకటి మాత్రం ఆలోచించండి. మీ జీవితాన్ని ఇతరుల ప్రకారం జీవించాలనుకోకూడదు. మీకు ఏదైనా సాధించాలని ఉంటే ఆ దిశగా అడుగులు వేయండి. మీ కలలకు విలువ ఇవ్వండి. లేదంటే తర్వాత పశ్చాత్తాపపడతారు.మీకు మీరే ముఖ్యంమన అవసరాల్ని తీర్చుకుని మిగతావారిని పట్టించుకుంటే చాలా మంది స్వార్థుపరులనే ట్యాగ్ వేసేస్తారు. మీకు మీరు ప్రాధాన్యత ఇచ్చుకోవడం స్వార్థం కాదని గుర్తుంచుకోండి. అది మీపై మీరు చూపించుకునే స్వీయ ప్రేమ. మీ ఆనందాన్ని, అవసరాల్ని ఇతరుల కోసం మార్చుకుంటే మిమ్మల్ని మీరు కోల్పోయినట్టే. ఇతరులకు అవసరమైనప్పుడు మాత్రమే సాయం చేయండి. ఎవరో ఏదో అనుకుంటారని ఇతరుల కోసం మీ అవసరాల్ని త్యాగం చేస్తే చాలా కోల్పోతారు. (చదవండి: పంటపొలాల్లో డ్రోన్..! ఇక నుంచి ఆ పనుల్లో మహిళలు..) -
74 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా ఉండటానికి కారణం అదే..!: ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయన తీసుకునే నిర్ణయాలు ఎలా అనూహ్యంగా ఉంటాయో.. అలాగే అత్యంత విభిన్నంగా ఉండే ఆయన వ్యవహారతీరు ఎవ్వరినైనా కట్టిపడేస్తుంది. అయితే మోదీ ఏడుపదుల వయసులోనూ అంతే ఫిట్‌గా, చలాకీగా ఉంటారు. ఎక్కడ అలసటను దరిచేరనీయరు. ఏ కార్యక్రమంలోనైన ముఖంపై రచిరునవ్వు, ఉత్సాహం చెరగనివ్వరు. మోదీ ఈ ఏజ్‌లో కూడా యువకుల మాదిరి నూతనోత్సహాంతో పనులు చక్కబెట్టుకుంటారు. అలా చలాకీగా ఉండేందుకు తాను పాటించే ఆ దినచర్యేనంటూ తన ఆహార నియమాల గురించి సవివరంగా వివరించారు. అవేంటో చూద్దామా..!.24 గంటల్లో ఒక్కసారే భోజనం..అమెరికాకు చెందిన పాడ్‌కాస్టర్ ఏఐ పరిశోధకుడు లెక్స్ ఫ్రిడ్మాన్తో జరిగిన సంభాషణలో మోదీ తన ఉపవాస షెడ్యూల్ గురించి, జీవనశైలి గురించి వివరించారు. జూన్ మధ్యలో ప్రారంభమైన దీపావళి నుంచి 4 నెలలు పాటు భారత వైదిక ఆచారమైన చాతుర్మాస్ దీక్షను అవలంభిస్తారట. ఆ రోజుల్లో 24 గంటల్లో కేవలం ఒక్కసారి మాత్రమే ఏమైనా తీసుకోవడం జరుగుతుందని చెప్పారు మోదీ. సరిగ్గా అది వర్షాకాలం ఆ టైంలో మనిషి జీర్ణక్రియ ఎలా మందగిస్తుందో వివరించారు. అంతేకాదు తాను పాటించే నవరాత్రి ఉపవాస దీక్ష గురించి కూడా మాట్లాడారు. ఆ సమయంలో మోదీ పూర్తిగా ఆహారం తీసుకోకుండా తొమ్మిది రోజులు కేవలం వేడినీరు మాత్రమే తీసుకుంటానని అన్నారు. అయితే వేడినీరు ఎల్లప్పుడూ తన దినచర్యలో ఒక భాగమేనని చెప్పారు. అది తనకు ఒక అలవాటుగా మారిపోయిందన్నారు. అలాగే మోదీ మార్చి లేదా ఏప్రిల్ నెలలో ప్రారంభమయ్యే చైత్ర నవరాత్రి ఉపవాసాన్ని కూడా అనుసరిస్తానన్నారు. అంతేగాదు తన దృష్టిలో ఉపవాసం అనేది ఒక రకమైన స్వీయ-క్రమశిక్షణగా పేర్కొన్నారు. ఇది భక్తితో కూడిన దినచర్య. నెమ్మదించేలా చేయదు. మరింత చురుకుగా ఉండేలా చేస్తుంది. ఉపవాసం శక్తి..ఉపవాసం శరీరాన్ని బలహీనపరస్తుందనే సాధారణ నమ్మకాన్ని సవాలు చేస్తూ..మనస్సు, ఆత్మ రెండింటిని రీచార్జ్ చేసుకునే ఓ గొప్ప మార్గంగా అభివర్ణించారు. ఆ టైంలో వాసన, స్పర్శ, రుచి వంటి జ్ఞానేంద్రియాలు సున్నితంగా మారడాన్ని గమనించొచ్చన్నారు. ఉపవాసం అంటే భోజనం దాటవేయడం మాత్రమే కాదు. శరీరాన్ని తిరిగి సమతుల్యం చేసుకోవడం, సంకల్ప శక్తిని బలోపేతం చేయడం, అంతర్గత సామరస్యాన్ని సాధించడం అని ఆయన వివరించారు. (చదవండి: Coconut Water Vs Sugarcane Juice: భగభగమండే ఈ ఎండలకు ఏ పానీయం మేలు అంటే..?) -
జీరో కార్బోహైడ్రేట్స్ డైట్: బాడీలో ఇన్ని మార్పులా..?
జీరో కార్బోహైడ్రేట్స్ డైట్ ఇటీవల బాగా ట్రెండ్ అవుతోంది. ఎందుకంటే త్వరితగతిన బరువు తగ్గిపోతుండటంతో చాలామంది దాన్నే ఫాలో అవుతున్నారు. కొందరు తమ ట్రైనర్స్ ఆధ్వర్యంలో చేస్తుంటే మరికొందరూ అనాలోచితంగా ఫాలో అయ్యి ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. అయితే ఓ న్యూట్రిషన్ ఈ డైట్‌ని ఫాలో అయ్యి తన అనుభవాన్ని పంచుకున్నారు. అందరూ చెబుతున్నట్లు బరువు తగ్గినా..బాడీలో ఎంత సడెన్ ఛేంజ్‌లు వస్తాయో తెలిపారు. స్లిమ్‌గా మారడం ఎలా ఉన్నా..లేనిపోని సమస్యలు వచ్చే ప్రమాదమే ఎక్కువగా ఉంటుందంటూ పలు షాకింగ్ విషయాలు వెల్లడించారు. అవేంటంటే..పొట్ట వద్ద ఉన్న ఫ్యాట్‌ని తగ్గించాడానికి తాను ఏడు రోజులు జీరో కార్బోహైడ్రేట్స్ డైట్‌ని తీసుకున్నట్లు తెలిపారు ప్రముఖ న్యూట్రిషన్ కోచ్ జస్టిన్ గిచాబా. అయితే ఏడు రోజుల్లో తన శరీరంలో పలు మార్పులను ఎదుర్కొన్నట్లు తెలిపారు. బాడీ తేలికగా మారుతుంది. అయితే మిగతా పనులేవి చురుకుగా చేయలేకపోతున్న ఫీల్ కలిగిందని చెప్పారు. వర్కౌట్ చేస్తుంటే శక్తి సన్నగిల్లినట్లు అనిపించిందట. ఇదివరకటిలా ఏ బరువులు అంతగా ఎంతలేకపోయానని అన్నారు. బాడీలో ఫ్యాట్ తగ్గింది కానీ అనుహ్యంగా దాంతోపాటు బాడీలో ఉండే ఎనర్జీ కూడా తగ్గిపోయిందన్నారు. అలాగే మానసికంగా కూడా చాలా మార్పులు చూశానన్నారు. చివరికి తనకి ఇది ఆరోగ్యకరమైనది కాదని క్లియర్‌గా అర్థమైందన్నారు.జీరో కార్బోహైడ్రేట్స్ వల్ల సంభవించే మార్పులు..ఈ డైట్‌ని వరసగా ఏడురోజులు అనుసరించినప్పుడు సంభవించిన మార్పులను సవివరంగా ఇలా వివరించారు. గ్లైకోజెన్ క్షీణత: ఈ డైట్ ప్రారంభించిన మొదటి 24 నుంచి 48 గంటల్లో, శరీరం కండరాలు, కాలేయంలో నిల్వ చేయబడిన చక్కెర రూపంలో ఉన్న గ్లైకోజెన్‌ను ఉపయోగిస్తుంది. ప్రతి 1 గ్రా గ్లూకోజ్‌తో శరీరం 3 గ్రా నీటిని కలిగి ఉంటుంది కాబట్టి ుముందుగా శరీరం నీటి బరువును కోల్పోతుంది. కీటోసిస్ ప్రారంభమవుతుంది: గ్లైకోజెన్ నిల్వలు క్షీణించిన తర్వాత, శరీరం ప్రత్యామ్నాయ శక్తి వనరుగా కీటోన్లను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది. అంటే శరీరంలో నిల్వ ఉన్న కొవ్వులు ఖర్చవ్వడం మొదలవుతుందన్నారు. View this post on Instagram A post shared by Justin Gichaba | Nutrition Coach (@justin_gichaba) శక్తి, మానసిక స్థితిలో హెచ్చుతగ్గులు: చురుకుదనం కోల్పోయి, తలనొప్పి, అలసట వంటివి దరిచేరుతాయి. ఎలక్ట్రోలైట్ అసమతుల్యత కారణంగా నిద్రలేమి వంటి సమస్యలు కూడా తలెత్తుతాయని చెప్పారు. ఆకలి తగ్గిపోవడం: కీటోన్లు తరచుగా ఆకలిని అణిచివేస్తాయి. ఈ డైట్లో కొంతమంది సహజంగానే కొన్ని రోజుల తర్వాత తక్కువ తింటారని అన్నారు. జీర్ణ మార్పులు: కార్బ్ మూలాల నుంచి ఫైబర్ లేకపోవడం మలబద్ధకం వచ్చి.. గట్ మైక్రోబయోటాకు దారితీయవచ్చు.ఇన్సులిన్ స్థాయిలు: పిండి పదార్థాలు లేకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు సమంగా ఉంటాయి లేదా ఇన్సులిన్ స్థాయిలు తగ్గుతాయి. ఒకరకంగా ఇది టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఉపయోగపడవచ్చునని అన్నారు. ఎలా తీసుకుంటే బెటర్..జీరో కార్బో హైడ్రేట్లు బదులు తక్కువ శాతం కార్బోహైడ్రేట్లు ఉండేలా చూడండి. ప్రోటీన్ కంటెంట్ ఎక్కువుగా ఉండేలా చూసుకుంటే చాలని చెప్పారు. ఫైబర్‌తో కూడిన కార్మోహైడ్రేట్లు ఎప్పటికీ ఆరోగ్యదాయకమైనవే అని అన్నారు. మన శరీరం ధర్మానికి అనుగుణంగా అన్ని సమతుల్యంగా తీసుకోవాలని సూచించారు. చివరగా కార్బోహైడ్రేట్లు తీసుకోకుంటే.. లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందన్నారు. ఎందుకంటే ఫైబర్ అధికంగా ఉండే, సంక్లిష్ట కార్బోహైడ్రేట్లకు ప్రాధాన్యత ఇస్తే మంచి ఎనర్జీని కోల్పోయే ప్రమాదం ఉండదు. పైగా దీర్ఘకాలిక ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదని నమ్మకంగా చెప్పారు. అంతేగాదు సమతుల్య ఆహారం అనేది అన్ని విధాల ఆరోగ్యానికి మేలని చెప్పారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.(చదవండి: మహిళా వ్యోమగాములు జుట్టును ముడి వేసుకోరు.. కారణం?) -
HKU1 కోలకతా మహిళకు అరుదైన కరోనా, అప్రమత్తం అంటున్న వైద్యులు
కోల్‌కతాలో 45 ఏళ్ల మహిళకు హ్యూమన్ కరోనావైరస్ HKU1 (HCoV-HKU1) ఉన్నట్లు నిర్ధారణ అయింది. తాజా నివేదికల ప్రకారం హెచ్ కేయూ1 వైరస్ కారణంగా బాధిత మహిళ గత 15 రోజులుగా జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతోంది. ప్రస్తుతం ఆమె దక్షిణ కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు. ఈ వార్తతో దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి వచ్చిందనే ఆందోళన మొదలైంది. అసలు హ్యూమన్ కరోనావైరస్ అంటే ఏమిటి? కరోనా అంత తీవ్రమైనదా? తెలుసుకుందాం ఈ కథనంలో.హ్యూమన్ కరోనావైరస్ అంటే ఏమిటి?మానవ కరోనావైరస్ HKU1 (హాంకాంగ్ విశ్వవిద్యాలయం) 2004లో తొలుత గుర్తించారు.ఇది కరోనా వైరస్ జాతికి చెందినదే. కానీ అంత తీవ్రమైనదే. అయితే అప్రమత్తంగా ఉండాలని, వ్యాప్తిని నివారించాలని వైద్యులు కోరుతున్నారు. బాధిత మహిళను ఐసోలేషన్‌లో ఉంచినట్టు తెలిపారు. ఇది కోవిడ్-19 లాంటిది కాదని, కోవిడ్-19 కి కారణమయ్యే SARS-CoV-2 వైరస్ కంటే తక్కువ తీవ్రమైనదని వారు స్పష్టం చేశారు.హ్యూమన్ కరోనావైరస్ HKU1ని బెటాకోరోనావైరస్ హాంగ్కోనెన్స్ అని కూడా పిలుస్తారు. ఇది మానవులను జంతువులను ప్రభావితం చేస్తుంది. అనేక రకాల హ్యూమర్ కరోనావైరస్లు ఉన్నాయి. వీటిలో కొన్ని 229E, NL63, OC43, HKU1.. ఈ వైవిధ్యాలు సాధారణంగా సాధారణ జలుబు వంటి తేలికపాటి నుండి ఊపిరి ఆడకపోవడం లాంటి శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతాయి.లక్షణాలు ఏమిటి?సీడీసీ (CDC), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (National Institutes of Health) జలుబు, జ్వరం లాంటి సాధారణ లక్షణాలుంటాయి. నిజానికి చాలా సాధారణమైనవి, తేలికపాటివి, కానీ కొన్ని సందర్భాల్లో, ముఖ్యంగా చికిత్స చేయకుండా వదిలేస్తే బ్రోన్కియోలిటిస్ , న్యుమోనియాకు దారితీస్తుంది.ముక్కు కారటం, జ్వరం, ముక్కు దిబ్బడ, సైనస్,, గొంతు నొప్పి, అలసట తలనొప్పిఎవరికి ప్రమాదం ఉంది?వృద్ధులు, పిల్లలు, గర్భిణీ స్త్రీలు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, ఇతర అనారోగ్యాలు ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలి.చదవండి: టికెట్ లేకుండా రైల్లో ఒంటరి మహిళలు : ఫైన్ కట్టేందుకు డబ్బుల్లేవా? డోంట్ వర్రీ!ఎలా వ్యాపిస్తుంది?సాధారణంగా సోకిన వ్యక్తి నుండి దగ్గు, తుమ్ములనుంచి తుంపర్ల ద్వారా, రోగి దగ్గరి సంబంధం ఉన్నవారికి సోకవచ్చు. డోర్ హ్యాండిల్స్, ఫోన్లు లేదా టేబుల్స్ వంటి వస్తువులపై వైరస్ జీవించగలదు. రోగి తాకిన వాటిని తాకిన వస్తువులను తాకి శానిటైజ్ చేసుకోకుండా ముక్కు, నోరు లేదా కళ్ళను తాకిన వారు వ్యాధి బారిన పడవచ్చు.చదవండి: Sunita Williams Earth Return: అంతరిక్షంలో పీరియడ్స్ వస్తే? ఏలా మేనేజ్ చేస్తారు?సురక్షితంగా ఎలా ఉండాలిమానవ కరోనావైరస్లకు టీకా లేదా నిర్దిష్ట చికిత్స లేదు. చాలామంది తొందరగానే కోలుకుంటారు. అయితే, కొన్ని రోజుల్లో తగ్గకపోయినా, లక్షణాలు మరింత ముదిరినా వైద్యుడిని సంప్రదించడం మంచిది. -
ఇన్ఫెక్షన్: సెల్యు'లైట్' తీసుకోకండి..!
ఓ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగా చర్మానికి సెల్యులైటిస్ అనే కండిషన్ వస్తుంది. ఇందులో కాలు లేదా చేయి విపరీతంగా వాచిపోయి, చర్మం ఎర్రగా అలాగే బాధితులకు వేడిగా అనిపిస్తుంటుంది. ముట్టుకుంటేనే నొప్పి (టెండర్నెస్)తో బాధాకరంగా ఉంటుంది. ఇది చేయి లేదా కాలు అంతటికీ వేగంగా వ్యాపిస్తుంది. ఈ దశలో కూడా చికిత్స సరిగా అందకపోతే చేయి/ కాలికి మాత్రమే పరిమితమైన ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ శరీరమంతా పాకి ప్రాణాలకే ముప్పు తెచ్చిపెట్టే ప్రమాదముంది. అందుకే సెల్యులైటిస్ లక్షణాలు కనిపించిన వెంటనే తప్పనిసరిగా చికిత్స తీసుకోవాలి. ప్రాణాలకే ముప్పు తెచ్చిపెట్టగల ఈ సెల్యులైటిస్పై అవగాహన కోసం ఈ కథనం.సెల్యులైటిస్ సాధారణంగా దేహంలోని కాలు, చేయితో పాటు ఏ భాగానికైనా రావచ్చు. కానీ ఈ కండిషన్ కాలిలో కనిపించడమే ఎక్కువ. సెల్యులైటిస్తో ప్రభావితమైన కాలు బాగా వాచిపోతుంది. ఎర్రబారుతుంది. ఇలా జరగడాన్ని ఎరిథిమా అంటారు. వాపు వచ్చి ముట్టుకుంటే మంట (ఇన్ఫ్లమేషన్)తో, లోపల వేడిగా ఉన్న భావన కలుగుతుంది. ఇన్ఫ్లమేషన్తో కూడిన సెల్యులైటిస్‌ను తీవ్రమైన పరిస్థితిగానే పరిగణించాలి. అది కేవలం పై చర్మానికి మాత్రమే పరిమితమైందా లేక లోపలి పొరలూ ప్రభావితమయ్యాయా అన్నదానిపై పరిస్థితి తీవ్రత ఆధారపడి ఉంటుంది. లోపలికి వ్యాపించిన కొద్దీ సెల్యులైటిస్‌లోని ఇన్ఫెక్షన్ రక్తప్రవాహంతో కలిసి లింఫ్‌నోడ్స్‌కూ వ్యాపిస్తుంది. సెల్యులైటిస్ కనిపించే సూక్ష్మక్రిములివే... సెల్యులైటిస్ సోకిన కాలు నునుపుదనంతో ఎర్రగా మెరుస్తూ కనిపిస్తుంది. అంతకు ముందే కాలికేదైనా గాయం ఉండటం, చర్మం చీరుకుపోయి ఉండటం వంటివి జరిగితే దానికి సెల్యులైటిస్ వచ్చే అవకాశాలు మరింత ఎక్కువ. చర్మానికి ఏ కారణంగానైనా పుండ్లు పడి అవి దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు అక్కడ బ్యాక్టీరియా చేరడంతో పాటు అది రెండో (సెకండరీ) దశకు చేరితే... అది సెల్యులైటిస్‌కు దారితీయవచ్చు. ఇందుకు చాలారకాల సూక్ష్మక్రిములు (బ్యాక్టీరియా) కారణమవుతాయి. ఉదాహరణకు... స్ట్రెప్టోకాక్సీ, స్టెఫాలోకాక్సీ, సూడోమొనాస్ ఎస్పీపీ, బ్యాక్టీరియోడీస్ వంటివి వీటిల్లో ప్రధానమైనవి. ఇవిగాక మరికొన్ని అప్రధాన రకాలకు చెందిన సూక్ష్మజీవులూ ఉంటాయి. సెల్యులైటిస్‌లో ఎలా వస్తుందంటే?వాతావరణంలో ఉండే అనేక సూక్ష్మజీవులను చర్మమే మొదట ఎదుర్కొంటుంది. చర్మం మన లోపలి అవయవాలన్నింటినీ కప్పుతూ ఆ సూక్ష్మజీవులన్నింటి నుంచి మనకు రక్షణ కలిగిస్తుంటుంది. అయితే చర్మంలో ఎక్కడైనా గాయాలైనా, లేదా చీరుకుపోయి ఉన్నా బయటి సూక్ష్మజీవులు ఆ ప్రాంతంలోంచి... చర్మాన్ని దాటి లోపలికి ప్రవేశించగలుగుతాయి. ఉదాహరణకు అథ్లెట్స్ ఫూట్ (టీనియా పెడిస్) వంటి కండిషన్లో చర్మానికి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు లోపలికి ప్రవేశించడమన్నది బ్యాక్టీరియాకు సులభంగా సాధ్యమవుతుంది. ఆ వెంటనే చర్మం తనను తాను రక్షించుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా ఆ వ్యక్తి తాలూకు వ్యాధి నిరోధక వ్యవస్థ / ఇమ్యూన్ సిస్టమ్ చర్మాన్ని ఎర్రబారుస్తుంది. ఇలా జరిగిన తర్వాత జరిగే పరిణామం సెల్యులైటిస్‌కు దారితీస్తుంది. వాతావరణంలో ఉండే అనేక సూక్ష్మజీవులను చర్మమే మొదట ఎదుర్కొంటుంది. చర్మం మన లోపలి అవయవాలన్నింటినీ కప్పుతూ ఆ సూక్ష్మజీవులన్నింటి నుంచి మనకు రక్షణ కలిగిస్తుంటుంది. అయితే చర్మంలో ఎక్కడైనా గాయాలైనా, లేదా చీరుకు΄ోయి ఉన్నా బయటి సూక్ష్మజీవులు ఆ ప్రాంతంలోంచి... చర్మాన్ని దాటి లోపలికి ప్రవేశించగలుగుతాయి. ఉదాహరణకు అథ్లెట్స్ ఫూట్ (టీనియా పెడిస్) వంటి కండిషన్లో చర్మానికి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు లోపలికి ప్రవేశించడమన్నది బ్యాక్టీరియాకు సులభంగా సాధ్యమవుతుంది. ఆ వెంటనే చర్మం తనను తాను రక్షించుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా ఆ వ్యక్తి తాలూకు వ్యాధి నిరోధక వ్యవస్థ / ఇమ్యూన్ సిస్టమ్ చర్మాన్ని ఎర్రబారుస్తుంది. ఇలా జరిగిన తర్వాత జరిగే పరిణామం సెల్యులైటిస్‌కు దారితీస్తుంది.చర్మం రంగు మారడం: సెల్యులైటిస్ వచ్చిన భాగంలో చర్మం రంగు మారిపోతుంది. ప్రధానంగా ఎర్రబారుతుంది. అప్పటికే ఎర్రటి చర్మం ఉన్నవారిలో ఇలా ఎర్రబారడం జరిగితే దాన్ని గుర్తుపట్టడం కాస్తంత కష్టమవుతుంది. అదే కాస్త నల్లటి చర్మం ఉన్నవారిలో ఈ రంగు మార్పును వెంటనే గుర్తుపట్టడం సాధ్యమతుంది. దాంతో తగిన చికిత్స తీసుకోవడం సాధ్యమవుతుంది. వాపు రావడం : సాధారణంగా వాపు పాదం నుంచి మొదలై పై వైపునకు వ్యాపిస్తుంటుంది. కొన్నిసార్లు పిక్కల నుంచి కూడా వాపు మొదలు కావచ్చు. ∙కాలికి ఎరుపుదనం వచ్చి బాగా వాచిన కారణంగా అది బాగా నునుపుగా అనిపిస్తూ, మెరుస్తూ కనిపిస్తుంది. వాపు కారణంగా చర్మం బాగా బిగుసుకు΄ోయినట్లుగానూ అనిపిస్తుంటుంది. ∙ముట్టుకుంటే మంట / నొప్పితోపాటు లోపల వేడిగా ఉన్నట్లుగానూ అనిపిస్తుంటుంది. ఈ కాలివాపు రాక ముందు ఫ్లూ జ్వరం వచ్చినప్పటి లక్షణాలతో... చలితో కూడిన జ్వరం కూడా కనిపించవచ్చు. ∙రక్త పరీక్ష చేయిస్తే తెల్లరక్తకణాల సంఖ్య బాగా పెరిగి కనిపిస్తుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉందనడానికి ఇది ఒక సూచన. ∙వాపు వచ్చిన కాలి భాగంలోని పుండ్ల నుంచి పసుపు రంగుతో కూడిన చీము స్రవిస్తుంటుంది. సెల్యులైటిస్‌కు తావిచ్చే కండిషన్స్చర్మానికి గాయమై అది దీర్ఘకాలికంగా మానకుండా ఉండటం. చర్మం చీరుకు΄ోయి ఆ గాయం చాలాకాలం మానక΄ోవడం, కాలి మీద పుండ్లు రావడం. దీర్ఘకాలంగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉండి, అవి దీర్ఘకాలికంగా మానకుండా ఉండటం (ప్రధానంగా కాలికి... అథ్లెట్స్ ఫూట్ వంటివి). ఎగ్జిమా, సోరియాసిస్ వంటి చర్మసంబంధమైన రుగ్మతలతో బాధపడేవారిలో చర్మం పగుళ్లుబారి ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించే అవకాశాలు ఎక్కువ. కొద్దిగా అరుదుగా దీర్ఘకాలికంగా ఉండే తీవ్రమైన మొటిమల కారణంగా కూడా. ∙చర్మం పగుళ్లుబారేలా చేసే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ఉందాహరణకు చికెన్‌పాక్స్, షింగిల్స్ వంటి జబ్బులు వచ్చాక సెల్యులైటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. డయాబెటిస్ ఉండి కాలిపై దీర్ఘకాలికంగా పుండ్లు పడటం (డయాబెటిస్ ఉన్నవారిలో సెల్యులైటిస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ).రక్తనాళాలకు సంబంధించిన జబ్బులు ఉండటం (వేరికోసిక్ వెయిన్స్ వంటివి). పెరిఫెరల్ వ్యాస్క్యులార్ డిసీజ్ వంటి జబ్బుల కారణంగా. శరీరంలో లింఫ్ ప్రవాహం తగినంతగా లేకపోవడం వల్ల. దీర్ఘకాలికంగా కాలేయ సంబంధిత జబ్బులతో బాధపడుతూ ఉండేవారిలో. (అంటే... క్రానిక్ హెపటైటిస్, సిర్రోసిస్ వంటి జబ్బులు ఉన్నవారిలో సెల్యులైటిస్‌కు అవకాశాలెక్కువ). స్థూలకాయం ఉన్నవారిలో. ఏదైనా శస్త్రచికిత్స తర్వాత ఏర్పడ్డ గాయం కారణంగా. చాలా సందర్భాల్లో కాలిన గాయాల కారణంగా. చర్మంలో ప్రవేశపెట్టే సూదుల కారణంగా (ఇంట్రావీనస్గా మందులను పంపడానికి అమర్చే క్యాన్యులా వంటివి), ట్యూబ్స్, ఆర్థోపెడిక్ కేసుల్లో చర్మంలోపల అమర్చే ప్లేట్లు, రాడ్ల వంటి వస్తువుల కారణంగా. ఎముకలకు వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల. కొన్ని కీటకాల కాటు కారణంగా (ప్రధానంగా సాలీడు వంటివి); కొన్ని జంతువులు కరవడం వల్ల. దీర్ఘకాలికంగా మందులు వాడుతున్నవారిలో వాళ్ల వ్యాధినిరోధక శక్తి (ఇమ్యూనిటీ) తగ్గడం వల్ల... ఇలాంటి అనేక కారణాల వల్ల సెల్యులైటిస్ రావచ్చు. ఒకసారి సెల్యులైటిస్ సోకాక...ఒకసారి సెల్యులైటిస్ సోకిన తర్వాత అది వ్యాపిస్తూ ఉంటుంది. ఎలాంటి స్రావాలు లేకుండా కేవలం వాపు మాత్రమే కనిపించే దాన్ని ‘డ్రై సెల్యులైటిస్’ అంటారు. ఈ దశలో సెల్యులైటిస్‌కు సరైన చికిత్స తీసుకోక΄ోతే అది వ్యాపించిన మేరకు కణజాలం నాశనమవుతుంటుంది. డ్రై సెల్యులైటిస్‌లో చర్మంపై ఎర్రటి మచ్చలు కూడా కనిపిస్తుంటాయి. డ్రై సెల్యూలైటిస్‌కు వెంటనే చికిత్స తీసుకోకపోతే చర్మంపై సన్నటి పగుళ్ల వంటివి ఏర్పడి అందులోంచి నీరు స్రవిస్తుంటుంది. దీన్నే వెట్ సెల్యులైటిస్ అంటారు.సాధారణంగా కాలి బొటనవేలికి దీర్ఘకాలంగా ఉండే గాయం వల్ల సెల్యులైటిస్ వస్తుంటుంది. సెల్యులైటిస్ కాలి భాగం నుంచి పైకి విస్తరిస్తూపోతుంటే దాన్ని అసెండింగ్ సెల్యులైటిస్ అంటారు. సాధారణంగా స్ట్రెప్టోకోకల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లో ఇలా జరుగుతుంది. సెల్యులైటిస్ అన్నది ఒక కాలికే కనిపిస్తుంటే దీన్ని యూనిలేటరల్ సెల్యులైటిస్‌గా పేర్కొంటారు. ఈ యూనిలేటరల్ సెల్యులైటిస్ చాలా సాధారణం. కానీ కొంతమందిలో రెండుకాళ్లకూ సెల్యులైటిస్ కనిపించ వచ్చు. కాకపోతే ఇది కాస్తంత అరుదు. ఇలా రెండుకాళ్లకూ సెల్యులైటిస్ రావడాన్ని ‘బైలేటర్ కాంకరెంట్ సెల్యులైటిస్’ అంటారు. చికిత్స యాంటీబయాటిక్స్‌తో చికిత్స స్ట్రెప్టోకాక్సి, స్టెఫాలోకాక్సి బ్యాక్టీరియాను మట్టుపెట్టే యాంటీబయాటిక్స్ మందులను నోటి ద్వారా తీసుకోవడం లేదా తీవ్రత ఎక్కువగా ఉన్నవారిలో నరానికి ఇంజెక్షన్ ద్వారా పంపడం వంటి చికిత్స అందిస్తారు.వ్యాయామం (ఫిజియోథెరపీ) వాపు తగ్గేలా కాలి వేళ్లు కదిలించే కొన్ని వ్యాయామాలు చేయడం అవసరమవుతుంది. కొన్ని జాగ్రత్తలుసెల్యులైటిస్ను నివారించుకోడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. కాలిపై ఎలాంటి గాయాలూ లేకుండా చూసుకోవడం.కాలి గోళ్లను తీసుకునే సమయంలో గాయం కాకుండా జాగ్రత్త వహించడం.కీటకాలు, జంతువులు కుట్టకుండా / కరవకుండా వాటిని దూరంగా ఉంచడం.కాలిన గాయాలైనప్పుడు అవి పూర్తిగా తగ్గే వరకు జాగ్రత్తగా ఉండటం.కాలికి గాయాలు ఉన్నవారు, కాలిన గాయాలైన వారు మురికినీళ్లలోకి వెళ్లక΄ోవడం. గాయమైన కాలితో సముద్రపు నీటిలోకి వెళ్లకపోవడం. కాలికి సరిగ్గా సరిపోయి, సౌకర్యంగా ఉండే పాదరక్షలు / షూస్ ధరించడం. (కాలికి గాయాన్ని చేస్తూ, బాధను కలిగించే షూస్‌ను బలవంతంగా తొడగకూడదు. చెప్పులు లేదా షూ కరవడం, కాలికి గాయం చేయడం వంటివి జరుగుతుంటే ఆ పాదరక్షలను తొడగడం మానేసి, సౌకర్యంగా ఉండే వాటినే తొడుక్కోవాలి. పాదరక్షల వల్ల కాలికి గాయాలవుతున్నాయా అంటూ తరచూ పరీక్షించుకుంటూ ఉండాలి. ముఖ్యంగా డయాబెటిస్తో బాధపడేవారు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి) అథ్లెట్స్ ఫూట్ వంటి ఇన్ఫెక్షన్తోపాటు అన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్కు తగిన చికిత్స తీసుకుని పూర్తిగా తగ్గేలా జాగ్రత్త వహించడం వేరికోస్ వెయిన్స్ వంటి సమస్య వస్తే అది తగ్గేలా చికిత్స తీసుకోవడం సెల్యులైటిస్ లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం. చివరగా... సెల్యులైటిస్ వచ్చి, అది ప్రాణాంతకం అవడం కంటే ... కేవలం చిన్న చిన్న జాగ్రత్తలతో అసలది రాకుండానే చూసుకోవడం మేలు.డా. స్వప్నప్రియ, సీనియర్ డర్మటాలజిస్ట్డా.జి. వెంకటేష్ బాబు, సీనియర్ కన్సల్టెంట్, ప్లాస్టిక్ – కాస్మటిక్ సర్జన్ (చదవండి: ఒకే కాన్పులో ముగ్గురు జననం..! ఇలా ఎందుకు జరుగుతుందంటే..?) -
చిన్నారులకు చిప్స్ ప్యాకెట్లు కొనిస్తున్నారా..?
పిల్లాడు అన్నం తినడం లేదు.. వెంటనే ఓ చిప్స్ ప్యాకెట్ తాయిలమైపోతుంది. పాప మారాం చేస్తోంది.. మరో ఎరుపురంగు ప్యాకెట్ తారకమంత్రంగా పనిచేస్తుంది. బుజ్జాయి స్కూలుకు వెళ్తోంది.. ఆ బ్యాగ్‌లో పుస్తకాలు ఉన్నా లేకున్నా చిరుతిళ్ల ప్యాకెట్టు మాత్రం ఉండి తీరుతుంది. చిన్నారి బడి నుంచి వచ్చాడు. ఇంట్లో వాళ్లను ఇబ్బంది పెట్టకుండా వీధి చివరి దుకాణంలో ఊరూపేరూ తెలియని రంగురంగుల ప్యాకెట్ వాడి నోరు మూయిస్తుంది. ఏ పదార్థంతో తయారు చేశారు, ఎలా తయారు చేశారు, ఎప్పుడు తయారు చేశారో తెలీని ‘ప్యాకెట్లు’ చిన్నారుల పాలిట విషంగా మారుతున్నాయి. ఈ తిను ‘బండారం’ తెలుసుకోకుండా తల్లిదండ్రులు చేతులారా పిల్లల ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నారు. ఏ షాపు చూసినా చిరుతిళ్ల ప్యాకెట్ల తోరణాలు కనిపిస్తుంటాయి. ఏ మాత్రం వాటి ఆకర్షణలో పడినా పిల్లలను ఆస్పత్రుల చుట్టూ తిప్పాల్సిందే. జంక్ ఫుడ్ పేరిట నానా రకా ల పదార్థాలు పాన్‌షాపుల్లో దర్శనమిస్తున్నాయి. ఆకర్షణీయమైన రంగుల్లో ఆకట్టుకునే బొమ్మలతో పిల్లల నోరూరిస్తున్నాయి. కానీ ఇటువంటి చిరుతిళ్లు చిన్నారుల ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవి పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని పేర్కొంటున్నారు. చిన్నారుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, నిర్లక్ష్యం చేస్తే భారీమూల్యం తప్పదని చెబుతున్నారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్‌కు చెందిన రింగ్స్ చిప్స్ ప్యాకెట్లు ఎక్కువగా జిల్లాలోని దుకాణాల్లో కనిపిస్తున్నాయి. రింగ్స్, ట్రాప్స్ అనే రకాలకు చెందిన రింగ్స్ చిప్స్ ఒడిశా నుంచి వస్తున్నాయని, ట్రాయ్ రింగ్స్ అనే రకం పశ్చిమ బెంగాల్ నుంచి ఒడిశా మీదుగా వస్తున్నాయని దుకాణదారులు చెబుతున్నారు. ఎక్కువగా పాఠశాలలు ఉండే ప్రాంతాల్లో పాన్ షాపుల్లో రెండు, ఐదు రూపాయలకే ఈ చిరుతిళ్లు దొరుకుతుండడంతో.. అవి తినడం బాలలకు వ్యసనంగా మారిపోతోంది. ముప్పొద్దులా వీటినే తింటుండడంతో చాలా మంది ఉదర సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రంగు రంగు ప్యాకెట్లు, నకిలీలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.జంక్ ఫుడ్స్‌కు దూరంగా ఉంచాలి పిల్లలను జంక్‌ఫుడ్స్‌కు దూరంగా ఉంచాలి. జింక్ ఫుడ్స్‌లో కెమికల్స్ ఉంటాయి. ఇవి తిన డం వల్ల చిన్నారులకు ఊపిరితిత్తుల సమస్యలు, కడుపు నొప్పి, విరోచనాలు, ఆకలి మందగించడం వంటి సమస్యలు పిల్లలకు ఎక్కువగా వస్తుంటాయి. పాణిపూరి, చాక్లెట్లు, ఐస్ క్రీమ్‌లు, కూల్ డ్రింక్‌లకు పిల్లలను దూరంగా ఉంచాలి. – జి.వేణుగోపాల్, చిన్నపిల్లల వైద్యుడు, సీహెచ్‌సీ, పాతపట్నంవిద్యార్థులు చదువుకు దూరం విద్యార్థులు పాఠశాలకు వచ్చేముందు చిప్స్, రింగ్స్ ప్యాకెట్లు తినుకుంటూ వస్తుంటా రు. పాఠశాలకు వచ్చి కడుపు నొప్పి, విరేచనాలు అంటూ మా కు చెబుతుంటారు. ఇంటికి విద్యారి్థని పంపిస్తుంటాము. మధ్యాహ్నం భోజనం కూడా పాఠశాలలో సరిగా తినడం లేదు. చిరుతిళ్లకు పిల్లలను దూరంగా ఉంచాలి. – పొడ్డిడి కృష్ణారావు,హెచ్ఎం, ఎంపీపీ మెయిన్ పాఠశాల, పాతపట్నం(చదవండి: 10th Class Exams: ఈ పంచ సూత్రాలతో ఒత్తిడిని అధిగమిద్దాం..గెలుపును అందుకుందాం!) -
మండుతున్న ఎండలు : సమతుల ఆహారంతోనే ఆరోగ్యం
జిల్లాలో ఎండల తీవ్రత పెరిగింది. మార్చిలోనే ఎండలు ముదురుతున్నాయి. రాబోయే రోజుల్లో తీవ్రమైన ఎండలతోపాటు వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ కాలంలో మనం తీసుకునే ఆహారం అత్యంత కీలకంమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక వైపు అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు శరీరం డీ హైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంది. చెమట అధికంగా ఉత్పన్నమవుతుంది. ఇలా ఉంటే శరీరంలోని లవణాలు తగ్గిపోయి వడదెబ్బ బారిన పడే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని సూచనలు తప్పక పాటించాలని చెబుతున్నారు. వైఎస్సార్ కడప జిల్లాలో 40 డిగ్రీల సెంటీగ్రేడ్ల లోపు నిత్యం ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రెండు రోజుల్లో 42 వరకూ నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరించారు. ఈ నేపత్యంలో వేసవి తాపాన్ని తట్టుకోలేక చాలామంది చల్లని ద్రవ పదార్థాలు తీసుకునేందుకు ఇష్టపడతారు. వేసవిలో చర్మవ్యాధులకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటంది. ఇవన్నీ ఎదుర్కొవాలంటే రోగ నిరోధకశక్తి పెంచే విధంగా....ప్రతి ఒక్కరూ సమతుల ఆహారం తీసుకోవాలి. మనం తినే ఆహారం మన ఆరోగ్యాన్ని కాపాడుతుందనే ఆలోచన కలిగి ఉండాలి. ఎక్కువ నీరు తీసుకోవాలి శరీరంలో 70 శాతం నీరు ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతలు తగ్గించడంలో నీరు ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఈ విధంగా ప్రతిరోజు 3–5 లీటర్ల వరకు నీరు తీసుకుంటూ ఉండాలి. శరీరం డీ హైడ్రేషన్‌కు గురి కాకుండా చూసుకోవాలి. నిర్లక్ష్యం వహిస్తే వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. తాజా పండ్లు తీసుకోవాలి ప్రతి రోజూ నీరు, పోషకాల శాతం ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. తాజా పుచ్చకాయ, కర్బూజ, బొప్పాయి, జామ, అరటి, యాపిల్ పండ్లు తీసుకోవాలి. నిమ్మ, నారింజ, బత్తాయి, కమల రసాలు శ్రేయేస్కరం. రాగులు, జొన్నలు తదితర చిరుధాన్యాలు తీసుకోవడం కూడా మంచిది. ఇవి శక్తిని ఇవ్వడంతోపాటు ఎండల్లో నిస్సత్తువ రాకుండా చూస్తుంది. ద్రవ పదార్థాలు తీసుకోవాలి ఎండలో ఎక్కువగా తిరిగే వారు ద్రవ పదర్థాలను తీసుకుంటూ రావాలి. మజ్జిగతో పాటు కొబ్బరినీరు, లస్సీ, చెరుకు రసం అధికంగా వినియోగించాలి. ఉల్లిపాయల్లో శరీరాన్ని చల్లబరిచే గుణం కలిగి ఉంది. ఉల్లిని నిత్యం ఆహారంలో తీసుకుంటే వడ దెబ్బ బారిన పడే అవకాశాలు తక్కువ. మజ్జిగ శరీరంలోని జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంతోపాటు అందులో ప్రో బయోటిక్స్ అధికంగా ఉంటాయి. కొబ్బరినీరు ఈ కాలంలో తరుచుగా తీసుకుంటే ఖనిజ లవణాలు ఎక్కువ శక్తిని ఇచ్చి వడగాలులు, వేగి గాలుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. పటిష్టమైన రోగ నిరోధక శక్తి వేసవిలో బలమైన రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసుకోవాలి. తీసుకునే ఆహారంలో ఖనిజ లవణాలు అధికంగా ఉండేలా చూడాలి. పాలు, గుడ్లు, టమోటా, నారింజ, పసుపు రంగు కూరగాయలు, చిలకడదుంప, చేపలు, బ్లాక్ బెర్రి, బ్లూ బెర్రి తినడం మంచిది. ఆహారంలో సొరకాయ, బీరకాయ, దోసకాయ, పొట్లకాయ తదితర కూరగాయలు వినియోగించడం శ్రేయస్కరం.చదవండి: 60లో 20లా మారిపోయాడుగా : హీరోలకే పోటీ, ఫ్యాన్స్ కమెంట్లు వైరల్ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి ప్రతి ఒక్కరూ ఎండలో అవసరమైతే తప్ప బయటికి రాకుండా ఉండడం ఎంతో మంచిది. తలపై రక్షణకు గొడుగు లేదా టోపీ పెట్టుకోవాలి. చేనేత, కాటన్ దుస్తులు ధరించి మంచిది. ఎక్కువ నీరు తాగడంతోపాటు మనిషికి సరిపడేలా నిద్రపోవాలి. ప్రతిరోజు వ్యాయామం మరింత మంచిది. ఎండలు ఎక్కువగా ఉండడంతో కాపీ, టీలు అలవాటున్న వారు వీలైనంత తగ్గించుకుంటే మంచిది. – డాక్టర్ శ్రీనాథరెడ్డి, సూపరింటెండెంట్, వైఎస్సార్ ఏరియా ఆస్పత్రి, కడప -
భారత్‌కు బిల్ గేట్స్!.. దేశంపై ప్రశంసలు కురిపించిన టెక్ దిగ్గజం
అభివృద్ధి చెందుతున్న భారతదేశాన్ని ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. ప్రముఖ కుబేరులు, దిగ్గజ పారిశ్రామికవేత్తలు సైతం ఇండియాను సందర్శిస్తున్నారు. ఇందులో భాగంగా.. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates) మరోమారు (మూడేళ్ళలో మూడోసారి) భారత్ పర్యటనకు వస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తన లింక్డ్ఇన్ ఖాతాలో వెల్లడించారు.ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, డిజిటల్ పరివర్తనలో భారత్ పురోగతి అనన్య సామాన్యమని బిల్ గేట్స్ అన్నారు. గేట్స్ ఫౌండేషన్ భారతదేశంలో రెండు దశాబ్దాలకు పైగా పనిచేస్తోందని, కీలక రంగాలలో పురోగతిని సాధించడానికి ప్రభుత్వం, పరిశోధకులు, వ్యవస్థాపకులతో కలిసి పనిచేస్తుందని బిల్ గేట్స్ హైలైట్ చేశారు. గేట్స్ ఫౌండేషన్ 25వ వార్షికోత్సవం సందర్భంగా.. ట్రస్టీల బోర్డు మొదటిసారి గ్లోబల్ సౌత్‌లో సమావేశమవుతోంది. ఈ కార్యక్రమానికి భారత్ అనువైన ప్రదేశం అని ఆయన అన్నారు.వ్యాధి నిర్మూలనలుపోలియో నిర్మూలన, హెచ్ఐవీ నివారణ, క్షయ నిర్మూలన వంటి వాటికోసం భారతదేశం చేపట్టిన ప్రధాన ఆరోగ్య కార్యక్రమాలను బిల్ గేట్స్ ప్రస్తావించారు. పోలియోను నిర్మూలించడంలో ఇండియా సాధించిన విజయాన్ని గేట్స్ ప్రశంసించారు. 2011లో దేశం చివరి పోలియో కేసు నమోదైందని అన్నారు. హెచ్ఐవీ నివారణకు చేపడుతున్న అవహాన్ వంటి కార్యక్రమాలను సైతం కొనియాడారు.నేడు క్షయవ్యాధి (TB)పై భారత్ పోరాటం చేస్తోందన్నారు. టీకాల తయారీ, రోగ నిర్ధరణలో దేశ సామర్థ్యాలను ప్రశంసించారు. భారతీయ కంపెనీలు అభివృద్ధి చేస్తున్న టీబీ పరీక్షలు.. ఆఫ్రికాలో ఆ వ్యాధి నివారణలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందన్నారు. భారతదేశం క్షయవ్యాధి (TB) నిర్మూలనలో ముందంజలో ఉందని గేట్స్ అన్నారు.డిజిటల్ విప్లవంబ్యాంకింగ్, ఆరోగ్య సంరక్షణ మరియు ప్రభుత్వ సేవలకు మెరుగైన ప్రాప్యతను అందించిన ఆధార్ మరియు డిజిటల్ చెల్లింపులతో సహా భారతదేశ డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను (DPI) గేట్స్ గుర్తు చేశారు. గ్రామీణ ఆరోగ్య కార్యకర్తలు ముందస్తు వ్యాధి గుర్తింపును మెరుగుపరచడానికి, గర్భధారణ సంరక్షణను ఆప్టిమైజ్ చేయడానికి, రోగి డేటాను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడటానికి భారతదేశం ఏఐ బేస్డ్ డీపీఐ సాధనాలను ఉపయోగిస్తోందని ఆయన అన్నారు. వ్యవసాయంలో కూడా ఏఐ వాడకం ప్రశంసనీయమని ఆయన అన్నారు.ఇదీ చదవండి: కస్టమర్ ఆర్డర్ చేసిన ఫుడ్.. తినేసిన డెలివరీ బాయ్.. థాంక్స్ జొమాటోభారతదేశ పురోగతి దాని సరిహద్దులను దాటి విస్తరించిందని గేట్స్ నొక్కిచెప్పారు. ముఖ్యంగా భారతదేశం G20 అధ్యక్ష పదవి సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశం యొక్క ఆవిష్కరణలను ప్రపంచవ్యాప్తంగా పంచుకుంటామని ప్రతిజ్ఞ చేసిన తర్వాత.. టీకా తయారీ నుంచి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్స్ వరకు ఇక్కడ అభివృద్ధి చేస్తున్న పరిష్కారాలను ప్రపంచంతో పంచుకుంటున్నారు. బిల్ గేట్స్ భారతదేశానికి వచ్చిన తరువాత.. ఇక్కడ ప్రభుత్వ అధికారులతో, శాస్త్రవేత్తలు చర్చలు.. సమావేశాలు జరిపే అవకాశం ఉంది. -
'వాకింగ్ యోగా': జస్ట్ ఒకే వ్యాయామంతో..!
నడక, యోగా రెండూ దేనికవే ప్రత్యేకం. ఆరోగ్యకరమైన వ్యాయామ మార్గాలు. ప్రస్తుతం ఈ రెంటినీ మిళితం చేసిన సరి కొత్త వ్యాయామంగా అందుబాటులోకి వచ్చింది వాకింగ్ యోగా. అటు నడక ద్వారా లభించే ప్రయోజనాలతో పాటు.. ఇటు యోగా ఫలితాలను ఒకే వ్యాయామం ద్వారా అందుకునేందుకు ఇది సహకరిస్తుంది. ఇటీవల తెలంగాణలోని హైదరాబాద్ నగరంలో అనేక మందిని ఆకట్టుకుంటున్న ఈ వాకింగ్ యోగా విశేషాలివి..నడక మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ నడక– యోగా ఆ ప్రయోజనాలను మరింత ముందడుగు వేయిస్తుంది. ఆధునిక సౌకర్యాలు, పని విధానాల వల్ల చలన రహితంగా మారుతున్న శరీరాన్ని చురుకుగా కదపడానికి విభిన్న రకాలుగా సాగదీయడానికి, సరైన రీతిలో శ్వాస పీల్చుకోడానికి వీలుగా ఈ వాకింగ్ యోగా రూపుదిద్దుకుంది. ఇది నడిచేటప్పుడు మన శరీర భంగిమను మెరుగుపరచడానికి, నడకను మరింత ప్రయోజనకరంగా మార్చడానికి సహకరిస్తుంది. ఏదో నడిచాం అన్నట్టుగా కాకుండా అవగాహనతో నడవడం నేర్పిస్తుంది. ఇందులో ప్రతి అడుగు లోతైన శ్వాస, సున్నితమైన స్ట్రెచ్‌లతో కలిపి ఉంటుంది. భంగిమకు మేలు.. మనలో చాలా మంది మన శరీర భంగిమ ఎలా ఉంటుందో పట్టించుకోకుండా నడుస్తూ ఉంటారు. తద్వారా నడవడం వల్ల కలిగే ప్రయోజనాలను కోల్పోతుంటారు. వాకింగ్ యోగా భంగిమను మెరుగుపరుస్తుంది. చేతులు, కాళ్లు, మెడ.. వీటిని సరైన రీతిలో ఉంచేలా సహాయపడుతుంది. నిటారుగా నిలిచేలా, నడుము భాగం, వీపుతో నడకను అనుసంధానిస్తుంది. కండరాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కొందరికి అననుకూలం.. ఒక వ్యక్తి తమ నడకను మరింత విశ్రాంతిగా అదే సమయంలో మరింత ఉపయుక్తంగా మార్చే నడక యోగా టీనేజర్స్‌తో సహా అన్ని వయసుల వారికీ ఉపయుక్తమే. అయితే అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ఇది అందరికీ అనుకూలం కాకపోవచ్చు. వేగవంతమైన నడక లేదా తీవ్రమైన వ్యాయామాలను ఇష్టపడే వ్యక్తులకు నప్పకపోవచ్చు. అలాగే, దీనికి ఏకాగ్రత, ఎక్కువ సహనం అవసరం. అది లేనివారు దీన్ని సాధన చేయడం కష్టం. నప్పుతుందో లేదో తెలుసుకోడానికి ఒక వారం పాటు దీనిని ప్రయత్నించి పరిశీలించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మానసికంగానూ ఎంతో మేలు.. నడక యోగా ఒత్తిడిని తగ్గించడానికి విశ్రాంతిని అందించడానికి ఒక గొప్ప మార్గం. ఇది నడుస్తున్నప్పుడు లోతుగా శ్వాస తీసుకోవడం అలవాటు చేస్తుంది. తద్వారా ఆందోళనను, ప్రతికూల ఆలోచనలను తగ్గించి మనసును ప్రశాంతపరుస్తుంది. ఇది చురుకుగా ఉంటూనే మెదడుకు రిఫ్రెష్ బటన్ ప్రెస్ చేయడం లాంటిదని చెప్పొచ్చు. మనసు శరీరానికి క్రమబద్ధమైన అభ్యాసం ఇది. ఒత్తిడిని తగ్గించడానికి, మానసిక స్థితిని, ఏకాగ్రతను పెంచడానికి శరీరంపై అవగాహనను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రోజుకు 5 నిమిషాలతో.. బాగా పరిచయం ఉన్న కాస్త ప్రశాంతంగా ఉండే ప్రదేశంలో రోజుకు ఐదు నిమిషాలతో ఈ వాకింగ్ యోగాని ప్రారంభించాలి. రోజుకు క్రమంగా ఐదు నిమిషాల చప్పున పెంచుకోవచ్చు. తద్వారా రొటీన్ వ్యవహారాలకు, వ్యాయామాలతో సర్దుబాటు కావడానికి కండరాలకు సమయాన్ని ఇవ్వాలి. ‘రోజుకు 20 నిమిషాలు వచ్చే వరకూ ఈ విధంగా పెంచుతూపోవాలి. ప్రతిరోజూ 20 నిమిషాలు కేటాయించలేకపోతే.. కనీసం వారానికి మూడు రోజులు 30 నిమిషాలు చేస్తే సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. 50 ఏళ్ల క్రితమే.. మైండ్‌ఫుల్ వాకింగ్ అనే ప్రక్రియను యోగా శిక్షకురాలు, యోగా ఫర్ పెయిన్ యాప్ సృష్టికర్త, లండన్‌కు చెందిన సోఫియా డ్రోజ్డ్ వ్యాప్తిలోకి తెచ్చారు. అయితే ఇదేమీ కొత్తది కాదని, దాదాపు 50 ఏళ్ల క్రితం.. అంటే 1970 ప్రాంతంలోనే రోజువారీ కార్యకలాపాలతో యోగా, బ్రీత్వర్క్లను కలిపే సాధనంగా ఇది ప్రప్రథమంగా వినియోగంలోకి వచ్చిందని డ్రోజ్డ్ అంటున్నారు. ప్రకృతితో మమేకం.. మైండ్ ఫుల్ వాక్.. దృష్టిని పూర్తిగా శ్వాస మీదే కేంద్రీకరిస్తూ.. ఆలోచనలు మరే విషయం మీదకూ మళ్లించకుండా శరీరాన్ని కదిలించడమే మైండ్ ఫుల్ నెస్. నడిచే సమయంలో ఈ ప్రక్రియను సాధన చేస్తే.. అద్భుత ప్రయోజనాలు లభిస్తాయి. అది కూడా ప్రకృతిలో మమేకమవుతూ చేయడం మరింత ప్రయోజనకరం. నడకను, యోగాను మేళవించడమే వాకింగ్ యోగా. మైండ్ ఫుల్ బ్రీతింగ్, మైండ్ ఫుల్ నేచర్ వాక్, పచ్చని గడ్డి మీద నడిచే బేర్ ఫుట్ వాక్, క్లౌడ్ గేజింగ్.. వంటివన్నీ ఇందులో భాగంగానే చెప్పవచ్చు. నగరంలో పలువురు వాకింగ్ యోగాను సాధన చేస్తున్నారు. – రీనా హిందోచా, యోగా శిక్షకురాలు (చదవండి: క్షణాల్లో తయారయ్యే ఈ మ్యాగీ నూడుల్స్ రెసిపీని కనిపెట్టిందెవరంటే..) -
పుట్టుకతో తోడై..జీవితం సూదిపోటై!
షుగర్ వ్యాధి బారిన పడకుండా ఒక్కొక్కరు ఒక్కో ఆరోగ్య సూత్రాన్ని పాటిస్తుంటారు. ఒకరు రైస్ తినకూడదంటారు.. ఇంకొకరు నడక మంచిదంటారు.. ఒక వయస్సుకు వచ్చిన తర్వాత వ్యాధి బారిన పడటం ఒక ఎత్తయితే, రాకుండా జాగ్రత్త పడటం ఇంకొక ఎత్తు. మరి పుట్టుకతోనే ఈ వ్యాధి తోడుగా వస్తే.. ఆ పిల్లల జీవితం నరకప్రాయం. ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకుంటే తప్ప బతకలేని పరిస్థితి. తలుచుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. అసలు ఎందుకు ఈ పరిస్థితి? వీళ్లు చేసిన పాపం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం..కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీకి చెందిన యువకునికి పుట్టుకతోనే షుగర్ వ్యాధి వచ్చింది. వైద్యులు పరిశీలించి టైప్–1 డయాబెటిస్‌గా నిర్ధారించారు. అప్పటి నుంచి ఇన్సులిన్‌ను ఇంజెక్షన్ రూపంలో అందిస్తున్నారు. ప్రస్తుతం ఇతని వయస్సు 30 ఏళ్లు. రోజూ ఇంజెక్షన్ వేయించుకోవాలంటే బాధగా ఉంటోందని, కానీ బతకాలంటే తప్పదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. స్వీట్లు అంటే ఇష్టమని, కానీ తింటే పరిస్థితి దారుణంగా ఉంటుందని వాపోతున్నాడు. పగిడ్యాల మండలంలోని పాత ముచ్చుమర్రి గ్రామానికి చెందిన మల్లయ్య, మానస దంపతులు వ్యవసాయ కూలీలు. వీరికి ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు వెంకట ఉమామహేష్ రెండవ కుమారుడు లిఖిత్. 9 నెలల వయస్సు కలిగిన లిఖిత్‌కు పుట్టుకతోనే చక్కెర వ్యాధి తోడుగా వచ్చింది. తరచూ అపస్మారక స్థితికి చేరుకోవడం గమనించి కర్నూలు ప్రైవేట్ ఆసుపత్రిలో సుమారు రూ.3లక్షలకు పైగా ఖర్చు చేసినా ఫలితం లేకపోయింది. షుగర్ లెవెల్స్ గుర్తించేందుకు మిషన్ తెచ్చుకుని వారానికోసారి ఇన్సులిన్ ఇంజెక్షన్ వేయించాల్సిన పరిస్థితి. నెలకు సుమారు రూ.5వేల దాకా ఖర్చవుతోందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. పేరులో తియ్యదనం దాచుకున్న మహమ్మారి మధుమేహం. ఇది పెద్దలనే కాదు.. చిన్నారులనూ వదలని పరిస్థితి. పుట్టుకతోనే తోడుగా వచ్చి జీవించినంత కాలం వేధిస్తోంది. అందరిలా జీవించాలంటే రోజూ సూదిపోటుతో ఇన్సులిన్ మందు వేసుకోవడం తప్పనిసరి. అల్లారుముద్దుగా పెంచుకున్న కన్నబిడ్డలను తల్లిదండ్రులే స్వయంగా ఇంజెక్షన్ ద్వారా ఇన్సులిన్ ఇవ్వడం వారికీ నరకంతో సమానం. ఇలాంటి బాధితుల సంఖ్య సమాజంలో రోజురోజుకూ పెరుగుతోంది. శరీరంలోని క్లోమగ్రంధిలో ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ గ్రంధిలో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే కణాలను(బీటా కణాలు) వ్యక్తుల రోగనిరోధక వ్యవస్థ నాశనం చేస్తుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. దీన్ని టైప్–1 మధుమేహం(డయాబెటిస్) అంటారు. సాధారణంగా పిల్లలు, యువకుల్లో ఈ పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొన్నిసార్లు బీటా కణాలను రోగినిరోధక వ్యవస్థ నిరీ్వర్యం చేయడం కాకుండా క్లోమగ్రంధికి ఏదైనా వ్యాధి సోకినప్పుడు లేదా గాయం అయినప్పుడు బీటా కణాలు నిర్వీర్యం అవుతాయి. దీనిబారిన పడిన వారికి క్రమం తప్పకుండా ఇన్సులిన్‌ను ఇంజెక్షన్ చేయాల్సి ఉంటుంది. ఇది కొంత మందికి జన్యుపరంగా కూడా రావచ్చు. మరికొంత మందికి పలు రకాల వైరల్ వ్యాధులు, ఇతర ప్రమాదకర అనారోగ్యాల కారణంగా కూడా ఈ పరిస్థితి ఎదురవ్వొచ్చు. అంతేకానీ ఆహారం, జీవనశైలి అలవాట్లు టైప్–1 డయాబెటిస్‌కు కారణం కావు. ప్రభుత్వాసుపత్రుల్లో అరకొర ఇన్సులిన్ ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్సతో పాటు ఇన్సులిన్‌ను ఉచితంగా అందించాల్సి ఉంది. అయితే గత 10 నెలలుగా వీరికి అరకొరగా ఇన్సులిన్ ఇస్తున్నారు. కేవలం కర్నూలు, నంద్యాల ప్రభుత్వ సర్వజన వైద్యశాలల్లో మాత్రమే అధికారులు స్థానికంగా కొనుగోలు చేసి ఇన్సులిన్‌ను కొద్దిమొత్తంలో అందజేస్తున్నారు. ఏరియా ఆసుపత్రులు, సీహెచ్‌సీలు, పీహెచ్‌సీల్లో ఇన్సులిన్ అందుబాటులో ఉండటం లేదు. దీంతో చాలా మంది మెడికల్ షాపుల్లో కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో చిన్నారికి వ్యాధి తీవ్రతను బట్టి నెలకు రెండు నుంచి నాలుగు ఇన్సులిన్ ఇంజెక్షన్లు అవసరం. పెరుగుతున్న చికిత్స వ్యయం మెడికల్‌షాపుల్లో ఒక్కో ఇన్సులిన్ ఖరీదు రూ.180 వరకు ఉంటోంది. ఈ మేరకు ప్రతి చిన్నారికి నెలకు రూ.600 నుంచి రూ.800 వరకు ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వాసుపత్రులతో పాటు ప్రైవేటు క్లినిక్‌లు, ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యుల వద్ద చికిత్స తీసుకునే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఆధునిక వైద్యవిధానాల మేరకు వారికి నొప్పి తక్కువగా ఉండే ఇన్సులిన్ పెన్నుల ద్వారా ఇంజెక్షన్ చేస్తున్నారు. వీటి ఖరీదు సాధారణ ఇన్సులిన్‌తో పోలిస్తే రెట్టింపుగా ఉంటుంది. లక్షణాలుటైప్–1 డయాబెటిస్ లక్షణాలు బయటపడటానికి కొన్ని నెలలు లేదా సంవత్సరాలు పట్టవచ్చు. విపరీతమైన దాహం, తిన్న తర్వాత కూడా బాగా ఆకలివేయడం, నోరు తడి ఆరిపోవడం. కడుపునొప్పి, వాంతులు, ఎక్కువసార్లుమూత్రవిసర్జనకు వెళ్లడం. ఊహించని విధంగా బరువు తగ్గిపోవడం, అలసట, కంటిచూపు తగ్గిపోవడం. శ్వాస తీసుకోవడానికి ఎక్కువ కష్టపడటం, తరచుగా చర్మ, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు. మూడ్ మారిపోవడం, నిద్రలో మూత్రవిసర్జన చేయడం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 50లక్షల వరకు జనాభా ఉంటుంది. ఇందులో 15 నుంచి 20 శాతం వరకు మధుమేహ బాధితులు. వీరిలో టైప్–2 మధుమేహ బాధితులు 90 శాతం కాగా.. టైప్–1 బాధితులు 10 శాతం పైనే. ఈ లెక్కన 7.50లక్షల నుంచి 10లక్షల వరకు మధుమేహ బాధితులు ఉండగా.. 75వేల నుంచి లక్ష దాకా చిన్నారులు ఉంటున్నారు.కోవిడ్ తర్వాత పెరిగిన కేసులు కోవిడ్–19 అనంతరం టైప్–1 డయాబెటిస్ రోగుల సంఖ్య పెరిగింది. గతంలో డయాబెటిస్ రోగులు 5 శాతం ఉండగా ఇప్పుడు 10శాతానికి చేరుకుంది. కోవిడ్ వైరస్ నేరుగా బీటా కణాలపై దాడి చేయడమే ఇందుకు కారణం. ఈ కారణంగా కోవిడ్‌కు గురైన వారికి జని్మంచే పిల్లల్లో టైప్–1 డయాబెటీస్ ఎక్కువగా కనిపిస్తోంది. – డాక్టర్ పి.శ్రీనివాసులు, ఎండోక్రైనాలజీ హెచ్‌వోడి, జీజీహెచ్, కర్నూలు ఇన్సులిన్‌తో మాత్రమే చికిత్స చిన్నపిల్లల్లో వచ్చే టైప్–1 డయాబెటిస్‌కు ఇన్సులిన్‌తో మాత్రమే చికిత్స అందుబాటులో ఉంది. ఆయాసం, కడుపునొప్పి, వాంతులు లక్షణాలతో చిన్నపిల్లలను ఆసుపత్రికి తీసుకొస్తారు. అన్నిరకాల పరీక్షలు నిర్వహించి డయాబెటిస్ నిర్ధారణ అయ్యాక చికిత్స ప్రారంభిస్తాం. ఈ పిల్లలకు ఇన్సులిన్‌తో పాటు ఆహార నియమావళి తప్పనిసరి. – డాక్టర్ ఎం.మల్లికార్జున, అసోసియేట్ ప్రొఫెసర్, పీడియాట్రిక్స్, జీజీహెచ్, కర్నూలు (చదవండి: మొటిమలను నివారిద్దాం..పెదవులను మృదువుగా చేసేద్దాం ఇలా..!) -
ప్రెగ్నెన్సీలో ఎలాంటి మల్టీ విటమిన్ టాబ్లెట్స్ బెస్ట్..!
ప్రెగ్నెన్సీలో ఎలాంటి మల్టీ విటమిన్ టాబ్లెట్స్ తీసుకోవాలి? – రాధ, శ్రీకాకుళంప్రెగ్నెన్సీలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే కావాలసిన పోషకాలన్నీ అందులోనే దొరుకుతాయి. ఫోలిక్ యాసిడ్ మాత్రలు, విటమిన్–డి సప్లమెంట్స్ మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలి. ఫోలిక్ యాసిడ్ మాత్రలను ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌లోనే తీసుకోవటం మొదలు పెట్టాలి.వీటిని ప్రెగ్రెన్సీలో చాలామందికి ఇస్తాం. ఫోలిక్ యాసిడ్ పుట్టబోయే బిడ్డకు ఎలాంటి అవయవ లోపాలు లేకుండా, వెన్నెముక సమస్యలు రాకుండా చేస్తుంది. ఇది ఎక్కువగా బ్రకలీ, పాలకూర, బీన్స్ లలో ఉంటుంది. వీటిని ఆహారంలో తీసుకున్నా కూడా ఫోలిక్ యాసిడ్ సప్లమెంట్స్ అవసరం ఉంటుంది. ప్రతిరోజూ 400 ఎమ్సీజీ ఫోలిక్ యాసిడ్ అవసరం ఉంటుంది.విటమిన్–డి ఎముకలు, కండరాలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. మార్చి నుంచి సెప్టెంబర్ నెల వరకు సూర్యకాంతి నుంచి విటమిన్–డి వస్తుంది, ఇది సరిపోతుంది. మిగిలిన నెలల్లో మాత్రం విటమిన్–డి సప్లమెంట్స్ తీసుకోవాలి. చేప, గుడ్లు, మాంసంలో విటమిన్–డి ఉంటుంది. రోజుకు 10 ఎమ్సీజీ టాబ్లెట్ సరిపోతుంది. ప్రెగ్నెన్సీలో విటమిన్–ఎ విటమిన్ టాబ్లెట్స్ తీసుకోకూడదు. ఇది బేబీకి హాని చేస్తుంది. లివర్, లివర్ ప్రాడెక్ట్స్‌లో హై విటమిన్–ఎ ఉంటుంది. అందుకే వీటిని ఆహారంలో తీసుకోకూడదు. డా‘‘ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: చేపే కదా కరిచిందని తేలిగ్గా తీసుకున్నాడు..!కట్‌చేస్తే..) -
ప్రెగ్నెన్సీ టైంలో జుట్టుకి రంగు వేసుకోవచ్చా..?
నాకు ఇప్పుడు ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయింది. ఫంక్షన్‌కి జుట్టుకు రంగు వేయించుకోవాలి. ప్రెగ్నెన్సీలో ఇది మంచిది కాదని విన్నాను. ఇప్పుడు జుట్టుకు ఎలాంటి రంగులు వేసుకోవటం మంచిది? – మీనాక్షి, అనంతపురం చాలామంది గర్భవతులు అడిగే ప్రశ్న ఇది. జుట్టుకు వేసుకునే రంగు మంచి కంపెనీది వాడటంతో గర్భవతులకు ఎలాంటి హాని జరగదని ఎన్నో పరిశోధనల్లో తేలింది. పర్మినెంట్, సెమీ పర్మినెంట్ డైలతో కొంతమందికి రియాక్షన్స్, దురదలు రావచ్చు. ఈ జుట్టుకు వేసుకునే రంగు తలపై మాడు ద్వారా రక్తంలోకి వెళ్లి బేబీకి హాని చేస్తుంది అనేది నిజం కాదు. జుట్టుకు వేసుకునే రంగులో చాలా తక్కువ మోతాదులో రసాయనాలు ఉంటాయి. ఇవి బేబీకి ఏ హాని చెయ్యవు. కాని ఆరోగ్యకరమైన మాడు లేకపోయినా, హై డోస్ కెమికల్ షాంపూలు, డైలు వాడినా చర్మంలో మార్పులు, దురదలు రావచ్చు. ఆరోగ్యకరమైన మాడు ఎక్కువ డైని పీల్చుకోదు. కాని, 12 వారాల ప్రెగ్నెన్సీ దాటే వరకు అంటే మూడు నెలలు నిండే వరకు ఎలాంటి యాంటీబయోటిక్స్, పెయిన్ కిల్లర్స్, రసాయనాల గాఢత ఎక్కువ ఉండే జుట్టు, చర్మ చికిత్స మందులను తీసుకోవద్దని చెప్తాం. రెండు, మూడు త్రైమాసికాల్లో ప్రెగ్నెన్సీలో వచ్చే చర్మం, శరీరంలో వచ్చే మార్పుల వలన చాలామందికి డైలతో రియాక్షన్స్, దురదలు రావచ్చు. కొన్నిసార్లు డై సరిగ్గా పనిచెయ్యకపోవచ్చు. హై స్ట్రాండ్స్ కలర్స్ అంతగా పనిచెయ్యవు. కాని ప్రతిసారి హెయిర్ డై లేదా హెయిర్ కలర్ చేయించుకునే ముందు స్ట్రాండ్స్ టెస్ట్ చేయించుకోండి. ప్యాచ్ టెస్ట్ అనే స్కిన్ టెస్ట్ ప్రతిసారి చెయ్యమనండి. ఒకవేళ ఇంట్లోనే జుట్టుకు రంగు వేసుకుంటుంటే, చేతులకు గ్లోవ్స్ వేసుకోవాలి. స్కిన్ ఇరిటేషన్ ప్రెగ్నెన్సీలో చాలా తర్వగా వస్తుంది. డై వేసుకున్న తర్వాత ఆ కంపెనీ చెప్పిన సమయం వరకు మాత్రమే ఉంచుకొని, వెంటనే శుభ్రం చేసుకోవాలి. బాగా గాలి, వెలుతురు ఉన్న ప్రదేశంలో డై వాడాలి. మాడును చాలాసార్లు నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. అలాగే ముఖం, మిగిలిన డైని కూడా శుభ్రం చేసుకోవాలి. డై బ్లడ్ స్ట్రీమ్ ద్వారా శరీరంలోకి వ్యాపించడం చాలా అరుదు. హైలైట్స్ అనేవి ఈమధ్య చాలామంది చేసుకుంటున్నారు. అక్కడ వేసే రసాయనాలను కేవలం జుట్టు మాత్రమే పీల్చుకుంటుంది. సెమీ పర్మినెంట్ కలర్స్ అంటే హెన్నా లాంటì వి ఇంట్లోనే తయారుచేసుకొని వాడుకోవటం మంచిది. -
కేంద్ర ప్రభుత్వ స్కీమ్: వయోపరిమితి 60 ఏళ్లకు తగ్గింపు!
భారత ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నెన్నో పథకాలను (స్కీమ్స్) అందిస్తోంది. ఇందులో సీనియర్ సిటిజన్ల ఆరోగ్యానికి సంబంధించిన స్కీమ్ 'ఆయుష్మాన్ భారత్' (Ayushman Bharat) కూడా ఉంది. దీని కవరేజికి మరింత విస్తరించడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.ఆయుష్మాన్ భారత్ పథకం కింద కవరేజీని విస్తృతం చేయడానికి, ఆయుష్మాన్ వే వందన కార్డు (Ayushman Vay Vandana Card) అర్హత వయస్సును 70 నుంచి 60 సంవత్సరాలకు తగ్గించాలని, ప్రతి కుటుంబానికి ఏటా అందించే ఆరోగ్య సంరక్షణ కవరేజీని పెంచాలని పార్లమెంటరీ కమిటీ సూచించింది. ఇది అమలులోకి వస్తే.. మరో 4.5 కోట్ల కుటుంబాలు ప్రయోజనం పొందుతాయి.ప్రస్తుతం భారతదేశంలో 40 శాతం కంటే ఎక్కువ మంది ప్రజలు ఆయుష్మాన్ భారత్ కింద్ ఆరోగ్య సౌకర్యాలను పొందుతున్నారు. కాగా ఇప్పుడు నిర్ణీత వయసును 70 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తే.. ఇది మరింత మంది వృద్దులకు ఉపయోగకరంగా ఉంటుందని.. పార్లమెంటరీ కమిటీ యోచిస్తోంది.ఇదీ చదవండి: డీఏ పెంపు ప్రకటన త్వరలో..: ఈ సారి ఎంతంటే?ఆయుష్మాన్ భారత్ ప్రయోజనాలను మరింత మందికి అందించడానికి వయసును తగ్గించడం మాత్రమే కాకుండా.. కవరేజికి కూడా పెంచాలని భావిస్తున్నారు. ఇదే జరిగితే ప్రస్తుతం రూ.5 లక్షలు ఉన్న కవరేజీ రూ.10 లక్షలకు చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న ఆయుష్మాన్ భారత్-ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB-PMJAY)లోని అంతరాలను కూడా పార్లమెంటరీ కమిటీ తన నివేదిక హైలైట్ చేసింది. -
మధుమేహం లేకపోయినా కిడ్నీ వ్యాధి వస్తుందా..?
కిడ్నీ.. మానవ శరీరంలో అతిముఖ్యమైన అవయవం. తినేతిండి, తాగే నీటిని వడకట్టి వడబోసి.. శరీరానికి అవసరమైన శక్తిని రక్తంలోకి, మలినాలను, వ్యర్థాలను మలమూత్రవిసర్జన ద్వారా బయటికి పంపించే ప్రక్రియను కిడ్నీ నిర్వహిస్తుంది. ఇటీవలకాలంలో తెలంగాణ కరీంనగర్ జిల్లాలో కిడ్నీవ్యాధి బాధితులు పెరుగుతున్నారు. పిల్లలు, యువతను సైతం సమస్య వెంటాడుతోంది. అనేక మందికి ముందస్తు లక్షణాలు లేకపోవడం, మధుమేహం లేకపోయినా మూత్రపిండాలు పనిచేయడం ఆగిపోవడం కనిపిస్తోంది. దశాబ్దకాలంలో వేలాదిమంది మరణాలకు కారణమైన వ్యాధికి ప్రధాన కారణాలు మధుమేహం, అధిక రక్తపోటు కాగా పెయిన్ కిల్లర్స్ అధిక వినియోగం, డీహైడ్రేషన్ మరింత ప్రమాదంలోకి నెడుతున్నాయి. నేడు ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా కథనం.రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లకు చెందిన పబ్బతి విజయేందర్‌రెడ్డి(55) వ్యవసాయం చేస్తుంటాడు. ఒకరోజు అనూహ్యంగా వాంతులయ్యాయి. కాళ్లు వాపులు వచ్చాయి. వెంటనే కరీంనగర్ వెళ్లగా రక్త పరీక్షలు చేసిన డాక్టర్లు కిడ్నీలు ఫెయిలయ్యాయని నిర్ధారించారు. విజయేందర్‌రెడ్డి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని, వారానికి రెండుసార్లు డయాలసిస్ చేశారు. ప్రతిసారీ రూ.5000 చొప్పున నెలకు రూ.40వేల నుంచి రూ.60 వేల వరకు ఖర్చు అయ్యాయి. విజ యేందర్‌రెడ్డిని ఆస్పత్రిలో అచేతన స్థితిలో చూసిన తమ్ముడు జితేందర్‌రెడ్డి(51) తన రెండు కిడ్నీల్లోని ఒక్కటి ఇచ్చేందుకు ముందుకొచ్చాడు. ఆపరేషన్ సక్సెస్ అయింది. విజయేందర్‌రెడ్డికి జితేందర్‌రెడ్డి కిడ్నీ మ్యాచ్ అయింది. అదిపని చేయడం ప్రారంభించింది. మృత్యుముంగిట అసహాయంగా చేతులు కట్టుకుని నిల్చున్న సోదరుడికి ఆత్మీయ రక్తబంధం పునర్జన్మనిచ్చింది.కిడ్నీలు ప్రతిరోజు దేహంలో 200 లీటర్ల రక్తాన్ని శుభ్రం చేస్తూ, యూరియా, క్రియాటినిన్ లాంటి జీవరసాయనాలను వడపోస్తాయి. కిడ్నీల పనితీరు దాదాపు 70 నుండి 80 శాతానికి పడిపోయే వరకు బాధితులకు ఆ విషయమే తెలియదు. ఒకసారి కిడ్నీలు గనక చెడిపోతే, జీవక్రియల్లో వెలువడే ఎన్నో విషరసాయనాలు దేహంలోనే పేరుకుపోవడం మొదలవుతుంది. దీంతో ప్రాణాలకే ముప్పు తెచ్చి పెడుతుంది. అవగాహన లేమి, నిర్లక్ష్యం, విచ్చలవిడిగా పెయిన్ కిల్లర్స్ మందులు వాడకంతో ఉమ్మడి జిల్లాలో జిల్లాలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారు. మూత్రపిండాలు ఒకసారి దెబ్బతింటే తిరిగి బాగు చేయటం సాధ్యం కాదు. కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే పాడవకుండా చూసుకోవచ్చని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. గురువారం ‘ప్రపంచ మూత్రపిండాల దినోత్సవం’ సందర్భంగా కథనం.ఇదీ నేపథ్యం2006లో తొలిసారిగా మార్చి 14న ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని ప్రారంభించారు. ఏటా ప్రత్యేక థీమ్‌ని ప్రకటించి కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మూత్రపిండాల ఆరోగ్యం, డయాలసిస్ అవగాహన కోసం ఏటా మార్చి రెండవ గురువారం “ప్రపంచ కిడ్నీ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.థీమ్: “మీ మూత్రపిండాలు బాగున్నాయా? ముందుగానే గుర్తించండి.., మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడండి..’' అనేది ఈ ఏడాది నినాదం. కిడ్నీ వ్యాధికి సంబంధించిన ప్రమాద కారకాలు మధుమేహం(షుగర్), రక్తపోటు(బీపీ) కుటుంబంలో మూత్రపిండాల వ్యాధి చరిత్ర ఉండడమని వైద్యులు పేర్కొంటున్నారు.కిడ్నీల పనితీరు కీలకంమూత్రపిండాలు మూత్రం తయారీతోపాటు రక్తం వడపోతలో కీలకంగా పనిచేస్తాయి. కణాలు ఉత్పత్తి చేసే ఆమ్లాలను (యాసిడ్)ను బయటకు పంపిస్తాయి. రక్తంలో నీరు, లవణాలు, సోడియం, కాల్షియం, భాస్వరం, పోటాషియం వంటివి సమతుల్యంగా ఉండేలా చేస్తాయి. కిడ్నీలు దెబ్బతింటే ప్రాణాలు కోల్పేయే ప్రమాదం ఉంది. సీరం క్రియాటిన్ పరీక్ష ద్వారా కిడ్నీ పనితీరును తెలుసుకునే వీలుంది. ఏడాదికోసారైనా ఈ పరీక్ష చేయించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.తీసుకోవాల్సిన జాగ్రత్తలుమూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, రక్తపోటు, మధుమేహం, అధిక బరువు వంటివి తలెత్తకుండా చూసుకోవాలి. ధూమపానం, మద్యపానం మానుకోవాలి. పుష్కలంగా నీరు తాగాలి, వ్యాయామం చేయాలి. ఉప్పు తక్కువ తీసుకోవాలి. అధికంగా మాంసం తీసుకోవద్దు. ఆహారంలో సగభాగం పీచు పదార్ధాలు ఉండేలా చూసుకోవాలి. నొప్పి గోళీలు, అనవసరంగా స్టెరాయిడ్స్ వాడకూడదు.ఉమ్మడి జిల్లాలో మూత్రపిండ వ్యాధిగ్రస్తుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యరంగంలో కిడ్నీ బాధితులకు నామమాత్రపు వైద్య సేవలు అందుతున్నాయి. స్థానికంగా ప్రైవేటు రంగంలో నెఫ్రాలజిస్టులు ఉన్నప్పటికీ సదుపాయాల కొరతతో రోగులు పెద్ద నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి. ప్రభుత్వ వైద్యశాలల్లో నెఫ్రాలజీ, యూరాలజీ విభాగాలు లేవు. చికిత్స మాత్రమే అందిస్తున్నారు.గోదావరిఖని జీజీహెచ్‌తోపాటు పెద్దపల్లి జిల్లా ఆస్పత్రి, మంథని ప్రభుత్వాస్పత్రుల్లో ఐదు మిషన్లు చొప్పున మూడు డయాలసిస్ కేంద్రాలున్నాయి. ఆరోగ్యశ్రీ పథకం కింద జీజీహెచ్‌లో రోజుకు 16 మందికి నాలుగు షిప్టుల ద్వారా నెలలో 40మందికి, పెద్దపల్లిలో రోజుకు 15 మందికి మూడు షిఫ్టుల చొప్పున నెలకు 33 మంది పేషెంట్లకు, మంథనిలో రోజుకు తొమ్మిది మందికి ఒక షిఫ్టులో నెలలో 9మంది పేషెంట్లకు డయాలసిస్ చేస్తున్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లావ్యాప్తంగా 95మంది కిడ్నీలు (మూత్రపిండాలు) ఫెయిల్ అయి డయాలసిస్‌పై జీవిస్తున్నారు. వందలాది మంది సకాలంలో వైద్యం అందక, కిడ్నీ అందించే రక్తసంబంధీకులు ఎవరూ ముందుకు రాక.. ప్రాణాలు కోల్పోయారు.కరీంనగర్ జిల్లా ఆస్పత్రిలో డయాలసిస్ సేవలు అందిస్తున్నారు. జిల్లా ఆస్పత్రితో పాటు నగర శివా రులో ఉన్న రెండు వైద్యకళాశాలల్లో సైతం డయాలసిస్ సేవలు ఆరోగ్యశ్రీ ద్వారా అందిస్తున్నారు.పెయిన్ కిల్లర్స్ తీసుకోవద్దుఈ మధ్య చాలా మంది పేయిన్ కిల్లర్స్, ఇతర హానికరమైన మందులను విచ్ఛలవిడిగా మింగుతున్నారు. డాక్టర్ సలహా లేకుండా ఎలాంటి మందులను వాడకూడదు. నాటు వైద్యం జోలికి వెళ్ల కూడదు. జీవన శైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు, వంశపారంపర్య రుగ్మతలు కిడ్నీ వ్యాధులకు కారణం. సంపూర్ణ ఆరోగ్యం కోసం మన జీవనశైలిని మార్చుకోవాలి. – కుందరాపు గోపికాంత్, యూరాలజిస్టు, గోదావరిఖనిలక్షణాలు తెలియడం లేదుచాలా మంది వ్యాధి ముదిరే వరకు లక్షణాలు తెలియపోవడం వల్ల పరిస్థితి విషమించిన తర్వాత వైద్యం కోసం వస్తున్నారు. తగ్గని జ్వరం, కాళ్లు, ముఖం వాపులు, యూరిన్‌లో ప్రొటీన్లు పోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాలి. అశ్రద్ధ చేయడం వల్ల ప్రాణాలకే ప్రమాదం ఏర్పడవచ్చు.– రాంచందర్ తొర్రెం, నెఫ్రాలజిస్టు (చదవండి: డీహైడ్రేషన్‌కు రీహైడ్రేషన్‌తో చెక్..! ఎండాకాలం ఈ జాగ్రత్తలు తప్పనిసరి..) -
సుర్రుమంటున్న సూర్యుడు.. డీహైడ్రేషన్ బారినపడకూడదంటే..!
ఎండాకాలం మొదలైంది. మార్చి రెండోవారంలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. గత 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా గతేడాది 47 నుంచి 49 డిగ్రీల సెల్సీయస్ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఏడాది కూడా అదేస్థాయిలో మండే ఎండలు ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వడదెబ్బ తగలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?ఎలాంటి వైద్య సేవలు పొందాలి? తదితర అంశాలను గురించి ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కరీంనగర్ జిల్లా వైద్య అధికారి(డీఎంహెచ్‌వో) వెంకటరమణ వివరించారు.వేసవిలో ఎలాంటి రక్షణ పొందాలి?డీఎంహెచ్‌వో: ఎండ ఎక్కువగా ఉండే 11 నుంచి 3 గంటల మధ్య సమయంలో బయటికి వెళ్లకుండా ఉండడం మంచింది. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే తలకు టోపీ లేదా రుమాలు పెట్టుకుని, తెల్లని దుస్తులు ధరించాలి. రేకులషెడ్లలో నివాసముండే వారు కూడా వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. రేకులపై గడ్డి, గోనె సంచులను వేసుకొని నీళ్లు చల్లాలి.రోజూ ఎన్ని నీళ్లు తాగాలి? డీఎంహెచ్‌వో: ఎండాకాలంలో నీటిశాతం లోపంవల్ల శరీరం డీహైడ్రేషన్ అవుతుంది. శరీరంలో శక్తి తగ్గి అలసట కలుగుతుంది. ప్రతీ రోజు 8నుంచి 10గ్లాసుల నీరు తాగాలి. ముఖ్యంగా ప్రయాణం లేదా బయట పనులున్నప్పుడు నీరు తాగడం మరిచిపోవద్దు. అది కూడా సురక్షితమైన నీటిని తీసుకోవాలి.ఆహారం విషయంలో జాగ్రత్తలు?డీఎంహెచ్‌వో: ఎండాకాలంలో మిగిలిన ఆహార పదార్థాలు త్వరగా పాడవుతాయి. ప్రతీరోజూ తాజా ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఆయిల్ ఫుడ్స్, బిర్యానీలు, మసాలాలతో తయారు చేసే ఆహారాన్ని పూర్తిగా తగ్గించాలి. మజ్జిగ, ఓఆర్ఎస్, కొబ్బరి నీరు ఎక్కువగా తీసుకోవాలి.శరీరంలో టెంపరేచర్ పెరిగినప్పుడు ఏం చేయాలి? డీఎంహెచ్‌వో: శరీరంలో టెంపరేచర్ పెరిగినప్పుడు, బట్టలు తీసేసి చల్లటి నీటితో ముఖం, చేతులు, కాళ్లు తుడవాలి. గాలి ఆడే స్థలంలో విశ్రాంతి తీసుకోవాలి. అప్రమత్తంగా ఉండకపోతే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది.ఆస్పత్రుల్లో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? డీఎంహెచ్‌వో: జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, మందులు ఎల్లవేళలా అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాం. డీహైడ్రేషన్ జరగకుండా ఉండేందుకు 2 లక్షల ఓఆర్ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచాం. అంగన్వాడీ కేంద్రాల్లో, ఉపాధిహామీ కూలీలకు పనిస్థలాల్లోనూ అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎవరైనా వాడుకోవచ్చు.గతేడాది వడదెబ్బ మరణాలు సంభవించాయా? డీఎంహెచ్‌వో: గతేడాది జిల్లాలో ఇద్దరు వడదెబ్బ కారణంగా మరణించారు. వడదెబ్బతో మరణించినట్లు నిర్ధారించేందుకు త్రీమెన్ కమిటీని ఏర్పాటు చేశాం. ఇందులో మెడికల్ ఆఫీసర్, తహసీల్దార్, పోలీస్ సబ్ఇన్స్పెక్టర్ సభ్యులుగా ఉంటారు. వీరి ద్వారా వడదెబ్బతో మృతి చెందినట్లు నిర్ధారణ జరిగితే ప్రభుత్వం నుంచి కలెక్టర్ ద్వారా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది.గర్భిణులు, పిల్లలు, వృద్ధులు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? డీఎంహెచ్‌వో: గర్భిణులు, పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలికవ్యాధులతో బాధపడే వారు హైరిస్క్ గ్రూపులో ఉంటారు. వీరు ఎండలో ఎక్కువ సమయం ఉండొద్దు. ముఖ్యంగా గర్భిణులు డెలివరీకి ముందే ప్లాన్ చేసుకొని ఆసుపత్రికి చేరుకోవాలి. పిల్లలు, వృద్ధులు, బీపీ, షుగర్, కేన్సర్ తదితర వ్యాధులతో బాధపడేవారు ఎండలో తిరిగే సాహసం చేయవద్దు.డీహైడ్రేషన్ అయితే ఏం చేయాలి?డీఎంహెచ్‌వో: డీహైడ్రేషన్ అయితే రీహైడ్రేషన్‌తో చెక్ పెట్టాలి. ఎవరైనా డీహైడ్రేషన్‌కు గురైన వెంటనే ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మజ్జిగ, కొబ్బరినీళ్లు, ఉప్పునిమ్మకాయ కలిపిన నీరు తాగించాలి. ప్రమాదం జరగకముందే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. (చదవండి: ఆ చెఫ్ చేతులు అద్భుతం చేశాయి..! వావ్ బంగాళదుంపతో ఇలా కూడా..) -
బీట్రూట్ని మజ్జిగతో కలిపి తీసుకోవచ్చా..?
మాములుగా బీట్రూట్తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయన్న సంగతి తెలిసిందే. దీన్ని జ్యూస్ రూపంలో లేదా కూర రూపంలో తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే కొన్నింటిని కొన్ని రకాల ఆహారాలతో జత చేసి తీసుకుంటే మరిన్ని ప్రయోజనాలు పొందొచ్చు. అదెలాగో చూద్దామా..!.బీట్రూట్ ఐరన్, యాంటీ ఆక్సిడెంట్ల మూలం. దీన్ని మజ్జిగతో జత చేసి తీసుకుంటే శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ శోషణ పెరుగుతుందని చెబుతున్నారు న్యూట్రిషన్లు. ఇలా తీసుకుంటే ఐరన్ శోషణ తోపాటు, గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందట. చలవ చేయడమే గాక మొత్తం ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారు. బీట్రూట్లో ఉండే కొన్ని రకాల ఐరన్లను మన శరీరం గ్రహించలేదు. అదే దాన్ని మజ్జిగతో కలిపి తీసుకున్నట్లయితే.. అందులో ఉండే లాక్టిక్ ఆమ్లం మంచి ప్రోబయోటిక్‌లను అందిస్తుంది. మంచి గట్ ఆరోగ్యాన్ని అందిస్తుంది. అంతేగాదు ఇందులోని ఆమ్లత్వం పేగులోని ఐరన్ శోషణను మరింత పెంచుతుంది. ఎర్రరక్తకణాలు ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. అలాగే రక్తహీనతను కూడా నివారిస్తుంది. దీనిలో నైట్రిక్ ఆక్సైడ్లుగా మార్చే నైట్రేట్లు ఉంటాయి. రక్తనాళాల్లో బ్లాక్‌లు ఉండవని చెబుతున్నారు నిపుణులు. ఇది హృదయనాళ పనితీరుకి మద్దతిచ్చే బయోయాక్టివ్ పెప్టైడ్లను అందిస్తుంది. వీటన్నింటి తోపాటు కాలేయ పనితీరుకి కూడా సహాయపడుతుంది. శరీరంలోని టాక్సిన్లను తొలగిస్తుంది. ఇలా బీట్రూట్ బట్టర్‌మిల్క్ మిక్సింగ్ అనేది శక్తిమంతమైన రిఫ్రెష్ టానిక్‌లా పనిచేస్తుంది. (చదవండి: 'ఎగ్ ఫ్రీజింగ్' అంటే..? ఉపాసన, నటి మెహ్రీన్ , తానీషా ముఖర్జీ అంతా..!) -
'ఎగ్ ఫ్రీజింగ్' అంటే..? ఉపాసన, నటి మెహ్రీన్ , తానీషా ముఖర్జీ అంతా..!
మాతృత్వం మధురిమ మాటలకందనిది. అందుకోసం ప్రతి అమ్మాయి తపిస్తుంటుంది. ప్రస్తుత జీవనవిధానం ,పర్యావరణ కాలుష్యం కారణంగా "అమ్మ" అనే పిలుపు దూరమవుతున్నారు. ఆ పరిస్థితిని అధిగమించడానికి కొందరూ 'ఎగ్ ఫ్రీజింగ్' బాటపడుతున్నారు. ముఖ్యంగా ఈ మార్గాన్నే టాలీవుడ్ హీరో రామ్‌చరణ్ భార్య ఉపాసన, నటి మెహ్రీన్, మ్యూచువల్ ఫండ్ సీఈవో రాధికా గుప్తా వంటి ప్రముఖులు ఎంచుకున్నారు. తాజాగా వారి సరసన చేరింది బాలీవుడ్ నటి తనీషా ముఖర్జీ. అసలు ఇంతకీ ఏంటి ఎగ్ ప్రీజింగ్..? ఈ వైద్య విధానం మంచిదేనా?.. అంటే..ప్రస్తుతం యువత కెరీర్‌కి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ క్రమంలో వయసు పెరిగిపోతుంది. ఆ తర్వాత పిల్లలు పుట్టక చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నారు. దీన్ని అధిగమించేందుకు నవతరం ఈ ఎగ్ ఫ్రీజింగ్ బాట పడుతోంది. చెప్పాలంటే ఇది జెన్ జెడ్ ట్రెండ్‌గా మారింది. అసలు ప్రముఖులే కాగా సామాన్యులు సైతం ఈ పద్ధతికే మొగ్గుచూపిస్తాన్నారు. మరీ అసలు ఈ విధానం ఎలా ఉంటుందనే దాని గురించి బాలీవుడ్ నటి తనీషా మాటల్లో చూద్దాం. ఎగ్ ఫ్రీజింగ్ అంటే..ఎగ్ ఫ్రీజింగ్ విధానాన్ని ఎంచుకున్నామంటే అంతా తప్పుగా చూస్తారు. పైగా ఇది చాలా పెయిన్‌తో కూడిన విధానమని భయబ్రాంతులు గురిచేశారని చెప్పుకొచ్చింది 46 ఏళ్ల తనీషా. అయితే తానువైద్యుల సాయంతో దాని గురించి వివరంగా తెలుసుకున్నాకే ధైర్యంగా ముందడుగు వేశానని చెప్పింది. వైద్య పర్యవేక్షణలో అండాలు భద్రపరుచుకునే విధానాన్ని ఎగ్ ఫ్రీజింగ్ అంటారు. ఈ పక్రియలో కడుపు ప్రాంతంలో ప్రొజెస్టెరాన్‌ని ఇంజెక్ట్ చేస్తారు. మొదట్లో తిమ్మిరితో కూడిన బాధ ఉంటుంది. ఆ తర్వాత ఐదు నుంచి ఆరో రోజులు అందుకు బాడీ ఆటోమేటిగ్గా సిద్ధమైపోతుంది. ఇదంతా అరగంట ప్రక్రియ. అయితే వాళ్లు అండాలను సేకరించిన విధానం మనకు తెలియకుండానే జరిగిపోతుందంటూ..ఆ వైద్య విధానం గురించి వివరించింది సోషల్‌మీడియా వేదికగా వెల్లడించింది. అయితే ఈ హర్మోన్లు ఇంజెక్ట్ చేసే ప్రక్రియలో బరువు పెరగడం జరుగుతుంది. అయితే ఇంజెక్ట్ చేసిన హార్మోన్లను తొలగించడానికి కూడా ఓ విధానం ఉంటుందని చెప్పుకొచ్చారు తనీషా. వైద్యులు ఏమంటున్నారంటే..నిజానికి ఈ ఎగ్ ప్రీజింగ్ ప్రక్రియలో సాధారణంగా హార్మోన్ల ఇంజెక్షన్ల సాయంతో అండాలను సేకరించడం జరుగుతుంది. అయితే అందుకు పేషెంట్ శారీరకంగా మాససికంగా సంసిద్ధంగా ఉండటం అనేది అత్యంత కీలకం. అయితే ఈ హార్మోన్ల ఇంజెక్షన్లలో ప్రొజెస్టెరాన్ ఉండదని ప్రసూతి వైద్యులు చెబుతున్నారు. అండాశయాలను ఉత్తేజపరిచేందుకే ఈ హార్మోన్ ఇంజెక్షన్లు ఉంటాయని అన్నారు. అయితే వీటి కారణంగా బరువు పెరగడం అనేది జరగదని చెప్పారు. అయితే ఆ తర్వాత సంభవించే ఆకలి మార్పులే లేదా శరీరంలో ద్రవాల నిలుపదల వంటి మార్పులను ఎదుర్కొంటారు. ఆ సమస్యలు ఒకటి లేదా రెండు రోజుల్లో తగ్గుముఖం పడతాయట. ఇక్కడ తగినంత నీరు తాగినట్లయితే అదనపు హార్మోన్లు బయటకు వచ్చేస్తాయని చెబుతున్నారు వైద్యులు. దీంతో ఈ హార్మోన్లు శరీరం నుంచి బయటకు వెళ్లేలా తాజాపండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, కాయధాన్యాలు తదితర పోషకాహారం తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. ఆ సమయంలో వాకింగ్, యోగా వంటి తేలికపాటి వ్యాయామాలు రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచి, బరువు పెరగకుండా రక్షిస్తాయని అన్నారు. వాటన్నింటి తోపాటు ఎనిమిది గంటల నిద్ర, యోగా, ధ్యానం వంటి వాటితో ఈ అదనపు హార్మోన్లను సమతుల్యం చేయొచ్చని చెప్పారు. జస్ట్ రెండు రుతక్రమ సైకిల్స్ కల్లా సాధారణ స్థితికి మహిళలు తిరిగి వస్తారని వెల్లడించారు వైద్యులు..ఈ విధానాన్ని ఎంచుకోవడానికి రీజన్..కెరీర్లో ముందుండాలనే క్రమంలో వయసు దాటిపోతుంది. ఆ తర్వాత పిల్లలను కనేందుకు ప్లాన్ చేసుకున్న చాలామంది జంటలు ఎంతలా అనారోగ్య సమస్యలు ఫేస్ చేస్తున్నారనేది తెలిసిందే. పోనీ ఏదోలా పిల్లలను కన్నా..వాళ్లు ఆరోగ్యంగా ఉండక ఆస్పత్రులు చుట్టూ తిరుగుతూ నానాపాట్లు పడుతున్నవాళ్లున్నారు. ఆ నేపథ్యంలోనే యువత ఇలా అండాలను భద్రపరుచకునే ఎగ్ ప్రీజింగ్ లేదా క్రయో ఫ్రిజర్వేషన్ పద్ధతిని ఆశ్రయిస్తున్నారు. ఇక ఆ జంటలు లేదా యువత కెరీర్లో నిలదొక్కుకున్నాక హాయిగా పిల్లల్ని కనడం గురించి ప్లాన్ చేస్తున్నారు. (చదవండి: జ్ఞాపకంగా మిగిలిన ఆ కుక్క కోసం .. ఏకంగా రూ. 19 లక్షలా..!) -
నాలుగు పదుల వయసులోనూ అంతే అందంగా శ్రియ.. ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
టాలీవుడ్ హీరోయిన్ శ్రియ శరణ్ (Shriya Saran) ఇప్పటికీ అంతే అందంతో అభిమానులను కట్టిపడేస్తుంది. ఆమె తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల సినిమాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది. శ్రియ ఇష్టం సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో బ్లాక్బాస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. అంతేగాదు ఇప్పటికీ అంతే ఆకర్షణీయమైన లుక్‌తో కుర్ర హీరోయిన్లకు మించిన సౌందర్యం ఆమెది. శ్రియ సినీ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడూ ఎలా ఉందో.. అలానే గ్లామర్‌గా ఉంది. ఆమె అందం రోజురోజుకి పెరుగుతుందే కానీ తగ్గదు అనేలా మాయ చేస్తుంటుంది. అంతే ఫిట్‌గా స్లిమ్‌గా ఉంటుంది. నాలుగు పదుల వయసులోనూ ఇంతలా బాడీ ఎలా మెయింటైన్ చేస్తుందా అని ఆశ్యర్యం కలగకమానదు. మరీ ఆమె హెల్త్, బ్యూటీ సీక్రెట్లేంటో చూద్దామా.. నటి శ్రియ శరణ్ ఒక ఇంటర్వ్యూలో తన ఫిట్నెస్ రహస్యాన్ని షేర్ చేసుకుంది. అదే తన తన బ్యూటీ సీక్రెట అని నవ్వుతూ చెబుతోంది. ఆరోగ్యంగా ఉంటే అందంగా ఉన్నట్లేనని అంటోంది శ్రియ. మన ఆరోగ్యంతో మన సౌందర్యం ముడిపడి ఉంటుందంట. అందుకే తినే భోజనం విషయంలో చాలా కేర్‌ఫుల్‌గా ఉంటానంటోంది. వర్కౌట్ల కంటే కూడా తీసుకునే భోజనం పోషకవంతమైనదైతే ఆటోమేటిగ్గా స్లిమ్‌గా, అందంగా ఉంటామని నమ్మకంగా చెబుతోంది శ్రియ. ఇదేంటి ఆమె చాలా వెరైటీగా మాట్లాడుతుందనుకుంటే.. పొరబడ్డట్టే. ఎందుకంటే చాలామంది నిపుణులు కూడా చాలాసార్లు ఈ విషయాన్నే బలంగా నొక్కి చెప్పారు. డైట్ ఎలా ఉండాలంటే..సమతుల్యతకు ప్రాధాన్యత ఇచ్చే మంచి పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటుందట. నిర్ణిత సమయానికే బోజనం తీసుకునేలా చూసుకుంటుందట. కడుపు నిండిన అనుభూతి కలిగించే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటానని తెలిపింది. తన రోజుని నిమ్మకాయ తేనెలతో కూడిన వాటర్ తీసుకుంటుందట. ఇది జీర్ణక్రియను మెరుగ్గా ఉంచి,బాడీలో ఉండే టాక్సిన్లను బయటకు పంపేస్తుందట. హైడ్రేషన్ తప్పనిసరిగా ప్రాధాన్యత ఇస్తానంటోంది. బ్రేక్‌ఫాస్ట్ కోసం బాదంగింజలు, ఓట్మీల్, గుడ్లులో తెల్లసొనతే వేసిన ఆమ్లేట్ లేదా బెర్రీలు, అరటి పండ్లు తింటుందట. పొద్దపొద్దునే డీప్ ఫైడ్ పదార్థాల జోలికిపోదట. ఇవి జీర్ణక్రియను నెమ్మదించి చురుకుదనం లేకుండా చేస్తాయట. ఇక భోజనంలో పప్పు, రోటీ , సబజీ, కవినోవా, ఉడికించిన కూరగాయలు, కాల్చిన చేప లేదా చికెన్ ఉంటాయట. ఇంట్లో తయారు చేసిన పెరుగుని తీసుకుంటుందట. పెరుగు ప్రేగుల ఆరోగ్యాన్ని కాపాడటమే గాక జీర్ణక్రియ సమస్యలను అదుపులో ఉంచుతుందట. ఇక స్నాక్స్‌గా బిస్కెట్లు లేదా చిప్స్ వంటి జోలికి అస్సలు పోనంటోంది. అందుకోసం దోసకాయ, క్యారెట్ వంటివి ఆస్వాదిస్తా, ఒకవేళ కుదరకపోతే కొంచెం డార్క్ చాక్లెట్ ముక్కతో గ్రీన్ టీ తీసుకుంటానంటోంది. జీవక్రియను చురుగ్గా ఉంచే స్నాకస్ తీసుకుంటే అతిగా తినాలనే కోరిక అదుపులో ఉంటుందటోంది శ్రియ. రాత్రి భోజనం తేలికగా జీర్ణంమయ్యే వాటిని ఎంచుకుంటానంటోంది. కూరగాయలతో తయారు చేసిన సూప్, కిచ్డీ లేదా సలాడ్ తీసుకుంటానంటోంది. అయితే రాత్రి భోజనం సాధ్యమైనంతవరకు సాయంత్రం ఏడున్నరలోపే ఫినిష్ చేస్తుందట. అంతేగాదు రాత్రి సమయాల్లో ఎక్కువ ఆయిల్‌తో కూడిన ఆహారాలను తీసుకోకపోవడమే మేలంటోంది. ఎందుకంటే ఇది జీరణక్రియను మందగింపచేసి, మరసటి రోజు బాడీలోని శక్తిస్థాయిలను ప్రభావితం చేస్తుందట. ఎలాంటి వర్కౌట్లంటే.. చర్మం ఆరోగ్యం, బరువు నిర్వహణకు ఉపకరించేలా నీళ్లను ఎక్కువగా తీసుకుంటుందట. అలాగే యోగా, పైలేట్స్, డ్యాన్స్ వంటివి తన దినచర్యలో భాగమని అంటోంది. హెల్తీగా ఉండటం అంటే..ఫిట్‌గా ఉండటం అంటే ఆహారాలను దూరం చేసుకోవడం అని కాదు. ఆరోగ్యకరమైన వాటిని చేర్చుకోవడం అని భావిస్తే..బరువు నిర్వహించడం తేలిక అవుతుంది. అలాగే కడుపు నిండిన అనుభూతినిచ్చేలా ఆరోగ్యకరమైన ఫుడ్స్ తీసుకుంటే నోరు కట్టేసుకున్నామనే ఫీల్ కలగదు. పైగా శరీరానికి కావాల్సిన విటమిన్లు, ఖనిజాలు అందుతాయి. శ్రమ లేకుండానే మంచి పోషకాహారాలతో హెల్తీగా, నాజుగ్గా ఉండొచ్చని చెబుతోంది అందాల శ్రియ. (చదవండి: మానసిక ఒత్తిడి..శారీరక సమస్యలు..!) -
మానసిక ఒత్తిడి..శారీరక సమస్యలు..!
ఒత్తిడి ఉంటేనే కొన్ని పనులు పూర్తవుతాయని కొందరి అభిప్రాయం. కానీ అది మితిమీరితే వచ్చే దుష్పరిణామాలు అన్నీ ఇన్నీ కావు. ఆ కాసేపు ఒత్తిడిని భరిస్తే సరిపోతుంది కదా అని సరిపెట్టుకోవాలనుకునేవారు మరికొందరు. కానీ అప్పటి ఒత్తిడి... ఆ అనంతరం కాలంలోనూ తన దుష్ప్రభావాలను చూపుతుంది. అంతేకాదు... మానసిక ఒత్తిడి అన్నది అలా చాలాకాలం పాటు అలా కొనసాగుతుంటే అది శారీరకంగా కూడా అనేక సమస్యలను... ముఖ్యంగా అనేక ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. మానసిక ఒత్తిడి తెచ్చిపెట్టే అనేక శారీరక సమస్యలూ, వ్యాధుల గురించి తెలుసుకుందాం. ఒత్తిడి ఎప్పుడూ తాత్కాలికం కాదు. దాని వల్ల శరీరంలో అనేక ప్రతికూలమైన మార్పులు వస్తాయి. అన్నిటికంటే ముందు ప్రభావితమయ్యేది మన వ్యాధి నిరోధక వ్యవస్థ. దాంతో అది అనేక జబ్బులకూ, శారీరక సమస్యలకు తావిస్తుంది. ఫలితంగా ఎన్నిరకాల వ్యాధులు వస్తాయో చూద్దాం. ప్రధాన ప్రభావం...వ్యాధి నిరోధక వ్యవస్థపైనే! మామూలుగా ఎవరికైనా ఎక్కడైనా గాయమైనప్పుడు అక్కడ ఇన్ఫ్లమేషన్ రావడం (వాపు వచ్చి ఎర్రబారి మంటగా అనిపించడం) మామూలే. సాధారణంగా దేహంలో ఎక్కడ గాయమైనప్పటికీ ఇలా జరుగుతుంది. గాయాన్ని మానేలా చేయడమనే ప్రక్రియలో వ్యాధి నిరోధక వ్యవస్థ ద్వారా కార్యకలాపాలు వల్ల ఇలా వాపు, మంట రావడమనేవి సహజంగా జరుగుతాయి. ఆ తర్వాత అవి మెల్లగా తగ్గిపోతాయి. అయితే ఎవరిలోనైనా అపరిమితమైన ఒత్తిడి ఉన్నప్పుడు ఇన్ఫ్లమేషన్ మానడం అనేది బాగా ఆలస్యమవుతుంది. ఈ విషయం కార్నెగీ మెలాన్ యూనివర్సిటీకి చెందిన షెల్డన్ కోహెన్ అనే అధ్యయనవేత్త ఆధ్వర్యంలో జరిగిన అధ్యయన ఫలితాల ద్వారా స్పష్టంగా వెల్లడయ్యింది. ఈ అధ్యయన ఫలితాలు నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ తాలూకు మార్గదర్శకాల్లో చోటుచేసుకున్నాయి కూడా. ఒత్తిడి అన్నది శరీరంపై ఎలా దుష్ప్రభావం చూపుతుందన్న విషయం మొదటిసారిగా స్పష్టమైన తార్కాణాలతో వెలుగుచూసింది. నిజానికి ఎవరిలోనైనా ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు కార్టిజోల్ అనే హార్మోన్ విడుదలై, అది వ్యాధి నిరోధక అంశాలను ప్రేరేపిస్తుంది. దాంతో ఆ నిరోధక అంశాలు మెల్లగా ఇన్ఫ్లమేషన్ను నియంత్రిస్తాయి. దాంతో ఇన్ఫ్లమేషన్ త్వరగా తగ్గిపోవాలి. కానీ అదేపనిగా చాలాకాలం పాటు ఒత్తిడి కొనసాగుతూపోతూ ఉంటే ఆ కారణంగా వ్యాధి నిరోధక అంశాలు కార్టిజోల్ వల్ల సరిగా ప్రేరణ చెందవు. ఫలితంగా ఇన్ఫ్లమేషన్ తగ్గదు. ఇది మాత్రమే కాకుండా... ఇంకొన్ని ఉదాహరణల ద్వారా కూడా ఈ థియరీ వాస్తవమని తేలింది. సాధారణంగా ఎవరికైనా జలుబు వస్తే, ఒకటి రెండు రోజుల్లో అది దానంతట అదే తగ్గుతుంది. కానీ దీర్ఘకాలం ΄ాటు ఒత్తిడికి గురయ్యే వారిలో జలుబు తగ్గడానికి చాలాకాలం పడుతుంది. ఒత్తిడి ప్రభావం కారణంగా వ్యాధినిరోధక అంశాలపై ప్రతికూల ప్రభావాలు పడటమే ఇందుకు కారణం. ఇలా చూసినప్పుడు మానసికమైన ఒత్తిడి కేవలం మానసికంగానే కాకుండా అది శారీరక సమస్యలైన స్థూలకాయం వంటి వాటిని తెచ్చిపెడుతుంది. ఇలా ఒక్క బరువు పెరగడమనే కారణమే కీళ్లనొప్పులూ వంటి ఇంకా ఎన్నో సమస్యలకు దారితీస్తుందన్న విషయం తెలిసిందే. అంతేకాదు... గుండెజబ్బులు, డయాబెటిస్, జీర్ణకోశ సమస్యలు, డిప్రెషన్, ఆస్తమా, అలై్జమర్స్ వంటి వ్యాధులకు దారితీస్తుందని పరిశోధకులు స్పష్టంగా తెలుసుకున్నారు.ఒత్తిడి ఉన్నట్లు గుర్తించడమిలా...కొందరు వ్యక్తులు నిత్యం ఒత్తిడికి గురవుతున్నప్పుడు వాళ్లలో తీవ్రమైన ఒత్తిడి ఉన్న విషయమే వారికి తెలియక΄ోవచ్చు. కానీ కొన్ని శారీరక లక్షణాలతో వారు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్న విషయం తెలుస్తుంది. ఆ లక్షణాలివి.. ఆకలి లేకపోవడం బాగా ఆలస్యంగా నిద్రపట్టడం లేదా అస్సలు నిద్రపట్టకపోవడం (నిద్రలేమి) మాటిమాటికీ తలనొప్పి వస్తుండటం తరచూ కండరాలు పట్టేస్తుండటం (మజిల్ క్రాంప్స్) తరచూ గ్యాస్, కడుపులో మంట వంటి జీర్ణకోశ సమస్యలు ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఇవి చాలా సాధారణంగా కనిపించేవే కదా అని నిర్లక్ష్యం చేయకూడదు.ఆస్తమా : తీవ్రమైన ఒత్తిడి ఊపిరి అందకుండా చేసే ఆస్తమాను ప్రేరేపిస్తుందని వైద్య పరిశోధనల్లో అనేక సార్లు వెల్లడైంది. ఇలా జరగడాన్ని సైకలాజికల్ ఇండ్యూస్డ్ ఆస్తమా అంటారు. నిజానికి పెద్దల్లో ఒత్తిడి కలగడం వల్ల అది వాళ్లకు మాత్రమే పరిమితం కాదు... తల్లిదండ్రుల ఒత్తిడి చూసి, పిల్లలూ తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు. దాంతో అది వారి చిన్నపిల్లల్లోనూ ప్రతికూల ప్రభావం చూపి, ఆ చిన్నారుల్లోనూ ఆస్తమా రూపంలో వ్యక్తమయ్యే అవకాశమున్నట్లు అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. తీవ్రమైన ఒత్తిడి అనుభవిస్తున్న గర్భవతులనూ, అలాగే తీవ్రమైన కాలుష్యం నెలకొని ఉన్న పరిసరాల్లో నివసిస్తున్న ఇంకొందరిని ఒక అధ్యయనం కోసం ఎంపిక చేశారు. ఈ అధ్యయన ఫలితాలు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేలా ఉన్నాయి. నిజానికి కాలుష్యపు పొగకు గురైన గర్భిణులకు పుట్టిన సంతానం కంటే... తీవ్రమైన ఒత్తిడికి లోనైన గర్భవతులకు పుట్టిన పిల్లల్లో చాలా మందికి ఆ తర్వాతికాలంలో ఆస్తమా వస్తుండటం పరిశోధకలను అబ్బుర పరిచింది. అంటే కాలుష్య ప్రభావం కంటే తీవ్రమైన ఒత్తిడి తాలూకు ప్రతికూల ప్రభావాలే ఎక్కువనేది గత కొంతకాలం కిందట తెలిసి వచ్చిన వాస్తవం.గుండెజబ్బులు : తీవ్రమైన ఆవేశానికి లోనైనవాళ్లు గుండెపట్టుకుని కుప్పకూలిపోతుండటం సినిమాల్లో చాలా తరచుగా చూసే దృశ్యం. అయితే అది పూర్తిగా సత్యదూరం కాదంటున్నారు పరిశోధకులు. ఏవైనా సమస్యల ఒత్తిడి కారణంగా గట్టిగా అరుస్తుండేవాళ్లు, త్వరగా వాదనల్లోకి దిగేవాళ్లు, త్వరగా కోపగించుకునేవాళ్లలో అనేక మంది ఆ ఒత్తిడి తాలుకు దుష్ప్రభావానికి లోనై గుండె జబ్బులు తెచ్చుకుంటారనేది నిపుణుల మాట. ఒత్తిడి తాలూకు ప్రతికూల ఫలితాలు గుండెజబ్బుల రూపంలో వ్యక్తమవుతుంటాయంటున్నారు కొందరు పరిశోధకులు. గుండెజబ్బులు ఉన్నవారిలో చాలామందిని పరిశీలించి, వారిపై అధ్యయనాలు నిర్వహించినప్పుడు వాళ్లలో నిత్యం భావోద్వేగాలకు లోనయ్యేవాళ్లూ, త్వరగా కోపం వచ్చేవారే ఎక్కువగా ఉంటారని ఆ అధ్యయన ఫలితాల్లో తేలింది. అలా ఒత్తిడికి గురయ్యేవారిలో దీర్ఘకాలిక గుండెజబ్బులు వస్తుండటంతోపాటు అవే ఒక్కోసారి గుండెపోటుకు దారితీస్తాయంటున్నారు అధ్యయనవేత్తలు, గుండెజబ్బుల నిపుణులు. స్థూలకాయం: శరీరంలోని మిగతా భాగాలతో పోలిస్తే... సాధారణంగా పోట్ట, తొడలు, పృష్టభాగం(హిప్స్) వంటి భాగాల్లోనే కొవ్వు ఎక్కువగా పేరుకుంటుంది. వీటన్నింటిలో తొడలు, పృష్టభాగంలో పేరుకునే కొవ్వు కంటే... పోట్టలో పేరుకునే కొవ్వు వల్ల తీవ్రమైన హాని కలుగుతుందంటున్నారు నిపుణులు. అయితే ఇలా పొట్టభాగంలో కొవ్వు పేరుకోవడమన్నది... ఒత్తిడి అనుభవించే వారిలోనే ఎక్కువగా జరుగుతుందని స్పష్టమైందని అధ్యయనవేత్తలు వెల్లడిస్తున్నారు. మామూలుగా ఇతర చోట్లలో కొవ్వు పేరుకునేవారికంటే పొట్టలో కొవ్వు పేరుకోవడం వల్ల (ఆబ్డామినల్ ఒబేసిటీ) వల్ల ఎక్కువగా హాని జరుగుతుందని తేలడం వల్ల... ఒత్తిడి అనేది మొదట పోట్టభాగంలో కొవ్వు ఎక్కువగా పేరుకునేందుకు దారితీయడంతోపాటు ఆ తర్వాత అది గుండెజబ్బుల వంటి వాటి ద్వారా తీవ్రమైన హానిచేస్తుందని అనేక పరిశోధనల్లో తేలింది. అధిగమించడం మేలు...అది చేయాల్సిందిలా...మానసిక ఒత్తిడి వల్ల కలిగే శారీరకంగానూ సమస్యలు ఎదురవుతాయని గుర్తించినప్పుడు చేయాల్సిందల్లా ఆ సమస్యను అధిగమించడానికీ లేదా నియంత్రించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. దీనివల్ల చాలా ప్రయోజనాలే ఉంటాయని తేలింది.ఉదాహరణకు మొదటిసారి గుండెపోటుకు గురైనవారు, ఒత్తిడిని బాగా నియంత్రించుకోగలిగితే 74 శాతం మందిలో రెండో స్ట్రోక్ రాకుండా నివారించుకోగలగడం సాధ్యమేనని కొన్ని అధ్యయనాల్లో తేలింది. పైగా ఇలా ఒత్తిడి నియంత్రణ కారణంగా వ్యాధి నిరోధకశక్తి కూడా పెరిగి అది కూడా జబ్బులను దూరం చేస్తుందని నిరూపితమైంది. ఒత్తిడిని అధిగమించడానికి అనుసరించాల్సిన మార్గాలివి... ఏ కారణంగా ఒత్తిడి కలుగుతుందో గుర్తించి, దాని నుంచి దూరంగా ఉండటం. ఉదాహరణకు ఒక వృత్తి వల్ల ఒత్తిడి పెరుగుతుందని గుర్తిస్తే, ఒకవేళ ప్రొఫెషన్‌ను పూర్తిగా మార్చుకునే అవకాశం ఉంటే దాన్ని మార్చుకోవడమే మేలు. అలా మార్చుకునే అవకాశం లేక΄ోతే ఒత్తిడిని అధిగమించడానికి కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించడం అవసరం. అవి... బ్రీతింగ్ వ్యాయామాలు చేయాలి. దాంతోపాటు యోగా వంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ అవలంబించాలి ∙ఏదైనా అంశం తీవ్రంగా బాధపెడుతుండటం లేదా పదే పదే గుర్తుకొస్తూ పశ్చాత్తాపానికి గురిచేస్తుంటే మరో వ్యాపకంలో పడిపోయి దాన్ని మరచిపోయి, ఒత్తిడి నుంచి విముక్తం కావడానికి ప్రయత్నించడం పరిస్థితులను సానుకూల దృక్పథంతో చూడాలి. సమస్యలను అధిగమించాల్సిన పరిస్థితుల్లో ఏ మార్గం ద్వారా వాటిని పరిష్కరించుకోవచ్చో తెలుసుకోవాలి. లేదంటే ఆ పరిస్థితిని అధిగమించడానికి తోడ్పడే నిపుణులను సంప్రదించాలి దేహానికి అవసరమైన వ్యాయామాలు చేయాలి. దీని వల్ల మెదడులో దేహాన్ని రిలాక్స్ చేసే, ఆహ్లాదంగా ఉంచే రసాయనాలు విడుదలవుతాయి. ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇవేవీ పనిచేయనప్పుడు అవసరమైతే వృత్తినిపుణులైన సైకాలజిస్టులు, కౌన్సెలర్స్‌ను సంప్రదించాలి.డయాబెటిస్ : తీవ్రమైన మానసిక ఒత్తిడి డయాబెటిస్‌కు దారితీయవచ్చన్న విషయం అందరికీ తెలిసిందే. మళ్లీ ఇది రెండు రకాలుగా బాధిస్తుంది. డయాబెటిస్ కారణంగా పెరిగే ఆకలి వల్ల అప్పటికప్పుడు దొరికే... తినడానికి ఆరోగ్యకరం కాని ఆహార పదార్థాలైన వేపుళ్లు, నిల్వ పదార్థాలూ, బేకరీ ఐటమ్స్ తినేలా చేస్తుంది. ఇవి తిన్న తర్వాత మళ్లీ రక్తంలో గ్లూకోజ్ మోతాదులు పెరగడంతో బాధితులు అనారోగ్యానికి గురవుతారు. డయాబెటిస్ కారణంగా ఇదొక సైకిల్లా సాగుతూ అనారోగ్యానికీ, చక్కెర పెరుగుదలకూ దారితీస్తుంది.వయసు త్వరగా పైబడటం : ఒత్తిడి వల్ల వయసు పైడాల్సిన సమయం కంటే ముందే వృద్ధులై΄ోయే మరో దుష్పరిణామానికి అవకాశముంది. తల్లుల, పిల్లల డీఎన్ఏలను పరిశీలిస్తూ జరిగిన ఒక అధ్యయనంలో ఈ ఫలితాలు స్పష్టమయ్యాయి. ఒత్తిడికి గురైన వారు, వారి తల్లిదండ్రులతో పోలిస్తే మీరే త్వరగా వృద్ధాప్య దశకు చేరుకున్నట్లు ఆ అధ్యయన ఫలితాలు పేర్కొంటున్నాయి. నిర్దిష్టంగా చె΄్పాలంటే తీవ్రమైన ఒత్తిడితో బాధపడుతున్న కొందరు ఆ వయసుకు కనపడాల్సిన లక్షణాలను చాలా త్వరగా అంటే... 9 నుంచి 17 ఏళ్ల ముందుగానే కనబరుస్తున్నట్లు ఆ అధ్యయన ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.అల్జిమర్స్ డిసీజ్ : ఒత్తిడి వల్ల మెదడులో కలిగే గాయాలు తీవ్రమై అలై్జమర్స్ డిసీజ్‌కు దారితీస్తుందని కొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఒత్తిడి వల్ల అలై్జమర్స్ డిసీజ్ తీవ్రం కావడంతో ΄ాటు దానివల్ల వచ్చే మరుపు మరింత వేగవంతం కావడం చాలా త్వరత్వరగా జరుగుతుంది. అంటే ఒత్తిడి లేనివారిలో అలై్జమర్స్ డిసీజ్ కాస్త ఆలస్యమైతే... ఒత్తిడి వల్ల అది రావాల్సిన సమయం కంటే ముందుగా వచ్చే అవకాశాలూ ఉన్నాయని స్పష్టమవుతోంది.చాలా ముందుగా మరణించడం (ప్రీ–మెచ్యుర్ డెత్) : ఒకరి ఆరోగ్య పరిస్థితిని బట్టి వారిలో మరణం ఎప్పుడు సంభవించవచ్చో కొంతమేరకు అంచనా వేయడం చాలా సాధారణ ప్రజలు కూడా చేస్తుంటారు. ఉదాహరణకు ‘ఆయన ఇప్పుడే చనిపోవాల్సిన వ్యక్తి కాదు. ఇంకా చిన్నవయసు’ లాంటి వ్యాఖ్యానాలు చేస్తుండటం కొందరి విషయంలో వింటుండటం పరిపాటే. తీవ్రమైన దీర్ఘకాలిక ఒత్తిడికి లోనయ్యేవారిలో మరణం చాలా ముందుగానే వస్తుందని అధ్యయనవేత్తలు హెచ్చరిస్తున్నారు. (చదవండి: ప్రధాని మోదీ స్ఫూర్తితో ‘భారత్ డిష్'..! ఎలాంటి వంటకాలు ఉంటాయంటే..) -
జర పైలం మరి.. నగరంలో మొదలైన వేసవి హడావుడి
చూస్తుండగానే వేసవికాలం వచ్చేసింది.. ఓ వైపు అప్పుడే మండుతున్న ఎండలు, మరో వైపు పరిశ్రమలు, వాహనాలు, ఏసీల నుంచి వెలువడే కాలుష్యం. వెరసి హైదరాబాద్ నగరంలో ఎప్పటిలానే సమ్మర్ ఎఫెక్ట్ కొనసాగనుంది. గతేడాది ఇదే మార్చ్ నెల్లో అత్యధికంగా 47.2 డీగ్రీ సెంటీగ్రేడ్ల ఎండలతో ఇబ్బందులకు గురిచేసింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా మండే ఎండల నుంచి రక్షణకు ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు పర్యావరణ, ఆరోగ్య నిపుణులు. వేసవిలో ముఖ్యంగా ముసలివారు, చిన్నారులు అధిక సంఖ్యలో మృత్యువాత పడుతుండటం, ఎలాంటి వేసవి సంరక్షణా తీసుకోకుండా వివిధ కారణాలతో బయటకు వెళ్లే వారు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఈ సందర్భంగా వేసవి నుంచి సంరక్షణను అందించే ప్రాథమిక పద్ధతులు, విధానాల గురించి పలు జాగ్రత్తలు.. వేసవిలో ప్రతి ఒక్కరికీ ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ నియమం నీరు. ఎట్టి పరిస్థితుల్లోనూ డీహైడ్రేషన్‌కు గురికాకుండా హైడ్రేట్ అవ్వాలని ఆరోగ్య నిపుణులు, ఫిట్నెస్ ఫ్రీక్స్ సూచిస్తున్నారు. శరీరంలో తగినంత నీటి శాతం ఉన్నంత వరకూ వేసవిలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవచ్చు. లేని పక్షంలో ఆరోగ్య సమస్యలు తప్పవని వైద్యులు చెబుతున్నారు. నగర జీవితంలో తప్పని సరిగా మూడు, మూగున్నర లీటర్ల నీటిని, ఇతర పానియాలను తీసుకోవాల్సిన అవసరముంది. బయటికెళుతున్న సమయంలో వాటర్‌బాటిల్ మర్చిపోవద్దు. వడదెబ్బకు దూరంగా.. వేసవిలో ప్రధాన సమస్య వడదెబ్బ. ప్రతి ఏడాదీ వడదెబ్బతో ప్రాణాలు కోల్పోతున్న వారు కోకొల్లలు. వీలైనంత వరకూ ఎండలకు దూరంగా ఉండటం, ముఖ్యమైన పనులను ఉదయం, సాయంత్రాల్లో చేసుకోవడం ఉత్తమం. తరచూ ఎండలో ఉండేవారు తగినంత విశ్రాంతి, ఫ్యాన్ లేదా ఏసీలో ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ దూరం వాహనాలపై ప్రయాణాలు చేసేవారు కళ్లద్దాలు, హెల్మెట్, టోపీలు తప్పనిసరిగా వినియోగించాలి. చిన్నారులైతే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. సైక్లింగ్.. జర భద్రం.. ఈ మధ్య కాలంలో ఈజీ మొబిలిటీలో భాగంగా నగరంలో సైక్లిస్టుల సంఖ్య భారీగా పెరిగింది. అంతేకాకుండా స్కూల్స్, గ్రౌండ్స్‌కు వెళ్లే వారు సైతం సైక్లిల్ వినియోగిస్తున్నారు. సమ్మర్లో సైక్లిస్టులు జాగ్రత్తగా ఉండాలి. మధ్య మధ్యలో విశ్రాంతి, పానియాలు తీసుకోవడం శ్రేయస్కరం. మధ్యాహ్న సమయాల్లో సైక్లింగ్ అంత మంచిది కాదని నగరానికి చెందిన సైక్లింగ్ రైడర్ రవి తెలిపారు. సన్ర్స్కీన్తో మేలు.. మండే ఎండలకు కళ్లద్దాలు, తలకు టోపీ, హ్యండ్‌బ్యాగ్‌లో కర్చీప్ లేదా న్యాప్కిన్స్ తప్పనిసరి. ఎండవేడి నుంచి చర్మ సంరక్షణకు సన్‌స్క్రీన్ లోషన్స్, కూలింగ్ లోషన్స్ వాడటం కాస్త ఉపశమనాన్ని అందిస్తుంది. ఈ సమ్మర్ ముగిసేంత వరకూ ఫ్యాషన్ వేర్లో ప్రత్యేక శైలిని ఎంపిక చేసుకోవాలి. సమ్మర్ కేర్ కోసం మార్కెట్లో అందుబాటులోకి వచి్చన గార్మెట్స్ ఎంచుకోవాలి. చెమటను గ్రహించే దుస్తులు ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి. వేడికి దూరంగా ఈవీ.. ఈ మధ్య కాలంలో నగరంలో ఎలక్ట్రిక్ వాహనల సంఖ్య భారీగా పెరిగింది. ఈ వాహనదారులు చాలా జాగ్రత్తగా ఉండలాని నిపుణులు చెబుతున్నారు. ఈవీ వాహనాలను ఎండలో పార్క్ చేయకుండా నీడలో ఉంచాలి. ఎక్కువ దూరం ప్రయాణించినప్పుడు బ్యాటరీ, ఇంజిన్ వేడి కాకుండా మధ్యలో విరామం ఇవ్వాలి. లేదంటే అధిక వేడికి బ్యాటరీలు పేలిపోయే ప్రమాదముంది. టైర్లు అరిగిపోయిన వాహనాలు మరింత జాగ్రత్తగా నడపాలి. టైర్లు వ్యాకోచించడం, రోడ్డు పై డాంబర్ కరగడం వంటి కారణాలతో వాహనాలు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంది. నో బ్లాక్..ఫ్యాషన్ పేరుతో ఎండాకాలంలో నల్లటి దుస్తులు ధరించడానికి స్వస్తి చెప్పాలి. నల్లటి దుస్తులు, వస్తువులు, వాహనాలు అధిక వేడిని గ్రహించి ఆరోగ్యానికి హాని చేస్తాయి. దీనికి పరిష్కారంగా తెల్లటి దుస్తులు లేదా లైట్ కలర్స్ వేసుకుంటే మేలు. ముఖ్యంగా కాటన్ దుస్తులు, మెత్తని స్వభావం కలవి ఉత్తమ ఎంపిక.కాసింత స్మార్ట్‌గా.. నగర జీవనంలో గ్యాడ్జెట్లు సర్వసాధారణం. ఈ నేపథ్యంలో వాతావరణ ఉష్ణోగ్రతలను ఎప్పటికప్పుడు తెలియజేసే స్మార్ట్ వాచ్‌లు, ఇతర గ్యాడ్జెట్లు వాడటం మంచిది. శరీర ఉష్ణోగ్రత, గుండెపనితీరు, బ్లడ్ ప్రెజర్, న్యూట్రిషన్ తదితర అంశాలను తెలియజేసే గ్యాడ్జెట్లు, యాప్‌లు వినియోగించడం మేలని ఈ తరం మెడికల్ నిపుణులు సూచిస్తున్నారు.ఇంటి భోజనమే మేలు.. వేసవిలో కాసింతైనా ఆహార నియమాలను పాటించాలి. జంక్‌ఫుడ్, డీప్ ఫ్రైడ్ ఫుడ్, అధిక మసాలాలతో తయారు చేసిన ఆహారాన్ని తగ్గించాలి. తగినంత నీటిని తాగడంతో పాటు వాటర్మెలన్, షర్బత్ విభిన్న రకాల పండ్ల రసాలను తీసుకోవడం వల్ల శరీరం చల్లబడుతుంది. దీంతో పాటు అవసరమైన ప్రోటీన్లను, మినరల్స్‌ను అందిస్తాయి. సాధ్యమైనంత వరకూ ఇంటి భోజనానికే ప్రాధాన్యమివ్వాలని ప్రముఖ న్యూట్రిషనిస్ట్ హజర్ తెలిపారు. ఉక్కపోత, వేడి ఎక్కువగా ఉంటే కూలర్లు, ఏసీలను ఉపయోగించాలి. ఇంటీరియర్ ప్లాంట్స్ పెంచుకోవడం వల్ల వాతావరణం చల్లగా ఉంటుంది. -
ఫ్లోరిడాలో అత్యున్నత స్థాయి ‘హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2025’
అమెరికాలోని ఫ్లోరిడాలోని ఓర్లాండో నగరంలో మెడికల్ కాన్ఫరెన్స్ ఘనంగా జరిగింది. 70-80 మంది ఆంకాలజిస్టులు, ప్రైమరి కేర్ డాక్టర్లు హాజరైన ఈ కార్యక్రమం, ఇన్నోవేటివ్ ఎడ్యుకేషన్‌కి ఒక వేదికగా పనిచేసిందని నిర్వాహకులు తెలిపారు. ఈ సదస్సు ప్రముఖ కీనోట్ వక్త, డాక్టర్ బార్బరా మెకనీ, మాజీ AMA ఉపాధ్యక్షురాలు ఆంకాలజి పరిశోధన, పక్షవాతం, పేషంట్ కేర్ మొదలైన అంశాల ప్రాముఖ్యాన్ని వివరించారు.‘హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2025 తన విజన్‌ను నిజం చేసింది. మహిళల కోసం క్యాన్సర్ సంరక్షణను ముందుకు తీసుకెళ్లడంలో వైద్య సమాజాన్ని శక్తివంతం చేయడానికి, అవగాహన నిమిత్తందీన్ని రూపొదిచామనీ, ఈమెడ్ ఈవెంట్స్, ఈమెడ్ ఎడ్ సీఈఓగా, శంకర నేత్రాలయ, యూఎస్ఏ సీఎమ్ఈ చైర్‌పర్సన్‌గా(USA CME) ఒక మహిళగా, మహిళా ఆరోగ్య సంరక్షణలో మార్పు తీసుకురావడానికి ఇదొక సదవకాశమని’ డాక్టర్ ప్రియా కొర్రపాటి సంతోషం వ్యక్తం చేశారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!చైర్పర్సన్ డాక్టర్ సతీష్ కత్తుల, ఆంకాలజిస్ట్, హెమటాలజిస్ట్, AAPI అధ్యక్షుడు, మహిళలలో సాధారణ క్యాన్సర్లను పరిష్కరించడం, నిరంతర అవగాహన ప్రాముఖ్యతను హైలైట్ చేశారు. కాంగ్రెస్‌లో 10 మంది అత్యున్నత నైపుణ్యం కలిగిన వక్తలు ఉన్నారని, ప్రతి ఒక్కరూ ఆంకాలజీలో పురోగతి, సమగ్ర రోగి సంరక్షణపై దృష్టిపెడుతున్నారని డా. ప్రియా అన్నారు. ఈ కాంగ్రెస్‌ను కేవలం ఒక కార్యక్రమం కాకుండా, కంటిన్యూస్ లర్నింగ్ చేయాలనే తమ లక్ష్యాన్ని బలోపేతం చేశారన్నారు. AAPI, CAPI (టంపా నుండి స్థానిక అధ్యాయం) eMed Ed తో కలిసి చేస్తున్న సహకార ప్రయత్నాలను డా. సతీష్ అభినందించారు. ప్రత్యేక ఆకర్షణలుNFL ఆటగాడు షెప్పర్డ్ స్టెర్లింగ్ ఈ సదస్సు హాజరు కావడం విశేషం. ఆంకాలజీ వంటి క్రిటికల్ కేర్ వైద్యులలో చాలా ఉద్యోగపరైమన ఒత్తిడి అధికంగా ఉంటుంది దాని కోసం ప్రత్యేకంగా ఆంకాలజీ బర్నవుట్ సెషన్ నిర్వహించటం మరో విశేషం. డాక్టర్ వర్షా రాథోడ్, ఇంటిగ్రేటివ్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఓర్లాండో, ఫ్లోరిడా ఈ సెషన్ నిర్వహించారు. డాక్టర్ శైలజ ముసునూరి, ఇంటిగ్రేటెడ్ మెడిసిన్, చీఫ్ ఆఫ్ సైకియాట్రి, వుడ్ సర్వీసెస్, పెన్సిల్వేనియా వారు నిర్వహించిన సైకాలజికల్ ఆంకాలజీ సెషన్ ఆకట్టుకుంది. క్యాన్సర్ కేర్ లో మెడికల్ ట్రీట్మెంట్ మాత్రమే కాకుండా, రోగుల మానసిక, భావోద్వేగ స్థితిని కూడా సమర్థంగా నిర్వహించాలని పేర్కొన్నారు.వాలంటీర్ల దృక్పదంస్పీకర్లకి మించి, ఈ కాంగ్రెస్ స్వచ్ఛంద సేవకులకు కూడా గొప్ప అనుభవాన్ని ఇచ్చిందనీ, సెషన్లు, ఆసక్తిక్రమైన చర్చలు జరిగాయి. డాక్టర్లు అనేక ప్రశ్నలను చాలా లోతైన వివరణ, పరిస్కారాలు ఇచ్చారని, క్వెషన్ అండ్ ఆన్సర్ సెషన్ చాలా ఆసక్తిగా, ఉపయోగంగా ఉందని ఆమె తెలిపారు.ఆడియన్స్ అభిప్రాయాలుమహిళల క్యాన్సర్లపై దృష్టి సారించే ఆంకాలజీ సమ్మేళనాలు అరుదుగా ఉన్నాయని, ఈ కార్యక్రమం ఆంకాలజిస్ట్‌లు, ప్రమరి కేర్ డక్టర్లు ఇద్దరికీ ఒక అమూల్యమైన అవకాశం అని అన్నారు. రోగులను ఎప్పుడు రిఫర్ చేయాలి, కొత్త చికిత్సా విధానాల ఏమున్నాయి వంటి అవసరమైన అంశాలను ఎలా నిర్వహించాలనేది తమ అభిప్రాయాల ద్వారా వెల్లడించారు.హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ భవిష్యత్తు హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2026 కాంగ్రెస్ ఓహియోలో జరుగుతుందని ప్రకటించారు. ఈ కార్యక్రం విజయానికి సహకరించిన అందరికీ ప్రియా కొర్రపాటి ధన్యవాదాలు తెలిపారు. అలాగే మహిళల కోసం ఆంకాలజీ సంరక్షణను ముందుకు తీసుకెళ్లే మిషన్‌లో ముందుకు సాగడానికి ఇది స్ఫూర్తినిస్తుందని ఇప్పుడున్నఆంకాలజీని ముందుకు ముందుకు తీసుకెళ్ళటానికి కలిసి పనిచేద్దామనిఆమె పిలుపునిచ్చారు. -
పిల్లలుంటే బ్రెయిన్ ఆరోగ్యంగా ఉంటుందా..?
వయసు పెరిగే కొద్దీ బ్రెయిన్ సామర్థ్యం కూడా తగ్గుతుంటుంది. అది సర్వసాధారణం. అయితే అలా కాకుండా బాడీపై వచ్చే వృద్ధాప్య లక్షణాలకు ఎలా అడ్డుకట్టవేస్తామో అలాగే బ్రెయిన్ సామర్థ్యం వృద్ధాప్యం బారిన పడకుండా ఎలా సంరక్షించుకోవాలనే దిశగా శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. తాజా అధ్యయనంలో చాలా అవాక్కయ్యేలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. గంపెడుమంది పిల్లలు ఉంటే బాధ్యతలు ఎక్కువై మతిమరుపు, త్వరితగతి వృద్ధాప్యం బారినపడటం జరుగుతుదనేవారు. కానీ అది అవాస్తమట. పరిశోధన ఏం చెబుతుందో తెలిస్తే.. అసలు ఇదెలా అని విస్తుపోవడం ఖాయం. మరీ పరిశోధనలో వెలుగు చూసిన ఆ షాకింగ్ విషయాలేంటో చూద్దామా..!.ఈ సరికొత్త పరిశోధన ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (PNAS)లో ప్రచురితమైంది. ఈ అధ్యయనం పిల్లలను కలిగి ఉన్నవాళ్లకు మెదడు ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంటుందని తేల్చింది. అందుకోసం శాస్త్రవేత్తలు దాదాపు మూడు వేల మందికిపైగా తల్లిదండ్రుల మెదడు పనితీరుపై పరిశోధనలు చేయగా ఈ విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అలసట, ఒత్తిడి అనేవి తల్లిదండ్రులైన వాళ్లలో కంటే పిల్లలు లేని తల్లిదండ్రులలోనే ఎక్కువగా కనిపించాయట. పిల్లలు ఉండటం అనేది వ్యక్తిగత జీవితాన్ని సుసంపన్నం చేసి అహ్లదభరితంగా చేస్తుందట. సాధారణంగా పేరెంట్స్ శారీరక శ్రమని పరస్పర సహకారంతో సునాయసంగా అధిగమించగలుగుతారని పరిశోధన నొక్కి చెబుతోంది. ఎక్కువ మంది పిల్లలున్న తల్లిదండ్రుల మెదడు మంచి క్రియెటివిటి కనెక్టివిటీని కలిగి ఉంటుందని కూడా పేర్కొంది అధ్యయనం. ఈ పరిశోధనలలో తల్లిదండ్రుల్లో తండ్రిని మినహాయించాయి. ఎందుకంటే వారు శారీరకంగా గర్భం ధరించరు, ప్రసివించరు, తల్లిపాలు ఇవ్వరు కాబట్టి తల్లులకే ప్రాధాన్యత ఇచ్చినట్లు పేర్కోన్నారు పరిశోధకులు. అయితే ఈ అధ్యయనంలో దాదాపు 17 వేలకు పైగా పురుషులు కూడా పాల్గొన్నారని అన్నారు.అయితే ఈ పరిశోధన పిల్లల పుట్టుక, వారి పెంపకం, పెరిగిన అదనపు బాధ్యతలు మెదడు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని చెబుతున్నాయి. అయితే లేటు వయసులో తల్లిదండ్రులైన వారిలో తక్కువ మెరుగైన ఫలితాలే కనిపించాయన్నారు. తల్లిదండ్రులుగా వారి పిల్లల బాధ్యతే వారి మెదడుని వృద్ధాప్యం బారిన పడకుండా శ్రీరామరక్షలా కాపాడతుందని అధ్యయనం చెబుతోంది. అంతేగాదు ఈ పరిశోధనకు కీలకమైన శాస్త్రవేత్త అవ్రామ్ హోమ్స్ ఎంత ఎక్కువ మంది పిల్లలు ఉంటే అంతలా వారి మెదుడు సురక్షితంగా ఉంటుందని చెప్పడం విశేషం. ఇది వరకు పిల్లల బాధ్యతల కారణంగా జుట్టు ఊడిపోవడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటివి జరుగతాయని ప్రగాడంగా భావించేవారు అంతా. అయితే అదంతా అవాస్తమని కొట్టిపారేసింది తాజా అధ్యయనం. కానీ ఈ అధ్యయనంలో పాల్గొన్నవారంతా యూకేకి చెందిన వాళ్లే కావడంతో మరిన్ని కచ్చితమైన ఫలితాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేరెంట్స్‌పై పరిశోధన చేయాల్సి ఉందని అన్నారు శాస్త్రవేత్తలు. దీంతోపాటు పిల్లల పెంపకం అనేది బ్రెయిన్ వృధ్యాప్యాన్ని ఎలా నివారిస్తుందో తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉందని నొక్కి చెప్పారు. ఈ పరిశోధన గనుక నిజమైతై ఒటరితనం, చిత్తవైకల్యం వంటి సమస్యలను ఎలా అధిగమించాలనేందుకు కచ్చితమైన పరిష్కారం కనుగొనేందుకు మార్గం సుగమం అవుతుందని చెబుతున్నారు పరిశోధకులు. (చదవండి: పదకొండేళ్లకే బీఎస్సీ, 21 ఏళ్లకే పీహెచ్డీ..! మాజీ సీఎం లాలు యాదవ్, ప్రదాని మోదీ..) -
Breast Abscess బాధాకరమైన రొమ్ము గడ్డలకు కారణాలు, చికిత్స
రొమ్ము ఇన్ఫెక్షన్ అనేది స్త్రీ స్తనములలో చీముతో కూడిన బాధాకరమైన నొప్పిని రొమ్ము అబ్సెస్(Breast Abscesses) అంటారు. రొమ్ము గడ్డలు మాస్టిటిస్ యొక్క సాధారణ పరిణామం. మాస్టిటిస్ అనేది రొమ్ములలో వాపు మరియు నొప్పిని కలిగించే ఇన్ఫెక్షన్. పాలిచ్చే తల్లులు ఎక్కువగా ఈ పరిస్థితికి గురౌతారు.రొమ్ము గడ్డలకు కారణంరొమ్ము గడ్డలు ఈ క్రింది కారణాల వల్ల సంభవిస్తాయి:మాస్టిటిస్ అని పిలువబడే రొమ్ము ఇన్ఫెక్షన్లు రొమ్ము చీముకు అత్యంత సాధారణ కారణం. మాస్టిటిస్ అనేది రొమ్ము కణజాలాన్ని, ముఖ్యంగా పాల నాళాలు మరియు గ్రంథులను ప్రభావితం చేసే ఒక తాపజనక పరిస్థితి. ఈ పరిస్థితి సాధారణంగా తల్లిపాలు ఇచ్చే స్త్రీలలో సంభవిస్తుంది.చనుమొన నొప్పి లేదా పగిలిన చనుమొన ద్వారా బ్యాక్టీరియా ప్రవేశించడం వల్ల ఎక్కువగా తల్లిపాలు ఇవ్వని మహిళల్లో రొమ్ము గడ్డలుఏర్పడతాయి. ఏదైనా మచ్చల కారణంగా కూడా చనుమొన నాళాలు మూసుకుపోయినప్పుడు రొమ్ము గడ్డలు ఏర్పడవచ్చు.రొమ్ము అబ్సెసెస్ లక్షణాలుస్తనముల వాపు, బాధాకరమైన నొప్పి,వేడిగా ఉన్న రొమ్ము, చనుమొన నుండి చీము లేదా స్రావం కారడం,తలక్రిందులుగా ఉన్న చనుమొనలు, చలి,వికారం మరియు వాంతులు,అధిక శరీర ఉష్ణోగ్రత లేదా జ్వరం మొదలగునవి వుంటాయి.రొమ్ము అబ్సెసెస్ నిర్ధారణరోగి చరిత్రవైద్యులను సందర్శించి నపుడు సాధారణంగా లక్షణాలను రొమ్ము నొప్పి, వేడి, ఎరిథెమా (చర్మం ఎర్రగా మారడం) మరియు రొమ్ములలో వాపును కూడా డాక్టరుకు తెలియచేయాలి తల్లిపాలు ఇచ్చే సమాచారాన్ని తెలియచేయాలి.వైద్యుడు గతంలో ఏవైనా రొమ్ము ఇన్ఫెక్షన్లు మరియు వాటి చికిత్స గురించి కూడా విచారిస్తారు.మధుమేహం వంటి వైద్య చరిత్రను వైద్యుడికి తెలియజేయాలి.క్లినికల్ పరీక్షవైద్యుడు రోగ నిర్ధారణ చేయడానికి శారీరక పరీక్షను చేస్తారు. వైద్యుడు రొమ్ములో చీము ఉందని అనుమానించినట్లయితే, రోగ నిర్ధారణను నిర్ధారించడానికి గడ్డ యొక్క ఆస్పిరేషన్ నిర్వహించబడుతుంది. అటువంటి సందర్భంలో, రొమ్ము గడ్డలు చీముతో నిండి ఉందో లేదో చూడటానికి వాపు ఉన్న ప్రదేశంలోకి ఒక సూదిని చొప్పించబడుతుంది.అసౌకర్యం మరియు వాపు చీము వల్ల సంభవిస్తాయో లేదో నిర్ధారించడానికి వైద్యుడు రొమ్ము అల్ట్రాసౌండ్ స్కాన్‌ను కూడా సిఫారసు చేయవచ్చు.రొమ్ము అబ్సెసెస్ చికిత్సఇంటి నివారణలు: ఇన్ఫెక్షన్ సోకిన రొమ్ము కణజాలానికి వెచ్చని మరియు తేమతో కూడిన కంప్రెస్లను ఇవ్వవచ్చు.ఇన్ఫెక్షన్ సోకిన రొమ్ము నుండి చీము కారుతున్నట్లయితే, స్త్రీలు బ్రాను ధరించే ముందు చనుమొనను సున్నితంగా కడిగి, గాలికి ఆరనివ్వాలివాపు మరియు నొప్పి నుండి ఉపశమనం పొందడానికి, రొమ్ములపై 10-15 నిమిషాలు ఐస్ లేదా కోల్డ్ ప్యాక్‌ను ఉంచవచ్చు. తల్లి పాలిస్తున్నటువంటి స్త్రీలైతే పాలు ఇచ్చే సమయం లో మధ్య విరామాలలో ఇలా చేయండి : పాలు తాగేటప్పుడు బయటి అంచు నుండి చనుమొన వరకు రొమ్మును మసాజ్ చేయండి, ఇది పాల ప్రవాహాన్ని ప్రోత్సహించడానికి మరియు అడ్డుపడే పాల నాళాలను తొలగించడానికి సహాయపడుతుంది.మందులుపారాసెటమాల్ లేదా ఇబుప్రోఫెన్ వంటి నొప్పి నివారణ మందులతో నొప్పి మరియు జ్వరాన్ని తగ్గించవచ్చు. ఈ మందులు పాలిచ్చే తల్లులు తీసుకోవడం సురక్షితమని భావిస్తారు. రొమ్ము గడ్డలు నివారించడానికి ముందు లేదా తర్వాత ఇన్ఫెక్షన్ తగ్గించడానికి యాంటీబయాటిక్స్ వాడవచ్చు.చికిత్సరొమ్ము చీముకు ప్రాథమిక చికిత్స ఏమిటంటే, రొమ్మును నుండి చీమును తొలగించడం.వైద్యుడు చీమును తొలగించడానికి ఈ క్రింది పద్ధతులను ఉపయోగించవచ్చు:సూది ద్వారా చిమును బయటకు తీయడం. ఈ పద్ధతిలో, లక్ష్య ప్రాంతంలోకి ఒక సూదిని చొప్పించి, చీమును బయటకు పీలుస్తారు.కోత ద్వారా చీమును బయటకు పంపడం: ఇందులో ద్రవంతో నిండిన గడ్డపై చిన్న కోత చేసి దానిని పూర్తిగా బయటకు వచ్చేలా చేయడం జరుగుతుంది.- L. ఉమాపతి MA PGDHE(Dr. MGR MU) Chennaiవిశ్రాంత డెమో వైద్య ఆరోగ్య శాఖ అనంతపురం జిల్లా -
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
దివంగత టాలీవుడ్ నటి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ అచ్చం తల్లిలానే తన అందం అభినయంతో వేలాదిగా అభిమానులను సంపాదించుకుంది. అలనాటి అందాల తార శ్రీదేవిని తలపించేలా ముగ్ధమనోహరంగా ఉంటుంది. దేవర మూవీలో టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ సరసన నటించి నటనలో మంచి మార్కులు కొట్టేసింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ చేసేలా కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రస్తుతం అటు టాలీవుడ్, ఇటు బాలీవుడ్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఈ రోజు ఆమె పుట్టినరోజు. ఈ ఏడాది మార్చి 06తో 28 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఆమె గ్లామర్ పరంగా తన తల్లికి ఏమాత్రం తీసిపోని విధంగా ఫిట్‌గా స్లిమ్‌గా ఉంటుంది. మరో అతిలోక సందరిలా కళ్లు తిప్పుకోనివ్వని అందం ఆమె సొంతం. అంతలా ఫిజిక్ మెయింటైన్ చేయడం వెనుకున్న రహస్యం ఏంటో చూద్దామా..!.జాన్వీ తరుచుగా తన ఫిట్నెస్కి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటుంది. ఆమె ఒక ఇంటర్వ్యూలో బ్యూటీ సీక్రెటని బయటపెట్టింది. తన ఆహారపు అలవాట్లు, ఫిటెనెస్ సీక్రెట్ తదితరాల గురించి షేర్ చేసుకుంది. తాను ఎక్కువుగా ఇంట్లో వండిన ఆహారాలనే ఇష్టంగా తింటానని అంటోంది. కఠినమైన డైట్‌ని ఫాలోఅవుతానని అంటోంది. అల్పాహారం అవకాడో, రెండు గుడ్ల మాత్రమేనని, భోజనంలో గ్రిల్డ్ చికెన్, పాలకూర, సూప్ తీసుకుంటానని చెబుతోంది. ఎక్కువగా జపనీస్, ఇటాలియన, ఆంధ్ర, మొఘలాయ్ వంటకాలంటే ఇష్టమని చెప్పుకొచ్చింది. అయితే తాను గ్లూటైన్ రహిత ఫుడ్‌నే తీసుకుంటానంటోంది. ఎందుకంటే గ్లూటైన్ తనకు పడదని, అలెర్జీ వస్తుందని తెలిపింది. తనకు బాగా నచ్చిన ఆరోగ్యకరమైన మంచీలను లేదా పండ్లు ఎక్కువగా ఇష్టంగా తింటానని చెప్పింది. వాటిలో చక్కెర ఎలాగో ఎక్కువ ఉంటుంది కాబట్టి స్వీట్స్ జోలికి వెళ్లనంటోంది. బాగా, పానీపూరీ, ఐస్‌క్రీం, స్ట్రాబెర్రీలు అంటే మహా ఇష్టమని చెబుతోంది. చాలామటుకు అన్ని కూరగాయలు, పళ్లు తింటానని, కాకపోతే బరువు పెరగకుండా చూసుకునేందుకు ఎక్కువగా వ్యాయామాలు చేస్తానని చెప్పింది. తేలికగా జీర్ణమయ్యే ఆహారానికే ప్రాధాన్యత ఇస్తుందట. అందుకే ఎక్కువగా రెడ్‌రైస్ బిర్యానీనే తింటుదట. తన చివరి భోజనం తొందరగానే పూర్తి చేశానని ఒకవేళ షూటింగ ఉంటే 10 గంటల కల్లా పూర్తి చేస్తానని చెబుతోంది. ఇంతకుమునుపు చిలగడదుంప, పరాఠా వద్దకు వెళ్లేదాన్నికాదని, నో కార్బ్సో డైట్‌ను పాటించేదాన్ని అని తెలిపింది. అయితే ఇప్పుడు కార్బోహైడ్రేట్లు పెంచడం ప్రారంభించినట్లు వెల్లడించింది జాన్వీ కపూర్. గ్లామర్ పీల్డ్‌లో రాణించాలంటే ఆ మాత్రం కేర్ తీసుకోకపోతే కష్టమే కదూ..!.(చదవండి: కోచింగ్ లేకుండానే నీట్లో 720కి 720 మార్కులు..!) -
International women's day 2025: ఈ నెల 9న రన్ ఫర్ హర్
మాదాపూర్: మహిళలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ఈ రన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివైబ్ సీఈవో రఘవీణసజ్జ తెలిపారు. మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో బుధవారం రన్ ఫర్ హర్ పేరిట పరుగు నిర్వహించనున్న కార్యక్రమానికి సంబందించిన వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 9వ తేదీన రన్‌ఫర్ హర్ కార్యక్రమాన్నినిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమాన్ని మంత్రి సీతక్క ప్రారంభిస్తారని తెలిపారు. ఈ రన్‌కు సంబందించిన బ్రోచర్, టీషర్టు, మెడల్స్‌ను ఆవిష్కరించారు. ఇందులో 3కె, 5కె, 10కె విభాగంలో ఈ పరుగును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాయదుర్గంలోని నాలెడ్జీ సిటీ పార్కు వద్ద పరుగును ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. 200 మందికి పైగా వైద్యులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు, మహిళలు, పురుషులు, చిన్నారులు పాల్గొననున్నట్టు తెలిపారు.డబుల్స్ డైవ్ చాలెంజ్‌కు పదేళ్లు సాక్షి, సిటీబ్యూరో: సింక్రోనీ ఆధ్వర్యంలో నిర్వహించే ‘డబుల్స్ డైవ్ చాలెంజ్’ పది సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా సింక్రోనీ బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక వేడుక నిర్వహించారు. నగరంలోని నోవోటెల్ హెచ్ఐసీసీ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో సింక్రోనీ సంస్థకు చెందిన దాదాపు 500 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. తమ ‘డబుల్స్ డైవ్ ఛాలెంజ్’లో భాగంగా.. ఉద్యోగులు పేద విద్యార్థుల విద్యకు అవసరమైన వనరులను రూపొందించడంతో పాటు వారి సృజనాత్మకతకు సహకారం అందిస్తారని సింక్రోనీలో ఇ–చాట్ వైస్ ప్రెసిడెంట్, సెంట్రల్ రీజినల్ ఎంగేజ్మెంట్ హబ్ లీడర్ రాజ్ కోలా తెలిపారు. యూ అండ్ ఐ ట్రస్ట్ ప్రయత్నంలో భాగంగా హ్యాండ్‌మేడ్ బుక్మార్క్లు, ఆకర్షణీయమైన పద శోధన మెటీరియల్స్‌తో పాటు విజ్ఞాన అంశాలను పెంపొందించే చాట్బోర్డులు, పుస్తకాలను అందిస్తామన్నారు. నిర్మాణ్ సంస్థ సహకారంతో ప్రాణాలను రక్షించే నైపుణ్యాలపై అవగాహన కల్పిస్తామని, ఇందులో సీపీఆర్, ప్రథమ చికిత్స శిక్షణ తదితర అంశాలున్నాయని పేర్కొన్నారు. ఈ విధంగా ఒక జట్టుగా పదేళ్ల పాటు కృషి చేయడం అభినందనీయమని వివరించారు. మహిళామణుల ఆరోగ్యం కోసం..సాక్షి, సిటీబ్యూరో: అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో ఖైరతాబాద్‌లోని జలమండలి కార్యాలయంలో మహిళా ఉద్యోగుల కోసం బుధవారం ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రి, జలమండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరాన్ని వాటర్‌బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి ప్రారంభించారు. వంద మందికిపైగా మహిళా ఉద్యోగులు పాల్గొని పరీక్షలు చేయించుకున్నారు. వైద్యులు వీరికి బీపీ, షుగర్, ఈసీజీ, కంటి చూపు, దంత పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో కిమ్స్ ఆసుపత్రి వైద్యురాలు డా.ఎం.మాధవి, ఫైనాన్స్ సీజీఎం కేదారేశ్వరి, జలమండలి ఉమెన్స్ మినిస్టీరియల్ స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు శైలజ, జనరల్ సెక్రటరీ బిల్కిస్ భాను తదితరులు పాల్గొన్నారు. ఆర్ట్ ఫర్ హోప్ సామాజిక మార్పు కోసం కళను సాధనంగా మార్చాలనే సందేశంతో హ్యుందాయ్ మోటర్ ఇండియా ఫౌండేషన్ ‘ఆర్ట్ ఫర్ హోప్’ పేరిట ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ విషయాన్ని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. దీని ద్వారా 50 మంది ప్రతిభావంతులైన కళాకారులను ఎంపిక చేస్తున్నామని, వీరికి రూ.60 లక్షల మొత్తం గ్రాంట్‌గా అందిస్తున్నామన్నారు. ఎంపికైన చిత్రకారుల కోసం దేశ రాజధానిలో భారీ ప్రదర్శన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. -
టైప్ 2 డయాబెటిస్‌కి మొక్కల ఆధారిత ఔషధం..!
దేశంలో ఎక్కువ మంది టైప్2డయాబెటిస్(Type2Diabetes)తోనే బాధపడుతున్నారు. గణాంకాలు సైతం ఆ వ్యాధి బాధితులు ఏటా వేలల్లో ఉంటున్నట్లు చెబుతున్నాయి. ఇప్పటి వరకు వాడుతున్న మందులన్నీ ఈ వ్యాధిని అదుపులో ఉంచుతాయే తప్ప. పూర్తిగా నివారించలేవు. ఆ దిశగా పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు కొంత పురోగతిని సాధించారు. తాజా అధ్యయనంలో టైప్2 డయాబెటిస్‌కి చెక్‌పెట్టే సరికొత్త ఔషధాన్ని తయారు చేశారు. ఇది రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌లో సత్ఫలితాలనందించి, డయాబెటిస్ రోగుల్లో కొత్త ఆశను రేకెత్తించింది. మరీ ఆ ఔషధం విశేషాలేంటో చూద్దామా..!.బెర్బెరిన్ అనేది వివిధ మొక్కలలో సహజంగా లభించే ఆల్కలాయిడ్. దీన్ని సాంప్రదాయ చైనీస్‌లో జీర్ణ సమస్యలు, వాపు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. వాళ్లు దీన్ని శతాబ్దాలుగా వివిధ రకాల చికిత్సకు ఉపయోగిస్తన్నారు. దాంతోనే టైప్2డయాబెటిస్ ఔషధాన్ని తయారు చేశారు చైనాలోని పెకింగ్ యూనివర్సిటీ పీపుల్స్ హాస్పిటల్ పరిశోధకులు. మొక్కల్లో లభించే బెర్బెరిన్ ఉత్పన్నం అయినబెర్బెరిన్ ఉర్సోడియోక్సికోలేట్ ఔషధాన్ని తయారు చేశారు. ఇక టైప్ 2 డయాబెటిస్ అనేది ఇన్సులిన్ నిరోధకత వల్ల సంభవిస్తుంది, ఇక్కడ శరీరం ప్యాంక్రియాస్ ఉత్పత్తి చేసే ఇన్సులిన్‌కు సరిగా స్పందించదు. కాబట్టి రక్తంలో గ్లూకోజ్ అమాంతం పెరుగుతుంది. అయితే దీనికి కేవలం రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను సాధారణ స్థాయికి తగ్గించే మందులు వాడుతూ..ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంభించడమే మార్గం. నిజానికి ఫ్యాటీ లివర్ వ్యాధికి చికిత్స చేయడానికి బెర్బెరిన్ ఉర్సోడియోక్సికోలేట్, లేదా HTD1801ని కనుగొన్నారు. అయితే ఫేస్ 2 ట్రయల్స్‌లో ఊహించని విధంగా టైప్ 2 డయాబెటిస్‌ని కూడా సమర్థవంతంగా ప్రభావితం చేసి గణనీయంగా తగ్గించింది. అంతేగాదు ఆ అధ్యయనంలో ఇది కాలేయ కొవ్వు శాతంతోపాటు రక్తంలోని గ్లూకోజ్ నియంత్రణను గణనీయంగా మెరుగుపరిచిందని పరిశోధకులు గుర్తించారు. ఇక్కడ గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ లేదా HbA1c అనేది రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను కొలిచే మార్కర్. అయితే ఆ ట్రయల్స్‌లో ఆహారం, వ్యాయామంతో తగినంతగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గని ఈ టైప్2 డయాబెటిస్ రోగుల్లో మాత్రం గణనీయమైన ప్రభావం చూపింది. వారిలో ఈ HTD1801 ఔషధం ప్రభావాన్ని అంచనా వేయగా..కొందరికి దీన్ని 500 మిల్లీ గ్రాములన చొప్పున రోజుకు రెండుసార్లు ఇచ్చారు. అలా తీసుకున్న వాళ్లలో గణనీయమైన మెరుగుదల కనిపించింది. వారందరిలో HbA1c అనేది చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. రోజుకు 500 మిల్లీగ్రాముల చొప్పున తీసుకున్నవాళ్లలో ఈ HbA1c 0.7% తగ్గింపు కనిపించింది. ఇక రోజుకు రెండు సార్లు చొప్పున మొత్తం 1000 మిల్లిగ్రాముల మోతాదులో ఔషధం తీసుకున్నవారిలో HbA1c లో 1.0% తగ్గింపు కనిపించింది. అంటే ఈ ఔషధం మోతాదు ఆధారిత మెరుగుదలను గుర్తించారు పరిశోధకులు. అంతేగాదు ఈ HTD1801 ఔషధం లిపోప్రొటీన్ కొలెస్ట్రాల్ (LDL-C, 'చెడు' రక్తం) స్థాయిలు, వాపు, హృదయనాళ ప్రమాదాలను గణనీయంగా తగ్గించింది. అలాగే ఈ పరిశోధనలో పాల్గొన్న రోగులెవరు బరువు పెరగలేదు కూడా. ఈ ఔషధంతో చికిత్స సురక్షితమైనది రోగులు ఈ మందు ప్రభావాన్ని తట్టుకోగలుగుతున్నారు. పైగా ఇతర ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పడుతున్నట్లు పరిశోధనలో తేలిందన్నారు శాస్త్రవేత్తలు. దీన్ని కేవలం టైప్ 2 డయాబెటిస్‌కి మాత్రమే కాకుండా ఇతర చికిత్సలకు కూడా వినయోగించొచ్చని వెల్లడించారు. ఇక ఈ ట్రయల్స్‌కి ఔషధం HTD1801 తయారీదారులైన షెన్జెన్ హైటైడ్ బయోఫార్మాస్యూటికల్ లిమిటెడ్ నిధులు సమకూర్చింది. ఈపరిశోధన జామా నెట్వర్క్ జర్నల్‌లో ప్రచురితమైంది. (చదవండి: 'మష్రూమ్ చట్నీ పౌడర్': పోషకాలు పుష్కలం ఆరోగ్యం కూడా..!) -
Journalist Bharadwaj: సింగర్ కల్పన అనుభవిస్తున్న బాధలు
-
'మష్రూమ్ చట్నీ పౌడర్': పోషకాలు పుష్కలం ఆరోగ్యం కూడా..!
బెంగళూరులోని భారతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ (ఐఐహెచ్ఆర్) రూపొందించిన ముఖ్యమైన సాంకేతికతల్లో ఒకటి ‘అర్క మష్రూమ్ చట్నీ పౌడర్’ టెక్నాలజీ. పుట్టగొడుగులకు విలువ జోడించటం ద్వారా వాటిలో పోషక విలువలను అనేక విధాలుగా ఉపయోగించుకోవటానికి అవకాశం ఉంటుంది. సంప్రదాయం, పౌష్టికత, రుచిల మేలు కలయికకు మష్రూమ్ చట్నీ పౌడర్ టెక్నాలజీ నిదర్శనంగా నిలుస్తుంది. తాజా పుట్టగొడుగులు ఎన్నో రోజులు నిల్వ ఉండవు, పైగా మార్కెట్ ధర ఎక్కువ. కాబట్టి అందరికీ అందుబాటులో ఉండవు. అందుకని వీటిత పొడులు తయారు చేసే టెక్నాలజీని ఐఐహెచ్ఆర్ రూపొందించింది. ఎండు పుట్టగొడుగులతో రకరకాలుగా చట్నీ పొడులను తయారు చేసుకోవచ్చు. పట్టణ, గ్రామీణ ప్రాంతవాసులు రోజువారీ భోజనంలో సులభంగా వాడుకునే విధంగా పోషకాలు నష్టపోని రీతిలో పొడులు తయారు చేయవచ్చు. సంప్రదాయ రుచులకు తగినట్టుగా 7 రకాల పుట్టగొడుగుల చట్నీ పొడులను రూపొందించారు. బ్రహ్మీ, మునగ ఆకులు, అవిశ గింజలు, నువ్వులు, వేరుశనగలు, కొబ్బరి వంటి వాటితో వీటిని వేర్వేరుగా రూపొందించారు. మన వంటకాల్లో కలిపి ఈ పొడులను వాడుకోవచ్చు. స్కూళ్లలో మధ్యాహ్నభోజనం, సైన్యానికి భోజనాల్లో సైతం వాడుకోదగినవని ఐఐహెచ్ఆర్ పేర్కొంది. నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఈ పొడులను తయారు చేసి ఎయిర్ టైట్ కంటెయినర్లలో/ పౌచ్‌లలో నింపుకొని (26–28 డిగ్రీల సెల్షియస్) సాధారణ ఉష్ణోగ్రత ఉండే చోట నిల్వ చేసుకుంటే 3 నెలల పాటు వాడుకోవచ్చు. ఈ పొడులను తయారు చేసి విక్రయించడం ద్వారా మహిళా స్వయం సహాయక బృందాలు, సైనిక వితంతువులు, వికలాంగులు.. ఉపాధి పొందవచ్చని ఐఐహెచ్ఆర్ చెబుతోంది. ఈ టెక్నాలజీ పూర్తి వివరాలకు.. 080–23086100 – ఎక్స్టెన్షన్ 348, 349 mushroomiihr@gmail.com(చదవండి: -
Singer Kalpana: కూతురి వల్లే ఆత్మహత్య యత్నం.. వెలుగులోకి షాకింగ్ నిజాలు
-
నిలకడగా సింగర్ కల్పన ఆరోగ్యం
-
పప్పుధాన్యాలు తీసుకోకపోతే ఏం జరుగుతుందంటే..!
పప్పుధాన్యాలు పోషకాల గనులు. ఇవి తీసుకోకపోయినా..లేక అవి లేకపోతే పర్యావరణ పరంగానే కాదు మానువుల ఆరోగ్యం కూడా ప్రమాదంలో పడిపోతుంది. అవి తీసుకోకపోతే జీవనమే అస్తవ్యస్తంగా అయిపోతుంది. మొక్కల ఆధారిత ప్రోటీన్, ఫైబర్‌తో కూడిన పోషక కేంద్రాలివి. ఇవి గుండె ఆరోగ్యానికి, జీర్ణక్రియకి మద్దతిస్తాయి. అలాగే స్థిరమైన వ్యవసాయానికి కీలకం ఇవి. పోషకాహారంలో వాటి పాత్ర అపారమైనది. అవి లేకుండా జీవనం అంటే.. ఊహకే అందని విషయం. ఇవి మానవ ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో చూద్దామా..ప్రోటీన్లు కోల్పోతాం.పప్పుధాన్యాలు తీసుకోకపోతే కండరాల నష్టం, బలహీనత వంటి సమస్యలు వస్తాయి. శాకాహారులు మాంసకృత్తుల కోసం ప్రత్యామ్నాయంగా వాడే పప్పుధాన్యాలతో ఎన్నో ప్రయోజనాలు పొందుతారు. ఈ పప్పుధాన్యాలు తీసుకోకపోతే గుండెకు ఆరోగ్యకరమైన ప్రోటీన్లను కోల్పోతాం. హృదయ సంబంధ వ్యాధులు, కేన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. వీటిని పూర్తిగా తీసుకోవడం మానేస్తే ప్రోటీన్ కొరత ఏర్పడి కీళ్ల సమస్యలు అధికమయ్యే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.ఫైబర్లు అందవు: జీర్ణక్రియ, గట్ సమస్యలు మొదలవుతాయి. మలబద్ధకం, పొట్ట ఉబ్బరం, గట్ సంబంధిత సమస్యలు అధికమవ్వుతాయి. కొలొరెక్టల్ కేన్సర్, టైప్ 2 డయాబెటిస్ , హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. నిజానికి పప్పుధాన్యాల్లో ఉండే ఫైబర్లు గట్ ఆరోగ్యానికి, రోగ నిరోధక శక్తికి, జీర్ణక్రియకు మద్దతిస్తాయి. అలాంటిది వాటిని అస్సలు తీసుకోకపోవడమంటే.. ఆరోగ్యాన్ని కోల్పోవడంతో సమానమని హెచ్చరిస్తున్నారు నిపుణులు.ఐరన్ లోపం:పప్పుధాన్యాల్లో ఐరన్, ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం, జింక్ వంటివి ఉంటాయి. ఎప్పుడైతే వీటిని తీసుకోమో అప్పటి నుంచి శరీరంలో రక్తహీనత వంటి సమస్యలు అధికమవుతాయి. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కారణంగా సులభంగా వివిధ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఐరన్, ఫోలేట్లు రక్తహీనతను నివారించగా, మెగ్నీషియం, పొటాషియ గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. జింక్ రోగనిరోధక వ్యవస్థను పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది.పర్యావరణానికి కూడా నష్టమే..ఈ పప్పుధాన్యాలు మానవులకు మాత్రమే కాదు పర్యావరణానికి కూడా మంచివి. వాటి నత్రజని-స్థిరీకరణ సామర్థ్యం నేలను సారవంతంగా ఉంచుతుంది. వ్యవసాయానికి అనుకూలంగా మారుస్తుంది. ఇతర పంటలతో పోలిస్తే ఈ పప్పుధాన్యాల పంటలకు తక్కువ నీరు చాలు. అంతేగాదు రైతులు వనరులు అధికంగా అవసరమయ్యే పంటలు, జంతువుల పెంపకంపై ఆధారపడవలసి వస్తుంది. దీని వల్ల అధిక నీరు వినియోగం కోసం భూమిపై అధిక ఒత్తిడి తెస్తుంది. ఫలితంగా ఆహార ఉత్పత్తి తగ్గుతుంది పర్యావరణ నష్టం మరింత పెరుగుతుంది.చెడు ఆహారపు అవాట్లు ఎక్కువ అవుతాయి..ఎప్పుడైతే పప్పుధాన్యాలు లేవో అప్పుడు ప్రజలు అనారోగ్యకరమైన ఆహారపదార్థాలకు ఎడిక్ట్ అవుతారు. ఇవి రుచికరంగా ఉన్నా..ఆరోగ్యానికి అంతగా మంచివి కావు. ఎప్పుడైతే ప్రాసెస్ చేసిన ఆహారాలు తీసుకోవడం మొదలవుతుందో పోషకాహారం లోపం ఏర్పడి వివిధ వ్యాధుల బారినపడే ప్రమాదం కూడా ఎక్కవ అవుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. రక్తంలో చక్కెర అధికమవుతుంది:డయాబెటిస్ ప్రమాదం పెరిగిపోతుంది. ఎందుకంటే ఈ పప్పుధాన్యాలు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI)ని కలిగి ఉంటాయి. ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలను స్థిరీకరించడానికి కీలకమైన ఆహారంగా మారుతాయి. డయాబెటిస్ రోగులు పప్పుధాన్యాలు తీసుకోకపోవడం వల్ల చక్కెరను అదుపులో ఉంచే మార్గాన్ని కోల్పోవడం జరగుతుంది. జీవక్రియ రుగ్మతలు, బరువు పెరగడం తదితర సమస్యలు ఉత్పన్నమవుతాయి.చూడటానికి చిన్నగా ఉండే ఈ పప్పుధాన్యాలు శక్తిమంతమైనవి. ఇవి దీర్ఘకాలిక వ్యాధులను అదుపులో ఉంచడం లేదా దరిచేరనీయవు. ఇవి మానవ ఆరోగ్యాన్ని కాపాడి, ఆకలిని నియంత్రించే అద్భుతమైన పోషకాలని కలగి ఉంటాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవి లేని ప్రపంచమంటే అనారోగ్యకరమైన జీవనం లేదా ప్రాణాపాయకరమైన జీవనంగా పేర్కొనవచ్చు అని చెబుతున్నారు నిపుణులు.(చదవండి: ఆరోగ్యకరమైన హైడ్రేటెడ్ చర్మ కోసం తప్పక తీసుకోవాల్సిన ఆహారాలివే..! -
'ఇ-నాలుక'..రుచిని కోల్పోయిన వాళ్లకు వరం..!
సాంకేతిక సాయంతో ఎన్నో కొంగొత్త ఆవిష్కరణలతో సవాళ్లకు సమాధానమిస్తుంటారు శాస్త్రవేత్తలు. అలానే తాజాగా పరిశోధకులు సరికొత్త ప్రయోగంతో ఓ గొప్ప ఆవిష్కరణకు నాంది పలికారు. ఇంతవరకు జ్ఞానేంద్రియాలకు సంబంధించి క్లిష్టతరమైన ప్రయోగాల్లో ఎదురవ్వుతున్న సమస్యకు చెక్‌పెట్టేలా ముందడుగు శారు. ఈసారి ఏకంగా రుచిని గుర్తించే ఇ-నాలుక(E-Tongue)ను అభివృద్ధి చేశారు. రుచిని కోల్పోయిన వ్యక్తులకు ఈ ఆవిష్కరణ ఒక వరంగా ఉంటుందని చెబుతున్నారు కూడా. మరీ ఆ ఆవిష్కరణ విశేషాలేంటో చూద్దామా..!.యిజెన్ జియా నేతృత్వంలోని ఒహియో స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు ఇ-టేస్ట్(E-Tongue) అనే నాలుక వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఆహార నమూనాలను విశ్లేషించడం తోపాటు రుచులను పాక్షికంగా గుర్తించలేనివారికి ఇది ఉపయోగాపడేలా రూపొందించారు. ఈ సాంకేతికత ప్రాథమిక అభిరుచికి అనుగుణంగా ఐదు కీలక రుచులను సులభంగా గుర్తిస్తుంది. సోడియం క్లోరైడ్ (ఉప్పు), సిట్రిక్ ఆమ్లం (పుల్లని), గ్లూకోజ్ (తీపి), మెగ్నీషియం క్లోరైడ్ (చేదు), గ్లూటామేట్ (ఉమామి). ఈ ఐదు రుచులు మన రోజువారీ ఆహారంలో తప్పనిసరి ఉండేవే అని పరిశోధకుడు జియా చెబుతున్నారు. ఈ సరికొత్త ఎలక్ట్రానిక్ నాలుక ఇ టంగ్ కేక్, ఫిష్ సూప్ వంటి రుచులను గుర్తించగలదు. అయితే వాసనను ప్రభావితం చేసే రుచిని మాత్రం గుర్తించలేదు. ఇది ఇంకా వాసన ఆధారంగా రుచిని ఐడెంటిఫై చేయలేదని పరిశోధకులు తెలిపారు. ఎలా వర్క్ చేస్తుందంటే..ఆహారంలో రుచి భాగాల సాంద్రత గుర్తించడానికి ఇ-టేస్ట్ సెన్సార్లను ఉపయోగిస్తుంది. డేటాను డిజిటల్ సిగ్నల్లుగా మారుస్తుంది. ఒక పంపు సాయంతో ఒక వ్యక్తి నాలుక కింద ఉన్న గొట్టం ద్వారా ఫ్లేవర్డ్ హైడ్రోజెల్‌లను కచ్చితమైన మొత్తంలో పంపిణీ చేస్తుంది. ముందుగా ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో టెస్ట్ చేయడానికి మొదట ఇది రుచులను ఎలా పునరుత్పత్తి చేస్తుందో అంచనా వేశారు. ఆ తర్వాత పది మంది వ్యక్తుల్లో దీని సామర్థ్యాన్ని పరీక్షించగా.. కృత్రిమ రుచి ఒరిజనల్ రుచికి సమానంగా ఉందని చెప్పారు. ఆ తర్వాత నిమ్మరసం, కేక్, వేయించిన గుడ్డు, చేపల సూప్, కాఫీతో సహా సంక్లిష్ట రుచులను గుర్తించగలదో లేదో అని పరీక్షించారు. అయితే పరిశోధకులు ఆహారం ఫ్లేవర్ కంటే దాని రుచే ప్రధానమని చెబుతున్నారు. వాసన, రంగువంటి ఇంద్రియ అంశాలు ఆహారాన్నిఎలా గ్రహిస్తామనే దానిపై కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ఎందుకంటే ముక్కు, కళ్లు మూసుకుంటే స్ట్రాబెర్రీలు పుల్లగా అనిపిస్తాయట, అదే చూసి తింటే వాటి ఎరుపుదనం వల్ల తీపిదనంతో కూడిన అనుభూతి కలుగుతుందట. అందువల్ల తాము రూపొందించిన ఈ ఇ టేస్ట్ పులుపు, తీపి వంటి రుచులను చూడగలిగినా..మానవ నాలుకలా రుచిని పూర్తిగి ఆస్వాదింప చేయలేదని వెల్లడించారు పరిశోధకులు.(చదవండి: పనిప్రదేశాల్లో పాలివ్వడాన్ని అవమానంగా చూడొద్దు: సుప్రీం కోర్టు) -
వయసుతో ముసిరే సమస్యలు..!
చాలా సమస్యలు స్త్రీ, పురుషులిద్దరిలోనూ కామన్‌గానే ఉన్నా... కొన్ని సమస్యలు మాత్రం మహిళల్లో చాలా ప్రత్యేకం. వాళ్లలో స్రవించే హార్మోన్లూ, సంక్లిష్టమైన సైకిళ్ల వల్ల వాళ్లకు కొన్ని సమస్యలిలా ప్రత్యేకంగా వస్తుంటాయి. ఈ నెల 8న ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలూ, పరిష్కారాలను సూచించే ఈ ప్రత్యేక కథనమిది...రుతుస్రావం మొదలుకాగానే ఓ బాలిక బాలుర నుంచి వేరుగా కనిపించడం మొదలువుతుంది.రుతుస్రావం నుంచే అమ్మాయిల్లో కొన్ని సమస్యలు కనిపించడం మొదలువుతుంది. చాలామంది అమ్మాయిలు ఇంకా ఈ విషయమై మాట్లాడటానికి ఇబ్బంది పడుతుంటారు. ఇందులో బిడియపడాల్సిందేమీ లేదు. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు డాక్టర్‌ను సంప్రదించి తగిన సూచనలతోపాటు అవసరమైతే తగిన వైద్య చికిత్స కూడా తీసుకోవాలి.తొలుత యువతల్లో కనిపించే రుతుసంబంధమైన సమస్యలను తెలుసుకుందాం.రుతుసంబంధిత సమస్యలను ఇంగ్లిష్‌లో మెన్స్ట్రువల్ డిజార్డర్స్‌గా చెబుతారు. వీటిల్లో కొన్ని ప్రధాన సమస్యలిలా ఉంటాయి. ప్రైమరీ అమెనోరియా : సాధారణంగా అమ్మాయిల్లో 12 నుంచి 16 ఏళ్ల మధ్య రుతుస్రావం మొదలువుతుంది. కానీ కొందరు యువతుల్లో 16 ఏళ్లు దాటినా రుతుక్రమం మొదలుకాదు. ఈ కండిషన్‌ను ‘ప్రైమరీ అమెనోరియా’ అంటారు. ఇందుకు చాలా కారణాలుంటాయి. వీళ్లు డాక్టర్‌ను సంప్రదించి, తగిన పరీక్షలు చేయించి, కారణాలు తెలుసుకోవాలి. ఆ కారణాన్ని బట్టి చికిత్స అందించాల్సి ఉంటుంది. డిస్మెనూరియా: రుతుసంబంధిత సమస్యల్లో ప్రధానమైనదీ, దాదాపు 80 శాతం మంది అమ్మాయిల్లో కనిపించేది రుతు సమయాల్లో నొప్పి. దీన్నే ‘డిస్మెనూరియా’ అంటారు. వీళ్లు ఒకసారి డాక్టర్‌ను సంప్రదించాక, వారి సలహాతో రుతుసమయంలో నొప్పి వచ్చినప్పుడల్లా వారు సూచించిన మోతాదులో నొప్పి నివారణ మందులు వాడుకోవచ్చు. అయితే వీటిని ఎక్కువగా వాడటం వల్ల మరికొన్ని ఆరోగ్య సమస్యలు రావచ్చు. కాబట్టి డాక్టర్ సూచించిన మోతాదుకు మించకుండా వాడాలి. పరిష్కారం : రుతు సమయంలో వచ్చే ఈ నొప్పి ఒక వయసుకు వచ్చాక చాలామందిలో దానంతట అదే తగ్గిపోతుంది. ఇలాంటివారికి డాక్టర్లు కొన్ని న్యూట్రిషనల్ సప్లిమెంట్లు కూడా సూచిస్తారు. సంతానం కలిగిన తర్వాత చాలామందిలో ఈ నొప్పి రావడం ఆగిపోతుంది. కొందరిలో నొప్పి రావడం ఆగకపోవచ్చు. వాళ్లు డాక్టర్‌ను సంప్రదించి, తగిన మందులు వాడాలి. మెనొరేజియా: కొంతమంది యువతుల్లో రుతు సమయంలో రక్తస్రావం చాలా ఎక్కువగా అవుతుంటుంది. ప్రధానంగా చిన్న వయసు (తరుణ వయస్కులైన అడాలసెంట్) బాలికల్లో అలాగే పాతిక ముఫ్ఫై ఏళ్లు వరకు యువతుల్లోనూ ఈ సమస్య కాస్త ఎక్కువే. ఇలా ఎక్కువ మోతాదులో రక్తం పోతుండటం వల్ల రక్తహీనతతో పాటు మరెన్నో ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. పరీక్షలూ, పరిష్కారం: ఈ సమస్య ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు కొన్ని హార్మోనుల పరీక్షలు చేయించుకొని, అవసరాన్ని బట్టి మందులు వాడాల్సి ఉంటుంది. కొన్ని సార్లు ఈ రక్తస్రావం ఫైబ్రాయిడ్స్ వల్ల కావచ్చు. వైద్యపరీక్షల ఫలితాలను బట్టి చికిత్స ఉంటుంది. ప్రి మెనుస్ట్రువల్ సిండ్రోమ్ : కొంతమంది మహిళల్లో రుతుస్రావం మొదలు కావడానికి కొద్ది రోజులు ముందర నుంచే కొన్ని శారీరక సమస్యలు కనిపిస్తుంటాయి. ఉదాహరణకు... ఆ సమయంలో వాళ్లకు రొమ్ముల్లో సలపరం, బాధ /నొప్పి, భావోద్వేగాలు వెంటవెంటనే మారి΄ోవడం (మూడ్స్ స్వింగ్స్) వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సమస్యను ప్రీ–మెనుస్ట్రువల్ సిండ్రోమ్ అంటారు. పరిష్కారం : ఈ సమయంలో కలిగే బాధల నివారణ కోసం తగినన్ని నీళ్లు తాగుతుండాలి. అలాగే ద్రవాహారం ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఆకుకూరలు, కాయగూరలతో కూడిన పౌష్టికాహారం ఎక్కువగా తీసుకోవాలి. ఒత్తిడికి లోనుకాకూడదు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఎండార్ఫిన్ అనే హార్మోన్లు విడుదలై, మంచి ఉపశమనం కలగజేస్తాయి. ఈ సమస్య ఉన్నవారు పొగతాగడం, కెఫిన్ డ్రింక్స్ (కాఫీ, కూల్‌డ్రింక్స్‌లో కోలా డ్రింక్స్ వంటివి), ఆల్కహాల్ వంటి వాటికి దూరంగా ఉండాలి. ఆహారంలో ఉప్పు బాగా తగ్గించాలి. ఉప్పు ఎక్కువగా ఉండే బేకరీ ఐటమ్స్‌కు దూరంగా ఉండాలి. కొవ్వులు, చక్కెరలు ఎక్కువగా ఉండే ఆహారాలను చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. అప్పటికీ ప్రయోజనం కనిపించక΄ోతే డాక్టర్‌ను సంప్రదించి, కొన్ని హార్మోన్ పరీక్షలు చేయించుకుని, ఆ వైద్య పరీక్షల ఫలితాలను బట్టి అవసరమైన చికిత్స తీసుకోవాలి. మూత్ర సంబంధ సమస్యలుమహిళల శరీర నిర్మాణం కారణంగా పురుషులతో ΄ోలిస్తే... మహిళల్లో మూత్రసంబంధమైన ఇన్ఫెక్షన్లు చాలా ఎక్కువ. మూత్రసంబంధమైన ఇన్ఫెక్షన్స్తో తరచూ వస్తుండేవారు నీళ్లూ, ద్రవాహారం ఎక్కువగా తీసుకుంటూ ఉండటం, ప్రతి మూడు గంటలకోసారి మూత్రవిసర్జనకు వెళ్లి, మూత్రాశయాన్ని పూర్తిగా ఖాళీ అయ్యేలా జాగ్రత్త తీసుకోవడం, భార్యాభర్త కలయిక తర్వాత మూత్ర విసర్జనకు వెళ్లడం (ఈ సమయంలో కాస్త వేగంగా మూత్రవిసర్జన చేయాలి), ప్రైవేటు పార్ట్స్ శుభ్రంగా కడుక్కోవడం, ప్రైవేట్ పార్ట్స్ దగ్గర ఎప్పుడూ పొడిగా ఉంచుకోవడం వంటి జాగ్రత్తలతో ఈ సమస్యను నివారించవచ్చు. యూరినరీ ఇన్‌కాంటినెన్స్: కొందరు మహిళల్లో మూత్రంపై నియంత్రణ అంతగా ఉండదు. ఈ సమస్య ఉన్నవారు దగ్గినా, తుమ్మినా, ఏదైనా వస్తువును అకస్మాత్తుగా ఎత్తినా, కొందరిలో నవ్వినా వారి పొట్టపై కండరాలు మూత్రాశయంపై ఒత్తిడి కలిగించి... మూత్రం చుక్కలు, చుక్కలుగా పడేలా చేస్తాయి. సాధారణంగా ప్రసవం తర్వాత ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ప్రసవమైన తర్వాత మహిళల పొట్ట కండరాలు బలహీనం కావడంతో మూత్ర విసర్జన స్ఫింక్టర్‌పై వారు నియంత్రణ కోల్పోయేందుకు అవకాశమెక్కువ. దాంతో ఈ సమస్య కనిపిస్తుంది. పరిష్కారాలు: డాక్టర్‌ను సంప్రదించి, వారు సూచించిన విధంగా కొన్ని ప్రసవానంతర వ్యాయామాలూ, కెగెల్స్ ఎక్సర్సైజ్ల ద్వారా మూత్రవిసర్జనపై నియంత్రణ సాధించవచ్చు లేదా వారు సూచించిన విధంగా చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది కొందరిలో శస్త్రచికిత్స కూడా అవసరమవుతుంది. మహిళల్లో కనిపించే కొన్ని సాధారణ గైనిక్ సమస్యలు..పీసీఓఎస్ / పీసీఓడీ : అండాశయంలో అనేక నీటితిత్తులు పెరిగే ఈ సమస్యను వైద్యపరిభాషలో పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ లేదా డిజార్డర్ అంటారు. చాలావరకు అవి హానికరం కాకపోవచ్చు. అలాగే గర్భధారణకూ పెద్దగా అంతరాయం కలిగించకపోవచ్చు. పీసీఓఎస్ / పీసీఓడీకి కారణాలు : మహిళల అండాశయం నుంచి ప్రతి నెలా ఒక ఫాలికిల్ (అండం పెరిగే నీటి తిత్తి) కనిపిస్తుంది. దీని పరిమాణం 18 నుంచి 20 మిల్లీమీటర్లకు చేరాక ఇది పగిలి దాని నుంచి అండం విడుదల అవుతుంది. అయితే కొంతమందిలో ఫాలికిల్స్ 5–10 మిల్లీమీటర్లకు చేరగానే అంతకు మించి అది పెరగకుండా చిన్న చిన్న నీటి బుడగలాగా పెరుగుతాయి. అవి పది, పన్నెండు కంటే ఎక్కువగా ఉన్న కండిషన్‌ను పాలిసిస్టిక్ ఓవరీస్ అంటారు. ఇవి ఏర్పడానికి స్పష్టమైన కారణం తెలియదుగానీ... మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్లు, కొన్ని మానసిక, శారీరక సమస్యలతో పాటు హార్లోన్లలో అసమతౌల్యత, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వంటి సమస్యలు ఉన్నప్పుడు ఇవి వస్తుండటం పరిశోధకులు గమనించారు. ఈ సమస్య ఉన్న మహిళల్లో బరువు పెరగడం, అవాంఛిత రోమాలు, పీరియడ్స్ సక్రమంగా లేకపోవడంతో పాటు కొంతమందిలో సంతానలేమి, గర్భధారణ సమస్యలు కనిపించవచ్చు. పరీక్షలు/పరిష్కారాలు : కొన్ని రక్తపరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలతో సమస్యను నిర్ధారణ చేస్తారు. ఈ సమస్య ఉన్న మహిళలందరికీ ఒకేలాంటి చికిత్స ఉండదు. వారిలో కనిపించే లక్షణాలు, రక్తపరీక్షలు తేలిన అంశాలను బట్టి చికిత్స మారుతుంది. బరువు తగ్గించుకోవడం, అవసరాన్ని బట్టి మెట్ఫార్మిన్ వంటి మందులు, హార్మోన్లు వాడాల్సి ఉంటుంది. సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే అవసరాన్ని బట్టి ల్యాపరోస్కోపిక్ శస్త్రచికిత్స చేయాల్సి రావచ్చు. ఎండోమెట్రియాసిస్ : గర్భాశయం లోపలి పొరను ఎండోమెట్రియమ్ అంటారు. రుతుస్రావం తర్వాత ఈస్ట్రోజెన్ హార్మోన్ గర్భాశయం లోపలి గోడలపై ప్రభావం చూపడంతో అక్కడ ఎండోమెట్రియమ్ అనే పొర మొదటి 14 రోజులపాటు వృద్ధి చెంది, 15వ రోజున విడుదల అయ్యే ప్రోజెస్టెరాన్ అనే హార్మోన్ వల్ల ఆ పొర మరింత మందమవుతుంది. అక్కడ సన్నటి రక్తనాళాలు కూడా అభివృద్ధి చెందుతాయి. అప్పుడు ఓవరీస్‌లో విడుదలైన అండం శుక్రకణంతో కలవకపోతే 14 రోజుల తర్వాత ప్రొజెస్టెరాన్ ఉత్పత్తి ఆగిపోతుంది. దాంతో ఎండోమెట్రియమ్‌లో అభివృద్ధి చెందిన రక్తనాళాలు కుంచించుకుపోతాయి. ఫలితంగా ఎండోమెట్రియమ్ పొర... గర్భాశయం గోడ నుంచి ఊడిపోయి సన్నటి ముక్కలుగా రక్తంలో కలిసి బ్లీడింగ్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. మహిళల్లో ప్రతినెలా అయ్యే రుతుస్రావం ఇదే. అయితే కొందరిలో ఎండోమెట్రియమ్ కణాలు గర్భాశయంలోపలి వైపునకు కాకుండా, కొన్ని కారణాల వల్ల కడుపులోకి వివిధ అవయవాలపైన అంటే... అండాశయాలపైనా, ట్యూబ్స్‌పై, గర్భాశయం పై పొరపై, కత్తికడుపులోని గోడలపై, పేగులపై, మూత్రాశయంపై, ఇంకా చాలా అరుదుగా ఊపిరితిత్తుల్లో, మెదడులోకి పెరుగుతాయి. హార్మోన్ల ప్రభావం వల్ల అవి రుతుచక్రంలో ఎలాంటి మార్పులు చెందుతాయో... బయట పెరిగిన ఆ కణాల్లోనూ అలాంటి మార్పులే జరుగుతూ అవి పెరిగిన చోట కూడా వృద్ధి చెందుతుంటాయి. వాటినే ఎండోమెట్రియల్ ఇంప్లాంట్స్ అంటారు. రుతుస్రావం సమయంలో ఆ అవయవాల్లో కూడా కొద్దిగా బ్లీడింగ్ అవుతుంటుంది. ఈ సమస్యనే ఎండోమెట్రియాసిస్ అంటారు. వివిధ అవయవాలపై ఉన్న ఎండోమెట్రియమ్ ఇంప్లాంట్స్‌లో రక్తస్రావం జరిగాక... అది బయటకు వెళ్లడానికి దారి లేక రక్తం అక్కడిక్కడే ఇంకిపోతుంది. అయితే కొందరిలో రక్తం ఇంకకుండా అది గూడు కట్టడం జరగవచ్చు. కొందరిలో ఒక అవయవానికి, మరో అవయవానికి మధ్య ఈ రక్తపు కణాలు గూడుకట్టడం వల్ల కండ పెరగడమూ జరగవచ్చు. ఇలా జరగడం వల్ల పెరిగిన కండను అడ్హెషన్స్ లేదా ఫైబ్రోసిస్ బ్యాండ్స్ అంటారు. అలా పెరిగిన కణజాలం నుంచి విడుదల అయ్యే ప్రోస్టాగ్లాండిన్స్ హార్మోన్స్తోపాటు ఇతర రసాయన పదార్థాల వల్ల ఒక్కొక్కరిలో ఒక్కోలాంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో నడుం, పొత్తికడుపులో నొప్పి, సంతానం కలగకపోవడం, పేగులు అతుక్కు΄ోవడం, మూత్రనాళాలు, పేగుల్లో అడ్డంకులు ఏర్పడటం వంటి సమస్యలు రావచ్చు. పరిష్కారం : ఈ సమస్యకు ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్ వంటి హార్మోన్ మాత్రలతో చికిత్స అందిస్తారు. కొందరిలో శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం రావచ్చు.చర్మ సమస్యలు..మహిళల్లో బిగుతైన వస్త్రధారణ కారణంగా వారిలో చర్మానికి సంబంధించిన కొన్ని సమస్యలు కనిపించేందుకు అవకాశాలెక్కువ. అందులో ముఖ్యమైనవి... క్యాండిడియాసిస్ / ఫంగల్ ఇన్ఫెక్షన్స్: ఇది మహిళల్లో కనిపించే చాలా సాధారణ సమస్య. వాళ్లకు చెమట విపరీతంగా పట్టే ప్రదేశాల్లోనూ, అలాగే చర్మంలోని ముడతలుండే ప్రాంతాల్లో తగినంత గాలి, వెలుతురు సోకే అవకాశాలు తక్కువ. దాంతో అక్కడ ఉక్క΄ోతలతో చెమట తాలూకు చెమ్మ పెరగడంతో క్యాండిడియాసిస్ వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశమెక్కువ. ఇక కొందరిలో వాళ్లు గర్భం దాల్చినప్పుడూ ఈ సమస్యలు కనిపించడం మామూలే. అలాగే డయాబెటిస్ ఉన్నవారిలోనూ, రోగనిరోధక శక్తి తగ్గిన వారిలో, యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడే వారిలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తరచూ కనిపిస్తుంటాయి. పరీక్షలు / పరిష్కారాలు: సాధారణ ఫిజికల్ ఎగ్జామినేషన్‌తోనే ఈ సమస్యను తెలుసుకోవచ్చు. చర్మంపై వచ్చిన ఫంగస్ తాలూకు రకాన్ని బట్టి కొన్ని చర్మంపై పూసేందుకు కొన్ని పూతమందులూ (టాపికల్ మెడిసిన్స్), నోటి ద్వారా తీసుకోవాల్సిన యాంటీఫంగల్ మందులు వాడాల్సి ఉంటుంది. ఎండోక్రైన్ సమస్యలు : ఇది హార్మోన్ల స్రావాల్లో వచ్చే తేడాల వల్ల వచ్చే సమస్యలు. ఇందులో ప్రధానంగా రెండు రకాలు కనిపించేందుకు అవకాశాలెక్కువ. మొదటిది థైరాయిడ్ గ్రంథి చాలా తక్కువగా లేదా అస్సలు పనిచేయకపోవడం వల్ల వచ్చే సమస్య అయిన హైపోథైరాయిడిజమ్.ఈ సమస్య స్త్రీ, పురుషులిద్దరిలోనూ కనిపించినా సాధారణంగా మహిళల్లోనే కాస్త ఎక్కువ. రోగనిరోధక వ్యవస్థలో వచ్చే లోపాల వల్ల హై΄ోథైరాయిడిజమ్ రావచ్చు. తీవ్రమైన అలసట / మందకొడిగా ఉండటం, డిప్రెషన్, బరువు పెరగడం, చర్మం పొడిగా మారడం, మలబద్దకం, రుతుక్రమం సక్రమంగా రాకపోవడం వంటి లక్షణాలతో ఇది కనిపిస్తుంది. కొందరిలో ఈ కండిషన్ వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ మోతాదులు పెరిగి అవి హృద్రోగాలకు దారితీయవచ్చు. ఒక్కోసారి మైక్సిడిమా కోమా అన్న కండిషన్‌కు దారితీసి ప్రాణాపాయం కూడా సంభవించే అవకాశం ఉంది. గర్భిణుల విషయంలో థైరాక్సిన్ మోతాదులు తగ్గుతున్నాయేమో జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ పరీక్షలు చాలా అవసరం. గర్భిణుల్లో హై΄ోథైరాయిడిజం అన్నది బిడ్డ మానసిక వికాసానికి కొద్దిగా అంతరాయం కలిగించవచ్చు. అందుకే గర్భిణుల విషయంలో హైపోథైరాయిడిజమ్ లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. లెవో థైరాక్సిన్ సోడియమ్ వంటి మందుల ద్వారా దీనికి చికిత్స చేస్తారు. హైపర్ థైరాయిడిజమ్ : రక్తంలో థైరాయిడ్ హార్మోన్లు (టీ3, టీ4) పెరగడం వల్ల వచ్చే సమస్యను హైపర్ థైరాయిడిజమ్ లేదా థైరోటాక్సికోసిస్ అంటారు. దీని లక్షణాలన్నీ హైపోథైరాయిడిజమ్ లక్షణాలకు పూర్తిగా విరుద్ధంగా ఉంటాయి. గుండెదడ చేతులు వణకడం బరువు తగ్గిపోవడం ∙నీరసం ∙విరేచనాలు ∙ రుతుక్రమానికి సంబంధించిన సమస్యలు థైరాయిడ్ గ్రంథి వాపు (గాయిటర్) వంటి లక్షణాలు కనిపిస్తాయి. హైపర్‌థైరాయిడిజమ్‌ను రక్త పరీక్ష ద్వారా గుర్తిస్తారు. ఈ పరీక్షలో రక్తంలో టీ3, టీ4 మోతాదు ఎక్కు కావడం, టీఎస్‌హెచ్ మోతాదు బాగా తగ్గి΄ోవడం కనిపిస్తుంది. దీనికి చికిత్సగా యాంటీ థైరాయిడ్ మందులు ఉపయోగిస్తారు. ఈ మందులను డాక్టర్ సలహా మేరకు తీసుకోవాలి. కొన్ని నెలల వ్యవధిలోనే ఈ సమస్య పూర్తిగా తగ్గుతుంది. చాలామందిలో ఈ యాంటీథైరాయిడ్ మందులు ఆపిన తర్వాత మళ్లీ థైరాయిడ్ హార్మోన్ మోతాదులు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ముందుగా యాంటీ థైరాయిడ్ మందుల ద్వారా హార్మోన్‌ని తగ్గించి, ఆ తర్వాత ఈ సమస్య శాశ్వత పరిష్కారం కోసం రెండు పద్థతులు అనుసరిస్తారు. మొదటి దానిలో రేడియో ఆక్టివ్ అయోడిన్ మందును ఎక్కువ మోతాదులో ఇవ్వడం ద్వారా థైరాయిడ్ గ్రంథిలో హార్మోన్ తయారు చేసే కణాలను నాశనం చేయడం ద్వారా హార్మోన్ స్రావాన్ని తగ్గిస్తారు. ఇక రెండో పద్ధతిలో ఆపరేషన్ ద్వారా థైరాయిడ్ గ్రంథిని తొలగించడం ద్వారా హార్మోన్ స్రావాన్ని తగ్గిస్తారు. ఈ రెండు పద్ధతుల్లోనూ హార్మోన్ స్రావం బాగా తగ్గిపోయి, చివరకు హార్మోన్ లోపానికి దారితీస్తుంది. అప్పుడుహైపోథైరాయిడిజమ్లో మాదిరిగానే జీవితాంతం థైరాక్సిన్ మాత్రలు వాడాల్సి ఉంటుంది. మధ్య వయసులో వచ్చేవి..మధ్యవయసు నాటికి మహిళల్లో కనిపించే సమస్యల్లో ముఖ్యమైనవి ఇవి... మెనోపాజ్ సమస్యలు : రుతుక్రమం రావడంతో సమస్యలు మొదలవుతాయంటే... తమకు 45 ఏళ్లు వచ్చాక అదే రుతుక్రమం ఆగి΄ోవడం కూడా మహిళల్లో ఒక సమస్యాత్మక అంశంగానే ఉంటుంది. రుతుక్రమం ఆగే సమయంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గినందున వారికి ఒంట్లోంచి వెచ్చటి ఆవిర్లు రావడం, భావోద్వేగాల్లో వేగంగా మార్పులు (మూడ్స్ స్వింగ్స్), ఆస్టియో΄ోరోసిస్తో ఎముకలు బలహీనం కావడం, ఈస్ట్రోజెన్ వల్ల గుండెకు కలిగే సహజ రక్షణ తొలగిపోవడం వల్ల గుండెజబ్బులకు తేలిగ్గా గురికావడం, యోని పొడిగా మారడం, గర్భసంచి కిందికి జారడం వంటి అనేక సమస్యలు కనిపిస్తాయి. పరిష్కారం : రుతుక్రమం ఆగిన (మెనోపాజ్) మహిళల్లో సంబంధిత లక్షణాలేవైనా కనిపిస్తే తక్షణం డాక్టర్‌ను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. లక్షణాలను బట్టి డాక్టర్లు హెచ్ఆర్టీ వంటి చికిత్సలను సూచిస్తారు. క్యాల్షియమ్, విటమిన్ ’డి’ ఇవ్వడం వల్ల మెనోపాజ్ వచ్చిన మహిళల్లో ఎముకల ఆరోగ్యం పటిష్టంగా ఉండటమే కాకుండా ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలను నివారించవచ్చు. అలాగే ఆహారంలో క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే పాల వంటివి తీసుకోవడంతోపాటు దేహానికి తగినంత వ్యాయామం కూడా అందేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆస్టియోపోరోసిస్... మహిళల్లో ఈ ఎముకలకు గుల్లబారి΄ోయే ఈ వ్యాధి చాలా ఎక్కువ. పైగా మన దేశ మహిళలు (ముఖ్యంగా చిన్నపిల్లల నుంచి యువతుల వరకు) క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే పాలు క్రమం తప్పకుండా తాగడం చాలా తక్కువ. ఇటీవల చాలామంది సూర్యకాంతికి ఎక్స్పోజ్ కాకపోవడంతో ఎముకలకు బలం చేకూర్చే విటమిన్ డీ3 పాళ్లూ తగ్గుతాయి. పైగా మహిళలకు వ్యాయామ అలవాట్లూ తక్కువే. వీటిన్నింటి ఫలితంగా మహిళల్లో ఎముక సాంద్రతా, బలం క్రమంగా తగ్గుతూ పోతుంది. ఇక తమ వ్యాధినిరోధక శక్తి తమపైనే ప్రతికూల ప్రభావం చూపే ఎముక సంబంధితమైన రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఎస్‌ఎల్‌ఈ వంటి వ్యాధులు మహిళ్లోనే ఎక్కువ. అందుకే మహిళల్లో ఎముకల బలాన్ని పెంచడానికి పొట్టుతో ఉంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఇచ్చే ధాన్యాలైన (గోధువు, జొన్న, మెుక్కజొన్న, రాగులు, ఓట్స్)తో చేసిన పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే పొట్టుతీసిన కార్బోహైడ్రేట్స్ నివారించాలి. తాజా పండ్లు, క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే రాగులు, తాజా ఆకుపచ్చ కూరలు (గ్రీన్ లీఫీ వెజిటబుల్స్) తీసుకోవడం చాలా మంచిది. ఇటీవలి ఆధునిక మహిళలు ఇంటిపనులతోపాటు బయట ఉద్యోగాలూ చేస్తున్నారు. అందుకే వారిపై పనిఒత్తిడి తోపాటు మానసిక ఒత్తిడీ ఎక్కువే. ఫలితంగా ఆరోగ్య సమస్యలూ ఎక్కువే. అందుకే ఆమెకు కుటుంబం నుంచీ, అందునా మరీ ముఖ్యంగా భర్త నుంచి తగిన సహాయ సహకారాలు అవసరమని అందరూ తెలుసుకోవాలి.డాక్టర్ చల్మేడ నివేదిత, సీనియర్ ఫిజీషియన్, డయాబెటాలజిస్ట్ (చదవండి: అరుదైన శసస్త్ర చికిత్స: దంతంతో కంటి చూపు..!) -
పోసాని కృష్ణమురళిపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు
-
రెండే రెండు చిట్కాలతో ఏకంగా 90 కిలోలు తగ్గింది.. వావ్ అనాల్సిందే!
బరువు తగ్గాలంటే అంత ఈజీ కాదు గురూ! ఇది ఒకరి మాట..మనసు పెట్టాలే గానీ అదెంత పనీ అనేది సక్సెస్ అయిన వారి మాట. విజయవంతంగా తాము అనుకున్నది చేసి చూపిస్తున్నారు. ఇప్పటివరకూ ఎంతోమంది వెయిట్‌లాస్ జర్నీల గురించి తెలుసుకున్నాం. తాజాగా సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ దాదాపు 90 కిలోలు తగ్గింది. అధిక బరువుతో బాధపడే ఆమె జీవనశైలి మార్పులతో జాగ్రత్తగా తన లక్ష్యాన్ని చేరుకుంది. ఇంతకీ ఎవరామె? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంది? తెలుసుకుందాం పదండి.వాస్తవానికి బరువు తగ్గడం అనేక సవాళ్లతో కూడుకున్నది. డైటింగ్ చేసి కష్టపడి బరువు తగ్గినా, దాన్ని నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం. దీనికి మన శరీర తత్వంపై, మనం తింటున్న ఆహారంపై, మన జీవన శైలిపై అవగాహన ఉండాలి. వైద్య నిపుణుల సలహా మేరకు, ప్రణాళికా బద్దంగా ప్రయత్నించి ఒక్కో మైలురాయిని అధిగమించాలి. ఫలితంగా అధిక బరువు కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలను అధిగమించడమేకాదు కొన్ని కిలోలు తగ్గి స్లిమ్‌గా ఆరోగ్యంగా కనిపించడం వల్ల కలిగే ఆనందం మాటల్లో వర్ణించలేం.న్యూట్రిషనిస్ట్ ప్రాంజల్ పాండే అదే చేసింది. తద్వారా 150కిలోల బరువునుంచి 66 కిలోలకు విజయవంతంగా బరువును తగ్గించుకుంది. కేవలం రెండేళ్లలో ఈ విజయాన్ని సాధించింది. అయితే ఈ ప్రయాణం అంత ఈజీగా సాగలేదు. ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం ఉంచి ఆమె ప్రయాణం మొదలైంది. రోజువారీ శారీరక శ్రమ,ఆరోగ్యకరమైన అలవాట్లను అవలంబించింది. దీనికి సంబంధించి ఎలా బరువు తగ్గిందీ ఇన్‌స్టాలో వివరించింది. తన అభిమానులు లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చింది. బరువు తగ్గడం ఎవరికైనా సాధ్యమేనని రుజువు చేసింది.తన కృషి , అంకితభావాన్నిఇలా చెప్పింది.‘‘బరువున్నా.. బాగానే ఉన్నాను కదా అనుకునేదాన్ని..అంతేకాదు అసలు నేను సన్నగా మారతానని ఎప్పుడూ అనుకోలేదు. ఎలాగైతేనేం డబుల్ డిజిట్‌కి చేరాను. దీని కోసం చాలా కష్టపడ్డాను. ఎంతో చెమట చిందించాను. కన్నీళ్లు కార్చాను. చివరికి ఇన్నేళ్లకు 150 కిలోల నుండి 66 కిలోలకు చేరాను’’ అని తెలిపింది.ప్రాంజల్ అనుసరించిన పద్దతులుబరువు తగ్గడానికి డైటింగ్, ఎక్స్‌ర్‌సైజ్ కంటే.. జీవనశైలిమార్పులే ముఖ్యం అంటుంది ప్రాంజల్.ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మరసం లేదా ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపిన గోరువెచ్చని నీరు త్రాగడం ప్రోటీన్ ఫుడ్ బాగా తినడం, చేపలు, పౌల్ట్రీ, రొయ్యలు ,గుడ్లు, అలాగే మొక్కల ప్రోటీన్,పనీర్, టోఫు, గ్రీకు యోగర్ట్, సోయాలాంటివి ఆహారంలో చేర్చుకోవడం.భోజనానికి ముందు సలాడ్ తీసుకోవడం ముఖ్యంగాక్యారెట్లు , కీరలాంటివాటితోసూక్ష్మపోషకాలు, ఆరోగ్యకరమైన కొవ్వుల కోసం తృణధాన్యాలు, పండ్లు , కూరగాయలు తినడం. ప్రతిరోజూ నాలుగు లీటర్ల నీరు త్రాగడం.వ్యాయామంప్రతి భోజనంలో ప్రోటీన్‌కు ప్రాధాన్యత. ప్రతి భోజనం తర్వాత కనీసం 10 నిమిషాలు రోజువారీ నడక. వాకింగ్ కుదరకపోతే భోజనం తర్వాత చురుకుగా ఉండటానికి 10-15 స్క్వాట్లు , పడుకునే ముందు 2-3 గంటల ముందే డిన్నర్ పూర్తి చేయడం. జిమ్‌కు వెళ్లడం, పైలేట్స్ , వాకింగ్ లేదా జాగింగ్ నోట్: బరువు తగ్గడం, దానిని నిర్వహించడం అనేది పూర్తి జీవనశైలి మార్పు ద్వారా సాధ్యం అనేది ప్రాంజల్ అనుభవం. ఇది అందరికీ ఒకేలా ఉండకపోయినా.. దాదాపు అందరికీ వర్తిస్తుంది. అంకితభావం , ఆరోగ్యకరమైన జీవనశైలితో ఎవరైనా తమ లక్ష్యాలను సాధించవచ్చు. -
పువ్వులు పంచే అందం..!
ఈ సీజన్లో రకరకాల పువ్వులు మనకు కనువిందు చేస్తుంటాయి. అవి మన చర్మానికి, ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను కలిగిస్తాయి. కొన్నింటి సువాసనల వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంటుంది. మరికొన్ని పువ్వులు బ్యూటీ ట్రీట్మెంట్లలో చేరి, తమ గొప్పతనాన్ని చాటుతుంటాయి. బంతిపువ్వులు క్రిమినాశకంగా పనిచేస్తాయి. చర్మంపై దద్దుర్లు, చికాకులకు, మొటిమల సమస్యలు ఉన్నవారికి ఔషధంలా పనిచేస్తుంది. బంతి పువ్వు రేకలను కొద్దిగా నూరి, మొటిమలపై రుద్ది, పది నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. రోజూ ఇలా చేస్తూ ఉంటే కొద్ది రోజుల్లోనే మొటిమల సమస్య దూరం అవుతుంది. లావెండర్ మనసుకు శాంతిని కలిగించడంలోనూ, చర్మానికి యాంటీ బాక్టీరియల్గానూ ఉపయోగపడుతుంది. మసాజ్‌ల కోసం లావెండర్ నూనెలు, చర్మం డీ హైడ్రేట్ కాకుండా లావెండర్ వాటర్ స్ప్రే చేస్తే తిరిగి కళగా మారుతుంది.మల్లెలతో చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చుకోవచ్చు. పొడి చర్మం గలవారు జాస్మిన్ ఆయిల్, జాస్మిన్ ఫేస్ ప్యాక్‌లు వాడితే మృదువుగా మారుతుంది. ఒత్తిడి ఉపశమనానికి జాస్మిన్ సువాసనలు ఎంతో మేలు చేస్తాయి. గులాబీ – లావెండర్ ఫ్లవర్ ప్యాక్ కప్పు రోజ్ వాటర్, టీస్పూన్ ఎండిన లావెండర్ పువ్వులు, 5–6 చుక్కల లావెండర్ నూనె తీసుకోవాలి. రోజ్ వాటర్‌ను మరిగించి, ఎండిన లావెండర్ పువ్వులను అందులో వేయాలి. కొద్దిసేపు అలాగే ఉంచి, మిశ్రమాన్ని చల్లబరచాలి. తర్వాత వడకట్టి, ఏదైనా నూనె కలిపి రాసుకోవచ్చు. మందార పువ్వులు నిస్తేజంగా ఉన్న శిరోజాలకు కండిషనర్‌గా ఉపయోగపడి మెరుపును తీసుకువస్తాయి. మాడుపై ఉండే చర్మం పొడిబారకుండా కాపాడుతుంది. గుప్పెడు మందార పువ్వులను తీసుకొని, వాటిని మెత్తని పేస్ట్‌లా తయారు చేసి,అందులో కొద్దిగా పెరుగు కలిపి తలకు ప్యాక్ వేయాలి. పదిహేను నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. పొడిబారి ఉన్న శిరోజాలు మృదువుగా అవుతాయి. ‘గులాబీపువ్వులలో చర్మాన్ని తాజాగా ఉంచేందుకే కాదు ఔషధంగా పనిచేసే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి. టోనర్‌గా రోజ్‌వాటర్, ఫేస్ మాస్క్‌లు, చర్మ సంరక్షణలో రోజ్ ఆయిల్‌ను ఉపయోగించవచ్చు. (చదవండి: అరుదైన కేసు: ఆ తల్లి కవలలకు జన్మనిచ్చింది..అయితే డీఎన్ఏ టెస్ట్‌లో..!) -
Sundeep Kishan: అలాంటి డైట్ ఫాలో అవుతాడా..! అందుకే..
స్నేహగీతం, ప్రస్థానం' చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన యువ కథానాయకుడు సందీప్‌కిషన్.బాలీవుడ్‌లోనూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని 2010లో టాప్ 3 చిత్రాల్లో ఒకటైన 'షోర్ ఇన్ ద సిటీ' చిత్రం ద్వారా బాలీవుడ్‌కు పరిచయమై అందరి దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్నాడు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ తాజాగా రాణాల తరువాత హిందీ సినిమాల్లో నటిస్తున్న హీరోగా సందీప్ గుర్తింపు తెచ్చుకున్నాడు. చూడటానికి పక్కింటి కుర్రాడిలా ఉంటే సందీప్ చాలా స్మార్ట్‌గా మంచి బాడీని మెయింటైన్ చేస్తాడు. అలాగే సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా తన రూపురేఖలను కూడా మార్చుంటాడు చాలా సులభంగా. మరీ అతడి ఫిటనెస్ సీక్రెట్ ఏంటో చూద్దామా..!.అందరి హీరోల మాదిరిగా స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవ్వడట. తనకస్సలు స్ట్రిక్ట్ డైట్'పై నమ్మకం లేదని తేల్చి చెప్పాడు. దానికంటే ఏడాది పొడవునా మంచిగా తినడమే మంచిదని చెబుతున్నాడు. చాలామంది కఠినమైన డైట్లు ఎంచుకోమని చెబుతారు గానీ, దానిపై తకెందుకనో నమ్మకం రాదని, హయిగా నచ్చిన ఫుడ్ తింటూ వ్యాయామాలు చేసుకోవడమే మేలు. అలాగే అందరీ బాడీకి ఒకేవిధమైన డైట్ సెట్ అవ్వదు. ప్రతి శరీరానికి వివిధ రకాలు ఆహార నియమాలు అవసరమవుతాయిని అన్నాడు సందీప్. కాబట్టి ఎవరికి వారు తమ బాడీకి ఏది సూటవ్వుతుందో పరీక్షించుకుని ఎంచుకోవడమే ఉత్తమం అని సూచిస్తున్నాడు. తీవ్రమైన కఠిన ఆహార నియంత్రణ కంటే ఒత్తిడిని దూరం చేసే మంచి ఉత్తేజకరమైన ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వడం మంచిదని నొక్కి చెబుతున్నాడు. ఏదైతే ఇష్టంగా తింటారో దాన్నే తీసుకోండి, అయితే అది ఆరోగ్యకరమైనదే అయ్యి ఉండాలన్నది గుర్తించుకోండి అని అంటున్నాడు. తాను మాత్రం వివిధ రకాల ఆహారాలను ఆస్వాదించడం తోపాటు, రోజంతా యాక్టివ్‌గా ఉంచే ఆహారానికే ప్రాధాన్యత ఇస్తానని అన్నారు. అలాగే తన బాడీకి సరిపోయే వర్కౌట్లు, వ్యాయామాలు కూడా చేస్తానని అన్నాడు సందీప్. కాగా, సందీప్ నటించిన అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'ఫ్యామిలీ మ్యాన్ 3' షూటింగ్ దాదాపుగా పూర్తి కాగా, త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన 'మజాకా' మూవీ విడుదలైంది. (చదవండి: పదిలో అత్తెసరు మార్కులు, ప్రిలిమ్స్ పదిసార్లు ఫెయిల్.. అయినా..!) -
నటి భాగ్య శ్రీ హెల్త్ టిప్స్: కాంతులీనే చర్మం, ఆరోగ్యం కోసం..!
బాలీవుడ్ నటి భాగ్య శ్రీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు మంచి మంచి హెల్త్ టిప్స్‌ని షేర్ చేస్తూ ఆరోగ్య స్ప్రుహని కలగజేస్తుంటుంది. అలాసే ఈసారి సరికొత్త హెల్త్ చిట్కాని నెట్టింట షేర్ చేసింది. అదే తన ప్రతిరోజూ ఉదయం తీసుకునే సూపర్‌ఫుడ్ అని చెబుతోంది. దీనివల్ల చర్మ, జుట్లు, ఆరోగ్యం బాగుంటాయని నమ్మకంగా చెప్పింది. ఇంతకీ అదెంటంటే..మెంతి గింజల ప్రయోజనాల గురించి చెప్పుకొచ్చింది ఇన్‌స్టాలో. నానబెట్టిన మెంతిగింజలు ఒక సూపర్ ఫుడ్ అని అది ఇన్సులిన్ స్థాయిలను నియంత్రిస్తుందని, రక్తాన్ని శుభ్రపరిచి..ప్రేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని అన్నారు. వీటిలో ఐరన్ పుష్కలంగా ఉంటుందని, అద్భుతమైన రోగనిరోధక శక్తిని అందిస్తాయని చెప్పుకొచ్చారు. వీటిని గనుక డైలీ లైఫ్‌లో భాగం చేసుకుంటే ఆరోగ్యంలో చక్కటి మార్పుని చూస్తారని అన్నారామె. ముఖ్యంగా కాంతులీనే చర్మాన్ని అందివ్వడంలోనూ, జుట్టు ఆరోగ్యంలోనూ కీలకంగా ఉంటుందని పేర్కొంది. నిపుణులు ఏం అంటున్నారంటే..మెరుగైన ఆరోగ్యాన్ని ఇవ్వడంలో మెంతుకు సాటిలేదని చెబుతున్నారు. దీని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాల గురించి సవివరంగా వెల్లడించారు. అవేంటంటే..దీనిలోని ఫైబర్ కంటెంట్ కారణంగా మలబద్ధకాన్ని నివారిస్తుందిగ్యాస్ సమస్యలను తగ్గిస్తుందిబరువుని అదుపులో ఉంచుతుంది, ఆకలిని అరికట్టి జీవక్రియను మెరుగ్గా ఉంచుతుందికీళ్ల నొప్పులు, ఉబ్బసం వంటి సమస్యలను తగ్గిస్తుందిమెరుగైన తల్లిపాల ఉత్పత్తిలో కీలకంగా ఉంటుంది. చక్కెర స్థాయిల నియంత్రిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచుతుందిమొటిమలు, ముడతలను తగ్గిస్తుంది.జుట్టు రాలడం తగ్గుతుందిపీసీఓఎస్ సమస్యలు అదుపులో ఉంటాయి. శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి.కాగా, నటి భాగ్యశ్రీ గతంలో చర్మ సౌందర్యానికి ఉపయోగ పడే గ్రీన్జ్యూస్ ప్రయోజనాలను గురించి పంచుకున్నారు. తాజాగా మరో ఆరోగ్య చిట్కాతో మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలందించే మెంతులు గురించి నెటిజన్లతో షేర్ చేసుకున్నారు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యులను లేదా నిపుణలను సప్రదించడం మంచిది. (చదవండి: అమెరికా నుంచి భారత్‌కి అందుకే వచ్చేశా! సీఈవో హార్ట్ టచింగ్ రీజన్) -
వాటర్ ఫిల్టర్ నీళ్లలో స్వచ్ఛత ఎంత? ఎలా ఎంచుకోవాలి?
ఈ రోజుల్లో శుద్ధమైన నీటిని తాగడమూ కొంత ప్రయాసతో కూడిన అంశంగా మారింది. భూగర్భ, నదీ జలాల కాలుష్యం, కొన్నాళ్ల పాటు నిల్వ ఉంచే వాటర్ ట్యాంకుల వల్ల స్వచ్ఛమైన నీటి కోసం వెతుకులాట తప్పడం లేదు. దీంతో చాలా మంది వాటర్ ప్యూరిఫైయర్లను ఎంచుకుంటున్నారు. మార్కెట్లో లభించే రకరకాల వాటర్ ప్యూరిఫైయర్లలో కొన్ని నీటిని వడకట్టేవి, మరికొన్ని నీటి నుంచి పోషకాలు పోకుండా కాపాడేవి, ఇంకొన్ని మోతాదులో పోషకాలు కలిపేవి లభిస్తున్నాయి. ప్రకృతి సిద్ధంగా లభించే నీటిలోఉండే స్వచ్ఛత తెలుసుకోవడానికి అవగాహనే ప్రధానమైనది.ఎంపిక చేసుకున్న ప్యూరిఫైయర్ని ఆపరేటర్లు ఇంట్లో అమర్చాక టిడిఎస్ ఎంత ఉందో నాణ్యత చూపించి, మరీ వాటి గురించి వివరిస్తుంటారు. వరప్రదాయినిగా లభించే నీటిలోపోషకాలు ఏంటి, టిడిఎస్ ఏంటి.. అంటూ కొంత ఆందోళన పడుతుంటాం. ఖనిజాలు, లవణాలు, లోహాలతో సహా నీటిలో కరిగిన పదార్థాల మొత్తాన్ని కొలవడమే టిడిఎస్ (టోటల్ డిసాల్వ్డ్ సాలిడ్స్).నీటిలో టిడిఎస్ స్థాయి ఎంత మేరకు ఉండాలంటే...0-50 పిపిఎమ్ (పార్ట్స్ పర్ మిలియన్) ఉంటే... దీనిని స్వేదనజలం అంటారు. అవసరమైన ఖనిజాలు,పోషకాలు లేకపోవడం వల్ల ఈ నీటిని తాగడానికి ఉపయోగించలేం 50-150 పిపిఎమ్ ఉంటే అవసరమైన ఖనిజాలు,పోషకాలు ఉన్నాయని, తాగడానికి మేలైనదని గుర్తించాలి 150 - 300 పిపిఎమ్ ఉంటే తాగడానికి మేలైనది300 - 500 పిపిఎమ్ ఉంటే ఆ నీరు ఆరోగ్య సమస్యలను తగ్గిస్తాయి 500-600 పిపిఎమ్ కంటే ఎక్కువ ఉంటే తాగడానికి మేలైనది కాదు.నీటి శుద్ధి యంత్రాల రకాలు: ఆర్వో (రివర్స్ ఓస్మోసిస్):అధిక టిడిఎస్ (300 పిపిఎమ్ కంటే ఎక్కువ)కు ఆర్వో ఉత్తమమైనది. ఇది, నీటిలో భార లోహాలు, రసాయనాలు, అదనపు లవణాలను తొలగిస్తుంది. అయితే, ముఖ్యమైన ఖనిజాలను కూడా తొలగించవచ్చు, కాబట్టి దీనిలోనూ మినరలైజర్ ఉన్న మోడల్‌ను ఎంచుకోవడం మేలు.యూవీ (అతినీలలోహిత) ఫిల్టర్: బ్యాక్టీరియా, వైరస్‌లకు వ్యతిరేకంగా, ప్రభావవంతంగా పనిచేస్తుంది. నీటిలో తక్కువ టిడిఎస్ ఉన్నప్పుడు యువి మోడల్ మంచిది.యూఎఫ్ అతినీలలోహిత ఫిల్టర్: ఈ మోడల్ వాటర్ ఫిల్టర్ యూవీ లాగానే ఉంటుంది. కానీ సస్పెండ్ చేయబడిన కణాలను కూడా యుఎఫ్ మోడల్ తొలగిస్తుంది. యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్లు: రుచిని మెరుగుపరచడానికి, క్లోరిన్, సేంద్రీయ మలినాలను తొలగించడానికి ఈ ఫిల్టర్ బాగా ఉపయోగపడుతుంది. సరైన ప్యూరిఫైయర్‌ను ఎంచుకోవడం: అధిక టిడిఎస్ కోసం (300 పిపిఎమ్)RO లేదా RO+UV/UF ఎంచుకోవచ్చు తక్కువ టిడిఎస్ (300 పిపిఎమ్ లోపల ) కోసం UV+UF లేదా గురుత్వాకర్షణ ఆధారిత ప్యూరిఫైయర్లు సరిపోతాయి.మున్సిపల్ నీటి కోసం సాధారణ టిడిఎస్, యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్లు బాగా పనిచేస్తా.బోర్వెల్/హార్డ్ వాటర్‌లో అధిక టిడిఎస్ స్థాయిలు ఉంటాయి కాబట్టి ఆర్వో ఫిల్టర్ బాగా పనిచేస్తుంది. కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలను తిరిగి కలపడానికి మినరలైజర్/టిడిఎస్ కంట్రోలర్ వంటి కొన్ని ఆర్వో ప్యూరిఫైయర్లు ఉన్నాయి ఇంట్లో వాడే వాటర్ ఫిల్టర్ ఎంపికను బట్టి టిడిఎస్ స్థాయిని కొలవడానికి మీరు టిడిఎస్ మీటర్‌ను ఉపయోగిస్తూ ఉండాలి. ఏవైనా మార్పులు కనిపిస్తే సంబంధిత ఆపరేటర్‌కు తెలియజేసి, ఫిల్టర్‌ను మార్చుకోవాలి. చదవండి: మంగళసూత్రం, మెట్టెలు అందుకే.... అమెరికన్ మహిళ వీడియో వైరల్ఒకే ఒక్క శ్వాసతో రికార్డ్: భారతీయ మత్స్య కన్య సక్సెస్ స్టోరీ!శుద్ధమైన నీటిని తాగితే చాలు...గతంలో సంప్రదాయ పద్ధతిలో మరిగించడం అనేది ఒక పద్ధతిగా ఉండేది. దీని వల్ల కూడా కొన్ని పోషకాలు పోతున్నాయి అని గ్రహించారు. వాటర్ క్వాలిటీ కోసం టిడిఎస్‌ను చెక్ చేస్తాం. ప్రభుత్వం కూడా ఈ పద్ధతిని అవలంబిస్తుంది. ఆర్వో సిస్టమ్ అయితే సురక్షితం అనుకుంటాం. ఫిల్టర్ వరకు పర్వాలేదు. కానీ, వీటి ద్వారా కూడా నీటిలో కొన్ని పోషకాలు పోతుంటాయి. 100 శాతం క్లోరిన్, కాలుష్య శుద్ధి చేసి, నీటి నుంచి మనకు కావల్సిన పోషకాలు లభిస్తే చాలు. ఇప్పుడు ఆల్కలైన్ వాటర్ తాగితే చాలా ప్రయోజనాలు అని చెబుతుంటారు. వాటికి సంబంధించిన ఫిల్టర్లు కూడా వస్తున్నాయి. నీటిలో ప్రధానంగా ఉండే పొటాషియం, మెగ్నిషియమ్, ఐరన్ వంటివి ఉంటే చాలు. ఎక్కువ ΄ోషకాలు కలిపి మరీ తీసుకోవాల్సిన అవసరం లేదు. – సుజాత స్టీఫెన్, న్యూట్రిషనిస్ట్ -
వింగ్డ్ బీన్స్..పోషకాలు పుష్కలం : ఒకసారి పాకిందంటే!
వింగ్డ్ బీన్ (సోఫోకార్పస్ టెట్రాగోనోలోబస్).. ప్రొటీన్లు పుష్కలంగా ఉన్న ఒక రకం చిక్కుడు పంట. మిగతా చిక్కుడు కాయల కన్నా ఇది చాలా విభిన్నంగా ఉంటుంది. ఈ చిక్కుడు కాయకు నాలుగు ముఖాలు ఉంటాయి. అందువల్ల ఈ తీగ జాతి కూరగాయ మొక్కకు ‘రెక్కల చిక్కుడు’ అని పేరొచ్చింది. ఉష్ణమండల ప్రాంతాల్లో చక్కగా పెరుగుతుంది. ఆసియా దేశాలకు బాగా అనుకూలమైనదైనా, ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా సాగు చేయని పంట ఇది. ఇది కూరగాయ పంట. ఆకుకూర పంట. దుంప పంట. పప్పు ధాన్యపు పంట కూడా! ప్రతికూల వాతావరణ పరిస్థితులను దీటుగా తట్టుకొని దిగుబడినిచ్చే అద్భుత పంట!! భారత్, బర్మా, శ్రీలంక, ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్, చైనా తదితర దేశాల్లో సాగవుతోంది. వింగ్డ్ బీన్స్‌తో కూర చేసుకోవచ్చు. ఎండు చిక్కుడు గింజల కోసం కూడా పెంచవచ్చు. గాలిలో పుష్కలంగా ఉన్న నత్రజనిని గ్రహించి నేలకు అందించే సామర్థ్యం అన్ని పప్పుధాన్యపు పంటలకూ ఉంది. దీనికి కొంచెం ఎక్కువగా ఉంది. దీని వేర్లపై ఉండే బుడిపెల ద్వారా నత్రజనిని భూమిలో స్థిరీకరిస్తుంది. దీని ఆకుల్లో కూడా అత్యంత నాణ్యమైన మాంసకృత్తులు ఉంటాయి. పౌష్టికాహార లోపాన్ని అధిగమించేందుకు దోహదపడే ఈ చక్కని చిక్కుడు పంటపై మనం పెద్దగా పట్టించుకోవటం లేదు. వింగ్డ్ బీన్‌లో కూడా అనేక రకాల వంగడాలు ఉన్నాయి. అద్భుతమైన ఈ కూరగాయ పంట ప్రతికూల బెట్ట వాతావరణ పరిస్థితులను తట్టుకోగలుగుతుంది. వర్షాధార ప్రాంతాల్లో నివసించే పేద గ్రామీణ కుటుంబాల ఆహారంలో మాంసకృత్తులను తగినంత చేర్చగల శక్తి ఉన్న పంట ఇది. సారం అంతగా లేని భూముల్లో సైతం మంచి దిగుబడినిస్తుంది. పంట పొలాల్లో పంటల జీవవైవిధ్యాన్ని, భూసారాన్ని పెంపొందించడానికి, వాణిజ్యపరంగా ఆదాయం పొందడానికి కూడా వర్షాధార వ్యవసాయంలో వింగ్డ్ బీన్ సాగును ్ర΄ోత్సహించవలసిన అవసరం ఉందని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఎఆర్) పరిశోధన, విస్తరణ సిబ్బందికి సూచించింది. వింగ్డ్ బీన్స్ ప్రజల పళ్లాల్లోకి చేర్చగలిగితే మనుషుల ఆరోగ్యాన్ని మెరుగుపర్చగలమని, పౌష్టికాహార లోపాన్ని పారదోలగలమని ఐసిఏఆర్ ఆశిస్తోంది. కూరగాయ తోటల్లో, ఇంటిపంటల్లో, మిద్దె తోటల్లో సైతం సాగు చేయదగిన మేలుజాతి తీగ జాతి కూరగాయ పంట ఇది.వన్ స్పెసీస్ సూపర్‌మార్కెట్!ఐసిఏఆర్ వింగ్డ్ బీన్ని ‘వన్ స్పెసీస్ సూపర్‌మార్కెట్’గా అభివర్ణించింది. ఆకుపచ్చని కాయలు, ఆకులు, గింజలతో పాటు.. కొంచెం లావుగా పెరిగే దీని వేర్లు కూడా చక్కని పోషకాలతో కూడి ఉండటమే ఇందుకు కారణం. ఆకులను పాలకూర మాదిరిగా పప్పులో వేసుకోవచ్చు. పూలను సలాడ్‌గా తినొచ్చు. దుంప మాదిరిగా ఊరే వేర్లను విడిగా తినొచ్చు లేదా ప్రాసెస్డ్ ఫుడ్స్‌లో కలుపుకోవచ్చు. ఈ తీగ జాతి మొక్క వేగంగా అల్లుకుపోతుంది కాబట్టి సజీవ ఆచ్ఛాదనగా వేసుకోవచ్చు. ప్రధాన పంట మధ్యలో కలుపు పెరగనీయకుండా అంతరపంటగా, పంటమార్పిడి కోసం సాగు చేస్తూ భూసారాన్నిపెంపొందించుకోవచ్చు. ఇది తేలిగ్గా చనిపోదు. ఇతరత్రా ప్రధాన ఆహార పంటలతో పోల్చితే కరువును, వరదను, వేడిని, చీడపీడలను అధికంగా తట్టుకునే శక్తి ఈ పంటకు ఉంది. ఇది బహు వార్షిక పంట. అయితే, వార్షిక పంటగానే సాగులో ఉంది. ఈ తీగ 3–4 మీటర్ల కన్నా పొడవుగానే పెరుగుతుంది. తీగ సాధారణంగా ఆకుపచ్చగా ఉంటుంది. కొన్ని రకాల వింగ్డ్ బీన్ జాతుల తీగ ఊదా, గులాబీ, గోధుమ రంగుల్లో కూడా ఉంటాయి. పూలు తెలుపు నుంచి ముదురు ఊదా రంగు, నీలం, నీలం తెలుపు కలగలపు రంగుల్లో ఉంటాయి. కాయలు నాలుగు పలకలుగా 15-22 సెం.మీ. ΄ పొడవున 2-3 సెం.మీ. వెడల్పున ఉంటాయి. కాయలో 5 నుంచి 20 గుండ్రటి గింజలుంటాయి. ఎండిన తర్వాత ముదురు గోధుమ రంగులో ఉంటాయి. వింగ్డ్ బీన్ పంటలో ఎక్కువ రకాలు న్యూగినియా, మారిషస్ దేశాల్లో కనిపిస్తాయి. మన దేశంలో అస్సాం, మణిపూర్, మిజోరం, కేరళ, తమిళనాడు, కర్ణాటకల్లో ఎక్కువగా దీన్ని సాగు చేస్తున్నారు. ఉత్తరాది మైదాన ప్రాంతాల్లోనూ మంచి దిగుబడినిస్తున్నట్లు రుజువైంది. తెలుగు రాష్ట్రాల్లో కొంతమందికి తప్ప పెద్దగా ప్రాచుర్యంలోకి రాని పంట ఇది.పుష్కలంగా పోషక విలువలువచ్చే కాలంలో మన ప్రాంతాల్లో కూడా బాగా ్ర΄ాచుర్యంలోకి తేదగిన అద్భుత పోషక విలువలు కలిగిన పంట వింగ్డ్ బీన్. ప ప్రొటీన్, పీచు, బీకాంప్లెక్స్ విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. మాంసకృత్తులు, ఖనిజాలు, విటమిన్లు తగుపాళ్లలో వింగ్డ్ బీన్స్‌లో ఉన్నయి. థయామిన్, పైరిడాక్సయిన్ (విటమిన్ బి–6), నియాసిన్, రిబోఫ్లావిన్ వంటి బికాంప్లెక్స్ విటమిన్లు ఉన్నాయి. ఇనుము, రాగి, మాంగనేసు, కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటి అవసరమైన ఖనిజాలు ఉన్నాయి. వింగ్డ్ బీన్ ఆకుల్లో పీచు, విలమిన్ ఎ, సి, ఖనిజాలు ఉన్నాయి. వంద గ్రాముల తాజా ఆకుల్లో 45 మిల్లీ గ్రాముల విటమిన్ సి (రోజువారీ అవసరంలో ఇది 75%), 8090 ఇంటర్నేషనల్ యూనిట్ల (ఐయు) విటమిన్ ఎ (270% ఆర్డిఎ) ఉంటాయి. లేత వింగ్డ్ బీన్ కాయల్లో ఫొలేట్స్ పుష్కలంగా ఉంటాయి. వంద గ్రాముల బీన్స్‌లో 66 మైక్రో గ్రాముల (రోజుకు మనిషికి రోజువారీ అవసరంలో ఇది 16.5%) ఫొలేట్స్ ఉంటాయి. డిఎన్ఎ సంశ్లేషణకు, కణ విభజనకు విటమిన్ బి–12తో ΄ాటు ఫొలేట్స్ అతి ముఖ్యమైనవి. గర్భం దాల్చే సమయం నుంచి ప్రసవం వరకు తల్లికి ఫొలేట్స్ లోపం లేకుండా ఉంటే బిడ్డకు న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ రావు. వంద గ్రాముల తాజా వింగ్డ్ బీన్స్‌లో 18.3 మిల్లీ గ్రాముల (రోజువారీ అవసరంలో 31%) విటమిన్ సి ఉంటుంది. విటమిన్ సి నీటిలో కరిగే యాంటీఆక్సిడెంట్. ఇన్ఫెక్షన్లకు తట్టుకునే రోగనిరోధక శక్తిని కలిగించటంలో తోడ్పడుతుంది. రక్త నాళాలకు సంకోచ వ్యాకోచ గుణాన్ని ఇస్తుంది. ఆహారంలో తగినంతగా తీసుకుంటే కేన్సర్ల నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది. వింగ్డ్ బీన్స్ అతి తక్కువ కేలరీలతో కూడిన కూరగాయ. వంద గ్రాముల్లో 49 కేలరీలు మాత్రమే ఉంటాయి.అతివృష్ఠినీ తట్టుకుంటుంది!కరువు కాటకాలను, వరదలను, తీవ్ర ప్రతికూల వాతావరణాన్ని, చీడపీడలను తట్టుకొని దిగుబడినివ్వగలగటం అనే లక్షణం వాతావరణ మార్పుల నేపథ్యంలో మిగతా ప్రధాన పంటలు దెబ్బతిన్న పరిస్థితుల్లో కూడా వింగ్డ్ బీన్స్ నిరాశపరచదని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రజలకు ఆహార కొరత, ΄పౌకాహార లోపాన్ని సరిదిద్దే క్రమంలో తోడ్పడే పంటగా దీన్ని చాలా ప్రాంతాల్లో విస్తృతంగా సాగు చేయించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. దీని ఆకులు, కాయలు, గింజలు, దుంపల్లాంటి వేర్లను తినటానికి వీలుంది. మిగిలిన తీగను పశుగ్రాసంగా వాడుకోవచ్చు. నత్రజనిని స్థిరీకరిస్తుంది కాబట్టి పంట మార్పిడికి ముఖ్యమైన పంటగా ఇది గుర్తింపు పొందింది. ఇది ప్రధానంగా స్వీయపరాగ సంపర్క పంట. మహా అయితే 7.6% మేరకు పరపరాగ సంపర్కం జరుగుతున్నట్లు గుర్తించారు. వింగ్డ్ బీన్స్ పంట అనావృష్టిని, అతివృష్టిని కూడా తట్టుకుంటుంది. 700 మిల్లీ మీటర్ల నుంచి 4100 ఎం.ఎం. వార్షిక వర్షపాతాన్ని తట్టుకుంటుంది. ఉష్ణోగ్రత 15.4 – 27.5 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రతను ఇష్టపడుతుంది. మెత్తని దుక్కి చేసి విత్తుకుంటే వేరు వ్యవస్థ విస్తరించడానికి వీలుగా ఉంటుంది. ఇసుక నేలల నుంచి లోతైన రేగడి నేలలు, నీరు నిలబడని ఎర్ర నేలలు, సేంద్రియ పదార్థం బాగా ఉన్న నేలలు అనుకూలం. 4.3–7.5 మధ్య ఉదజని సూచిక ఉన్న నేలలు అనుకూలం. సెప్టెంబర్ మధ్య నుంచి అక్టోబర్ మధ్యలో పూత వస్తుంది. 18 డిగ్రీల కన్నా తక్కువ, 32 డిగ్రీల సెల్షియస్ కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటే పూత రాదు. సముద్రతలం నుంచి 2,000 మీటర్ల ఎత్తు వరకు గల ప్రాంతాల్లో ఈ పంట బాగా పెరుగుతుంది (హైదరాబాద్ 542 మీ. ఎత్తులో ఉంది). కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో ఖరీఫ్‌లో విస్తారంగా సాగు చేయటానికి, తోటల్లో అంతరపంటగా సాగు చేయటానికి ఇది అనుకూలమైన పంట. విత్తుకోవచ్చు. కాండం ముక్క పెట్టినా వస్తుంది. హెక్టారుకు 15–20 కిలోల విత్తనాలు అవసరం. విత్తనం పైన గట్టి పెంకులాంటి పొర ఉంటుంది. 1-2 రోజులు నానబెట్టి, 3-4 సెం.మీ. లోతులో విత్తుకోవాలి. 5-7 రోజుల్లో మొలకెత్తుతుంది. 25 డిగ్రీల సెల్షియస్ పగటి ఉష్ణోగ్రత ఉన్న కాలంలో చక్కగా పెరుగుతుంది. ఉత్తర–దక్షిణ నిలువు పందిళ్లకు తీగలు పాకిస్తే ఎండ బాగా తగిలి బాగా పెరుగుతుంది. కూరగాయ పంటగా సాగు చేసేటప్పుడు 90 సెంటీమీటర్లు (36 అంగుళాలు)“ 90 సెంటీమీటర్లు దూరంలో విత్తుకోవాలి. విత్తన పంటగా అయితే 45 సెం.మీ.“ 45 సెం.మీ. దూరంలో విత్తుకోవాలి. తీగ 3-4 మీటర్ల కన్నా తక్కువ పెరిగే రకాలైతే 30 సెం.మీ. “ 20 సెం.మీ. దూరంలో నాటుకోవచ్చు. రుతుపవనాలు వచ్చిన తర్వాత జూన్–జూలైల్లో నాటుకోవాలి. వింగ్డ్ బీన్ వేరు దుంపలను కూడా ఆహారంగా వాడుతారని చెప్పుకున్నాం కదా. దుంపల కోసం సాగు చేసేటప్పుడు ఆగస్టు–సెప్టెంబర్ మధ్య ఆలస్యంగా విత్తుకుంటే రొట్ట ఎక్కువ పెరగకుండా వేరు ఎక్కువ పెరుగుతుంది.నత్రజని తక్కువ నేలలైనా.. నత్రజనిని భూమిలో స్థిరీకరిస్తుంది కాబట్టి వింగ్డ్ బీన్స్ పంటను సారం తక్కువగా ఉన్న నేలల్లోనూ విత్తుకోవచ్చు. హెక్టారుకు 20 టన్నుల మాగిన పశువుల ఎరువుతోపాటు 50:80:50 కిలోల ఎన్.పి.కె. ఎరువులు హెక్టారుకు వేసుకోవాలి. నత్రజనిని మాత్రం రెండు భాగాలుగా చేసి, ఒక భాగాన్ని విత్తనానికి ముందు, రెండో భాగాన్ని 40–60 రోజుల మధ్య వేసుకోవాలి.నెలలోనే కమ్మేస్తుంది!వింగ్డ్ బీన్స్ తీగ విత్తిన నెల రోజుల్లోనే వేగంగా పెరిగి పొలం అంతా కమ్మేస్తుంది. విత్తిన తర్వాత 15–20 రోజులకు ఒకసారి కలుపు తీస్తే చాలు. వేరు దుంపల కోసం సాగు చేస్తే నేల మీదే పాకించవచ్చు. కూరగాయ పంటగా, విత్తనాల పంటగా సాగు చేసుకుంటేపాదులను ఒక మోస్తరు ఎత్తు గల ఊత కర్రలకు పాకిస్తే కాయలు కోసుకోవటానికి వీలుగా ఉంటుంది. అధిక దిగుబడి వస్తుంది. తుప్పు తెగులు, ఆకుమచ్చ వంటి శిలీంధ్ర తెగుళ్లు తప్ప మిగతా తీవ్రమైన చీడపీడలేవీ ఈ పంటకు సోకవు. రూట్‌నాట్ నెమటోడ్స్ సమస్య ఉండొచ్చు. అవసరాన్ని బట్టి తగిన సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి.చదవండి: ఒక్క రక్త పరీక్ష : రానున్న పదేళ్లలో మన మరణం గుట్టు! కొత్త పరిశోధనఐరన్ లోపానికి అర్క ఐరన్ ఫార్టిఫైడ్ మష్రూమ్ హెక్టారుకు 5–10 టన్నులువిత్తుకున్న 10 వారాలకు ఆకుపచ్చని వింగ్డ్ బీన్స్ కూరగాయలను కోసుకోవచ్చు. హెక్టారుకు 5–10 టన్నుల వరకు తాజా కాయలతోపాటు అంతే బరువైన వేరు దుంపల దిగుబడి వస్తుంది. విత్తనాలైతే హెక్టారుకు 1 నుంచి 1.5 టన్నుల దిగుబడి వస్తుంది. తాజా వింగ్డ్ బీన్స్ కూరగాయలను ప్లాస్టిక్ బాగ్స్‌లో కట్టి 10 డిగ్రీల సెల్షియస్, 90% తేమ గల చోట నిల్వ చేస్తే 4 వారాల వరకు బాగుంటాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకోవటం,పౌష్టిక విలువలతో కూడిన పంట కావటంతో వింగ్డ్ బీన్స్ పంట భవిష్యత్తులో విస్తారంగా సాగులోకి తేవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం సాగవుతున్న రాష్ట్రాల్లో నుంచి అనువైన రకాలను సేకరించి తెలుగు రాష్ట్రాల్లోని ఉద్యాన పరిశోధనా సంస్థలు పరిశోధన చేసి స్థానికంగా రైతులకు విత్తనాలను అందుబాటులోకి తేవాలి. ప్రభుత్వం విధానాల ద్వారా ఈ పంట వ్యాప్తికి దోహదం చేయాలి. -
ఆముదంతో చర్మం, జుట్టు సమస్యలకు చెక్ పెట్టొచ్చిలా!
బంకబంకగా జిగురుగా ఉండే ఆముదం చూడగానే ముట్టుకోవడానికి ఇష్టపడం.. కానీ ఇది అందానికి, కురుల సంరక్షణలో అద్భుత ప్రయోజనాలను అందిస్తుంది. ఆరోగ్య పరంగా కూడా ఎంతో మేలు. దీన్ని సంప్రదాయ వైద్య విధానంలో కూడా ఉపయోగిస్తారు. అన్ని ప్రయోజనాలని అందించే ఈ ఆముదం నూనెని జుట్టు, చర్మం సంరక్షణ కోసం ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.టేబుల్ స్పూను ఆముదం, టేబుల్ స్పూను కొబ్బరి నూనెలను కలిపి వేడి చేసి గోరువెచ్చగా అయిన తరవాత మాడుకు పట్టించి పదినిమిషాల పాటు మర్దన చేయాలి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే.. చుండ్రు తగ్గడంతోపాటు, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.పొడిబారిన చర్మానికి సైతం ఆముదం మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. బాడీ లోషన్స్‌కు బదులు ఆముదాన్ని రాసుకుంటే మరింత మంచిది.గోరువెచ్చని ఆముదాన్ని పలుచగా ఉన్న కనుబొమ్మలకు రాసి రెండు నిమిషాలు మర్దన చేసి ఉదయం కడిగేయాలి. ఇలా కొన్నిరోజులపాటు క్రమం తప్పకుండా చేస్తే కనుబొమ్మలు ఒత్తుగా కనిపిస్తాయి.రాత్రి పడుకునే ముందు ఆముదాన్ని పెదవులకు రాసి మూడు నిమిషాలపాటు మర్దన చేయాలి. చిన్న బాక్స్‌లో ఆముదాన్ని ΄ోసుకుని రోజులో అప్పుడప్పుడు లిప్‌బామ్‌లా రాసుకుంటూ ఉంటే పెదవులు మృదువుగా, పింక్ కలర్లోకి మారతాయి. క్లెన్సర్లు, లోషన్లు, సౌందర్య సాధనాలలో విస్తృతంగా ఈ ఆముదాన్ని ఉపయోగిస్తారు.దీనిలో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీమైక్రోబయల్ లక్షణాలు కాలిన గాయాలు, ప్రెజర్ అల్సర్లు, డయాబెటిక్ అల్సర్లు, శస్త్రచికిత్సా గాయాలకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది. ఇది జుట్టును లూబ్రికేట్ చేయడంలో సహాయపడుతుంది. జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. ఇందులోని ఒలీక్, లినోలిక్ యాసిడ్ రక్త ప్రసరణను పెంచి మీ జుట్టును బలంగా, మృదువుగా మార్చుతాయి.(చదవండి: బీపీ-హైబీపీకి మధ్య తేడా ఏంటి..? వంశపారపర్యంగా వస్తుందా..?) -
అతడి వెయిట్‌లాస్ జర్నీకి నటుడు హృతిక్ రోషన్ ఫిదా..!
ఎందరో తమ వెయిట్ లాస్ జర్నీతో స్ఫూర్తిని రగులుస్తున్నారు. బరువు తగ్గడం ఏమి భారం కాదని చేతలతో నిరూపిసతున్నారు. అంతేగాదు కొందరూ అచంచలమైన దీక్షతో బరువు తగ్గి ఊహించని రీతీలో స్మార్ట్‌గా మారి సెలబ్రిటీల చేత గ్రేట్ చేత ప్రశంసలందుకుంటున్నారు. అలాంటి కోవకు చెందినవాడే ఫిట్నెస్ ఇన్‌ప్లుయెన్సర్ ఫుర్కాన్ ఖాన్. అతడు అంతలా ఓపికతో వ్యహరించి మరీ బరువు తగ్గిన తీరు నెటిజన్లందరినే గాక బాలీవుడ్ ప్రసిద్ధ నటుడుని సైతం ఇంప్రెస్ చేసింది. 23 ఏళ్ల ఫుర్కాన్ ఖాన్ తన ఫిట్నెస్ జర్నీని డాక్యుమెంట్ రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఆ వీడియోకి 'ఓపికతో కసరత్తులు చేస్తూనే ఉండండి' అనే క్యాప్షన్‌తో తన వెయిట్ లాస్ జర్నీ వీడియోలు షేర్ చేసేవాడు. ఆ వీడియోలో పుర్కాన్ జనవరి 19 2024 జిమ్‌లో చేరిన 9 రోజుల తర్వాత అనే క్లిప్‌తో ప్రారంభమవుతుంది. ఒక ఏడాది క్రితం తాను ఎలా ఉన్నాడో చూపిస్తూ తన ఫిట్నెస్ జర్నీని గురించి వివరిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. అయితే అంతలా జిమ్‌లో వర్కౌట్లు చేసినా ఫలితం మాత్రం త్వరగా రాదు. అయినా స్కిప్ చేయకుండా కష్టపడుతున్న తీరు వీడియోలో కనిపిస్తుంటుంది. మొదటి మూడు నుంచి నాలుగు నెలల్లో పెద్ద మార్పు కనిపించదు. శరీరాన్ని ఫిట్‌గా నిర్మించుకోవడానికి సంవత్సరాలు పట్టినా సరే.. మనం మాత్రం మన వర్కౌట్లు స్కిప్ చేయకూడదని చెబుతుంటాడు. ఓపిక అనేది అత్యంత ముఖ్యమని నొక్కి చెబుతుంటాడు. అయితే అలా చేయగా చేయగా.. ఫుర్కాన్ శరీరంలో చక్కటి మార్పు కనిపిస్తూ ఉంటుంది. చివరగా ఏది ఒక్క రోజులో జరగదనేది బాగా గుర్తించుకోండి అంటూ ముగిస్తాడు వీడియోలో. అతడి విజయవంతమైన వెయిట్ లాస్ జర్నీకి నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున సానుకూల స్పందన రావడమే గాక స్వయంగా హృతిక్ రోషన్ నుంచే మన్ననలను అందుకోవడం విశేషం. హృతిక్ సదరు ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ ఫుర్కాన్ని "మీరు బాగా చేశారు" అంటూ సోషల్ మీడియాలో ప్రశంసించారు. దీంతో నెటిజన్లు బ్రో గ్రీకు దేవుడు హృతిక్ నుంచే ప్రశంసలు అందుకున్నావు కదా..! నువ్వు గ్రేట్ అంటూ మెచ్చుకోగా, మరొకరు స్థిరత్వం, క్రమశిక్షణ ఎంత గొప్పవనేది తెల్తుస్తుందంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Furkan Khan (@flexwithfurru) (చదవండి: ఝుమైర్ నృత్యం అంటే..? ఈ వేడుకకు ప్రధాని మోదీ, జైశంకర్‌లు..) -
వల్లభనేని వంశీ హెల్త్ పిటిషన్ పై ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు ఆదేశాలు
-
సంతానోత్పత్తికి పోషకాహారం కీలకం.. గైనకాలజిస్ట్ డాక్టర్ రిజ్వానా అత్తర్
సంతానోత్పత్తి విషయంలో సమతుల ఆహారానికి అత్యంత ప్రాధాన్యత ఉందని ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ రిజ్వానా అత్తర్ పేర్కొన్నారు. పోషకాలతో నిండిన ఆహారం గర్భధారణ అవకాశాలను పెంచుతుందని వివరించారు. అదేవిధంగా మెరుగైన ఆరోగ్యం కూడా సంతానోత్పత్తికి అవసరమని, గర్భధారణకు ముందు, ఆరోగ్యకరమైన గర్భధారణ సమయంలో శరీరాన్ని సిద్ధం చేయడంలో పోషకాహార పద్ధతులను పాటించాలన్నారు. కొన్ని పోషకాలు తల్లి, పిండం ఆరోగ్యానికి ఎంతో కీలకమని చెప్పారు. !సంతానోత్పత్తికి పోషకాహారం అంటే కేవలం ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే కాదనీ, పునరుత్పత్తి జీవక్రియలను కూడా మెరుగుపరచడానికి, ఆరోగ్యకరమైన శిశువు పెరుగుదలకు తోడ్పడుతుందన్నారు.గర్భిణీ స్త్రీలకు పోషక అవసరాలు వివిధ రకాల విటమిన్లు, ఖనిజాలు, స్థూల పోషకాలను కలిగి ఉంటాయని తెలిపారు. వీటిలో ముఖ్యమైన అంశాలలో ఫోలిక్ ఆమ్లం, ఇనుము, కాల్షియం మరియు ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు ఉన్నాయని, ఇవి తల్లి, బిడ్డ శ్రేయస్సులో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని వెల్లడించారు.ఫోలిక్ ఆమ్లం: న్యూరల్ ట్యూబ్ లోపాలను నివారించడంలో ముఖ్యమైనది.ఇనుము: ఆక్సిజన్ రవాణాకు అవసరమైన ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని సులభతరం చేస్తుంది.కాల్షియం: ఆరోగ్యకరమైన ఎముకలకు అవసరం.ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు: మెదడు మరియు కళ్ళు ఏర్పడటానికి సహాయపడుతుంది.గర్భధారణ ఫలితాలను మెరుగుపరచడానికి అలాగే సాధారణ తల్లి శ్రేయస్సును నిర్ధారించడానికి ఈ పోషకాల సమతుల్య వినియోగం ముఖ్యం.పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, ఎండోమెట్రియోసిస్, హార్మోన్ల రుగ్మతలతోపాటు, పోషకాహారం కూడా ముఖ్యమైన అంశం. మహిళల్లో, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వులను ఆహారంలో తీసుకోవడం వల్ల పీరియడ్స్ సజావుగా సాగుతాయని, ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపరచడానికి సహాయపడుతుందన్నారు.ఎన్డోడోమెట్రియోసిస్ ఉన్న మహిళల్లో, ఆకుకూరలు, బెర్రీలు, గింజలను ఆహారంగా తీసుకోవాలన్నారు.సంతానోత్పత్తిలో ఆహారం యొక్క ప్రాముక్యతను ప్రముఖ నిపుణురాలు గైనకాలజిస్ట్ డాక్టర్ రిజ్వానా అత్తర్ వివరించారు. ప్రణాళికాబద్దంగా ఆరోగ్యకరమైన ఆహారం తినడంతో పాటు మీ శరీరానికి పునరుత్పత్తి ప్రక్రియలను పెంచడానికి, ఎండోమెట్రియోసిస్ వంటి పరిస్థితులకు చికిత్స చేయడం ద్వారా సంతాన ఉత్పత్తి ఫలితాలు మెరుగుపడతాయి. సరైన పోషకాలతో ఆరోగ్యకరమైన గర్భధారణ, ఆరోగ్యకరమైన శిశువు అభివృద్ధికి దారితీస్తుందన్నారు.సంతానోత్పత్తికి పోషకాహారం పునాది వంటిదని, ఇది గర్భధారణ, ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చే వరకు దోహదపడుతుందన్నారు. విటమిన్లు, ఖనిజాలు, మైక్రోన్యూట్రియెంట్స్ వంటి కీలకమైన పోషకాలను సమతుల్యంగా తీసుకోవడంపై దృష్టి పెట్టడం ద్వారా, మహిళలు సరైన ఆరోగ్యాన్ని పొందవచ్చు. శిశువు అభివృద్ధిని ప్రోత్సహించవచ్చు. అలాగే, ఎండోమెట్రియోసిస్, హార్మోన్ల రుగ్మతలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.ఆలివ్ హాస్పిటల్ గురించి:తెలంగాణలో రాష్ట్ర స్థాయిలో ఆలివ్ హాస్పిటల్స్ అధునాతన వైద్య సంరక్షణకు కృషి చేస్తుంది. సమగ్ర ఆరోగ్య సంరక్షణ, నాణ్యమైన వైద్యాన్ని నిబద్ధతతో . 2010 నుండి అందిస్తోంది. విశ్వసనీయమైన వైద్యం అందించాలని లక్ష్యంతో కట్టుబడి ఉంది. మొత్తం మానవాళికి ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణను అందుబాటులోకి తీసుకురావడంలో గత 15 సంవత్సరాలుగా నిరంతరం కృషి చేస్తోంది. అత్యుత్తమ ప్రతిభతో ఆలివ్ హాస్పిటల్ తెలంగాణలోని ప్రముఖ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులలో ఒకటిగా మారింది. ఆలివ్ హాస్పిటల్ 210 పడకల, అత్యాధునిక మల్టీస్పెషాలిటీ హెల్త్‌కేర్ సౌకర్యం వివిధ స్పెషాలిటీలలో విస్తృత శ్రేణి వైద్య సేవలను అందిస్తుంది, కార్డియాక్ కేర్, ఎమర్జెన్సీ సర్వీసెస్, న్యూరో కేర్, కిడ్నీ కేర్, యూరాలజీ, ఆర్థోపెడిక్స్, జాయింట్ రీప్లేస్మెంట్స్, గైనకాలజికల్ సర్వీసెస్, అడ్వాన్స్డ్ డయాగ్నస్టిక్స్, ఇంటర్వెన్షనల్ సర్వీసెస్ వంటి రంగాలలో అనేక అధునాతన విధానాలలో మార్గదర్శకత్వం వహించింది. తాజా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడానికి, సమర్థులైన వైద్యులను నియమించుకోవడానికి కట్టుబడి ఉండటం వలన భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ నాణ్యత యొక్క బంగారు ప్రమాణం అయిన నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ – హెల్త్‌కేర్ నుండి జాతీయ స్థాయి గుర్తింపు పొందింది. -
మూత్రంలో రక్తపు చార కనిపిస్తోందా?
మూత్రవిసర్జన సమయంలో రక్తపు చార కనిపించడం ఎవరిలోనైనా ఆందోళన కలిగించే అంశమే. అయితే అంతగా బెంబేలు పడాల్సిన అవసరం లేదు. సాధారణంగా మూత్రంలో ఇన్ఫెక్షన్ (యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్), కిడ్నీలో రాళ్లు ఉండటం వల్ల ఇలా జరగవచ్చు. కాకపోతే మూత్రవిసర్జన సమయంలో రక్తం కనిపిస్తున్నవారు మాత్రం ఒకసారి ఫిజీషియన్ లేదా యూరాలజిస్ట్‌ను సంప్రదించి... మూత్రపరీక్షలు, అబ్డామిన్ స్కానింగ్ తప్పక చేయించుకోవాలి. అవసరమైతే ఐవీపీ (ఇంట్రావీనస్ పైలోగ్రామ్) వంటి పరీక్షలూ చేయించాల్సిరావచ్చు. ఆ పరీక్షల్లో నిర్ధారణ (డయాగ్నోజిస్) అయిన జబ్బును బట్టి చికిత్స ఉంటుంది. కాకపోతే మరీ భయాందోళనలు అక్కర్లేదుగానీ... తక్షణం డాక్టర్‌ను సంప్రదించడం మాత్రం అవసరమని గుర్తించాలి. (చదవండి: మెనోపాజ్ నిద్రలేమికి లింకప్ ఏమిటి) -
పైల్స్, మలబద్దకం సమస్యలు ఉంటే ప్రెగ్నెన్సీ టైంలో ఇబ్బందా..?
నాకు ఇప్పుడు ఏడవ నెల. పైల్స్ ముందు నుంచి ఉన్నాయి. ఇప్పుడు రోజూ బ్లీడ్ అవుతున్నాయి. మలబద్ధకం కూడా ఉంది. ఎలాంటి చికిత్స అవసరం ఉంటుంది? – మీనాక్షి, అనంతపురం. మొలలు లేదా పైల్స్ అనేవి మలద్వారం లేదా వివిధ వీనస్ రెక్టమ్‌లో వాపు వస్తే ప్రెగ్నెన్సీలో మలబద్ధకం ఇంకా పెరిగి బ్లీడింగ్ అవుతుంది. ఇది చాలామందిలో చూస్తాం. ప్రతి ముగ్గురిలో ఒకరికి ఇవి ఉంటాయి. మలవిసర్జన సమయంలో నొప్పి, మంట ఉంటుంది. ఇలా బ్లీడింగ్ అవకుండా ఉండాలంటే నీళ్లు ఎక్కువ తాగటం, పండ్ల రసాలు తీసుకోవటం మంచిది. పీచుపదార్థాలతో కూడిన ఆహారం తీసుకోవాలి. వీటి ద్వారా ప్రెగ్నెన్సీలో పైల్స్ బయటకు కనిపించవు. కేవలం రెక్టల్ ఎగ్జామినేషన్‌లో తెలుస్తుంది. ఎక్స్టర్నల్ పైల్స్ బయటికి కనిపిస్తాయి. వీటితో బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. గర్భంలో శిశువు పెరిగే కొద్దీ బరువు మోషన్ ప్లేస్‌లో పడుతుంది. మలబద్ధకం వలన మలవిసర్జన సమయంలో ముక్కడం, ఒత్తిడి చేసినప్పుడు ఈ పైల్స్ మరింత ఎక్కువ అవుతాయి. ప్రెగ్నెన్సీ చివరి మూడు నెలల్లో ఈ లక్షణాలు పెరుగుతాయి. అందరికీ ఇలాగే ఉండకపోవచ్చు. కేవలం సమస్య అయితేనే వీటికి చికిత్స చేయాలి. ప్రెగ్నెన్సీలో అన్నీ మందులు వాడటం మంచిది కాదు. కాబట్టి, నివారణ పద్ధతులను సూచిస్తాం. ఐస్ ప్యాక్స్‌తో మోషన్ ఏరియాలో నొప్పి తగ్గించుకోవాలి. ఫ్రీ మోషన్ అయేటట్టు లాక్సేటివ్స్ ఇస్తాము. పారాసిటమాల్ లాంటి టాబ్లెట్స్‌కి నొప్పి తగ్గుతుంది. హెమరాయిడ్ క్రీమ్స్ కొన్ని దురుద, నొప్పి, మంటను తగ్గిస్తాయి. వాటిలో ఎక్కువ స్టెరాయిడ్ లేని క్రీమ్స్ సూచిస్తాం. లోకల్ అనస్థీíషియా జెల్స్ కూడా వాడొచ్చు. కొంతమందికి పైల్స్ లేకుండా కూడా మోషన్ ప్లేస్‌లో బ్లీడింగ్ కావచ్చు. అప్పుడు వెంటనే గైనకాలజిస్ట్‌ను కలవాలి. అవసరానికి బట్టి కొలనోస్కోపీ సజెస్ట్ చేస్తారు. అందుకే, వెంటనే డాక్టర్ని కలవాలి. సాధారణ కాన్పులో పుషింగ్ టైమ్‌లో పైల్స్ మీద ఒత్తిడి ఎక్కువ పడి, బ్లీడ్ కావచ్చు. అందుకే డాక్టర్ పర్యవేక్షణలో డెలివరీ చేయించుకోవాలి. డెలివరీ అయిన వెంటనే ఒత్తిడి తగ్గుతుంది. కాబట్టి పైల్స్ చాలామందికి తగ్గిపోతాయి. లైఫ్ స్టయిల్లో మార్పులు చేసుకోవాలి. హెమరాయిడ్స్‌కి లోకల్ క్రీమ్స్, సపోజిటరీస్ ప్రెగ్నెన్సీ, బ్రెస్ట్ ఫీడింగ్ సమయంలో జాగ్రత్తగా వాడాలి. పండ్లు, కూరగాయలు ఎక్కువ తీసుకోవాలి. తరచు వ్యాయామం చేయాలి. ఎక్కువసేపు కూర్చోవటం, నిలబడి ఉండటం చేయకూడదు. డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్హైదరాబాద్ (చదవండి: మెనోపాజ్‌లో నిద్రలేమితో సతమతమవుతున్నారా..? బీకేర్‌ఫుల్..!) -
'మే'నిగనిగలకు కేర్ తీసుకుందామిలా..!
ఒక మహిళ తాలూకు ఆరోగ్యం ఎలా ఉందన్నది ఆమె మేని చాయ, నిగారింపు లాంటి అంశాలు పట్టి చూపుతాయి. ఆమె వయసుకూ, హార్మోన్ల సమతౌల్యతకూ, ఆరోగ్యకరమైన జీవనశైలికీ ఆమె చర్మం ప్రతిబింబం. కౌమార దశ నుంచి మెనోపాజ్ వచ్చేవరకు ప్రతి దశనూ ఆమె చర్మం ఓ అద్దంలా చూపిస్తూ ఉంటుంది. ప్రతి వాళ్ల చర్మమూ ప్రధానంగా (బ్రాడ్‌గా) జిడ్డు చర్మం, నార్మల్ లేదా పొడి చర్మం అనే మూడింట్లో ఏదో ఒకటిగా ఉంటుంది. ఓ మహిళది ఆయిలీ స్కిన్ అయితే... వయసు పెరుగుతున్న కొద్దీ అది క్రమంగా ఆయిలీ నుంచి నార్మల్కు మారవచ్చు. అదే... మరొకరి విషయంలో నార్మల్ స్కిన్ అయితే... అది నార్మల్ నుంచి పొడి చర్మానికి మారవచ్చు. ఆయా వయసుల్లో చర్మంలో వచ్చే మార్పులేమిటి, ప్రతికూల మార్పుల నుంచి రక్షణ పొందడమెలా, సుదీర్ఘకాలం పాటు చర్మ రక్షణ ఎలాగో తెలుసుకుందాం. వేర్వేరు వయసుల్లో చర్మంలో వచ్చే మార్పులెలా ఉంటాయో, వాటిని అధిగమించి మేనిని ఆరోగ్యంగా ఉంచుకునే రక్షణ చర్యలేమిటో చూద్దాం. టీనేజ్‌లో (అంటే 13 నుంచి 19 ఏళ్ల వయసు వరకు)...ఈ వయసులోనే అమ్మాయిల్లో రుతుక్రమం మొదలవుతుంది. ఈ టైమ్‌లో వాళ్లలో ఈస్ట్రోజెన్, యాండ్రోజెన్ హార్మోన్ల మోతాదులు మారిపోతాయి. దాంతో చర్మం కాస్తంత జిడ్డుగా (ఆయిలీగా) మారుతుంది. ఫలితంగా మొటిమలు, బ్లాక్‌హెడ్స్ కనిపిస్తాయి. కొందరిలో ఆ మొటిమలు పగిలిపోతాయి. ఇవి ముఖ్యంగా ముఖంలోని నుదురు, ముక్కు, చుబుకం వంటి టీ–జోన్లో ఇవి వస్తుంటాయి.రక్షణ ఇలా: ఇలాంటి మొటిమల నుంచి చర్మాన్ని రక్షించుకోవడం కోసం... జిడ్డు తొలగి΄ోయేలా మైల్డ్ సోప్‌తో ముఖం కడుక్కుంటూ ఉండటం, అన్ని పోషకాలు అందేలా సమతులాహారం తీసుకోవడం, కొవ్వులు, నూనెలు ఉన్న ఆహారాన్ని తక్కువగా తీసుకుంటుండటం, వీలైతే డాక్టర్ సలహాతో జిడ్డు తొలగేందుకు తగిన క్లెన్సింగ్ ఉత్పాదనలు వాడటం చేయాలి. 20 నుంచి 30 ఏళ్ల వయసు వరకు... హార్మోన్లలో సమతౌల్యత ఏర్పడే వయసు ఇది. ఈ సమయంలో జిడ్డు చర్మం చాలా వరకు నార్మల్ అయ్యే అవకాశముంది. అయితే ఈ వయసులో కొన్ని రకాల ఒత్తిడులు పెరగడం జరుగుతుంది. మొదట్లో అంతగా క్రమబద్ధంగా లేని రుతుక్రమం కాస్త ఓ గాడిన పడి, క్రమం తప్పకుండా రావడం మొదలవుతున్నప్పటికీ అయితే అప్పుడప్పుడూ కొన్నిసార్లు క్రమం తప్పడమూ కనిపిస్తుంది. ఈ వయసులోనే మహిళల గర్భధారణ జరగడం మామూలు. అలాంటి సందర్భాల్లో కొందరిలో ముఖం మీద నల్లమచ్చల్లా వచ్చే ‘క్లోయాస్మా’ అనే పిగ్మెంటేషన్ (మెలాస్మా లాంటిదే) గోధుమరంగులో ముఖం మీద కనిపిస్తుంది. రక్షణ ఇలా: ప్రధానంగా ఈ వయసులో ఉండే ఒత్తిడిని రిలాక్సేషన్ టెక్నిక్స్‌తో అధిగ మించి ప్రశాంతంగా ఉండాలి. ఇక గర్భధారణ సమయంలో కనిపించే పిగ్మెంటేషన్ గురించి అంతగా ఆందోళన కూడా అక్కర్లేదు. ప్రసవం తర్వాత దానంతట అదే తగ్గిపోయే అవకాశాలే ఎక్కువ. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే సమతులాహారం తీసుకుంటూ ఉండాలి. ఒంటికి తగినంత ద్రవాహారం అందేలా మంచినీళ్లు, కొబ్బరినీళ్ల వంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఎండలోకి వెళ్లేప్పుడు తప్పనిసరిగా ఎస్పీఎఫ్ ఉన్న సన్‌స్క్రీన్ ప్రతి రెండు మూడు గంటలకోమారు రాసుకుంటూ ఉండాలి. 40వ పడిలో... మహిళల్లో తమ నలభైల్లో ఈస్ట్రోజెన్ హార్మోన్ స్రవించే మోతాదు క్రమంగా తగ్గడం మొదలవుతుంది. దాంతో చర్మాన్ని బిగుతుగా ఉంచే కొలాజెన్ అనే ప్రోటీన్ తగ్గడం వల్ల చర్మం తమ బిగువు కోల్పోవడం మొదలై వదులుగా కనిపించడం ప్రారంభమవుతుంటుంది. ఈ కొలాజెన్, అలాగే దేహంలో ఉండే తేమ తగ్గుతుండటం వల్ల ముఖంలో, చర్మం ముడతలు పడే ప్రాంతాల్లో సన్నటి గీతలుగా కనిపించడం మొదలవుతుంది. ఆ గీతలు క్రమంగా లోతుగా మారడం, చర్మం బాగా వదులయ్యాక ముడతలుగా కనిపిస్తుంది.రక్షణ ఇలా: అందుకే ఇలా చర్మం డల్‌గా, వేలాడటం మొదలవ్వడానికి ముందే దేహానికి కొలాజెన్ అందించే మంచి ఆహారం, వేలడకుండా మంచి వ్యాయామం అందించాలి. తాము తీసుకునే పోషకాల్లో కొలాజెన్ అందించే ఆహారాలైన చేపలు, నట్స్, విటమిన్–సి పుష్కలంగా ఉండే తాజాపండ్లు తీసుకోవాలి. దీంతో చర్మం ఈ వయసులోనూ బిగుతుగా, మేనిలో మంచి మెరుపుతో ఉంటుంది. మరికొంతకాలం చర్మం యౌవనంతో కనిపిస్తుంటుంది. 50వ పడి మొదలుకొని... ఆ పైన...ఈ వయసులో మెనోపాజ్ వచ్చేందుకు అవకాశాలెక్కువ. దాంతో దేహంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ మోతాదు తగ్గుతుంది. చర్మం పలుచబారడం, పారదర్శకంగా మారుతుండటం దాంతో లోపలి రక్తనాళాలు కనిపిస్తున్నట్లుగా ఉండటం, చర్మం పొడిబారడం జరుగుతుంది. చర్మంపైన గీతలు మరింత లోతుగా మారుతూ, క్రమంగా ముడుతలు కనిపిస్తుంటాయి. ఫలితంగా ఏజింగ్ వల్ల వచ్చే మార్పులు మరింత స్పష్టమవుతుంటాయి. వయసు పైబడటం వల్ల కనిపించే అన్ని మార్పులూ వ్యక్తమవుతుంటాయి. ఈ వయసు రాగానే చర్మం తనంతట తాను రిపేర్ చేసుకునే సామర్థ్యం క్రమంగా తగ్గడం మొదలువుతుంది. రక్షణ ఇలా: ఈ ముడతలు కనిపించడం మరింత ఆలస్యమయ్యేలా చేసుకునేందుకు అవసరమైన కొన్ని ప్రక్రియలను అనుసరించాలి. ఇందులో భాగంగా... ఒమెగా– 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా దొరికే చేపల వంటి ఆహారాలు, అన్ని పోషకాలు అందే సమతులాహారం అవసరం. ఈ వయసులో తేమ తగ్గి చర్మం పొడిగా మారడం వల్ల గీతలు మరింత లోతుగా మారడం, ముడుతలు స్పష్టంగా కనిపించడం జరుగుతుంటాయి కాబట్టి దేహానికి అవసరమైన తేమను అందించేలా మాయిశ్చరైజర్ క్రీములు వాడాలి. ఇక చర్మం బిగుతుగా మారడానికీ, కొలాజెన్ తగ్గే ప్రక్రియ చాలా ఆలస్యంగా జరగడానికి బాగా తోడ్పడేది తగినంత వ్యాయామం. ఈ అన్ని వయసుల్లోనూ... ఆ వయసుకు తగినంత తీవ్రతతో శరీరానికి తగనంత శ్రమ తెలిసేలా వ్యాయామం చేయడం వల్ల చర్మం మరింత కాలం నిగారింపుతో, మరింత మెరుపుతో కనిపిస్తుంటుంది. వీటితోపాటు కాస్త ఏజింగ్ ఛాయలు కనిపిస్తుండగానే వాటిని ఆలస్యం చేయడానికి, చర్మం ఆరోగ్యంగా మంచి నిగారింపుతో కనిపించడానికి డర్మటాలజిస్టుల సలహా మేరకు వారికి సరిపడే కెమికల్ పీల్స్, మైక్రోనీడిలింగ్స్, ఆర్ఎఫ్, బొటాక్స్, ఫిల్లర్స్ వంటి పలు చికిత్సలు చేయించుకోవచ్చు.డా. విజయశ్రీ, సీనియర్ కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ (చదవండి: ‘ఫాఫో పేరెంటింగ్’ అంటే..? నెట్టింట వైరల్) -
అమ్మ అంజనాదేవికి అస్వస్థత.. స్పందించిన మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి అమ్మగారు అంజనాదేవి అస్వస్థత గురైనట్లు వచ్చిన వార్తలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. సోషల్ మీడియాలో వచ్చిన కథనాలపై ఆయన ట్వీట్ చేశారు. మా అమ్మ అస్వస్థతకు గురైందని కొన్ని మీడియా కథనాలు చూశానని వెల్లడించారు. అమ్మ కొద్దిపాటి అస్వస్థతకు గురైన మాట వాస్తవమేనని.. రెండు రోజుల ముందు నుంచే ఆమెకు ఆరోగ్యం కాస్తా బాగాలేదని స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేదని.. సంపూర్ణం ఆరోగ్యంతో ఉన్నారని చిరంజీవి తెలిపారు. అమ్మ ఆరోగ్యంపై ఎలాంటి ఊహాజనిత కథనాలు ప్రచురించవద్దని అన్ని మీడియాలకు విజ్ఞప్తి చేస్తున్నా అంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.కాగా.. అంతకుముందు మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి అస్వస్థత గురైనట్లు సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. అయితే కేవలం రెగ్యూలర్ చెకప్ కోసం మాత్రమే ఆసుపత్రికి వెళ్లినట్లు వారి కుటుంబ సన్నిహితులు తెలిపారు. కానీ సోషల్ మీడియాలో తీవ్ర అస్వస్థతకు గురైనట్లు కథనాలొచ్చాయి. దీంతో మెగాస్టార్ చిరు స్పందించారు. తాజాగా అమ్మ అంజనాదేవి ఆరోగ్యంపై అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇక సినిమాల విషయానికొస్తే మెగాస్టార్ ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు బింబిసార్ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. My attention is drawn to some media reports claiming our mother is unwell and is hospitalised. Want to clarify that she was a little indisposed for a couple of days. She is hale and hearty and is perfectly alright now. Appeal to all media not to publish any speculative reports…— Chiranjeevi Konidela (@KChiruTweets) February 21, 2025 -
హైదరాబాద్‌లో తొలిసారిగా ఆక్సిజన్ థెరపీ ఛాంబర్
హైదరాబాద్: నగరంలోని వైద్య చికిత్సలలో ఇదో సరికొత్త విప్లవం. నగరంలో ఇన్నాళ్లుగా అందుబాటులో లేని హైపర్బేరిక్ ఆక్సిజన్ థెరపీ (హెచ్‌బీఓటీ) సాయంతో 20 మందికి రాస్ మెడికల్ ఫిట్నెస్ సెంటర్ విజయవంతంగా చికిత్స అందించింది.హెచ్‌బీఓటీ అనేది ఒక నాన్ ఇన్వేజివ్ థెరపీ. ఇందులో ఆరోగ్యం కావాలనుకునేవారు ప్రెషరైజ్డ్ ఛాంబర్లో 100% స్వచ్ఛమైన ఆక్సిజన్ పీల్చుకుంటారు. దీనివల్ల శరీరం ఆక్సిజన్‌ను మరింత మెరుగ్గా స్వీకరిస్తుంది. ఈ ప్రక్రియ సెల్యులార్ మరమ్మతును వేగవంతం చేస్తుంది, యాంటీ ఏజింగ్ ప్రయోజనాలను ప్రోత్సహిస్తుంది. నాడీ, జీవక్రియ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది, మంటలను తగ్గిస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.. ఇలా మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ చికిత్సను ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వైద్య నిపుణులు, అథ్లెట్లు, వెల్నెస్ ఔత్సాహికులు విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో కూడా దాని ప్రయోజనాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి.సయ్యద్ ఖలీల్, ఫిజికల్ థెరపిస్ట్: "మేము హైదరాబాద్‌లో మొట్టమొదటి హెచ్‌బిఒటి (హైపర్బారిక్ ఆక్సిజన్ థెరపీ) ఛాంబర్‌ను పరిచయం చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఇది ‘మేక్ ఇన్ ఇండియా’ ఉత్పత్తి గా, ఆరోగ్య పునరుద్ధరణ మరియు యాంటీ-ఏజింగ్ పరిష్కారాలను విప్లవాత్మకంగా మార్చుతోంది. ఈ అత్యాధునిక చికిత్స ఆక్సిజన్ శోషణను పెంచి, మానవ శరీరపు స్వాభావిక నయం చేసే శక్తిని వేగవంతం చేస్తుంది మరియు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఒత్తిడి పెంచిన ఛాంబర్లో 100% శుద్ధ ఆక్సిజన్ శ్వాసించడం ద్వారా కణాల పునరుద్ధరణ మెరుగుపడి, వాపు తగ్గి, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నాడీ సంబంధిత ఆరోగ్యం, మెటాబాలిక్ ఆరోగ్యం, మరియు జీవనశైలి పునరుద్ధరణ వంటి అనేక ప్రయోజనాలతో, హెచ్‌బిఒటి ఆధునిక ఆరోగ్య సంరక్షణలో గేమ్-చేంజర్‌గా మారింది.రుజువైన ప్రయోజనాలు- యాంటీ ఏజింగ్, రికవరీ విషయంలో సమూల మార్పులు రాస్ మెడికల్ ఫిట్నెస్ సెంటర్‌ను ప్రారంభించినప్పటి నుంచి రోగులు వేగంగా కోలుకోవడానికి, ఆరోగ్యం మెరుగుపడడానికి సేవలు అందిస్తోంది. ఇప్పటివరకు పలు విభాగాల్లో అసాధారణ ఫలితాలు సాధించింది. వాటిలో ప్రధానమైనది యాంటీ ఏజింగ్, చర్మ పునరుజ్జీవనం.వయసుతో వచ్చే సమస్యలకు సరైన పరిష్కారంహెచ్బీఓటీ చికిత్స వల్ల చర్మం మీద అసాధారణ ప్రభావాలు కనిపిస్తాయని ఇప్పటికే శాస్త్రీయంగా రుజువైంది. బయటి వాతావరణంలో మనం గాలి పీల్చుకునేటప్పుడు అందులో 20 శాతం మాత్రమే ఆక్సిజన్ ఉంటుంది. దాన్ని మనం పీల్చుకుని, మళ్లీ 15% బయటకు వదిలేస్తాం. అంటే, 5 శాతం ఆక్సిజన్ మాత్రమే మన శరీరంలోకి వెళ్తుంది. కానీ, అదే హెచ్‌బీఓటీ ఛాంబర్లో అయితే మొత్తం నూరుశాతం ఆక్సిజన్ మాత్రమే ఉంటుంది. దాన్ని మన శరీరం పూర్తిగా పీల్చుకోవడం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి ప్రేరేపితం అవుతుంది. చర్మం స్థితిస్థాపకత మెరుగుపడుతుంది. దానివల్ల శరీరం మీద ఉండే గీతలు తగ్గిపోతాయి. మన కణజాలం కూడా చాలా ఆరోగ్యంగా తయారవుతుంది. ఎముకలు, కండరాలకు వయసుతో పాటే వాటిల్లే నష్టాన్ని కూడా ఇది తగ్గిస్తుంది. దీనివల్ల గుండె కండరాలు, ఊపిరితిత్తుల పనితీరు చాలా మెరుగుపడుతుంది. గతంలో మధుమేహ బాధితులకు ఏవైనా గాయాలు అయినప్పుడు, లేదా శస్త్రచికిత్సలు చేసినప్పుడు వారి చర్మం త్వరగా కోలుకునేందుకు వీలుగా ఇలాంటి చికిత్సలు సూచించేవారు. కానీ, ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యవంతులకు కూడా ఈ చికిత్స వల్ల చర్మంతో పాటు శరీరంలోని కణాలన్నింటికీ కూడా ఎనలేని ప్రయోజనం చేకూరుతుంది. అవన్నీ ఆరోగ్యవంతం కావడంతో వయసు ప్రభావం వల్ల కనిపించే చర్మం ముడతలు, ఇతర సమస్యలన్నీ తగ్గిపోతాయి.ఇది కాక ఇంకా...దీర్ఘకాలిక అలసట, శక్తి బూస్ట్: ఈ చికిత్స ఆక్సిజన్ డెలివరీని పెంచి, అలసటను తగ్గిస్తుంది, సామర్థ్యాన్ని పెంచుతుందిడయాబెటిస్, జీవక్రియపరమైన ఆరోగ్యం: రక్త ప్రసరణకు ఇది సహాయపడుతుంది. గాయం నయం చేయడాన్ని వేగవంతం చేస్తుంది, రక్తంలో చక్కెరశాతాన్ని సరిగ్గా నిర్వహించేలా చూస్తుంది. క్యాన్సర్ చికిత్సలు: రేడియేషన్ తర్వాత కణజాల పునరుద్ధరణకు సహాయపడుతుంది. క్యాన్సర్ బాధితులకు రోగనిరోధకశక్తి మెరుగుపడేందుకు ఉపయోగపడుతుంది. నాడీ సమస్యలు: స్ట్రోక్, మెదడుకు అయ్యే గాయాలు, రోగులలో న్యూరోడీజెనరేటివ్ సమస్యలకు, జ్ఞాపకశక్తి పునరుద్ధరణకు సహాయపడుతుంది. ఒత్తిడి, జీవనశైలి పునరుద్ధరణ: ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది, మానసిక స్పష్టతను పెంచుతుంది, విశ్రాంతిని ప్రోత్సహిస్తుందిఆధునిక వైద్యం, చికిత్సలలో గేమ్ ఛేంజర్అసలు తొలినాళ్లలో దీన్ని కనుక్కున్నప్పుడు.. డ్రైవర్లలో డీకంప్రెషన్ సిక్నెస్కు చికిత్స చేయడానికి ఉపయోగించేవారు. కానీ తర్వాత ఇప్పుడు దానివల్ల అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయి. యాంటీ ఏజింగ్, జీవితకాలాన్ని పెంచడం, క్యాన్సర్ చికిత్సల వల్ల కలిగే దుష్ప్రభావాలు, ముఖ్యంగా రేడియేషన్ వల్ల కలిగే నష్టాల నుంచి కోలుకునేలా చేయడం, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడం, ఒత్తిడి, నిద్రలేమి లాంటి జీవనశైలి సమస్యలను పరిష్కరించడం, అథ్లెట్ల సామర్థ్యాన్ని పెంచి, కండరాలు కోలుకునేలా చేయడం లాంటి అనేక ప్రయోజనాలు దీంతో సిద్ధిస్తున్నాయి.రాస్ మెడికల్ ఫిట్నెస్ సెంటర్ గురించి: రాస్ మెడికల్ ఫిట్నెస్ సెంటర్ అనేది హైదరాబాద్ నగరంలోని ఒక ప్రధాన వెల్నెస్, హెల్త్‌కేర్ సంస్థ. వ్యాధుల నుంచి కోలుకుఓవడం, సమగ్ర ఆరోగ్యం, పనితీరు విషయాలకు సంబంధించి శాస్త్రీయ చికిత్సలను అత్యాధునిక విధానాల్లో అందించేందుకు ఇది అంకితమైంది. సంపూర్ణ వైద్యం, వినూత్న చికిత్సలపై దృష్టి సారించిన రాస్ సంస్థ.. హెచ్‌బీఓటీ, ఇతర పునరుత్పత్తి చికిత్సలతో చికిత్సల భవిష్యత్తును పునర్నిర్వచిస్తోంది -
పోషకాల పరంగా బెస్ట్ చట్నీలివే..!
భారతీయ ఆహారంలో ఎన్ని రకాల కూరలు ఉన్నా.. పక్కన కాస్త రోటి పచ్చడి లేదా కొద్దిపాటి చట్నీతో గానీ భోజనం పూర్తి చేయరు. ఇవి భోజనాన్ని శక్తిమంతంగా మార్చుతాయి. ఓ గొప్ప రుచిని అందిస్తాయి. అయితే మనం ఎన్నో రకాల వెరైటీ చట్నీలు చేసుకుంటాం. హాయిగా లాగించేస్తుంటాం. కానీ పోషకాల ప్రొఫెల్ పరంగా ఏ చట్నీ ఆరోగ్యానికి మంచిదనేది తెలియదు. అయితే కొన్ని చట్నీలు బరువు తగ్గేందుకు మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు ఉపకరిస్తాయట. వాటి పోషకాల ఆధారంగా ఆయా చట్నీలకు ర్యాంకుల ఇచ్చి మరీ వివరంగా చెబుతున్నారు ప్రముఖ డైటీషియన్ కనిక మల్హోత్రా. అవేంటంటే..చట్నీలను మాగ్జిమం సుగంధ ద్రవ్యాలు, కొన్ని రకాల ఆయుర్వేద సంబంధిత మూలికలు వంటి వాటితో తయారు చేస్తుంటాం. అందువల్ల వాటి తయారీ ఆధారంగా పోషక విలువలు గణనీయంగా మారతాయని చెబుతున్నారు మల్హోత్రా. ఆ నేపథ్యంలోనే మన భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన చట్నీలకు పోషకాల ఆధారంగా ర్యాంకులిచ్చి మరీ వాటి ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. అవేంటో చూద్దామా..పుదీనా-కొత్తిమీర చట్నీ: దీనిలో విటమిన్లు ఏ,సీ, కేలు సమృద్ధిగా ఉంటాయి. జీర్ణక్రియకు సహాయపడుతుంది. వాపును తగ్గిస్తుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.వెల్లుల్లి చట్నీ: గుండె ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందింది. రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.కొబ్బరి చట్నీ ఆరోగ్యకరమైన కొవ్వులు (ఎంసీటీలు), ఫైబర్ అధికంగా ఉంటాయి, జీవక్రియ, జీర్ణ ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి. మాంగనీస్, రాగి వంటి ఖనిజాలను అందిస్తుంది.వేరుశెనగ చట్నీ: ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండి ఉంటుంది. శక్తి వంతమైనది. సంతృప్తికరంగా ఉంటుంది. మొత్తం ఆరోగ్యానికి మద్దతు ఇచ్చే విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి.టమాటో చట్నీ: లైకోపీన్ (గుండె ఆరోగ్యానికి సంబంధించిన యాంటీఆక్సిడెంట్), విటమిన్లు సీ, ఈలు సమృద్ధిగా ఉంటాయి. చర్మ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది.చింతపండు చట్నీ: విటమిన్ బీ, మెగ్నీషియం, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అయితే దీనిలో ఎక్కు చక్కెర ఉండటం వల్ల దీన్ని అంతగా ఆరోగ్యకరమైనదిగా పరిగణించలేదు నిపుణులు. మామిడి చట్నీ: ఇందులో కూడా ఎక్కువ చక్కెర ఉంటుంది. అయితే దీనిలో విటమిన్లు ఏ, సీ, ఫైబర్లు సమృద్ధిగా ఉంటాయి. ఎర్ర మిరప చట్నీ: క్యాప్సైసిన్ అధికంగా ఉంటుంది,. జీవక్రియను పెంచుతుంది. అయితే మితంగానే తీసుకోవాలి.“కారపు చట్నీలు వాటిలో ఉండే యాంటీఆక్సిడెంట్ కంటెంట్ కారణంగా ప్రకాశవంతమైన రంగును ప్రోత్సహిస్తాయి. ఇంట్లో తయారుచేసిన చట్నీలు స్టోర్-కొనుగోలు చేసిన వెర్షన్ల కంటే ఎక్కువ పోషకాలను ఉంటాయి. ఎందుకంటే వాటిలో ప్రిజర్వేటివ్‌లు, అదనపు చక్కెరలు ఉండవు కాబట్టి చెబుతున్నారు మల్హోత్రా .మితంగా తీసుకోవాల్సిన చట్నీలుకొన్ని భారతీయ చట్నీలు అధిక కేలరీలు లేదా సోడియం కంటెంట్ కారణంగా మితంగా తినాలి అని మల్హోత్రా సూచించారు.కొబ్బరి చట్నీ: రుచికరమైనది అయినప్పటికీ, 100 గ్రాములకు 217 కేలరీలు, 19.84 గ్రాముల కొవ్వును కలిగి ఉంటుంద., ప్రధానంగా సంతృప్త కొవ్వు నుంచి ఎల్డీఎల్ (LDlL) కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. ఇది గుండె సంబంధితన సమస్యలు ఉన్నవారికి మంచిది కాదని చెబుతున్నారువేరుశెనగ చట్నీ: కేలరీలు అధికంగా ఉంటాయి. దీనిలో 100 గ్రాములకు సుమారు 331.78 కేలరీలు, 22.82 గ్రాముల కొవ్వు ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన కొవ్వులు ప్రోటీన్లను అందిస్తున్నప్పటికీ.. ఇందులో జోడించిన ఉప్పు, చక్కెర మధుమేహం ఉన్నవారికి ప్రమాదకరం.చింతపండు చట్న: తయారీ పద్ధతులను బట్టి ఈ చట్నీలో అదనపు చక్కెరలు, సోడియం కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువ. అందువల్ల ఇది ఒకరకంగా అదనపు కేలరీల తీసుకునేందుకు దోహదం చేస్తుందని హెచ్చరిస్తున్నారు మల్హోత్రా. చివరగా ఈ చట్నీలన్నీ రుచి, పోషక ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ, ఆహార సమతుల్యత, ఆరోగ్య పరిస్థితులను సమర్థవంతంగా నిర్వహించడానికి తక్కువగా తీసుకోవడమే మంచిదని సూచించారు మల్హోత్రా.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యలను సంప్రదించడం ముఖ్యం. (చదవండి: Vicky Kaushal: 'ఛావా' కోసం వంద కిలోలు దాటేసిన హీరో.. ఏ డైట్ ఫాలో అయ్యాడంటే?) -
ఉన్నపాటుగా ప్రాణాలు తీస్తున్న గుండెపోటు : ఎలా గుర్తించాలి?
తెలంగాణాలో హైకోర్టులో ఉండగానే హఠాత్తుగా కుప్పకూలి సీనియర్ న్యాయవాది ప్రాణాలు కోల్పోయిన వైనం ఆందోళన రేపింది. ఒకపుడు గుండెపోటు అంటే.. మధుమేహం ఉన్న వారికి, శారీరక శ్రమ లేని వారికి, వయసు మీద పడిన వారికి, ఊబకాయ ఉన్నవారికి మాత్రమే వస్తుంది అని అనుకునే వాళ్ళం. కానీ ప్రస్తుత కాలంలో గుండె పోటు తీరు మారింది. మాకు రాదులే అని అనుకోడానికి లేదు. చిన్నా పెద్దా తేడా లేకుండానే ఇటీవలి కాలంలో గుండెపోటు సమస్య చాలా ఎక్కువగా వస్తుంది. అసలు గుండె పోటు ఎందుకు వస్తుంది? గుండె పోటు వచ్చే ముందు మన శరీరం ఏమైనా సంకేతాలు పంపిస్తుందా? ఈ కథనంలో చూద్దాం.జీవనశైలి మార్పులు, శారీరక శ్రమ లేకపోవడం, బీపీ, షుగర్ లాంటి వ్యాధుల బారిన పడిన వారిలో గుండె వ్యాధుల ప్రమాదం ఎక్కువ. అయితే ఇటీవలి కాలంలో అసలు అనారోగ్య సమస్యలేకపోయినా కూడా హార్ట్ ఎటాక్‌తో చనిపోతున్నారు.గుండెపోటు అంటే? గుండె కండరానికి మంచి రక్తాన్ని తీసుకువెళ్లే రక్తనాళాలలో కొవ్వు కాని గడ్డలు కాని ఏర్పడడం వల్ల రక్తసరఫరాలో ఆటంకం ఏర్పడితే గుండె పోటు వస్తుంది. సాధారణంగా గుండె (కరోనరీ) ధమనులలో కొవ్వు, కొలెస్ట్రాల్ ,ఇతర పదార్థాలు పేరుకుపోవడం వల్ల అడ్డంకులు(బ్లాక్స్) ఏర్పడతాయి. రక్తనాళాలు పూడుకుపోవడం, రక్తాన్ని గుండె సరిగా సరఫరా చేయలేకపోవడం తదితర కారణాల వల్ల గుండె పోటు వచ్చే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. వీటికి సరైన సమయంలో చికిత్స అవసరం. అలాగే బాడీలో విపరీతంగా కొలెస్ట్రాల్ పెరిగిన వారు కూడా గుండెపోటు బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.గుండెపోటు వచ్చే ముందు కనిపించే లక్షణాలువాస్తవానికి కొంతమందిలో తేలికపాటి లక్షణాలు ఉంటాయి. మరికొందరికి తీవ్రమైన లక్షణాలు ఉన్నాయి. కొందరిలో ఎలాంటి లక్షణాలు ఉండవు. కానీ సాధారణంగా గుండెపోటు వచ్చే ముందు కచ్చితంగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయని, కానీ చాలామంది వాటిని గుర్తించడంలో వైఫల్యంతోనే ముప్పు ముంచుకొస్తోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ లక్షణాలు గుర్తించి, ప్రాథమిక చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం తప్పే అవకాశం చాలా ఉందిలో ఉంటుందని అంటున్నారు.గుండెల్లో మంట లేదా అజీర్ణంగొంతులో ఏదో ఇరుక్కున్నట్లు అనిపించడంఛాతీలో నొప్పి, గుండె లయలో మార్పులుశ్వాస తీసుకోవడంలో ఇబ్బందితల తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. తొందరగా అలసిపోవడం, అంటే కొద్దిగా నడిస్తేనే నీరసంనాలుగు మెట్టు ఎక్కంగానే ఆయాసంఇలాంటి లక్షణాలున్నపుడు వెంటనే వైద్యుని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి.► మరి కొందరిలో ముందు దవడ, మెడ, జీర్ణాశయం పై భాగంలో నొప్పిగా ఉంటుంది. ► ఒకటి లేదా రెండు రోజులకు మించి ఎడం చెయ్యి లేదా రెండు చేతులలో అకారణంగా నొప్పి, వికారం, వాంతి వచ్చినట్టు ఉంటే కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలిలక్షణాలు లేకపోయినా ఎవరు జాగ్రత్త పడాలి అధిక బరువు వున్నా, హైబీపీ డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నా, ధూమపానం అలవాటు ఉన్న వారంతా గుండె పోటు ప్రమాదం పట్ల అవగాహనతో ఉండాలి. అలాగే ఎక్కువ ఒత్తిడి ఉండే ఉద్యోగాలు చేసేవారిలోనూ గుండె పోటు వచ్చే అవకాశాలు ఎక్కువ అనేది గమనించాలి. ముఖ్యంగా మధ్య వయసులో స్త్రీల కన్నా మగవారికి గుండెపోటువచ్చే ప్రమాదం ఎక్కువని నిపుణులు చెబుతన్నారు.మెనోపాజ్ దశలో మహిళల్లో ఈస్ట్రెజెన్ స్థాయి తగ్గిపోతుంది. అప్పుడు వారిలో గుండె పోటు ముప్పు పెరుగుతుంది. అయితే 65 ఏళ్ల తర్వాత పురుషుల్లో కంటేమహిళల్లో ఎక్కువ గుండె పోటు వస్తున్నట్టు పలు అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరువురిలోనూ అలసత్వం ఎంతమాత్రం మంచిది కాదు.మరీ ముఖ్యంగా కుటుంబంలో ఎవరికైనా గుండెపోటు వచ్చిన చరిత్ర ఉన్నా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. వంశపారంపర్యంగా ఈ గుండె వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.గుండెపోటు రావడానికి కారణంవృత్తి, వ్యాపారాల్లో భరించలేని టెన్షన్లు, సరైన పోషకాహారం తీసుకోకపోవడంచిన్నతనం నుంచే అలవాటుపడిన జంక్‌ఫుడ్‌లు వదలలేకపోవడంకాలానికి తగినట్లుగా పిరియాడికల్ టెస్టులు చేయించుకొని శరీరంలో వస్తున్న అనారోగ్య సంకేతాలను ముందే తెలుసుకొని తగిన చికత్సలు తీసుకోకపోవడంశక్తికి మించి జిమ్, ఎక్సర్సైజులు వంటివి చేయడంగుండెపోటు రాకుండా ఏం చేయాలి?క్రొవ్వు పదార్ధాలు అతిగా తినకుండా శరీరానికి అవసరమైన మేరకు తినడంప్రతి ఉదయం నలభై నుండి అరవై నిమిషాలు నడక, లేదా ఇతర వ్యాయామం చేయడం.ఒత్తిడి లేని జీవన శైలి పాటించడం, ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చూసుకోవడంనోట్: కొన్ని అనుమానాస్పద లక్షణాలున్నవారందరూగుండెజబ్బు వచ్చేసినట్టు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ లక్షణాలు కనిపించగానే రోగ నిర్ధరణ అనేది చాలా కీలకం. క్రమం తప్పని వ్యాయామం, సమతుల ఆహారంపై శ్రద్దతో పాటు ఏ చిన్న అనుమానం వచ్చినా అజాగ్రత్త చేయకుండా వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవడం ఉత్తమం. -
ఈవినింగ్ వాక్? మార్నింగ్ వాక్? ఎక్కువ ప్రయోజనాలు కావాలంటే?!
ఆధునిక జీవితం కాలంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. ఎందుకంటే శారరీక శ్రమ తగ్గిపోతున్న తరుణంలో అనేక రకాల వ్యాధులు మనల్ని చుట్టుముడతాయి. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా హాయిగా జీవించాలంటే విధిగా వాకింగ్ చేయాల్సిన అవవసరం చాలా ఉంది. అయితే వాకింగ్ ఉదయం చేస్తే మంచిదా లేక సాయంత్రం చేస్తే మంచిదా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. అసలు ఏ సమయంలో వాకింగ్ చేస్తే ఎక్కువ ఫలితాలు లభిస్తాయి ఆలోచిస్తూ ఉంటారు. అసలు సమస్యలు ఉన్నవారు, ఆరోగ్యంగా ఉన్నవారు, చిన్నా పెద్దా అన్న భేదమేలేదు. ఎవరైనా, ఎపుడైనా ఎంచక్కా వాకింగ్‌ను ఎంజాయ్ చేయవచ్చు. దీని వల్ల రాబోయే అనేక ఆరోగ్య సమస్యలు పరారవుతాయి. ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేందుకు ఉండేందుకు వివిధ రకాల పోషకాలే కాదు శారీరక శ్రమ కూడా అవసరం అనేది ముఖ్యం అని గమనించాలి. మధుమేహం, రక్తపోటు, హృదయ సంబంధ వ్యాధుల వంటి దీర్ఘకాలిక పరిస్థితులను నివారించడానికి, అనేక ఆరోగ్య ప్రయోజనాలకు నడక ఒక ముఖ్యమైన వ్యాయామం. ఎపుడు ఎలా చేసినా ఆరోగ్యానికి చాలా మంచిది. వాకింగ్ వల్ల మానసిక ఒత్తిడికి దూరమవుతుంది. రోగ నిరోధక శక్తి పెరగుతుంది. కండరాలకు,కీళ్లకు బలం చేకూరుతుంది. వివిధ రకాల అధ్యయనాల ప్రకారం మార్నింగ్ వాకింగ్ ప్రయోజనాలు, ఈవెనింగ్ వాక్ ప్రయోజనాలు వేర్వేరుగా ఉన్నాయి. ఉదయం వాకింగ్ ఉదయం వేళ లేత ఎండలో వాకింగ్ లేదా సాయంత్రం చల్లగాలిలోవాకింగ్ రెండూ ప్రత్యేకమే. మార్నింగ్ వాకింగ్ వల్ల శరీరానికి కావల్సిన విటమిన్ డీ లభిస్తుంది. ఇది ఇమ్యూనిటీ పటిష్టం చేసేందుకు, ఎముకల ఆరోగ్యానికి దోహదపడుతుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ముఖ్యంగా ఒత్తిడి దూరమౌతుంది. రోజంతా ఎనర్జెటిక్‌గా ఉంటారు. ఉదయం పూట స్వచ్ఛమైన గాలి ఆరోగ్యానికి చాలా మంచిది. సాయంత్రం పూట వాకింగ్సాయంత్రం వాకింగ్ లాభాలను కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఉదయం నుంచి ఉన్న అలసట, పని ఒత్తిడి దూరం కావాలంటే, చికాకు పోవాలన్నా నడక చక్కని పరిష్కారం. ప్రశాంతమైన నిద్ర పడుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. వాకింగ్‌తో ఇన్ని సమస్యలకు చెక్ చెప్పవచ్చుగాలి నాణ్యత, ఉష్ణోగ్రత ,భద్రత దృష్టిలో పెట్టుకుని ఎవరికి వారు ఉదయమా, సాయంత్రమా అనేది నిర్ణయించుకోవాలి. ఉదయపు చలిగాలులు పడని వారు సాయంత్రం వాకింగ్ చేస్తే మంచిది. కాలుష్యానికి దూరంగా ఉండే ప్రశాంతమైన వాతావరణంలో నడక మంచి ఫలితాలనిస్తుంది. అన్ని వయసుల వారికి అనువైన వ్యాయామం. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా చేస్తే బరువు తగ్గుతుంది. ఎండార్ఫిన్లను విడుదల చేయడం ద్వారా మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఇవే కాకుండా రోజూ మీకునచ్చిన సమయంలో వాకింగ్ వల్ల జుట్టు రాలటం, మొటిమలు, చర్మం నల్లబడటం, ఆటో ఇమ్యూన్ సమస్యలు, మలబద్ధకం,తలనొప్పి, దిగులు, ఆందోళన, డిమెన్షియా, పార్కిన్ సన్స్, మతిమరుపు, ఏకాగ్రత లేమి, చికాకు, కోపం, పీసీఓడీ, బహిష్టు సంబంధిత సమస్యలు ఇలాంటి వాటికెన్నింటికో చెక్ చెప్పవచ్చు. -
సార్కోమాను ఎదుర్కోలేమా!
దేహంలోని సూక్ష్మ కణజాలానికి వచ్చే ఆరు రకాల ప్రధాన కేన్సర్లలో ‘సార్కోమా’ ఒకటి. సార్కోమాను త్వరగా కనుగొంటే మనుగడ రేటు 81 శాతం. అంటే... దీన్ని ఎంత త్వరగా కనుక్కుంటే అంతగా దాన్ని అంతగా అరికట్టవచ్చని తెలుస్తోంది. అయితే దురదృష్టవశాత్తూ మనదేశంలో సార్కోమాను చాలా ఆలస్యంగా కొనుగొంటుండటం వల్ల పొరుగునే ఉన్న ధనిక దేశాలతో పోలిస్తే మన దగ్గర మరణాల రేటు ఎక్కువే. ఈ నేపథ్యంలో సార్కోమా గురించి తెలుసుకుందాం. ఎముక చివరన ఉండే మృదులాస్థి అయిన కార్టిలేజ్కూ, టెండన్స్కూ, కండరాలకూ, ఇక అక్కడి కొవ్వు కణజాలాలలో కనిపించే కేన్సర్లకు ఇచ్చిన ఒక కామన్ పేరు ‘సార్కోమా’. అంటే శరీరంలో ఉండే ఎముకకు గానీ లేదా దాని సపోర్టివ్ కనెక్టివ్ కణజాలానికి వచ్చే చాలా రకాల కేన్సర్లన్నింటికి ఇచ్చిన కామన్ పేరు ఇది. ఇది శరీరంలో ఎక్కుడైనా రావచ్చు... అయితే ప్రధానంగా చేతులు, కాళ్లూ, ఛాతీభాగంలో, పొట్ట భాగంలో ఈ కేన్సర్ ఎక్కువగా కనిపిస్తుంది. సార్కోమాలో మళ్లీ దాదాపు 70 రకాల సబ్టైప్స్ ఉంటాయి. ఈ కేన్సర్ ఉద్భవించే మౌలికమైన కణాలు, వాటి ప్రవర్తన, లక్షణాలు... వీటన్నింటిని బట్టి సార్కోమాను రెండు ప్రధానమైన పెద్ద సబ్టైప్స్గా విభజించారు. వాటిల్లో... మొదటిది ‘సాఫ్ట్ టిష్యూ సార్కోమా’, రెండోది ఎముకలకు సంబంధించిన ‘బోన్ సార్కోమా’. రిస్క్ ఫాక్టర్లు (ఈ ముప్పును తెచ్చిపెట్టే అంశాలు)... ఇటీవలి కొత్త పరిశోధనల ప్రకారం... హానికరమైన పరిశ్రమల్లో లేదా ప్రమాదకరమైన రసాయనాలకు ఎక్స్పోజ్ అయ్యేలాంటి చోట్ల పనిచేసేవారిలో ఈ సార్కోమా కేన్సర్లు ఎక్కువగా వస్తున్నట్లు కనుగొన్నారు. ఉదాహరణకు ప్లాస్టిక్ పరిశ్రమల్లో పనిచేసేవారు వినైల్ క్లోరైడ్ లేదా డయాక్సిన్స్ అనే హానికరమైన రసాయనాలకు ఎక్స్పోజ్ అయినప్పుడు కాలేయానికి వచ్చే యాంజియోసార్కోమా వంటి క్యాన్సర్లు కనిపిస్తుంటాయి. అలాగే పురుగు మందులు, కలుపు మొక్కల నివారణ కోసం ఉపయోగించే మందుల (హె ర్బిసైడుల) కారణంగా వ్యవసాయ కూలీల్లోనూ, వ్యర్థాలను తొలగించే కార్మికుల్లోనూ సార్కోమా బాధితులు ఎక్కువ. ఇక పిల్లల్లో... వారి ఎదుగుదల అనే అంశమే సార్కోమాలు కనిపించడానికి కారణమవుతుంది. వారు ఎదిగే క్రమంలో జరిగే వేగవంతమైన కణవిభజనల్లో ఎక్కడైనా లోపం జరిగాక... ఆ లోపభూయిష్టమైన కణం నుంచి పెరిగే కణజాలం అపరిమితంగా పెరుగుతూపోతూ సార్కోమాకు దారితీయవచ్చు. అనారోగ్యకరమైన జీవనశైలి, కాలుష్యాలతో కూడిన పర్యావరణం, గతంలో ఏవైనా కారణాల వల్ల రేడియోథెరపీ తీసుకోవాల్సిన రావడం వంటివి సార్కోమా ముప్పును మరింతగా పెంచే అంశాలు. అలాగే ‘లి–ఫ్రౌమెనీ సిండ్రోమ్’ వంటి సిండ్రోములు, జెనెటిక్ మ్యూటేషన్లు కూడా సార్కోమాకు కారణమవుతుంటాయి. నిర్ధారణ... సీటీ స్కాన్ వంటి ఇమేజింగ్ టెక్నిక్స్ సార్కోమాలను కనుగొనడంలో కీలక భూమిక పోషిస్తుంటాయి. ఎక్కడో పుట్టిన మూల కేన్సర్... అటు తర్వాత మరో చోటకు చేరి అక్కడ పెరగడాన్ని (మెటాస్టేటిస్ను) కనుగొనడంలోనూ ఈ ఇమేజింగ్ ఉపకరణాలు సహాయపడతాయి. మృదు కణజాలంలో (సాఫ్ట్ టిష్యూల్లో) వచ్చే కేన్సర్ గడ్డలను ఎమ్మారై వంటి వాటితో కనుగొనడానికీ, రేడియోషన్ దుష్ప్రభావాలను వీలైనంతగా తగ్గించి ఉపయోగించే రేడియో టెక్నిక్స్ అయిన అలారా (ఏజ్ లో ఏజ్ రీజనబ్లీ అచీవబుల్) టెక్నిక్‌తో సురక్షితంగా సార్కోమాలను కనుక్కోడానికీ. ఇక పెట్–సీటీ, రేడియోమిక్స్ వంటి అధునాతన టెక్నిక్స్‌తో అవి హానికరం కాని బినైన్ గడ్డలా లేక హానికరమైన మేలిగ్నెంట్ లీజన్సా అన్న అంశాలను కనుగొనడానికి ఆస్కారం ఉంది. చికిత్సలు / అధునాతన చికిత్సా పద్ధతులు... అధునాతమైన శస్త్రచికిత్స పద్ధతుల ద్వారా అలాగే రేడియేషన్ థెరెపీ వంటి అంశాల్లో చోటు చేసుకున్న వినూత్న పద్ధతుల ద్వారా సార్కోమాకు చికిత్స అందించడం ఇప్పుడు సాధ్యం. బాధితుల కాళ్లు, చేతులను తొలగించకుండానే చేసే శస్త్రచికిత్సలు (లింబ్ స్పేరింగ్ సర్జరీస్), ఒకవేళ అలా తొలగించాల్సి వస్తే వారికోసమే రూపొందించిన (పేషెంట్ స్పెసిఫిక్ ఇం΄్లాంట్స్)తో... ఆ తొలగించిన చోట ఇంప్లాంట్స్ అమర్చుతూ అవయవాలు కోల్పోకుండా చేసే టెక్నిక్లిప్పుడు అందుబాటులో అత్యంత ఆధునికమైన ప్రోటాన్ థెరపీ, ఐఎమ్ఆర్టీ (ఇంటెన్సిటీ మాడ్యూలేటెడ్ రేడియేషన్ థెరపీ) వంటి అత్యాధునిక రేడియేషన్ పద్ధతులతో చుట్టుపక్కల ఉండే కణజాలానికి హానికలగకుండా లేదా తక్కువ హాని కలిగేలా చేసే రేడియోథెరపీ. రకరకాల మందుల కాంబినేషన్లతో ప్రభావపూర్వకమైన కీమోథెరపీ. ఇవేకాకుండా టార్గెటెడ్ థెరపీలు, ఇమ్యూనోథెరపీల వంటి వాటితో జెనెటిక్ మ్యూటేషన్ల వల్ల వచ్చిన సార్కోమాలను నయం చేయడానికి ఆస్కారం. కొద్దిరోజుల్లో అందుబాటులోకి రానున్న కార్–టీ సెల్ థెరపీల వంటి వాటి సహాయంతో మునుపు అంతగా లొంగని సార్కోమా కేన్సర్లను మరింత ప్రభావపూర్వకంగా చికిత్స అందించే వీలుంది. --డాక్టర్ (ప్రొఫెసర్) బి. రాజేష్, మస్క్యులో స్కెలిటల్ రేడియాలజీ స్పెషలిస్ట్, రాయల్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ బర్మింగ్హమ్ (యూకే) (చదవండి: కోళ్ల అందాల పోటీలు..!) -
సిట్ రైట్: సరిగ్గా కూర్చుందాం ఇలా..!
ఇటీవల డాక్టర్ల దగ్గరకు వస్తున్న కేసుల్లో ఒళ్లు నొప్పులు, కీళ్లనొప్పులు, వెన్నునొప్పి, మెడ నొప్పి, తలనొప్పి ప్రధానంగా కనిపిస్తున్నాయి. కండరాల నొప్పులు, కీళ్లనొప్పులు, వెన్ను కింది భాగం (లోవర్ బ్యాక్) నొప్పికేసులను నిశితంగా పరిశీలించిన స్పైన్ స్పెషలిస్ట్‌లు నూటికి ఇరవై శాతం వరకు ఈ రకమైన వెన్నునొప్పులకు బ్యాడ్ సిట్టింగ్ కోశ్చర్లే కారణమని చెబుతున్నారు. నాణ్యత లోపించకుండా క్వాలిటీ వర్క్ ఇవ్వడంలోనూ కూర్చునే భంగిమ పాత్ర కీలకమే. అందుకే సరిగ్గా కూర్చుందాం. ఇలా కూర్చోవాలికుర్చీలో కూర్చున్నప్పుడు భుజాలు, బట్ భాగం కుర్చీ వెనుక భాగాన్ని తాకాలి. బట్ భాగం కుర్చీని తాకని పక్షంలో కుర్చీ మార్చుకోవడం లేదా కుషన్ అమర్చుకోవడం మంచిది. అరగంటకొకసారి కదిలి కూర్చున్న భంగిమకు విశ్రాంతినిచ్చి తిరిగి సరైన తీరులో కూర్చోవాలి. కథల్లో వర్ణించినట్లు విశ్రాంతిగా కుర్చీలో జారగిలపడి కూర్చోవడం అనే భంగిమలో గంటలసేపు ఉండకూడదు, దేహం సాంత్వన పొందే రెండు–మూడు నిమిషాల సేపు మాత్రమే ఉండాలి. అరగంట, గంట పనికి ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకుని పని చేస్తే ఫర్వాలేదు. కానీ ఎక్కువ గంటలు పని చేయాల్సి వస్తే ల్యాప్‌టాప్‌ను కూడా డెస్క్ మీద ఉంచి పని చేయడమే కరెక్ట్. ఎక్కువ గంటలు కూర్చుని పనిచేసే వాళ్లు అబ్డామినల్ స్ట్రెంగ్త్ కోసం రోజూ అరగంట పాటు ఎక్సర్సైజ్ చేయాలి. ఇందుకోసం పెద్ద బాల్ మీద కానీ కుర్చీలో కానీ కూర్చోవాలి. ఈ భంగిమలో పాదాల మధ్య అడుగు దూరం ఉంచాలి. గాలి వదులుతూ కుడి మోకాలిని ఫొటోలు చూపినట్లు పైకెత్తాలి, అదే సమయంలో ఎడమ చేతిని కూడా పైకెత్తాలి. మెల్లగా మామూలు స్థితికి రావాలి. రెండవసారి అదేవిధంగా ఎడమ మోకాలు, కుడిచేత్తో చేయాలి. ఇలా కనీసం పదిసార్లు చేస్తుంటే... కూర్చున్న భంగిమలు సరిలేని కారణంగా ఎదురయ్యే అవాంఛిత ఒత్తిడుల నుంచి దేహం సాంత్వన పొందుతుంది. కడుపు కండరాలు, అంతర్గత అవయవాలు శక్తిమంతమవుతాయి. -
నటి షెహ్నాజ్ గిల్ డైట్ ప్లాన్ ఇదే..! ఆరు నెలల్లో 55 కిలోలు..
బాలీవుడ్ నటి షెహ్నాజ్ గిల్ మోడల్, గాయని కూడా. ఆమె పలు మ్యూజిక్ వీడియోస్, టెవిజన్ షోస్‌లో పాల్గొని గుర్తింపు సంపాదించుకుంది. షెహ్నాజ్ కౌర్‌గా కూడా పిలిచే ఆమె పంజాబీ, హిందీ టెలివిజన్ చిత్రాలలో నటిస్తుంది. అంతేగాదు ఆమె సోషల్ మీడియా సెన్సెషన్ కూడా. ఇటీవల బాలీవుడ్ టీవీ షో మిర్చి ప్లస్‌లో శిల్పా శెట్టి కుంద్రాతో జరిగిన సంభాషణలో తన డైట్ ప్లాన్ గురించి షేర్ చేసుకుంది. అవేంటో చూద్దామా..!.ఆమె దాదాపు 55 కిలోలు బరువు తగ్గారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట షేర్ చేయడంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. అందరూ ఆమె ఫిట్నెస్ సీక్రెంటో ఏంటని ఆరా తీయడం ప్రారంభించారు. అందరి కుతుహలానికి తెరపడేలా ఆమె తన డైట్ సీక్రెట్ ఏంటో బయటపెట్టింది. ఆమె ఏం చెప్పారంటే..డైట్ ప్లాన్..తాను సరైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా ఆరునెలల్లోనే ఇంతలా స్లిమ్‌గా మారిపోయానని చెప్పారు. తన రోజుని పసుపుతో ప్రారంభిస్తానని అంటోంది. పసుపు ఆరోగ్య నిర్వహణకు మంచిదే అయినప్పటికి సరైన మార్గంలో ఉపయోగిస్తే మంచి ప్రయోజనాలు పొందొగలమని అంటోంది. తాను హైడ్రేషన్‌గా ఉండేలా తగినంత నీరు తాగిన తర్వాత పెసరట్టు లేదా మెంతీ పరాఠాలతో కూడిన అల్పహారాన్ని ఎంచుకుంటానని తెలిపారు. చాలావరకు బ్రేక్‌ఫాస్ట్‌లో ఎక్కువ పరిమాణంలో ప్రోటీన్ ఉండేలా చూసుకుంటానని అన్నారు. ఒక్కోసారి అల్పాహారంగా పోహా కూడా తీసుకుంటానని అంటోంది. ఇక తాను కూరగాయల రెసిపీనే ఎక్కువగా తీసుకుంటానని అన్నారు. అలాగే వాటిలో తప్పనిసరిగా జీలకర్ర, ఆవాలు ఉండాల్సిందేనట. ఎక్కువగా మాత్రం బ్రకోలి, క్యారెట్, బెల్ పిప్పర్ వంటివి తీసుకుంటానని చెప్పింది. భోజనంలో ఎప్పుడు ఆరోగ్యకరమైన పోషకాలు ఉండేలా మొలకలు, టోపు స్క్రాంబుల్, నెయ్యి, రోటీతో కూడిన పప్పు, సలాడ్లు ఉంటాయని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, ఫైబర్ సమతుల్యత ఉండేలా చూసుకుంటానని వెల్లడించింది. అలాగే పార్టీ టైంలో డైట్ ప్లాన్ బ్రేక్ చేయకుండా ఎలా ఫుడ్ తీసుకుంటున్నామనే దానిపైనే బరువు తగ్గడం అనేది ఆధారపడి ఉంటుందని నొక్కి చెబుతుంది. ఇదేగాక డిన్నర్ టైంలో మఖానా తీసుకుంటానని అన్నారు. ఇది ప్రోటీన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటుంది. పైగా ఇది బరువు తగ్గడం, జీర్ణక్రియ, గుండె ఆరోగ్యానికి మద్దితిస్తుందని చెబుతోంది షెహ్నాజ్. చాలావరకు తేలిక పాటి విందునే స్వీకరించడం ఉత్తమం అని అంటోంది. దీని వల్ల జీర్ణక్రియ, నిద్ర నాణ్యత తోపాటు, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తందని చెప్పుకొచ్చింది. ఇలా ఆరోగ్యకరమైన రీతీలో డైట్ ప్లాన్ తోపాటు స్ట్రిట్‌గా పాటించే గట్స్ ఉంటే ఈజీ బరువు తగ్గగలరని చెబుతోంది.(చదవండి: తలకు మర్దనా చేసేటప్పుడు ఈ చిట్కాలు పాటించండి..! ) -
Priyanka Chopra: కడవల కొద్దీ కన్నీళ్లు వచ్చేస్తాయ్..!
బాలీవుడ్ ప్రసిద్ధ నటి ప్రియాంక చోప్రా(Priyanka Chopra) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమెకు ఫ్యాషన్, నటనల పరంగా సాటిలేరవ్వరూ. తన వైవిధ్యభరితమైన నటనతో ప్రేక్షకులను అలరించి, వేలాదిగా అభిమానులను సొంతం చేసుకుంది. అలాంటి ఆమెకు చిన్న సంఘటనకు కూడా కన్నీళ్లు(cry) ధారాళంగా వచ్చేస్తాయంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. పైగా ఆపడం తన తరం కాదంటూ ఎమోషనల్‌గా మాట్లాడింది. నిజానికి ప్రియాంక భావోద్వేగాలను హ్యాండిల్ చేయగలదు. వాటి విషయంలో భయపడదు కానీ, బాధ కలిగించే సంఘటనలు జరిగితే మాత్రం కళ్లల్లో నీళ్లు తిరిగిపోతాయని చెబుతోంది. అస్సలు ఇలా ఎందుకు జరుగుతుంది. కొందరూ అస్సలు ఏడుపుని బయటకి వ్యక్తం చెయ్యరు. మరికొందరు మాత్రం కళ్ల కిందే నీళ్ల కుండ పెట్టుకున్నట్లుగా వలవల ఏడ్చేస్తుంటారు ఎందుకని..? అంటే..మన శరీరం భావోద్వేగాలను వ్యక్తం చేసేందుకు ఉపయోగించే సహజసిద్ధమైన మార్గమే ఏడుపు అని చెబుతున్నారు మానసిక నిపుణులు(Psychologist). అయితే కొందరూ అత్యంత సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాంటివాళ్లు తమ భావోద్వేగాలని ఆపుకోలేరు. దీంతో సులభంగా కనుల నుంచి నీళ్లు కుండపోత వాన వచ్చినట్లుగా వచ్చేస్తుంటాయి ఇలా ఎందకంటే..సున్నితమైన భావ్వోద్వేగం..అధిక సున్నితమై భావోద్వేగ కలవారు చాలా సులభంగా కన్నీళ్లు పెట్టేస్తుకుంటారట. వారి భావోద్వేగాలు ఇట్టే బయటపడిపోతాయట. దీంతో ఇలాంటి వ్యక్తులు తన భావోద్వేగం తగ్గేంత వరకు ఏడుస్తూనే ఉంటారట. ఒత్తిడి కారణంగా..ఒత్తిడి, ఆందోళన కారణంగా మనసు బరువు ఎక్కువైపోయి ఉంటే ఒక్కసారిగా ఏడుపు రూపంలో అది వ్యక్తమవుతుందట. దీన్ని ప్రెషనర్ కుక్కర్‌తో పోల్చి చెప్పొచ్చని అంటున్నారు. అంతేగాదు మనస్తత్వ శాస్త్రవేత్తలు భావోద్వేగాలతో మనసు నిండిపోయినప్పుడూ దాన్ని శరీరం ఏడుపు రూపంలో ఇలా బయటకు పంపిస్తుందని చెబుతున్నారు. హార్మోన్ల వల్ల...హార్మోన్ల మార్పులు కూడా కన్నీటిని గణనీయంగా ప్రభావితం చేస్తాయట. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్లో హెచ్చుతగ్గులు, ముఖ్యంగా ఋతుస్రావం, గర్భధారణ లేదా రుతువిరతి సమయంలో, వ్యక్తులు ఏడుపుకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలా మంది మహిళలు తమ రుతు చక్రాల సమయంలో అధిక భావోద్వేగాలను అనుభవిస్తారు.నిద్ర లేమి, మానసిక ఆరోగ్యంనిద్ర లేకపోవడం భావోద్వేగ నియంత్రణను బలహీనపరుస్తుందని చెబుతున్నారు నిపుణులు. ఫలితంగా వ్యక్తులు చిన్నదానికి కూడా అతిగి రియాక్ట్ అయ్యి కన్నీళ్లు కార్చేస్తారని చెబుతున్నారు. కొందరికి రోజువారీగా ఏడుపు ఏదో రూపంలో వస్తే మాత్రం మానసిక ఆరోగ్య సమస్యగా పరిగణించి సకాలంలో చికిత్స తీసుకోవాలని చెబుతున్నారు.ఏడుపు ఆరోగ్యకరమైనదేనా?భావోద్వేగాలను వ్యక్తం చేయడానికి ఏడుపు అనేది సహజసిద్ధమైన ఆరోగ్యకరమైన మార్గం. భావాలను అణచివేయడం కంటే ఏడవడమే మంచిదని చెబుతున్నారు. దీనివల్ల గుండెల్లో భారం తగ్గి ప్రశాంతంగా ఉంటారట. అయితే, ఏడుపు అధికంగా లేదా అదుపు చేయలేనిదిగా మారితే మాత్రం అతర్లీనంగా ఉన్న ఆరోగ్య సమస్యగా పరిగణించాలని అన్నారు. సరైన మానసిక నిపుణుల వద్ద కౌన్సిలింగ్ తీసుకుని ఈ సమస్య నుంచి బయటపడే యత్నం చేయాలని సూచిస్తున్నారు. (చదవండి: -
రూ.6,000 కోట్లతో ‘అదానీ హెల్త్ సిటీస్’
అదానీ గ్రూప్ రూ.6,000 కోట్లతో మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌లు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ముంబయి, అహ్మదాబాద్‌ల్లో రెండు అత్యాధునిక 1,000 పడకల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సిద్ధమవుతున్నట్లు అదానీ గ్రూప్ తెలిపింది. ఇందుకోసం మాయో క్లినిక్ సహకారం తీసుకోబోతున్నట్లు చెప్పింది. అన్ని సామాజిక-ఆర్థిక నేపథ్యాలు కలిగిన ప్రజలకు సరసమైన, ప్రపంచ స్థాయి వైద్యాన్ని అందించే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ పేర్కొంది.అదానీ హెల్త్ సిటీస్‌గా పిలుస్తున్న ఈ రెండు ఇంటిగ్రేటెడ్ హెల్త్ క్యాంపస్‌ల్లో 150 మంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు, 80 మందికి పైగా రెసిడెంట్ డాక్టర్లు, 40 మందికి పైగా ఫెలోషిప్ డాక్టర్లు పనిచేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్యాంపస్‌లో మెడికల్ కాలేజీలతో సహా అధునాతన వైద్య సదుపాయాలు అందిస్తారని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బయోమెడికల్ ఇన్ఫర్మేటిక్స్, క్లినికల్ రీసెర్చ్ వంటి అత్యాధునిక రంగాలపై దృష్టి సారించే ట్రాన్సిషనల్ కేర్ యూనిట్లు, రీసెర్చ్ సెంటర్లు కూడా ఈ క్యాంపస్‌ల్లో ఉంటాయని చెప్పారు.ఇదీ చదవండి: బాలెనో ధరల పెంపుఆరోగ్య సంరక్షణ, విద్య, నైపుణ్యాభివృద్ధిని మెరుగుపరచడానికి సిద్ధంగా ఉన్నట్లు అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ నొక్కి చెప్పారు. మాయో క్లినిక్‌తో తమ భాగస్వామ్యం దేశంలో ఆరోగ్య సంరక్షణ ప్రమాణాలను పెంచడానికి సహాయపడుతుందన్నారు. అదానీ హెల్త్ సిటీస్ సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు సేవ చేయడానికి రూపొందించబడుతుందని తెలిపారు. అధిక నాణ్యత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. -
Salman Khan : రెండు గంటలే నిద్రపోతా! నిపుణులు ఏమంటున్నారంటే..!
బాలీవుడ్ ప్రముఖ నటుడు, కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్లో ఉంటుంది. ఈ వయసులో కూడా ఆయన కుర్ర హీరోలకు ఏ మాత్రం తీసిపోని రేంజ్లో గ్లామర్‌గా ఉంటారు. ఇప్పటికీ అదేవిధంగా బాడీ మెయంటైన్ చేస్తూ తన అభిమానులను ఖుషి చేస్తుంటారు. సల్మాన్ సినిమా అనగానే ప్రేక్షకుల అంచనాలే వేరేలెవెల్లో ఉంటాయి. అందుకు తగ్గట్టుగానే తన అభినయంతో మెప్పించి విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు సల్మాన్. అంతేగాదు ఆయన నటనకు గానూ ఎన్నో అవార్డు వరించాయి కూడా. ఆయన తన మేనల్లుడు అర్హాన్ ఖాన్‌తో జరిగిన సంభాషణలో తన జీవనశైలి గురించి మాట్లాడారు. అది వింటే అన్ని గంటలేనా నిద్ర అని విస్తుపోతారు. అయితే నిపుణులు మాత్రం అది మంచిది కాదంటూ వార్నింగ్ ఇస్తున్నారు. మరీ సల్మాన్ ఏం చెప్పారు. ఎంతసేపు నిద్రపోతే ఆరోగ్యం సురక్షితం తదితరాల గురించి చూద్దామా..!.సల్మాన్ ఖాన్ ఇటీవల తన మేనల్లుడు అర్హాన్ ఖాన్‌తో జరిగిన సంభాషణలో తాను సాధారణంగా రెండు గంటలే పడుకుంటానంటూ బాంబు పేల్చారు. ఎప్పుడో నెలకు ఒకసారి మాత్రమే ఏడు నుంచి ఎనమిది గంటలు పడుకుంటానని అన్నారు. అందువల్లే ఒకోసారి సెట్లో చిన్న విరామాలో నిద్రపోతానని అన్నారు. 59 ఏళ్ల సల్మాన్ తనకు వేరే పనిలేకపోతేనే నిద్రపోతానని చెబుతున్నారు. ముఖ్యంగా తాను జైల్లో ఉన్నప్పుడు బాగా నిద్రపోయానని అన్నారు. అలాగే విమానంలో కూడా నిద్రపోతానని అన్నారు. ఇదే మాదిరిగా షారుక్ కూడా ఒకనొక సందర్భంలో తన నిద్ర షెడ్యూల్ గురించి మాట్లాడారు. తాను ఉదయం 5 గంటలకు నిద్రపోయి 9 గంటలకు మేల్కొంటానని అన్నారు. ఇలా నిద్రపోతే మంచిదేనా అంటే..క్రమరహితమైన నిద్ర ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ప్రతి వ్యక్తి రాత్రి 7 నుంచి 9 గంలటకు నిద్రపోవాలని నొక్కి చెబుతున్నారు. నిద్రలేమి వల్ల ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్, రక్తపోటు, గుండెపోటు, స్ట్రోక్, డిప్రెషన్, చిత్తవైకల్యం, కొన్ని రకాల కేన్సర్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అన్నారు. దీని కారణంగా డ్రైవింగ్ సామర్థ్యం కూడా బలహీనపడుతుందని చెబుతున్నారు నిపుణులు. మొత్తం నిద్రను ఒకేసారి పూర్తి చేయడం మంచిది. రాత్రిపూటకే ప్రాధాన్యత ఇవ్వాలి లేదంటే పగటిపూట అంతేస్థాయిలో సమతుల్య నిద్రను పూర్తిచేయాలి. నిద్ర స్థిరంగా ఉండేలా చూసుకోవాలి. ఒకే సమయానికి పడుకోవడం, మేల్కొనడం వంటివి చేయాలి. స్థిరమైన నిద్ర షెడ్యూల్ మొత్తం మెరుగైన ఆరోగ్యంతో ముడిపడి ఉందని చెబుతున్నారు వైద్యులు .(చదవండి: నీట్ ఎగ్జామ్ పాసైన 62 ఏళ్ల డాక్టర్.. స్టూడెంట్‌గా కాలేజ్‌లో..!) -
ప్రెగ్నెన్సీ టైంలో మార్పులు ఉంటాయా..?
నేను ఇప్పుడు ఐదునెలల గర్భవతిని. రొమ్ముల్లో చాలా నొప్పి ఉంటోంది. ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయ్యాక రొమ్ముల్లో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఏవి నార్మల్ అనేది తెలియజేయండి?– బిందు, విజయవాడ. బ్రెస్ట్ టిష్యూలో కొవ్వు ఉంటుంది. లోబ్యూల్స్ అంటే పాలను ఉత్పత్తి చేసేవి. డక్ట్స్ అంటే పాలను క్యారీ చేసేవి ఉంటాయి. ప్రెగ్నెన్సీలో ఈ లోబ్యూల్స్, డక్ట్స్ పాలను ఉత్పత్తి చేయటానికి సిద్ధమవుతుంటాయి. అందుకే, ప్రెగ్నెన్సీలో కొన్ని మార్పులు రెండు రొమ్ముల్లోనూ ఉంటాయి. సాధారణ మార్పులు అంటే రెండు రొమ్ముల ఆకారం, పరిమాణం మారుతాయి. నిపుల్స్, ఆరియోలా డార్క్‌గా మారుతాయి. వాటి చుట్టూ ఉన్న చర్మం కూడా డార్క్ అవుతుంది. కనిపించే రొమ్ము సిరల మీద స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి. రొమ్ములు సున్నితంగా అవుతాయి. బ్రెస్ట్ అవేర్నేస్ అనేది ఈ రోజుల్లో చాలా అవసరం. త్వరగా కేన్సర్‌ని డిటెక్ట్ చేయవచ్చు. ప్రతి మూడు వందల్లో ఒకరికి ప్రెగ్నెన్సీలో కూడా కేన్సర్ రావచ్చు. అందుకే బ్రెస్ట్ మీద చర్మం ముడతలు పడటం, నిపుల్ నుంచి గ్రీన్ కలర్ డిశ్చార్జ్ వచ్చినా, గడ్డలు తగిలినా అల్ట్రాసౌండ్ టెస్ట్స్ ప్రెగ్నెన్సీలో చేస్తాం. ఏ సందేహం ఉన్నా బయాప్సీకి పంపిస్తాం. బ్రెస్ట్ ఫీడింగ్‌లో రొమ్ము కేన్సర్ ప్రమాదం చాలా తగ్గుతుంది. బ్రెస్ట్ ఫీడింగ్ డెలివరీ అయిన అరగంటలోపు చేయాలని అందుకే ఎంకరేజ్ చేస్తాం. ఎంత ఎక్కువ కాలం బ్రెస్ట్ ఫీడ్ ఇస్తే అంత మంచిది. కేన్సర్ రిస్క్ అంత తక్కువ చేస్తుంది. ఫీడింగ్ ఇచ్చే సమయంలో బ్రెస్ట్ గట్టిగా అవటం, ఫ్యూయర్ రావటం, నొప్పి ఉండటం చూస్తాం. దీనిని ఎంగేజ్మెంట్ అంటాం, పాల డక్ట్స్ బ్లాక్ అయినందున ఇలా అవుతుంది. ప్రెగ్నెంట్ బ్రెస్ట్ ఫీడింగ్, ఎక్స్ట్రా మిల్క్‌ను తొలగించటంలాంటి వాటితో ఎంగేజ్‌మెంట్‌ను ప్రివెంట్ చేయవచ్చు. బ్రెస్ట్ స్పెషలిస్ట్‌ని సంప్రదించటం మంచిది. ప్రసవం అయి, బ్రెస్ట్ ఫీడింగ్ సమయంలో కూడా రొమ్ముల్లో మార్పులు ఉంటాయి. ఈ మార్పులు చాలా వరకు ఫీడింగ్ ఆపిన తరువాత నార్మల్ బ్రెస్ట్లాగా అవుతాయి.రొటీన్ చెకప్స్ చాలా అవసరం. ప్రతి నెలా ప్రెగ్నెన్సీలో బ్రెస్ట్ స్కిన్ టెక్స్చర్ మారుతుందా, ఆర్మ్పిట్లో ఏవైనా లంబ్స్ వచ్చాయా, నిపుల్ డిశ్చార్జ్లోను అకస్మాత్తుగా ఆకార పరిమాణాల్లోను మార్పులు వచ్చినా, నిపుల్ ఇన్వెన్షన్, డిసెక్షన్స్లో మార్పులు అయినా, దురద ఉన్నా వెంటనే డాక్టర్ని కలవాలి. డాక్టర్ భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ (చదవండి: ఉమ్మనీరు పోతే ఎలా తెలుసుకోవాలి?) -
ఆరోగ్యకరమైన ఆహారమే అయినా బరువు తగ్గడం లేదు ఎందుకు..?
కొందరికి బరువు తగ్గడం అత్యంత క్రిటికల్‌గా మారిపోతుంటుంది. ఎంతలా ప్రయత్నించిన చక్కటి ఫలితం మాత్రం దక్కదు. ఆఖరికి ఆరోగ్యకరమైన ఆహారమే తీసుకున్నా ఎందువల్ల బరువు తగ్గలేకపోతున్నామనేది అర్థంకానీ చిక్కుప్రశ్నలా వేధిస్తుంటుది. అందుకు గల ముఖ్యమైన ఆటంకాల గురించి పోషకాహార నిపుణురాలు అంజలి ముఖర్జీ(Anjali Mukerjee) సోషల్‌మీడియా వేదికగా వెల్లడించారు. కొందరు బరువు తగ్గడానికి చాలా కష్టపడుతుంటారని, వాళ్లంతా చేసే తప్పులు ఇవే అంటూ వివరించారు. అవేంటంటే..పోషకాహారమే తీసుకుంటున్నాం(Eating Healthy) అయినా సరే బరువు తగ్గడం భారంగా మారిపోతోందన్నారు. అలాంటివాళ్లను తాను స్వయంగా చూశానన్నారు. ఇన్‌స్టాలో “ఆరోగ్యంగా తిన్నప్పటికీ బరువు తగ్గడానికి కష్టపడుతున్నారా? అనే క్యాప్షన్‌తో అందుకు గల కారణాలను వివరించారు ముఖర్జీ. కొన్నిసార్లు మీరు ఏం తింటున్నారనేది ప్రధానం కాదు, శరీరం దానికి తగిన విధంగా ప్రాసెస్ చేస్తుందా లేదా అనేది కూడా గమనించాలని అన్నారు. అసలు బరువు తగ్గాలనుకున్నవాళ్లు చేసే తప్పులు ఏంటంటే..పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం చేసే తప్పులుబరువు తగ్గించే జర్నీలో డైట్ అనేది ఎంత ముఖ్యమే సమతుల్యంగా తీసుకుంటున్నామో లేదా అన్నిది కూడా అంతే ప్రధానం అని చెబుతున్నారు అంజలి.అలాగే ఆహరం పరిమాణ, కేలరీలను గమనించండి. ఎందుకంటే బాదం, నెయ్యి ఆరోగ్యానికి మంచివే గానీ ఆ రోజు నువ్వు తీసుకునే కేలరీల ఆధారంగా తీసుకోవాలా లేదా నిర్ణయించుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారాలను అతిగా తినడం: అంటే మంచిది కదా అని అవకాడో, వాల్నట్లు, జీడిపప్పు, ఖర్జూరాలు, ఎండుద్రాక్ష మరియు డార్క్ చాక్లెట్లను ఎక్కువగా తినేస్తుంటారు. దీని వల్ల కూడా బరువు తగ్గడం సాధ్యం కాదని అన్నారు. హార్మోన్ ఆరోగ్యాన్ని అంచనా వేయండి: అంటే ఒక్కోసారి థైరాయిడ్ అనేది రక్తపరీక్షల్లో కూడా బయటపడకపోవచ్చు. దీనివల్ల కూడా బరువు తగ్గించే ప్రయత్నం విఫలమయ్యే అవకాశం ఉంటుందట. దీర్ఘకాలిక ఒత్తిడి: ఒత్తిడి కార్టిసాల్ స్థాయిలలో పెరుగుదలకు దారితీస్తుంది. ఇది క్రమంగా బొడ్డు కొవ్వుకు దారితీస్తుంది. అంటే ఇక్కడ ఒత్తిడిని నిర్వహించడం అనేది అత్యంత ప్రధానం. అదే బరువు తగ్గడానికి సహయపడుతుందట. పేగు ఆరోగ్యాన్ని నిర్వహించడం: పైన పేర్కొన్న అంశాలతో పాటు, పేగు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా ముఖ్యమని అంజలి చెప్పారు. అడపాదడపా ఉపవాసం వంటి వాటిని ప్రయత్నించి సరైన విధంగా ఆహారం తీసుకుంటేనే చక్కటి ఫలితాన్ని అందుకోగలుగుతారని అన్నారు. అలాగే అనుసరించే డైట్‌కి శరీరం స్పందించే విధానాన్ని కూడా పరిగణలోనికి తీసుకుంటే మరిన్ని చక్కటి ఫలితాలను అందుకోగలుగుతారని చెప్పారు ముఖర్జీ.(చదవండి: యంగ్ లుక్ మంచిదే!) -
నిద్రలేమితో నా'ఢీలా'!
నిద్రకూ, మెదడూ అలాగే నాడీ వ్యవస్థకు ఉన్న సంబంధం చాలా సంక్లిష్టం. అయినప్పటికీ చాలా చిన్న చిన్న ఉదాహరణలతోనే ఆ సంక్లిష్ట సంబంధాన్ని నిరూపించవచ్చు. ఉదాహరణకు క్రితం రాత్రి నిద్రలేకపోతే... ఆ మర్నాడంతా దేనిపైనా దృష్టి కేంద్రీకరించలేరు. స్వల్పకాలిక జ్ఞాపకశక్తి (షార్ట్ టర్మ్ మెమరీ) తగ్గుతుంది. అలాగే నాలుగైదు రోజులు సరిగా నిద్రలేకపోతే చిన్న చిన్న విషయాలకే చికాకు కలగవచ్చు. చిర్రెత్తుకురావచ్చు. పిచ్చికోపం వచ్చేస్తుంది. కొన్ని భ్రాంతులకూ లోనయ్యే ప్రమాదం ఉంది. ఇలా నిద్రలేమి కారణంగా మూడ్స్ మారిపోవడాన్ని బట్టి చూస్తే... నిద్రకూ, నాడీ వ్యవస్థకూ సంబంధముంటుందని తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు... వాహనాలు నడిపేవారికి తగినంత నిద్రలేకపోతే డ్రైవింగ్‌పై పూర్తిగా దృష్టి నిలపలేక యాక్సిడెంట్లు అయిన ఉదంతాలు అన్నీ ఇన్నీ కావన్నది అందరికీ తెలిసిన విషయాలే.నిద్ర సమయంలో మెదడులో జరుగుతూ మానవులకు మేలు చేసే కొన్ని పరిణామాలివి... పెద్దవాళ్ల విషయంలో... అల్జిజమర్స్ వ్యాధికి గురికావడం : మెదడులో వెలువడే కొన్ని విషపూరితమైన రసాయనాలను అంటే... ఉదాహరణకు బీటా ఎమైలాయిడ్ ప్యాక్ వంటి పాచిలాంటి పదార్థాలను నిద్రపోయే సమయంలోనే బ్రెయిన్ వదిలించుకుంటుంది. ఈ పాచి వంటి రసాయనాలే అల్జిజమర్ వ్యాధికి కారణమవుతాయి. ఈ వ్యాధి ఎంతటి ప్రమాదకరమైనదంటే గతంలో తాను నివసించిన ప్రాంతాలు, తాను నివాసముంటున్న ఇల్లు, తనకు తెలిసిన అన్ని నైపుణ్యాలు (వాహనం నడపడం వంటివి) ఇలా అన్నింటినీ మరచిపోయే ప్రమాదముంటుంది. అల్జిమర్స్ సోకినవాళ్లు మింగడం ఎలాగో అనేదేకాదు... చివరికి తానెవరో అనే సంగతీ మరచిపోతారు. స్లీప్ ఆప్నియా: గొంతులోంచి ఊపిరితిత్తులకు గాలిని తీసుకెళ్లే నాళం ముడత పడటంతో శ్వాసప్రక్రియలో అందులోంచి గాలి ప్రవహించేటప్పుడు గురక వస్తుంది. చాలామంది గురకను తేలిగ్గా తీసుకుంటారుగానీ ‘స్లీప్ ఆప్నియా’ అని పిలిచే ఇది... చాలా ప్రమాదకరమైన వ్యాధి. గొంతులోని వాయునాళానికి సంబంధించిన ఈ వ్యాధిని... నిజానికి ముక్కు, గొంతుకు సంబంధిత రుగ్మత అనుకుంటారుగానీ... ఈ వ్యాధికీ మెదడుకూ ఎంత సంబంధముంటుందంటే... గురక సమయంలో ముడుచుకుపోయిన వాయునాళం కారణంగా మెదడుకు తగినంత ఆక్సిజన్ అందనప్పుడు... బాధితుణ్ణి నిద్రలేవాల్సిందిగా మెదడు ఆదేశిస్తుంది. ఈ శ్వాసనాళం పూర్తిగా మూసుకుపోవడం అనే పరిస్థితి 10 సెకండ్లకు పైగానే కొనసాగవచ్చు. అంటే ఆ టైమ్‌లో శ్వాస అందదు. అలాంటి ప్రమాదకరమైన పరిస్థితిని తప్పించడానికి బాధితుణ్ణి నిద్రలేవమని మనను మన మెదడు ఆదేశిస్తుంది. అప్పుడు నిద్రలేచి శ్వాస తీసుకుని మళ్లీ నిద్రలోకి జారుకుంటారు. అలా నిద్రాభంగం కాగానే ముడుతలు పడ్డ వాయునాళం కాస్తా మామూలుగా అయిపోవడంతో మళ్లీ మెదడుకు తగినంత ఆక్సిజన్ అందుతుంటుంది. ఇలా శ్వాస అందని (ఆప్నియా) స్థితి ఒక రాత్రిలోనే కొన్ని వందల సార్లు రావచ్చు. ఫలితంగా వచ్చే నిద్రలోటును ‘స్లీప్ డెఫిసిట్’ అంటారు. ఇలా గురక వస్తూ ఉంటుంది కాబట్టి మెదడుకు తగినంత ఆక్సిజన్ అందకపోవడంతో అలాగే నాణ్యమైన నిద్ర కరవు కావడంతో (అంటే స్లీప్ డెఫిసిట్‌తో) ఆ మర్నాడు బాధితులు మగతగా, డల్‌గా కనిపిస్తుంటారు. దేనిపైనా దృష్టి కేంద్రీకరించలేరు. దీనివల్ల అర్థం చేసుకునే శక్తి, లాజికల్‌గా నేర్చుకునే శక్తియుక్తులు (కాగ్నెటివ్ ఎబిలిటీస్) తగ్గుతాయి. అంతేకాదు... పలు నాడీ సంబంధమైన రుగ్మతలు (న్యూరలాజికల్ కండిషన్స్)తోపాటు క్రమంగా మెదడు ఆరోగ్యమూ ప్రభావితమయ్యే అవకాశముంది. పక్షవాతం : నిద్రలేమి కారణంగా మెదడుకు కలిగే అసౌకర్యాలూ లో΄ాలతో పక్షవాతం లాంటి తీవ్రమైన వ్యాధులు సైతం వచ్చే అవకాశముంది. త్వరగా వయసు పైబడటం: నిద్రలేమి కారణంగా వయసు పెరగడం (ఏజింగ్) వల్ల కలిగే అనర్థాలు చాలా త్వరగా వచ్చేస్తాయి. కంటినిండా నిద్ర΄ోయే వారిలో ఏజింగ్ ప్రక్రియ నెమ్మదిగా జరుగుతుంది. అంటే వాళ్లు సుదీర్ఘకాలం ΄ాటు యౌవనంగా ఉంటారు. ఆరోగ్యకరమైన నిద్ర వల్ల చర్మం త్వరగా ముడతలు పడదు. అలా ముడతలు పడకుండా ఉంచేందుకు దోహదపడే కొలాజెన్ అనే కణజాలం చాలా కాలం పటుత్వంగా ఉండటంతో చర్మంపైనా, కళ్ల కింద నల్లబడటం జరగదు (డార్క్ సర్కిల్స్ రావు). నుదుటిమీద గీతలు పడవు. మంచి నిద్రతోనే మంచి జ్ఞాపకశక్తి : నిద్రలో మెదడులో కొన్ని తరంగాలు లయబద్ధంగా కదులుతూ ఉంటాయి. వాటినే ‘షార్ట్ వేవ్ రిపుల్స్’ అంటారు. మనుషులు ఏదైనా విషయాన్ని గుర్తుపెట్టుకున్నప్పుడు అది మరింతగా గుర్తుండిపోవడానికి కారణమౌతూ జ్ఞాపకశక్తికి తోడ్పడేవి ఈ తరంగాలే. అమెరికన్, ఫ్రెంచ్ శాస్త్రజ్ఞులు 2009లో నిర్వహించిన ఒక పరిశోధన ప్రకారం ఈ జ్ఞాపకాలన్నీ మెదడులోని హి΄్పోక్యాంపస్ నుంచి మరో ప్రాంతం అయిన నియోకార్టెక్స్‌కు బదిలీ అయి... అక్కడ దీర్ఘకాలపు జ్ఞాపకాలు (లాంగ్ టర్మ్ మెమరీ)గా ఉండిపోతాయి. అంటే ఇక్కడ షార్ట్ టర్మ్ మెమరీగా ఉన్న జ్ఞాపకాలు... అక్కడ లాంగ్ టర్మ్ మెమరీస్‌గా మారి శాశ్వతమవుతాయి. అందుకు కారణమైన ‘షార్ప్ వేవ్ రిపుల్స్’ అన్నీ గాఢనిద్రలోనే సాధ్యమవుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే... నిద్ర ఉంటేనే మంచి జ్ఞాపకశక్తి సాధ్యమవుతుంది.నిద్రతోనే పిల్లలు ఎత్తు పెరిగే సామర్థ్యం: పిల్లల్లో ఎత్తు పెరిగేందుకు సహాయం చేసే గ్రోత్ హార్మోన్లు నిద్రలోనే స్రవించేలా మెదడు ఆదేశాలు ఇస్తుంది. అంటే పిల్లలు కంటి నిండా నిద్రపోతేనే బాగా పెరుగుతారు. బాగా ఎత్తుగా ఎదురుతారు. ఒక వయసు దాటాక ఇదే గ్రోత్ హార్మోన్ కండరాలను పెంచుతుంది. అవి మందంగా అయ్యేలా చేస్తుంది. ఎముకలను గట్టిపరుస్తుంది. చిన్న పిల్లలు కంటి నిండా నిద్రపోతున్నారంటే... పై ప్రయోజనాలన్నీ చేకూరుతున్నాయని అర్థం. మంచి నిద్ర కోసం... ప్రతిరోజూ ఒకే వేళకు నిద్రించడం / నిద్రలేవడం నిద్రపోయే ముందర సమస్యలను చర్చించకపోవడం గోరువెచ్చటి నీళ్లతో స్నానం, శ్రావ్యమైన సంగీతం వినడం రాత్రిపూట పడుకునే ముందు కాఫీ, టీ, శీతల నీయాలు, మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉండటం నిద్రకు ముందర టీవీ చూడటం, కంప్యూటర్ పై పనిచేయడానికి దూరంగా ఉండటం పడకగదిలో మరీ ఎక్కువ కాంతిగానీ, చప్పుళ్లు గానీ లేకుండా చూసుకోవడంపడకగదిలో మరీ ఎక్కువ చల్లగా లేకుండా, వెచ్చగా లేకుండా జాగ్రత్తపడటం అన్నిటికంటే ముఖ్యంగా రోజూ దేహానికి తగినంత వ్యాయామం ఇవ్వడం. దానితోటు మెదడుకు మేతగా సుడోకూ, పజిల్స్ వంటివి సాల్వ్ చేస్తూ మెదడుకూ తగినంత వ్యాయామాన్ని కల్పించడం. ఇలాంటివి చేయడం వల్ల మంచి నిద్ర పట్టడంతోపాటు మెదడుకూ మంచి ఆరోగ్యం సమకూరుతుంది. డా. విక్రమ్ కిశోర్ రెడ్డి, సీనియర్ న్యూరో ఫిజిషియన్ (చదవండి: అందాన్ని చెడగొట్టే పులిపిరులను సులభంగా తొలగించుకోండిలా..!) -
ఉమ్మనీరు పోతే ఎలా తెలుసుకోవాలి?
నాకు ఇప్పుడు ఎనిమిదవ నెల. ముందుగానే ఉమ్మనీరు పోతే కష్టమని విన్నాను. ఉమ్మనీరు పోతే ఎలా తెలుసుకోవాలి? ఏమైనా ప్రమాదం ఉంటుందా?– మమత, జమ్మలమడుగు.శిశువు చుట్టూ గర్భంలో ఉమ్మనీరు ఉంటుంది. ఉమ్మనీరు కొంతమందిలో మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్స్ ఉన్నా, వెజైనా లేదా సర్విక్స్ బలహీనమైనా, ఎనిమిదవ నెలలో ఉమ్మనీరు సంచి పలుచనైయి, చిట్లుతుంది. అప్పుడు నొప్పులు లేకుండానే ఉమ్మనీరు పోవటం వలన లోపల శిశువుకు, తల్లికి ఇన్ఫెక్షన్ రిస్క్ ఉంటుంది. 24 వారాల నుంచి 37 వారాల లోపల ఉమ్మనీరు పోతే ప్రీమెచ్యూర్ బర్త్ అంటాం. ఇది తెలుసుకోవటం కొందరికి తెలియక పోవచ్చు. అకస్మాత్తుగా నీరు వెజైనా నుంచి పోవటం, కంట్రోల్ చేసుకోలేకపోవటం, ధారగా ఉండటం, యూరిన్ వాసన లేకపోవటం లాంటివి ఉంటే, ఇంట్లోనే తెలుసుకోవచ్చు. లేదా వెంటనే డాక్టర్ని కలిస్తే, వారు స్పెక్యులమ్ పరీక్ష ద్వారా చెక్ చెస్తారు. అమోనిసోర్ అనే టెస్ట్ ద్వారా కూడా డాక్టర్ చెక్ చేస్తారు. ఇది వెజైనల్ స్వాబ్ టెస్ట్ లాగా ఉంటుంది. ఇది 99 శాతం సెన్సిటివ్ టెస్ట్. మీరు ఆసుపత్రికి వచ్చినప్పుడు ఈ పరీక్షతో పాటు, మీ పల్స్, బీపీ, టెంపరేచర్ చెక్ చేసి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా అని చూస్తారు. ఒకవేళ లీకింగ్ ఉందని తెలిస్తే, అడ్మిట్ చేసి 24–48 గంటలు అబ్జర్వ్ చేస్తారు. ఈ సమయంలో బేబీ వెల్ బీయింగ్ స్కాన్ చేస్తారు. యాంటీబయోటిక్స్ ఇస్తారు. నెలలు నిండలేదు కాబట్టి శిశువుకు లంగ్ మెచ్యూరిటీ కోసం స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇస్తారు. నియో నాటాలజిస్ట్ ద్వారా కౌన్సెలింగ్ చేసి ప్రీమెచ్యుర్ బేబీ రిస్క్స్, కాంప్లికేషన్స్, కేర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకవేళ మీకు నొప్పులు వచ్చి, ప్రసవం అవుతుంటే సురక్షితంగా, ఎలా కాన్పు చెయ్యాలి అని చూస్తారు. ఒకవేళ నొప్పులు రాకపోతే, పైన చెప్పినట్లు యాంటీబయోటిక్స్ ఇచ్చి, అబ్జర్వ్ చేసి డిశ్చార్జ్ అయిన తరువాత ఇంట్లో ఎలా మానిటర్ చేసుకోవాలో వివరిస్తారు. వారానికి రెండుసార్లు ఉమ్మనీరు, బేబీ బ్లడ్ ఫ్లో స్టడీస్ చేస్తారు. ప్రెగ్నెన్సీ 37 వారాల వరకు పొడిగించడానికి ఎలాంటి కేర్ తీసుకోవాలో చెప్తారు. రెగ్యులర్ చెకప్స్, ఫాలో అప్స్లో ఏ సమస్య లేకుండా డాక్టర్ సలహాలను పాటించాలి. (చదవండి: వ్యాధిని వరంలా మార్చి..కుటుంబాన్ని పోషించింది..!) -
బ్రకోలి ఆరోగ్యానికి మంచిదని కొనేస్తున్నారా..?
ప్రస్తుంతం అందరూ ఆరోగ్య స్ప్రుహతో బ్రకోలిని ఇష్టంగా తినడం మొదలు పెట్టారు. అస్సలు కాలీఫ్లవర్ వైపుకి చూడనివాళ్లు సైతం బ్రకోలి ప్రయోజనాలు తెలిసి మిస్ చేయకుండా కొంటున్నారు. అయితే ఆరోగ్యానికి మంచివని కొనేముందు తాజాగా ఉందా లేదా అనేది గమనించాలి. ఏమరపాటుతో కొంటే మాత్రం ఆరోగ్యదాయకమైనవి కూడా అత్యంత ప్రమాదకరమైనవిగా మారిపోతాయి. ఇలాంటివి కొనేటప్పడు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోకపోతే సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన అధికారులు. ఎందుకంటే..?..యూఎస్‌లోని సుమారు 20 రాష్ట్రాల్లోని ప్రజలు కొన్ని దుకాణాల నుంచి ప్యాక్ చేసి ఉన్న బ్రకోలి(Broccoli)ని కొనుగోలు చేశారు. వెంటనే యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (US Food and Drug Administration (FDA)) అప్రమత్తమై తినొద్దని హెచ్చరించింది. వాటిని వెనక్కి ఇచ్చేయండి లేదా ఉపయోగిచకండి అని విజ్ఞప్తి చేసింది. ఎందుకంటే ఎఫ్‌డీఏ అధికారులు ఓ దుకాణంలో యాదృచ్ఛికంగా బ్రకోలిని టెస్ట్ చేయగా దానిలో ప్రాణాంతక లిస్టెరియా మోనోసైటోజీన్ బ్యాక్టీరియాలు(Listeria monocytogenes) ఉన్నట్లు గుర్తించారు. దీంతో డిసెంబర్ 2024 తొలివారంలో ఎవరైతే ఈ బ్రకోలిని కొన్నారో వారు.. డిసెంబర్ 10 కల్లా ఉపయోగిస్తే పర్లేదని అలాకాని పక్షంలో తక్షణమే వినియోగించటం మానేయాలని సూచించింది. ఎందుకంటే ప్యాకింగ్ చేసినప్పుడు నిల్వ తక్కువ ఉండే ఆహార పదార్ధాల్లో ఆటోమేటిగ్గా ఇలాంటి బ్యాక్టీరియా ఫామ్ అవుతుందట. అందువల్ల దయచేసి ఇలాంటి కూరగాయాలను ప్యాకింగ్ కవర్‌పై ఉండే డేట్ ఆధారంగా కొనడం, ఉపయోగించడం వంటివి చేయండి అని చెబుతున్నారు. ఇలాంటి కలుషితమైన బ్రకోలి తింటే ఆరోగ్యవంతుడైన వ్యక్తులలో అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, వికారం, కడుపు నొప్పి, విరేచనాలు వంటి స్వల్పకాలిక లక్షణాలు సంభవిస్తాయని చెబుతున్నారు. అదే గర్భిణీ స్త్రీలలో గర్భస్రావాలు, నెలలు నిండకుండానే ప్రసవించడం వంటివి జరుగుతాయని చెబుతున్నారు. ఏంటీ లిస్టెరియా మోనోసైటోజీన్లు:లిస్టెరియా మోనోసైటోజెన్స్ అనేది వ్యాధికారక బాక్టీరియం. ఇది మానవులకు జంతువులకు సోకుతుంది. అనేక ఇతర బాక్టీరియాలా కాకుండా లిస్టెరియా రిఫ్రిజిరేటెడ్ పరిసరాలలో వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ఆహర ఉత్పత్తి నిల్వలో ఈబ్యాక్టీరియా ఉత్ఫన్నమవుతుంది. అందువల్ల కొన్ని ఆహార పదార్థాలు అంటే.. మహా అయితే ఐదు రోజులకి మించి నిల్వ చేయలేని కూరగాయల్లో ఇది ఫామ్ అవుతుంది. తాజా కూరగాయాలు ఆరోగ్యానికి మంచివి. అది కూడా రైతులు కోసుకొచ్చిన.. రెండు మూడు రోజులకి మించి నిల్వ లేనివి అయితేనే మంచివనే విషయం గ్రహించాలి. నిజానికి బ్రకోలి సూపర్ ఫుడ్. ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలని ఇస్తుంది. కానీ అన్నింటికంటే ఇది ఫ్రెష్‌గా ఉందా లేదా అనేది నిర్థారించి తీసుకోవడం మంచిది అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: చుట్టుముట్టిన ఆరోగ్య సమస్యలతో రైతుగా మారాడు..! కట్‌చేస్తే..) -
LED Light Therapy: అన్ని రోగాలకు దివ్యౌషధం..!
ముడతలు, సోరియాసిన్, మచ్చలు, ఎండతాకిడికి దెబ్బతిన్న చర్మానికి మంచి చికిత్సగా ‘లెడ్‌లైట్ థెరపీ’ ఉత్తమమని చెబుతున్నారు ఆధునిక పరిశోధకులు. కొందరైతే ‘లెడ్‌లైట్ థెరపీ’ అనేది అన్ని రకాల రోగాలకు దివ్యౌషధం అని ప్రచారం చేస్తున్నారు. లెడ్‌లైట్ థెరపీని లో–పవర్డ్ లేజర్ థెరపీ, కోల్డ్ లేజర్ థెరపీ, ఎల్ఈడీ లైట్ థెరపీ అని కూడా పిలుస్తారు.నొప్పి, మంట, కణజాల నష్టాన్ని తగ్గించడంలో, నోటిపూతలు, మచ్చలు, కాలిన గాయాలను నయం చేయడానికి, కొన్ని రకాల అల్సర్లను నయం చేయడానికి లెడ్‌లైట్ థెరపీ ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.పార్కిన్సన్, అల్జీమర్స్, మల్టిపుల్ స్లిరోసిస్, ఆర్థరైటిస్, ఆటిజం ఉన్న రోగులకు కూడా లెడ్‌లైట్ థెరపీ ఉపయోగపడుతుందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి.ఈ చికిత్స సులువైనది. నొప్పి ఉండదు.లెడ్‌లైట్ థెరపీలో కూర్చున్న లేదా పడుకున్న పేషెంట్‌ను పదిహేను నిమిషాల పాటు లెడ్లైట్కు ఎక్స్పోజ్ చేస్తారు.‘సరిగ్గా వినియోగించినప్పుడు లెడ్‌లైట్ చికిత్స చాలా సురక్షితం’ అంటున్నారు నిపుణులు.‘అన్నిరకాల సమస్యలకు లెడ్లైడ్ థెరపీ పనిచేయకపోవచ్చు’ అంటున్నారు వైద్య అవసరాల కోసం లైట్, లేజర్ల ఉపయోగాలకు సంబంధించిన ఎక్స్పర్ట్, వోరల్ బయాలజీ, బయో మెడికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ ప్రవీణ్ అరణి.ఆందోళన నుంచి ఉపశమనం, కండరాల పనితీరును మెరుగుపరచడం, ఆటల వల్ల అయిన గాయాల నుంచి కోలుకోవడం, చర్మానికి యాంటీ ఏజింగ్ ప్రయోజనాలు...మొదలైన వాటికి సంబంధించి లెడ్‌లైట్ థెరపీని ఉపయోగిస్తున్నారు. అయితే దీనివల్ల ఎంత మేలు జరుగుతుందనే విషయంలో లోతైన అధ్యయనాల కొరత కనిపిస్తుంది. (చదవండి: ఆ... భరణం అచ్చం అలాగే!) -
మగ దేవుళ్ళను కూడా పూజించొద్దు అంటున్నాడు మా ఆయన
మా పెళ్ళయి 15 సంవత్సరాలయింది. ఇద్దరు పిల్లలు. మొదటి నుంచి మా ఆయన నన్నెంతో ప్రేమించేవారు. కానీ ఇటీవల 2 సంవత్సరాల నుండి అనుమానంతో వేధిస్తున్నాడు. ప్రత చిన్న విషయానికీ ఆయనకు నాపైన అనుమానమే! చివరకు నా అన్నా తమ్ముడితో మాట్లాడినా అనుమానమే! ఒకప్పుడు తరచు సినిమాకో, హోటల్‌కో తీసుకెళ్ళే ఆయన, ఇపుడు అవన్నీ పూర్తిగా మానేశారు. నన్ను ఒక విధంగా హౌస్ అరెస్ట్ చేసి, బయట లోకమే లేకుండా చేశారు. చివరకు ఇంట్లో మగ దేవుళ్ళ పటాలు కూడా తీసివేసి, పూజలు కూడా చేసుకోనివ్వడం లేదు. ప్రమాణంగా చెప్తున్నాను. నాకసలు అలాంటి ఆలోచనలే లేవు. ఈ విషయాలు ఎవరితో చెప్పుకోలేక ఆయన బాధలు పడలేక ఒక్కోసారి చచ్చిపోదామనిపిస్తోంది. నన్ను బయటకు కదలనివ్వడం లేదు. దయచేసి నా సమస్యకు పరిష్కారం చూపిస్తారనే ఆశిస్తున్నాను.– ఒక సోదరి విజయవాడజ. మీ మనోవేదనను అర్థం చేసుకున్నాను. మగవారినే కాదు, మగ దేవుళ్ళను కూడా చూడొద్దు, పూజించొద్దు అనే స్థాయికి వెళ్ళాడంటే అది ఖచ్చితంగా మానసిక జబ్బే! ‘డెల్యూజనల్ డిసాస్టర్’ లేదా ‘΄ారనాయిడ్ సైకోసిస్’ అనే ఈ తీవ్రమైన మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మెదడులోని సెరటోనిన్ అనే ఒక ప్రత్యేక రసాయనిక పదార్థం సమతుల్యంలో తేడాలొచ్చినప్పుడు లేదా వారసత్వంగా కూడా కొందరికి ఇలాంటి మానసిక జబ్బు వచ్చే అవకాశముంది. ఇలాంటి ప్రవర్తన కూడా ఒక మానసిక రుగ్మతేనన్న విషయం తెలియక కొందరు మానసిక వ్యాధి అంటే ‘పిచ్చి’ పట్టిందని అంటారనే భయంతో బయటకు చెప్పుకోలేకపోవడం లేదా ఆ వ్యక్తి డాక్టరు దగ్గరకు చికిత్సకు వచ్చేందుకు సహకరించకపోవడం వల్ల జబ్బు ముదిరిపోయి, తీవ్రస్థాయికి వెళ్ళే ప్రమాదముంది. మీ దగ్గరి బంధువుల సహాయం తీసుకొని, ఏదో ఒకవిధంగా ఒకసారి మీరు హాస్పిటల్‌కి రాగలిగితే పూర్తి వివరాలు తీసుకుని, ఇలాంటి వారికి ఎలాంటి వైద్యం చేయాలో మీతో వివరంగా చర్చించడానికి వీలవుతుంది. కొత్త మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం ప్రకారం అయన ఒప్పుకోకపోయినా వైద్యం చేసే అవకాశముంది. ఆలస్యం చేయకుండా ముందుకెళ్ళండి!డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
Ram Kapoor: 140 కిలోల బరువుతో ఒబెసిటీతో బాధపడ్డాడు..ఇవాళ ఏకంగా .!
వెయిట్‌లాస్ జర్నీలో సక్సెస్ అవ్వడం అంత ఈజీ కాదు. కొందరు బరవు తగ్గినట్లు తగ్గి మళ్లీ యథావిధి బరువుకి వచ్చేస్తుంటారు. అందరి శరీరతత్వం ఒకలా ఉండదు. ఒకరికి సాధ్యమైనట్లు మరొకరి బాడీకి సాధ్యం కాకపోవచ్చు. అలానే ప్రయత్నం మానకుండా బరువు తగ్గాలని బలంగా అనుకున్నవారే విజయవంతమవుతారు. అలాంటి కోవకు చెందినవారే బాలీవుడ్ నటుడు రామ్ కపూర్. ఆయన 140 కిలోల బరువతో ఊబకాయంతో నానా ఇబ్బందులు పడ్డారు. తగ్గే ప్రయత్నం చేసిన ప్రతిసారి..తగ్గినట్లుగా అనిపించేలోపే మళ్లీ యథావిధిగా అదే బరువుకి వచ్చేసేవారు. అయినా విసుగు చెందకుండా విజయవంతంగా బరువు తగ్గి స్లమ్‌గా మారి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. మరీ ఆయన ఫిట్నెస్ జర్నీ ఎలా సాగిందో తెలుసుకుందామా..!నటుడు రామ్ కపూర్(Ram Kapoor) తన అధిక బరువు గురించి తనభార్య గౌతమి(Gautami) ఎన్నడూ ఏమి అనలేదు గానీ తన ఆరోగ్యం గురించి కలత చెందేదని అన్నారు. ఎందుకంటే.. అధిక బరువు కారణంగా ఒబెసిటీ, టైప్2 డయాబెటిస్(type 2 diabetes) వంటి అనారోగ్య సమస్యలతో బాధపడేవాడినని చెప్పారు. వాటికి చెక్ పెట్టాలంటే బరువు తగ్గక తప్పదని స్ట్రాంగ్‌గా నిర్ణయించుకున్నాని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ ఇంటర్వ్యూలో తన వెయిట్‌లాస్ జర్నీ గురించి చాలా ఆస్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. గత 15 ఏళ్లుగా అధిక బరువుతో నిరాటంకంగా పనిచేశాను. కానీ కనీసం ఇప్పుడైనా ఆరోగ్యం కోసం తన ఒంటిపై దృష్టి పెట్టాలని గట్టిగా అనుకున్నట్లు తెలిపారు. అందుకోసం తాను రెండుసార్లు ప్రయత్నించి విఫలమయ్యానని అన్నారు. తాను రెండు సార్లు 30 కిలోలు వరకు తగ్గి మళ్లీ నార్మల్ బరువుకి తిరిగి వచ్చేసిట్లు చెప్పారు. అయితే ఎప్పుడు డైట్‌తో బరువు తగ్గుతారని అనుకోవడం సరైనది కాదని అంటున్నారు.ఇక్కడ కేవలం మన సంకల్ప శక్తి(willpower.), సానుకూల మనస్తత్వం వల్లే బరువు తగ్గడం అనేది సాధ్యమవుతుందని చెబుతున్నారు. తాను రోజుకు రెండు పూటలా భోజనం చేసేవాడినని అన్నారు. ఒకటి ఉదయం 10.30 గంటలకు, మరొకటి సాయంత్రం 6.30 గంటలకని చెప్పారు. మధ్యలో నీళ్లు, కాఫీ లేదా టీ తాగేవాడినని అన్నారు. అయితే సాయంత్రం మాత్రం 6.30 గంటల కల్లా భోజనం చేసేస్తానని చెప్పారు. అస్సలు అల్పాహారం తినని అన్నారు. సూర్యాస్తమయం తర్వాత అస్సలు తినని చెప్పారు. దీన్ని కరెక్ట్‌గా చేసేలా మన మైండ్ సెట్ స్ట్రాంగ్ ఉండేలా చూడాలని చెప్పారు. డైట్లు, ఆహారపు అలవాట్ల కంటే..మనసుని నియంత్రించగలిగే శక్తే బరువు తగ్గడానికి అత్యంత కీలకమైనదని అన్నారు. వాటివల్ల తాను 55 కిలోల మేర బరువు తగ్గడమే కాకుండా ఆ బరువునే మెయింటైన్ చేయగలిగానని అన్నారు. నిపుణుల ఏమంటున్నారంటే..నిపుణులు సానుకూల మనస్తత్వంతోనే బరువు తగ్గడం అనేది సాధ్యమవుతుందని చెబుతున్నారు. ఆరోగ్యకరమైన శరీరాన్ని కాపడుకోవడానికి అంకితభావంతో కూడిన మనస్తత్వం అవసరమని చెప్పారు. శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు తగ్గించి ట్రాన్స్ఫ్యాట్లను నివారించాలన్నారు. ఇక్కడ వ్యాయామాన్ని శిక్షగా కాకుండా ఇష్టంతో చేయాలని చెప్పారు. ఒక్కోసారి చీట్ మీల్స్ ఉండొచ్చు. అయినా దాన్ని బర్న్ చేసేలా శారీరక శ్రమ చేయడం ముఖ్యం అని చెబుతున్నారు. మనసు మన మాట వినేలా ఎంత బలంగా చేసుకోగలిగితే అంతలా డైట్‌ని నియమబద్ధంగా ఫాలో అవ్వడం సాధ్యమవుతుందని చెబుతున్నారు. దీంతోపాటు సరిగా నిద్రపోవడం, తగినంత నీరు తాగడం తదితర జీవనశైలి చర్యలు ఉంటే అనుకున్న రీతిలో బరువు తగ్గగలరని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: మానవ ఐవీఎఫ్ సాయంతో కంగారూ పిండాలు..!) -
రోజంతా కూర్చొనే ఉంటే ఎంత సేపు వ్యాయమం చేయాలో తెలుసా..!
ప్రస్తుతం చాలామటుకు కూర్చొని చేసే డెస్క్ జాబులే. దీంతో గంటలకొద్ది కంప్యూటర్ల ముందు కూర్చొండిపోవడంతో చాలామంది పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అధిక బరువు సమస్యతో ఎక్కువమంది బాధపడటానికి కూడా కారణం ఇదే అని చెప్పొచ్చు. అలా ఎక్కువసేపు కూర్చొవడంతో పిరుదుల వద్ద కండరాలు బిగిసుకుపోయి ఉండిపోతాయి. దీంతోపాటు కాళ్లు, తొడలు, పొత్తుకడుపులో ఫ్యాట్ కూడా పేరుకుపోతుంటుంది. దీంతో ఊబకాయం, గుండెజబ్బులు, అకాల మరణం వంటి అనారోగ్యం బారినపడుతున్నారు చాలామంది. అయితే ఈసమస్యను అధిగమించడానికి ఎంత సేపు వ్యాయమం చేస్తే మంచిదో తాజా అధయనాల్లో పరిశోధకులు వెల్లడించారు. ఎంత వ్యవధి వ్యాయమాలు మనకు హెల్ప్ అవుతాయో సవివరంగా వివరించారు. అవేంటో చూద్దామా..!.ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలను భర్తీ చేయడానికి సరైన వ్యాయామం వ్యవధి జస్ట్ 40 నిమిషాలేనట. ప్రతిరోజూ '40 నిమిషాల వరకు సాధారణమైన వ్యాయమాల నుంచి శక్తిమంతమైన వ్యాయమాలు చేస్తే సరిపోతుందట. పదిగంటలు నిశ్చలంగా ఒకే చోట కూర్చోనేవారు ఇలా జస్ట్ 40 నిమిషాలు వ్యాయమానికి కేటాయిస్తే ఆరోగ్యంగా ఉండొచ్చని ధీమాగా చెబుతున్నారు పరిశోధకులు. దీనికోసం నాలుగు వేర్వేరు దేశాల్లో మొత్తం 40 వేల మందికి పైగా వ్యక్తులపై ఫిట్నెస్ ట్రాక్‌ని విశ్లేషించారు. వారిలో సూమారు 30 నుంచి 40 నిమిషాలు సాధారణ వ్యాయమాలతో మొదలై అధిక తీవ్రత వ్యాయమాలతో పూర్తి చేసిన వ్యక్తుల్లో ఎలాంటి అనారోగ్య ప్రమాదాలు ఉండవని తేలింది. వారిపై దుష్ర్పభావాలు గణనీయంగా తగ్గినట్లు వెల్లడైందని అన్నారు. ఎక్కువ గంటలు కూర్చొని పనిచేసే వ్యక్తుల ముఖ్యంగా సైక్లింగ్, వాకింగ్, తోటపని వంటివి చేస్తే వారిపై ఎలాంటి అనారోగ్యం ప్రభావం ఉండదని అన్నారు.తప్పనిసరిగా చేయవల్సినవి.. ప్రతి గంటకు 5 నిమిషాలు నడవడం. చిన్న చిన్న విరామాలు తీసుకోవడం. అలాగే తుంటి, నడుమ భాగాలను సాగదీయడం వంటివి చేస్తే ఎక్కువసేపు కూర్చొవడం వల్ల ఎముకలు పట్టేసినట్లు అనిపించవట.అలాగే బరువు వ్యాయామాలు చేయడం వల్ల బాడీ తేలికగా ఉంటుందట. స్క్వాట్లు, పుష్ అప్లు కండరాలను సక్రియం చేస్తాయి, జీవక్రియనున పెంచుతాయి. సాధ్యమైనంత వరకు స్టాండింగ్ డెస్క్‌ను ఉపయోగించడం వల్ల ఎక్కువసేపు కూర్చొవడాన్ని నిరోధించొచ్చుమెట్టు ఎక్కడం వంటివి కూడా మంచి ఫలితాన్ని అందిస్తాయట. ఈ కొత్త పరిశోధన బ్రిటీష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్‌లో ప్రచురితమైంది. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే దుష్ప్రభావాలను మనకున్న పరిమితుల్లోనే సులభంగా అధిగమిద్దాం ఆరోగ్యంగా ఉందాం.(చదవండి: రాయల్ డెజర్ట్ "మైసూర్ పాక్" ఎవరు తయారు చేశారో తెలుసా..!) -
ఆగ్రహం.. ఆరోగ్యానికి అనర్థం
సాక్షి, హైదరాబాద్: భావోద్వేగాల పరంగా చూస్తే.. ఆయా సందర్భాలు, సంఘటనలను బట్టి కోపం రావడాన్ని సహజ లక్షణంగానే పరిగణిస్తుంటారు. కానీ కోపాన్ని నియంత్రించుకోవడంలో విఫలమైతే మాత్రం.. దాని పర్యవసనాలు తీవ్రంగా ఉంటున్నాయనేది అనేక ఘటనలు రుజువు చేస్తున్నాయి. ఎవరైనా తమ కోపాన్ని ఆపుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటే.. దాని ప్రతికూల ప్రభావం వారి ఆరోగ్యంపై పడుతోందని స్పష్టమౌతోంది.ఆగ్రహాన్ని ఆపుకోలేకపోతే వివిధ రూపాల్లో ఆరోగ్యంపై ప్రభావంపడడంతో పాటు, ఏదైనా ధ్వంసం చేయాలనే ఆలోచన లేదా ఎవరిపై దాడికి పాల్పడటం, స్వీయ నియంత్రణ కోల్పోవడం, తదితర రుగ్మతలకు దారితీయడం, వ్యక్తుల మధ్య సంబంధాలు దెబ్బ తినడానికి కారణమౌతున్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. చిన్నచిన్న విషయాలకే కోపం రావడం వంటివి దీర్ఘకాలం కొనసాగితే.. వ్యక్తిగతంగా ఆరోగ్యంపై, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపి.. అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కోనాల్సి వస్తుందని స్పష్టం చేస్తున్నారు.ట్రాఫిక్‌లో ఇరుక్కుని వెళ్లాల్సిన ముఖ్యమైన సమావేశానికి లేదా ఫంక్షన్‌కు ఆలస్యం కావడం, చిన్న విషయానికే చిరాకు పడటం, అపరాధ భావం, కొందరిపై లేదా పరిస్థితులపై వ్యతిరేక భావం, ఏదైనా విషయమై తోటివారు, స్నేహితులు, బంధువులు, సహచరులతో భిన్నాభిప్రాయాలు ఎదురుకావడం, మానసికంగా కుంగుబాటు, కూడా కోపం రావడానికి కారణాలుగా విశ్లేష్టిస్తున్నారు. పలు ప్రతిష్టాత్మక సంస్థలు నిర్వహించిన అధ్యయనాల్లోనూ కోపం వల్ల ఆరోగ్యంపై పడే ప్రభావం, ఇతర అంశాలను పరిశీలించారు. కోపోద్రిక్తులు కావడం వల్ల వెంటనే గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. రక్తపోటు పెరగడం వల్ల గుండెపై (కార్డియోవాసు్క్యలర్ స్ట్రెయిన్) ఎక్కువ ఒత్తిడి పెరుగుతుంది. గుండెజబ్బుల ముప్పు కూడా 19 శాతం పెరుగుతుందని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ తన పరిశీలనలో పేర్కొంది. ఏదైనా సంఘటన లేదా కారణంతో అధికంగా ఉద్రేక పడితే.. ఆ తర్వాత రెండుగంటల వ్యవధిలోనే గుండెపోటు వచ్చే అవకాశం ఎనిమిదన్నర రెట్లు పెరుగుతుందని యూరోపియన్ హార్ట్ జనరల్ వెల్లడించింది. రక్తపోటు పెరిగిపోయి ‘క్రానిక్ హైపర్‌టెన్షన్’గా మారితే హార్ట్‌స్ట్రోక్‌తో పాటు మూత్రపిండాల వ్యాధులకు దారితీయొచ్చని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. కోపంపై నియంత్రణ కోల్పోతే రోగనిరోధక సామర్థ్యం 30 శాతం తగ్గిపోతుందని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. కోపానికి గురైనపుడు కొన్ని గంటల పాటు రోగనిరోధక వ్యవస్థ బలహీనమౌతుందని వెల్లడిస్తున్నాయి. 24 గంటల పాటు ‘స్లీప్ సైకిల్స్’లో ఇబ్బందులు, కేవలం రెండు నిమిషాల కోపం అనేది 7 గంటల పాటు ‘కోర్టిసోల్’స్థాయిల్లో పెరుగుదలకు కారణమౌతుందని హెచ్చరిస్తున్నాయి.ఆగ్రహం నియంత్రణకు ఏం చేయాలంటే.. ⇒ కోపం వచ్చే సూచనలను ముందుగానే గమనించి.. దాని నియంత్రణకు అవసరమైన విధంగా స్పందించాలి ⇒ వెంటనే ప్రతిస్పందించకుండా.. ఏం చేయాలనే దానిపై కొంత సమయమిచ్చి ఆలోచించాలి. ఒకటి నుంచి పది దాకా లెక్క పెట్టడంతో పాటు కామింగ్ బ్రీథింగ్ ఎక్సర్సైజులు చేయాలి ⇒ కోపానికి కారణం ఏమిటో తెలియజేయాలి. అందుకు కారణమైన వ్యక్తితో కాకుండా మిత్రుడు లేదా ఆప్తులతో మాట్లాడాలి ⇒ పరుగు, నడక, ఈత, యోగ వంటి ఒత్తిళ్లను తగ్గించే కార్యకలాపాలు చేయాలి ⇒ ఏదైనా సంఘటనకు వెంటనే ప్రభావితమై స్పందించకుండా.. ఏం చేయాలన్న దానిపై దృష్టి పెట్టాలి.యాంగర్ మేనేజ్మెంట్ కేసులే ఎక్కువమా దగ్గరకు ‘యాంగర్ మేనేజ్మెంట్’కు సంబంధించిన కేసులు ఎక్కువగానే వస్తున్నాయి. వైవాహిక బంధంలో తలెత్తే సమస్యలతో దంపతులిద్దరిలో ఎవరో ఒకరు కోపోద్రిక్తులు కావడం, రోడ్డుపై వెళ్తునపుడు ఎదురయ్యే ఘటనలతో, వ్యక్తిత్వాల్లో వచ్చిన మార్పులతో ఆవేశాలు, ఇలా వివిధ కారణాలు, సంఘటనలతో ప్రభావితమై తమ ఆగ్రహాన్ని నియంత్రించుకోలేని వారు వస్తున్నారు. వారికి ఆయా సమస్యలకు అనుగుణంగా మందులు ఇవ్వడం, కౌన్సెలింగ్, యాంగర్ మేనేజ్మెంట్ క్లాసెస్ తీసుకుంటున్నాం. అప్పుడప్పుడు ఏదైనా సందర్భంలో లేదా ఏదైనా అనుకోని ఘటన జరిగినప్పుడు ఆగ్రహానికి గురైతే మంచిదే.కానీ ఏ చిన్న సంఘటనకైనా, చిన్నపాటి వాగ్వాదానికి ఇతరులపై కోపగించుకోవడం, రుస రుసలాడటం వంటివి చేస్తే మాత్రం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కోపం అనేది ‘నెగిటివ్ ఎమోషన్’అయినప్పటికీ.. ఆగ్రహం రావడానికి భావోద్వేగపరమైన అంశాలు మెదడుపై ప్రభావం చూపి (నెర్వస్ సిస్టమ్‌పై) శరీరంలోని అన్ని భాగాలను ప్రభావితం చేసి ఒక్కసారిగా రక్తప్రసారం పెరిగిపోతుంది. వెంటనే ఏదో రూపంలో శరీరం స్పందించేలా చేస్తుంది. మామూలుగా చూస్తే ఇదొక రక్షణ వ్యవస్థ (డిఫెన్న్ మెకానిజం)గా ఉన్నా.. ఒకస్థాయి దాటాక కోపాన్ని నియంత్రించుకోలేకపోతే దాని ప్రభావం తీవ్రంగానే ఉంటుంది. అందువల్ల కోపంపై నియంత్రణ ఎంతైన అవసరం. – డాక్టర్ ఎమ్మెస్ రెడ్డి, సీనియర్ సైక్రియాట్రిస్ట్–డైరెక్టర్, ఆశా హాస్పటల్స్చేయకూడనివి..⇒ అన్నింటినీ ఒకేసారి చేయా లని ప్రయత్నించొద్దు. అందుకోగలిగే చిన్న లక్ష్యాలను ముందు నిర్దేశించుకోవాలి ⇒ మనం మార్చలేని వాటిపై దృష్టి కేంద్రీకరించొద్దు. సమయాన్ని, శక్తియుక్తులను నిర్దేశిత లక్ష్యంపై పెట్టాలి. ఎవరికి వారు స్వాంతన చేకూర్చుకుంటే మంచిది ⇒ ఏకాకిగా ఉన్నాననే భావన రానివ్వొద్దు. మిత్రులు, సహచరుల సహకారం, మద్దతు తీసుకోవాలి ⇒ కోపాన్ని తగ్గించుకునేందుకు మద్యం, సిగరెట్, గ్యాంబ్లింగ్, డ్రగ్స్ వంటి వాటిని ఎప్పటికీ ఆశ్రయించవద్దు. ఇవన్నీ కూడా మానసికంగా మరింతగా క్షీణించేలా చేస్తాయి. -
చుట్టుముట్టిన ఆరోగ్య సమస్యలతో రాజీ పడకూడదనుకుంది..కట్‌చేస్తే..!
చుట్టుముట్టే ఆరోగ్య సమస్యలు మనకు పరోక్షంగా మంచి జీవనశైలి అవలంభించమని సంకేతమిస్తుంటాయి. మన శరీరం చెప్పే మాట వింటే ఆరోగ్యం, బరువు మన చేతిలో ఉంటుంది. లేదంటే అధిక బరువుతో లేనిపోని అనారోగ్య సమస్యలతో సతమతమవ్వక తప్పదు. కనీసం అనారోగ్య సమస్యలతో పోరాడుతున్నప్పుడే మేల్కొని మంచి ఆహారపు అలవాట్లతో బరువు తగ్గేందుకు ఉపక్రమించి ఎందరికో స్ఫూరిగా నిలుస్తున్నారు కొందరు. అచ్చం అలానే బరువు తగ్గి ఆరోగ్యంలో రాజీ ఉండకూడదని చాటి చెప్పి శెభాష్ అనిపించుకుంది ఈ మహిళ. ఆ మహిళ పేరు రాజీ ఘంఘాస్. ఆమె జనవరి 2024లో సుమారు 155 కిలోల బరువుతో పలు అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతుండేది. భారీకాయం వల్ల కొద్ది దూరం నడకకే ఆయాస పడిపోతుండేది. అలాగే ఈ అధిక బరువు కారణంగా ఆమె రూపం అసహ్యంగా మారడమే గాక ఆరోగ్య సమస్యలు కూడా చుట్టుముట్టాయి. అధిక బరువు, హర్మోన్ల అసమతుల్యత, క్రమరహిత రుతుక్రమం, ప్రీ డయాబెటిక్ వంటి సమస్యలను ఎదుర్కొంది. ఆమెను చూస్తే పెద్దన్నాళ్లు ఈ బరువుతో బతకదేమో అనేంతలా ఇబ్బందులుపడింది. అప్పుడే రాజీ అనుకుంది భగవంతుడి ఇచ్చిన రూపం మార్చలేను, కానీ అనారోగ్యాన్ని భరిస్తూ మాత్రం చావలేను అని గట్టిగా నిర్ణయించుకుంది. ముందు అందం కంటే ఆరోగ్యంగా ఉండటమే ప్రధానం, పైగా అది తన చేతిలో ఉన్న అవకాశం అని గ్రహించింది రాజీ. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మంచి ఆహారపు అలవాట్లను అనుసరించింది. ముఖ్యంగా ఇంట్లో వండిన ఆహారానికే ప్రాధాన్యత ఇచ్చింది. "రోజుని మెంతులు, యాలకులతో ఉడికించిన గోరువెచ్చని డిటాక్స్ వాటర్‌తో ప్రారంభించేది. అల్పహారంగా కూరగాయలతో నిండిన పోహా వంటివి తీసుకునేది. మధ్యాహ్నం చియా గింజల నీరు, ఓట్స్ తీసుకునేది. సాయంత్రం: గ్రీన్ టీ, మొక్కజొన్న చాట్. ఇక రాత్రికి కూరగాయలతో చేసిన శాండ్విచ్లు, డిటాక్స్ నీరు తీసుకునేది. క్రమం తప్పకుండా ఈ డైట్‌ని అనుసరించింది. తన అధిక బరువుతో ఎదురవ్వుతున్న ఆరోగ్య సమస్యలు గుర్తొచ్చి చీట్మీల్కి చోటివ్వకుండా నిబద్ధతతో ఆరోగ్యకరమైన డైట్‌ని అనుసరించింది రాజీ". అలా ఒక్క ఏడాదికే 60 కిలోలు తగ్గి 95కిలోల బరువుకి చేరింది. అయితే వెయిట్ లాస్ జర్నీ మగియలేదని అంతలా 155 కిలోల బరువు ఉన్న తాను ఇంతలా బరువు తగ్గుతానని కలలో కూడా ఊహించలేదని ఆనందంగా చెబుతోంది రాజీ. ఆరోగ్యకరమైన బరువు చేరుకునేవరకు తన వెయిట్ లాస్ జర్నీ ఆగదని సోషల్ మీడియా వేదికగా తన అనుభవాల్ని షేర్ చేసుకుంది. View this post on Instagram A post shared by Rajii Ghanghas (@rajiighanghas) (చదవండి: సింగిల్ పేరెంటింగ్ సవాలుని సులభంగా అధిగమించండిలా..!) -
అప్‌స్టాక్ సీఈవో వెయిట్ లాస్ జర్నీ: పదివేల అడుగులతో పది కిలోల బరువు..!
బరువు తగ్గేందుకు ఏదో ఒక రీజన్ ఉంటుంది. కొందరికి ఎదుర్కొన్న బాడీ షేమింగ్ అవమానాలు, అనారోగ్యాలు తదితర కారణాలతో బరువు తగ్గడం జరుగుతుంది. మరికొందరూ సెలబ్రిటీలు, ప్రముఖులు స్ఫూర్తితో బరువు తగ్గించుకునే యత్నం చేస్తుంటారు. అయితే ఈ అప్‌స్టాక్(Upstox) సీఈవో వెయిట్ లాస్ జర్నీ మాత్రం కాస్త విభిన్నం. ఎందుకంటే తండ్రి అవ్వాలన్నా ఆలోచనే.. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేలా చేసి, ఇలా స్మార్ట్‌గా మారేందుకు కారణమైంది అని అంటారాయన. మరీ ఆయన ఎలాంటి డైట్, వర్కౌట్లు ఫాలో అయ్యారో చూద్దామా..!.అప్‌స్టాక్స్ సహ వ్యవస్థాపకుడు(UpStox Co-founder) శ్రీని విశ్వనాథ్(Shrini Viswanath,) తాను తండ్రి అవ్వాలనే కోరిక తన ఫిట్నెస్, ఆరోగ్యంపై దృష్టిసారించేలా చేసిందట. ఆ కొత్త బాధ్యతను తీసుకునేటప్పడు తాను మరింత ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటేమ కాకుండా తన బిడ్డకు గ్రేట్‌గా కనిపించాలనే పిచ్చి కోరిక వల్లే కిలోలు కొద్దీ బరువు తగ్గానంటారు. ప్రస్తుతం తన భార్య ప్రెగ్నెంట్ అని ఆమె కూడా తన ఈ వెయిట్ లాస్(weight loss) జర్నీలో ఎంతో తోడ్పాటును అందించిందని అన్నారు. ఆయన 68 కిలోలు బరువు ఉండేవారట. ఈ వెయిట్ లాస్ జర్నీకి కీలకమైంది అంకితభావం అని అంటారు విశ్వనాథ్. సరైన డైట్, వ్యాయమం క్రమంతప్పకుండా చేస్తే కచ్చితం వందరోజుల్లో పది కిలోలు బరువు తగ్గిపోతారంటున్నారు. ప్రాసెస్ చేసిన ఆహారాలు, బయటి ఫుడ్ఆర్డర్ పెట్టుకోవడం తగ్గిస్తే బరువు అదుపులోనే ఉంటుందట. అలాగే షుగర్‌కి సంబంధించిన ఆహారాలకు కూడా దూరంగా ఉండాలి. వాటికి బదులు యాపిల్స్, బేరి, పీచెస్, డ్రైప్రూట్స్ వంటి తీసుకునేవాడినన్నారు. విశ్వనాథ్ ఇష్టమైన కర్రీలను తీసుకున్నాను కానీ వాటిలో వెన్న లేదా నెయ్యి లేకుండా చూసుకున్నానని అన్నారు. భారతీయ ఆహరం సుగంధద్రవ్యాలతో అత్యంత రుచికరంగా ఉంటుంది. ఆ రుచిని ఆరోగ్యప్రదంగా తీసుకుంటే చాలు అని చెబుతున్నారు విశ్వనాథ్. అలాగే తన బరువు గణనీయంగా తగ్గడానికి బాగా ఉపయోగపడింది ఎనమిది వేల నుంచి పది వేల అడుగుల వాకింగ్ అని చెప్పారు. చాలామంది మాత్రం బరువు తగ్గడానికి విపరీతమైన వ్యాయామాలు, గంటలు కొద్ది జిమ్‌లో గడిపితే చాలనుకుంటారు. కానీ అది సరైంది కాదట. ఆహారపు అలవాట్లలో మంచి స్థిరమైన మార్పులే గణనీయంగా బరువు తగ్గేందుకు తోడ్పడతాయట.వర్క్‌లైఫ్ బ్యాలెన్స్, ఫిట్నెస్..జీవితం అనేది వ్యక్తిగత శ్రేయస్సు. దీన్ని వృత్తిపరమైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూనే బ్యాలెన్సు చేయాలి. వ్యాపారం లేదా ఉద్యోగం, కుటుంబం, ఫిట్నెస్ - ఇలా ప్రతిదానికి నిర్దిష్ట సమయాన్ని కేటాయించాలి. కానీ ఏ పనిపై ఉంటే దానిపై మొత్తం దృష్టిని కేంద్రీకరించాలి. ప్రస్తుతం డెస్క్ఉద్యోగాల వల్ల గంటలకొద్దీ కూర్చోవడం ఎక్కువైపుతోంది. అందువల్లే ఆరోగ్య సమస్యలు, అధిక బరువు వంటి సమస్యలు ఎక్కువవుతున్నాయి. చిన్న సర్దుబాటుతో ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవచ్చని అంటున్నారు విశ్వనాథ్. (చదవండి: అంతరిక్షంలోనే ఏడు నెలలు..నడక మర్చిపోయా..!) -
ఆహారంలోని పోషకాలు ఒంటబట్టాలంటే..!
ఆహారం తీసుకున్న తర్వాత అందులోని పోషకాలు ఒంటికి పట్టకపోవడం అన్న కండిషన్‌ను ‘మాల్ అబ్జార్ప్షన్’ అంటారు. జీర్ణవ్యవస్థలోని ఇన్ఫెక్షన్లు లేదా ఇతర అనేక కారణాల వల్ల ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియలో అందులోని పోషకాలు ఒంటికి పట్టకపోవచ్చు. కొన్నిసార్లు ప్రత్యేకంగా ఏదో ఓ అంశమే ఒంటికి పట్టకపోవచ్చు కూడా. ఉదాహరణకు లాక్జేజ్ అనే ఎంజైము లోపం వల్ల పాలు ఒంటికి పట్టకపోవచ్చు. ఈ కండిషన్‌ను లాక్టోజ్ ఇన్టాలరెన్స్ అంటారు. కొందరిలో ‘సీలియాక్ డిసీజ్’ లేదా ‘క్రోన్స్ డిజీస్’ అనే రుగ్మతలు ఉన్నప్పుడు ఆహారంలోని అన్ని పోషకాలూ ఒంటికి పట్టకపోవచ్చు. అయితే కారణాలను బట్టి మాల్ అబ్జార్ప్షన్కు చికిత్స అందించాల్సి ఉంటుంది. పోషకాలు ఒంటికి పట్టని ఈ కండిషన్ గురించి తెలుసుకుందాం. ఒంటికి పట్టకపోవడం అనే కండిషన్ కొన్ని సాధారణ పరిస్థితుల కారణంగా రావచ్చు లేదా కొన్నిసార్లు కొన్ని శరీర నిర్మాణపరమైన కారణాలతోనూ ఇలా జరగవచ్చు. మాల్ అబ్జార్ప్షన్ ఎందుకు, ఎలా? తిన్న ఆహారం ఒంటికి పట్టకపోవడం ఎందుకు జరుగుతుందో తెలుసుకునేందుకు పేగుల్లో ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియ ఎలా జరుగుతుందనే పరిజ్ఞానం కొంత అవసరం. సాధారణ పరిస్థితుల్లో ఆహారం జీర్ణమై, ఒంటికి పట్టడాన్ని మూడు దశలుగా చెప్పవచ్చు. అవి... 1) ల్యూమినల్ 2) మ్యూకోజల్ 3) పోస్ట్ అబ్జార్‌ప్టివ్ ఈ మూడు దశల్లో ఎక్కడ లోపం జరిగినా అది మాల్ అబ్జార్ప్షన్కు దారితీయవచ్చు. ల్యూమినల్ దశలో..ఆహారంలోని కొవ్వులు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు... ఇవన్నీ జీర్ణవ్యవస్థల్లోని ఎంజైములు, బైల్లో కలిసి, దాదాపు కరిగిన స్థితిలో ఉంటాయి. ల్యూమినల్ దశలో లోపాలకు ఈ దశలో లోపాలకు ప్రధానంగా ప్రాంక్రియాస్ గ్రంథికి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రాంక్రియాటైటిస్, ఏవైనా కారణాలతో ప్రాంక్రియాస్ గ్రంథి తొలగింపు, ప్రాంక్రియాటిక్ క్యాన్సర్ లేదా దేహంలోని కణాలను దెబ్బతీసే సిస్టిక్ ఫైబ్రోసిస్ కారణంగా జరుగుతుంది. దీనివల్ల కొవ్వులను జీర్ణం చేసే లైపేజ్ అనే ఎంజైము తగ్గడంతో కొవ్వులు, ప్రోటీన్లు ఒంటికి పట్టవు.అలాగే ఏవైనా చిన్నపేగు సర్జరీలు జరగడం వల్ల... పైత్యరసం (బైల్)తోపాటు ప్రాంక్రియాటిక్ ఎంజైములు... జీర్ణం కావాల్సిన ఆహారంతో సరిగా, పూర్తిగా కలవకపోవడంతోనూ జీర్ణప్రక్రియలో అంతరాయంతో ఆహారం ఒంటికి పట్టకపోవచ్చు.ఇక చాలా అరుదుగా కొన్నిసార్లు ట్రిప్సినోజెన్, ఎంటెరోజైనేజ్ అనే ఎంజైములను ప్రేరేపించాల్సిన ప్రోఎంజైములు చురుగ్గా లేనందువల్ల తిన్న ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం (అజీర్తి) లేదా తిన్నది ఒంటికి పట్టక΄ోవడం జరగవచ్చు. ఆహారపు ముద్ద... ఓ అరిగిపోయే ద్రవంగా రూపొందకపోవడం (ఇంపెయిర్డ్ మిసెల్లీ ఫార్మేషన్) : ఇది అనేక కారణాల వల్ల జరగవచ్చు. ఉదాహరణకు... కాలేయం దెబ్బతినడం వల్ల లేదా సిర్రోసిస్ కారణంగా తగినంత బైల్ సాల్ట్స్ ఉత్పన్నం కాకపోవడం. స్రవించాల్సిన పైత్య రసానికి (బిలియరీ జ్యూసెస్కు) ఏదైనా అడ్డంకి ఏర్పడటం లేదా కోలోయోస్టాటిక్ జాండీస్ అనే కామెర్ల కారణంగా. ఏవైనా కారణాలతో చిన్న పేగులను శస్త్రచికిత్సతో తొలగించిన పరిస్థితుల్లో పైత్యరస ప్రవాహం సరిగా లేకపోవడం (ఎంటరోపాథిక్ బైల్ సర్క్యులేషన్) చిన్నపేగుల్లో బ్యాక్టీరియా చాలా ఎక్కువగా పేరుకుపోవడంతో పైత్యరసంలో ఉండే సంక్లిష్టమైన నిర్మాణంలోంచి గ్లైసిన్ / టారిన్ అనే అమైనో యాసిడ్స్ తాలూకు మాలెక్యూల్స్ను తొలగించడం. దీన్నే బైల్ సాల్ట్ డీ కాంజ్యుగేషన్ అంటారు. ఇక కొన్నిసార్లు చిన్నపేగుల నిర్మాణ లోపాలతో అక్కడ జీర్ణమైన ఆహారపు కదలికలు సరిగా లేకపోవడం వల్ల, ఆహారపు ముద్ద ఏదైనా కారణాలతో కలుషితం కావడం వల్ల (స్మాల్ బవెల్ కంటామినేషన్), ఆ ప్రాంతంలో బ్యాక్టీరియా అనూహ్యంగా చాలా ఎక్కువగా పెరిగి΄ోవడం వల్ల జరిగే అంతరాయాలతో... ఈ అన్ని కారణాలతో తిన్నది ఒంటికి పట్టకపోవచ్చు. జీర్ణమైన ఆహారాన్ని తీసుకునే లోపలి పొరలోని లోపాలతో లేదా అక్కడ ఉండే బ్యాక్టీరియా (ల్యూమినల్) పెరిగిపోయి, ఆహారం ఇంకడానికి అడ్డంకిగా మారడంతో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్లు (ఉదాహరణకు విటమిన్–బి12, ఫోలేట్) లాంటివి జీర్ణమయ్యే సామర్థ్యం తగ్గడంతోనూ తిన్నది ఒంటికి పట్టకపోవచ్చు. ఇక విటమిన్ బి12 ఒంటికి పట్టకపోవడం అన్నది ప్రాంక్రియాటిక్ ఎంజైముల లోపం వల్ల జరగవచ్చు.మ్యూకోజల్ దశలో..ఆహారాన్ని దేహంలోకి ఇంకింపజేసుకునేందుకు / లాక్కునేందుకు వీలుగా పేగుల్లోని ఎపిథీలియమ్ కణాలనేవి ఓ పొరలా ఏర్పడి ఉంటాయి. ఇవన్నీ మైక్రో విల్లై అనే చేతివేళ్లలాంటి నిర్మాణాలపై అమరి ఉంటాయి. ఆహారం జీర్ణమయ్యేందుకు చాలా ఎక్కువ ఉపరితలం అవసరమయ్యేలా మైక్రోవిల్లీ అనే వేళ్లవంటి నిర్మాణాల్లో లోపం వల్ల. డైశాకరైడేజ్ అనే ఎంజైము లోపం వల్ల డైశాకరైడ్స్ అనే చక్కెరలు సరిగా జీర్ణకాకపోవడం. ల్యాక్జేజ్ అనే ఎంజైము లోపంతో పాలు సరిగా అరగకపోవడం.ఇమ్యూనో గ్లోబ్యులిన్ ఎ లోపం వల్ల కొన్ని రకాల పిండి పదార్థాలు జీర్ణం కాకపోవడం. కార్బోహైడ్రేజ్ అనే ఎంజైము లోపం (సుక్రేజ్, ఐసోమాల్జేట్ వంటి వాటి లోపం)తో పిండిపదార్థాల్లోని చెక్కరలు సరిగా అరగకపోవడం.పోషకాలు ఇంకే ప్రక్రియ సరిగా జరగకపోవడం (ఇంపెయిర్డ్ న్యూట్రియెంట్ అబ్జార్ప్షన్) : పుట్టుకతో వచ్చే కొన్ని జన్యులోపాలతోను లేదా ఆ తర్వాత వచ్చే మరికొన్ని సమస్యలతోనూ ఇలా పోషకాలు దేహంలోకి ఇంకే ప్రక్రియ సరిగా జరగకపోవచ్చు. పుట్టుకతోనే వచ్చే లోపాల గురించి చెప్పాలంటే అది గ్లుకోజు–గెలాక్టోజు సరిగా ఒంటబట్టకపోవడం వంటివి. ఇక ఆ తర్వాత వచ్చే సమస్యలంటే... జీర్ణమైన ఆహారాన్ని ఒంటిలోకి ఇంకేలా చేసే ఉపరితలం తగ్గిపోవడం. జీర్ణమైన ఆహారాన్ని దేహంలోకి ఇంకేలా చేసుకునే ఉపరితలం దెబ్బతినడం. (సీలియాక్ స్ప్రూ, ట్రాపికల్ స్ప్రూ, క్రోన్స్ డిసీజ్, ఎయిడ్స్ ఎంటెరోపతి అనే జబ్బుల్లోనూ అలాగే రేడియేషన్ చికిత్స తీసుకునేవారిలో ఇలా జరగవచ్చు. లింఫోమా వంటి కేన్సర్లలో దేహంలోకి జీర్ణాహారం ఇంకడం తగ్గుతుంది. జియార్డియా అనే పరాన్న జీవులూ లేదా ఇతర బ్యాక్టీరియా అనూహ్యంగా అపరిమితంగా పెరిగినప్పుడు జీర్ణమైన ఆహారం ఒంటికి పట్టదు. అలాగే విపుల్ డిసీజ్, క్రి΄్టోస్పోరాడోసిస్, మైక్రోస్పోరిడియోసిస్ వంటి రుగ్మతల్లోనూ తిన్నది ఒంటికి పట్టదు.అబ్జార్‌ప్టివ్ దశలో..కొవ్వులూ ఇంకా ఇతర కీలకమైన పోషకాలన్నీ లింఫాటిక్ ప్రవాహం నుంచి అలాగే ఎపిథీలియల్ కణాల ద్వారా రక్తప్రవాహంలోకి చేరి దేహంలోని అన్ని భాగాలకూ చేరుకునే ప్రక్రియ జరుగుతుంది. ఒంటికి పట్టే దశ తర్వాతి అంశాల్లో (పోస్ట్ అబ్జార్‌ప్టివ్ ఫేజ్)...లింఫాటిక్ ప్రవాహంలో ఏవైన లోపాలు ఉన్నప్పుడు (ఇలా పుట్టుకతోనే వచ్చే ఇంటస్టినల్ లింఫాంజియెక్టాసియా, మిల్‌రాయ్ డిసీజ్ వంటి వ్యాధుల కారణంగా జరగవచ్చు). అలాగే కైలోమైక్రోన్స్, లైపోప్రోటీన్స్ వల్ల తిన్నది ఒంటబట్టక ప్రోటీన్లను కోల్పోవాల్సి రావచ్చు.మాల్ అబ్జార్ప్షన్ లక్షణాలు...కడుపు ఉబ్బుగా మారడం కడుపు పట్టేసినట్లుగా ఉండటం బరువు తగ్గడం కొన్నిసార్లు నీళ్ల విరేచనాలు (డయేరియా) విటమిన్లు, ఖనిజ లవణాల లోపం వల్ల రక్తహీనత (అనీమియా) చర్మం రంగు పాలిపోయి కనిపించడం ∙జుట్టు ఊడి΄ోవడం రే–చీకటివిటమిన్ కె లోపం కారణంగా రక్తస్రావం జరగటం తీవ్రమైన అలసట, నీరసం, నిస్సత్తువ / మానసికంగానూ అలసట ఎముకలు గుల్లబారడం (ఆస్టియోపోరోసిస్) డాక్టర్ విక్టర్ వినోద్ బాబు సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ (చదవండి: భారత్ యువకుడిని పెళ్లాడిన గ్రీకు అమ్మాయి) -
ఎముకలు, కండరాలు దృఢంగా ఉండాలంటే ఇలా చేయండి!
శరీరం తేలికగా కదలటానికి, చురుకుగా ఉండటానికి ఎముకలు బలంగా ఉండటం ఎంతైనా అవసరం ఎముకలు బలహీనపడితే.. విరగడం, ఆస్టియోపోరోసిస్ ముప్పు పెరుగుతుంది. ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి జీవన శైలిమార్పులతోపాటు, వ్యాయామాన్ని కూడా క్రమం తప్పకుండా చేయాలి. ఎముకలు, కండరాలను బలోపేతం చేయడానికి, అకస్మాత్తుగా పడిపోయే ప్రమాదాన్ని నివారించగల శక్తి అధో ముఖానికి ఉంది. రోజూ ఈ ఆసనాన్ని దినచర్యలో భాగం చేస్తూ ఉంటే మైండ్, బాడీ చురుకుదనం పెరుగుతుంది. ఇలా వేయాలి....∙మ్యాట్ పైన లేదా నేలపైన నిటారుగా నిల్చొని చేతులను పైకి స్ట్రెచ్ ఉంచాలి. తర్వాత నడుం భాగం వంచుతూ, చేతులను పూర్తిగా నేలమీద ఆనించాలి. ∙చేతులను పాదాలకు దూరంగా తీసుకెళుతూ త్రికోణాకారంలో ఉండాలి.కాలి వేళ్ల మీద ఉంటూ మడమలను పైకి లేపాలి. శరీర బరువు చేతులు, కాలి ముని వేళ్ల మీద ఉంటుంది. ∙నిమిషం సేపు ఇదే భంగిమలో ఉండాలి. తిరిగి యధాస్థితికి రావాలి. ఇలా ఒకటి నుంచి 3 సార్లు ఈ ఆసనాన్ని పునరావృతం చేయాలి.ఈ ఆసనం వేయటానికి మొదట్లో కాస్త కష్టంగా వున్నా రోజూ సాధన చేస్తూ ఉంటే సులువవుతుంది. వెన్నెముక, కాళ్ళను బలోపేతం చేస్తుంది. అదే విధంగా ఏకాగ్రత పెంచి, ఒత్తిడి నుండి రిలీఫ్‌ని ఇస్తుంది. అజీర్తి సమస్యలు దూరమవుతాయి. నడుము నొప్పి తగ్గుతుంది. ఆస్టియోపోరోసిస్ సమస్య నుండి రక్షిస్తుంది. సైనస్, ఆస్తమా, పీరియడ్స్‌లో వచ్చే సమస్యల నుంచి రిలీఫ్‌ని ఇస్తుంది. ఇన్ని ప్రయోజనాలని ఈ ఆసనం ద్వారా పొందవచ్చు. ఎముకలు దృఢంగా ఉండటానికి ఏం చేయాలి?ఎముకలు దృఢంగా ఉండాలంటే.. సమతుల్య, పోషకమైన ఆహారాన్ని తీసుకోవాలి.కాల్షియం, విటమిన్ డి వంటి పోషకాలు సమృద్ధిగా లభించే ఆహారం తినాలి.పాలు, పెరుగు, జున్ను వంటి పాల ఉత్పత్తులు తినాలి.విటమిన్ డి సమృద్ధిగా ఉండే ఆహారాలు తినాలి.బాల్యంలో ఎముకలు దృఢంగా ఉండటానికి పోషకాలు తీసుకోవడం ముఖ్యం.వ్యాయామం చేయడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి.మెనోపాజ్ దాటిన స్త్రీలు మరింత జాగ్రత్తలు తీసుకోవాలి.ఎముకలు, కండరాలను బలోపేతం చేసేలా వ్యాయామం తప్పనిసరిగా చేయాలి.ఇదీ చదవండి: టాటూ కోసం వెళ్లి..వ్యాపారవేత్త, పాపులర్ ఇన్ఫ్లూయెన్సర్ మృతి -
సంక్రాంతికి వస్తున్నాం ‘అప్పడాలు’ కాదు... సోషల్ మీడియాను షేక్ చేస్తున్నవీడియో!
సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో కామెడీ పండించిన ‘బుల్లిరాజు’ గుర్తున్నాడా? ‘‘అప్పడాలు వడియాలు అయ్యాయా’’అంటూ చెప్పిన కొన్ని డైలాగులు సోషల్ మీడియాను షేక్ చేశాయి. థియేటర్ లో నవ్వులు పూయించిన బుల్లిరాజు క్యారెక్టర్ విమర్శల పాలయ్యింది. పిల్లాడితో బూతు డైలాగులా అంటూ జనం మండిపడ్డారు. ఇప్పుడు ఇదంతా ఎందుకూ అంటే...అక్కడికే వస్తున్నా... అప్పడాలు, వడియాలతోపండగ చేసుకుంటున్న నెటిజనుల దృష్టిలో అప్పడాలకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. పప్పు, సాంబారు, అప్పడాలు కాంబినేషన్ ఎంత ఫ్యామస్సో తెలుసు కదా. చాన్స్ దొరికితే కరకరమనే అప్పడాలను ఇంకో రెండు వేసుకుని మరీ లాగించేస్తాం. అయితే ఈ అప్పడాలను ఎలా తయారు చేస్తారో ఎపుడైనా ఆలోచించారా? దీనికి సంబంధించిన ఒక వీడియోపై నెట్టింట తెగ చర్చ నడుస్తోంది.అప్పడాల్లో చాలా రకాలు మార్కెట్లో లభిస్తుంటాయి. బియ్యం పాపడ్, మసాలా పాపడ్, కలి మిర్చ్ పాపడ్, రాగి పాపడ్, వెల్లుల్లి పాపడ్, సాబుదానా పాపడ్, అబ్బో ఇలా చాలా రకాలే ఉన్నాయి. ఈ అప్పడాలు లేనిదే ఫంక్షన్స్, పార్టీలు సంపూర్ణం కాదంటే అతిశయోక్తి కాదు. అయితే అప్పడాలను తయారు చేస్తున్న వీడియో ఒకటి ట్విటర్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో ప్రకారం ఒక పెద్ద గిన్నెలో అప్పడాల పిండి కలిపి ఉంది. దీని ఆవిరి మీద ఉడికేలా.. వేడినీటి గిన్నెపై ఉన్న మూతపై పూతలా వేసింది ఒక మహిళ.దాన్ని తీసి ఒకచోట పేర్చింది. ఆ తర్వాత వరుసగా పేర్చిన వాటిపై పదునైన గుండ్రటి స్టీల్ డబ్బాల సాయంతో కాళ్లతో తొక్కుతూ పెద్ద అప్పడంపై ఒత్తిడి పెంచి, దాన్ని గుండ్రటి అప్పడాలుగా తయారు చేశారు. అలా ఒక్కోటి వేరు వేరుగా తీసి వాటిని ఎండబెట్టడం ఈ వీడియోలు చూడవచ్చు.తేజస్ పటేల్ అనే యూజర్ దీన్ని ఎక్స్‌లో షేర్ చేశారు. కష్టపడి పనిచేస్తున్నారు... కానీ శుభ్రతగురించి పట్టించుకోవడం లేదు అన్నట్టుగా కమెంట్ చేశారు. ఇలాంటి వాటిని తినడం తినకపోవడం మీ ఇష్టం అన్నట్టుగా ఉన్న ఈ వీడియోపై నెటిజన్లు విభినంగా స్పందించారు. కాళ్లతో తొక్కడం తప్ప అంతా బానే ఉందని కొందరు, అప్పడం రుచిలోని రహస్యం అదే అంటూ వ్యాఖ్యానించారు. ( టాటూ కోసం వెళ్లి..వ్యాపారవేత్త, పాపులర్ ఇన్ఫ్లూయెన్సర్ మృతి)Very hardworking ppl, let's support. Why care about hygiene🤡 pic.twitter.com/4HmsxZIgWC— Tejas Patel (@237Stardust) January 22, 2025ఫాస్ట్ ఫుడ్, హోటల్స్‌లో పాటించే శుభ్రత కంటే బెటరేగా?గతంలో ఇలాంటి వీడియో ఒకటి ఇన్‌స్టాలో చర్చకు తెరతీసింది. దీనిపై చాలామంది విమర్శలు గుప్పించినప్పటికీ, చాలామంది సమర్ధించారు. "ఫాస్ట్ ఫుడ్" కంటే మెరుగే అని కొందరు "చాలా హై-ఎండ్ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లు, స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ కంటే ఇది చాలా బెటర్ అని ఒకరు,"కనీసం ఈ మహిళ అప్పడాలపై డైరెక్ట్‌గా పాదం పెట్టకుండా తగినంత జాగ్రత్త పడుతోంది.. ఇంత కంటే ఘోరంగా చాలా హోటల్స్ ఉంటాయి అంటూ ఇంకొందరు అంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. View this post on Instagram A post shared by Karansingh Thakur (@dabake_khao)అప్పడం ఒక ఎమోషన్సౌత్ ఇండియాలో అప్పడాలు, వడియాలు విందు భోజనాన్ని అస్సలు ఊహించలేం. అప్పడాలలో ఫైబర్, ప్రోటీన్, ఇతర మంచి పోషకాలు వుంటాయి. జీవక్రియను ప్రోత్సహించేందుకు అప్పడాలు దోహదపడతాయి. గ్యాస్ట్రిక్ సమస్యలను నివారించగల శక్తి అప్పడాలకు వుంది.అయితే ఇటీవల ఆరోగ్యంపై పెరుగుతున్న అవగాహన నేపథ్యంలో ఆయిల్ లేకుండా వేయించుకునే అప్పడాలు కూడా వచ్చాయి ఎందుకంటే అప్పడాలతో ఆరోగ్య ప్రయోజనాలతో పాటు అనారోగ్య సమస్యలు కూడా వున్నాయి ముఖ్యంగా ఆయిల్లో వేయించడం ద్వారా ఎన్నో అనారోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. రక్తపోటు, గుండె జబ్బుల నుంచి క్యాన్సర్ వరకు ముప్పు పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతారు. సో.. చాయిస్ ఈజ్ యువర్స్. -
బరువు తగ్గాలనుకుంటున్నారా..? హెల్ప్ అయ్యే టిప్స్ ఇవిగో..
బరువు తగ్గాలని(Losing weight) చాలామంది అనుకుంటారు. అయితే కొత్తగా ప్రారంభించేవారికి ఏది మంచిది, ఎలాంటి డైట్ బెటర్ అనే గందరగోళానికి గురవ్వతుంటారు. అందుకు తగ్గట్టుగానే విభిన్నమైన డైట్లు సోషల్ మీడియాల్లో ఊదరగొట్టేలా వైరల్ అవుతున్నాయి. దీంతో సవ్యంగా సరైనది ఎంచుకోలేక తంటాలు పడుతున్నారు. అలాంటి వాళ్లు ఇన్స్టాగ్రామ్ యూజర్ భవ్య చెప్పే డైట్ అండ్ ఫిట్నెస్ హెల్ప్ అవుతాయి. అందుకు ఆమె అనుభవమే ఓ ఉదాహరణ. ముఖ్యంగా కొత్తగా వెయిట్ లాస్ జర్నీ(Weight loss journey)కి ఉపక్రమించేవాళ్లకు మరింత ఉపయోగపడతాయని నమ్మకంగా చెబుతోంది భవ్య. అవేంటో చూద్దామా..!.భవ్య కూడా దగ్గర దగ్గర 75 కేజీల బరువు ఉండేదట. తాను ఎలాగైన బరువు తగ్గాలని శ్రద్ధగా తీసుకున్న బేసిక్ డైట్, వర్క్ట్లు ప్రభావవంతంగా పనిచేశాయట. దీంతో ఆమె ప్రస్తుతం 60 కేజీల బరువుతో ఫిట్‌గా కనిపిస్తోంది. తాను ఎలాంటి డైట్, ఫిట్నెస్ వర్కౌట్లు ఫాలో అయ్యిందో ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకుంది. వెయిట్ లాస్ జర్నీకి ఉపకరించే బేసిక్స్..డైట్ ఎలా ఉండాలంటే..కలర్‌ఫుల్ ఫ్రూట్స్, కూరగాయాలను తప్పనిసరిగా ప్రతీ భోజనంలో ఉండేలా చూసుకోవడం. లీన్ ప్రోటీన్ కోసం చికెన్, చేప, టోఫు తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ ప్రోటీన్లు బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి.బియ్యం, క్విననో, ఓట్స్ వంటి వాటిని తీసుకోవాలి. వర్కౌట్లు..వామ్ అప్ వ్యాయామాలతో ప్రారంభించి, ఐదు నుంచి పదినిమిషాలు కార్డియో ఎక్సర్సైజులు చేయాలి. ముప్పై నుంచి నలభై నిమిషాలుపుష్అప్, స్క్వాట్స్, లేదా శక్తిమంతమైన వ్యాయామాలు చేయాలి. ఈ వర్కౌట్లు పూర్తి అవ్వగానే బాడీ ఫ్లెక్సిబిలిటీ, మానసిక ప్రశాంతత కోసం యోగా వంటివి చేస్తే బెటర్ అని చెబుతోంది భవ్య.వీటన్నింటి తోపాటు బాడీ హైడ్రేటెడ్‌గా ఉండేలా రెండు నుంచి మూడు లీటర్లు నీళ్లు తీసుకోవాలి. అలాగే తక్కువ క్వాండిటీలో ఎక్కువ సార్లు తీసుకుంటే అలసటకు గురవ్వమని చెబుతోంది భవ్య. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవతోంది. View this post on Instagram A post shared by Bhavya .ೃ࿔ ✈︎ *:・ (@avgeek.bhavya) (చదవండి: ఆ డాక్టర్ డేరింగ్‌కి మతిపోవాల్సిందే..! వామ్మో మరీ ఇలానా..) -
ఏజ్.. ఇక్కడ జస్ట్ నంబరే!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి / జహీరాబాద్: జీవన విధానం, ఆహారపు అలవాట్లలో మార్పులతో నేడు మూడు పదుల వయసు వచ్చేసరికే బీపీ, షుగర్, గుండె సంబంధ ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. పట్టణాలు, నగరాల్లో ఈ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కానీ, కొన్ని గ్రామీణ ప్రాంతాలు నేటికీ ఆరోగ్య సిరులతో విలసిల్లుతున్నాయి. పది పదుల వయసు దాటిన వృద్ధులు సైతం నవ యువకుల్లా పనులు చేసుకుంటున్నారు. తమ ఆహారపు అలవాట్లే అందుకు కారణమని వారు చెబుతున్నారు. చిరు ధాన్యం మహాభాగ్యండెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్) స్వచ్ఛంద సంస్థ 4 దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతంలో చిరుధాన్యాల సాగును ప్రోత్సహిస్తూ వస్తోంది. ఝరాసంగం, రాయికోడ్, న్యాల్కల్, కోహీర్, మొగుడంపల్లి, జహీరాబాద్ మండలాల్లోని సుమారు 40 గ్రామాల్లో 5 వేల మంది మహిళా రైతులను సంఘటితం చేసి సేంద్రియ విధానంలో చిరుధాన్యాలను సాగు చేసేలా ప్రోత్సహిస్తోంది. కొర్రలు, సామలు, అండుకొర్రలు, పచ్చ జొన్నలు, సాయిజొన్నలు, కంది, మినప, పెసర వంటి పంటలు సుమారు రెండు వేల ఎకరాల్లో సాగు చేయిస్తున్నారు. ఇందులో పోట్పల్లి, మోడ్ తండా గ్రామాలూ ఉన్నాయి.ఎన్నో పోషక విలువలు కలిగిన ఈ సిరిధాన్యాల (మిల్లెట్స్)ను సాగు చేయడంతో పాటు, వాటినే నిత్యం ఆహారంగా తీసుకుంటున్న ఆ గ్రామాల వాసులు సంపూర్ణ ఆరోగ్యంతో జీవనం కొనసాగిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఏటా జరిగే పాత పంటల జాతర నేపథ్యంలో ఝరాసంఘం మండలం పోట్పల్లి, జహీరాబాద్ మండలం మోడ్ తండా గ్రామాల్లో ‘సాక్షి’బృందం నిర్వహించిన క్షేత్రస్థాయి పరిశీలనలో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. పాత పంటల జాతరఈ ప్రాంతంలో ఏటా నిర్వహించే పాత పంటల జాతర ఈ నెల 14న న్యాల్కల్ మండలంలోని వడ్డీ గ్రామం నుంచి ప్రారంభమైంది. ఫిబ్రవరి 11న ఝరాసంగం మండలం మాచ్నూర్లో ముగుస్తుంది. జాతర 24 గ్రామాల్లో జరగనుంది. ఎడ్ల బండ్లలో చిరుధాన్యాలను ప్రదర్శిస్తూ వాటి ప్రాధాన్యత గురించి ఈ జాతరలో ప్రచారం చేస్తున్నారు.విలేజ్ ప్రొఫైల్స్.. గ్రామం: పోట్పల్లి (ఝరాసంఘంమండలం,సంగారెడ్డి జిల్లా) జనాభా:2,263 ప్రధాన వృత్తి: వ్యవసాయం (సుమారు 90 శాతం) బీపీ, షుగర్ ఉన్నవారు సుమారు పదిమంది లోపే..గ్రామం:మోడ్ తండా (జహీరాబాద్ మండలం,సంగారెడ్డి జిల్లా) జనాభా: 192 ప్రధాన వృత్తి : వ్యవసాయం బీపీ, షుగర్ ఉన్న వారు కేవలం ఇద్దరే.వారికి రోగాలు తక్కువే.. పోట్పల్లి, ఎల్గొయ్ గ్రామాల్లో వ్యాధుల బారిన పడినవారి సంఖ్య చాలా తక్కువ. వీరు నిత్యం జొన్నరొట్టె, కందిపప్పుతో పాటు, కొర్రలు, సామలు తింటుంటారు. అందుకే వయసు మీదపడినా ఆరోగ్యంగా ఉంటున్నారు. – ఆలీస్, ఏఎన్ఎం, ఎల్గొయ్ సబ్ సెంటర్అత్తల నుంచి కోడళ్లకు బదిలీ చిరుధాన్యాల సాగును ముందుకు తీసుకెళ్లేందుకు అత్తల నుంచి కోడళ్లకు వ్యవసాయాన్ని బదిలీ చేయించుకున్నాము. వేయి మందికి పైగా కోడళ్ల సంఘంలో సభ్యులు ఉన్నారు. భూమి కౌలుకు తీసుకుని మూడు ఎకరాల్లో సాయిజొన్న పంట వేసుకున్నా. –మొగులమ్మ, పోట్పల్లి, కోడళ్ల సంఘం అధ్యక్షురాలుఈయన పేరు బోంగూరు స్వామిదాసు. సంగారెడ్డి జిల్లా పోట్పల్లికి చెందిన స్వామిదాసు వయసు 75 ఏళ్లు. దశాబ్దాలుగా తన పొలంలో పాత పంటలు (మిల్లెట్స్) సాగు చేస్తూ, వాటినే ఆహారంగా తీసుకుంటుండటంతో ఎలాంటి అనారోగ్యం లేకుండా ఇప్పటికీ తన పనులు తానే చేసుకుంటున్నానని చెబుతున్నారు. కొర్రబువ్వ, జొన్నరొట్టెను ఆహారంగా తీసుకుంటున్నానని చెప్పారు.వందేళ్ల వయసు దాటిన ఈయన పేరు గర్మూనాయక్. భార్య జాలీబాయికి కూడా తొంౖభైæ ఏళ్లు ఉంటాయి. మోడ్ తండాకు చెందిన ఈ దంపతులు ఇప్పటికీ స్వయంగా మేకలు కాసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. చిన్ననాటి నుంచి పచ్చజొన్న, సాయిజొన్న, సజ్జరొట్టెలు, తైద అంబలి, కంది, మినప పప్పు తినడమే తమ ఆరోగ్య రహస్యమని చెబుతున్నారు.ఇంటి ముందు సానుపు (కల్లాపి) చల్లుతున్న ఈ వృద్ధురాలు మన్నెల్లి దానమ్మ. సుమారు 70 ఏళ్ల వయసున్న ఈమెకు సంతానం లేదు. ఇప్పటికీ తన పని తాను చేసుకుంటోంది. చిన్నప్పటి నుంచి కొర్రబువ్వ, సామలు, తైద అంబలి, సాయిజొన్న రొట్టెలు తినటం వల్లనే ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నట్లు చెబుతోంది. -
మూడు పూటలా భోజనం, నడకతో ఏకంగా 124 ఏళ్లు..!
అత్యంత కాలం బతికిన శతాధిక వృద్ధులను చూస్తే..వారి ఆరోగ్య రహస్యం ఏంటని కుతూహలంగా ఉంటుంది. వారి దీర్ఘాయువుకి కారణం.. క్రమశిక్షణతో కూడిన జీవన విధానమని క్లియర్‌గా స్పష్టమవుతోంది. ఇంతవరకు జపాన్, బ్రెజిల్‌లోని శతాధిక వృద్ధ మహిళలు, వారి హెల్త్ సీక్రెట్ల గురించి విన్నాం. ఇప్పుడు వారందర్నీ వెనక్కినెట్టి అత్యంత శతాధిక వృద్ధురాలికి నిలిచి ఆశ్చర్యపరుస్తోంది ఈ చైనా బామ్మ. అయితే ఈ బామ్మ ఇప్పటికీ తన పనులను తానే చేసుకుంటోందట. మిగతా శతాధిక వృద్ధ బామ్మల మాదిరిగా ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో జాయిన్ అవ్వకపోవడం విశేషం. అయితే ఈ బామ్మ ఆరోగ్య రహస్యం ఏంటో తెలిస్తే విస్తుపోవడం ఖాయం. ఆ బామ్మ ఎవరంటే..చైనా(China)కు చెందిన క్వి చైషి(Qiu Chaishi) అనే బామ్మ. ఆమె వలసవాద సెమీ ఫ్యూడల్ పాలనకు గుర్తుగా నాటి క్వింగ్ రాజవంశ పాలకుల హయాంలో 1901లో జన్మించింది. జనవరి 1న 124వ పుట్టిన రోజున జరుపుకుంది. అప్పుడే రుతి చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో ఉన్న నాన్‌చాంగ్ నగరం అత్యంత శతాధిక వృద్ధులలో ఆమె కూడా ఒకరిగా క్విచైషి బామ్మను గుర్తించింది.ఆమెకు ఏకంగా 60 ఏళ్ల వయసున్న మనవరాలు ఉంది. తన తరంలోని అత్యంత చిన్న కుటుంబ సభ్యురాలు వయసు ఎనిమిది నెలల చిన్నారి అట. ఇక ఆమె సుదీర్ఠకాల ఆరోగ్యం రహస్యం ఏంటంటే..హెల్త్ సీక్రెట్..తన సుదీర్ఘకాల(Longevity) జీవన రహస్యం క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అని నమ్మకంగా చెబుతోంది. రోజూ మూడుపూటల భోజనం(Lard Rice) చేస్తుందట. అయితే భోజనం తర్వాత నడక(Walks) తప్పనిసరి అని చెబుతోంది క్విచైషి. అలాగే రాత్రి 8 కల్లా నిద్రపోతుందట. ఇప్పటకీ తన పనులన్నీ చకచక చేసుకుంటుందట. తల దువ్వుకోవడం దగ్గర నుంచి స్టవ్ వెలిగించడం, పెంపుడు జంతువులను పెంచడం, మెట్లు ఎక్కడం తదితర అన్ని పనులను సునాయాసంగా చేసేస్తుందట. తనకు ఇష్టమైన వంటకాల గురించి కూడా షేర్ చేసుకుంది. ఆమెకు గుమ్మడికాయ, శీతాకాలపు పుచ్చకాయ, మొక్కజొన్న పిండితో చేసే గంజి, పందికొవ్వు అంటే మహా ఇష్టమట. కానీ పంది కొవ్వుని మాత్రం వైద్యుల సలహా మేరకు మితంగా తీసుకుంటున్నట్లు తెలిపింది. నిజంగా ఈ బామ్మ ఆరోగ్యపు అలవాట్లు ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఈ బామ్మ మాములు గ్రేట్ కాదు, అంతకు మించి అని ప్రశంసించకుండా ఉండలేం కదా..!.(చదవండి: ఇంతలా 'కృతజ్ఞత' చూపించడం అందరి వల్ల కాదేమో..!) -
2025లో ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ..బెస్ట్ టిప్స్!
చిరకాలం ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం చాలా ముఖ్యం. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. 2025లోకి అడుగుపెడుతున్న ఈ సమయంలో, జీవనశైలి మార్పులు ఆరోగ్యంపై ఎంత ప్రభావితం చేస్తాయనే దానిపై పెరుగుతున్న అవగాహనతో, ప్రోటీన్లు, ఒమేగా-3లు, విటమిన్లు , ఖనిజాలు వంటి ముఖ్యమైన పోషకాలకు ప్రాధాన్యత గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ఇదే మన భవిష్యత్ ఆనందానికి, ఆరోగ్యానికి బలమైన పెట్టుబడి.పోషకాహారం అంటే కేలరీలను లెక్కించడం గురించి మాత్రమే కాదు. అది శరీరానికి ఎంత అవసరమో తెలుసుకోవడం. ఆరోగ్యంగా ఉండటానికి శక్తితోపాటు సూక్ష్మపోషకాల కోసం సరైన మాక్రోన్యూట్రియెంట్లు ఉండేలా చూసుకోవాలంటున్నారు. అబాట్, న్యూట్రిషన్ బిజినెస్, మెడికల్ & సైంటిఫిక్ అఫైర్స్ డైరెక్టర్ డాక్టర్ ప్రీతి ఠాకూర్. ఆహారపు అలవాట్ల పట్ల మరింత శ్రద్ధ వహిస్తున్నందున, పోషకాలు అధికంగా ఉండే ఆహారాలకు డిమాండ్ పెరుగుతోంది. ఇది ఆరోగ్యకరమైన ఆహార విధానాలకు దారితీస్తుంది. ముఖ్యంగా నోటి పోషక పదార్ధాలు (ONS) పోషకాహార లోపాలను పూరించడానికి, పోషకాహార లోపాన్ని నివారించడానికి సహాయపడుతంది. ముఖ్యంగా ఆకలి లేని వారికి, పోషకాహార లోపం ఉన్నవారికి,పోషకాలను గ్రహించడంలో ఇబ్బంది ఉన్న వ్యక్తులకు ఇది సాయపడుతుంది.పోషకాహారం & అభివృద్ధి చెందుతున్న పోషక అవసరాలను అర్థం చేసుకోవడంపోషకాహారం అంటే ఏంటి అనేది అస్పష్టంగా ఉండిపోతున్నప్పటికీ, మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంచి పోషకాహారం చాలా అవసర అనేది మనందరికీ తెలుసు. శాకాహారం పాలియో డూట్, గ్లూటెన్-రహిత , కీటో డైట్ వంటివి చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇందులో దేన్ని ఎంచుకోవాలనేది కష్టంగా అనిపించినా, సమతుల్యమైన ఆహారం అందరికీ శ్రయస్కరం అనేది అధ్యయనాలతోపాటు అందరూ అంగీకరించే విషయం.ఎదుగుతున్న క్రమంలో వివిధ దశల ఆధారంగా పోషక అవసరాలు పెరుగుతాయి. ఉదాహరణకు, పిల్లలకు పెరుగుదలకు అధిక మొత్తంలో కొన్ని పోషకాలు అవసరం, పెద్దలు కండబలం, ఎముక సాంద్రతను నిర్వహించడంపై దృష్టి పెట్టాలి. అదే వద్ధులైతే కండరాల నష్టాన్ని నివారించేలా, ఎక్కువ ప్రోటీన్ , అభిజ్ఞా పనితీరును నిర్వహించడానికి విటమిన్‌డీ, బీ 12 అదనపు విటమిన్లు అవసరం పడుతుంది. ఈ మార్పులను గుర్తించడం అనేది చాలా ముఖ్యమైనది.పెద్దల ఆహారం-ముఖ్యమైన పోషకాలుప్రోటీన్: ఇది కండరాల మరమ్మత్తుకు పెరుగుదలకు మద్దతు ఇస్తుంది . పప్పు (కాయధాన్యాలు), చిక్పీస్, కిడ్నీ బీన్స్ (రాజ్మా), పనీర్ (కాటేజ్ చీజ్), గుడ్లు ,చికెన్ ద్వారా దీన్ని పొందవచ్చు.కార్బోహైడ్రేట్లు: శరీరానికి ప్రాథమిక శక్తి వనరు అయిన కార్బోహైడ్రేట్లు సాధారణంగా బియ్యం, గోధుమ రోటీ, పోహా, ఓట్స్, చిలగడదుంపల్లో లభిస్తాయి.ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు: గుండె ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడంతోపాటు వాపును తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి అవిసె గింజలు (ఆల్సి), వాల్నట్లు, ఆవనూనె , ఇండియన్ మాకేరెల్ (బంగ్డా) లేదా రోహు వంటి చేపల ద్వారా అందుతాయి.ఫైబర్: ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది. బ్రౌన్ రైస్, మిల్లెట్ వంటి తృణధాన్యాలు, జామ ,ఆపిల్ వంటి పండ్లు, పాలకూర , బ్రోకలీ వంటి కూరగాయలు, ఇంకా సైలియం పొట్టు (ఇసాబ్గోల్)లో లభిస్తుందివిటమిన్లు:విటమిన్ డి: ఎముకల ఆరోగ్యానికి కాల్షియం శోషణకు సహాయపడుతుంది. పాలు, పెరుగు,సూర్యకాంతి ద్వారా పొందవచ్చువిటమిన్ ఇ: యాంటీఆక్సిడెంట్, కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. బాదం, పొద్దుతిరుగుడు గింజలు, ఆవ ఆకూరలో ఉంటుంది.విటమిన్ సి: రోగనిరోధక పనితీరుకు,ఆరోగ్యానికి అవసరం, నారింజ ,యు నిమ్మకాయలు, ఆమ్లా (ఇండియన్ గూస్బెర్రీ), జామ వంటి సిట్రస్ పండ్లలో లభిస్తుందివిటమిన్ బి6: మెదడు ఆరోగ్యం , జీవక్రియకు ముఖ్యమైనది, అరటిపండ్లు, బంగాళాదుంపలు, పొద్దుతిరుగుడు విత్తనాలలో లభిస్తుందివిటమిన్ బి12: నాడీ పనితీరుకు, రక్త కణాల ఉత్పత్తికి ముఖ్యమైనది, పాల ఉత్పత్తులు, గుడ్లు, చేపలు,బలవర్థకమైన తృణధాన్యాలలో లభిస్తుందిఖనిజాలు:కాల్షియం: ఎముకల ఆరోగ్యానికి ముఖ్యమైనది, పాలు, పెరుగు, రాగి (Finger millets) నువ్వుల గింజల్లో ఎక్కువ లభిస్తుంది.ఐరన్: జీవక్రియ ప్రక్రియలకు మద్దతు ఇస్తుంది. పాలకూర, మెంతి ఆకులు ((Fenugreek), బెల్లం (గుర్), పప్పుధాన్యాలు (పప్పు) ద్వారా లభిస్తుందిజింక్: రోగనిరోధకశక్తి, గాయాలను నయం చేయడంలో సాయపడుతుంది. గుమ్మడికాయ గింజలు, చిక్పీస్ . బజ్రా వంటి తృణధాన్యాలలో లభిస్తుంది.రోజువారీ భోజనం ఎలా ఉండాలంటే..సామెత చెప్పినట్టుగా "రాజులాగా అల్పాహారం, యువరాజులాగా భోజనం, బిచ్చగాడిలా రాత్రి భోజనం’’ ఉండాలి. కార్బోహైడ్రేట్ల కంటే ప్రోటీన్లు ఎక్కువ ఉండాలి. కొవ్వులు జీర్ణం కావడం కష్టం కాబట్టి, వాటిని అల్పాహారం , భోజనంలో తీసుకోవాలి. అరుగుదల తక్కువగా ఉంటుంది కాబట్టి రాత్రి భోజనం తేలిగ్గా ఉండాలి. ఆహారానికి మధ్యలోచాలా విరామం తర్వాత తీసుకునే భారమైన అల్పాహారం శక్తివంతమైందిగా ఉండాలి. అయితే పరగడుపున శరీరంలోని మలినాలను బైటికి పంపేందుకు గోరువెచ్చని నీరుతాగిలి. సీజన్‌ను బట్టి కూరగాయలు, పప్పుధాన్యాల నుండి తయారు చేసిన పోహా, ఉప్మా, దోస, ఇడ్లీ లేదా చీలా పవర్పేక్డ్ కార్బోహైడ్రేట్స్‌ను తీసుకోవచ్చు.2025లో చిన్న చిన్న మార్పులు, భారీ లాభాలు చిన్న మార్పులు మన మొత్తం ఆరోగ్యంలో గణనీయమైన మెరుగుదలకు దారితీస్తాయిసమతుల ఆహారంపై దృష్టిపెట్టడంప్రాసెస్ చేసిన ఆహారాలను తగ్గించడంహైడ్రేడెట్గా ఉండటం, అంటే రోజుకు సరిపడినన్ని నీళ్లు తాగడం.పోషకాహారం తీసుకుంటూ ఎముకలు కండరాల బలాన్ని పెంచుకునేందుకు క్రమం తప్పని వ్యాయామం. ఆరోగ్య సంరక్షణలో శారీరక శ్రమ చాలా కీలకం. వారానికి కనీసం రెండుసార్లు బలమైన వ్యాయామాల వల్ల సమతుల్యత మెరుగుపడుతుంది. నడక, ఈత లేదా యోగా వంటివి ఫిట్‌నెస్‌కు దోహదం చేస్తాయి.ఈ ఏడాదిలో ఆరోగ్యకరమైన జీవనంపై దృష్టి పెడదాం. శరీరానికి బలాన్నిచ్చే ఆహారాన్ని, చురుకునిచ్చే వ్యాయామాలను, సానుకూల మనస్తత్వాన్ని పెంపొందించే మార్పులను స్వీకరిద్దాం. తద్వారా సమిష్టిగా జీవితాన్ని ఆరోగ్యకరంగా, సంతోష కరంగా మార్చుకుందాం. ఇదీ చదవండి: కొత్త బంగారు లోకం.. అనాథ చిన్నారులకు ఆహ్వానం -
ఆరోగ్య.. సంతాన ప్రదాత : మల్లూరు నరసింహస్వామి
హిరణ్యకశిపుడి ఆగడాలను అంతమొందించడానికి భక్త ప్రహ్లాదుడికి ముక్తిని ప్రసాదించడానికి శ్రీహరి ఎత్తిన అవతారమే నరసింహావతారం. ఆ నృసింహ దేవుడు తన ఉనికిని చాటుకోవడానికి అనేక క్షేత్రాలలో అవతరించాడు. అలాంటి పుణ్య క్షేత్రాలు తెలుగు రాష్ట్రాలలో తొమ్మిది ఉన్నాయి. వాటినే మనం నవ నరసింహ క్షేత్రాలని పిలుస్తున్నాం.. ఆ నవ నరసింహ క్షేత్రాలలో మొట్టమొదటి క్షేత్రంగా మల్లూరు హేమాచల లక్ష్మి నరసింహ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. వరంగల్ జిల్లా మంగ పేట మండలంలో ఉన్న ఈ క్షేత్రంలో స్వామి హేమాచల లక్ష్మి నరసింహస్వామిగా పూజాదికాలు అందుకుంటున్నాడు. సంతాన, ఆరోగ్య ప్రదాతగా విశేష ఖ్యాతిగడించాడు స్వామి. వరంగల్ పట్టణానికి 135 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అటవీ వనాలు కొండలు మధ్య, ఆహ్లాదకరమైన వాతావరణంలో అలరారుతోంది. మల్లూరు గ్రామానికి ఎనిమిది కిలోమీటర్లు దూరంలో ఉన్న ఈ ఆలయం హేమాచలం అనే కొండ మీద అలరారుతోంది. హేమాచల నరసింహ స్వామిని దర్శించుకోవడం వల్ల సమస్త శత్రు బాధలు తీరుతాయంటారు.ఇక్కడి స్వామి వారి మూర్తి అయిదు వేల సంవత్సరాల నాటిదని ఇక్కడి ఆధారాల ద్వార తెలుస్తోంది. సాక్షాత్తు దేవతలే ఇక్కడ స్వామివారిని ప్రతిష్టించినట్లు చెబుతారు. గర్భాలయంలో స్వామి వారి మూర్తి మానవ శరీరంలా మెత్తగా దర్శనమిస్తుంది . స్వామి వారి ఛాతీ మీద రోమాలు దర్శనమిస్తాయి. అలాగే స్వామి వారి శరీరాన్ని ఎక్కడ తాకినా మెత్తగా ఉంటుంది. ఉదర భాగం కూడా మానవ శరీరంలా మెత్తగా ఉండి.. మనుషులకు వచ్చినట్టే చెమట కూడా వస్తుంది. స్వామి వారి నాభి భాగంలో ఓ రంధ్రం దర్శనమిస్తుంది. దీనినుంచి నిరంతరం ఓ ద్రవం కారుతుంటుంది. దీనిని అదుపు చేయడానికి ఆ భాగంలో గంధాన్ని పూస్తారు. పూర్వకాలంలో స్వామి వారి విగ్రహాన్ని తరలించినపుడు, బొడ్డు దగ్గర ఇలా రంధ్రం పడిందంటారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఆ బొడ్డు భాగంలో ఉంచిన గంధాన్నే ప్రసాదంగా ఇస్తారు.ఆరోగ్యామృతం ఆ నీరుఇక స్వామివారి పాదాల చెంత నుంచి నిత్యం ఒక జలధార ప్రవహిస్తూ ఉంటుంది. దానినే చింతామణి జలధారగా పిలుస్తారు. ఈ నీరు కొద్ది కొద్దిగా కొన్ని రోజుల ΄ాటు తాగితే అన్ని రోగాలూ తగ్గిపోతాయనీ ఆ జలం సర్వ రోగ నివారిణి అనీ, భక్తులు విశ్వసిస్తారు స్వామి పాదాల నుంచి వచ్చే ఆ నీరు చింతామణి జల పాతాన్ని సమీపించే లోపు అనేక ఔషధ విలువలు గల చెట్ల క్రింది నుండి రావడం వల్ల ఆ నీటికి అంతటి శక్తి పెంపొందిందని అంటారు. రాణి రుద్రమదేవి అనారోగ్యానికి గురైన సమయంలో ఈ జలపాతంలోని నీటిని తాగడంతో ఆమె అనారోగ్యం నుంచి కోలుకుందని, ఆ తర్వాత అక్కడి నీటి విశిష్ఠత తెలుసుకున్న రుద్రమదేవి ఆ జలపాతానికి చింతామణి అనే పేరు పెట్టింది. చింతామణి జలధార నీటిని ఇప్పుడు కూడా విదేశాలలో ఉన్న తమ వారికి కూడా పంపిస్తూ ఉంటారు స్థానికులు, క్షేత్రాన్ని సందర్శించిన వారు. ఈ జలపాతానికి సమీపంలో మహా లక్ష్మి అమ్మవారి పురాతన మందిరం ఉంది. చింతామణి జల పాతానికి సమీపంలో మరో చిన్ని జల పాతం ఉంది.ఎలా చేరుకోవాలి?ములుగు జిల్లాలోని మల్లూరు గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో హేమాచల నరసింహస్వామి ఆలయం ఉంది. మల్లూరు క్షేత్రానికి వరంగల్ నుంచి నేరుగా చేరుకోవచ్చు. అలాగే ఖమ్మం జిల్లా మణుగూరు పట్టణానికి కూడా ఇది సమీపంలో ఉండడం వల్ల మణుగూరు నుంచి కూడా ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు.– భాస్కర్ -
అది ఒబెసిటీ కాదట..!15 ఏళ్ల తర్వాత..
ఇన్నాళ్లుగా అనుకున్నట్లుగా ఒబెసిటీ అంటే అది కాదట. దశాబ్దాలు అలానే తప్పుగా భావించమని తేల్చి చెప్పారు వైద్యులు. అసలు ఒబెసిటీ అంటే ఏంటో..అందుకు సంబంధించిన సరికొత్త మార్గదర్శకాలను అందించారు నిపుణులు. మరీ ఒబెసిటీ అంటే ఏంటంటే..దశాబ్దాలుగా వైద్యులు ఊబకాయాన్ని(obesity) కొలవడానికి బాడీ మాస్ ఇండెక్స్(బీఎంఐ)(body mass index (BMI))సాధనంగా ఉపయోగిస్తున్నారు. ఇక్కడ బీఎంఐ అనేది వ్యక్తి బరువును కిలోగ్రాముల్లోనూ, ఎత్తు చదరుపు మీటర్లలో భాగించగా వచ్చిన దాన్ని శరీర కొవ్వు కొలతగా నిర్వచించేవారు. దీంతో బీఎంఐ 30 కంటే ఎక్కువ ఉంటే ఊబకాయంగా పరిగణించారు. అయితే కొందరిలో మాత్రం అధిక శరీర కొవ్వు ఉన్నప్పటికీ ఎల్లప్పుడూ 30 కంటే ఎక్కువ బీఎం ఉండదు. అలాంటప్పుడూ రాబోయే ఆరోగ్య ప్రమాదాలు గుర్తించలేమని వైద్యులు చెబుతున్నారు. అదీగాక ప్రస్తుత జనాభా ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఊబకాయం. అలాంటప్పుడు కాలం చెల్లిన బీఎంఐలతో బరువు, ఎత్తు నిష్పత్తిలతో అంచనా వేస్తే సరిపోదని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ది లాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండోక్రినాలజీ ఒబెసిటీకి సరికొత్త నిర్వచనాన్ని మార్గదర్శకాలను అందించింది. అవేంటంటే..ఊబకాయం అనే అధిక శరీర కొవ్వు. ఇది అనేక వ్యాధులకు కారణమయ్యే దీర్ఘకాలిక వ్యాధి. అలాగే ఇక్కడ బీఎంఐ అనేది శరీర కొవ్వును అతిగా లేదా తక్కువగా అంచనా వేయవచ్చు. అంతే తప్స స్పష్టమైన అంచనా మాత్రం ఇవ్వదు. అందుకని ఈ ఊబకాయాన్ని దీర్ఘకాలిక వ్యాధికి సరిగ్గా సరిపోయేలా అనారోగ్య స్థితిగా నిర్వచించారు. ఇది అవయవాలు, కణజాలల పనితీరుపై నేరుగా ప్రభావం చూపే అధిక కొవ్వుగా పరిగణించారు. దీన్ని బయో ఎలక్ట్రికల్ ఇంపెడెన్స్ లేదా డీఈఎక్స్ఏ స్కాన్లు వంటి ప్రత్యేక యంత్రాలతో కచ్చితంగా నిర్థారించగలమని అన్నారు. అయితే ఇవి ఖరీదైనవి కావడంతో క్లినిక్‌లలో అందుబాటులో లేవు. ఇక ఊబకాయం ఉన్నవారికి శరీరంలో కొవ్వు ఎక్కడ పేరుకుపోయిందనేది ముఖ్యమట. అంటే బొడ్డు చుట్టూ ఉంటే ఇది అనేక అనారోగ్యాలకు దారితీస్తుంది. ప్రస్తుత మార్గదర్శకాలు బెల్లీఫ్యాట్(Belly Fat)ని తీవ్రమైన ఒబెసిటీ పరిగణించమని చెబుతోంది. అలాగే ఆయా వ్యక్తులకు మధుమేహం, గుండె జబ్బులు, కీళ్ల నొప్పులు వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయనేది కూడా పరిగణలోనికి తీసుకోవాలట. కొత్త మార్గదర్శకాల్లో ఒబెసిటీని రెండు దశల్లో వర్గీకరించారు. దశ1: అవయవ పనితీరుపై లేదా సాధారణ రోజువారీ కార్యకలాపాలపై స్పష్టమైన ప్రభావాలు లేకుండా పెరిగిన కొవ్వు (BMI > 23 kg/m². ఈ దశ ప్రస్తుతం ఎలాంటి అనారోగ్య సమస్యలు చూపించకపోయినా..భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంటుందట. దశ2: బీఎంఐ 23 కిలోలు/మీ2 కంటే ఎక్కువ ఉండి, పొట్ట చుట్టూ కొవ్వు, అధిక నడుము చుట్టుకొలత ఉంటే దీన్ని ఊబకాయంగా పరిగణిస్తారు. ఇది శారీరక అవయవ విధులను ప్రభావితం చేస్తుంది. టైప్2 డయాబెటిస్ వంటి వ్యాధులకు దారితీస్తుంది. ఈ మార్గదర్శకాలను అక్టోబర్ 2022 నుంచి జూన్ 2023 వరకు ఐదు సర్వేలు నిర్వహించి మరీ అందిచినట్లు నిపుణుల చెబుతున్నారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత అందించిన ఈ మార్గదర్శకాలు ఆచరణాత్మకమైనవి, అలాగే ఆరోగ్య సమస్యలను ముందస్తుగా గుర్తించి నివారించడానికి ఉపయోగపడతాయని చెప్పారు.(చదవండి: 32 ఏళ్లు ద్వీపంలో ఒంటరిగా బతికాడు! సడెన్‌గా జనాల్లోకి తీసుకురాగానే..) -
మీల్ మేకర్ ఆరోగ్యానికి మంచి 'గేమ్ ఛేంజర్'..!
బిర్యానీలో వేసే సోయా చంక్స్ లేదా మీల్ మేకర్(Soya chunks) ఆరోగ్యానికి ఎంతో మంచివట. వీటిని మన ఆహారంలో చేర్చుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందొచ్చని చెబుతున్నారు నిపుణులు. ఇవి మొక్కల ఆధారిత ప్రోటీన్గా పిలుస్తున్నారు. ముఖ్యంగా ఆరోగ్యానికి మంచి గేమ్ ఛేంజర్(Game-changer)గా చెబుతున్నారు. అదెలాగో సవివరంగా చూద్దాం..!.సోయా ముక్కలు (సోయా చంక్స్) సోయాబీన్స్ నుంచి తయారైన మొక్కల ఆధారిత ప్రోటీన్ మూలం. కొవ్వు శాతం తక్కువ, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. శాకాహారులకు ప్రత్యామ్నాయమైన సాంప్రదాయ మాంసం ఆధారిత ప్రోటీన్గా పనిచేస్తుంది. తినేందుకు రుచిగానూ, శరీరానికి అవసరమైన విటమిన్లను అందిస్తుంది. తృప్తికరమైన భోజనానికి చిహ్నంగా ఉంటుంది. ఆరోగ్య స్ప్రుహ ఉన్న వ్యక్తులకు ఇది బెస్ట్ సూపర్ ఫుడ్. ఆహార ప్రియలు ఈ మీల్ మేకర్ని పలు విధాల రెసిపీలతో ఆస్వాదిస్తున్నారు. వంట చేసే నేర్పు లేనివారైనా..సులభంగా వండుకోగలరు. దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటంటే..గుండె ఆరోగ్యానికి మంచిది..మీల్ మేకర్లో ప్రొటీన్, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా, సంతృప్త కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ పోషకాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరగుతుంది.బరువు తగ్గుతారు..మీల్ మేకర్లో ప్రొటీన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది మిమ్మల్ని చాలా కాలం పాటు నిండుగా ఉంచుతాయి. మీరు తరచుగా తినాలనే కోరికలను తగ్గిస్తుంది. మీల్ మేకర్‌లోని ప్రొటీన్‌కు శరీరం కొవ్వు, బరువును తగ్గించే లక్షణాలు ఉంటాయి. మనం శరీరంలో కార్బోహైడ్రేట్ల కంటే సోయా చంక్స్‌ను జీర్ణం చేయడానికి ఎక్కువ శక్తిని ఖర్చు చేస్తుంది. ఫలితంగా శరీరంలో కొవ్వు ఈజీగా కరుగుతుంది, బరువు కూడా సులభంగా తగ్గుతారు.మెనోపాజ్ లక్షణాలను తగ్గిస్తుంది..మెనోపాజ్ దశలో మహిళలు యోని పొడిబారడం, వేడి ఆవిర్లు, మూడ్ స్వింగ్స్, నిద్రాభంగం, రాత్రిపూట చెమటలు పట్టడం వంటి లక్షణాలతో ఇబ్బంది పడుతుటుందారు. సోయా చంక్స్‌లో ఐసోఫ్లేవోన్స్ అనే ఫైటోఈస్ట్రోజెన్ ఉంటుంది, ఇది మెనోపాజ్ లక్షణాలను తగ్గించడానికి సహాయపడుతుంది.హార్మోన్ల సమతుల్యతవీటిలోని ఫైటోఈస్ట్రోజెన్ కంటెంట్ పీరియడ్స్ సక్రమంగా వచ్చేలా చేస్తుంది. ముఖ్యంగా PCOS, పోస్ట్ మెనోపాజ్ లక్షణాలతో బాధపడేవారికి మీల్ మేకర్ మేలు చేస్తాయి.యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి..మీల్ మేకర్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు, కొన్ని రకాల కేన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.జీర్ణక్రియకు..మీల్ మేకర్ పేగులలో లాక్టోబాసిల్లి, బైఫిడోబాక్టీరియా పరిమాణం పెంచుతుంది. ఈ రెండు సూక్ష్మజీవులు జీర్ణక్రియకు సహాయపడతాయి.మధుమేహ రోగులకు మంచిది..మీల్ మేకర్లో ఐసోఫ్లేవోన్లు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. ఇలా రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్లో ఉంటే గుండె సమస్యల ప్రమాదం కూడా తగ్గుతుంది.(చదవండి: జపాన్‌లో ఇంత క్లీన్‌గా ఉంటుందా..!) -
గట్ బయోమ్ 'పవర్ హోమ్'..!
ఒకప్పుడు జీర్ణవ్యవస్థ అంటే ఆహారాన్ని జీర్ణం చేయడం వరకే దాని పని అనుకునేవారు. కానీ... దాని పని ‘అంతకు మించి’అంటూ ఇటీవలి ఎన్నో పరిశోధనలు తెలుపుతున్నాయి. జీర్ణ వ్యవస్థ అనేది చాలా సంక్లిష్టమైన వ్యవస్థ అంటూ కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇందులో కోటాను కోట్ల (ట్రిలియన్ల కొద్దీ) బ్యాక్టీరియా, వైరస్లు, ఫంగీ వంటి జీవులు నివసిస్తుంటాయి. వాటినే సంక్షిప్తంగా ‘గట్ బయోమ్’గా పేర్కొంటున్నారు. ఈ జీవులే మానవుల సంపూర్ణారోగ్య నిర్వహణకు తోడ్పడుతున్నాయనీ, ఇవి కేవలం ఒక జీర్ణం(Digestion) చేసే పనే కాకుండా... ఆ వ్యక్తి తాలూకు వ్యాధి నిరోధక వ్యవస్థ, మానసిక ఆరోగ్యం వంటివాటినీ సమర్థంగా నిర్వహిస్తున్నాయని అధ్యయనాల్లో తేలింది. అంతేకాదు... ఓ వ్యక్తికి వచ్చే దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు(రిస్క్)లు కూడా ఆ బయోమ్పైనే ఆధారపడి ఉన్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. దీన్నిబట్టి తెలిసేదేమిటంటే... ఓ వ్యక్తి తీసుకునే ఆహారంపైనే అతడి గట్ బయోమ్ ఆధారపడి ఉండటం, ఇక దాని మీదనే అతడి సంపూర్ణ ఆరోగ్యం కూడా ఆధారపడి ఉంటోంది. సూక్ష్మ సమాచార వారధిజీర్ణవ్యవస్థలో ఉండే గట్ బయోమ్ అన్నది దేహానికి మేలు చేసే అనేక రకాల సూక్ష్మజీవుల సముదాయం. ఈ అనేక రకాల సూక్ష్మజీవుల సముదాయం తాలూకు సమతౌల్యత మీదే ఓ వ్యక్తి తాలూకు సంపూర్ణ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఆ జీవవైవిధ్యత వల్లనే ఆహారం సరిగా జీర్ణం కావడం, జీర్ణమైనది ఒంటికి పట్టడం, జీవక్రియలన్నీ సక్రమంగా జరగడం.అన్నిటికంటే ముఖ్యంగా ఆ బయోమ్ కారణంగానే అతడి వ్యాధి నిరోధక శక్తి ఇనుమడించడం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే ఈ బయోమ్ వల్లనే జీర్ణవ్యవస్థకూ, మెదడుకూ మధ్య నిరంతరం ఓ సమాచార వ్యవస్థ (గట్–బ్రెయిన్ ఏక్సిస్) నడుస్తుంటుంది. ఈ బయోమ్ వ్యవస్థ బాగుంటేనే... ఓ వ్యక్తితాలూకు భావోద్వేగాలు (మూడ్స్), నిద్ర, అతడి మానసిక ఆరోగ్యం ఇవన్నీ బాగుంటాయి.నేచురల్ సమతౌల్యంమంచి సమతులాహారం తీసుకుంటూ గట్ మైక్రోబయోమ్(Gut Micorbiome) తాలూకు సమతౌల్యతను కాపాడుకోవడం ద్వారా ఓ వ్యక్తి తాలూకు జీవనశైలిని సానుకూలంగా అంటే పాజిటివ్‌గా మలచేందుకు ఆస్కారముంటుంది. భారతీయ సంప్రదాయ ఆహారంలోనివి... అంటే ముఖ్యంగా మొక్కలు, వృక్షాల నుంచి లభ్యమయ్యే చిరుధాన్యాలు, సుగంధద్రవ్యాలు, పులవడానికి సిద్ధంగా ఉన్న ఆహారాల వంటివి ఈ గట్బయోమ్ సమతౌల్యాన్ని స్వాభావికంగా (నేచురల్‌గా) నిర్వహితమయ్యేలా చేస్తాయి. మన జీర్ణవ్యవస్థలోని గట్ బయోమ్ సరిగా వృద్ధిచెందడానికైనా లేక అవి సరిగా అభివృద్ధి చెందకపోవడానికైనా మన ఆహారమే కారణమవుతుంది. మంచి ఆహారం తీసుకుంటే అవి సానుకూలంగా అభివృద్ధి చెందుతాయి. ఉదాహరణకు పీచుపదార్థాలు పుష్కలంగా ఉండే ఆహారాలు, పప్పులు (దాల్), శెనగలు, ఆకుపచ్చరంగులో ఉండే పాలకూర, గోంగోర వంటి ఆకుకూరల వల్ల జీర్ణవ్యవస్థలో మనకు మేలు చేసే బ్యాక్టీరియా వృద్ది చెందుతాయి.మంచి ఆరోగ్యం కోసం...కేవలం ఆహారంపైనే కాకుండా మన జీవనశైలి కూడా గట్ మైక్రోబియమ్ మీద ప్రభావం చూపుతుంది. మన ప్రపంచంలోని వివిధ ఖండాల్లో చాలా ఆరోగ్యకరమైన రీతిలో ప్రజలు నివసించే ప్రాంతాలను బ్లూ జోన్స్‌గా పరిగణిస్తుంటారు. ఈ బ్లూ జోన్స్‌లో నివసించే వారు మిగతా ప్రజల కంటే సుదీర్ఘ కాలం జీవిస్తుంటారు. అలాగే వారు సంపూర్ణారోగ్యంతో జీవనం సాగిస్తుంటారు. ఈ బ్లూ జోన్స్‌గా గుర్తించిన ప్రాంతాలు... సార్డీనియా (ఇటలీ), నికోయా (కోస్టా రికా), ఇకారియా (గ్రీస్), లోమా లిండా (కాలిఫోర్నియా) వంటివి. వీటిల్లో నివసించే వాళ్లను, వారి జీవనశైలిని పరిశీలించినప్పుడు... వారి జీవనశైలి మూలంగా జీర్ణవ్యవస్థ తాలూకు ఆరోగ్యం మెరుగుపరుచుకోడానికి అవలంబించాల్ని కొన్ని పద్ధతులు తెలిశాయి. అవి...నిద్రపోదాంనాణ్యత లేని నిద్ర, తరచూ నిద్రాభంగం కావడం వంటి సమస్యల వల్ల జీర్ణవ్యవస్థలోని గట్ బయోమ్ దెబ్బతింటుంది. దాంతో జీర్ణసమస్యలు వస్తాయి. బ్లూజోన్లోని ప్రజలు కంటి నిండా నిద్రపోవడంతోపాటు వేళకు నిద్రకు ఉపక్రమిస్తారు. ఇది కూడా వాళ్ల ఆరోగ్యానికి కావడం వల్ల ఆరోగ్యాన్ని కోరుకునేవారంతా రోజూ కనీసం 7 – 8 గంటల నాణ్యమైన నిద్రకు ప్రాధాన్యమివ్వాలి. దీనివల్ల వాళ్లకు గట్ ఆరోగ్యంతోపాటు సంపూర్ణ ఆరోగ్యమూ సిద్ధిస్తుంది.చురుగ్గా ఉందాం...మనలో రోజువారీ కదలికలు ఎక్కువగా ఉంటే... అలా ఉండటం వల్ల సమకూరే వ్యాయామం కారణంగా జీర్ణవ్యవస్థలోని మైక్రోబయోమ్ ఆరోగ్యంగా ఉండటం, ఆహారం బాగా జీర్ణం కావడం జరుగుతుంది. బ్లూజోన్లోని ప్రజలు తమ స్వాభావికమైన కదలికలతోనే తమ రాకపోకలు సాగిస్తుంటారు. ఉదాహరణకు నడక, సైక్లింగ్ వంటివి. అలాగే తోటపని లాంటి పనుల వల్ల దేహపు కదలికలు బాగా చురుగ్గా జరుగుతుంటాయి. అంతేకాకుండా నడక, యోగా, వంటి తేలికపాటి వ్యాయామాలు, దేహపు కదలికల వల్ల... వాళ్ల జీర్ణవ్యవస్థ మరింత మెరుగ్గా, ఆరోగ్యంగా ఉంటుంది.నీళ్లు తాగుదాం...నీళ్లు తాగడమన్నది మంచి జీర్ణవ్యవస్థకూ, ఆహారం బాగా జీర్ణం కావడానికీ, తిన్నవి బాగా ఒంటికి పట్టడానికి తోడ్పడుతుంది. బ్లూజోన్లోని ప్రజలు కూడా నీళ్లు తాగడాన్ని ఓ మంచి అలవాటుగా పాటిస్తారు. వాళ్లు చక్కెరతో కూడిన తియ్యటి పానీయాలను చాలా పరిమితంగా తీసుకుంటారు. మంచి ఆరోగ్యం కోసం రోజంతా తరచూ కొద్దికొద్దిగా నీళ్లు తాగుతూ ఉండటం, అలాగే తీయ్యటివీ, కెఫిన్‌తో కూడిన పానీయాలు చాలా పరిమితంగా తీసుకుంటూ ఉండాలి. పులవడానికి సిద్ధంగా ఉండే ఆహారాలైన పెరుగు, ఇడ్లీ, దోశ వంటివి ప్రోబయాటిక్ ఆహారాలుగా పనిచేస్తూ... గట్‌లో ఉండే సూక్ష్మజీవరాసుల వృద్ధికీ, సమతౌల్యతకూ తోడ్పడతాయి. మళ్లీ వీటి కారణంగానే వ్యాధి నిరోధక శక్తి వృద్ధి చెందుతుంది. వీటితోపాటు ప్రీ–బయాటిక్ సమృద్ధిగా ఉండే వెల్లుల్లి, ఉల్లి, అరటి, ఓట్స్ వంటి ఆహారాలతో గట్‌లో ఉండే సూక్ష్మవృక్షజీవరాసులు అభివృద్ధి చెందుతాయి. అలాగే పసుపు, అల్లం, జీలకర్ర వంటి వాటితో దేహంలోని వాపు, మంట తగ్గించే (యాంటీ ఇన్ఫ్లమేటరీ) ప్రక్రియ జరుగుతుంది.మరీ ముఖ్యంగా చెప్పాలంటే పసుపులో ఉండే కర్కుమైన్ అనే సంక్లిష్ట పోషకాలు దేహంలోని ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తాయి. ఇక కాయధాన్యాలైన వరి, బార్లీతో తోపాటు చిరుధాన్యాల్లో పీచుపదార్థం సమృద్ధిగా ఉంటుంది. ఇవన్నీ జీర్ణవ్యవస్థలో ఉండే గట్ బయోమ్ను ఆరోగ్యకరంగానూ, సమతౌల్యంతోనూ పెరిగేలా చూస్తాయి.ఒత్తిడిని ఎదుర్కొందాం...దీర్ఘకాలికమైన ఒత్తిడి జీర్ణవ్యవస్థలో ఇన్‌ఫ్లమేషన్‌కూ, ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడానికీ... అది మళ్లీ జీర్ణవ్యవస్థలో మైక్రోబియమ్ బలహీనపడటానికి దారితీస్తుంది. ధ్యానం, బాగా లోతుగా శ్వాస తీసుకోవడం, ప్రకృతితో సమన్వయమై వీలైనంత ఎక్కువసేపు గడపటం వంటి అంశాలు ఒత్తిడిని గణనీయంగా తగ్గిస్తాయి. ఉదాహరణకు జపాన్‌లోని ‘ఒకినవా’ అనే ప్రాంతంలోని ప్రజలు ‘ఇకిగయి’ అనే జీవనవిధానం ద్వారా ఒత్తిడి తగ్గించుకుని, మానసిక ప్రశాంతతను పొందుతారు. ఇలాంటి ఆరోగ్యకరమైన జీవన విధానాలను అనుసరించడం ద్వారా మానసిక ఆరోగ్యమూ సమకూరుతుంది. తద్వారా జీర్ణవ్యవస్థ ఆరోగ్యమూ మెరుగుపడుతుంది.విచక్షణతో తిందాం...బ్లూ జోన్లో ఉన్న ఆరోగ్యవంతులైన ప్రజలు తమ కడుపు 80 శాతం నిండగానే తినడం ఆపేస్తారు. దీనివల్ల తిన్నది బాగా జీర్ణమవుతుంది. వాళ్లు భోజనాన్ని బాగా ఆస్వాదిస్తూ, మెల్లమెల్లగా నములుతూ హాయిగా తింటారు. దీనివల్ల కడుపుబ్బరం, అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలేవీ రావు. గట్కూ, మెదడుకూ మంచి సమన్వయమూ ఉంటుంది.టేక్...కేర్భోజనంలోని ఆహారాల్లో... తగినన్ని కాయధాన్యాలు, ఆకుకూరలు, కాయగూరలు, పప్పులు, పండ్లు ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి∙ పులవడానికి సిద్ధంగా ఉన్న ఆహారాలను ఆహారంలో భాగం చేయాలి. ప్రాసెస్డ్ ఆహారాలూ, చక్కెరతో కూడిన ఆహారాలు గట్ మైక్రోబయోమ్‌ను దెబ్బతీస్తాయి కాబట్టి వాటిని చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవాలి ఒళ్లంతా మంచి కదలికలతో రోజంతా చాలా చురుగ్గా ఉండాలి∙ స్ట్రెస్‌ను అదుపులో ఉంచుకోడానికి మంచి రిలాక్సేషన్ టెక్నిక్స్ అవలంబించాలి వేళకు కంటి నిండా నిద్రపోతూ గట్ – బ్రెయిన్ ఆరోగ్యం కోసం ప్రయత్నించాలి.దీర్ఘాయుష్మాన్‌భవ...జీర్ణాశయం ఆరోగ్యం కోసం ప్రయత్నించడమంటే అది కేవలం గట్ తాలూకు ఆరోగ్యం కోసం మాత్రమే కాదు... నిజానికి అది సంపూర్ణారోగ్యం కోసం చేసే ప్రయత్నమని గుర్తుంచుకోవాలి. బ్లూజోన్‌లో నివసించేవాళ్ల నుంచి స్ఫూర్తి ΄పొందుతూ అందరమూ మన జీవనశైలినీ, భారతీయ సంప్రదాయ ఆహారాలైన మొక్కల నుంచి లభ్యమయ్యేవీ, పులిసేందుకు సిద్ధంగా ఉండేవీ, పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. ఇది కేవలం జీర్ణవ్యవస్థ ఆరోగ్యం కోసం మాత్రమే కాకుండా ఓ వ్యక్తి తాలూకు సంపూర్ణారోగ్యానికి దోహదపడుతుంది.ప్రో బయాటిక్పులవడానికి సిద్ధంగా ఉండే ఆహారాలైన పెరుగు, ఇడ్లీ, దోశ వంటివి ప్రో బయాటిక్ ఆహారాలుగా పనిచేస్తూ... గట్‌లో ఉండే సూక్ష్మజీవరాసుల వృద్ధికీ, సమతౌల్యతకూ తోడ్పడతాయి. మళ్లీ వీటి కారణంగానే వ్యాధి నిరోధక శక్తి వృద్ధి చెందుతుంది. వీటితో పాటు ప్రీ–బయాటిక్ సమృద్ధిగా ఉండే వెల్లుల్లి, ఉల్లి, అరటి, ఓట్స్ వంటి ఆహారాలతో గట్‌లో ఉండే సూక్ష్మవృక్షజీవరాసులు అభివృద్ధి చెందుతాయి.అలాగే పసుపు, అల్లం, జీలకర్ర వంటి వాటితో దేహంలోని వాపు, మంట తగ్గించే (యాంటీ ఇన్ఫ్లమేటరీ) ప్రక్రియ జరుగుతుంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే పసుపులో ఉండే కర్కుమైన్ అనే సంక్లిష్ట పోషకాలు దేహంలోని ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తాయి. ఇక కాయధాన్యాలైన వరి, బార్లీతోపాటు చిరుధాన్యాల్లో పీచుపదార్థం సమృద్ధిగా ఉంటుంది. ఇవన్నీ జీర్ణవ్యవస్థలో ఉండే గట్ బయోమ్ను ఆరోగ్యకరంగానూ, సమతౌల్యంతోనూ పెరిగేలా చూస్తాయి. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఛైర్మన్ అండ్ చీఫ్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఏఐజీ హాస్పిటల్స్,హైదరాబాద్ (చదవండి: సాత్విక ఆహారంతో బరువుకి చెక్‌పెట్టండిలా..!) -
జీన్స్ తొడుక్కుని స్క్వాటింగ్ చేస్తున్నారా? అయితే మీకో షాకింగ్ న్యూస్
ఆధునిక కాలంలో జీన్స్ ప్యాంట్లు లేనిదే కాలం గడవదు. ట్రెండ్‌కు,ఫ్యాషన్‌కు తగ్గట్టు అనేక రకాల జీన్స్ ప్యాంట్లు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. మహిళలతో పోల్చితే పురుషులే ఎక్కువగా జీన్ ప్యాంట్లను వినియోగిస్తారు. ఆఫీసులకు, బయటికి వెళ్లినప్పుడు, పార్టీలకు ఇలా ఏదైనా జీన్స్ ప్యాంట్లకే ప్రాధాన్యత ఉంటుంది. అన్ని వయసుల వారికి ఫిట్ అయ్యే జీన్స్ అనేవి చాలా పాపులర్. అనేక రకాల మోడల్స్‌లో ఇవి మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. వీటిని ధరించడం వలన చాలా కంఫర్ట్ గా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. వీటిని ఉతుక్కోవడం ఈజీ కావడం కూడా వీటికి ఆదరణ ఎక్కువ. కానీ జీన్స్పాంట్లు వేసుకున్నపుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.జీన్స్ వేసుకొని కింద కూర్చోవడం, అందునా జీన్స్ ప్యాంట్లు తొడిగి బాసిపట్లు వేయడం (సక్లముక్లం వేసి కూర్చోవడం) ఆరోగ్యానికి అంత మేలు కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. జీన్స్ ప్యాంట్ తొడుక్కొని ఇలా కూర్చోవడం వల్ల కండరాలు, నరాలు దెబ్బతింటాయనీ, ఇది మరీ విషమిస్తే ఒక్కోసారి జీన్స్ ప్యాంట్లతో బాసిపట్లు వేసుకుని కూర్చునేవారు పైకి లేవగానే నడవలేని పరిస్థితి వచ్చేందుకూ అవకాశముందని హెచ్చరిస్తున్నారు. ఇక వ్యాయామం చేసే సమయంలోనూ జీన్స్ అస్సలు తొడుక్కోవద్దనీ, వాటిని తొడిగి ‘స్క్వాటింగ్’ ఎక్సర్సైజ్ చేయడం అస్సలు మంచిది కాదని చెబుతున్నారు. ఈ అంశాలన్నింటినీ ‘జర్నల్ ఆఫ్ న్యూరాలజీ, న్యూరోసర్జరీ, సైకియాట్రీ’ అనే మెడికల్ జర్నల్‌లోనూ ప్రచురితమయ్యాయి. అవే కాకుండా బాగా బిగుతుగా ఉండే జీన్స్ వల్ల పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గే అవకాశముందని కూడా మరికొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.జీన్స్ ప్యాంట్లు బాగా టైట్‌గా ఉండే జీన్స్ ప్యాంట్ ధరించి పడుకుంటే చర్మంపై బ్యాక్టీరియా పెరుగుతుంది. స్కిన్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. దీంతో దురదలు, చర్మంపై ర్యాషెస్, దద్దుర్లు వస్తాయి. రక్తప్రసరణకు కష్టం : జీన్స్ ప్యాంట్ బిగుతుగా ఉండటంతో రక్తప్రసరణకు ఇబ్బంది కలుగుతుంది. దీంతో కొన్ని అవయవాలకు రక్తం సరిగా అందదు. జీన్స్ ప్యాంట్ ధరించి నిద్రించడం వల్ల శరీరంలోని వేడీ పెరుగుతుంది. పేగుల కదలికకు ఇబ్బందిగా ఉంటుంది. దీంతో జీర్ణక్రియపై దుష్ప్రభావం పడుతుంది. -
కాలుష్యం కాటేస్తది.. చెవి, ముక్కు, గొంతు జాగ్రత్త!
ఇటీవల వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ముక్కు ఆరోగ్య సంరక్షణ చాలా కీలకంగా మారుతోంది. అంతేకాదు.. ఈమధ్యకాలంలో శబ్దకాలుష్యం కూడా అనూహ్యంగా పెరిగి పోతోంది. వాహనాల పెరుగుదల వల్ల శబ్ద, వాయు కాలుష్యాలు... ఈ రెండూ ఏకకాలంలో పెరిగి రెండు జ్ఞానేంద్రియాలపై దుష్ప్రభావం చూపుతున్నాయి. ఇక ఈ ముక్కు, చెవులు రెండూ గొంతుతో అనుసంధానమై ఉంటాయి. ఈ నేపథ్యంలో చెవులు,ముక్కు, గొంతు ఆరోగ్య పరిరక్షణ ఎంతో కీలకం. అందుకే వాటి సంరక్షణ కోసం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలను తెలుసుకోవడం తప్పనిసరి. ముక్కు చెవులనూ, అలాగే తలను మిగతా దేహంతో అనుసంధానం చేసే కీలక అవయవ భాగమే మెడ. వీటన్నింటి ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకు పాటించాల్సిన కొన్ని సూచనలివి... చెవుల సంరక్షణ కోసం... ∙పెద్ద పెద్ద చప్పుళ్ల నుంచీ, శబ్దకాలుష్యం నుంచి చెవులను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇయర్ ఫోన్స్‌తో మొబైల్ వాడేటప్పుడు, కంప్యూటర్ను ఉపయోగిస్తూ హెడ్‌ఫోన్స్ పెట్టుకున్న సమయంలో పెద్దగా వాల్యుమ్ పెట్టుకోకుండా చెవికి తగినంత వాల్యుమ్‌తో జాగ్రత్తగా చెవులను కాపాడుకోవాలి. ∙పెద్ద పెద్ద శబ్దాలు వచ్చే చోట్లలో / పనిప్రదేశాలలో ఇయర్ ప్లగ్స్ వాడుకోవాలి.చెవుల్లో హోరు శబ్దాలు గానీ, ట్రాన్స్ఫార్మర్ దగ్గరి గుయ్‌మనే శబ్దాలుగాని వినిపిస్తుంటే అది టినైటస్ అనే సమస్య కావచ్చని భావిస్తూ సర్టిఫైడ్ ఆడియాలజిస్ట్ దగ్గర వినికిడి పరీక్షలు చేయించుకోవాలి. ∙చెవులు వినబడుతుంటేనే చిన్నారులు మాటలు నేర్చుకునేది. అందుకే చిన్నారి పుట్టగానే ఆ పిల్లలకు వెంటనే వినికిడి పరీక్షలు చేయించాలి. ఇలా పరీక్షించి చికిత్స చేయిస్తే... అటు వినికిడి సమస్యనూ, ఇటు మాటలు రాక΄ోవడాన్నీ ఏకకాలంలో అరికట్టవచ్చు. కాక్లియర్ ఇం΄్లాంట్స్ వంటి చికిత్సలతో మాటలూ, వినికిడీ వచ్చేలా చేయవచ్చు సైనస్ ఇన్ఫెక్షన్లూ, సమస్యల నుంచి కాపాడుకోవడానికి... ఒక్కోసారి చేతుల్లో ఉండే హానికరమైన సూక్ష్మజీవులు ఏదైనా తింటున్న సమయంలో గొంతులోకి వెళ్లి అక్కణ్నుంచి ముక్కు, నోరు, గొంతు ద్వారా (ఒక్కోసారి కళ్ల నుంచి కూడా) లోనికి ప్రవేశించి ముక్కు, నోరు, గొంతు, కళ్ల ఇన్ఫెక్షన్లతో పాటు సైనసైటిస్ వంటి సమస్యలకూ కారణమవుతాయి. కానీ చేతులు శుభ్రంగా కడుక్కుంటూ మంచి హ్యాండ్ హైజీన్‌ను పాటించడం మేలు. అందుకే కేవలం చేతులు శుభ్రంగా కడుక్కోవడం (హ్యాండ్ వాష్)తో ఎన్నో సమస్యలను నివారించవచ్చునని గుర్తుంచుకోవాలికొన్ని అలర్జీ సమస్యలను, మనకు సరిపడని అలర్జెన్స్ వల్ల ముక్కు, గొంతు, కళ్ల అలర్జీలూ, సైనస్ సమస్యలతో ΄ాటు ఊపిరితిత్తులకు సంబంధించిన మరికొన్ని రుగ్మతలూ రావచ్చు. అందుకే మనకు సరిపడని వాటికి దూరంగా ఉండాలి వేడినీటితో ఆవిరిపట్టడం అనే ఓ చిట్కాతో ముక్కు, గొంతు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.ఈ జాగ్రత్తలతోపాటు మంచి సమతులాహారం, విటమిన్–సి సమృద్ధిగా ఉండే నిమ్మజాతి పండ్లైన నారింజ, బత్తాయి వంటివి వాడటం, జింక్ మోతాదులు ఎక్కువగా ఉండే నట్స్, గింజధాన్యాలు, పప్పుధాన్యాలు తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు నివారితమవుతాయి. ఈ జాగ్రత్తలతోపాటు మసాలాలు ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల గొంతులో ఇరిటేషన్లు, యాసిడ్ గొంతులోకి వచ్చి గొంతు మండటం అనే సమస్యలు నివారితమవుతాయి. ఇక వీటితోపాటు ఈ చలి సీజన్లో మరింత చల్లటి గాలికీ, నీటికి దూరంగా ఉండటం, కాలుష్యానికి ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్తవహించడం వంటి జాగ్రత్తలు మేలు చేస్తాయనే అంశాన్ని గ్రహించాలి. గొంతు ఆరోగ్యం (థ్రోట్ హైజీన్) కోసంస్మోకింగ్, మద్యం అలవాటు మానుకుంటే కేవలం గొంతు ఆరోగ్యం మాత్రమే కాదు... మొత్తం దేహం ఆరోగ్యమంతా బాగుంటుంది. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలూ, జబ్బులూ, రుగ్మతలూ నివారితమవుతాయి. గొంతు ఆరోగ్యం కోసం గొంతును శుభ్రంగా ఉంచుకోవడం మేలు చేస్తుంది. ఇందుకు గోరువెచ్చని నీటిలో కాస్తంత ఉప్పు వేసుకుని పుక్కిలించడం ఓ మంచి ఇంటి చిట్కా. దీనివల్ల గొంతుకు వచ్చే అనేక ఇన్ఫెక్షన్లూ, ఇన్ఫ్లమేషన్లూ, సోర్ థ్రోట్ వంటి సమస్యలు దూరం కావడమే కాకుండా అనేక రకాల గొంతు ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కలుగుతుంది. ఇది చాలా సులువైన, నమ్మకమైన, ప్రభావపూర్వకమైన చిట్కా ∙ఇక నీళ్లు ఎక్కువగా తాగుతుండటమనేది ఇటు గొంతుతోపాటు పూర్తి శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతూ అనేక సమస్యల నుంచి రక్షణ కల్పించే అంశం. (భరించలేని మోకాళ్ల నొప్పులకు.. సూపర్ ఫుడ్ ఈ లడ్డూ...అంతేనా!)ముక్కు ఆరోగ్యం కోసం...ముక్కు ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం మనందరి మొదటి ప్రాధాన్యత. అన్ని అవయవాలనుంచి తేమను లాగేసినట్టే... ముక్కు నుంచి కూడా తేమను లాగేస్తుంది ఈ సీజన్. అందుకే ముక్కు తాలూకు తేమ బాగానే నిర్వహితమయ్యేలా చూసుకోవాలి ∙ఈ సీజన్లో బాగా నీళ్లు తాగుతూ ఉంటే అది ముక్కులోని మ్యూకస్ మెంబ్రేన్‌ను ΄పొడిబారకుండా తేమగా ఉండేలా చూడటంతో పాటు... మిగతా దేహమంతా బాగా హైడ్రేటెడ్‌గా ఉండేలా చూసుకునేందుకు ఉపయోగపడుతుంది.ముక్కులు బిగదీసుకుపోయే తత్త్వం ఉన్నవారు (ఇది ఈ సీజన్లో మరీ ఎక్కువ) సెలైన్ నేసల్ స్ప్రేలు వాడటం వల్ల ముక్కు ఆరోగ్యం బాగుంటుంది. ఇక చీదే సమయంలో బలంగా చీదడం సరికాదు. ఒక్కోసారి దీంతో ముక్కులోని అతి సన్నటి రక్తనాళాలు (క్యాపిల్లరీస్) చెదిరి రక్తస్రావం కూడా అయ్యే అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: మహిళలకు ఫ్రీ బస్సా? ఇదెక్కడి న్యాయం అంటూ ట్వీట్ : ఇచ్చిపడేసిన నెటిజనులు -
బరువు నిర్వహణకు ది బెస్ట్ 30-30-30 రూల్ డైట్..!
ఎన్నో రకాల డైట్ల గురించి విన్నాం. కానీ ఏంటిది 30-30-30 డైట్..?. కీటోజెనిక్ డైట్ నుంచి వీగన్ ప్లాన్స్, అడపాదడపా ఉపవాసం, అధిక-ప్రోటీన్ నియమాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ భోజనం ఇలా ఎన్నో ఉన్నాయి. కానీ ఇలా నెంబర్ల రూల్‌తో కూడిన డైట్ ఏంటి..? మంచిదేనా అని సందేహించకండి. ఎందుకంటే పోషకాహార నిపుణులు ఈ డైట్ నూటికి నూరు శాతం మంచిదని కితాబిస్తున్నారు. మరీ ఆ డైట్ ఏంటి..? అందులో ఎలాంటి ఆహారం తీసుకుంటారో చూద్దామా...ప్రస్తుతం తీసుకునే డైట్లలో ఎక్కువగా అధిక బరువు సమస్యను తగ్గించుకుని ఆరోగ్యంగా ఉండటం కోసం అనుసరించేవి. అయితే కొన్ని డైట్లతో తొందరగా ఫలితాలను అందుకోగలం. అదేవిధంగా అందరికీ అన్ని డైట్లు సరిపడవు కూడా. అయితే పోషకాహార నిపుణురాలు లోవ్నీత్ బాత్రా చెప్పే 30-30-30 డైట్ మాత్రం సత్వర ఫలితాలను ఇవ్వడమే గాక తొందరగా వెయిట్ లాస్ అవ్వుతారట. నిపుణుల సైతం నూటికి నూరు మార్కుల ఇస్తున్నారు ఈ డైట్‌కి. పైగా ఇది సమర్థవంతమైనది, ఆరోగ్యకరమైన వెయిట్ లాస్ డైట్ అని చెబుతున్నారు. ఈ డైట్ ఎలా ఉంటుందంటే..ఉదయం మేల్కోగానే 30 నిమిషాలలోపు 30 గ్రాముల ప్రోటీన్ తీసకోవాలి. ఆ తర్వాత 30 నిమిషాల పాటు తీవ్రతతో కూడిన వ్యాయామాలు చేయాలి. మనం ఎప్పుడైతే కేలరీలను తగ్గిస్తామో.. అప్పుడు శరీరంలో ఉన్న వేస్ట్ కొవ్వు అదనపు శక్తి కోసం ఖర్చువుతుంది. దీనివల్ల చక్కెర స్థాయిలు సమంగా ఉంటాయి. అలాగే ఈ డైట్ పరంగా చేసే శక్తిమంతమైన వ్యాయామాలు కండరాలను బలోపేతం చేస్తాయి. ఇది ఒకరకంగా తినాలనే కోరికను నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. అదీగాక ప్రతి ఉదయాన్ని 30 నిమిషాలలోపు 30 గ్రాముల ప్రోటీన్‌తో ప్రారంభిస్తారు కాబట్టి ఎక్కువ ఫుడ్ తీసుకోవాలనే ధ్యాస తెలియకుండానే తగ్గుతుందట. ఆటోమేటిగ్గా ఈ రూల్ గుర్తొచ్చి చకచక మన పనులు పూర్తిచేసుకునేలా మన మైండ్ సెట్ అయిపోవడంతో త్వరితగతిన ఫలితాలు అందుకుంటామని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. View this post on Instagram A post shared by Lovneet Batra (@lovneetb) (చదవండి: దీర్ఘాయువు మందులతో దుష్ప్రభావాలే ఎక్కువ..!: టెక్ మిలియనీర్) -
'గోంద్ లడ్డు'..పోషకాల గని..!
కావలసినవి: గోంద్ (ఎడిబుల్ గమ్) – ము΄్పావు కప్పు; బాదం పలుకులు – 2 టేబుల్ స్పూన్లు; పిస్తా – 2 టేబుల్ స్పూన్లు; జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్లు; రైజిన్స్ – 2 టేబుల్ స్పూన్లు; కొబ్బరి తురుము– 2 కప్పులు; బెల్లం పొడి– ఒకటింపావు కప్పు; ఖర్జూరాలు (గింజలు తొలగించినవి) – అర కప్పు; గసగసాలు– 2 టేబుల్ స్పూన్లు; యాలకుల పొడి– అర టీ స్పూన్; నెయ్యి – టేబుల్ స్పూన్. తయారీ: మందపాటి బాణలిలో నెయ్యి వేడి చేసి గోంద్‌ను వేయించాలి. చల్లారిన తర్వాత చిదిమి పొడి చేయాలి లేదా చపాతీలు చేసే పీట మీద వేసి చపాతీల కర్రతో ΄పొడి చేయవచ్చు. చిన్న రోలు ఉంటే అందులో వేసి దంచి పొడి చేసుకోవచ్చు. ఒక బాణలిలో కొబ్బరి తురుము, గసగసాలు, కిస్మిస్, మిగిలిన గింజలన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి విడివిడిగా వేయిస్తూ, వేయించిన దినుసులన్నింటినీ ఒకే పాత్రలో వేయాలి. అందులో యాలకుల పొడి, ఖర్జూరాలు, గోంద్ పొడి వేసి సమంగా కలిసే వరకు స్పూన్‌తో కలపాలి. మరొక పాత్రలో బెల్లం పొడి వేసి మూడు టేబుల్ స్పూన్ల నీటిని ΄ోసి తీగ పాకం వచ్చేవరకు మరిగించాలి. పాకం వచ్చిన తర్వాత స్టవ్ మీద నుంచి దించి అందులో గోంద్పొడి తోపాటు దినుసులన్నింటినీ కలిపిన మిశ్రమాన్ని వేసి కలపాలి. వేడి తగ్గే వరకు ఆగాలి. మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి నెయ్యి రాసుకుని లడ్డులు చేయాలి. పై కొలతలతో చేస్తే 16 లడ్డులు వస్తాయి. గాలి దూరని డబ్బాలో నిల్వ చేస్తే రెండు వారాల వరకు తాజాగా ఉంటాయి. గమనిక: ఇది గోధుమ జిగురు. మార్కెట్లో గోంద్ కటిరా పేరుతో దొరుకుతుంది. ఒక్కో లడ్డులో పోషకాలు ఇలా ఉంటాయి..కేలరీలు – 120–130; కార్బోహైడ్రేట్లు – 15–18 గ్రాములు; ప్రోటీన్లు – 2–3 గ్రాములు;ఫ్యాట్ – 6–7 గ్రా.; ఫైబర్– 1–2 గ్రాములుప్రయోజనాలు..గోంద్ దేహంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది, ఎముకలను శక్తిమంతం చేస్తుంది. చల్లటి వాతావరణంలో దేహానికి తగినంత వెచ్చదనాన్నిస్తుంది. గింజల నుంచి ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, దేహానికి అవసరమైన మైక్రో న్యూట్రియెంట్స్ అందుతాయి.బెల్లంలో ఐరన్, జీర్ణశక్తిని పెంచే లక్షణం ఉంటుంది. కొబ్బరి తురుములో ఫైబర్, ఆరోగ్యకరమైన ఫ్యాట్ ఉంటుంది. ఖర్జూరాలు, రైజిన్స్లోని యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ఉండటంతోపాటు అవి శక్తినిస్తాయి. (చదవండి: భారతదేశపు తొలి స్టంట్ విమెన్..ధైర్యానికి కేరాఫ్ అడ్రస్..!) -
కొంచెమైనా.. ముంచేస్తుంది!
అతిగా మద్యం తాగడం ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని అందరికీ తెలిసిందే. కానీ కొందరు వైద్యులు, సైంటిస్టులు, డైటీషియన్లు వంటివారు రోజూ స్వల్ప మొత్తంలో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లాభం ఉంటుందని, గుండె జబ్బులను దూరం పెడుతుందని చెబుతూ ఉంటారు. కానీ దీనికి పక్కా ఆధారాలేమీ లేవని, రోజూ కాస్తంత ఆల్కహాల్ తీసుకున్నా కేన్సర్ బారినపడే ముప్పు పెరిగిపోతుందని అమెరికా సర్జన్ జనరల్ వివేక్ మూర్తి స్పష్టం చేస్తున్నారు. దీనికి సంబంధించి పలు అధ్యయనాలు, గణాంకాల్లో తేలిన అంశాలను ఆధారంగా చూపుతున్నారు. సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులపై అవి కేన్సర్‌కు దారితీస్తాయంటూ ఎలా హెచ్చరికలు ముద్రిస్తారో.. అలా ఆల్కహాల్ ఉత్పత్తులపైనా ముద్రించాలని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఆయన నివేదిక ప్రకారం..ఆల్కహాల్‌కు కేన్సర్‌కు లింకేమిటి?⇒ తగిన జాగ్రత్తలు తీసుకుని నివారించుకునే అవకాశమున్న కేన్సర్లలో.. పొగాకు, ఊబకాయం తర్వాత ఎక్కువగా నమోదవుతున్నవి ఆల్కహాల్ కారణంగానే. ప్రపంచ ఆరోగ్య సంస్థ కేన్సర్ రీసెర్చ్ విభాగం కూడా ఆల్కహాల్‌ను ప్రధానమైన కేన్సర్ కారకాల్లో (గ్రూప్ 1 కార్సినోజెన్) ఒకటిగా గుర్తించడం గమనార్హం. ⇒ అమెరికాలో ఏటా ఆల్కహాల్ కారణంగా కేన్సర్ బారినపడి మరణిస్తున్నవారు.. 20 వేల మంది ⇒ 2020లో ప్రపంచవ్యాప్తంగా ఆల్కహాల్ వినియోగం కారణంగా నమోదైన కేన్సర్ కేసులు... 7.4 లక్షల మంది.(ఒక డ్రింక్ అంటే సుమారుగా.. 330 మిల్లీలీటర్ల బీరు లేదా 35 మిల్లీలీటర్ల విస్కీ)7 ఆల్కహాల్‌తో రకాల కేన్సర్ల ముప్పుపొగాకు నేరుగా కేన్సర్లకు కారణమైతే.. ఆల్కహాల్ ఏడు రకాల కేన్సర్లకు దారితీస్తుంది. మన దేశంలో కాలేయ కేన్సర్‌కు ముఖ్య కారణంగా ఆల్కహాల్ నిలుస్తోంది. ఇక ఆల్కహాల్, పొగాకు ఉత్పత్తులు రెండూ కలిస్తే కేన్సర్ల ముప్పు మరింత తీవ్రమవుతుందని కేన్సర్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.ఆల్కహాల్ కేన్సర్‌కు దారితీసేదిలా.. 1. శరీరంలో ఆల్కహాల్ అసిటాల్డిహైడ్‌గా మారుతుంది. ఇది మన కణాల్లోని డీఎన్ఏను దెబ్బతీసి, కేన్సర్ ముప్పును పెంచుతుంది. 2. ఆల్కహాల్ శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను పెంచుతుంది. ఇది శరీరంలో కణాలు, ప్రొటీన్లు, డీఎన్ఏను దెబ్బతీసి కేన్సర్‌కు కారణమయ్యే ఇన్ఫ్లమేషన్కు కారణమవుతుంది. 3. ఆల్కహాల్ కారణంగా శరీరంలో వివిధ హార్మోన్లలో విపరీతమైన హెచ్చుతగ్గులు వస్తాయి. ఇది కేన్సర్‌కు దారితీస్తుంది. ముఖ్యంగా మహిళల్లో ఈస్ట్రోజన్ హార్మోన్‌పై ప్రభావం పడి రొమ్ము కేన్సర్ ముప్పు పెరుగుతుంది. 4. కేన్సర్‌కు కారణమయ్యే పదార్థాలను (కార్సినోజెన్లు) శరీరం ఎక్కువగా సంగ్రహించడానికి ఆల్కహాల్ కారణమవుతుంది.ఎంత తాగితే.. అతిగా తాగినట్టు? ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన పలు అధ్యయనాల మేరకు.. రోజూ కనీసం ఒక డ్రింక్ ఆల్కహాల్ తాగేవారిలో కేన్సర్ల ముప్పు 10 నుంచి 40% వరకు పెరుగుతుంది. డ్రింక్స్ సంఖ్య పెరిగిన కొద్దీ.. ముప్పు అదే స్థాయిలో పెరుగుతూ పోతుంది. అక్కడి అధ్యయనం మనకెందుకు? ప్రపంచంలోనే అత్యధిక జనాభాకు తోడు ఆల్కహాల్ వినియోగం కూడా ఎక్కువగానే ఉండటంతో.. భారత్‌లోనూ ఈ కేన్సర్ల ముప్పు ఎక్కువ. ‘ది లాన్సెట్ అంకాలజీ’ జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధన వివరాల మేరకు... 2020లో భారత్‌లో కొత్తగా 62,100 ఆల్కహాల్ ఆధారిత కేన్సర్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేన్సర్ కేసుల్లో ఇవి 5 శాతానికన్నా ఎక్కువే కావడం గమనార్హం.మన దేశంలో కొన్నేళ్లుగా పెరిగిపోతున్న ఊబ కాయం సమస్యకు తోడుఆల్కహాల్, పొగాకు ఉత్పత్తుల వినియోగం ఈ పరిస్థితికి దారితీస్తోందని అంకాలజీ నిపుణులు చెబుతున్నారు.మరి ఈ కేన్సర్ల ముప్పు నుంచి బయటపడేదెలా?రోజూ స్వల్ప మొత్తంలో ఆల్కహాల్ తీసుకున్నా కేన్సర్ ముప్పు తప్పదని ఈ అధ్యయనం తేల్చింది. అంటే ఈ ముప్పు నుంచి బయటపడటానికి ఉన్న ఏకైక మార్గం... ఆల్కహాల్‌కు పూర్తిగా దూరంగా ఉండటమేనని అంకాలజీ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఒక్కసారిగా అలవాటు మానుకోలేనివారు.. స్వల్పంగా తీసుకుంటూ మానేయాలని, అదే సమయంలో సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులకు కచి్చతంగా దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. –సాక్షి,సెంట్రల్ డెస్క్ -
హైదరాబాద్‌లో కొత్త జీసీసీ ఏర్పాటుకు ప్రణాళికలు
హైదరాబాద్ గ్లోబల్ కెపాసిటీ సెంటర్లకు హబ్‌గా మారుతోంది. హెల్త్ సెక్టార్లో సేవలందిస్తున్న ఎలీ లిల్లీ అండ్ కంపెనీ హైదరాబాద్‌లో కొత్తగా గ్లోబల్ కెపాసిటీ సెంటర్(GCC)ను ఏర్పాటు చేసే ప్రణాళికలను ప్రకటించింది. ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ ఇంజినీరింగ్, క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఎలీ లిల్లీ సేవలందిస్తోంది. ఈ సంస్థ ఇప్పటికే 2016లో బెంగళూరులో జీసీసీను ఏర్పాటు చేసింది. త్వరలో హైదరాబాద్‌లో ప్రారంభించబోయే జీసీసీ ఇండియాలో రెండోది కావడం విశేషం. కొత్త జీసీసీ(Global Capability Center)ను హైదరాబాద్‌కు ఆహ్వానించడం సంతోషంగా ఉందని తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. హెల్త్ కేర్ ఇన్నోవేషన్‌లో హైదరాబాద్ ఖ్యాతి పెరుగుతోందని చెప్పారు.లిల్లీ కెపాసిటీ సెంటర్ ఇండియా (ఎల్‌సీసీఐ)గా పిలవబడే ఈ కొత్త జీసీసీ ద్వారా స్థానికంగా మరింత సాంకేతిక సేవలు అందించడంతోపాటు అంతర్జాతీయంగా కూడా ఈ సెంటర్ సేవలు ఎంతో కీలకం కానున్నాయని కంపెనీ తెలిపింది. ఈ సెంటర్లో టెక్నాలజీ ఇంజినీర్లు, డేటా సైంటిస్టులతో సహా సుమారు 1,000 నుంచి 1,500 మంది నిపుణులను నియమించుకోవాలని యోచిస్తున్నట్లు ఎలీ లిల్లీ(Eli Lilly) తెలిపింది. ఈ జీసీసీ 2025లోనే అందుబాటులోకి వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.ఇదీ చదవండి: అపోహలు వీడితేనే మంచి స్కోరుఈ సందర్భంగా సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ డిజిటల్ ఆఫీసర్ డియోగో రావ్ మాట్లాడుతూ.. ‘హైదరాబాద్‌లో కొత్త కేంద్రాన్ని ప్రారంభించే ప్రణాళికలను ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాలను మెరుగ్గా మార్చాలనుకునే సాంకేతిక నిపుణులను ఏకతాటిపైకి తీసుకొస్తాం’ అని చెప్పారు. కొత్త సాంకేతిక పురోగతిని ఉపయోగించుకుంటూ వినూత్న ఆవిష్కరణలతో సంస్థ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి హైదరాబాద్ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కొత్త ఎల్‌సీసీఐ వల్ల యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెప్పారు. -
విశాల్ ఆరోగ్యంపై తప్పుడు వార్తలు.. అసలు విషయం ఇదీ: ఖుష్భూ
కోలీవుడ్ హీరో విశాల్( Vishal) అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన ‘మదగజరాజ’ ప్రీరిలీజ్ ఈవెంట్లో ఆయన వణుకుతూ మాట్లాడారు. అంతకు ముందు కొన్నాళ్ల పాటు కెమెరాకు కనిపించలేదు. సడెన్‌గా ఈవెంట్లో కనిపించి.. అలా వణుకుతూ మాట్లాడడంతో తమ హీరోకి ఏమైందోనని అభిమానులు కంగారు పడ్డారు. ఆయన జ్వరంతో బాధపడుతన్నాడని వైద్యులు చెప్పినప్పటికీ.. విశాల్ హెల్త్‌పై రకరకాల పుకార్లు వస్తున్నాయి. అసలు విశాల్‌కి ఏమైందనే విషయాన్ని తాజాగా నటి ఖుష్బూ(khushboo sundar) వివరించింది.కంగారు పడాల్సిన అవసరం లేదుతాజాగా ఖుష్బూ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..విశాల్ ఆరోగ్యం ఎలా ఉందో చెప్పారు. ‘ఢిల్లీలో ఉన్నప్పుడే విశాల్‌కి జ్వరం వచ్చింది. కానీ 12 ఏళ్ల తర్వాత ‘మదగజరాజ’ రిలీజ్ అవుందుని ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా ఈవెంట్‌కి వచ్చాడు. అప్పటికే విశాల్ డెంగీ ఫీవర్‌తో బాధపడుతున్నాడు. 103 డిగ్రీల జ్వరం కారణంగా వణికిపోయారు. ‘ఇంత జ్వరంతో ఎందుకు వచ్చావు?’అని అడిగితే.. ‘నేను నటించిన చిత్రం 12 ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా ఈవెంట్‌కి కచ్చితంగా రావాలనుకున్నాను. అందుకే బాడీ సహకరించకపోయినా వచ్చేశాను’ అని విశాల్ చెప్పారు. ఈ ఈవెంట్ పూర్తయిన వెంటనే విశాల్‌ని ఆస్పత్రికి తీసుకెళ్లాం. ఇప్పుడు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. కంగారుపడాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పారు. అయినా కూడా కొంతమంది యూట్యూబర్స్ విశాల్ ఆరోగ్యంపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. సెలబ్రిటీల గురించి నిజానిజాలు తెలుసుకోకుండా తప్పుడు కథనాలను ప్రచారం చేయకండి’ అని ఖుష్భూ విజ్ఞప్తి చేశారు.కాగా, విశాల్, ఖుష్భూ మధ్య మంచి స్నేహబంధం ఉంది. కలిసి సినిమాలు చేయకపోయినా.. చాలా క్లోజ్‌గా ఉంటారు. మదగజరాజు సినిమాకు ఖుష్భూ భర్త సుందర్.సి దర్శకత్వం వహించారు. విశాల్‌తో తనకున్న అనుబంధం గురించి ఖుష్భూ మాట్లాడుతూ.. ‘మేమిద్దరం కలిసి సినిమాలు చేయలేదు. కానీ మొదటగా ఇద్దరం కలిసి ఓకే పార్టీలో పని చేశాం. ఆ కారణంగానే మా మధ్య మంచి స్నేహం ఏర్పడింది. విశాల్ నటించిన సినిమాల్లో కొన్ని నాకు చాలా ఇష్టం. మంచి టాలెంట్ ఉన్న నటుడు ఆయన. సినిమా కోసం చాలా కష్టపడతాడు’ అని ఖష్భూ చెప్పుకొచ్చింది.12 ఏళ్ల తర్వాత రిలీజ్విశాల్ హీరోగా సుందర్.సి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమే ‘మదగజరాజ’(Madha Gaja Raja). 2013లో ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. పలు కారణాల వల్ల వాయిదా పడి దాదాపు 12 ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. యాక్షన్ కామెడీగా రూపొందిన ఈ మూవీలో అంజలి, వరలక్ష్మీ శరత్‌కుమార్ హీరోయిన్లుగా నటించారు. ఆర్య, సదా అతిథి పాత్రల్లో సందడి చేయనున్నారు. ఈ సినిమా కోసం విశాల్ ఎయిట్ ప్యాక్ చేశాడట. షూటింగ్ ఆసల్యం అయినా కూడా మరో సినిమా చేయకుండా.. ఈ మూవీ కోసం కష్టపడ్డాడని ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ సుందర్ చెప్పారు. అంతేకాదు విశాల్ తనకు సొంత తమ్ముడి లాంటి వాడని చెప్పాడు. మొదట్లో విశాల్‌ని అపార్థం చేసుకున్నానని, అతనితో పరిచయం ఏర్పడిన తర్వాత అతను ఎంత మంచి వాడనే విషయం తెలిసిందన్నాడు. ఇండస్ట్రీలో చాలా మంది హీరోలతో పని చేసినప్పటికీ.. కార్తిక్ తర్వాత విశాల్‌తోనే తను బాగా క్లోజ్ అయ్యానని చెప్పారు. #Vishal na get well soon.. #MadhaGajaRajapic.twitter.com/I2K3lTRR0Q— Tamil Cinema Spot (@tamilcinemaspot) January 5, 2025 -
శారీరక శిక్షణే అతిపెద్ద 'గేమ్ ఛేంజర్'.!: విశ్వనాథన్ ఆనంద్
మాజీ చెస్ గ్రాండ్‌మాస్టర్(Chess Grandmaster) విశ్వనాథన్ ఆనంద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచ చదరంగం క్రీడలో భారతదేశానికి వన్నెతెచ్చిన క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్. 16వ ఏటనే జాతీయ ఛాంపియన్ షిప్ చేజిక్కించుకున్నాడు. 1987లో ప్రపంచ జూనియర్ చెస్ చాంపియన్ షిప్ సాధించి ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. ఆ నేపథ్యంలోనే ఆయన గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించారు. ఎంతటి విజేతకైనా అప్పడప్పడూ ఓటమి పలకరిస్తుంటుంది. తడబాటులు తప్పవు. అలాంటప్పుడూ ఒక్కసారిగా ఎదురయ్యే నైరాశ్యం నుంచి బయటపడేందుకు తన భార్య ఇచ్చిన పనిష్మెంట్ తనకు ఉపకరిస్తుందని అంటున్నారు ఆనంద్. అది తనకు పెద్ద 'గేమ్ ఛేంజర్' అని చెబుతున్నారు. అదేంటో తెలుసుకుందామా..!విశ్వనాథన్ ఆనంద్(Vishwanathan Anand) అర్జెంటీనాలో ఒక టోర్నమెంట్ (Tournament)లో ఆడుతున్నాడు. ఆ టోర్నమెంట్ గెలిచాడు కానీ ప్రారంభంలో రెండు పరాజయాలను ఎదుర్కొనక తప్పలేదు. అయితే అక్కడ ఆనంద్ చేసినవి చాలా సిల్లీ తప్పులట. దీంతో అతడి భార్య అరుణకు ఆయన మీద పిచ్చకోపం వచ్చి..ఈ రాత్రికి డిన్నర్ కావాలంటే.. ముందు చకచకా 50 పుష్అప్లు(Pushups) చేయండని ఆదేశించిందట. అసలే ఓటమితో భారంగా ఉన్న ఆనంద్ చేసేదేమిలేక మారు మాట్లాడకుండా పుష్అప్లు చేసి తర్వాత డిన్నర్ కానిచ్చారట. ఆ తర్వాత బాడీ అలసిపోవడంతో మంచి నిద్ర పట్టేసిందట. మరుసటి రోజు ఆ ఓటమి తనని శారీరకంగా గానీ మానసికంగా(Mental) డిస్ట్రబ్ చేయలేదట.దీంతో రిఫ్రెష్‌గా కొత్త ఎత్తులతో గేమ్ ఆడి ప్రత్యర్థిని మట్టికరిపించాడట. అందుకే ఆయన శారీరక శిక్షణ అనేది చాలా పెద్ద గేమ్ ఛేంజర్ అని నమ్మకంగా చెబుతున్నారు. నిజానికి అందరూ చదరంగం ఒక మానసిక గేమ్ అని భావిస్తారు కానీ అది తెలియకుండానే ఫిజికల్ గేమ్‌గా మారుతుందని తన భార్య తరచు చెబుతుంటుందని అన్నారు. ఇక్కడ రికార్డులు బ్రేక్‌చేసే క్రీడాకారుడికి తప్పనిసరిగా శారీక బలం తోపాటు, మానసిక దృఢత్వం ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి ఆటల్లో ఓటమి తెలియని ఒత్తిడికి గురయ్యేలా చేసి అలసట తెప్పిస్తుందట. చెప్పాలంటే ఇక నావల్ల కాదనేలా కుంగిపోతారట. అలాంటప్పుడు శారీరక శిక్షణ వారిని ఉత్సాహవంతుడిగా మార్చి విజయాన్ని కైవసం చేసుకునేలా ప్రేరేపిస్తుందని వెల్లడించారు నిపుణులు. ఆ పనే ఇక్కడ ఆనంద్ భార్య అరుణా చేశారు. ఇక్కడ ఆతడి భార్య తన ఆర్థిక లావదేవీలు చూసే మేనేజర్‌గానే కాకుండా వ్యక్తిగతంగా స్ట్రాంగ్ ఉండేలా చేసే శిక్షకురాలిగా సూచనలిచ్చింది. ఫిట్నెస్, ఆరోగ్యం అనేవి మానసిక క్షేమంతో ముగిపడి ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ అరుణ చెప్పిన పుష్ అప్లు ఏకగ్రాతతో చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది మెదడు సహజ స్థితి పెంచేలా ఎండార్ఫిన్లను విడుదల చేసి ఒత్తిడి, ఆందోళనలను నివారిస్తుందని తెలిపారు. తద్వారా ఆయా వ్యక్తుల్లోని ఆత్మవిశ్వాసం పుంజుకుని, మనసును లక్ష్యంపై స్థిరంగా ఉండేలా చేస్తుందట. ప్రయోజనాలు..ఇది ఆటగాళ్లకే ఇంత ప్రయోజనాలందిస్తే..రోజువారీ టెన్షన్లు, ఆందోళనలతో నలిగిపోయే సామాన్యులకు కూడా ఇంకెన్ని ప్రయోజనాలను ఇవ్వగలదో చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా కోర్ కండరాలను బలోపేతం చేయడమే గాక మొత్తం శరీరం, మనసును బలోపేతం చేసే వ్యాయామం ఇది. అయితే దీనిని సరైన విధంగా చేయాలి. ఇప్పుడే కొత్తగా మొదలుపెడుతున్నవారు.. వ్యాయామ నిపుణుల సలహాలు సంప్రదింపులతో చేయడం మంచిది. View this post on Instagram A post shared by CircleChess (@circlechess) (చదవండి: ముంచుకొస్తున్న హెచ్ఎంపీవీ..నఖ శిఖం పరిశుభ్రంగా ఉందామిలా..!) -
ఆరోగ్య ఆసియా
సాక్షి, అమరావతి: ఆసియా దేశాల్లో ఆరోగ్య స్పృహ పెరిగింది. చిన్న దేశాల్లోనూ ఉత్తమ ఆహార అలవాట్లు, వ్యాయామ విధానాలతో ప్రజలు జీవన ప్రమాణాలను పెంచుకుంటున్నారు. ఎంతో అభివృద్ధి చెందినట్టు భావిస్తున్న అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో ఆరోగ్యంపై శ్రద్ధ తగ్గుతున్నట్టు గుర్తించారు. ప్రపంచంలోని 200 దేశాల్లో ఆహార అలవాట్లు, ఆరోగ్య శ్రద్ధపై చేసిన సర్వే నివేదిక ‘బ్లూమ్‌బర్గ్, గ్లోబల్ హెల్త్ ఇండెక్స్–2024’ను ఇటీవల విడుదల చేశారు. ఇందులో ప్రపంచంలో టాప్–3 హెల్త్ ర్యాంకులు ఆసియా దేశాలైన సింగపూర్, జపాన్, దక్షిణ కొరియావే. తొలి స్థానం సింగపూర్‌ది కాగా.. జపాన్, దక్షిణ కొరియా రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి. నాలుగో స్థానంలో తైవాన్ ఉంది. భారత దేశం 112వ స్థానంలో నిలిచింది. బ్లూమ్‌బెర్గ్ గ్లోబల్ హెల్త్ ఇండెక్స్ దేశ ప్రజల వ్యక్తిగత ఆరోగ్య పరిరక్షణ కోసం తీసుకుంటున్న జాగ్రత్తలు, ప్రభుత్వాలు కల్పిస్తున్న సదుపాయాలను అన్ని కోణాల నుంచి అధ్యయనం చేయగా, గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ ఇండెక్స్ సంస్థ ప్రజల వ్యాధి నిరోధక శక్తి సామర్థ్యాలపై అధ్యయనం చేసింది. ఈ రెండు సంస్థలుసంయుక్తంగా గ్లోబల్ హెల్త్ ఇండెక్స్–2024 నివేదికను విడుదల చేశాయి.ఆరోగ్య ప్రగతికి ప్రత్యేక కొలమానం ఒక దేశ ఆరోగ్యాన్ని కొలవడానికి ప్రత్యేకంగా రూపొందించిన మెట్రిక్ విధానాన్ని బ్లూమ్‌బర్గ్ గ్లోబల్ హెల్త్ ఇండెక్స్ వినియోగించింది. దేశ ప్రజల్లో పొగాకు వినియోగం, అధిక రక్తపోటు, ఊబకాయం, స్వచ్ఛమైన నీటి లభ్యత, సగటు ఆయుర్దాయం, పోషకాహార లోపం, మరణానికి కారణాలను ప్రామాణికంగా తీసుకుంది. తీవ్రమైన రోగాలు ప్రబలినప్పుడు ఆ దేశంలో చేపట్టే నివారణ చర్యలు, ప్రజల శ్రేయస్సు కోసం తీసుకునే విధానాలపై గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ ఇండెక్స్ నివేదిక రూపొందించింది.ఇందులో వ్యాధి నివారణ చర్యలు, అంతర్జాతీయ అంటు వ్యాధులను ముందస్తుగా గుర్తించి నిరోధించడం, వ్యా«ధులు వ్యాప్తి చెందకుండా వేగంగా చర్యలు చేపట్టడం (ర్యాపిడ్ రెస్పాన్స్), ఆ దేశ ఆరోగ్య వ్యవస్థ, అంతర్జాతీయ నిబంధనల అమలు వంటి అంశాల ఆధారంగా నివేదిక తయారు చేసింది. 2019 ర్యాంకింగ్ ప్రకారం స్పెయిన్ 92.75 స్కోరుతో ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన దేశంగా ఉండగా, అప్పట్లో 4వ స్థానంలో ఉన్న సింగపూర్ 2024లో 95.3 స్కోర్‌తో మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంది. జపాన్ 95.1 స్కోరుతో రెండో స్థానంలో, 94.3 స్కోరుతో దక్షిణ కొరియా మూడో స్థానంలో నిలిచాయి.అభివృద్ధి చెందిన దేశాలు వెనుకే..అభివృద్ధి చెందిన దేశాలుగా చెప్పుకొంటున్న యునైటెడ్ కింగ్డమ్ (బ్రిటన్) 88.8 స్కోరుతో 34వ ర్యాంకులో ఉంది. అమెరికాది 2019లో 35వ ర్యాంక్ కాగా, ఇప్పుడు 69కు పడిపోయింది. ఇక మన పక్కనున్న పాకిస్తాన్ 61.3 స్కోరుతో 124వ ర్యాంకు, చైనా 46.3 స్కోరుతో 163వ ర్యాంక్ పొందాయి. భారతదేశం 61.5 స్కోరుతో 112వ ర్యాంకులో ఉంది. కాగా, కోవిడ్–19 మహమ్మారి కారణంగా 2021లో ప్రపంచంలోని అన్ని దేశాలు తీవ్ర ప్రభావానికి గురయ్యాయని, అయినప్పటికీ భవిష్యత్‌లో ఇలాంటి ఉపద్రవాలు ఎదురైతే మహమ్మారిని నిరోధించడానికి ఏ దేశమూ తగిన చర్యలు తీసుకోలేదని నివేదిక పేర్కొంది.ఆరోగ్యం, ఆయుర్దాయంలో సింగపూర్ టాప్ఆరోగ్యం, ఆయుర్దాయంలో సింగపూర్‌దే అగ్రస్థానమని నివేదిక తెలిపింది. అక్కడి ప్రభుత్వం ప్రత్యేక సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసి, పెద్దలు, పిల్లల కోసం పలు రకాల ఆరోగ్య పరీక్షలు, ఆరోగ్యకరమైన జీవనశైలి కార్యక్రమాలు అమలు చేస్తోందని పేర్కొంది. ఈ దేశ జనాభాలో 14 శాతం మందే ధూమపానం చేస్తున్నట్టు గుర్తించింది. ప్రపంచంలో అత్యధిక ఆయుర్దాయం 84.8సంవత్సరాలతో సింగపూర్ మొదటి స్థానంలో నిలిచింది. జపాన్ 84 సంవత్సరాలతో రెండో స్థానంలో ఉంది.ప్రస్తుతం స్పెయిన్ ప్రజల సగటు ఆయుర్దాయం 83.5 సంవత్సరాలు కాగా, ఇది 2040 నాటికి 85.8కి పెరిగి ప్రపంచంలోనే అత్యధిక ఆయుర్దాయం గల దేశంగా నిలుస్తుందని నివేదిక పేర్కొంది. ఇక్కడి ప్రజలు మాంసాహారం కంటే ఆరోగ్యకరమైన కొవ్వులు, చిక్కుళ్లు, పండ్లు, కూరగాయలు అధికంగా తీసుకుంటారని, తక్కువ మొత్తంలో రెడ్ మీట్, ప్రాసెస్డ్ పదార్థాలు తింటున్నట్టు వివరించింది. ఐరోపాలోనే స్పెయిన్‌లో అత్యధిక శాతం వాకర్లు ఉన్నారని, ఇక్కడ 37 శాతం మంది ఉద్యోగాలకు నడిచే వెళతారని పేర్కొంది. అందుకు భిన్నంగా అమెరికాలో 6 శాతం మంది మాత్రమే పనికి నడిచివెళుతున్నట్టు పేర్కొంది. -
ఈ పప్పు మనిషి మాంసాన్ని తింటుందట! ఇది ప్రోటీన్ కాదట..
భారతీయ ఇళ్లలో పప్పులు లేనిదే వంట సంపూర్ణం కాదు. ఏదో ఒక విధంగా పప్పులను వినియోగిస్తాం. అలాగే వారంలో ఏ రెండు లేదా మూడు రోజులైనా భోజనంలో పప్పు ఉండాల్సిందే. అయితే పప్పు అనేది ప్రోటీన్ల మూలకమని, ఎన్నో మాంసకృత్తులు ఉంటాయని విన్నాం. కానీ ఈ పప్పు మనిషి మాంసాన్ని తింటుందట. ఇది ప్రోటీన్ మూలం కాదట. వాట్ పప్పులు మనిషి మాంసాని తినడం ఏమిటి..? అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే ఐఏఎస్ ఇంటరర్వ్యూలో ఓ అభ్యర్థికి ఎదురైన ప్రశ్న ఇది. ఔను మనిషి మాంసాన్ని తినేసే పప్పు ఏది అని ప్రశ్నించారట. కాబట్టి ఆ పప్పు రకం ఏంటి..?దాని కథాకమామిషు గురించి చూద్దామాభారతీయ ఇళ్లలో సాధారణంగా పెసర పప్పుని ఎక్కువగా వినియోగిస్తారు. ముఖ్యంగా పండుగల టైంలో ఈ పప్పుతో చేసే వంటకాలను దేవుడికి నైవేద్యంగా పెడతారు. ముఖ్యంగా ఏకాదశి వ్రతాలు చేసేవాళ్లు నియమానుసారంగా నీళ్లు, పాలు, పండ్లు తప్ప ఘన పదార్థాలు తీసుకోకూడదు. కానీ నిష్టగా చేయలేని వాళ్లు లేదా ఉపవాసానికి ఆగలేని వాళ్లు ఈ పెసరపప్పుతో చేసిన అత్తెసర లేదా హవిష్యాన్నం తిని ఉండొచ్చని వేదాలు చెబుతున్నాయి. అంతలా భారతీయ వంటకాల్లో అగ్రస్థానంలో ప్రాధాన్యత కలిగినది ఈ పెసరపప్పు. ఇంతకి పెసరపప్పు(Moong Dal) మనిషి మాంసాన్ని తింటుదా..? అని విస్తుపోకండి. ఎందుకంటే దీన్ని అలా అనడానికి వెనుకున్న శాస్త్రీయ కోణం గురించి సవివరంగా తెలుసుకుందాం."ప్రోటీయోలైటిక్ ఎంజైమ్‌లు"గా పలిచే ఒక ప్రత్యేక రకం ప్రోటీన్ ఉంది. ఈ ఎంజైమ్‌లు మన జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. స్తంభించి ఉన్న కొవ్వు, చనిపోయిన కణాల రూపంలో ఉండే అశుద్ధ మూలకాలు, చెత్తని తొలగించడం వాటి ప్రధాన విధి. పెసర పప్పు "మానవ మాంసాన్ని తింటాయి" అనగానే మన శరీర మాంసాన్ని తింటుందని కాదు, శరీరంలోని టాక్సిన్స్, వ్యర్థ పదార్థాలు, అదనపు కొవ్వును తినేస్తుందని అర్థం. బరువు తగ్గడానికి, శరీరాన్ని ఆరోగ్యంగా మార్చడానికి పెసరపప్పు చాలా మంచిదని చెప్పడానికీ ఇదే రీజన్ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారుఆరోగ్య ప్రయోజనాలు:బరువు తగ్గడం: ఊబకాయం ఉన్నవారికి పెసర పప్పు తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది.ఎందుకంటే ఇందులో ప్రోటీన్, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తొలగించడంలో సహాయపడతాయి. ఇది శరీరంలో నిల్వ ఉన్న అదనపు కొవ్వును తొలగించడానికి పనిచేస్తుంది. ఈ చెడు కొలెస్ట్రాల్, వ్యర్థపదార్థాలు చూడటానికి మాంసం మాదిరిగా కనిపిస్తాయి. అందుకని ఇలా అనడం జరిగిందని చెబుతున్నారు నిపుణులు. ఇది శరీరాన్ని మంచి ఆకృతిలో ఉండేలా చేస్తుంది. పైగాఎక్కువ కాలం కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది.ఇది అతిగా తినే అలవాటును తగ్గిస్తుంది. అంతే కాకుండా జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది.రక్తపోటును నియంత్రిస్తుంది: పెసర పప్పు తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఇందులో పొటాషియం , మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి రక్తపోటును సమతుల్యంగా ఉంచడంలో సహాయపడతాయి.పోషణ , జీర్ణశక్తి: పెసర పప్పు చాలా పోషకమైనది, సులభంగా జీర్ణమయ్యేదిగా పరిగణిస్తారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు ఉపయోగపడే బలవర్ధకమైన పప్పు ఇది. అన్ని వయసుల వారు హాయిగా తీసుకోవచ్చునని చెబుతున్నారు నిపుణులు. తేలికగా జీర్ణమయ్యే ఆహారంగా పేర్కొంటారు. శరీరంలోని కొవ్వు, మలినాలను తొలగిస్తుందని ఇలా మానవ మాంసాన్ని తినేసే పప్పుగా పేర్కొన్నారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది, సురక్షితమైనది కూడా. ముఖ్యంగా శాకాహారులు హాయిగా తీసుకునే మంచి బలవర్ధకమైన పప్పు ధాన్యంగా చెబుతున్నారు నిపుణులు.(చదవండి: నిజమైన ప్రేమ అంటే ఇది కదా..!) -
ఈ విటమిన్లు తీసుకోండి
విటమిన్లు అందరికీ అవసరమే అయినా మహిళల ఆరోగ్యంలో ఇవి మరింత కీలక పాత్ర పోషిస్తాయి. 25 ఏళ్ల తరువాత మహిళల శరీరంలో పలు మార్పులు ప్రారంభమవుతాయి. ఇలాంటి కీలక దశలో పోషకాహారం, ఎక్సర్సైజులను నిర్లక్ష్యం చేస్తే విపరిణామాలు ఎదురవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నిపుణుల ప్రకారం 25 దాటిన మహిళల ఆహారంలో కొన్ని విటమిన్స్ తప్పనిసరిగా ఉండాలి. అవేంటంటే..విటమిన్ డి...ఎముకలు, రోగనిరోధక శక్తి బలోపేతానికి అవసరమైన కాల్షియం, ఫాస్ఫరస్లను శరీరం సులువుగా గ్రహించేందుకు విటమిన్ డీ అవసరం. మహిళల్లో మరణాలకు ప్రధాన కారణాల్లో ఆస్టియోపోరోసిస్, ఫ్రాక్చర్ల ప్రమాదం ఎక్కువ కాబట్టి విటమిన్ డీ ఆహారంలో ఉండేలా చేసుకోవాలి. ఎందులో ఉంటుందంటే...ఫార్టిఫైడ్ పాలు, గుడ్లు, సాల్మన్ లాంటి ఫ్యాటీ ఫిష్‌లో ఇది పుష్కలంగా ఉంటుంది.విటమిన్ బి12...ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి కీలకమైన విటమిన్ బీ12 మహిళ ఆరోగ్యానికి ఎంతో కీలకం. ఈ విటమిన్ లోపం తలెత్తితే మెగాలోబ్లాస్టిక్ అనేమియా అనే రక్తహీనత తలెత్తుతుంది. సంతానోత్పత్తికి, ప్రెగ్నెన్సీ సమయంలో ఇబ్బందులను అడ్డుకునేందుకు కూడా ఈ విటమిన్ కీలకం. ఎందులో లభిస్తుందంటే... అన్ని రకాల మాంసాహారాలలో... పాలు, పెరుగు, నెయ్యి, కివీ, అరటి వంటి పండ్లలో విటమిన్ బి 12 లభిస్తుంది. విటమిన్ సి...మహిళలకు కావలసిన అతి ముఖ్యమైన విటమిన్లలో ఇది కూడా ఒకటి. ఇది శరీరంలో ఉత్పత్తి కాదు కాబట్టి ఆహారం ద్వారానే తీసుకోవాల్సి ఉంటుంది. మహిళలకు రోజుకు 75 మిల్లీ గ్రాముల విటమిన్ సీ కావాలి. ఇది రక్తపోటు, కొలెస్టెరాల్ స్థాయులను నియంత్రించేందుకు అవసరం. వయసు పెరిగే కొద్దీ గుండె జబ్బులు అడ్డుకునేందుకు కూడా ఇది కీలకం. విటమిన్ సి సమృద్ధిగా తీసుకుంటే ఐరన్ లోపం తలెత్తే అవకాశాలు కూడా తగ్గిపోతాయి. ఎందులో ఉంటుంది?నిమ్మ జాతికి చెందిన పండ్లు, కీవీ పళ్లల్లో ఈ విటమిన్ సమృద్ధిగా ఉంటుంది.విటమిన్ ఈయాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్న విటమిన్ ఈ చర్మ ఆరోగ్యానికి కీలకం. అతినీలలోహిత కిరణాలు, కాలుష్యం కారణంగా చర్మానికి జరిగే నష్టాన్ని ఇది తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తి కూడా బలోపేతమయ్యేలా చేస్తుంది. నెలసరి సమయంలో వచ్చే నొప్పులు, ఇతర అసౌకర్యాల నుంచి కూడా విటమిన్ ఈ ఉపశమనం కలిగిస్తుంది.ఎందులో ఉంటుందంటే... విత్తనాలు, గింజలు, పాలకూర, పొద్దుతిరుగుడు పువ్వు నూనెలో ఈ విటమిన్ పుష్కలంగా ఉంటుంది.విటమిన్ కే...బ్లడ్ క్లాటింగ్‌కు కీలకమైన విటమిన్ కే గాయాలు త్వరగా మానేలా చేస్తుంది. ఎముకల ఆరోగ్యానికీ ఇది కీలకం. మహిళల్లో ఉదయం పూట కలిగే అసౌకర్యాల నుంచి ఉపశమనం కల్పిస్తుంది. మెదడు ఆరోగ్యానికీ ఇది అవసరమే. ఆకుకూరలు, ఆవకాడో లాంటి పండ్లు, చేపలు, లివర్, మాంసం గుడ్లల్లో ఇది పుష్కలంగా ఉంటుంది. -
2024లో వార్తల్లో నిలిచిన 'సూపర్‌ఫుడ్స్' ఏంటో తెలుసా?
2024 ఏడాదికి బైబై చెప్పేసి2025 సంవత్సరానికి ఆహ్వానం పలికాం. అనేక రంగాల్లో ఎన్నో పరిశోధనలు, సరికొత్త అధ్యయనాలకు సాక్ష్యం 2024. ఈ క్రమంలో 2024లో సూపర్ ఫుడ్‌గా వార్తల్లో నిలిచిన ఆహారం గురించి తెలుసుకుందాం. గతంలో లాగానే 2024 కూడాసహజమైన ఆహారాలు , పదార్దాల ఆరోగ్య ప్రయోజనాలపై కొత్త పరిశోధనలకు బలమైన సంవత్సరంగా నిలిచింది వీటిలో కొన్ని శతాబ్దాలుగా సాంప్రదాయ వైద్యంలో ఉపయోగించ బడుతున్నవే. బరువు తగ్గడం, కణాల మరమ్మత్తు, వాపు లేదా గుండె ఆరోగ్యం తదితర విషయాల్లో 'సూపర్‌ఫుడ్స్' అద్భుత నివారణలు కాకపోవచ్చు. కానీ కొన్ని మాత్రం ఆరోగ్య సంరక్షణ మించి ఉన్నాయని తేలింది. అలాగే చాలా మంచి ఫుడ్ కూడా కొంతమందికి ప్రాణాపాయంగా ఉండవచ్చిన నిపుణులు చెప్పారు.చీజ్‌తో మానసిక ఆరోగ్యం2.3 మిలియన్ల మంది వ్యక్తులపై జరిపిన ఒక అధ్యయనంలో, షాంఘై జియావో టోంగ్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు చీజ్ వినియోగంతో మెరుగైన మానసిక ఆరోగ్యం ముఖ్యంగా వృద్ధుల్లో సామాజిక ఆర్థిక కారకాలతో సంబంధం లేకుండా ఎక్కువ ప్రభావం ఉంటుందని తేలింది. జన్యపరంగా వృద్ధాప్యం సహజమే అయినా, చీజ్ ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి ముఖ్యమైన సాంఘికీకరణ వంటి ఇతర కార్యకలాపాలతో ముడిపడి ఉందని పరిశోధన సూచించింది.నట్స్ - మెదడుగింజలు చిత్తవైకల్యం నుండి మెదడును రక్షించడంలో సహాయపడతాయి మెల్బోర్న్లోని మోనాష్ యూనివర్శిటీ పరిశోధకులు 49-ఐటమ్ ఫుడ్-ఫ్రీక్వెన్సీ సర్వేను పూర్తి చేసిన 70 ఏళ్లు పైబడిన 9,916 మంది వ్యక్తుల రికార్డులను పరిశీలించారు. ఇతర కారకాలను పరిశీలించిన తరువాత, తక్కువ నట్స్ తినే వారితో పోలిస్తే,తమ ఆహారంలోరోజుకు ఒకటి లేదా రెండుసార్లు నట్స్‌ను తీసుకునేవారిలో మంచి అభిజ్ఞా పనితీరు శారీరక ఆరోగ్యాన్ని నిలుపుకోవటానికి మంచి అవకాశం ఉందని గుర్తించింది. ఫాక్స్ నట్స్ఫాక్స్ నట్స్ ఆగ్నేయాసియాతోపాటు ఇండియాలో చాలాకాలంగా సంప్రదాయ వైద్యంలో వాడుతున్నారు. నీటి కలువ కుటుంబానికి చెందిన నీటి మొక్క (యురేల్ ఫెరోక్స్ ఫ్లవర్) గింజలే ఫాక్స్ నట్స్. వీటిల్లోని యాంటీ ఏజింగ్ లక్షణాలు ఈ ఏడాది పరిశోధకులకు ప్రత్యేక ఆసక్తిని కలిగించాయి. 2012, 2018, 2020లో అధ్యయనాలతో పాటు, ఇటీవల 2023లోని యాంటీఆక్సిడెంట్ల అధ్యయనాలను సమీక్షించారు. తద్వారా ఇవి కణాల ఆరోగ్యానికి, వాపును ఎదుర్కోవడానికి ముఖ్యమైన సమ్మేళనాలు అని గమనించారు. అంతేకాదు ప్రోటీన్- స్టార్చ్-రిచ్ సీడ్స్ పాప్‌కార్న్ లాగా చేసుకోవచ్చు. ఇవి ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్ నివారణలో బాగా ఉపయోగడతాయని గుర్తించారు.గాలి నుండి తయారైసూపర్ ప్రోటీన్సొలీన్ ప్రొటీన్ ఉత్పత్తికి ప్రపంచంలోనే మొట్టమొదటి వాణిజ్య-స్థాయిఫ్యాక్టరీ ఫిన్లాండ్లో ఏర్పాటైంది 2024లోనే. సోలిన్ ప్రొటీన్ (సోలెంట్ గ్రీన్ కాదు) శక్తి కోసం హైడ్రోజన్‌ను ఆక్సీకరణం చేసే రహస్య సింగిల్-సెల్ మట్టిలో ఉండే సూక్ష్మజీవి ద్వారా తయారు చేస్తారు. సోలిన్ అని పిలువబడే పొడి లాంటి పదార్ధంలో 65-70% ప్రోటీన్, 5-8% కొవ్వు, 10-15% డైటరీ ఫైబర్స్ , 3-5% ఖనిజ పోషకాలు ఉంటాయి కేవల ఐదో వంతు కర్బన ఉద్గారాలతో, 100 రెట్లు తక్కువ నీరు, 20 శాతం కంటే తక్కువ మొక్క ప్రోటీన్ ఉత్పత్తి. డయాబెటిస్‌కు డార్క్ చాక్లెట్డార్క్ చాక్లెట్ ఆరోగ్య ప్రయోజనాలపై పరిశోధనా ప్రపంచంలో చర్చనీయాంశంగా ఉన్నాయి. కానీ ఈ ఏడాది హార్వర్డ్ T.H. చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు వారానికి ఐదు సార్లు డార్క్ చాక్లెట్ వల్ల మంచిదని తేల్చారు. దీని వల్ల బరువు పెరగకుండానే టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 21శాతం తగ్గుతుందని కనుగొన్నారు. అధిక-ఫ్లావనాల్ కోకో ఉత్పత్తులు ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరుస్తాయని పరిశోధకులు విశ్వసిస్తున్నారు. ఇది ఇతర రకాల చాక్లెట్లలో కనిపించదు. ఫ్లేవనోల్స్, పాలీఫెనాల్ యాంటీఆక్సిడెంట్లు మెరుగైన గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చి, టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని అంచనా.తేనె- ప్రొబయాటిక్స్ఇల్లినాయిస్ యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ అర్బానా-ఛాంపెయిన్ పరిశోధకులు పెరుగులో ఒక టేబుల్ స్పూన్ తేనెను జోడించడం వల్ల జీర్ణకోశంలో ప్రోబయోటిక్ మనుగడను పెంచుతుందనికనుగొన్నారు. జీర్ణక్రియను పెంచడంలో సహాయ పడుతుంది. ముఖ్యంగా క్లోవర్ తేనె - మంచి బ్యాక్టీరియాను రక్షిస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది ఎగువ జీర్ణశయాంతర ప్రేగుల ద్వారా గట్ మైక్రోబయోమ్‌కు ప్రయాణిస్తుంది, అక్కడ మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.అలర్జీ నివారణలో స్ట్రాబెర్రీటోక్యో యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ జరిపిన ఒక అధ్యయనం ప్రకారం, స్ట్రాబెర్రీ అలర్జీల నివారణలో సాయపడతాయి. ఫ్లేవనాయిడ్ కెంప్ఫెరోల్ రోగనిరోధక వ్యవస్థపై దాని ప్రభావం ద్వారా ఆహార అలెర్జీలతో సహా,ఇతర శరీరం అలెర్జీలను ఇవి తగ్గిస్తాయి. కెంప్ఫెరోల్ టీ, బీన్స్, బ్రోకలీ, యాపిల్స్, స్ట్రాబెర్రీలలో పుష్కలంగా ఉంటుంది. ఈ నిర్దిష్ట ఫ్లేవనాయిడ్ మైక్రోబయోలాజికల్ యాంటీగ్గా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. -
"తంపటి తేగ" జీవితంలో ఒక్కసారైనా తినాల్సిందే...
మలికిపురం: ‘తేగ’నచ్చేసే ఆహారం ఇది.. ఆరోగ్య ప్రదాయినీగా పేరొందింది.. అందుకే దీనికి ఉభయ గోదావరి జిల్లాలో ఎంతో ప్రాధాన్యం ఉంది.. చిన్నారుల నుంచి వృద్ధుల వరకూ అందరూ ఇష్టపడి తినే తేగల విక్రయం కార్తిక మాసంలో వచ్చే నాగుల చవితి అనంతరం ప్రారంభం అవుతోంది. హిందూ సంప్రదాయంలో తేగలకు నాగుల చవితికి పురాణాల్లో అవినాభావ సంబంధం ఉంది. అందువల్ల నాగుల చవితి తర్వాతే తేగలను వెలికితీసి విక్రయిస్తారు. అలాగే ఆహార ప్రియులు నాగులు చవితి చేసిన తర్వాతే తేగలను తినడం మొదలు పెడతారు. అయితే మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా తేగల దిగుబడి డిసెంబర్ నుంచీ మొదలవుతుంది. తాటి చెట్ల ద్వారా... తేగలు తాడి చెట్ల నుంచే ఉద్భవిస్తాయి. వేసవిలో తాటికాయల కాపు మొదలవుతుంది. మార్చి, ఏప్రియల్ నెలల్లో తాటి ముంజులను విక్రయిస్తారు. అనంతరం కురిసే వర్షాల నాటికి తాటికాయలు తాటి పండ్లుగా మారతాయి. అలా రాలిన తాటి పండ్ల గుజ్జును వినియోగించి పిండి వంటలు కూడా పల్లెటూర్లలో తయారు చేస్తారు. అలా రాలిన కాయల టెంకలతో పాటు, తాడి చెట్ల నుంచి తాడి కాయలను దించి ప్రత్యేక ప్రాంతాల్లో రైతులు వ్యాపారులు తేగల పాతరలు వేస్తారు. రైతులు, వ్యాపారులు వారికి ఉన్న చెట్లను బట్టి వ్యాపార స్థాయిని బట్టి ఒక్కొక్కరు ఎకరం నుంచి రెండు ఎకరాల్లో కూడా వివిధ ప్రాంతాల్లో పాతర వేస్తారు. వీటికి ఎటువంటి ఎరువులు వేయరు. భూమి ఇసుక పొరలలో దృఢంగా పెరుగుతాయి. డిసెంబర్ నాటికి ఇవి తేగలుగా తయారవుతాయి. సీజనల్ ఆహార పంటగా.. ప్రస్తుతం తేగలు, బుర్ర గుంజుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో తేగలు ప్రస్తుత సీజన్లో సమృద్ధిగా లభిస్తాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో కేశనపల్లి, గూడపల్లి, పశ్చిమ గోదావరిలో మొగల్తూరు, ఇరగవరం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో చింతూరు తేగలకు ప్రసిద్ధి. కోనసీమ తేగలు ఇతర ప్రాంతాలకూ ఎగమతి అవుతున్నాయి. స్థానిక ప్రజలు దూర ప్రాంతాల్లో ఉన్న తమ బంధువులకు తేగలను పార్శిల్ చేసి పంపుతుంటారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు, ముంబయి, ఢిల్లీలకు కూడా తరలిస్తారు. కోనసీమలోని కేశనపల్లి, గూడపల్లి, చింతలమోరిలలో తేగలు రుచిగా ఉంటాయి. దీనికి ఇక్కడి ఎర్రటి ఇసుక నేలలే కారణమని వ్యాపారులు చెబుతున్నారు. అలాగే చింతూరులో లభించే అటవీ తేగలకు కూడా మంచి రుచి ఉంటుంది. అమ్మకాలతో ఉపాధి తేగల అమ్మకంతో అనేక మంది ఉపాధి పొందుతున్నారు. సీజనల్ ఆహార పంటల వ్యాపారులు ఈ తేగల సీజన్ వచ్చిందంటే తేగలతో రోడ్లపైనా, ప్రధాన రహదాలు వెంబడి దుకాణాలను తెరుస్తారు. భూమిలో తయారైన తేగలను తవ్వి తీసి వాటిని ప్రత్యేక కుండలలో కాలుస్తారు. వాటిని తంపటి వేయడం అంటారు. ఇలా తంపటి వేస్తేనే అవి రుచిగా ఉంటాయి. రాత్రి తంపటి వేసిన తేగలను అలా కుండల నుంచి తీసి మంచులో ఉంచుతారు. అలా చేయడం వల్ల రుచితో పాటు ఆరోగ్యకారకంగా ఉంటాయి. ఉదయం వీటిని కట్టలుగా కట్టి విక్రయాలు చేస్తారు. సైజులుగా విభజించి కట్టలు కడతారు. సైజును బట్టి పది కట్ట రూ.50 నుంచి రూ.100 వరకూ విక్రయిస్తున్నారు. బుర్ర గుంజుకూ డిమాండ్ తేగలను పాతర నుంచి తీసే సమయంలో తేగ మొలవడానికి కారణమైన తాటి టెంక (బుర్ర) కూడా బయటకు వస్తుంది. ఆ టెంకలను కత్తితో బద్దలు కొట్టి దానిలో మెత్తగా ఉండే గుజ్జును కూడా బయటకు తీస్తారు. ఇది కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని ప్రత్యేక ప్యాకెట్లలో వేసి పావు కిలో రూ.50కి విక్రయిస్తున్నారు.ఆహా ఆరోగ్యం.. తేగలు గుండె జబ్బులు, డయాబెటిస్ ఇలా ఎన్నో సమస్యలకు చెక్ పెడతాయి. ఇవి కొలె్రస్టాల్‌ను తగ్గించి గుండె జబ్బులను దూరం చేస్తాయి. నోటి సమస్యలను తగ్గించడానికి కూడా ఉపయోగపడతాయి. జీర్ణ సంబంధిత వ్యాధుల నుంచి కాపాడతాయి. డయాబెటిస్తో బాధపడే వారు వీటిని తింటే డయాబెటిస్ నుంచి ఉపశమనం లభిస్తుంది. కాలేయానికి సంబంధించిన వ్యాధులు కూడా రాకుండా తాటి తేగలు మనకు ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. ఇన్ని ప్రయోజనాలను కలిగించే తాటి తేగలను ప్రతిరోజు క్రమం తప్పకుండా దొరికినప్పుడు ఒకటి చొప్పున తీసుకుంటే చాలా మంచిది. ఎటువంటి రసాయనాలు, ఎరువులు వాడకుండా పెరిగే ఈ తాటి తేగలు మంచి పోషకాహారంగా మనం చెప్పవచ్చు. వీటిల్లో ఉండే పీచు పదార్థం మన జీర్ణక్రియ సక్రమంగా జరగడానికి దోహదం చేస్తుంది. మన శరీరంలోని టాక్సిన్స్ బయటకు పంపించడానికి ఉపయోగపడుతుంది. బరువు తగ్గాలని భావించే వారికి తాటి తేగలు బాగా ఉపయోగపడతాయి. వీటిని తినడం వల్ల ఎముకల దృఢత్వం పెరుగుతుంది. ఇవి మహిళల్లో ఆస్టియోపోరోసిస్ సమస్య రాకుండా అడ్డుకుంటాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు తెల్లరక్త కణాలను పెంచి, వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. -
న్యూ ఇయర్ పార్టీ జోష్: ఫస్ట్ డే తలెత్తే హ్యాంగోవర్‌ని హ్యాండిల్ చేయండిలా..!
న్యూ ఇయర్(New year) ముందు రోజు (డిసెంబర్ 31) రాత్రంత కొత్త ఏడాదికి స్వాగతం పలికే సంబరాల్లో మునిగి తేలుతుంటారు. ఆట, పాట, మందు, విందు అంటూ పార్టీలతో పెద్దలు, కుర్రకారు మంచి జోష్‌తో ఎంజాయ్ చేస్తుంటారు. అర్థరాత్రి పన్నెండు దాక సెలబ్రేషన్స్ ఖుషీలో పరిమితికి మించి ఫుడ్‌ని హాంఫట్ చేసేస్తుంటారు. దీంతో నెక్ట్స్ డే మార్నింగ్ నుంచి మొదలవుతుంది తలంతా పట్టేసి హ్యాంగోవర్‌తో బాధడుతుంటారు. ఈ పరిస్థితి నుంచి ఓ పట్టాన బయటపడమేమో అన్నంతగా దాని ప్రతాపం చూపిస్తుంటుంది. ఒకటే తల బరువు, నొప్పితో తెగ బాధపడుతుంటారు చాలామంది. అలాంటి వాళ్లు దీన్నుంచి తేలికగా బయటపడాలంటే ఇలా చేయాలంటున్నారు ఆరోగ్య నిపుణులు అవేంటో చూద్దామా..కొందరు మిడ్నైట్ వరకు పార్టీల పేరుతో మందు పుచ్చుకుంటే..మరికొందరూ నచ్చిన ఫుడ్, కూల్‌డ్రింక్స్ లాగించేస్తుంటారు. అదీగాక అర్థరాత్రి వరకు మేల్కొనడంతో ఒక్కసారిగా ఈ సడెన్ ఛేంజ్‌ని మన శరీరం ఆకలింపు చేసుకోలేక ఎదురయ్యే పరిస్థితే ఈ హ్యాంగోవర్(Hangover) అని చెబుతున్నారు ఆరోగ్య నిపణులు. ముఖ్యంగా ఆల్కహాల్ సేవించే వాళ్లకు ఈ సమస్య మరింత త్రీవంగా ఉంటుందట. కొందరికి దీనివల్ల తలనొప్పి, తల తిరగడం, వాంతులు కావడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు. ఇలాంటప్పడు అలాంటి ఆహార పదార్థాలను తీసుకుంటే చక్కటి ఉపశమనం లభించడమే గాక చాలా సులభంగా దీన్నుంచి బయటపడతామని చెబుతున్నారు నిపుణులు. అవేంటంటే..హైడ్రేటింగ్ డ్రింక్స్హ్యాంగోవర్ నుంచి కోలుకోవడానికి, బాడీని హైడ్రేట్ చేసుకోవాలి, ఎలక్ట్రోలైట్లను రిస్టోర్ చేసుకోవాలి. దీని కోసం స్పోర్ట్స్ డ్రింక్స్, కోకోనట్ వాటర్, ఎలక్ట్రోలైట్-ఎన్హాన్స్డ్ డ్రింక్స్ వంటి కొన్ని డ్రింక్స్ తీసుకోవచ్చు. సోడియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఎలక్ట్రోలైట్లను కలిగి ఉన్న దోసకాయ నీరు, బచ్చలి నీళ్లు వంటి డ్రింక్స్ కూడా తాగుతుండాలి. వాటర్(Water) తాగొచ్చా అంటే..నీరు తాగవచ్చు కాకపోతే నెమ్మదిగా, చిన్న సిప్స్ మాత్రమే తీసుకోవాలి. అతిగా లేదా చాలా వేగంగా తాగితే, వాంతులు కావచ్చు. అలాగే, చాలా చల్లటి నీటిని తీసుకోకూడదు. గోరు వెచ్చని నీరు అయితే మంచి ఉపశమనంగా ఉంటుంది. విరేచనాలు లేదా వికారం ఉంటే..చప్పగా, సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తినవచ్చు. ముఖ్యంగా అరటి, రైస్, యాపిల్సాస్, టోస్ట్ వంటి ఫుడ్స్ తీసుకోవచ్చుపండ్లు(Fruits)హ్యాంగోవర్ నుంచి కోలుకోవడానికి పండ్లు తినొచ్చు. పండ్లలోని సహజసిద్ధమైన చక్కెరలు బాడీలో నుంచి ఆల్కహాల్నిగ ఎలిమినేట్ అయ్యలా చేస్తాయి. అలాగే హైడ్రేషన్‌ను, శక్తిని పెంచేలా విటమిన్లు, నీరు, పోషకాలు పండ్లలో సమృద్ధిగా లభిస్తాయి. మామిడిపండ్లు, ద్రాక్ష, నారింజ, బేరి, అరటిపండ్లు, పుచ్చకాయ హ్యాంగోవర్‌ను సమర్థవంతంగా దూరం చేయగలవు.వికారం తగ్గాలంటే..అల్లం హ్యాంగోవర్ వల్ల తలెత్తే వికారాన్ని పోగొడుతుంది. దీన్ని వివిధ రూపాల్లో తినవచ్చు లేదా తాగవచ్చు, కానీ జింజర్ ఆలే లేదా అల్లం బీర్ వంటి చక్కెర, జిగట డ్రింక్స్ సేవించకూడదు. బదులుగా పచ్చి అల్లంతో చేసిన గోరు వెచ్చని నీళ్లే మంచివి.. విటమిన్ ట్యాబెలెట్స్ వద్దు..వ్యక్తులు హ్యాంగోవర్లను నయం చేయడానికి విటమిన్ సప్లిమెంట్లను తీసుకుంటారు, కానీ అవి పని చేయవు. బదులుగా సాల్మన్ చేప ఒక గొప్ప ఎంపిక. ఇందులో B6, B12, అలాగే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి.తీసుకోకూడనవి..హ్యాంగోవర్‌ను నివారించడానికి(Prevention) బర్గర్లు, ఫ్రైస్, కాఫీ వంటి డ్రింక్స్ కొందరు తీసుకుంటుంటారు. వీటిని అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే ఈ ఫుడ్ ఐటమ్స్ హ్యాంగోవర్ మరింత తీవ్రతరం చేస్తాయి.(చదవండి: పాదాల నొప్పి తగ్గడానికి పొట్టలోని కొవ్వును ఇంజెక్ట్ చేస్తే చాలు!!) -
పోషకాల గని దేశీ వంగడాలు..!
రసాయనిక ఎరువులు వాడితేనే అధిక దిగుబడి ఇచ్చేలా ఆధునిక వంగడాలను తయారు చేస్తున్నారు. ఈ ఆధునిక వంగడాల్లో పోషకాలు గత 50 ఏళ్లలో సగానికి సగం తగ్గిపోయాయని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఎఆర్) అధ్యయనంలోనే తేలింది. అందువల్ల దిగుబడి తక్కువొచ్చినా పోషకాలతో కూడిన ఆహారోత్పత్తి కావాలనుకుంటే దేశీ వంగడాలే వాడుకోవాలి. రసాయనాలు వాడకుండా ఆరోగ్యదాయకమైన వ్యవసాయం చేయాలంటే అందుకు తగిన వనరులు సమకూర్చుకోవాలి. అందులో ముఖ్యమైనది అనువైన విత్తనం. ప్రకృతి/సేంద్రియ సేద్యానికి అనువైన విత్తనం దేశీ విత్తనమే. అందుకే ప్రభుత్వాలు కూడా ప్రకృతి వ్యవసాయంతోపాటు దేశీ వంగడాలను ప్రోత్సహిస్తున్నాయి. కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి ప్రకృతి సేద్యం చేపట్టిన దార్లపూడి రవి కూడా దేశీ విత్తన పరిరక్షణ కోసం విశేష కృషి చేస్తున్నారు. దేశీ వరి, చిరుధాన్యాలు తదితర పంటలకు సంబంధించి ఏకంగా 600 రకాల దేశవాళీ విత్తనాల సేకరణ, సాగు, అదనపు విలువ జోడించి ఆహార ఉత్పత్తుల తయారీ, విక్రయం.. ఈ పనులన్నీ ఆయన ఒక తపస్సులా చేసుకు΄ోతున్నారు. ఇతరులకు మార్గదర్శకంగా నిలుస్తున్న రవి అనుభవాలు ఆయన మాటల్లోనే.. ‘విజయనగరం జిల్లా రేగిడి ఆమదాలవలస మండలంలోని ఉంగరాడ మా గ్రామం. పోస్టు గ్రాడ్యుయేషన్ (పర్యావరణ శాస్త్రం) చదివాక ఓ సిమెంట్ కంపెనీలో ఎజీఎంగా ఉద్యోగం చేశాను. సెలవులకో, శుభకార్యాలకో వచ్చినప్పుడు బంధుమిత్రులు చాలామందిలో ఒక విషయం గమనించాను. అజీర్తి అనో, బీపీ అనో, గ్యాస్ట్రిక్ అనో భోజనం తగ్గించేసేవారు.ఏదో వంటలు బాగున్నాయని జిహ్వ చాపల్యం ఆపులేక కాస్త ఎక్కువగా తింటే మాత్ర వేసుకోవాల్సి వస్తుందని చెప్పేవారు. దీనికి కారణం పంటల రసాయనీకరణ. రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు పరిమితికి మించి రైతులు వాడేస్తుండటం చూశాను. ఈ పరిస్థితి మారాలంటే మళ్లీ పూర్వపు ప్రకృతి వ్యవసాయమే సరైనదని భావించాను.అమ్మానాన్నలను దగ్గరుండి చూసుకోవాలని కూడా మనసు చెబుతుండటంతో ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంటికి తిరిగొచ్చేశా. మాది వ్యవసాయ కుటుంబం. రెండున్నర ఎకరాల భూమి ఉంది. పూర్తిగా వర్షాధారం. అందులో కొంతమేర మామిడి తోట ఉంది. అంతరపంటగా పెసలు, ఉలవలు, నువ్వులు సాగు చేస్తున్నాను. దాదాపు ఎకరా భూమిలో అరుదైన సంప్రదాయ వరి రకాలను సాగు చేస్తున్నాను. అవన్నీ పూర్తిగా విత్తనాల కోసమే. ఉత్తరాంధ్రలో పలువురు రైతులకు వాటిని ఇచ్చి సాగు చేయిస్తున్నా. తెలుసుకుంటూనే ‘సాగు’తూ..పదేళ్ల క్రితం కాకినాడలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణా శిబిరంలో సుభాష్ పాలేకర్ చెప్పిన పద్ధతులను ఆచరణలో పెట్టాను. 80 సెంట్లలో వరి నాటాను. మామిడి తోటలో అంతర పంటగా పసుపు పెట్టాను. 30 సెంట్ల భూమిలో 30 కిలోల కస్తూరి పసుపు విత్తనం పెడితే 300 కిలోల పంట చేతికొచ్చింది. ఎండబెడితే 180 కేజీల పసుపు వచ్చింది. కొర్రలు వేస్తే మంచి దిగుబడి వచ్చింది. ఆ ఉత్సాహంతో ఐదేళ్ల క్రితం నుంచి మూడెకరాలు కౌలుకు తీసుకొని వరి, కొంతమేర కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తున్నాను. దేశవాళీ పంటల తియ్యదనం...ఒకప్పుడు దేశవాళీ టమాటాను చూస్తే నోరూరేది. ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్న హైబ్రిడ్ టమాటా వంటకు తప్ప తినడానికి చప్పగా ఉంటోంది. అన్ని పంటలదీ అదే పరిస్థితి. ఇది మారాలంటే దేశవాళీ పంటల తియ్యదనం మళ్లీ తెచ్చుకోవాలి. అందుకే దేశవాళీ విత్తనాల సేకరణ ఒక అలవాటుగా మార్చుకున్నాను. 2016 నుంచి ప్రామాణిక పద్దతి ప్రకారం వరి విత్తనాలను సేకరించి, సంరక్షిస్తున్నాను. ప్రతి విత్తన రకానికి ఒక రికార్డు కూడా నిర్వహిస్తున్నా. సంప్రదాయ వరి విత్తనాలే గాకుండా కూరగాయలు, ఆకు కూరలు, అపరాల విత్తనాలు సేకరించాను. ఔషధ మొక్కలను, విత్తనాలనూ సేకరిస్తున్నాను. వరి వంగడాల్లో ముఖ్యంగా ఎర్రబుడమలు (రెడ్ రైస్), నెల్లూరు మొలకలు విత్తనాలు సేకరించాను. అరుదైన రాజుల చిక్కుడు (ఎరుపు, తెలుపు రంగులో ఉండే విత్తనం), తొక్క తీయకుండా వండుకోవడానికి వీలయ్యే గుత్తి బీర విత్తనాలు కూడా ఉన్నాయి.ఒడిశా నుంచి తెచ్చిన శీలావతి, గాయత్రి అనే వరి విత్తనాలు, కెంపుసన్నా అనే బాస్మతి రకం విత్తనాలను కర్ణాటకలో సేకరించాను. గోదావరి ఇసుకరవ్వలు అనే రకం కూడా అన్నం వండుతుంటే మంచి సువాసన వస్తుంది. ఈ విత్తనాలనూ మూడేళ్ల నుంచి అభివృద్ధి చేస్తున్నాను. ఇలా సంప్రదాయ వరి రకాలు, చిరుధాన్యాలు కలిపి దాదాపు ఆరొందల రకాల విత్తనాలు ఇప్పటివరకూ సేకరించగలిగాను. వీటిలో చాలావరకూ తూర్పు కనుమల్లో పలువురు రైతులకు ఇచ్చి ప్రయోగాత్మకంగా సాగు చేయిస్తున్నాను. ఈ ప్రాంతంలో వ్యవసాయక జీవవైవిధ్యాన్ని ప్రోదిచేయడానికి ఈ ప్రయత్నం దోహదపడుతుందనేది నా విశ్వాసం. విత్తనాల సంరక్షణా ఓ సవాలే...దేశవాళీ విత్తనాల సంరక్షణా ఒక సవాలు వంటిదే. పూర్వం వెదురుబుట్టల్లో, కుండల్లో విత్తనాలు భద్రపరిచేవారు. ముందుగా కాపుకొచ్చిన మొక్కజొన్న కంకులు, బీరకాయలు, సొరకాయలు, బెండకాయలు ప్రత్యేకంగా వేరుచేసి విత్తనాల కోసం వసారాలో వేలాడగట్టేవాళ్లు. ఆ విధానాలన్నీ ఇప్పుడు విత్తనాల నిల్వ కోసం పాటిస్తున్నాం. ఇలా ఓ సీడ్ బ్యాంక్‌ను నిర్వహించడానికి ఒక ఎన్జీవోను ప్రారంభించాను. దేశీయ పంటలకు విలువ పెంచేలా చిరుధాన్యాలు, పప్పుధాన్యాలతో గానుగ నూనె, బిస్కెట్లు, స్నాక్స్ తయారు చేయించి విక్రయిస్తున్నాం..’(– దార్లపూడి రవి మొబైల్: 86394 56848)– అల్లు సూరిబాబు, సాక్షి ప్రతినిధి, విజయనగరంఫోటోలు: డి.సత్యనారాయణమూర్తి (చదవండి: నాటు కోళ్లతో మంచి ఆదాయం ఆర్జిస్తున్న యువజంట..) -
సొట్ట బుగ్గల సుందరి ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
స్టార్ హీరోయిన్గా బాలీవుడ్‌ను ఏలిన అందాల తార ప్రీతి జింటా(Preity Zinta). యాపిల్బ్యూటీగా, డింపుల్ గర్ల్‌గా పాపులర్ అయిన నటి. ఆమె అందమైన నవ్వు, సొట్టబుగ్గలంటే అప్పట్లో కుర్రకారుకి ఒక వ్యామోహం. అంతేగాదు బాలీవుడ్లో మంచి సినిమాలతో సక్సెస్‌ని అందుకున్న అగ్రనటి. ఆమె టాలీవుడ్లో కూడా ప్రిన్స్ మహేష్ బాబు, విక్టరీ వెంటేష్ల సరసన నటించి బ్యూటీఫుల్ హిరోయిన్‌గా మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి పంజాబ్‌కింగ్స్ కో ఓనర్‌గా వ్యవహరిస్తూ ఐపీఎల్ మ్యాచ్‌ల్లో తళుక్కుమని.. అభిమానులను ఖుషీ చేస్తుంటుంది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఓ మంచి సినిమాతో బాలీవుడ్లో రీ ఎంట్రీ ఇస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఆమెకు దగ్గరదగ్గరగా 50 ఏళ్లు ఉంటాయి. అయినా ఇప్పటకీ అంతే అందం, గ్లామర్‌తో కట్టిపడేస్తుంది. అంత అందం వెనుకున్న సీక్రెట్ ఏంటంటే..ఏవయసులోనైనా అంతే అందంగా, గ్లామర్‌గా ఉండొచ్చు అనేందుకు ప్రేరణ ప్రీతి జింటా(Preity Zinta). ఈ ఏడాది ప్రారంభంలో వోగ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వన్నె తరగని అందం రహస్యం గురించి షేర్ చేసుకుంది. తాను క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుతానని చెప్పారు. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తానని, అలాగే తీసుకునే ఆహారంపై కూడా దృష్టిపెడతానని తెలిపారు. తాను పైలేట్స్(Pilates)కి అభిమానిని అని చెప్పారు. వర్కౌట్(workouts)ల విషయంలో రాజీ ప్రసక్తే లేదంటోంది ప్రీతి. బాడీని మంచి ఆకృతిలో ఉంచేవి పైలెట్స్ అని, అందుకే ఇది చేయడం అంటే మహా ఇష్టం అంటోంది. ఇది తన కండరాలను బలోపేతం చేస్తుందని చెబుతోంది. దీంతోపాటు నిద్ర కూడా చాలా ముఖ్యం అంటోంది. పనికంటే తగిన నిద్ర ఉంటేనే రోంతా యాక్టివ్‌గా ఉండగలం. పైగా ఆరోగ్యం బాగుటుందని నమ్మకంగా చెబుతోంది. నోటిని అదుపులో పెట్టుకున్నవాళ్లు కచ్చితంగా అందంగా ఉంటారని చెబుతోంది. ఏ పదార్థం పడితే అది ఇష్టంతో డైట్‌ని బ్రేక్ చేయకూడదని హెచ్చరిస్తోంది. ముఖ్యంగా కేలరీలు తీసుకోవడంలో సరైన స్ప్రుహ ఉండాలంటోంది. రోజూ మొతంలో సరైన ఆహారం తీసుకోవాంటే ఈ నాలుగు చిట్కాల(Tips)ను తప్పనిసరిగా పాటించమని చెబుతోంది. అవేంటంటే..హడావిడిగా, నుంచొని అస్సలు తొనొద్దు. ఆకలిపై శ్రద్ధ పెట్టి నిధానంగా తినవల్సినంత మేర తినాలి. మైండ్‌ఫుల్‌గా తినాలి. ఒకవేళ మూడ్ బాగోకపోయినా సరే ఆహారం చూడగానే మనసు ఆటోమెటిగ్గా మారాలి ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచన రావాలి. నెమ్మదిగానే తినాలి. ముఖ్యంగా బాగా నమిలి తినాలి. ఇలా చేస్తే అతిగా తినడాన్ని నిరోధించగలుగుతాం వారానికి ఒక్కసారైనా ఒంటరిగా తినండి. ఎందుకంటే ఇతరులతో కలిసి తినడం వల్ల తెలియకుండా వారితో ప్రభావితమై ఎక్కువగా తినే అవకాశం ఉంటుందట. అందుకని అప్పడప్పుడూ ఇలా ప్లాన్ చేస్తే డైట్ అదుపులో ఉండే అవకాశం ఉంటుంది. పైగా ఫిట్‌గా ఆరోగ్యంగా ఉంటాం అని చెబుతోంది అందాల భామ ప్రీతి జింటా. View this post on Instagram A post shared by Preity G Zinta (@realpz) (చదవండి: దటీజ్ మధురిమ బైద్య..! మైండ్‌బ్లాక్ అయ్యే గెలుపు..) -
ముగ్గులో దాగున్న ఆరోగ్య రహస్యం, సైన్సు ఏంటో తెలుసా..!
ఈ ముగ్గుల సంస్కృతి ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల్లో ఉంది. కాకపోతే ఒక్కోభాషలో ఒక్కో పేరుతో దీన్ని పిలుస్తారు. తెలుగులో ముగ్గులు అంటాం. కన్నడలో రంగోలి అంటారు. తమిళం-మళయాళంలో కోలం, బెంగాల్లో అల్పన, రాజస్థాన్‌లో మండన, సంస్కృతంలో మండల వంటి పేర్లుతో పిలుస్తారు. ఏ పేరుతో పిలిచినా.. అందరూ అందంగా తీర్చిదిద్దేది రంగవల్లులే. పండుగలతో సంబంధం లేకుండా ప్రతి తెలుగింటి లోగిళ్లలో తప్పనిసరిగా ముగ్గు వేయడం పరిపాటి. ఇది అనాదిగా వస్తున్న ఆచారం లేదా సంస్కతిగా చెబుతారు పెద్దలు. అయితే ఇలా ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్దడంలో దాగున్న ఆరోగ్య రహస్యం, సైన్సు ఏంటో చూద్దామా ఏంటో చూద్దామా..!ముత్యాల ముగ్గులోని శాస్త్రీయ కోణం..ముగ్గులని ప్రాచీన ఖగోళశాస్త్రంగా చెబుతుంటారు. పూర్వం ఆర్యభట్ట ఖగోళాన్ని అధ్యయనం చేసేందుకు ముగ్గుల రూపంలో నేలమీద చిత్రించాడట. అప్పటినుంచే ఖగోళశాస్త్ర రహస్యాలకు ప్రతీకగా చుక్కలు పెట్టడం, వాటిని వివిధ ఆకారాల్లో కలపడం ద్వారా ముగ్గులను వేస్తున్నారని నానుడి. జ్యోతిషంలో కనిపించే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, రాశుల చిహ్నాలూ ముగ్గుల్లో కనిపిస్తాయి. గృహవాస్తు, ఆలయవాస్తు, నగర నిర్మాణాల్ని తెలిపే రంగవల్లులూ ఉన్నాయంటున్నారు నిపుణులు. వైద్యశాస్త్రం కూడా ఉందట..రంగవల్లిలో కిందికి చూపించే త్రిభుజాలు స్త్రీలనీ, పైకి చూపించే త్రిభుజాలు పురుషులనీ, ఈ రెంటినీ కలపడం ద్వారా గీసిన ఆరు కోణాల నక్షత్రం స్త్రీ, పురుషుల కలయికకు సంకేతమనీ నమ్ముతారు. ముగ్గులోని కలుగపువ్వు గర్భాన్ని సూచిస్తుందట. నేటి కంప్యూటేషనల్ ఆంత్రోపాలజీ పరిశోధనలకీ ముగ్గు ఉపయోగపడుతుంది. ముగ్గుల్లోని గణిత సూత్రాలను అధ్యయనం చేసేందుకు ఆల్గారిథమ్స్‌ను రూపొందించి, వాటిని బొమ్మలు గీసే కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌లోనూ వాడుతున్నారట. అంతేగాదు సంక్లిష్టమైన ప్రొటీన్ నిర్మాణాల్ని అర్థం చేసుకునేందుకూ ఈ ముగ్గులు తోడ్పడతాయని నిపుణులు చెబుతున్నారు.ముగ్గులో గమ్మతైన గణితం..ఈ ముగ్గులో తీరుగా పెట్టే చుక్కలు లెక్కలపట్ల ఆసక్తిని పెంచితే కలపడం వల్ల గణితం తేలికగా అర్థమవుతుందట. ఉదాహరణకు చుక్కలు పెడుతూ సరి, బేసి సంఖ్యలు నేర్చుకోవచ్చు. చుక్కలు...అంక గణితమైతే, వాటిని కలపడం సమితులు. నిజం చెప్పాలంటే ముగ్గులు మేధస్సుకి సవాలుగా నిలుస్తాయి. అంతేగాదు పిల్లల మెదడు వృద్ధి చెందడానికి మొదటి ఏడు సంవత్సరాలూ కీలకం. ఆ సమయంలో వారికి తేలికపాటి ముగ్గులు నేర్పిస్తే వాళ్లలో నైపుణ్యాలు మెరుగుపడతాయని నిపుణులు చెబుతున్నారుఆరోగ్య ప్రయోజనం..ముగ్గు వేయడం అనేది మహిళలకు మంచి వ్యాయామం లాంటిది. వంగి లేవడం కారణంగా.. వాళ్లకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవని.. అందుకే పెద్దలు రోజూ ఇంటి ముందు ముగ్గు వేసే సంప్రదాయం తీసుకొచ్చారని అంటారు.చేతులు, కాళ్లను చుక్కలకు, గీతలకు అనుగుణంగా అటూఇటూ తిప్పడం వల్ల వారి జీర్ణక్రియ, పునరుత్పత్తి అవయవాలకు చక్కిని మసాజ్‌లా ఉపకరిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే, జాయింట్లు, వెన్నెముక, పూర్తి శరీరానికి వ్యాయాయం తద్వారా బలం చేకూరుతుంది. ముగ్గులు వేసే మహిళల మెదడు చాలా చురుగ్గా పని చేస్తుందట. మహిళలకు ఇది శారీరక వ్యాయామంతో పాటు మానసిక వ్యాయామంలా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.అంతేగాదు ముగ్గులు వేయడం వల్ల మంచి శరీరాకృతిని కలిగి ఉంటారట.శరీరాన్నీ మనస్సునూ ఒకేచోట కేంద్రీకృతం చేస్తూ వేసే ముగ్గు ఏకాగ్రతను పెంచే దివ్యమైన మెడిటేషన్‌గా చెబుతున్నారు. ఇది రక్తప్రసరణను మెరుగుపరుస్తుందట. ఎక్కడో చూసి.. ఎప్పుడో నేర్చిన ముగ్గుల్ని గుర్తుతెచ్చుకుంటూ వేయడంవల్ల ధారణశక్తి మెరుగవుతుందట. దీనివల్లే మహిళలకు ఏకాగ్రత, ఓర్పు అలవడుతాయట.అదీగాక ఉదయాన్నే ముగ్గు వేస్తారు కాబట్టి..స్వచ్ఛమైన గాలిని పీల్చడం జరుగుతుంది. అందువల్ల మహిళలు ఇలా వాకిట ముగ్గులు వేయడం వల్ల ఆరోగ్యపరంగా ఎంతో మేలని అంటున్నారు ఆరోగ్య నిపుణలు. అలాగే చాలామంది ముగ్గుగా బియ్య పిండిని ఉపయోగిస్తారు. ఇది పక్షులు పావురాలు, చీమలు, పిచ్చుక, కాకితో పాటు ఇతర కీటకాల కడుపు నింపేందుకు ఉపయోగపడుతుంది. ఆధ్యాత్మిక పరంగానూ, ఆరోగ్య పరంగానూ ఎన్నో ప్రయోజనాలందించే రంగవల్లికలను శోభాయమానంగా తీర్చిదిద్దుదాం..ఆరోగ్యంగా ఉందాం. (చదవండి: ఇలాంటి డైట్ గురించి తెలిసే ఛాన్సే లేదు..! కానీ ఒక్క ఏడాదిలోనే 50 కిలోలు..) -
టీ బ్యాగ్‌లు ఉపయోగిస్తున్నారా..? తస్మాత్ జాగ్రత్త..!
ఇటీవల కాలంలో సరికొత్త రెడీమేడ్ పుడ్స్ ప్రిపరేషన్లు వచ్చాయి. అలాంటి వాటిలో టీ బ్యాగ్‌లు కూడా ఒకటి. చక్కగా వీటిని వేడివేడి పాలల్లో లేదా వేడినీళ్లలో ముంచితే చాలు మంచి టీ రెడీ అయిపోతుంది. మనం కూడా హాయిగా సిప్ చేసేస్తున్నాం. ఇలాంటివి ఎక్కువగా జర్నీల్లో లేదా కార్యాలయాల్లో సర్వ్ చేస్తుంటారు. ఐతే ఇలా టీ బ్యాగ్‌లతో రెడీ అయ్యే టీని అస్సలు తాగొద్దని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇది ఆరోగ్యానికి అత్యంత హానికరమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు పరిశోధకులు. తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. బార్సిలోనా అటానమస్ యూనివర్సిటి పరిశోధకులు జరిపిన అధ్యయనంలో టీ బ్యాగ్‌లు(Tea Bags) బిలియన్ల కొద్దీ హానికరమైన మైక్రోప్లాస్టిక్‌లను(Microplastics) విడుదల చేస్తాయి తేలింది. వారి పరిశోధన ప్రకారం..ఆహార ప్యాకేజింగ్(Food Packaging)అనేది సూక్ష్మ నానోప్లాస్టిక్(Mono Plastic)లకు మూలం. ఇది కాలుష్యానికి, మానవ ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని అన్నారు. ముఖ్యంగా టీ బ్యాగ్ బయటి పొరలో ఉపయోగించే పదార్థం ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని చెప్పారు. "మనం ఈ టీ బ్యాగ్‌లతో తయారైన టీని సిప్ చేయగానే.. అత్యంత సూక్ష్మమైన ప్లాస్టిక్ కణాలు లోనికి వెళ్లిపోతాయి. వాటిని శరీరంలోని ప్రేగు కణాలు గ్రహిస్తాయి. అక్కడ నుంచి రక్తప్రవాహంలోకి చేరుకుని శరీరం అంతటా వ్యాపిస్తాయి." అని చెప్పారు. ఈ మోనో ప్లాస్టిక్ కణాలను అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి విజయవంతంగా వర్గీకరించారు పరిశోధకులు. అంతేగాదు ఈ టీ బ్యాగ్‌ల ద్వారా నానో పరిమాణంలో ఉండే ప్లాస్టిక్ అవశేషాలు, దాని తాలుకా కణాలు విడుదలవుతాయని గుర్తించారు. ముఖ్యంగా పాలిమర్-ఆధారిత పదార్థంతో తయారు చేసిన వాణిజ్య టీ బ్యాగ్‌లు మరింత ప్రమాదకరమని అన్నారు. నిజానికి ఈ టీ బ్యాగ్‌లు నైలాన్-6, పాలీప్రొపైలిన్, సెల్యూలోజ్లతో తయారు చేస్తారు. మనం ఎప్పుడైతో ఈ టీ బ్యాగ్‌లను వేడి నీరు లేదా పాల్లో ముంచగానే..ఇందులోని పాలీప్రొఫైలిన్ ఒక మిల్లీలీటర్‌కు సుమారుగా 1.2 బిలియన్ కణాలను విడుదల చేయగా, సెల్యులోజ్ ఒక మిల్లీలీటరుకు 135 మిలియన్ కణాలను, అలాగే నైలాన్-6 ఒక మిల్లీలీటర్‌కు 8.18 మిలియన్ కణాలను విడుదల చేస్తాయని వెల్లడించారు. ఈ పరిశోధన ప్లాస్టిక్ మానవ ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావాలు కలుగజేస్తాయనే దిశగా చేసే పరిశోధనలకు కీలకంగా ఉంటుందన్నారు. (చదవండి: భారత్‌లోని తొలి విడాకుల కేసు..! ఏకంగా క్వీన్ విక్టోరియా జోక్యంతో..) -
Year Ender 2024: దుమ్మురేపిన 100 మంది డిజిటల్ స్టార్స్..
2024లో భారత్ డిజిటల్ విప్లవంలో అనూహ్య పురోగతిని సాధించింది. క్రియేటర్లు తమ కంటెంట్‌తో ఇన్‌స్టాతో పాటు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించారు. అలాగే కొత్తగా పలువురు డిజిటల్ స్టార్లు పుట్టుకొచ్చారు. భారత్‌కు చెందిన కంటెంట్ సృష్టికర్తలను ఫోర్బ్స్ కూడా ప్రశంసించింది.2024లో 100 మంది కంటెంట్ క్రియేటర్లు ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించారు. గత అక్టోబర్‌లో ఫోర్బ్స్ ఇండియా టాప్ 100 భారత్ డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్ల జాబితాను విడుదల చేసింది. వీరిలో క్రియేటర్ నాన్సీ త్యాగి అందించిన ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టయిల్ అందరి దృష్టిని ఆకర్షించింది. అలాగే ఈ ఏడాది చాలా మంది కామెడీ క్రియేటర్లు సోషల్ మీడియాలో తమదైన ముద్రవేశారు. ఫ్యాషన్, కామెడీ క్రియేటర్లు మాత్రమే కాకుండా ఆరోగ్యం, సాంకేతికత, ట్రావెల్ క్రియేటర్లు కూడా ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నారు.ఫోర్బ్స్ టాప్ 100 డిజిటల్ స్టార్స్ వీరే..1 నాన్సీ త్యాగి (ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్))2 సాక్షి కేశ్వాని (కామెడీ)3 డానీ పండిట్ (కామెడీ)4 ధారణ దుర్గా (హాస్యం)5 మహేష్ కేశ్వాల (కామెడీ)6 హర్షిత గుప్తా (కామెడీ)7 రాజవర్ధన్ గ్రోవర్ (కామెడీ)8 అపూర్వ ముఖిజా (కామెడీ)9 తారిణి పెషావారియా (బ్యూటీ)10 కిరణ్ దత్తా (కామెడీ)11 మితికా ద్వివేది (కామెడీ)12 సబా ఇబ్రహీం (ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్) 13 శృతిక్ కోలంబకర్ (కామెడీ)14 మృదుల్ శర్మ (ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్) 15 రేవంత్ హిమత్సింకా (ఆరోగ్యం)16 రాహుల్ డ్యూ (కామెడీ)17 యువరాజ్ దువా (కామెడీ)18 కరిష్మా గాంగ్వాల్ (కామెడీ)19 త్రినేత్ర హల్దార్ గుమ్మరాజు (చేంజ్ మేకర్)20 రాకేష్ కుమార్ (టెక్నాలజీ)21 కరణ్ సోనావానే (కామెడీ)22 రాశి ప్రభాకర్ (ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్)23 అంకితా సెహగల్ (కామెడీ)24 సిద్ధార్థ్ బాత్రా (ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్)25 అర్జున్ మనోహర్ (కామెడీ)26 అనుజ్ దత్తా (ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్)27 స్వాతి రాతి (ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్)28 జీత్ సెలాల్ (ఆరోగ్యం)29 తాన్యా సింగ్ (బ్యూటీ)30 భారత్ వాధ్వా (ఆహారం)31 పూజా చాంద్వానీ (ఆహారం)32 కరణ్ ధింగ్రా (ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్)33 అంకుష్ బహుగుణ (బ్యూటీ)34 షాజ్ జంగ్ (ట్రావెల్ అండ్ ఫోటోగ్రఫీ)35 నబీల్ నవాబ్ (టెక్నాలజీ)36 ధృవ్ షా అండ్ శ్యామ్ శర్మ (కామెడీ)37 సమీనా మరియం (టెక్నాలజీ)38 అనునయ్ సూద్ (టావెల్ అండ్ ఫోటోగ్రఫీ)39 జెర్వాన్ బున్‌షా (కామెడీ)40 నిహారిక ఎన్ఎమ్ (కామెడీ)41 కోమల్ పాండే (ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్)42 విజయ్ యేనారెడ్డి (టెక్నాలజీ)43 అల్ఫియా కరీం ఖాన్ (బ్యూటీ)44 సోమశేఖర్ ఎం. పాటిల్ (టెక్నాలజీ)45 విరాజ్ ఘేలానీ (కామెడీ)46 దీబా రాజ్‌పాల్ (ఆహారం)47 జై కపూర్ (బిజినెస్ అండ్ ఫైనాన్స్)48 అశ్విన్ ప్రభాకర్ (ఆహారం)49 తేజ పుచూరి (ఆహారం)50 నిఖిల్ శర్మ (ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్)51 చేతన్య ప్రకాష్ (ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్)52 హర్జాస్ సేథి (కామెడీ)53 కింకర్ రే (టెక్నాలజీ)54 షానైస్ (ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్)55 రెబెక్కా రాయ్ అండ్ గౌతమ్ ఇలాంభారతి (ట్రావెల్ అండ్ ఫోటోగ్రఫీ)56 శివభుజితన్ అండ్ స్వర్ణలక్ష్మి శ్రీనివాసన్(ఆహారం) 57 బృందా శర్మ (ట్రావెల్ అండ్ ఫోటోగ్రఫీ)58 నందు పాటిల్ (టెక్నాలజీ)59 గౌరవ్ చౌదరి (టెక్నాలజీ)60 ఉమా రఘురామన్ (ఆహారం)61 ఆకాంక్ష మోంగా (ట్రావెల్ అండ్ ఫోటోగ్రఫీ)62 ఇస్సా ఖాన్ (ట్రావెల్ అండ్ ఫోటోగ్రఫీ)63 ఆదిత్య వెంకటేష్ (ట్రావెల్ అండ్ ఫోటోగ్రఫీ)64 శ్రీమణి త్రిపాఠి (టెక్నాలజీ)65 ఆకాష్ మల్హోత్రా (ట్రావెల్ అండ్ ఫోటోగ్రఫీ)66 యష్ తివారీ (టెక్నాలజీ)67 శ్రీమయి రెడ్డి (బ్యూటీ)68 నమన్ దేశ్‌ముఖ్ (టెక్నాలజీ)69 సారా హుస్సేన్ (ఆహారం)70 జై అరోరా (టెక్నాలజీ)71 కరీనా టెక్వానీ (బ్యూటీ)72 స్నేహ సింఘీ ఉపాధ్యాయ్ (ఆహారం)73 అనుష్క రాథోడ్ (బిజినెస్ అండ్ ఫైనాన్స్)74 లక్ష్య ఠాకూర్ (ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్)75 శివేష్ భాటియా (ఆహారం)76 షాలిని కుట్టి (బ్యూటీ)77 అక్షత్ శ్రీవాస్తవ (బిజినెస్ అండ్ ఫైనాన్స్)78 అమీర్ వానీ (ట్రావెల్ అండ్ ఫోటోగ్రఫీ)79 తనయ నరేంద్ర (హెల్త్)80 నవనీత్ ఉన్నికృష్ణన్ (ట్రావెల్ అండ్ ఫోటోగ్రఫీ)81 కాస్లిన్ నహా (బిజినెస్ అండ్ ఫైనాన్స్)82 వాహిని అరుణ్ (ఆరోగ్యం)83 అషర్ (చేంజ్‌మేకర్)84 కోమల్ గుడాన్ (ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్)85 మోహిత్ బలానీ (టెక్నాలజీ)86 ఆకాంక్ష కొమ్మిరెల్లి (బ్యూటీ)87 కనిష్క్ అగర్వాల్ (టెక్నాలజీ)88 వైభవ్ కేశ్వాని (ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్)89 ఉజ్వల్ పహ్వా(బిజినెస్ అండ్ లైఫ్ స్టైల్)90 సీతారామన్ (టెక్నాలజీ)91 సాహిల్ గులాటి (ట్రావెల్ అండ్ ఫోటోగ్రఫీ)92 మల్హర్ కలంబే (చేంజ్ మేకర్)93 శివమ్ పాట్లే (టెక్నాలజీ)94 శరణ్ హెగ్డే(బిజినెస్ అండ్ లైఫ్ స్టైల్)95 సన గలార్ (ఆరోగ్యం)96 కుశాల్ లోధా (బిజినెస్ అండ్ ఫైనాన్స్)97 మహి శర్మ (ట్రావెల్ అండ్ ఫోటోగ్రఫీ)98 రూహి దోసాని (కామెడీ)99 నిధి తివారీ (చేంజ్ మేకర్)100 అనుజ్ రామ్త్రి (చేంజ్ మేకర్)2024లో కొత్త క్రియేటర్లు కూడా డిజిటల్ ప్రపంచంలో తమ ప్రభావాన్ని చూపారు. వీరు తమ సృజనాత్మకతతో ప్రజలను ప్రభావితం చేస్తున్నారు. భారతదేశంలో సాంకేతిక పురోగతి , డిజిటలైజేషన్ వేగంగా జరుగుతున్నందున కంటెంట్ క్రియేటర్లకు తమ ప్రతిభ చాటుకునే అవకాశం దక్కుతోంది. ఈ ఏడాది ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్న డిజిటల్ స్టార్స్ మరింతమంది కొత్త కంటెంట్ క్రియేటర్లకు స్ఫూర్తినిస్తున్నారు.ఇది కూడా చదవండి: World Year Ender 2024: హద్దులు దాటిన విమర్శలు.. వివాదాల్లో రాజకీయ ప్రముఖులు -
'ఉసిరి టీ' గురించి విన్నారా? బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
ఇంట్లోనే యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ ఉండే టీని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎన్నో రకాల హెర్బల్ టీలు విని ఉంటారు. ఈ టీ గురించి అస్సలు విని ఉండరు. గ్రీన్ టీకి మించి ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. ఇంతకీ ఆ టీ ఏంటనే కదా..మనం ఎంతో ఇష్టంగా పచ్చళ్లు పట్టుకునే తినే ఉసిరితో ఈ టీ తయారు చేస్తారు. దీని తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.కావాల్సినవి: ఉసిరి, చూర్ణంపుదీనా ఆకులు-4అల్లం-1 అంగుళం -క్యారమ్ విత్తనాలుతయారు చేయు విధానం..ఒక గ్లాస్ నీటిని మరిగించి..అందులో పైన చెప్పిన పదార్థాన్నీ వేసి కాసేపు తిరగబడనివ్వాలి. ఆ తర్వాత వడకట్టండి అంతే అదే ఉసిరి టీ. ప్రయోజనాలు..గుండె ఆరోగ్యానికి మంచి ఔషధం. వృద్ధాప్యాన్ని దూరం చేస్తుంది. ఇందులో మొత్తం పది యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. గ్రీన్ టీ కంటే మెరుగైన ప్రయోజనాలను అందిస్తుందట. వివిధవ్యాధుల బారిన పడకుండా రక్షిస్తుంది. గ్రీన్ టీ కంటే ఇదే మంచిదా..?పులుపు పడని వాళ్లు దీన్ని తీసుకోకపోవడమే మంచిది. ఇది యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్. ఈ రెండు కూడా ఆరోగ్యానికి మంచివే. తీసుకునే మోతాదును బట్టి ప్రభావం ఉంటుందని చెబుతున్నారు.(చదవండి: మేకప్ వేసుకుంటున్నారా..? ఈ పొరపాట్లు చెయ్యకండి..) -
గట్ హెల్త్‌పై దృష్టి పెడదాం..ఆరోగ్యంగా ఉందాం..!
ఇంటిగ్రేటెడ్ హెల్త్‌కేర్ సొల్యూషన్స్ మహిళల గట్ హెల్త్ కోసం పిలుపునిచ్చింది. అందుకోసం సెలియక్ సొసైటీ ఆఫ్ ఇండియా హాబిటాట్ సెంటర్లోని అపోలో హాస్పిటల్స్ సహకారంతో వివిధ విభాగాలకు చెందిన ప్రముఖ నిపుణులతో ఇల్నెస్ టు వెల్నెస్ అనే ప్రోగ్రామ్ నిర్వహిచింది. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన నిపుణులచే గట్ హెల్త్‌పై అవగాహన కల్పించేలా 'గట్ మ్యాటర్స్- ఉమెన్స్ హెల్త్ అండ్ గట్ మైక్రోబయోమ్' అంశంపై సెమినార్ని నిర్వహించింది. ఆరోగ్య సమస్యలకు మూలం..ఆ సమావేశంలో హర్మోన్ల అసమతుల్యత, సంతానోత్పత్తి, పీసీఓఎస్ వంటి దీర్ఘకాలిక పరిస్థితులుపై గట్ మైక్రోబయోమ్ ప్రభావం గురించి చర్చించారు. అలాగే మహిళ తరుచుగా ఎదుర్కొన్నే ఆరోగ్య సమస్యలపై కూడా దృష్టిసారించారు. ఈ సెమినార్లో పాల్గొన్న క్లినికల్ న్యూట్రిషనిస్ట్ ఇషి ఖోస్లా, డాక్టర్ అర్జున్ డాంగ్, డాక్టర్ డాంగ్స్, డాక్టర్ హర్ష్ మహాజన్, ఇండియన్ కోయలిషన్ ఫర్ కంట్రోల్ ఆఫ్ అయోడిన్ డెఫిషియెన్సీ డిజార్డర్ (ICCIDD) అధ్యక్షుడు, పద్మశ్రీ గ్రహీత డాక్టర్ చంద్రకాంత్ పాండవ తదితరాలు మహిళల ఆరోగ్యంలో కీలక పాత్ర పోషించే గట్ హెల్త్ సంరక్షణ గురించి నొక్కి చెప్పారు. అంతేగాదు సమాజంలో ముఖ్యపాత్ర పోషించే మహిళల ఆరోగ్యంపై దృష్టిసారించాల్సిన ప్రాముఖ్యతను గురించి కూడా హైలెట్ చేశారు. అలాగే మహిళల ఆరోగ్యంలో గట్ హెల్త్ అత్యంత కీలకమైనదని అన్నారురు. ఇది హర్మోన్లు, సంతానోత్పత్తి, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని చెప్పారు. మహిళలకు సంబంధించిన ప్రశూతి ఆస్పత్రులు లేదా ఆరోగ్య క్లినిక్స్‌లో దీనిపై అవగాహన కల్పించాలన్నారు. ఈ గట్ ఆరోగ్యం అనేది వైద్యపరమైన సమస్య కాదని మొత్తం కుటుంబాన్నే ప్రభావితం చేసే సమస్యగా పేర్కొన్నారు. సెలియక్ సొసైటీ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఇల్నెస్ టు వెల్నెస్ ప్రోగ్రామ్‌లో తాను పాలుపంచుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు ఆస్కామ్ నేషనల్ సీఎస్ఆర్ ఛైర్పర్సన్అనిల్ రాజ్‌పుత్. ఆరోగ్యకరమైన సమాజాన్నినిర్మించేందుకు ఇలాంటి ఆరోగ్య పరిజ్ఞానానికి సంబందించిన సెమినార్లు అవసరమన్నారు. ఇక ఆ సెమినార్లో డాక్టర్ అర్జున్ డాంగ్ మహిళల్లో పేగు ఆరోగ్యాన్ని గణనీయంగా ప్రభావితం చేసే అలర్జీలు, సరిపడని ఆహారాలు గురించి కూడా చర్చించారు. అలాగే అభివృద్ధి చెందుతునన్న రోగ నిర్థారణ సాధానాల ప్రాముఖ్యత తోపాటు అందుబాటులో ఉన్న సమర్థవంతమైన చికిత్సపై రోగులకు సమగ్రమైన అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని గురించి నొక్కిచెప్పారు. మిల్లెట్ల పాత్ర..పోషకాహారం తీసుకునేలా మిల్లెట్లను మహిళల డైట్లో భాగమయ్యేలా చూడాలని వాదించారు. దీనివల్ల మొటిమలు, నెలసరి సమస్యలు, అధిక బరవు తదితర సమస్యలు అదుపులో ఉంటాయని ఉదహరించి మరి చెప్పారు. అంతేగాదు సెమినార్‌లోని నిపుణులు 2023లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన భారతదేశ మిషన్ మిల్లెట్స్ గురించి లేవనెత్తడమే గాక దానిపై మళ్లీ ఫోకస్ పెట్టాలన్నారు. గట్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మిల్లెట్ ఆధారిత ఆహారాలను ప్రోత్సహించాలన్నారు.అంతేగాదు పెరుగుతున్న ఆటిజం కేసులు, తల్లిబిడ్డల ఆరోగ్యంతో సహా మహిళల ప్రేగు ఆరోగ్యం ఎలా ప్రభావితం చేస్తుందన్నది సెమినార్లో నొక్కి చెప్పారు. వీటన్నింటిని నిర్వహించడంలో ఆహారం, మైక్రోబయోమ్ బ్యాలెన్స్‌ల పాత్రపై మరింతగా పరిశోధనలు నిర్వహిస్తున్నట్లు కూడా వెల్లడించారు. చివరగా ఈ సెమినార్లో ప్రజారోగ్య విధానాల్లో గట్ హెల్త్ ప్రాముఖ్యత, మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేలా బడ్జెట్ కేటాయింపుల చర్చలతో ముగిసింది. కాగా, సెలియక్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రజారోగ్య కార్యక్రమాలలో గట్ హెల్త్ పై అవగాహన పెంచడమే గాక ఇలాంటి సెమినార్లో ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించేలా ప్రోత్సహిస్తోంది. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య సవాళ్లను పరిష్కరించడమే లక్ష్యంగా పెట్టుకుంది.(చదవండి: ఇండియా నన్ను స్వీకరిస్తే చాలు..!: జాక్వెలిన్ ఫెర్నాండేజ్) -
బ్రెస్ట్ కేన్సర్: తొలిదశ గుర్తింపే అతిపెద్ద సవాలుగా..!
మహిళల్లో ప్రధానంగా కనిపిస్తున్న కేన్సర్ రొమ్ము కేన్సర్... పట్టణాలు, పల్లెలనే తేడా లేదు. అలాగే పెద్ద వయసు, చిన్న వయసు అనే తేడాలేకుండా దాడి చేస్తోంది. చాలామంది మహిళలు ఈ కేన్సర్ బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. దురదృష్టవశాత్తూ చాలా సందర్భాల్లో వ్యాధి ముదిరేంతవరకూ దీన్ని గుర్తించలేకపోతున్నారు. తొలిదశలోనే గుర్తించగలిగితే ప్రాణాలు దక్కించుకునే అవకాశాలూ పెరుగుతాయి. భారతదేశం లాంటి దేశాల్లో ఈ పరిస్థితి మరి ఎక్కువగా ఉంది. అసలు తొలిదశలోనే ఈ కేన్సర్‌ని గుర్తించడంలో ఎదురవుతున్న అడ్డంకులు, ఎలాంటి ప్రయత్నాలతో ప్రజలకు అవగాహన కల్పించాలో తదితర విషయాలపై అమూల్యమైన సలహాలు సూచనలు అందించారు హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ బ్రెస్ట్ ఆంకాలజిస్ట్ అండ్ ఆంకోప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ ప్రజ్ఞ చిగురుపాటి.ప్ర: రొమ్ము కేన్సర్‌పై అవగాహన, వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఏడాది పొడవునా కార్యక్రమాలను నిర్వహించాల్సిన అవసరం ఏమిటి? జ: మహిళలు ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్న భారత్ లాంటి దేశాల్లో రొమ్ము కేన్సర్‌పై నిత్యం కార్యక్రమాలు నిర్వహించాలి. చాలామందిలో వ్యాధిపై అవగాహన ఉండదు. కుటుంబ బాధ్యతల పేరుతో మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూంటారు. పైగా వ్యాధి నిర్ధారణ, పరీక్షలకు తగిన వసతులు కూడా ఇక్కడ తక్కువే. రొమ్ము కేన్సర్ పరీక్షలు సొంతంగా ఎలా చేసుకోవచ్చో మామోగ్రామ్ వంటి ప్రాథమిక స్క్రీనింగ్ పరీక్షలు ఎక్కడ చేయించుకోవాలో మహిళలకు తెలిసే అవకాశాలు తక్కువ. గ్రామీణ ప్రాంతాల్లో వీటి గురించి అస్సలు మాట్లాడుకోరు. దగ్గరలో కేన్సర్ చికిత్స కేంద్రాలూ ఉండవు.ప్ర: వీలైనంత తొందగా రొమ్ము కేన్సర్‌ను గుర్తించడం ఎలా ముఖ్యమవుతుంది?జ: అవగాహన లేమి, స్క్రీనింగ్ సౌకర్యాలు లేకపోవడం వంటి అనేక కారణాల వల్ల రొమ్ము కేన్సర్‌ను చాలా సార్లు ముదిరిన తరువాత మాత్రమే గుర్తిస్తున్నారు. మెరుగైన చికిత్స అందించేందుకు వ్యాధి నుంచి బయటపడేందుకు తొలిదశల్లోనే గుర్తించడం చాలా కీలకం. అందుకే మేము గ్రామాలతోపాటు చిన్న చిన పట్టణాల్లో రొమ్ము కేన్సర్‌పై అవగాహన పెంచే కార్యక్రమాలు చేపడుతున్నాం. వ్యాధి లక్షణాలు, సక్రమంగా గుర్తించడం ఎలా? నిర్ధారణ చేసుకోవడమెలా? సొంతంగా పరీక్షించుకునే విధానం, ట్రిపుల్ టెస్ట్ వంటి విషయాల గురించి వివరిస్తున్నాం. ప్ర: సాధారణంగా ఏ ఏ కారణాలతో మహిళలు తొలిదశ పరీక్షలకు ముందుకు రావడం లేదు?జ: ఎక్కువమంది కుటుంబ బాధ్యతలు చూసుకోవడంలో తలమునకలై ఉంటారు. తమ ఆరోగ్య అవసరాలను నిర్లక్ష్యం చేస్తూంటారు. తరచూ వైద్యపరీక్షలు చేసుకోవాలన్న అవగాహన లేకపోవడమే పెద్ద ప్రతిబంధకం. కొంతమందికి ఈ పరీక్షలు ఎలా చేయించుకోవాలో కూడా తెలియదు. పైగా కేన్సర్ వ్యాధ నిర్ధారణకు సంబంధించి చాలా అపోహలున్నాయి. తెలియకపోవడమే మేలని చాలామంది అనుకుంటూంటారు. ఈ కారణాల వల్లనే మేము ‘బ్రెస్ట్ హెల్త్ ఎక్స్‌ప్రెస్’ పేరుతో గ్రామ ప్రాంతాల్లో కార్యక్రమాలు చేపడుతున్నాం.ప్ర: రొమ్ము కేన్సర్‌పై ఉన్న అతిపెద్ద అపోహలేమిటి?జ: కుటుంబంలో ఎవరికైనా రొమ్ము కేన్సర్ ఉంటే మాత్రమే మామోగ్రామ్ చేయించుకోవాలన్నది అతి పెద్ద అపోహ. వాస్తవానికి ప్రతిమహిళ రొమ్ము కేన్సర్ బారిన పడే అవకాశం ఎంతో కొంత ఉంటుంది. అంటే కుటుంబంలో ఎవరికీ రొమ్ము కేన్సర్ లేనప్పటికీ మీకు వచ్చే అవకాశం ఉందన్నమాట. అందుకే నలభై ఏళ్లు దాటిన వారందరూ కచ్చితంగా ఏటా మామోగ్రామ్ చేయించుకోవాలి. ఒకవేళ కుటుంబంలో ఎవరికైనా రొమ్ము కేన్సర్ ఉంటే వారు ఈ పరీక్షలు చేయించుకోవడం మరీ ముఖ్యమవుతుంది. ప్ర: రొమ్ము కేన్సర్, అంకప్లాస్టిక్ సర్జరీని మీ వృత్తిగా ఎంచుకునేందుకు స్ఫూర్తి ఏమిటి?జ: దేశంలో కేన్సర్ సర్జన్లు చాలా తక్కువమంది ఉన్నారు. హైదరాబాద్‌లోనూ అంతే. అందుకే నేను ఈ రంగాన్ని ఎంచుకున్నా. మా అమ్మ శరీరంలోంచి కణితి (కేన్సర్ కాదు)ని తొలగించేందుకు తీసుకువెళ్లాల్సి రావడం ఒక రకంగా నేను ఆంకోప్లాస్టిక్ సర్జన్ అయ్యేందుకు కారణం. ప్ర: సాధారణ రొమ్ము కేన్సర్ శస్త్రచికిత్సలతో పోలిస్తే ఆంకోప్లాస్టీ సర్జరీ ఎలా భిన్నం?జ: ప్రధానమైన తేడా ఆంకోప్లాస్టిక్ సర్జరీ విధానంలో కేన్సర్ సోకిన రొమ్మును పూర్తిగా తొలగించాల్సిన అవసరం లేదు. వీలైనంత వరకూ రొమ్మును మిగల్చడం లక్ష్యంగా శస్త్రచికిత్స చేయడం వల్ల ప్రత్యేక కృత్రిమ పొరలను ఏర్పాటు చేసి కేన్సర్ తిరగబెట్టకుండా రేడియేషన్ థెరపీ ఇచ్చేందుకు అనువుగా చేయవచ్చు కూడా. ఒకవేల రొమ్ము మొత్తాన్ని తీసివేసినా.. శరీరంలోని కొవ్వు, కండరాల సాయంతో రొమ్మును మళ్లీ సిద్ధం చేయవచ్చు. కాబట్టి ఆంకోప్లాస్టిక్ సర్జరీ అంటే కేన్సర్ చికిత్సకు ప్లాస్టిక్ సర్జరీ తోడవడం అన్నమాట. ప్ర: బ్రెస్ట్ ఆంకాలజిస్ట్, ఆంకోప్లాస్టిక్ సర్జన్‌గా మీకు తృప్తినిచ్చే అంశం...?జ: శస్త్రచికిత్స తాలూకూ తుది ఫలితం. సర్జరీకి బాధితులు ఎలా స్పందిస్తున్నారు? అన్నది. కొన్ని కేసుల విషయంలో వ్యాధి నిర్ధారణ కూడా చాలా ముఖ్యమవుతుంది. తమ సమస్యలను అర్థం చేసుకునేందుకు తగినంత సమయం ఇచ్చారని రోగి నవ్వుతూ చెప్పినప్పుడు కలిగే ఆనందం అంత ఇంత కాదు. ఎంత పనిచేశామన్న దానికంటే ఎంత నాణ్యమైన పని చేశామన్నది ముఖ్యమని అనుకుంటా(చదవండి: 20 ఏళ్లకే డాక్టర్, 22 ఏళ్లకు ఐఏఎస్ ఆఫీసర్..ఇవాళ ఏకంగా..!) -
ఆ నాలుగు 'వైట్ ఫుడ్స్'ని నివారిద్దాం..ఆరోగ్యంగా ఉందాం..!
ఈ బిజీ లైఫ్‌లో సంపూర్ణ ఆరోగ్యంగాన్ని ఎలా పొందగలమని చాలామంది బాధపడుతుంటారు. కొద్దిపాటి చిట్కాలతో ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండొచ్చట. ఇక్కడ కొద్దిపాటి శ్రద్ధ ఉంటే చాలంటున్నారు నిపుణులు. వర్కౌట్లు, డైట్లు చేయకపోయినా.. తినే ఆహారంపై కాసింత స్ప్రుహ ఉంటే చాలు..సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం అంటున్నారు నిపుణులు. అదెలాగో చూద్దామా..!.మైదాతో చేసిన పదార్థాలకు దూరంగా ఉంటే సగం వ్యాధుల దరిచేరవట.అలాగే పంచదారను నివారించటం అంటే..టీ, కాఫీల్లో పర్లేదని లైట్‌గా తీసుకోకూడదట. వాటిల్లో కూడా పూర్తిగా నివారించి దానికి బదులుగా ఫ్రూట్ స్వీట్స్ లేదా బెల్లం జోడించండి చాలు.మరొకటి బంగాళ దుంపలు ఆరోగ్యకరమైన రీతిలో తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండదట. డీఫ్ ఫై, చిప్స్ రూపంలో అయితే అస్సలు వద్దని చెబుతున్నారు. ఇది గుండె ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తుందటచివరిగా తెల్లబియ్యం నివారించాలట. బాగా పాలిష్ పెట్టిన బియ్యం కాకుండా పొట్టు తక్కువగా తీసిని బియ్యం, ముడిబియ్యం లేదా బ్రౌన్ రైస్ తీసుకోమంటున్నారు. అలాగే ఒకవేళ తినాలనుకున్న వైట్ రైస్‌ని మితంగా తీసుకునే యత్నం చేసినా చాలు. ఎలాంటి అనారోగ్య సమస్యలు బారినపడే అవకాశం ఉండదని చెబుతున్నారు నిపుణులు. దీంతోపాటు పొగ, మద్యపానం వంటి చెడు అలవాట్లకు కూడా దూరంగా ఉండమని సూచిస్తున్నారు.ఒకవేళ పైన చెప్పిన ఆ ఆహారాలను పూర్తిగా నిషేధించలేకపోయినా..కనీసం పరిమిత స్థాయిలో మితంగా తీసుకునే యత్నం చేసినా..సత్ఫలితాలను పొందగలరని చెబుతున్నారు నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత నిపుణులను సంప్రదించి అనుసరించటం మంచిది. (చదవండి: ఛీ.. ఫేషియల్ కోసం అదా? హాలీవుడ్ తారల బ్యూటీ సీక్రెట్ తెలిస్తే..) -
పెద్దపేగు కేన్సర్ నివారణకు...
గతంలో పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా కనిపించే పెద్దపేగు (కోలన్) కేన్సర్ ఇప్పుడు మన దేశంలోనూ కనిపిస్తుంది. చిన్నపాటి జాగ్రత్తలతోనే దీన్ని నివారించవచ్చు. అవి... పొద్దున్నే తేలిగ్గా విరేచనమయ్యేలా పీచు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. ఇందుకోసం చిరుధాన్యాలూ, కాయధాన్యాలూ, ఆకుకూరలు, తాజాపండ్లను ఎక్కువగా తీసుకోవాలి. ఆహారంలో కొవ్వులు బాగా తక్కువగా ఉండేలా జాగ్రత్త పడాలి. ఇందుకోసం మాంసాహారాన్ని పరిమితంగా తీసుకోవడంతోపాటు అందులోనూ.... కొవ్వు మోతాదులు తక్కువగా ఉండే చికెన్, చేపల వంటి వైట్ మీట్‌ను మాత్రమే తీసుకోవాలి. వేటమాంసం, రెడ్మీట్నుంచి దూరంగా ఉండాలి. మంచి ఆరోగ్యకరమైన విసర్జక అలవాట్లు కలిగి ఉండాలి. అంటే రోజూ ఒకేవేళకు మల విసర్జనకు వెళ్లడం, అజీర్తి, గ్యాస్ ట్రబుల్ లేకుండా చూసుకోవడం లాంటివి. మలవిసర్జన సాఫీగా జరగాలంటే దేహానికి తగినంత శారీరక శ్రమ, వ్యాయామం ఉండాలి. పొగతాగడం, మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. (చదవండి: పాజిటివ్ పవర్: హీనాఖాన్ ధైర్యానికి ఎవ్వరైన ఫిదా కావాల్సిందే..! )