![Salman Khan Says He Sleeps 7 To 8 Hours In A Day Only Once A Month](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/salman1.jpg.webp?itok=MJ2Uvncy)
బాలీవుడ్ ప్రముఖ నటుడు, కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్‌లో ఉంటుంది. ఈ వయసులో కూడా ఆయన కుర్ర హీరోలకు ఏ మాత్రం తీసిపోని రేంజ్‌లో గ్లామర్‌గా ఉంటారు. ఇప్పటికీ అదేవిధంగా బాడీ మెయంటైన్ చేస్తూ తన అభిమానులను ఖుషి చేస్తుంటారు. సల్మాన్ సినిమా అనగానే ప్రేక్షకుల అంచనాలే వేరేలెవెల్‌లో ఉంటాయి. అందుకు తగ్గట్టుగానే తన అభినయంతో మెప్పించి విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు సల్మాన్. అంతేగాదు ఆయన నటనకు గానూ ఎన్నో అవార్డు వరించాయి కూడా. ఆయన తన మేనల్లుడు అర్హాన్ ఖాన్‌తో జరిగిన సంభాషణలో తన జీవనశైలి గురించి మాట్లాడారు. అది వింటే అన్ని గంటలేనా నిద్ర అని విస్తుపోతారు. అయితే నిపుణులు మాత్రం అది మంచిది కాదంటూ వార్నింగ్ ఇస్తున్నారు. మరీ సల్మాన్ ఏం చెప్పారు. ఎంతసేపు నిద్రపోతే ఆరోగ్యం సురక్షితం తదితరాల గురించి చూద్దామా..!.
సల్మాన్ ఖాన్ ఇటీవల తన మేనల్లుడు అర్హాన్ ఖాన్‌తో జరిగిన సంభాషణలో తాను సాధారణంగా రెండు గంటలే పడుకుంటానంటూ బాంబు పేల్చారు. ఎప్పుడో నెలకు ఒకసారి మాత్రమే ఏడు నుంచి ఎనమిది గంటలు పడుకుంటానని అన్నారు. అందువల్లే ఒకోసారి సెట్‌లో చిన్న విరామాలో నిద్రపోతానని అన్నారు.
59 ఏళ్ల సల్మాన్ తనకు వేరే పనిలేకపోతేనే నిద్రపోతానని చెబుతున్నారు. ముఖ్యంగా తాను జైల్లో ఉన్నప్పుడు బాగా నిద్రపోయానని అన్నారు. అలాగే విమానంలో కూడా నిద్రపోతానని అన్నారు. ఇదే మాదిరిగా షారుక్ కూడా ఒకనొక సందర్భంలో తన నిద్ర షెడ్యూల్ గురించి మాట్లాడారు. తాను ఉదయం 5 గంటలకు నిద్రపోయి 9 గంటలకు మేల్కొంటానని అన్నారు.
ఇలా నిద్రపోతే మంచిదేనా అంటే..
క్రమరహితమైన నిద్ర ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ప్రతి వ్యక్తి రాత్రి 7 నుంచి 9 గంలటకు నిద్రపోవాలని నొక్కి చెబుతున్నారు. నిద్రలేమి వల్ల ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్, రక్తపోటు, గుండెపోటు, స్ట్రోక్, డిప్రెషన్, చిత్తవైకల్యం, కొన్ని రకాల కేన్సర్‌లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అన్నారు.
దీని కారణంగా డ్రైవింగ్ సామర్థ్యం కూడా బలహీనపడుతుందని చెబుతున్నారు నిపుణులు. మొత్తం నిద్రను ఒకేసారి పూర్తి చేయడం మంచిది. రాత్రిపూటకే ప్రాధాన్యత ఇవ్వాలి లేదంటే పగటిపూట అంతేస్థాయిలో సమతుల్య నిద్రను పూర్తిచేయాలి.
నిద్ర స్థిరంగా ఉండేలా చూసుకోవాలి. ఒకే సమయానికి పడుకోవడం, మేల్కొనడం వంటివి చేయాలి. స్థిరమైన నిద్ర షెడ్యూల్ మొత్తం మెరుగైన ఆరోగ్యంతో ముడిపడి ఉందని చెబుతున్నారు వైద్యులు .
(చదవండి: నీట్ ఎగ్జామ్ పాసైన 62 ఏళ్ల డాక్టర్.. స్టూడెంట్‌గా కాలేజ్‌లో..!)
Comments
Please login to add a commentAdd a comment