ప్రస్తుత జీవన విధానంలో ఎంతమంది నిద్రలేమితో బాధపడుతున్నారో తెలిసిందే. ఒక్క క్షణం రెప్పవాలితే బాగుండును అన్నంతగా ఉంది పరిస్థితి. అందుకోసం మెడిసిన్స్ అని ఏవేవో చిట్కాలని పాటించేస్తున్నారు కూడా. కేవలం చక్కటి జీవనశైలితో శరీర ధర్మం దానంతట అదిగా సర్దుబాటు అయ్యేలా చేసుకోవాల్సిందేనని నిపుణులు కూడా చెబుతున్నారు. ప్రస్తుతం దీన్ని కూడా క్యాష్ చేసుకునేలా కొన్ని కార్పొరేట్ కంపెనీలు చూస్తుండటం బాధకరం. ఏకంగా సాంకేతికతో కూడిన సాధనాలు, ప్రత్యేక పరుపులు వీటితో మంచి నిద్ర గ్యారంటీ అంటూ ప్రజలను ఊదరగొట్టేస్తున్నాయి కొన్ని కార్పొరేట్ కంపెనీలు. మరోవైపు ప్రజలు నిద్ర వస్తే చాలు అన్నట్లు వాటిని కొనితెచ్చేసుకోవాలనే ఆరాటంలో ఉన్నారు. అలా వచ్చిందే ఈ "స్లీప్‌మాక్సింగ్" వెల్నెస్ ట్రెండ్..!. అసలు ఏంటిది.? దీని వల్ల నిజంగా మంచి నిద్ర పడుతుందా..?
నిద్ర కోసం సాగించిన అన్వేషణ కాస్త "స్లీప్‌మాక్సింగ్"కి దారితీసిందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. నిద్రలేమితో బాధపడేవారంతా సోషల్‌మీడియాలో గ్రూప్‌గా మారి ఒకరి అనుభవానలు ఒకరూ షేర్ చేసుకుంటున్నప్పుడూ వచ్చిందే ఈ "స్లీప్ మాక్సింగ్". ఒక ఔత్సాహిక సోషల్ మీడియా వినియోగదారు చెప్పడంతో ఇది రకరకాల చర్చలకు తెరలేపింది.
'స్లీప్‌మాక్సింగ్' అంటే..
నిద్ర కోసం ఉపయోగించే ఒక విధమైన సాధనాలు లేదా ఉత్పత్తులుగా చెప్పొచ్చు. ఇయర్‌ప్లగ్‌లు, నాసికా డైలేటర్‌లు, మెగ్నీషియం ఫుట్ స్ప్రే, మౌత్ టేప్, చిన్ స్ట్రాప్స్ ట్రాకర్‌లతో మంచి నిద్రను పొందేలా మార్గం సుగమం చేసుకునే విధానమే స్లీప్‌మాక్సింగ్. దీని గురించి సోషల్ మీడియా వినియోగదారు డెరెక్ ఆంటోసిక్ చెప్పుకొచ్చారు. తన 20 ఏళ్ల జీవితంలోని అనారోగ్యకరమైన అలవాట్లు నిద్రలేమికి దారితీశాయని, దాన్ని అధిగమించేందుకు సాగిన అన్వేషణలో ఈ స్లీప్‌మాక్సింగ్ తనకు ఉపయోగపడిందంటూ వివరించాడు.
ఈ సాధానాలతో మంచి నిద్రపట్టిందా లేదా అని ట్రాకర్‌తో చెక్ చేసుకునేవాడినని చెబుతున్నాడు అంతేగాదు ఆ సాధానాలు తనకు గాఢనిద్రను అందించాయని చెప్పాడు. దీన్ని క్యాష్ చేసుకునేలా కొన్ని కంపెనీలు స్మార్ట్ స్లీప్ సొల్యూషన్ అంటూ సాంకేతికతో కూడిన సాధనాలను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా ఏఐ హెడ్‌బ్యాండ్ వంటవి గాఢనిద్రను ప్రేరేపించేలా నిశబ్ద వాతావరణాన్ని సృష్టించేందుకు మెదడు తరంగాలను ఉపయోగిస్తుందట. అలాగే మెదడు మెలుకువగా ఉండేలా చేసే కార్యకలాపాలను లక్ష్యంగా రూపొందిచామని ఊదరగొడుతున్నాయి కంపెనీలు.
అంతేగాదు మంచినిద్రను తెచ్చిపెట్టే పరుపులు కూడా వచ్చేశాయి. అలాగే ఉష్ణోగ్రతను సర్దుబాటు చేసే సాధనాలు, గురక తగ్గించే పరికరాలు వంటి వాటితో నిద్రను ప్రజలు కొనుక్కునే దుస్థితికి తీసుకొచ్చేయటం బాధకరం. అయితే నెటిజన్లు మాత్రం ఇవన్నీ మంచి నిద్రను అందించే సాధానలే అయిన..అవేమి సహజమైన నిద్రను అందివ్వలేవని తేల్చి చెబుతున్నారు. చక్కటి శారీరక శ్రమ, మంచి ఆహారపు అలవాట్లతోనే దాన్ని పొందగలమని నమ్మకంగా చెబుతుండటం విశేషం. ఆ గాడ్జెట్స్‌పై ఆధారపడితే క్రమేణ నాణ్యమైన నిద్రను కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేస్తూ..పోస్టులు పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment