గతకొద్దేళ్లుగా పర్యావరణ కాలుష్యం, మానవ కార్యకలాపాలు కారణంగా సమ్మర్‌లో ఎండలు దంచి కొట్టాయి. సూర్యుడి భగభగలు మాములుగా లేదు. అంతేగాదు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్, ఆంటోనియో గుటెర్రెస్ సైతం ప్రజలు అధిక వేడిని ఎదుర్కొటున్నారని, బిలయన్లమంది ప్రజలు ప్రాణాంతక వేడి తరంగాలతో అల్లాడుతున్నారంటూ హెచ్చరించారు.
అంతేగాదు ఇటీవల ఎన్నడూ చూడని విధంగా ఉష్ణోగ్రతలు ఏకంగా 50 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్నాయని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. దీంతో సామాన్య ప్రజలు సైతం అప్పో సొప్పో చేసి మరీ కూలర్ లేదా ఏసి కొనుక్కుని ఉపశమనం పొందుతున్నారు. ఈ విపరీతమైన వేడికి భయపడే ఏసీ గదుల్లో గంటల్లకొద్ది నిద్రిస్తున్నారు. కొందరైతే తెల్లవార్లు ఏసీ ఆన్‌చేసి పడుకుంటారు. అయితే ఇలా చేయడం అస్సలు మంచిది కాదని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
ఏసీలో పడుకోవడం వల్ల కలిగే దుష్పరిణామాలు..
పొడి కళ్ళు: ఏసీ గాలి నుంచి తేమను తొలగిస్తుంది. ఇది కళ్లను పొడిగా చేసి.. దురద, అసౌకర్యానికి దారితీస్తుంది.
బద్ధకం: చల్లని ఉష్ణోగ్రతలు జీవక్రియ రేటును తగ్గించి, శరీర ప్రక్రియలను నెమ్మదిస్తాయి. ఇది అలసట, మగతకు దారితీస్తుంది.
నిర్జలీకరణం: పొడి గాలి వేగవంతమైన తేమ నష్టాన్ని కలిగిస్తుంది. తగినంతగా నీళ్లను తాగకపోతే నిర్జలీకరణానికి దారితీస్తుంది.
పొడి లేదా దురద చర్మం: తక్కువ తేమ చర్మం తేమను కోల్పోయేలా చేసి చర్మ పొడిబారినట్లుగా అయిపోతుంది. దీంతో ఒక విధమైన దురద, చికాకుకు కలుగుతుంది.
తలనొప్పి: ఆకస్మిక ఉష్ణోగ్రత మార్పులు, చల్లని పొడి గాలి తలనొప్పి, సైనస్‌కు కారణమవుతుంది.
శ్వాసకోశ సమస్యలు: చల్లని మరియు పొడి గాలి వాయుమార్గాలను చికాకుపెడుతుంది, ఉబ్బసం మరియు అలెర్జీల వంటి అధ్వాన్నమైన పరిస్థితులు.
అలెర్జీలు, ఉబ్బసం: ఎయిర్ కండిషనింగ్‌లో దుమ్ము ధూళి వంటి అలెర్జీ కారకాలను కలిగి ఉంటాయి. ఇది అలెర్జీ ప్రతిచర్యలను ప్రేరేపిస్తుంది.
శబ్ద కాలుష్యం: నిరంతరం హమ్మింగ్ చేయడం వల్ల నిద్రకు భంగం కలిగించి, చికాకు కలిగిస్తుంది.
అంటువ్యాధులు: పేలవంగా నిర్వహించబడే ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థలు బాక్టీరియా, వైరస్లు,శిలీంధ్రాలు వ్యాప్తి చెందుతాయి.
నవజాత శిశువులపై ప్రభావం
ఎయిర్ కండీషనర్‌లను సరిగ్గా ఉపయోగిస్తే నవజాత శిశువులకు సురక్షితంగా ఉంటుందని చెప్పారు. తల్లిదండ్రులు శిశువు శరీర ఉష్ణోగ్రతకు ఉష్ణోగ్రతను నియంత్రించాలి, సర్దుబాటు చేయాలి. నవజాత శిశువును గదిలోకి తీసుకురావడానికి కనీసం 20 నిమిషాల ముందు AC ఆన్ చేయాలి, అదికూడా 25-27 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత మధ్య ఉంచాలి.
దగ్గు, న్యుమోనియా వంటి వ్యాధుల బారినపడకుండా ఉండేలా చల్లటి గాలికి ప్రత్యక్షంగా గురికాకుండా జాగ్రత్తపడాలి. కొంతమంది నవజాత శిశువులకు కూడా చల్లని ఉష్ణోగ్రతలకు అలెర్జీని కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి విపరీతమైన చలికి దూరంగా ఉండాలి. అంతే కాకుండా దుమ్ము వంటి అలర్జీలను నివారించడానికి ఎయిర్ కండీషనర్లను తరచుగా శుభ్రం చేయాలి.
(చదవండి: ఈగను చంపడంతో ..ఏకంగా కన్నే పోగొట్టుకున్నాడు..!)
Comments
Please login to add a commentAdd a comment