న్యూ ఇయర్(New year) ముందు రోజు (డిసెంబర్ 31) రాత్రంత కొత్త ఏడాదికి స్వాగతం పలికే సంబరాల్లో మునిగి తేలుతుంటారు. ఆట, పాట, మందు, విందు అంటూ పార్టీలతో పెద్దలు, కుర్రకారు మంచి జోష్‌తో ఎంజాయ్ చేస్తుంటారు. అర్థరాత్రి పన్నెండు దాక సెలబ్రేషన్స్ ఖుషీలో పరిమితికి మించి ఫుడ్‌ని హాంఫట్ చేసేస్తుంటారు. దీంతో నెక్ట్స్ డే మార్నింగ్ నుంచి మొదలవుతుంది తలంతా పట్టేసి హ్యాంగోవర్‌తో బాధడుతుంటారు. ఈ పరిస్థితి నుంచి ఓ పట్టాన బయటపడమేమో అన్నంతగా దాని ప్రతాపం చూపిస్తుంటుంది. ఒకటే తల బరువు, నొప్పితో తెగ బాధపడుతుంటారు చాలామంది. అలాంటి వాళ్లు దీన్నుంచి తేలికగా బయటపడాలంటే ఇలా చేయాలంటున్నారు ఆరోగ్య నిపుణులు అవేంటో చూద్దామా..
కొందరు మిడ్‌నైట్ వరకు పార్టీల పేరుతో మందు పుచ్చుకుంటే..మరికొందరూ నచ్చిన ఫుడ్, కూల్‌డ్రింక్స్ లాగించేస్తుంటారు. అదీగాక అర్థరాత్రి వరకు మేల్కొనడంతో ఒక్కసారిగా ఈ సడెన్ ఛేంజ్‌ని మన శరీరం ఆకలింపు చేసుకోలేక ఎదురయ్యే పరిస్థితే ఈ హ్యాంగోవర్(Hangover) అని చెబుతున్నారు ఆరోగ్య నిపణులు.
ముఖ్యంగా ఆల్కహాల్ సేవించే వాళ్లకు ఈ సమస్య మరింత త్రీవంగా ఉంటుందట. కొందరికి దీనివల్ల తలనొప్పి, తల తిరగడం, వాంతులు కావడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు. ఇలాంటప్పడు అలాంటి ఆహార పదార్థాలను తీసుకుంటే చక్కటి ఉపశమనం లభించడమే గాక చాలా సులభంగా దీన్నుంచి బయటపడతామని చెబుతున్నారు నిపుణులు. అవేంటంటే..
హైడ్రేటింగ్ డ్రింక్స్
హ్యాంగోవర్ నుంచి కోలుకోవడానికి, బాడీని హైడ్రేట్ చేసుకోవాలి, ఎలక్ట్రోలైట్లను రిస్టోర్ చేసుకోవాలి. దీని కోసం స్పోర్ట్స్ డ్రింక్స్, కోకోనట్ వాటర్, ఎలక్ట్రోలైట్-ఎన్‌హాన్స్‌డ్ డ్రింక్స్ వంటి కొన్ని డ్రింక్స్ తీసుకోవచ్చు. సోడియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఎలక్ట్రోలైట్లను కలిగి ఉన్న దోసకాయ నీరు, బచ్చలి నీళ్లు వంటి డ్రింక్స్ కూడా తాగుతుండాలి.
వాటర్(Water) తాగొచ్చా అంటే..
నీరు తాగవచ్చు కాకపోతే నెమ్మదిగా, చిన్న సిప్స్ మాత్రమే తీసుకోవాలి. అతిగా లేదా చాలా వేగంగా తాగితే, వాంతులు కావచ్చు. అలాగే, చాలా చల్లటి నీటిని తీసుకోకూడదు. గోరు వెచ్చని నీరు అయితే మంచి ఉపశమనంగా ఉంటుంది.
విరేచనాలు లేదా వికారం ఉంటే..
చప్పగా, సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తినవచ్చు. ముఖ్యంగా అరటి, రైస్, యాపిల్సాస్, టోస్ట్ వంటి ఫుడ్స్ తీసుకోవచ్చు
పండ్లు(Fruits)
హ్యాంగోవర్ నుంచి కోలుకోవడానికి పండ్లు తినొచ్చు. పండ్లలోని సహజసిద్ధమైన చక్కెరలు బాడీలో నుంచి ఆల్కహాల్‌నిగ ఎలిమినేట్ అయ్యలా చేస్తాయి. అలాగే హైడ్రేషన్‌ను, శక్తిని పెంచేలా విటమిన్లు, నీరు, పోషకాలు పండ్లలో సమృద్ధిగా లభిస్తాయి. మామిడిపండ్లు, ద్రాక్ష, నారింజ, బేరి, అరటిపండ్లు, పుచ్చకాయ హ్యాంగోవర్‌ను సమర్థవంతంగా దూరం చేయగలవు.
వికారం తగ్గాలంటే..
అల్లం హ్యాంగోవర్ వల్ల తలెత్తే వికారాన్ని పోగొడుతుంది. దీన్ని వివిధ రూపాల్లో తినవచ్చు లేదా తాగవచ్చు, కానీ జింజర్ ఆలే లేదా అల్లం బీర్ వంటి చక్కెర, జిగట డ్రింక్స్ సేవించకూడదు. బదులుగా పచ్చి అల్లంతో చేసిన గోరు వెచ్చని నీళ్లే మంచివి..
విటమిన్ ట్యాబెలెట్స్ వద్దు..
వ్యక్తులు హ్యాంగోవర్లను నయం చేయడానికి విటమిన్ సప్లిమెంట్లను తీసుకుంటారు, కానీ అవి పని చేయవు. బదులుగా సాల్మన్ చేప ఒక గొప్ప ఎంపిక. ఇందులో B6, B12, అలాగే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి.
తీసుకోకూడనవి..
హ్యాంగోవర్‌ను నివారించడానికి(Prevention) బర్గర్లు, ఫ్రైస్, కాఫీ వంటి డ్రింక్స్ కొందరు తీసుకుంటుంటారు. వీటిని అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే ఈ ఫుడ్ ఐటమ్స్ హ్యాంగోవర్ మరింత తీవ్రతరం చేస్తాయి.
(చదవండి: పాదాల నొప్పి తగ్గడానికి పొట్టలోని కొవ్వును ఇంజెక్ట్ చేస్తే చాలు!!)
Comments
Please login to add a commentAdd a comment