
దివంగత టాలీవుడ్ నటి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ అచ్చం తల్లిలానే తన అందం అభినయంతో వేలాదిగా అభిమానులను సంపాదించుకుంది. అలనాటి అందాల తార శ్రీదేవిని తలపించేలా ముగ్ధమనోహరంగా ఉంటుంది. దేవర మూవీలో టాలీవుడ్ హీరో ఎన్‌టీఆర్ సరసన నటించి నటనలో మంచి మార్కులు కొట్టేసింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ చేసేలా కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రస్తుతం అటు టాలీవుడ్, ఇటు బాలీవుడ్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఈ రోజు ఆమె పుట్టినరోజు. ఈ ఏడాది మార్చి 06తో 28 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఆమె గ్లామర్ పరంగా తన తల్లికి ఏమాత్రం తీసిపోని విధంగా ఫిట్‌గా స్లిమ్‌గా ఉంటుంది. మరో అతిలోక సందరిలా కళ్లు తిప్పుకోనివ్వని అందం ఆమె సొంతం. అంతలా ఫిజిక్ మెయింటైన్ చేయడం వెనుకున్న రహస్యం ఏంటో చూద్దామా..!.
జాన్వీ తరుచుగా తన ఫిట్‌నెస్‌కి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటుంది. ఆమె ఒక ఇంటర్వ్యూలో బ్యూటీ సీక్రెటని బయటపెట్టింది. తన ఆహారపు అలవాట్లు, ఫిటెనెస్ సీక్రెట్ తదితరాల గురించి షేర్ చేసుకుంది. తాను ఎక్కువుగా ఇంట్లో వండిన ఆహారాలనే ఇష్టంగా తింటానని అంటోంది. కఠినమైన డైట్‌ని ఫాలోఅవుతానని అంటోంది. అల్పాహారం అవకాడో, రెండు గుడ్ల మాత్రమేనని, భోజనంలో గ్రిల్డ్ చికెన్, పాలకూర, సూప్ తీసుకుంటానని చెబుతోంది.
ఎక్కువగా జపనీస్, ఇటాలియన, ఆంధ్ర, మొఘలాయ్ వంటకాలంటే ఇష్టమని చెప్పుకొచ్చింది. అయితే తాను గ్లూటైన్ రహిత ఫుడ్‌నే తీసుకుంటానంటోంది. ఎందుకంటే గ్లూటైన్ తనకు పడదని, అలెర్జీ వస్తుందని తెలిపింది. తనకు బాగా నచ్చిన ఆరోగ్యకరమైన మంచీలను లేదా పండ్లు ఎక్కువగా ఇష్టంగా తింటానని చెప్పింది. వాటిలో చక్కెర ఎలాగో ఎక్కువ ఉంటుంది కాబట్టి స్వీట్స్ జోలికి వెళ్లనంటోంది. బాగా, పానీపూరీ, ఐస్‌క్రీం, స్ట్రాబెర్రీలు అంటే మహా ఇష్టమని చెబుతోంది.
చాలామటుకు అన్ని కూరగాయలు, పళ్లు తింటానని, కాకపోతే బరువు పెరగకుండా చూసుకునేందుకు ఎక్కువగా వ్యాయామాలు చేస్తానని చెప్పింది. తేలికగా జీర్ణమయ్యే ఆహారానికే ప్రాధాన్యత ఇస్తుందట. అందుకే ఎక్కువగా రెడ్‌రైస్ బిర్యానీనే తింటుదట. తన చివరి భోజనం తొందరగానే పూర్తి చేశానని ఒకవేళ షూటింగ ఉంటే 10 గంటల కల్లా పూర్తి చేస్తానని చెబుతోంది.
ఇంతకుమునుపు చిలగడదుంప, పరాఠా వద్దకు వెళ్లేదాన్నికాదని, నో కార్బ్సో డైట్‌ను పాటించేదాన్ని అని తెలిపింది. అయితే ఇప్పుడు కార్బోహైడ్రేట్లు పెంచడం ప్రారంభించినట్లు వెల్లడించింది జాన్వీ కపూర్. గ్లామర్ పీల్డ్‌లో రాణించాలంటే ఆ మాత్రం కేర్ తీసుకోకపోతే కష్టమే కదూ..!.
Comments
Please login to add a commentAdd a comment