
దేశంలో ఎక్కువ మంది టైప్2డయాబెటిస్(Type2Diabetes)తోనే బాధపడుతున్నారు. గణాంకాలు సైతం ఆ వ్యాధి బాధితులు ఏటా వేలల్లో ఉంటున్నట్లు చెబుతున్నాయి. ఇప్పటి వరకు వాడుతున్న మందులన్నీ ఈ వ్యాధిని అదుపులో ఉంచుతాయే తప్ప. పూర్తిగా నివారించలేవు. ఆ దిశగా పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు కొంత పురోగతిని సాధించారు. తాజా అధ్యయనంలో టైప్2 డయాబెటిస్‌కి చెక్‌పెట్టే సరికొత్త ఔషధాన్ని తయారు చేశారు. ఇది రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌లో సత్ఫలితాలనందించి, డయాబెటిస్ రోగుల్లో కొత్త ఆశను రేకెత్తించింది. మరీ ఆ ఔషధం విశేషాలేంటో చూద్దామా..!.
బెర్బెరిన్ అనేది వివిధ మొక్కలలో సహజంగా లభించే ఆల్కలాయిడ్. దీన్ని సాంప్రదాయ చైనీస్‌లో జీర్ణ సమస్యలు, వాపు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. వాళ్లు దీన్ని శతాబ్దాలుగా వివిధ రకాల చికిత్సకు ఉపయోగిస్తన్నారు. దాంతోనే టైప్2డయాబెటిస్ ఔషధాన్ని తయారు చేశారు చైనాలోని పెకింగ్ యూనివర్సిటీ పీపుల్స్ హాస్పిటల్ పరిశోధకులు.
మొక్కల్లో లభించే బెర్బెరిన్ ఉత్పన్నం అయినబెర్బెరిన్ ఉర్సోడియోక్సికోలేట్ ఔషధాన్ని తయారు చేశారు. ఇక టైప్ 2 డయాబెటిస్ అనేది ఇన్సులిన్ నిరోధకత వల్ల సంభవిస్తుంది, ఇక్కడ శరీరం ప్యాంక్రియాస్ ఉత్పత్తి చేసే ఇన్సులిన్‌కు సరిగా స్పందించదు. కాబట్టి రక్తంలో గ్లూకోజ్ అమాంతం పెరుగుతుంది. అయితే దీనికి కేవలం రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను సాధారణ స్థాయికి తగ్గించే మందులు వాడుతూ..ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంభించడమే మార్గం.
నిజానికి ఫ్యాటీ లివర్ వ్యాధికి చికిత్స చేయడానికి బెర్బెరిన్ ఉర్సోడియోక్సికోలేట్, లేదా HTD1801ని కనుగొన్నారు. అయితే ఫేస్ 2 ట్రయల్స్‌లో ఊహించని విధంగా టైప్ 2 డయాబెటిస్‌ని కూడా సమర్థవంతంగా ప్రభావితం చేసి గణనీయంగా తగ్గించింది. అంతేగాదు ఆ అధ్యయనంలో ఇది కాలేయ కొవ్వు శాతంతోపాటు రక్తంలోని గ్లూకోజ్ నియంత్రణను గణనీయంగా మెరుగుపరిచిందని పరిశోధకులు గుర్తించారు.
ఇక్కడ గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ లేదా HbA1c అనేది రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను కొలిచే మార్కర్. అయితే ఆ ట్రయల్స్‌లో ఆహారం, వ్యాయామంతో తగినంతగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గని ఈ టైప్2 డయాబెటిస్ రోగుల్లో మాత్రం గణనీయమైన ప్రభావం చూపింది. వారిలో ఈ HTD1801 ఔషధం ప్రభావాన్ని అంచనా వేయగా..కొందరికి దీన్ని 500 మిల్లీ గ్రాములన చొప్పున రోజుకు రెండుసార్లు ఇచ్చారు. అలా తీసుకున్న వాళ్లలో గణనీయమైన మెరుగుదల కనిపించింది. వారందరిలో HbA1c అనేది చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
రోజుకు 500 మిల్లీగ్రాముల చొప్పున తీసుకున్నవాళ్లలో ఈ HbA1c 0.7% తగ్గింపు కనిపించింది. ఇక రోజుకు రెండు సార్లు చొప్పున మొత్తం 1000 మిల్లిగ్రాముల మోతాదులో ఔషధం తీసుకున్నవారిలో HbA1c లో 1.0% తగ్గింపు కనిపించింది. అంటే ఈ ఔషధం మోతాదు ఆధారిత మెరుగుదలను గుర్తించారు పరిశోధకులు. అంతేగాదు ఈ HTD1801 ఔషధం లిపోప్రొటీన్ కొలెస్ట్రాల్ (LDL-C, 'చెడు' రక్తం) స్థాయిలు, వాపు, హృదయనాళ ప్రమాదాలను గణనీయంగా తగ్గించింది.
అలాగే ఈ పరిశోధనలో పాల్గొన్న రోగులెవరు బరువు పెరగలేదు కూడా. ఈ ఔషధంతో చికిత్స సురక్షితమైనది రోగులు ఈ మందు ప్రభావాన్ని తట్టుకోగలుగుతున్నారు. పైగా ఇతర ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పడుతున్నట్లు పరిశోధనలో తేలిందన్నారు శాస్త్రవేత్తలు.
దీన్ని కేవలం టైప్ 2 డయాబెటిస్‌కి మాత్రమే కాకుండా ఇతర చికిత్సలకు కూడా వినయోగించొచ్చని వెల్లడించారు. ఇక ఈ ట్రయల్స్‌కి ఔషధం HTD1801 తయారీదారులైన షెన్‌జెన్ హైటైడ్ బయోఫార్మాస్యూటికల్ లిమిటెడ్ నిధులు సమకూర్చింది. ఈపరిశోధన జామా నెట్‌వర్క్ జర్నల్‌లో ప్రచురితమైంది.
(చదవండి: 'మష్రూమ్ చట్నీ పౌడర్': పోషకాలు పుష్కలం ఆరోగ్యం కూడా..!)
Comments
Please login to add a commentAdd a comment