ఎండు ద్రాక్షలో... మెండుగా పోషకాలు! | Health Colors of feelings | Sakshi
Sakshi News home page

ఎండు ద్రాక్షలో... మెండుగా పోషకాలు!

Published Mon, Apr 27 2015 10:57 PM | Last Updated on Sun, Sep 3 2017 12:59 AM

ఎండు ద్రాక్షలో... మెండుగా పోషకాలు!

ఎండు ద్రాక్షలో... మెండుగా పోషకాలు!

ఆరోగ్యమే మహాభాగ్యం

 ఎండుద్రాక్షల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అది రక్తహీనత ఏర్పడకుండా చూస్తుంది.  ఇందులో ఉండే విటమిన్ బి రక్తకణాల నిర్మాణంలో ఉపయోగపడుతుంది. ఆకలిని ఎక్కువ చేసే లెప్టిన్‌ని ఎండు ద్రాక్షలు నియంత్రిస్తాయి. కాబట్టి డైటింగ్ చేసేవారు వీటిని తరచూ తీసుకుంటూ ఉంటే ఆహారాన్ని ఎక్కువ తీసుకోకుండా ఉండగలుగుతారు.  వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వైరస్, బ్యాక్టీరియాలతో పోరాడుతాయి. కాబట్టి ఇన్ఫెక్షన్లు, జ్వరం వంటివి దరి చేరవు.

రక్తంలో ఉండే యాసిడోసిస్ అనే టాక్సిన్... చర్మవ్యాధులు, ఆర్థరైటిస్, క్యాన్సర్, ట్యూమర్లు వంటి వాటిని కలిగిస్తుంది. ఎండుద్రాక్షల్లో ఉండే పొటాసియం, మెగ్నీసియం యాసిడోసిస్‌ను నియంత్రించి ఆరోగ్యాన్ని కాపాడతాయి.  ఎండుద్రాక్షల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది కనుక ఎముకలు దృఢంగా అవుతాయి.   ఎండు ద్రాక్ష దంతక్షయాన్ని దరిచేరనివ్వదు.     
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement