తుక్కు ఇనుమును అక్రమంగా తరలిస్తుండగా అనంతపురం జిల్లా హిందూపురం రూరల్ పోలీసులు గురువారం అర్ధరాత్రి పట్టుకున్నారు.
అనంతపురం : తుక్కు ఇనుమును అక్రమంగా తరలిస్తుండగా అనంతపురం జిల్లా హిందూపురం రూరల్ పోలీసులు గురువారం అర్ధరాత్రి పట్టుకున్నారు. స్థానిక ఉక్కు తయారీ పరిశ్రమల నుంచి స్క్రాప్‌ను ఎనిమిది లారీల్లో బెంగళూరుకు తరలిస్తున్నట్టు తెలిసింది. అయితే, వీటికి పన్నులు చెల్లించకుండా రవాణా చేస్తుండడంతో పోలీసులు వాటిని సీజ్ చేసి రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
(హిందూపురం అర్బన్)