న్యూఢిల్లీ: దేశీయ అవసరాలను స్థానికం గానే తీర్చుకోవడంతోపాటు (స్వీయ సమృద్ధి), ఎగుమతులకు అవకాశమున్న 12 రంగాలను ఎంపిక చేసినట్టు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్ తెలిపారు. భారత్‌లో తయారీ కార్యక్రమం కింద ఈ 12 రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు. భారత్ తన అవసరాలకు తనపైనే ఆధారపడడం వల్ల నాణ్యమైన ఉత్పత్తులను పెద్ద ఎత్తున తయారు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఆహార శుద్ధి, సహజ సాగు, ఐరన్, అల్యూమినియం, కాపర్, ఆగ్రో కెమికల్స్, ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్ మెషినరీ, ఫర్నిచర్, లెదర్ అండ్ షూ, ఆటో విడిభాగాలు, టెక్స్‌టైల్స్, కవరాల్స్, మాస్క్‌లు, శానిటైజర్లు, వెంటిలేటర్ల విషయంలో భారత్ అంతర్జాతీయ సరఫరాదారుగా అవతరించగలదని మంత్రి చెప్పారు. ఈ రంగాల్లో భారత్ పోటీ పడగలదని, ఇతర దేశాలతో పలిస్తే మన దేశానికి సానుకూలతలు ఉన్నట్టు పేర్కొన్నారు.
నేడు బ్యాంకర్లతో ఆర్థిక మంత్రి సమావేశం
ప్యాకేజీలోని పథకాల అమలుపై చర్చ
న్యూఢిల్లీ: దేశీ ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్‌యూ)ల చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్లతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు (శుక్రవారం) సమావేశంకానున్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన రూ. 21 లక్షల కోట్ల ప్యాకేజీలో భాగంగా అమలుకానున్న పలు పథకాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా జరిగే ఈ మీటింగ్‌లో రుణాల జారీ, తగ్గిన వడ్డీ రేట్ల ప్రయోజనం బదలాయింపు, మారటోరియం వంటి పలు ఇతరాత్ర అంశాలపై చర్చించనున్నారు.
ఎగుమతులకు 12 రంగాల ఎంపిక
Published Fri, May 22 2020 6:37 AM | Last Updated on Fri, May 22 2020 6:37 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment