
విశాఖపట్నం: విశాఖపట్నంలో వినాయక మండపం వద్ద భక్తులకు పెను ప్రమాదం తప్పింది. ఆర్కే బీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన చాక్లెట్ వినాయక మండపం వద్ద ఈదురు గాలులకు మండపంపై రేకులు ఎగిరిపడ్డాయి. దీంతో వెనుకనే కూర్చున్న భక్తులపై సిమెంట్ రేకులు పడ్డాయి.
భక్తులు తప్పుకోవడంతో తృటిలో ప్రమాదం తప్పింది. ఓ వ్యక్తికి తలపై ఇనుప రాడ్డు పడింది. స్వల్ప గాయాలు అయ్యాయి. నిబంధనలు పాటించకుండా స్టాల్స్ ఏర్పాటుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: తిరుమల: నాడు వైఎస్సార్.. నేడు సీఎం జగన్: భూమన
Comments
Please login to add a commentAdd a comment