![7 Amazing Health Benefits Of Cluster Beans Goru Chikkudu Kaya In Telugu - Sakshi](/styles/webp/s3/article_images/2022/01/26/Chikkudu-Kaya_5.jpg.webp?itok=-RR5r7Gy)
చాలా మంది గోరు చిక్కుడును ఇష్టంగా తింటారు. ముఖ్యంగా గోరు చిక్కుడు కాయ ఫ్రైలో చారు వేసుకుని తింటే.. ఆ టేస్టే వేరు. కేవలం రుచికి మాత్రమే పరిమితమైపోలేదు మన గోకరకాయ. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు తనలో ఇముడ్చుకుంది కూడా. సాధారణంగా భారత్‌లోని పశ్చిమ, వాయవ్య ప్రాంతాల్లో, పాకిస్తాన్‌లోనూ గోరుచిక్కుడు విరివిగా పండుతుంది.
అమెరికా, మెక్సికో, ఆఫ్రికా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో కూడా దీనిని విస్తారంగా పండిస్తారు. కరువు పరిస్థితులను తట్టుకుని మరీ పెరగడం గోరు చిక్కుడుకు ఉన్న లక్షణం. గోరుచిక్కుడును కూరలు తదితర వంటలతో పాటు, గోరుచిక్కుడు జిగురును పలు రకాల ఆహార ఉత్పత్తుల్లో వినియోగిస్తారు.
గోరు చిక్కుడులో ఉండే పోషకాలు
►గోరు చిక్కుడులో ప్రొటీన్లు అధికం.
►స్వల్పంగా పిండి పదార్థాలు, పీచు పదార్థాలు ఉంటాయి.
►విటమిన్–ఎ, విటమిన్–బి1, బి2, బి3, బి5, బి6, బి9, విటమిన్–సి, విటమిన్–కె వంటివి గోరు చిక్కుడులో ఉంటాయి.
►క్యాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలను గోరు చిక్కుడు కలిగి ఉంటుంది.
గోరు చిక్కుడు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
►మధుమేహంతో బాధపడే వారికి గోరు చిక్కుడు వంటలు ఉపయోగకరం. రక్తంలో చక్కెర స్థాయిని ఇది నియంత్రిస్తుంది.
►అంతేగాక గోరు చిక్కుళ్లు రక్తపోటును అదుపులో ఉంచుతాయి.
►అదే విధంగా కాల్షియం, ఫాస్పరస్ కలిగి ఉండటం వల్ల ఎముకలకు, కండరాలకు బలాన్నిస్తాయి.
►గోరు చిక్కుడులో ఐరన్ ఉంటుంది. కాబట్టి రక్తహీనతను నివారించడంలోనూ ఇది ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
►జీర్ణకోశాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. వ్యర్థాలను బయటకు పంపే గుణం దీనికి ఉంటుంది.
►స్థూలకాయాన్ని అరికట్టడంలోనూ గోరు చిక్కుడు పాత్ర చెప్పుకోదగినదే.
►గోరు చిక్కుడులోని హైపోగ్లైసియామిక్ గుణాలు ఒత్తిడిని తగ్గించడంలో తోడ్పడతాయి. మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. యాంగ్జైటీని తొలగిస్తుంది.
చదవండి: Health Benefits Of Ivy Gourd: దొండకాయ కూర తింటున్నారా.. అందులో ఉండే బీటా కెరోటిన్ వల్ల..
Comments
Please login to add a commentAdd a comment