
3 వేల ఏళ్లనాడే ఇనుము వినియోగం
పుల్లూర్‌లో కొనసాగుతున్న తవ్వకాలు
సిద్దిపేట రూరల్: మెదక్ జిల్లా సిద్దిపేట మం డలం పుల్లూర్ శివారులో కొనసాగిస్తున్న తవ్వకాల్లో శనివారం పలు రకాల పనిముట్లు బయటపడ్డాయి. పురావస్తు శాఖ ఇక్కడ తవ్వకాలు చేపడుతున్న విషయం విదితమే. సూక్ష్మరాతి, ఉలి లాంటి పనిముట్లు, మృణ్మయ పాత్రలు వెలుగుచూశాయి.
సూక్ష్మరాతి పనిముట్లతో పక్షులను, జంతువులను వేటాడటానికి, ఉలిని బండలను పగులగొట్టడానికి వినియోగించినట్లు పురావస్తు శాఖ సాంకేతిక సహాయకుడు టి. ప్రేమ్‌కుమార్, రిటైర్డు ముఖ్య సంరక్షకుడు ఎర్రమరాజు భానుమూర్తిలు పేర్కొంటున్నారు. బయట పడుతున్న పనిముట్ల ఆధారంగా చూస్తే.. 3వేల సంవత్సరాల నాడే ఇనుమును వినియోగించినట్లు అధికారులు చెబుతున్నారు.