
ఇంటిప్స్
ఇనుప సామాను తుప్పుపట్టకుండా ఉండడానికి వాటి మధ్య కర్పూరం బిళ్ళలు ఉంచాలి. పండ్లను కోశాక ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే, ముక్కలపై ఉప్పు కలిపిన నీళ్లు చల్లి తడిబట్టతో కప్పాలి. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వంటి ఆకు కూరలు న్యూస్‌పేపర్‌లో చుట్టి పాలిథిన్ కవర్‌లో వుంచితే ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి.
గోడలమీద క్రేయాన్‌తో గీసిన గీతలు పోవాలంటే బూడిదతో రుద్దాలి. కిరోసిన్ లో ముంచిన బట్టతో కిటికీలు, తలుపులు తుడిస్తే తుప్పు మరకలు పోతాయి. ఆ వాసనకు దోమలు కీటకాలు ఇంట్లోకి రావు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే, గ్రైండ్ చేసేటప్పుడు ఒక స్పూన్ నూనె కలపాలి.