ఐరన్ ఇచ్చే అరటిపువ్వు!
గుడ్ ఫుడ్
అరటిపువ్వు ఆరోగ్యానికి కలిగించే మేలు అంతా ఇంతా కాదు. అరటిపువ్వుతో కూర చేసుకుని తినడం వల్ల కలిగే ప్రయోజనాల్లో కొన్ని...
అరటిపువ్వులో ఐరన్ ఎక్కువ, కాబట్టి అనీమియాను సమర్థంగా అరికడుతుంది. అరటిపువ్వులో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, పీచుపదార్థం, కొవ్వులు, క్యాల్షియమ్, ఫాస్ఫరస్, ఐరన్, కాపర్, పొటాషియమ్, మెగ్నీషియమ్, విటమిన్–ఈ పుష్కలంగా ఉంటాయి. అరటిలోని పోషకగుణాలు ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి ఉపయోగపడతాయి.
ఇందులోని ఇథనాల్ హానికరమైన బ్యాక్టీరియాను తొలగించి, గాయం త్వరగా మానడానికి ఉపయోగపడుతుంది. అరటిపువ్వులోని యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్‌ను కలిగించే ఫ్రీరాడికల్స్ అనే కాలుష్య పదార్థాలను హరిస్తాయి.వయసుపైబడే ప్రక్రియనూ అరటిపువ్వు మందగింపజేస్తుంది. అలా ఏజింగ్ ప్రక్రియను ఆపుతుంది. అరటిపువ్వు రక్తంలోని చక్కెర పాళ్లను కూడా నియంత్రిస్తుంది.