
తెనాలి: కర్ణాటకకు చెందిన ప్రముఖ సినీనటుడు డాక్టర్ పునీత్ రాజ్‌కుమార్ అభిమానుల వినతిపై ఆయన నిలువెత్తు ఐరన్ స్క్రాప్ విగ్రహాన్ని గుంటూరు జిల్లా తెనాలిలోని సూర్య శిల్పశాల శిల్పకారులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర తయారు చేశారు. టన్నున్నర ఐరన్ స్క్రాప్‌ను వినియోగించి నాలుగు నెలలు శ్రమించి తొమ్మిది అడుగుల విగ్రహాన్ని సిద్ధం చేశారు. బెంగళూరులోని ఓ ప్రధాన కూడలిలో ప్రతిష్టించనున్నారు.