దోహా: మధ్య ప్రాచ్యంలో ఇరాన్‌ను ఒంటరిని చేయాలని గల్ఫ్‌లోని సౌదీ అరేబియా, ఇరాక్ దేశాలకు అమెరికా విదేశాంగ మంత్రి టిల్లర్‌సన్ పిలుపునిచ్చారు. ఇరాన్‌ను దీటుగా ఎదుర్కొనేందుకు సౌదీ అరేబియా, ఇరాక్ దేశాలు ఒక్కటవ్వాలన్నారు. అరబ్ ఇరుగు పొరుగు దేశాలకు ఖతర్‌కు మధ్య సంక్షోభాన్ని పరిష్కరించుకోవాలన్నారు.
మధ్య ప్రాచ్యంలో ఇరాన్ అనుసరిస్తున్న వైఖరిని టిల్లర్‌సన్ విమర్శించారు. ఇరాన్‌కు చెందిన రెవల్యూషనరీ గార్డ్ కోర్‌తో ఐరోపా దేశాలు సంబంధాలు పెట్టుకోవద్దన్నారు. ఇరాన్ మద్దతుగల షితే మిలిషీయా తిరుగుబాటుదారులను ఇరాక్ నుంచి వెనక్కి రప్పించాలని లేదా వారిని ఇరాక్ సైన్యంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment