lonely
-
26 ఏళ్లుగా అడవిలో ఒంటరి జీవనం.. అంతరించిపోయిన అరుదైన తెగ
బ్రెజీలియా: బ్రెజిల్‌లోని ఆదివాసీ తెగకి చెందిన ఒక ఒంటరి మనిషి తుది శ్వాస విడిచాడు. ప్రపంచంలోనే ఒంటరి వ్యక్తిగా పిలిచే ఆ మనిషి ఇటీవల మరణించినట్టు బ్రెజిల్ అధికారులు వెల్లడించారు. అతని పేరేంటో తెలీదు. బాహ్య ప్రపంచంతో అతనికి సంబంధాలు లేవు. వయసు 60 ఏళ్ల వరకు ఉంటుంది. గత 26 ఏళ్లుగా అడవిలో ఒంటరిగా జీవిస్తున్నాడు. అడవి జంతువుల్ని బంధించడంతో పాటు ఆత్మ రక్షణ కోసం అడవిలో ఎక్కడికక్కడ గోతులు తవ్వుకుంటూ వెళతాడని అతనిని ‘‘మ్యాన్ ఆఫ్ ది హోల్’’ అని పిలుస్తారు. దూరం నుంచే అతని బాగోగుల్ని పర్యవేక్షిస్తున్న బ్రెజిల్ ఆదివాసీ వ్యవహారాల సంస్థ అధికారికి ఆగస్టు 23న ఒక గుడిసెలో అతని మృతదేహం కనిపించింది. అతని మీద దాడి చేసి ప్రాణాలు తీసినట్టుగా ఆధారాలేవీ కనిపించలేదు. అప్పటికే ఆ వ్యక్తి మరణించి 40 నుంచి 50 రోజులై ఉంటుందని అతని మృతదేహం పడి ఉన్న తీరుని బట్టి అంచనా వేశారు. అతని మృతదేహంపైన రంగు రంగుల పక్షి ఈకలు ఉన్నాయి. దీంతో అతను తన మరణాన్ని ముందుగానే ఊహించి ఈకలు కప్పుకొని ఉంటాడని ఆదివాసీ నిపుణుడు మార్కెల్ డోస్ శాంటో తెలిపారు. రోండానియా రాష్ట్రంలోని టనూరు ఆదివాసీ ప్రాంతంలో నివసించే ఒకానొక ఆదివాసీ తెగలో ఇతను చివరి వాడు కావడంతో మానవజాతిలో ఒక తెగ అంతరించినట్టయింది. నాలుగేళ్ల క్రితం అతను బ్రెజిల్ అధికారుల కెమెరాలకు చిక్కాడు. పదునైన ఆయుధంతో చెట్లు నరికే దృశ్యాలు అందులో ఉన్నాయి. ఆ వ్యక్తి అధికారులకి కనిపించడం అదే చివరిసారి. టనూరులో ఆదివాసీ తెగపై కొందరు భూ ఆక్రమణదారులు 1970 నుంచి దాడులు చేస్తూ ఈ తెగకి చెందిన వారిని చాలా మందిని బలి తీసుకున్నారని ఆదివాసీల సంక్షేమం కోసం పని చేసే స్వచ్ఛంద సంస్థ సర్వైవల్ ఇంటర్నేషనల్ వెల్లడించింది. ఆ తెగలో మిగిలిన ఆరుగురిని 1995లో అక్రమ గనుల తవ్వకదారులు దాడులు చేసి చంపేశారు. అతనొక్కడే ప్రాణాలతో మిగిలిపోవడంతో ఒంటరివాడైపోయాడు. అప్పట్నుంచి అతని రక్షణని ఎప్పటికప్పుడు బ్రెజిల్ సంస్థ పర్యవేక్షిస్తోంది. ఆ ప్రాంతంలోకి ఎవరూ వెళ్లకుండా నిషేధం విధించింది. ఇప్పుడు ఈ మిస్టరీ మ్యాన్ మరణించడంతో ఆ తెగకు చెందిన వివరాలన్నీ ఒక మిస్టరీగానే మిగిలిపోయాయి. -
బహుళ అంతస్తుల భవనం... ఏకంగా 127 ఫ్లాట్లు...ఉండేది ఒకే ఒక్కడు!
కాల పరిమితి దాటిని బహుళ అంతస్తుల భవనాన్ని కూల్చడం సహజం. నివాసితులను అక్కడ నుంచి వెళ్లిపోమని చెప్పి సదరు బిల్డర్లు ఎంతో కొంత డబ్బులు చెల్లించడం వంటివి జరుగుతుంది. అలానే ఇక్కడొక భవనాన్ని కూల్చేయలనుకున్నారు. అందుకోసం నివాసితులను ఖాళీ చేయించారు కూడా. కానీ ఒకే ఒక్కడు మాత్రం ఆ భవనాన్ని ఖాళీ చేసి వెళ్లటం లేదు. ఒంటరిగా అక్కడే ఉంటున్నాడు. వివారల్లోకెళ్తే....బ్రిటన్‌లోని స్కాట్లాండ్లో నార్త్ లానార్క్‌షైర్ కౌన్సిల్లో ఒక బహుళ అంతస్తుల భవనం ఉంది. అందులో ఏకంగా 127 ఫ్లాట్లు ఉన్నాయి. అయితే నగరానికి దూరంగా ఉండటం పెద్ద పెద్ద గాలులకు అద్దలు పగిలిపోవడం, దొంగలు పడటం తరుచుగా జరుగుతోందని ఫిర్యాదలు రావడంతో ఆ భవనాన్ని కూల్చివేయాలని కౌన్సిల్ నిర్ణయించింది. దీంతో ఆ భవనంలోని నివాసితులందర్నీ ఖాళీ చేయించారు. ఐతే ఒకే ఒక్క వ్యక్తి నిక్ విస్నీవ్సీక్ అనే వ్యక్తి మాత్రం ససేమిరా ఖాళీ చేయనని చెప్పేశాడు. పైగా అతనోక్కడే ఒంటరిగా ఉంటున్నాడు. ఆఖరికి కౌన్సిల్ అతనకి సుమారు రూ. 34 లక్షలు తోపాటు మరోచోట అద్దెకున్నందుకు అక్కడ అద్దెను కూడా రెండేళ్ల వరకు చెల్లిస్తామని మంచి ఆఫర్ కూడా ఇచ్చింది. అయినా కుదరదని నిక్ తెగేసి చెప్పేశాడు. దీంతో కౌన్సిల్ అతను వెళ్లిపోవాలని ఆ భవనం శుభ్రం చేయకుండా, సెక్యూరిటీని తీసేసి, పట్టించుకోకుండా వదిలేసింది. అయినా అతను తన ప్లాట్‌ని వదిలి వెళ్లనని, వాళ్లు ఇచ్చే డబ్బులుతో మరో ఫ్లాట్ కొనేందుకు సరిపోవని అన్నాడు. నిక్ రైట్ టు బై స్కీమ్ కింద ఆ ఫ్లాట్‌ని 2017లో కొనుక్కున్నాడు. తాను ఒంటరిగా ఎలాంటి సౌకర్యాలు లేకుండా ఉంటాననే చెబుతున్నాడు. కౌన్సిల్ మాత్రం ఇది సున్నితమైన సమస్య అతన్ని ఎలాగైన ఖాళీ చేయిస్తానని చెబుతోంది. (చదవండి: Viral Video: ఎంత పెద్ద మనసు ఆ చిన్నారులది!) -
తోడొకరుండిన అదే భాగ్యమూ.. ఆరోగ్యమూ..
ప్రభుత్వోద్యోగిగా రిటైరైన ఎఎస్‌రావు నగర్ వాసి ప్రహ్లాదరావు, కొన్నాళ్ల క్రితం భార్యను కోల్పోయారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం దెబ్బతిని డయాబెటిస్, బీపీ వగైరాలు చుట్టుముట్టాయి. ఇటీవల ఆయన తన వయసుకు తగ్గ తోడును వెదుక్కుని మళ్లీ ఓ జంటవారయ్యారు. కొన్ని నెలల్లోనే ఆయన ఆరోగ్య సమస్యలూ నియంత్రణలోకి వచ్చాయి. పిల్లలంతా వేర్వేరు చోట్ల స్థిరపడిపోవడంతో ఒంటరిగా ఉంటున్న శైలజ (55) ఇటీవలే తనలాగే ఒంటరిగా ఉంటున్న స్నేహితుడితో కలిసి జీవించడం ప్రారంభించారు. విచిత్రంగా ఆమెను వేధించిన డిప్రెషన్, నిద్రలేమి తదితర సమస్యలన్నీ మాయమయ్యాయి. ‘ఏ వయసులోనైనా తోడు అనేది ఒక తప్పనిసరి. అది మనిషిని మానసికంగా సేదతీర్చి అనేక ఆరోగ్య సమస్యలకు చికిత్సలా పనిచేస్తుంది’ అని నగరానికి చెందిన ఫిజిషియన్ డా.శంకర్ చెప్పారు. సాక్షి, హైదరాబాద్ : ఒంటరి జీవితం ఏ వయసులోనైనా దుర్భరమే అయినప్పటికీ.. మరే రకమైన వ్యాపకం లేని వృద్ధులకు అది మరింత తీవ్రమైన సమస్యగా మారుతుంది. ఈ పరిస్థితిలోనే అనేక రకాల శారీరక, మానసిక అనారోగ్యాలకు వారు గురవుతారు. అప్పటిదాకా లేని జబ్బులు వారిని చుట్టుముడతాయి. ‘‘మానసిక వేదన, నిరాశా నిస్పృహలు, తాము అప్ర«దాన వ్యక్తులుగా మారామనే భావన...రోగ నిరోధకశక్తిని తీవ్రంగా దెబ్బతీస్తాయి. దాగి ఉన్న వ్యాధులు విజృంభించేలా చేస్తాయి’’ అని సైకాలజిస్ట్ ప్రవీణ్ చెప్పారు నిద్రలేమి, బీపీ తగ్గాయి.. ఒంటరిగా ఉన్నప్పుడు రక్తపోటు, చక్కెర వ్యాధి, నిద్రలేమి వంటి సమస్యలు వేధించేవి. నిత్యం మందులు వాడాల్సి వచ్చేది. ఈ పరిస్థితిలో టైమ్‌కి మందులవీ ఇచ్చి నా బాగోగులు చూసుకునేందుకు ఒకరు ఉంటే బాగుండని రాజేశ్వరిని పెళ్లి చేసుకుంటే... తనే నా పాలిట మెడిసిన్‌గా మారింది. ఇప్పుడు నిద్రలేమి పోయింది.. మందుల అవసరం తగ్గిపోయింది. –కోటేశ్వరరావు ఆ‘పరేషాన్’ తీరింది... వ్యక్తిగతంగా నేనూ 60ఏళ్ల వయసులో పునర్వివాహం చేసుకున్నాను. ఆ పెళ్లి నాతో పాటు నా భర్త ఆరోగ్యాన్ని కూడా చాలా మెరుగయ్యేలా చేసింది. తోడు నీడ స్థాపించడానికి అదో కారణం. మా సంస్థ ద్వారా కొన్ని వందల మంది సీనియర్ సిటిజన్స్‌ని పెళ్లిళ్లు/లివిన్ రిలేషన్ షిప్స్ ల ద్వారా జంటలుగా మార్చాం. అది అనేకమందికి అప్పటికే ఉన్న అనారోగ్య సమస్యలకు పరిష్కారం చూపింది. ఒంటరిగా ఉన్న ఓ పెద్దావిడ ఎప్పటి నుంచో వాయిదా వేస్తూ వచ్చిన మోకాలి చిప్ప ఆపరేషన్ ను పెళ్లయిన వెంటనే చేయించుకోగలిగారనేది దానికో చిన్న ఉదాహరణ మాత్రమే. –రాజేశ్వరి, నిర్వాహకులు తోడు నీడ సీనియర్ సిటిజన్స్ సంక్షేమ సంఘం (చదవండి: ‘లింక్’ ప్యాకేజ్... అనుసంధాన రోడ్లకు రూ.2410 కోట్లు) -
ఇరాన్‌ను ఏకాకి చేయండి: టిల్లర్సన్
దోహా: మధ్య ప్రాచ్యంలో ఇరాన్‌ను ఒంటరిని చేయాలని గల్ఫ్‌లోని సౌదీ అరేబియా, ఇరాక్ దేశాలకు అమెరికా విదేశాంగ మంత్రి టిల్లర్సన్ పిలుపునిచ్చారు. ఇరాన్‌ను దీటుగా ఎదుర్కొనేందుకు సౌదీ అరేబియా, ఇరాక్ దేశాలు ఒక్కటవ్వాలన్నారు. అరబ్ ఇరుగు పొరుగు దేశాలకు ఖతర్‌కు మధ్య సంక్షోభాన్ని పరిష్కరించుకోవాలన్నారు. మధ్య ప్రాచ్యంలో ఇరాన్ అనుసరిస్తున్న వైఖరిని టిల్లర్సన్ విమర్శించారు. ఇరాన్‌కు చెందిన రెవల్యూషనరీ గార్డ్ కోర్తో ఐరోపా దేశాలు సంబంధాలు పెట్టుకోవద్దన్నారు. ఇరాన్ మద్దతుగల షితే మిలిషీయా తిరుగుబాటుదారులను ఇరాక్ నుంచి వెనక్కి రప్పించాలని లేదా వారిని ఇరాక్ సైన్యంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. -
సుదీర్ఘ నేస్తంలేక లోన్లీగా ఫీల్ అవుతున్నా..
-
సుదీర్ఘ నేస్తంలేక లోన్లీగా ఫీల్ అవుతున్నా..
చెన్నై: అక్రమ ఆస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఎఐఎడిఎంకె చీఫ్ వికె శశికళ "ఒంటరితనం" ఫీల్ అవుతున్నారట. మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత జయలలిత 69వ పుట్టినరోజు సందర్భంగా ఆమె అమ్మను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె కార్యర్తలకు తన సందేశాన్ని పంపారు. అమ్మ ఆశయాలను, ఆకాంక్షలను ముందుకు తీసుకు పోవాలని కోరారు. ఈ నెల 24వ తేదీన (శుక్రవారం) అమ్మ జయలలిత జయంతిని పెద్ద ఎత్తున నిర్వహించాలని ఆమె సూచించారు. జయలలిత తొలి జయంతి కావడంతో.. ఈ మేరకు శశికళ పార్టీ కేడర్‌కు లేఖ రాశారు. అమ్మ 69వ పుట్టినరోజు( ఫిబ్రవరి 24) సందర్భంగా కార్యకర్తలకు ఇచ్చిన సందేశంలో..అమ్మ ప్రభుత్వం పేదలకు మరిన్ని ప్రోత్సాహకాలు, పథకాలు అందించాలని కోరారు. అవిరామంగా ప్రజలకు సేవ చేయాలన్న జయలిలత కోరికను నెరవేర్చాలని ఆమె కోరారు. తమ ప్రభుత్వం ద్వారా ప్రజలకు సేవ చేసేందుకు ప్రతిజ్ఞ బూనాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తన సుదీర్ఘ నేస్తం లేకపోవడం లోన్లీగా ఉందన్నారు. దాదాపు 33సం.రాలు కలిసిఉన్నామనీ, అమ్మ పుట్టినరోజును ప్రతీ ఏడాది జరుపుకునే వారమనీ.. ఈ సంవత్సరం లేకపోవడం చాలా విచారంగా ఉందని శశికళ చెప్పారు. గత ఏడాది ఆమె ఉన్నారు. కానీ ఈ సం.రం ఆమె జ్ఞాపకాలు మిగిలాయన్నారు. అమ్మ చాలా ఉత్సాహం పుట్టిన రోజు వేడుకులు జరుపుకునేవారని చెప్పారు. కానీ ఈ సంవత్సరం ఇలా ఉంటుందని తానెపుడూ ఊహించలేదని ఆమె వ్యాఖ్యానించారు. తన ఆలోచనలు అమ్మ చుట్టూనే తిరుగుతున్నాయన్నారు. అమ్మ పుట్టినరోజు సందర్భంగా సామూహిక అన్నదానాలు చేయాలని, మాజీ ముఖ్యమంత్రి ఫోటోలను ప్రజల దర్శనార్థం ఉంచి.. అమ్మకు ఘననివాళులర్పించాలని కార్యకర్తలను కోరారు.అమ్మ ఎపుడూ సవాళ్లకు తలొగ్గలేదనీ, చాలా ధైర్యంతోవాటిని ఎదుర్కొని సమస్యలన్ని ఎదుర్కొననే ధైర్యాన్ని, స్ఫూర్తిని అందించారని ఆమె పేర్కొన్నారు. జయలలిత ప్రముఖ నేత అని, ఆమెను ఎవరైనా జీవితంలో ఒకసారి కలిస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారన్నారు. 1987లో పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్ చనిపోయినపుడు అనేక సవాళ్లమధ్య పార్టీ పగ్గాలు చేట్టి, సమయ స్ఫూర్తితో పార్టీని ఏకంచేసిన ఘనత ఆమెకే దక్కుతుందన్నారు. "ప్రేమ, దయ, కష్టించే తత్వం’’ తో కీర్తి గడించారని తెలిపారు. అమ్మ బర్తడే సందర్భంగా పేదల సంక్షేమం కోసం పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అమ్మ ఎపుడూ సవాళ్లకు తలొగ్గలేదనీ, చాలా ధైర్యంతో వాటిని ఎదుర్కొని సమస్యల్నిఎదుర్కొనే ధైర్యాన్ని,స్ఫూర్తిని అందించారంటూ అమ్మతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. -
ఒంటరిగా ఉండలేక ఫినాయిల్ తాగిన విద్యార్థిని
తిరుపతి మెడికల్ : తల్లిదండ్రులను వదిలి హాస్టల్లో ఒంటరిగా ఉండలేక ఒక విద్యార్థిని ఫినాయిల్ తాగింది. ఈ సంఘటన తిరుపతిలో గురువారం చోటు చేసుకుంది. బాధితురాలు, వైద్యుల కథనం మేరకు.. తిరుపతి గిరిపురానికి చెందిన కృష్ణయ్య కుమార్తె హేమావతి స్థానిక నెహ్రూ మున్సిపల్ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. గురువారం ఉదయం యథావిధిగా పాఠశాలకు వెళ్లింది. ఇంటర్వెల్ సమయంలో పాఠశాలలో ఉన్న ఫినాయిల్ బాటిల్ తీసుకుని తాగింది. కొంత సేపటికి కడుపు నొప్పి రావడంతో తల్లడిల్లింది. తోటి విద్యార్థులు ఆమెను రుయాకు తీసుకెళ్లారు. వైద్యులు విచారించగా అసలు విషయం చెప్పింది. హాస్టల్లో ఒంటరిగా ఉండలేక ఫినాయిల్ తాగానని పేర్కొంది. ఈ సంఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎప్పుడూ సందడిగా ఉండే నెహ్రూ మున్సిపల్ పాఠశాలలో విద్యార్థులకు అందేలా ఫినాయిల్ ఎందుకు పెట్టారు. ఒక విద్యార్థిని ఫినాయిల్ తాగుతుంటే తోటి విద్యార్థులు ఎందుకు అడ్డుకోలేకపోయారు. టీచర్లు ఏం చేస్తున్నారు. ఆ విద్యార్థిని చిన్న పిల్లలతో రుయా ఆస్పత్రికి పంపాల్సిన అవసరం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. పాఠశాలలో టీచర్లు మందలించారా, లేక వసతి గృహంలో ఏమైనా జరిగిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
ఒంటరితనం.. ఓ మృత్యు కౌగిలి
వాషింగ్టన్: ఒంటరితనం ఓ ఫీలింగ్ మాత్రమే కాదు.. ఇది శారీరక మార్పులకు కారణమవ్వడమే కాక.. మరణానికి దగ్గరయ్యేలా చేస్తుందట. వృద్ధుల్లో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంటుందట. అమెరికా పరిశోధకుల తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. వృద్ధుల్లో ఆరోగ్య సమస్యలు పెరగడానికి సాంఘిక ఒంటరితనం ప్రధాన కారణమని, దీనివల్ల వృద్ధుల్లో ముందుగానే మరణం సంభవించడానికి 14 శాతం అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. ఒంటరితనానికి.. కన్సర్వుడ్ ట్రాన్స్క్రిప్షనల్ రెస్పాన్స్ టు ఎడ్వర్సిటీ(సీటీఆర్ఏ)కి సంబంధం ఉందని గత పరిశోధనల ఆధారంగా ఈ బృందం గుర్తించింది. అయితే ఒంటరితనం ప్రతికూల ఆరోగ్య ఫలితాలకు కారణమవుతుందనే అంశంపై మాత్రం ఎవరికీ అవగాహన పెద్దగా లేదు. ఇదే అంశంపై యూనివర్సిటీ ఆఫ్ షికాగో సైకాలజిస్ట్ జాన్ కాకివొప్పొ నేతృత్వంలోని బృందం పరిశోధనలు జరిపింది. ఒంటరితనం వల్ల కలిగే శారీరక మార్పులు వాటి కారణంగా ఎదురయ్యే దుష్పరిణామాలపై వీరు ప్రధానంగా దృష్టి సారించారు. ఒంటరితనానికి సంబంధించి మనుషులతో పాటు రీసస్ మకాక్స్ అనే జాతి కోతులపైనా అధ్యయనం చేశారు. 2002లో 50 నుంచి 68 ఏళ్ల వ్యక్తులపై ఈ అధ్యయనాన్ని ప్రారంభించారు. ఈ పరిశోధనల్లో ఒంటరితనం అనుభవించే వారిలో రోగ నిరోధక ప్రతిస్పందనలు తక్కువగా ఉంటాయని, అదే సమయంలో వారిలో ఒంటరితనం అనుభవించని వారికంటే నొప్పి ప్రభావం ఎక్కువగా ఉంటుందని వెల్లడైంది. ఈ నేపథ్యంలో కణాలలో జన్యు మార్పులు, బ్యాక్టీరియా, వైరస్ల నుంచి శరీరాన్ని కాపాడే రోగ నిరోధక శక్తికి సంబంధించిన సెల్స్ ఏవిధంగా పనిచేస్తున్నాయనే దానిపై అధ్యయనం జరిపారు. ఈ పరిశోధనలో ఒంటరితనం కారణంగా శరీరంపై పడే పలు దుష్పరిణామాలు వెలుగుచూశాయి. ఒంటరితనం వల్ల శరీరంలో తెల్లరక్త కణాల ఉత్పత్తి తగ్గిపోయి రోగ నిరోధక శక్తిపై ప్రభావం చూపుతుందని వెల్లడైంది. ఒక ఏడాది లేదా అంతకంటే ఎక్కువ కాలం తర్వాత ఒంటరితనం.. భవిష్యత్‌లో సీటీఆర్ఏ జన్యు ప్రక్రియను అంచనా వేస్తుందని, అలాగే ఒక ఏడాది లేదా అంతకంటే ఎక్కువ కాలం తర్వాత సీటీఆర్ఏ జన్యు ప్రక్రియ ఒంటరితనం పరిణామాలను అంచనా వేస్తుందని గుర్తించారు. కణాల జన్యు పరిణామాలు, ఒంటరితనం ఒకదానికొకటి పరస్పర సంబంధం కలిగి ఉంటాయని, కాలక్రమంలో ఇవి ఒకదానికొకటి సహాయం చేసుకుంటాయని కూడా గుర్తించారు. ఈ పరిశోధన ఒంటరితనానికి మాత్రమే పరిమితమని, నిరాశ, ఒత్తిడి, సామాజిక మద్దతు మొదలైన అంశాలకు దీనికి సంబంధం లేదని పరిశోధకులు పేర్కొన్నారు. -
వారిలో విభిన్న ఆలోచనలు..
మనిషి సంఘజీవి. అతిని చుట్టూ రకరకాల అనుబంధాల తీగలను పెనవేసుకొని సమాజంలో మనుగడ సాగిస్తుంటాడు. అయితే కొందరి విషయంలో మాత్రం ఇది విభిన్నంగా ఉంటుంది. కుటుంబంతో పాటు ఎలాంటి సంబంధాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఒంటరిగా జీవితాన్ని గడిపేస్తుంటారు. ఇలాంటి వారిపై అమెరికాలోని చికాగో యూనివర్సిటీకి చెందిన ఇద్దరు మానసిక శాస్త్రవేత్తలు విస్తృతమైన పరిశోధనలు జరిపి ఒంటరి వారి ఆలోచనలు సంఘజీవులతో పోల్చినప్పుడు చాలా విభిన్నంగా ఉంటాయని నిర్ధారించారు. ఈ పరిశోధనలో ఒంటరిగా జీవించడానికి అలవాటు పడిన వారి మెదడు పనితీరు చాలా విభిన్నంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా సమాజంలో తమకు ఎదురయ్యే ఆపదల పట్ల చాలా అప్రమత్తంగా ఉండేలా వారి మెదడు ట్యూన్ చేయబడి ఉంటుందని తెలిపారు. ఒంటరివారి ఆలోచనలు 'స్వీయ రక్షణ' అనే అంశానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నట్లు గుర్తించారు. నిజంగానే తమకు ఏ విధమైన హాని లేకపోయినప్పటికీ స్వీయ రక్షణకు ఒంటరి వారు ఇచ్చినటువంటి ప్రాధాన్యతను కుటుంబాలతో గడిపే వారు ఇవ్వరని నిర్థారించారు. పరిశోధనలో భాగంగా 'బిలాంగ్', 'పార్టీ', 'ఎలోన్', 'జాయ్' అనే పదాలను విన్పించినప్పుడు మిగతావారితో పోల్చితే ఒంటరివారిలో విపరీతమైన ప్రతిస్పందనలు గమనించినట్లు గుర్తించారు. అయితే ఈ స్పందనలు వారికి తెలియకుండానే అసంకల్పితంగా వెలిబుచ్చారని తెలిపారు. సమాజంపై గల ప్రతికూల ఆలోచనల ఫలితంగానే వారి మెదడు ఇలా ట్యూన్ చేయబడుతుందని అందుకే ఇలాంటి స్సందనలు గమనించినట్లు శాస్త్రవేత్తలు కార్టెక్స్ జర్నల్‌లో తమ ఫలితాలను ప్రచురించారు. పరిశోధనలో తేలిన మరో విషయం ఏమిటంటే.. ఒంటరితనం అనేది మనసులో తాము వేరు చేయబడ్డామని ఏర్పరుచుకునే ఒక భావన. కొందరు ఎంతో మంది స్నేహితులు, బంధువులను కలిగి ఉన్నప్పటికీ తాము ఒంటరివారిమనే భావనలోనే ఉంటారని తెలిపారు. -
ఫేస్‌బుక్‌కు బానిసయితే ప్రమాదమే!
లండన్: రోజూ ఫేస్బుక్లో గంటలకొద్దీ గడుపుతారా? దీనివల్ల సమయం వేస్ట్ చేస్తున్నామని బాధపడుతున్నారా? అయినా ఈ వ్యాపకం మానుకోలేకపోతున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడినట్టే. ఫేస్‌బుక్‌కు బానిసయితే ఇలాంటి లక్షణాలు ఒత్తిడిని మరింత పెంచి మనిషిని కుంగదీస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ఫేస్బుక్ వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయన్నది కాదలేని వాస్తవం. స్నేహితులు, కావాల్సినవారితో ఫేస్బుక్ ద్వారా నిత్యం సంబంధాలు కొనసాగించవచ్చు. అయితే ఫేస్‌బుకే ప్రపంచమని భావిస్తే ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ప్రాథమిక మానసిక అవసరాలకు సంబంధించి జీవితంపై అసంతృప్తి పెరగడం, లేదా మూడ్ పాడవడం వంటి లక్షణాలు ఏర్పడుతాయని చెప్పారు. ఫేస్‌బుక్‌కు, మూడు పాడవడానికి మధ్య సంబంధముందని మానసిక నిపుణులు తెలిపారు. ఫేస్బుక్ యూజర్లపై మూడు దశల్లో పరిశోధనలు నిర్వహించారు. ఫేస్‌బుక్‌తో గడిపిన అనంతరం మూడు పాడవడంతో పాటు ఒంటరితనం అనుభవిస్తున్నట్టు చాలామంది చెప్పారు.