సుదీర్ఘ నేస్తంలేక లోన్లీగా ఫీల్ అవుతున్నా..
చెన్నై: అక్రమ ఆస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఎఐఎడిఎంకె చీఫ్ వికె శశికళ "ఒంటరితనం" ఫీల్ అవుతున్నారట. మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత జయలలిత 69వ పుట్టినరోజు సందర్భంగా ఆమె అమ్మను గుర్తుచేసుకున్నారు. ఈ సందర‍్భంగా ఆమె కార్యర్తలకు తన సందేశాన్ని పంపారు. అమ్మ ఆశయాలను, ఆకాంక్షలను ముందుకు తీసుకు పోవాలని కోరారు. ఈ నెల 24వ తేదీన (శుక్రవారం) అమ్మ జయలలిత జయంతిని పెద్ద ఎత్తున నిర్వహించాలని ఆమె సూచించారు.
జయలలిత తొలి జయంతి కావడంతో.. ఈ మేరకు శశికళ పార్టీ కేడర్‌కు లేఖ రాశారు. అమ్మ 69వ పుట్టినరోజు( ఫిబ్రవరి 24) సందర్భంగా కార్యకర్తలకు ఇచ్చిన సందేశంలో..అమ్మ ప్రభుత్వం పేదలకు మరిన్ని ప్రోత్సాహకాలు, పథకాలు అందించాలని కోరారు. అవిరామంగా ప్రజలకు సేవ చేయాలన్న జయలిలత కోరికను నెరవేర్చాలని ఆమె కోరారు. తమ ప్రభుత్వం ద్వారా ప్రజలకు సేవ చేసేందుకు ప్రతిజ్ఞ బూనాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
తన సుదీర్ఘ నేస్తం లేకపోవడం లోన్లీగా ఉందన్నారు. దాదాపు 33సం.రాలు కలిసిఉన్నామనీ, అమ్మ పుట్టినరోజును ప్రతీ ఏడాది జరుపుకునే వారమనీ.. ఈ సంవత్సరం లేకపోవడం చాలా విచారంగా ఉందని శశికళ చెప్పారు. గత ఏడాది ఆమె ఉన్నారు. కానీ ఈ సం.రం ఆమె జ్ఞాపకాలు మిగిలాయన్నారు. అమ్మ చాలా ఉత్సాహం పుట్టిన రోజు వేడుకులు జరుపుకునేవారని చెప్పారు. కానీ ఈ సంవత్సరం ఇలా ఉంటుందని తానెపుడూ ఊహించలేదని ఆమె వ్యాఖ్యానించారు. తన ఆలోచనలు అమ్మ చుట్టూనే తిరుగుతున్నాయన్నారు.
అమ్మ పుట్టినరోజు సందర్భంగా సామూహిక అన్నదానాలు చేయాలని, మాజీ ముఖ్యమంత్రి ఫోటోలను ప్రజల దర్శనార్థం ఉంచి.. అమ్మకు ఘననివాళులర్పించాలని కార్యకర్తలను కోరారు.అమ్మ ఎపుడూ సవాళ్లకు తలొగ్గలేదనీ, చాలా ధైర్యంతోవాటిని ఎదుర్కొని సమస్యలన్ని ఎదుర్కొననే ధైర్యాన్ని, స్ఫూర్తిని అందించారని ఆమె పేర్కొన్నారు.
జయలలిత ప్రముఖ నేత అని, ఆమెను ఎవరైనా జీవితంలో ఒకసారి కలిస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారన్నారు. 1987లో పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్ చనిపోయినపుడు అనేక సవాళ్లమధ‍్య పార్టీ పగ్గాలు చేట్టి, సమయ స్ఫూర్తితో పార్టీని ఏకంచేసిన ఘనత ఆమెకే దక్కుతుందన్నారు. "ప్రేమ, దయ, కష్టించే తత్వం’’ తో కీర్తి గడించారని తెలిపారు. అమ్మ బర్తడే సందర్భంగా పేదల సంక్షేమం కోసం పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అమ్మ ఎపుడూ సవాళ్లకు తలొగ్గలేదనీ, చాలా ధైర్యంతో వాటిని ఎదుర్కొని సమస్యల్నిఎదుర్కొనే ధైర్యాన్ని,స్ఫూర్తిని అందించారంటూ అమ్మతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.