ఫేస్బుక్కు బానిసయితే ప్రమాదమే!
లండన్: రోజూ ఫేస్బుక్లో గంటలకొద్దీ గడుపుతారా? దీనివల్ల సమయం వేస్ట్ చేస్తున్నామని బాధపడుతున్నారా? అయినా ఈ వ్యాపకం మానుకోలేకపోతున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడినట్టే. ఫేస్బుక్కు బానిసయితే ఇలాంటి లక్షణాలు ఒత్తిడిని మరింత పెంచి మనిషిని కుంగదీస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.
ఫేస్బుక్ వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయన్నది కాదలేని వాస్తవం. స్నేహితులు, కావాల్సినవారితో ఫేస్బుక్ ద్వారా నిత్యం సంబంధాలు కొనసాగించవచ్చు. అయితే ఫేస్బుకే ప్రపంచమని భావిస్తే ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ప్రాథమిక మానసిక అవసరాలకు సంబంధించి జీవితంపై అసంతృప్తి పెరగడం, లేదా మూడ్ పాడవడం వంటి లక్షణాలు ఏర్పడుతాయని చెప్పారు. ఫేస్బుక్కు, మూడు పాడవడానికి మధ్య సంబంధముందని మానసిక నిపుణులు తెలిపారు. ఫేస్బుక్ యూజర్లపై మూడు దశల్లో పరిశోధనలు నిర్వహించారు. ఫేస్బుక్తో గడిపిన అనంతరం మూడు పాడవడంతో పాటు ఒంటరితనం అనుభవిస్తున్నట్టు చాలామంది చెప్పారు.