depress
-
ప్రోబయాటిక్స్‌తో డిప్రెషన్ దూరం!
మన జీర్ణవ్యవస్థలో ప్రతి చదరపు అంగుళంలోనూ కోటానుకోట్ల మంచి బ్యాక్టీరియా ఉంటుందన్న విషయం తెలిసిందే. జీర్ణప్రక్రియలకు, జీర్ణమైన ఆహారంలోని పోషకాలు దేహానికి అందడానికి అవి ఎంతో తోడ్పతతాయి. అందుకే జీర్ణవ్యవస్థ ఆరోగ్యం దెబ్బతింటే మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు తోడ్పడే పెరుగు, మజ్జిగ, కొద్దిగా పులిసేందుకు అవకాశం ఉన్న పిండితో చేసే ఇడ్లీ, దోస వంటి ఆహారాలు తీసుకొమ్మని డాక్టర్లు సూచిస్తుంటారు. ఇప్పుడు ఇదే ప్రో–బ్యాక్టీరియా మనుషుల్లోని డిప్రెషన్ తగ్గడానికి కూడా ఎంతగానో తోడ్పడుతుందని స్విట్జర్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ బాసెల్‌కు చెందిన మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. డిప్రెషన్‌తో బాధపడుతూ యాంటీడిప్రెసెంట్స్ వాడుతున్న కొందరిని ఓ అధ్యయనం కోసం ఎంపిక చేశారు. ఇందులో భాగంగా... డిప్రెషన్ చికిత్స కోసం ముందుకొచ్చిన వలంటీర్లలో కొంతమందికి ప్రోబయాటిక్స్ ఇచ్చారు. వారిని పరీక్షించి చూసినప్పుడు... ఇలా ప్రోబయాటిక్స్ పుష్కలంగా తీసుకుంటున్న వ్యక్తుల మెదడు పనితీరు మరింత త్వరగా నార్మల్ అయ్యిందంటూ ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన సైకియాట్రిస్ట్ అన్నా కియారా స్క్వాబ్ పేర్కొన్నారు. జీర్ణవ్యవస్థలో ఉండే సూక్ష్మజీవరాశికీ... మెదడుకూ మధ్య ఏదో సంబంధం ఉందని ఏళ్లుగా జరుగుతున్న పరిశోధనల్లో తేలినా... అదెలా జరుగుతుందన్నది ఇంకా తెలియరాలేదు. అయితే ప్రోబయాటిక్ ఆహారంతో కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలతో పాటు డిప్రెషన్ కూడా తగ్గుతోంది. అంతమాత్రాన డిప్రెషన్‌కు ప్రో–బయాటిక్ ఒక్కటే చికిత్స అని చెప్పడం ఈ పరిశోధన ఉద్దేశం కాదు. కానీ ఒక్క యాంటీడిప్రెసెంట్స్ మాత్రమే వాడుతున్న మూడింట రెండు వందల మందికి వెంటనే మంచి గుణం కనిపించడం లేదు. అయితే మందులు వాడుతూనే ప్రోబయాటిక్స్ తీసుకుంటున్నప్పుడు మంచి గుణమే కనిపిస్తోంది. ప్రోబయాటిక్స్లోని ఏ అంశం ఇలా మేలు చేస్తోందనేది కనుగొనేందుకు పరిశోధనలు కొనసాగుతున్నాయి. దాంతో భవిష్యత్తులో మరింత సమర్థంగా డిప్రెషన్‌కు చికిత్స అందించే వీలుంద’’ని చెబుతున్నారు అన్నా కియారా పేర్కొంటున్నారు. -
రోజంతా స్మార్ట్ ఫోన్ తో గడిపేస్తున్నారా?
రోజంతా స్మార్ట్ ఫోన్ తో గడిపేస్తున్నారా? అది లేకుండా క్షణం గడపలేకపోతున్నారా ? అయితే తస్మాత్ జాగ్రత్త. ఈ వ్యసనం నుంచి త్వరగా బయటపడండి. లేదంటే త్వరలోనే మీకు అనేక ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తే అవకాశముందని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. స్మార్ట్ ఫోన్ వ్యసనం వల్ల ముఖ్యంగా టీనేజర్లలో ఒత్తిడి, మానసిక కుంగుబాటు వంటి సమస్యలు తలెత్తవచ్చునని తాజా అధ్యయనంలో గుర్తించారు. కొత్త టెక్నాలజీ వచ్చిన ప్రతిసారి ఇలాంటి వ్యాధులు వస్తాయనే నానుడి ఎప్పటినుంచో ఉందని, టీవీ, వీడియో గేమ్స్ మొదలు ఇప్పటి స్మార్ట్‌ఫోన్ వరకు అందరిలో ఇలాంటి అభిప్రాయమే ఉందని, అయితే స్మార్ట్ ఫోన్ విషయంలో టీనేజర్లలో ఈ సమస్య అధికంగా ఉండే అవకాశముందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన ఇల్లినాయిస్ యూనివర్సిటీ పరిశోధకుడు అలెజాండ్రో లెరాస్ తెలిపారు. దాదాపుగా 300 యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులపై ఆయన ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. విద్యార్థుల మానసిక స్థితి, ఎంతసేపు స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉపయోగించడానికి వారిని పురిగొల్పిన కారణాలు ఏమిటి? వంటి అంశాల ఆధారంగా స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ వారిపై ఏవిధంగా ప్రభావం చూపుతాయో అంచనా వేశారు. గంటలు గంటలు స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోయి అస్తమానం అందులోనే తల దూర్చేవారి మానసిక కుంగుబాటు, ఒత్తిడికి ఎక్కువగా లోనవుతున్నారని ఈ అధ్యయనంలో తేలింది. టెక్నాలజీని మితంగా వాడటం వల్ల ఈ సమస్యలు దరిచేరకుండా చూడవచ్చునని శాస్త్రవేత్తలు సూచించారు. ఈ అధ్యయనం వివరాలు 'కంప్యూటర్స్ ఇన్ హ్యూమన్ బిహేవియర్' అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
ఫేస్‌బుక్‌కు బానిసయితే ప్రమాదమే!
లండన్: రోజూ ఫేస్బుక్లో గంటలకొద్దీ గడుపుతారా? దీనివల్ల సమయం వేస్ట్ చేస్తున్నామని బాధపడుతున్నారా? అయినా ఈ వ్యాపకం మానుకోలేకపోతున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడినట్టే. ఫేస్‌బుక్‌కు బానిసయితే ఇలాంటి లక్షణాలు ఒత్తిడిని మరింత పెంచి మనిషిని కుంగదీస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ఫేస్బుక్ వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయన్నది కాదలేని వాస్తవం. స్నేహితులు, కావాల్సినవారితో ఫేస్బుక్ ద్వారా నిత్యం సంబంధాలు కొనసాగించవచ్చు. అయితే ఫేస్‌బుకే ప్రపంచమని భావిస్తే ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ప్రాథమిక మానసిక అవసరాలకు సంబంధించి జీవితంపై అసంతృప్తి పెరగడం, లేదా మూడ్ పాడవడం వంటి లక్షణాలు ఏర్పడుతాయని చెప్పారు. ఫేస్‌బుక్‌కు, మూడు పాడవడానికి మధ్య సంబంధముందని మానసిక నిపుణులు తెలిపారు. ఫేస్బుక్ యూజర్లపై మూడు దశల్లో పరిశోధనలు నిర్వహించారు. ఫేస్‌బుక్‌తో గడిపిన అనంతరం మూడు పాడవడంతో పాటు ఒంటరితనం అనుభవిస్తున్నట్టు చాలామంది చెప్పారు.